కాళేశ్వరాలయంలో పూజలు
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని ఆదిలాబాద్ జిల్లా జడ్జి కె.ప్రభాకర్‌రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం ఆయన ఆలయానికి రాగా ఆలయ అర్చకులు రాజగోపురం వద్ద మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేకం, అమ్మవారి ఆలయంలో దర్శనం చేశారు. ఆలయ అర్చకుడు శ్రావణ్‌కుమార్‌శర్మ స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించారు.
సినీనటుడు పూజలు
సినీనటుడు మధునందన్ కుటుంబ సమేతంగా దర్శించుకుని అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. ఆశీర్వచన వేదిక వద్ద ఆయనను అర్చకుడు రాముశర్మ స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు.
కాళేశ్వరాలయంలో పూజలు


