గార్లదిన్నె: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఎం చంద్రబాబుకు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజా ఉద్యమం ర్యాలీని జయప్రదం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని కొప్పల కొండలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ–రచ్చబండ కార్యక్రమానికి ‘అనంత’, పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త శైలజానాథ్, రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ పరిశీలకులు ఎల్‌ఎం మోహన్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు నార్పల సత్యనారాయణరెడ్డి, బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ ఈనెల 12న శింగనమలలో జరగనున్న ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకునేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో 40 శాతం మంది ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారన్నారు. గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టి ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తే, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పథకాన్ని మరింత బలోపేతం చేశారన్నారు. నేడు సీఎం చంద్రబాబు ఆరోగ్యశ్రీని అనారోగ్య శ్రీగా మార్చి పేదలకు ఉచిత వైద్యం అందకుండా చేశారన్నారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందన్నారు. మెడికల్ కళాశాలల విషయమై తీవ్ర ఒత్తిడి చేస్తున్నా చంద్రబాబు మొండిపట్టు వీడడం లేదన్నారు. కోటి సంతకాల సేకరణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కరువుతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఎమ్మెల్యేలంతా మద్యం అమ్ముకొని బతుకుతున్నారని విమర్శించారు. డిసెంబర్ ఆఖరుకల్లా గ్రామాల్లో కమిటీలు పూర్తి చేయాలన్నారు.
ప్రజల పక్షాన పోరాటం..
రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకై క నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రమే అని సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మాట్లాడితే చాలు కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. తుపాన్ వల్ల పంటలు నష్టపోతే చినబాబు లోకేష్ క్రికెట్ చూడటానికి వెళ్తారా అని నిలదీశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉండేవారన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరే కంగా చంద్రబాబు రూ. వందల కోట్ల విలువైన భూములను రూ.99 పైసలకే కట్టబెడుతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఎల్లారెడ్డి, సర్పంచు రామాంజనేయులు, ఎంపీపీ వెంకటనారాయణ, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు నారాయణ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రసాద్, చామలూరు రాజగోపాల్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆంజనేయులు, రైతు విభాగం అధ్యక్షులు పుల్లారెడ్డి, బూత్ కమిటీ అధ్యక్షులు ఓబిరెడ్డి, మేధావుల ఫోరం అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి, ఆర్టీఐ విభాగం అధ్యక్షులు నాగరాజు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నారాయణ స్వామి, ఆయా మండలాల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
‘ప్రజా ఉద్యమం ర్యాలీ’ని
జయప్రదం చేయండి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
అనంత వెంకటరామిరెడ్డి పిలుపు


