ఐకమత్యంతో పనిచేద్దాం
అచ్చంపేట: సమాజ శ్రేయస్సు కోసం రెడ్డి సామాజికవర్గ సభ్యులంతా ఐకమత్యంతో పనిచేయాలని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి తెలిపారు. మండలంలోని నీలీశ్వరపాలెంలో స్వయంభు నీలకంఠేశ్వర స్వామి దేవాలయ సన్నిధిలో సోమవారం జరిగిన రెడ్డి సామాజిక వర్గ అన్నదాన సమారాధనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలకంఠేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేణుగోపాలరెడ్డి మాట్లాడారు. మనమంతా ఐక్యమత్యంగా ఉండి, ఇతరులకు ఆదర్శంగా ఉండాలన్నారు. నీలకంఠేశ్వరస్వామి కృపాకటాక్షాలతో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలన్నారు. భగవంతుని ఆశీస్సులతో మంచి పాలకులు వస్తే రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉంటుందన్నారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు గుత్తికొండ అంజిరెడ్డి, పత్తిపాడు జడ్పీటీసీ కృష్ణారెడ్డి, క్రోసూరు మాజీ జడ్పీటీసీ వెంకట్రామిరెడ్డి, బెల్లంకొండ ఎంపీపీ మర్రి వెంకటేశ్వరరెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ సీహెచ్ ఎస్సార్కే సాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షుడు సుంకర శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ గంగసాని నరసింహారెడ్డి, వెన్నా సీతారామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ సాంబిరెడ్డి, రోశిరెడ్డి, గోవిందరెడ్డి, ఈమని బ్రహ్మారెడ్డి, కోటిరెడ్డి, అప్పిరెడ్డి, రుదవ్రరం సాంబిరెడ్డి, బోదెల నాగిరెడ్డి, పెదకూరపాడు నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన రెడ్డి సామాజికవర్గీయులు పాల్గొన్నారు.


