నిర్వహణ మరిచారు..
పార్క్‌లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. కానీ.. నిర్వహణ, సర్వీసింగ్ లేక పరికరాల్లో శబ్ధాలు వస్తున్నాయి. కొన్నింటి భాగాలు విడిపోయాయి. చిన్న పిల్లలకు అవసరమైన కొన్ని యంత్రాలను సమకూర్చాలి. అధికారులతో పాటు ప్రజలు కూడా ఓపెన్ జిమ్, పార్క్ నిర్వహణకు శ్రద్ధ చూపాలి.
– తిరుపతిగౌడ్, వాకర్ భూపాలపల్లి
పురపాలికలోని ఒక ఓపెన్ జిమ్‌లో యంత్రాల భాగాలు విరిగిపోవడం చూశాం. పట్టణంలో జిమ్‌లు ఎక్కడున్నాయో తెలుసుకొని వాటిని పరిశీలించి మరమ్మతుకు చర్యలు తీసుకుంటాం. అఽధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం. నిర్వహణ మెరుగుపరిచేలా చూస్తాం.
– శ్రీనివాస్,
కమిషనర్ భూపాలపల్లి మున్సిపాలిటీ


