అండర్–19 హాకీ జిల్లా జట్లు ఎంపిక
సత్తెనపల్లి(ముప్పాళ్ళ): సత్తెనపల్లి మండలంలోని నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్‌గేమ్స్ ఉమ్మడి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో అండర్–19 హాకీ బాల బాలికల జిల్లా జట్ల ఎంపిక సోమవారం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా హాకీ జట్టు వివరాలు..
● బాలుర జట్టు: వై.చంటిబాబు, ఎ.గణేష్, పి.నవీన్, కె.సాగర్, షేక్ అమిత్, కె.జాన్‌విల్సన్, షేక్ రియాజ్, ఎం.నీరజ్, ఎస్.కృష్ణమనోహర్, కె.సాయిసురేంద్ర, బి.సాయిశ్రీరామ్, జి.ఉదయ్‌కిరణ్, పి.శౌరికిరణ్, టి.జగన్, కె.శ్యామ్‌కుమార్, ఎం.మనోహర్, జె.పవన్‌కుమార్, స్టాండ్‌బైలుగా వై.సాత్విక్, షేక్ సర్దార్, షేక్ మొహియిద్దీన్‌బాషాలు ఎంపికయ్యారు.
● బాలికల జట్టు: ఎ.వందన, షేక్ ఉమేరా, టి.లోహితకృష్ణకుమారి, టి.ఝాన్సీలక్ష్మీ, బి.హారిక, ఆర్.లీలాప్రసన్న, పి.కోమలి, పి.శ్రీలేఖ, పి.దుర్గామహేశ్వరి, షేక్ కరిష్మా, ఎం.రోషితాసాయి, జి.అమృతవర్షిని, సీహెచ్ కీర్తిశ్వేత, డి.వర్ధిని, ఒ.దీవెన, పి.అక్షయ, ఎం.పల్లవి, బి.మానస స్టాండ్‌బైలుగా బి.యోగిత, వై.సుస్మిత, సీహెచ్ దివ్య, షేక్ సమీరాలు ఎంపికై నట్లు స్కూల్‌గేమ్స్ కార్యదర్శి జి.నరసింహారావు తెలిపారు. ఎంపికలు స్కూల్‌గేమ్స్ జిల్లా కార్యదర్శి జి.నరసింహారావు, విద్యాకేంద్రం జూనియర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ పి.శివరామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపికై న క్రీడాకారులు విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో జరిగే 69వ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా కార్యదర్శి జి.నరసింహారావు తెలిపారు. ఎంపికకు వ్యాయాయ ఉపాధ్యాయులు గండు సాంబశివరావు, లాకు పిచ్చయ్య, బి.అనిల్ దత్తానాయక్, తాడికొండ భాస్కరరావు, బోయిన వీరచంద్ర, కాకుమాను సునీత, పి.వాణిసునీలలు వ్యవహరించారు. కార్యక్రమంలో విద్యాకేంద్రం ప్రిన్సిపాల్ షేక్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు.


