నష్ట పరిహారం చెల్లించడం సాధ్యం కాదు
నెహ్రూనగర్ : శంకర్ విలాస్ బ్రిడ్జి వద్ద ఉన్న షాపుల యాజమాన్యం అడుగుతున్న నష్ట పరిహారం చెల్లించడం సాధ్యం కాదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఆదివారం మిర్చి యార్డు, శంకర్ విలాస్ వంతెన నిర్మాణ పనులను నగర మేయర్ కోవెలమూడి రవీంద్రబాబు, నగర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి పనులను పరిశీలించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ మిర్చి యార్డు వద్దపై వంతెన పనులు చాలా వేగంగా జరుగుతున్న నేపథ్యంలో యార్డు వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం అడ్డంకి కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జి జీజీహెచ్ వైపు డిసెంబర్ 15 తేదీలోపు 7 పిల్లర్లు పూర్తయ్యేలా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శంకర్ విలాస్ వైపు ఉన్న షాపులు తొలగించడంలో కొంత జాప్యం చోటు చేసుకుందని, వ్యాపారులు, ప్రజలు అర్థం చేసుకుని అభివృద్దికి సహకరించాలని కోరారు. రోడ్డు విస్తరణలో కోల్పోయే షాపులకు యాజమానులు అడుగుతున్న నష్టపరిహారం సాధ్యం కాదని...సదరు సమస్య పరిష్కారానికి నగరపాలక సంస్థ మేయర్, కమిషనర్ చర్చలు జరుపుతున్నారని వీలైనంత త్వరలో పరిష్కారమవుతుందన్నారు.
కేంద్ర సహాయ మంత్రి
పెమ్మసాని చంద్రశేఖర్
మిర్చియార్డు, శంకర్ విలాస్ బ్రిడ్జి
పనులను పరిశీలన


