పులిచింతలకు 31,101 క్యూసెక్కులు విడుదల
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ నాలుగు క్రస్ట్‌గేట్లు, రెండు యూనిట్లు ద్వారా విద్యుత్ ఉత్పాదన అనంతరం మొత్తం 31,101 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెయిల్ పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ రెండు క్రస్ట్‌గేట్లు 1.5 మీటర్లు, మరో రెండు క్రస్ట్‌గేట్లు మీటర్ ఎత్తు ఎత్తి 22,640 క్యూసెక్కులు, రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పాదన అనంతరం 8,461 క్యూసెక్కులు మొత్తం 31,101 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నీటి మట్టం 75.50 మీటర్లకుగాను 75.50 మీటర్లకు చేరిందన్నారు. రిజర్వాయర్ గరిష్ట నీటి సామర్ధ్యం 7.080 టీఎంసీలకుగాను ప్రస్తుతం రిజర్వాయర్‌లో 7.080 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు తెలిపారు. టీఆర్‌సీ లెవల్ 55.62 మీటర్లకు చేరుకుందన్నారు. ఎగువనున్న నాగార్జునసాగర్ నుంచి ప్రస్తుతం 34,185 క్యూసెక్కులు వస్తుందని పై నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామన్నారు.
మాజీ ఎంపీ శివాజీకి
పరామర్శ
నగరంపాలెం: మాజీ ఎంపీ డాక్టర్ యలమంచిలి శివాజీని ఆదివారం బృందావన్‌గార్డెన్స్‌లోని ఆయన నివాసంలో స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న తనయుడు, మాజీ మంత్రి గౌతు శ్యాంసుందర శివాజీ పరామర్శించారు. పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అనంతరం ఇరువురిని విశ్రాంత పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాళహస్తి సత్యనారాయణ సత్కరించారు. శ్రీపాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల పాలకవర్గం కార్యదర్శి పాటిబండ్ల విష్ణువర్ధన్, పలువురు పాల్గొన్నారు.
రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడికి వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జెల సుధీర్ భార్గవరెడ్డి ప్రథమ చికిత్స అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. సేకరించిన వివరాల ప్రకారం.. అద్దంకి – నార్కెట్‌పల్లి రహదారిపై పెదనెమలిపురి వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడిపోయాడు. అదేసమయంలో పిడుగురాళ్ల నుంచి నరసరావుపేట వెళుతున్న డాక్టర్ గజ్జెల సుధీర్ భార్గవరెడ్డి తీవ్ర గాయాలతో పడిఉన్న యువకుడిని గమనించి, వెంటనే ప్రథమ చికిత్స చేశారు. క్షతగాత్రుడిని స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. ఆపద సమయంలో మానవత్వంతో సత్వరం స్పందించిన డాక్టర్ గజ్జెల సుధీర్ భార్గవరెడ్డిని స్థానికులు అభినందించారు.
మానవత్వం చాటుకున్న వైఎస్సార్ సీపీ
సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జెల
పులిచింతలకు 31,101 క్యూసెక్కులు విడుదల


