కోటగుళ్ల శిల్పసంపద అద్భుతం
● ఐఏఎస్‌ల శిక్షణ బృందం
● కోటగుళ్ల సందర్శన, ప్రత్యేక పూజలు
గణపురం: కోటగుళ్ల శిల్పసంపద ఎంతో అద్భుతంగా ఉందని ఐఏఎస్‌ల శిక్షణ బృందం సభ్యులు అన్నారు. ఆదివారం జిల్లా పర్యటనలో భాగంగా 12 మంది సభ్యులతో కూడిన వారి బృందం కోటగుళ్లను సందర్శించి ప్రత్యేక పూజలు చేసింది. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఆలయాన్ని సందర్శించిన వారిలో ఐఏఎస్‌ల బృందం సభ్యులు అనురాగ్ రంజన్, పటాస్ రాజ్, కృష్ణ ఝావిపశయన తన్వర్, కృష్ణసి, విశేష్ సింగ్, తుషార్ సింగ్, ఆదిత్య సింగ్, మయాంక్ ఖండేల్వాల్, మణిమాల, విశాల్ సింగ్, పవార్ అక్షయ్ విలాష్, రితాకా రాత్ ఉన్నారు. సుమారు గంట పాటు ఆలయ ప్రాంగణంలోనే గడిపి ఫొటోలు, వీడియోలు చిత్రీకరించుకున్నారు. రాతితో కట్టిన ఆలయం ఎంతో అద్భుతమని.. సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. వారివెంట గణపురం ఎస్‌ఐ రేఖ అశోక్, మహాముత్తారం డీటీ సందీప్, గణపురం ఆర్‌ఐ చెక్క దేవేందర్ ఉన్నారు.


