పెద్దపులి దాడిలో గేదె మృతి
వెల్దుర్తి: నల్లమల అటవీ ప్రాంత సమీపంలోని వజ్రాలపాడు తండా సమీపంలో మేత మేస్తున్న గేదైపె పెద్దపులి దాడి చేయగా, అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. మండలంలోని వజ్రాలపాడు తండాకు చెందిన మూడావత్ తులశ్యనాయక్‌కు చెందిన గేదె అడవిలో మేత మేస్తుంటే పెద్దపులి దాడి చేసి చంపింది. విషయం తెలుసుకున్న తులశ్యనాయక్, సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. గేదె మెడ కొరికి తాగిన ఆనవాళ్లు ఉండడంతో పెద్ద పులి దాడిచేసినట్లు స్థానికులు చెబుతున్నారు. రూ.50వేల విలువైన గేదె పెద్దపులి దాడిలో చనిపోయిందని అటవీశాఖాధికారులు తనకు న్యాయం చేయాలని తులశ్యనాయక్‌కోరారు. ఈ ప్రాంతంలో అప్పడప్పుడు పెద్దపులి సంచరిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖాధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. అటవీశాఖాధికారులు మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


