‘కమిటీ కుర్రాళ్లు’ ఫేమ్ త్రినాథ్ వర్మ హీరోగా, వైష్ణవి కొల్లూరు, మలినా హీరోయిన్లుగా అక్షర గౌడ కీలకపాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో ఎంతోమంది ప్రముఖ నటులు నటించనున్నారు.
ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అతిరథ మహారుధుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది.
చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరో హీరోయిన్లపై నిహారికా కొణిదెల క్లాప్‌నివ్వగా ప్రముఖ దర్శకులు బి.గోపాల్ కెమెరా స్విచాన్ చేశారు.
ఫస్ట్‌షాట్‌కి ప్రముఖ దర్శకులు ఎ కోదండరామిరెడ్డితో పాటు నిర్మాత, కెమెరామెన్ ఎస్ గోపాల్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.


