హక్కుల పరిరక్షణకే చట్టాలు
భీమవరం: ప్రజల హక్కుల పరిరక్షణకు చట్టాలు రూపొందించబడ్డాయని, చట్టాలను అతిక్రమిస్తే ఎంతటి వారైనా శిక్షార్హులేనని భీమవరం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్), జుడీషియల్ మొ దటి తరగతి మేజిస్ట్రేట్ జి.సురేష్‌బాబు అన్నారు. ఆదివారం జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్బంగా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రత్యేక ఉపకారాగారంలో ఏర్పాటుచేసిన న్యాయ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన ముద్దాయిలతో మా ట్లాడి కేసు వివరాలు, పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక స్థోమత లేక న్యాయవాదిని పెట్టుకోలేకపోతే మండల న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు. జైలు సూపరింటెండెంట్ డి.వెంకటగిరి జైలులో అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. న్యాయమూర్తి మధ్యాహ్న భోజనాన్ని, బియ్యం, పప్పుదినుసులను పరిశీలించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యేలేటి యోహాను పాల్గొన్నారు.


