కూటమి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
భీమడోలు: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకోకుంటే కూటమి ప్రభుత్వానికి ప్రజా ఉద్యమంతో ప్రజలే గుణపాఠం చెబుతారని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు అన్నారు. పూళ్లలోని జిల్లా అధికార ప్రతినిధి కందులపాటి శ్రీనివాసరావు ఇంటి వద్ద ఆదివారం ఈనెల 12న వైఎస్సార్ సీపీ తలపెట్టిన ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం నియోజకవర్గ స్థాయిలో జరిగే నిరసన ర్యాలీలో నాలుగు మండలాల పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొనాలని కోరారు. ఉంగుటూరులో మండల అధ్యక్షుడు మరడ మంగారావు కోత మెషీన్ వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ చేపడతామన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యను పేదలు, మధ్యతరగతి వర్గాలకు దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తుందని, దీనిని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కందులపాటి శ్రీనివాసరావు, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ కార్యదర్శి ముళ్లగిరి జాన్సన్, పార్టీ రాష్ట్ర యూత్ కార్యదర్శి మద్దుల రాజా, ఉంగుటూరు మండల అధ్యక్షుడు మరడ వెంకట మంగారావు, నియోజకవర్గ బీసీ సెల్ కన్వీనర్ తుమ్మగుంట రంగా, మండల ఉపాధ్యక్షుడు రామకుర్తి నాగేశ్వరరావు, జిల్లా నాయకులు యెలిశెట్టి పాపారావుబాబ్జి, ఎంపీటీసీ గంటా శ్రీనివాసరావు, నియోజకవర్గ పంచాయతీరాజ్ సెల్ కన్వీనర్ రామిశెట్టి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాది మద్దాల రాజేష్, మాజీ ఎంపీటీసీ పచ్చా బాబి, నాయకులు పాల్గొన్నారు.


