14 నుంచి 72వ సహకార వారోత్సవాలు
రొంపిచర్ల: డివిజన్‌లో ఈనెల 14వ తేదీ నుంచి ఆలిండియా 72వ సహకార వారోత్సవాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించామని డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ కె.తిరుపతయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, గురజాల సబ్‌డివిజన్‌ల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో ఈ వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. సహకార పతాకావిష్కరణ, సహకార రంగ అభివృద్ధి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. డివిజన్‌లో 14వ తేదీన విప్పర్ల, బొల్లాపల్లి, పాకాలపాడు, గురజాల పీఏసీఎస్‌లో ప్రారంభ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. 15వ తేదీన చిలకలూరిపేటలోని బీఎస్‌ఎన్‌ఎల్, ఈసీసీఎస్ లిమిటెడ్‌లో నూజెండ్ల పీఏసీఎస్‌లో ఏబీఎఫ్‌ఎస్‌సీఎస్ లిమిటెడ్ ధూళిపాళ్లలో చర్లగుడిపాడు పీఎసీఎస్‌లో, 16వ తేదీన లింగంగుంట్ల, వినుకొండ, పరస తాళ్లూరు, పెద్ద అగ్రహారం పీఏసీఎస్‌లోను, 17వ తేదీన ఇక్కుర్రు, కారుమంచి, అంగలూరు, మాదల, మాచవరం పీఏసీఎస్‌లో, 18వ తేదీన నాదెండ్ల, శావల్యాపురం, క్రోసూరు, మాచర్ల పీఏసీఎస్‌లో, 19వ తేదీన సుబ్బయ్యపాలెం, ఈపూరు, అచ్చంపేట, బ్రాహ్మణపల్లి పీఏసీఎస్‌లోను, 20వ తేదీన చీమలమర్రి, గుర్రపునాయుడుపాలెం, దుర్గి, పీఏసీఎస్‌లోను, అమరావతి జీడీసీసీ బ్యాంక్ బ్రాంచ్‌లో వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో సహకార వేత్తలు, సహకార ఉద్యోగులు, సహకారవాదులు, సంఘాల్లో సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


