ఏర్పాట్ల పరిశీలన
పలిమెల: మండలంలోని లెంకలగడ్డ గ్రామంలో ట్రైనీ ఐఏఎస్‌ల బృందం పర్యటన నేపథ్యంలో ఆదివారం అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రైనీ ఐఏఎస్ బృందం మూడురోజుల పాటు ఉండనున్న నేపథ్యంలో బృందానికి వసతుల కల్పనలో లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాయి పవన్, ఎంపీఓ ప్రకాశ్‌రెడ్డి, ఎస్సై రమేష్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
రెడ్డిగుడిని సందర్శించిన ‘సిరికొండ’
గణపురం: మండలకేంద్రంలోని ప్రసిద్ధ నాగలింగేశ్వర స్వామి ఆలయాన్ని (రెడ్డి గుడి) మాజీ స్పీకర్, శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆదివారం సందర్శించారు. కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి శివపార్వతుల కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ క్రమంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను కల్యాణానికి ఆహ్వానించారు.ఆలయాన్ని సందర్శించిన ఆయనకు ఆలయ అర్చకులు భద్రయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో పురాతన ప్రసిద్ధి గాంచిన రెడ్డి గుడి అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానన్నారు.
పెరిగిన చలి తీవ్రత
భూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. జిల్లాలో ఆదివారం ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో జిల్లాలో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. ఉదయం తొమ్మిది గంటల లోపు.. సాయంత్రం ఆరు గంటల తర్వాత చలి పెరిగింది. చలి కారణంగా పట్టణ ప్రజలు సాయంత్రం కాగానే ఇళ్లకు చేరుకుంటున్నారు. చలి తీవ్రతను తట్టుకునేందుకు చలి మంటలు ప్రారంభించారు.
హేమాచలుడి దర్శనానికి నిరీక్షణ
మంగపేట: మంగపేట మండల పరిధిలోని మల్లూరు హేమాచల శ్రీ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం పోటెత్తింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం ఉదయం 8నుంచి సాయంత్రం 5గంటల వరకు భక్త జనంతో కిటకిటలాడింది.
ఏర్పాట్ల పరిశీలన
ఏర్పాట్ల పరిశీలన


