కొనసాగుతున్న ఎంపికలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: బ్యాడ్మింటన్ రాష్ట్రస్థాయి ఎంపికలు నగరంలోని డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇటీవల నిర్వహించిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో అర్హత సాధించిన క్రీడాకారులకు ఆదివారం నుంచి 3 రోజుల పాటు మెయిన్ ఎంపికలను నిర్వహిస్తున్నట్లు జిల్లా బ్యా డ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ జిలానీ బాషా తెలిపా రు. ఆదివారం మెయిన్ ఎంపికలను కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతో ఇండోర్ స్టేడియం కళకళలాడింది. బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరి నాగరాజు, మ్యాచ్ రెఫరీలు, టెక్నికల్ అఫీషియల్స్ కోచ్‌లు పాల్గొన్నారు.


