జగన్‌కు పేరొస్తుందనే చంద్రబాబు కుట్రలు
ఆ భయంతోనే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చర్యలు 12న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రజా ఉద్యమ ర్యాలీలు ఏడాదిన్నరలో చేసిందేమీ లేక బురద రాజకీయాలు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా
అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం:
అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుడితే ప్రజల్లో ఆయనకున్న మంచి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబా బు, కూటమి ప్రభుత్వం భయపడుతోందని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకర ణ చేసే దిశగా కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయా లు చేస్తోందని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుని పేద ప్రజలకు మెరుగైన వైద్యం, వైద్య విద్య ఉచితంగా అందించేందుకు ప్రజా మద్దతో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న బుధవా రం తలపెట్టనున్న ప్రజా ఉద్యమ ర్యాలీలకు సంబందించిన వాల్‌పోస్టర్‌లను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోలగట్ల కూటమి ప్రభుత్వం చేస్తోన్న మోసకారి పాలనపై పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న విజయనగరం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు కోలగట్ల వెల్లడించారు. స్థానిక సీఎంఆర్ జంక్షన్ వద్ద గల దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహం నుంచి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచి మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ సాగుతుందన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేయటం జరుగుతుందన్నా రు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజా సంఘా లు, కలిసి వచ్చే పార్టీలను భాగస్వాములు చేసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మోసపూరిత హమీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తూ పబ్బం గడుపుకోవటం విడ్డూరంగా ఉందని కోలగట్ల వాఖ్యానించారు.
చేసిందేమీ లేకే..
చెప్పుకునేందుకు చేసిందేమీ లేని కూటమి నాయకు లు గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు పేర్లు మార్చి ప్రచారం చేసుకోవటమేనా వారు సాధించిన అభివృద్ధి అంటూ కోలగట్ల ప్రశ్నించారు. అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చినా ఇప్పటికీ ప్రజలంతా అమ్మఒడిగానే పిలుస్తున్నారని చెప్పారు. సచివాలయాలను విజన్ యూనిట్‌లుగా మార్పు చేసినా ప్రజల గుండెల్లో మాత్రం సచివాలయాలగానే చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఇదే తరహలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన నవరత్నాలు, నాడు–నేడు పథకాలు ప్రజల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నాయన్నాయని వివరించారు. ఈ తరహాలో చంద్రబాబు అమలు చేసిన పథకాల్లో ప్రజలకు టక్కున గుర్తుకు వచ్చే ఒక్క పథకమైనా ఉందా అని ప్రశ్నించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఎన్నికలకు ముందు వేదికలపై ఊగిపోతూ ప్రసంగాలు చేసి పదవి వచ్చిన తరువాత యువతను మోసగించటం నిజం కాదా అని ప్రశ్నించారు. సమావేశంలో విజయనగరం కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, మండల పార్టీ అధ్యక్షుడు కెల్ల త్రినాధరావు, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి బోడసింగి ఈశ్వరరావు, కార్పొరేటర్‌లు జివి.రంగారావు, గాదం మురళి, బండారు ఆనంద్, ఎన్ని లక్ష్మణరావు, పార్టీ నాయకులు అవనాపు లక్ష్మణరావు, రెడ్డి గురుమూర్తి, బొంగ భానుమూర్తి, దుప్పాడ సునీత, తాళ్లపూడి పండు, రౌతు భాస్కరరెడ్డి, సప్పా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మెరకముడిదాం: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 12న తలపెట్టిన ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్, భీమిలి నియోజకవర్గం ఇన్‌చార్జ్ మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మండలంలోని చినబంటుపల్లిలో ప్రజా ఉద్యమానికి సంబంధించి పార్టీ ముఖ్యమైన నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రజా ఉద్యమం వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ హయాంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు కూటమి నాయకులు చీకటి ఒప్పందం చేసుకున్నారని, దీనిని వ్యతిరేకిస్తూ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 12వ తేదీన చేపట్టిన ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీకి ప్రతీ గ్రామం నుంచి 20 బైక్‌లకు తక్కువ కాకుండా పాల్గొనే విధంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలన్నారు. బైక్ ర్యాలీ గరివిడి శంకర్ ఫంక్షన్ హాలు నుంచి బయలుదేరి చీపురుపల్లిలోని మూడురోడ్లు కూడలి వరకూ నిర్వహించనున్నామని తెలిపారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు ఎస్.వి.రమణరాజు, తాడ్డి వేణుగోపాల్‌రావు, కోట్ల విశ్వేశ్వరరావు, కె.ఎస్.ఆర్.కె.ప్రసాద్, బూర్లె నరేష్‌కుమార్, పప్పల కృష్ణమూర్తి, రేగిడి లక్ష్మణరావు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.


