ట్రైనీ ఐఏఎస్‌ల బృందం పర్యటన
– వివరాలు 8లోu
అందెశ్రీ మృతి సాహిత్య లోకానికి తీరని లోటు
– వివరాలు 9లోu
● మద్యం దుకాణాలు పొందిన వారికి ‘సిండికేట్ల’ బంఫర్ ఆఫర్
● రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు డీల్
● ‘మేడారం’, లోకల్ ఎన్నికలే కారణం
● డిసెంబర్ 1 నుంచి దుకాణాలు నడిపేలా
‘సిండికేట్’ల వ్యూహం
● ఉమ్మడి వరంగల్‌లో
పడగవిప్పిన
మద్యం మాఫియా
పలిమెల: మండలంలోని లెంకలగడ్డలో ట్రైనీ ఐఏఎస్‌ల బృందం సోమవారం పర్యటించింది. తొలిరోజు సోమవారం లెంకలగడ్డలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చేరుకున్న సభ్యులు మధ్యాహ్న భోజనం అనంతరం గ్రామంలోని వీధి వీధి తిరిగారు. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన టైనీ ఐఏఎస్ అధికారులు పిల్లలు, బాలింతలు, గర్భిణులకు ఏ విధంగా పోషకాహారం అందిస్తున్నారని వివరాలు తెలుసుకున్నారు. ఏఎన్‌ఎం, ఆశకార్యకర్తలతో మాట్లాడారు. వాధ్యుల నివా రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆరా తీశారు. అనంతరం పాఠశాల చేరుకొని గ్రామంలోని వసతులు, సమస్యలు, అందుతున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నేడు, రేపు (మంగళవారం, బుధవారం) కూడా మండలంలోని లెంకలగడ్డ, పంకెన గ్రామాల్లో పర్యటన ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.
ములుగుపల్లిలో పర్యటన
కాటారం(మహాముత్తారం): మహాముత్తారం మండలం ములుగుపల్లిలో సోమవారం ఆరుగురితో కూడిన కేంద్ర సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల బృందం పర్యటించింది. అధికారుల బృందానికి అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో మండల అధికారులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులతో సమావేశం నిర్వహించి పలు అంశాలను తెలుసుకున్నారు. అనంతరం విలేజ్ మ్యాప్‌ను పరిశీలించి గ్రామంలోని పలు వీధులను కలియ తిరిగారు. రైతులు, గీత కార్మికులతో మాట్లాడి వారి వృత్తి నిర్వహణ, పంటల సాగుపై ఆరా తీశారు. గ్రామంలోని వాటర్ ట్యాంకులు, చెరువులు, బోర్లు, ఆయకట్టు సాగు, ఏఏ పంటలు సాగు చేస్తున్నారనే విషయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి వసతులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, విద్యాబోధనపై ఆరా తీసి మధ్యాహ్న భోజనం చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. మిషన్ భగీరథ సంపును పరిశీలించి పథకం ఉపయోగం, పనితీరు, నీటి సరఫరా తదితర వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నిశాంత్, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంఈఓ రవీందర్‌రెడ్డి, ఏఓ అనూష పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా కవులు, కళాకారుల సంతాపం
ట్రైనీ ఐఏఎస్‌ల బృందం పర్యటన
ట్రైనీ ఐఏఎస్‌ల బృందం పర్యటన


