నిరసన ర్యాలీని జయపద్రం చేయండి
కై కలూరు: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 12న కై కలూరు నియోజకవర్గంలో జరిగే నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, కై కలూరు మాజీ ఎమ్మె ల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) కోరారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో ర్యాలీ పోస్టర్లను ఆదివారం అవిష్కరించారు. బుధవారం ఉదయం 9 గంటలకు నియోజకవర్గ నాలుగు మండలాల నాయకులు కై కలూరు సంత మార్కెట్ దివంగత వైస్ విగ్రహం వద్దకు రావాలన్నారు. అక్కడ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీరరాజు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గుమ్మడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి బలే నాగరాజు, రాష్ట్ర మైనారిటీ విభాగ కార్యదర్శి ఎండి.గాలిబ్‌బాబు, మండల పార్టీ అధ్యక్షులు సింగంశెట్టి రాము, ఏసేబురాజు, రామరాజు, జిల్లా అధికార ప్రతినిధి మొట్రూ యేసుబాబు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్


