సమస్యల పరిష్కారానికి చర్యలు
● కలెక్టర్ రాహుల్‌శర్మ
భూపాలపల్లి రూరల్: ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. సోమవారం 41 దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును జాగ్రత్తగా నమోదు చేసి, పరిష్కారం వరకు అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఆర్డీఓ రవి పాల్గొన్నారు.
అవగాహన కలిగి ఉండాలి..
గ్రామస్థాయి పరిపాలనా విధానాలు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. శిక్షణ సివిల్ సర్వీసెస్ అధికారులతో ఐడీఓసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ శిక్షణ అధికారులకు గ్రామీణ ప్రాంతాల వాస్తవ పరిస్థితులపై ప్రత్యక్ష అనుభవం అవసరమన్నారు. పలిమెల, మహాముత్తారం మండలాల్లో అధికారులతో కలిసి ప్రాంతాలను సందర్శించి మహిళా సంఘాలు, రైతులు, యువతతో ఇంటరాక్షన్ కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ మధుసూదన్, డీఈఓ రాజేందర్, డీఏఓ బాబూరావు, డీఆర్‌డీఓ బాలకృష్ణ, సీపీఓ బాబూరావు, సంక్షేమ అధికారి మల్లేశ్వరి పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్
ధాన్యం, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లపై అన్ని కలెక్టర్లు, పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార, మార్కెట్, రవాణా శాఖలు, పౌర సరఫరాల సంస్థ అధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీలో కలెక్టర్ రాహుల్‌శర్మ, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్, డీఎం రాములు, సహకార అధికారి వాల్యనాయక్, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, జిల్లా రవాణాశాఖ అధికారి సంధాని పాల్గొన్నారు.


