దాచేపల్లి: అతివేగంతో వస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి, అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం దాచేపల్లి మండలం శ్రీనగర్ గ్రామ సమీపంలో జరిగింది. ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, వారిని వైద్యసేవల నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు కారులో చైన్నె వెళ్లి హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. ఈక్రమంలో మండలంలోని శ్రీనగర్ సమీపంలో అతివేగంతో వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న సీహెచ్ దుర్గాచరణ్, సీహెచ్ సూరివితో పాటుగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనం ద్వారా గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన తరువాత మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు.
దుర్గి: భార్యపై గొడ్డలితో భర్త దాడిచేసిన సంఘటన మండల పరిధిలోని ధర్మవరం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగేండ్ల చిననాగేష్ మద్యానికి బానిసై భార్య మరియమ్మతో తరచూ గొడవ పడుతుండేవాడు. సోమవారం పూటుగా మద్యం సేవించి భార్య మరియమ్మతో గొడవపడి గొడ్డలితో దాడిచేశాడు. దాడిలో మరియమ్మకు తీవ్రగాయాలయ్యాయి. బాధితురాలిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు
అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు
అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు


