మూగ రోదన..!
జిల్లాలో పశు సంపద ఇలా..
జిల్లాలో పశు వైద్య శాలలు..
భామిని: పార్వతీపురం మన్యం జిల్లాలో పశువైద్యం అందని ద్రాక్షగా మారింది. వైద్యుల కొరత, శిథిలావస్థకు చేరిన పశు ఆస్పత్రుల భవనాలు, అరకొర మందులు పాడిరైతులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. 22 మంది వైద్యులు, 17 పశువైద్యసహాయకుల పోస్టుల ఖాళీలతో పశువైద్యం అందని ద్రాక్షగా మారింది. పల్లెల్లో మూగ రోదన వినిపిస్తోంది. పశువులకు సకాలంలో మెరుగైన వైద్యసేవలందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ పరిస్థితి...
జిల్లాలో 38 వెటర్నరీ డిస్పెన్సరీలు ఉన్నాయి. వాటిలో 22 చోట్ల పశు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 54 వెటర్నరీ సహాయకుల స్థానాల్లో 17 చోట్ల నియామకాలు సాగలేదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ స్థానం ఖాళీగా ఉంది. 28 వైద్య శాలలకు భవనాలే లేవు. చాలా చోట్ల ఆస్పత్రి భవనాలు శిథిలావస్థకు చేరాయి. పశువైద్య సేవలు అందించేందుకు వైద్యులు ఇబ్బంది పడుతున్నారు.
జిల్లాలో జీవాలు వివరాలు..
జిల్లాలో పశువైద్య ఖాళీల వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. ఉన్న సిబ్బందితో జిల్లా వ్యాప్తంగా 281 వైద్య శిభిరాలు నిర్వహించాం. 2.25 లక్షల పశువులకు వైద్య సేవలు అందించి వ్యాధినిరోధక టీకాలు వేశాం. కొత్త భవనాల నిర్మాణానికి, పాత భవనాల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాం.
– డాక్టర్ కలిశెట్టి మన్మథరావు, డీఏహెచ్‌ఓ, పార్వతీపురం మన్యం జిల్లా
జిల్లాలో 38 పశువైద్యశాలలు
22 వైద్యుల పోస్టులు కాళీ
భర్తీకాని 17 వెటర్నీ అసిస్టెంట్ పోస్టులు
శిథిలావస్థలో పశువైద్యశాలలు
పశువైద్య సేవలపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం
పాడి పశువులు: 2,28,658
గొర్రెలు: 2,07,451
మేకలు: 1,73,110
కోళ్లు: 8,10,937
ప్రాంతీయ పశు వైద్య శాలలు: 7
వెటర్నీరీ డిస్పెన్సరీలు: 38
గ్రామీణ పశు వైద్య కేంద్రాలు: 35
మూగ రోదన..!
మూగ రోదన..!


