పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి
సమ్మెటివ్–1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రశ్నపత్రాల స్టోరేజీ, పంపిణీ, భద్రత, పరీక్షల నిర్వహణ అంశాల్లో పొరపాట్లుకు తావు లేకుండా ఏర్పాట్లు చేశాం. ఏరోజు పరీక్షకు ఆరోజు ప్రశ్నాపత్రాన్ని మాత్రమే తీసుకెళ్లి పరీక్ష నిర్వహించాలి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఆరోపణలు రాకూడదు. ఎక్కడా ఏ విధమైన పొరపాట్లు తలెత్తినా హెచ్‌ఎంలు, ఎంఈఓలు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
– షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి


