కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, మహదేవపూర్ పీఏసీఎస్ చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి దంపతులు సోమవారం దర్శించుకున్నారు. స్వామివారి ఆలయంలో అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో వారిని అర్చకులు సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. వారి వెంట మాజీ ఎంపీటీసీ మమత ఉన్నారు.
భూపాలపల్లి అర్బన్: ఈనెల 18న జిల్లాస్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్ డీవైఎస్‌ఓ సీహెచ్.రఘు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో 29వ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి యువజనోత్సవాలు, సాంస్కృతిక, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్నోవేషన్ అంశాలలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మంజూర్‌నగర్‌లోని ఇల్లందు క్లబ్‌హౌస్‌లో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని 15నుంచి 29 సంవత్సరాలలోపు యువ కళాకారులు, యువతి, యువకులు పాల్గొనాలని సూచించారు. ఈ పోటీల్లో పాల్గొనే అంశానికి సంబంధించిన సామగ్రిని సంబంధిత కళాకారులు వెంట తీసుకురావాలన్నారు. ఈ పోటీలో పా ల్గొనేవారు బయోడేటా దరఖాస్తులను కలెక్టరేట్‌లోని డీవైఎస్‌ఓ కార్యాలయంలో అందించాలని చెప్పారు. వివరాలకు 96180 11096, 81251 13132 ఫోన్‌నంబర్లను సంప్రదించాలన్నారు.
భూపాలపల్లి అర్బన్: 69వ ఎస్‌జీఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలను జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలోని సింగరేణి స్విమ్మింగ్ పూల్‌లో నిర్వహించినట్లు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జయపాల్ తెలిపారు. స్విమ్మింగ్ క్రీడా పోటీల ప్రారంభానికి సీఐ నరేష్‌కుమార్ హాజరయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాలకు చెందిన 150మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు అండర్–14 విభాగం పెద్దపల్లి, అండర్–17 విభాగం హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి స్పోర్ట్స్ సూపర్‌వైజర్ పర్స శ్రీనివాస్, పీడీలు రమేష్, రాజయ్య, వసంత, సురేష్, సాంబమూర్తి, శ్రీకోటి, అన్వర్‌పాషా పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16, 17వ తేదీల్లో జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడాపోటీలను నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఎల్.జైపాల్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో అండర్–14, 17 బాల బాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడాపోటీలను నిర్వహించనున్లట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాల క్రీడాకారులు పాల్గొనున్నట్లు తెలిపారు.
భూపాలపల్లి అర్బన్: జిల్లా స్థాయి (అస్‌మిత లీగ్) బాలికల అథ్లెటిక్ పోటీలను సోమవారం ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీలను ఎస్సై రవళి ప్రారంభించారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి పతకాలు, షీల్డ్‌లు, సర్టిఫికెట్‌లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్‌ఓ రఽఘు, అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పూతల సమ్మయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, పీడీ, పీఈటీ, సభ్యులు, కోచ్‌లు పాల్గొన్నారు.
కాళేశ్వరాలయంలో పూజలు
కాళేశ్వరాలయంలో పూజలు


