Crime News
-
సీఎం రేవంత్ ఓఎస్డీనంటూ బెదిరింపులు.. మాజీ క్రికెటర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి ఓఎస్డీ పేరుతో బెదిరింపులకు దిగుతున్న శ్రీకాకుళానికి చెందిన ఆంధ్రా మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం యవ్వారిపేటకు చెందిన నాగరాజు ర్యాపిడో, కంట్రీ డిలైట్ ఎండీలకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తాను సీఎం ఓఎస్డీ అని చెప్పుకొంటూ పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ఛైర్మన్లకు వాట్సాప్ మెసేజ్‌లు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఓఎస్డీ పేరుతో నాగరాజు ఫేక్ ఈ మెయిల్ క్రియేట్ చేసినట్టు పోలీసులు నిర్థారించారు. నాగరాజును శ్రీకాకుళంలోఅదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ క్రికెటర్ నాగరాజుపై 30 కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళంలో నాగరాజును అరెస్ట్ చేసిన పోలీసులు.. హైదరాబాద్‌కు తరలించారు. -
అనకాపల్లి: అచ్యుతాపురం కేంద్రంగా భారీ సైబర్ డెన్ గుట్టురట్టు
సాక్షి, అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం కేంద్రంగా భారీ సైబర్ డెన్ గుట్టురట్టరయ్యింది. అచ్యుతాపురం శివారులో ఫేక్ కాల్ సెంటర్ ముసుగులో ఈ సైబర్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 44 ఫ్లాట్స్ అద్దెకు తీసుకుని.. గత రెండేళ్ల నుండి సైబర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్థారించారు. నెలకి రూ.15 నుంచి 20 కోట్ల టర్నోవర్ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.అమెరికా పౌరులే లక్ష్యంగా కాల్ సెంటర్ ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 33 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై, రాజస్థానకు చెందిన ఇద్దరు ప్రధాన మేనేజర్లు నడిపిస్తున్నారు. మేఘాలయ, సిక్కిం, అస్సాం, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులు ఇందులో పనిచేస్తున్నారు. అమెరికా పౌరులతో ఎలా మాట్లాడాలో రెండు వారాలు ట్రైనింగ్ ఇస్తున్నారు. అమెజాన్ ఈ మార్కెట్ పేరుతో సైబర్ కాల్స్, వాల్నట్, సూపర్ మార్కెట్ గిఫ్ట్ కూపన్ లా పేరుతో నాలుగు దశల్లో ట్రాప్ చేస్తున్నారు.3 వందల డాలర్ల నుంచి 3,000 డాలర్ల వరకు కూపన్లు ఒక్కొక్కరికి అమ్ముతున్నారు. ఇందులో 200 నుండి 250 మంది కాల్ సెంటర్లో పని చేస్తున్నారు. మొదట వీరందరికీ ఉద్యోగాల పేరుతో ఎరవేస్తున్నారు. అపార్ట్మెంట్లకు 18 లక్షల రూపాయలు చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. పోలీసులు.. అన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. రూ.3 లక్షల నగదు, 300కు పైగా కంప్యూటర్స్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని.. అపార్ట్మెంట్ ఓనర్లపై కూడా విచారణ జరుపుతామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. -
ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు
ఫిలింనగర్(హైదరాబాద్): ప్రేమ పేరుతో ఓ యువతిని మోసగించి..మరో యువతితో తిరుగుతున్న యువకుడిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. అర్చిత్ పసుపులేటి అనే యువకుడు 2023 ఓ యువతిని పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ యువతితో సన్నిహితంగా ఉండడంతో గర్భందాల్చగా అబార్షన్ చేయించాడు. అనంతరం ఆమెను దూరం పెట్టాడు. ఇటీవల అర్చిత్ మరో యువతితో తిరుగుతున్నట్లు తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్చిత్‌తో పాటు అతని సోదరుడు, మామ, మరో ఇద్దరు స్నేహితులపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొంది. తనను మానసికంగా వేధిస్తుండడంతో పాటు ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా ప్రవర్తించారని, ఆర్థికంగా దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొంది. తనను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు తోసేశారని, అర్ధరాత్రి రోడ్డుపై బలవంతంగా నడుచుకుంటూ ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశానని, ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఆమె పోలీసులకు అందజేశారు. ఈ మేరకు పోలీసులు అర్చిత్‌తో పాటు సోదరుడు, మామ, మరో ఇద్దరిపై బీఎన్ఎస్ సెక్షన్ 69, 79, 89, 351 (3) కింద కేసు నమోదు చేశారు. -
ఒంటరి మహిళలే రాము టార్గెట్.. 18 దారుణ హత్యలు!
ఘట్కేసర్(హైదరాబాద్): మహిళను హత్యచేసి మృతదేహాన్ని కాల్చిన నిందితుడికి 1వ అడిషనల్ జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. బుధవారం ఇన్స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 4, 2021న అంకుషాపూర్ రైల్వేట్రాక్ 218/16–18 మైలురాయి వద్ద ముళ్లపొదల్లో 35–45 ఏళ్లున్న గుర్తు తెలియని మహిళ కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని దుండగులు ఆమెను అక్కడికి తీసుకొచ్చి గుర్తుపట్టకుండా ముఖం కాల్చివేసినట్లు కేసు నమోదైంది. అప్పటి ఇన్స్పెక్టర్ చంద్రబాబు దర్యాప్తు చేయగా.. మృతురాలు నగరానికి చెందిన దినసరి కూలీ కూర వెంకటమ్మగా తేలింది. సీసీ ఫుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా.. పోలీసులు సీసీ పుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి 18 మందిని హత్య చేసిన నిందితుడు సీరియల్ కిల్లర్ సంగారెడ్డి జల్లా కంది మండలం, ఆరుట్ల గ్రామానికి చెందిన మైనం రాములు (47)గా పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించి దర్యాప్తు తర్వాత చార్జ్‌షిట్ దాఖలు చేశారు. మహిళ హత్య కేసును ఛేదించిన అప్పటి ఇన్స్పెక్టర్ చంద్రబాబును పోలీస్ ఉన్నతాధికారులు అభినందించి అవార్డును అందజేశారు. ఇరు వాదనలు విన్న 1వ అడిషనల్ మేడ్చల్ జిల్లా న్యాయమూర్తి నిందితుడికి జీవితఖైదు విధించారు. -
బెంగళూరు: సూట్‌కేస్‌లో యువతి డెడ్‌బాడీ కలకలం
బెంగళూరు: నగరంలో దారుణం జరిగింది. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం కలకలం రేపింది. రైల్వే వంతెన సమీపంలో ట్రావెల్ బ్యాగ్‌లో యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బుధవారం ఉదయం హోసూర్ ప్రధాన రహదారిలోని పాత చందాపుర రైల్వే బ్రిడ్జి సమీపంలో, రైలు పట్టాల దగ్గర నీలం రంగులో ఉన్న ట్రావెల్ సూట్‌కేస్ పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు.అందులో యువతి మృతదేహం ఉండటంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతిని వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి కదులుతున్న రైలు నుంచి బయటకు విసిరేసి ఉంటారని అనుమానిస్తున్నారు.ట్రావెల్ బ్యాగ్‌లోని యువతి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. యువతి వయస్సు 18 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఆమె వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. -
Hyderabad: స్టార్ హోటల్లో యువ వైద్యురాలిపై లైంగిక దాడి
హైదరాబాద్: తన భార్యకు విడాకులు ఇచ్చానని, త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటానని వైద్యురాలిని నమ్మించి బంజారాహిల్స్ లోని ఒక స్టార్ హోటల్ లో లైంగిక దాడికి పాల్పడిన వైద్యుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మహబూబాబాద్ లోని అమ్మ ఆసుపత్రిలో పిల్లల వైద్య నిపుణుడిగా పనిచేస్తున్న డాక్టర్ జర్పుల స్వామి (37)కి 2023 లో అక్కడే మెడికో గా పని చేస్తున్న యువ వైద్యురాలు (30)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. తన భార్య తనను బలవంతంగా వివాహం చేసుకుందని, ఆమెకు నాలుగు అబార్షన్లు సైతం అయ్యాయని, అందుకే ఆమెకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నట్లు యువ వైద్యురాలిని నమ్మించారు. ఆమెతో స్నేహం, ప్రేమకు దారి తీసి విషయం పెళ్ళి వరకు వెళ్ళింది. 2024 సెపె్టంబర్లో వైద్యురాలు నగరానికి వచ్చి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నది. ఇదిలా ఉండగా డాక్టర్ స్వామి ఈ ఏడాది జనవరి 12న నేషనల్ పెడికాన్ సదస్సు నిమిత్తం నగరానికి రాగా ఆ సదస్సుకు యువ వైద్యురాలు సైతం హాజరైంది. ఇద్దరు కలిసి అదే రోజు బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో గది తీసుకున్నారు. పెళ్లి పేరుతో నమ్మించిన డాక్టర్ స్వామి ఆమెపై బలవంతంగా లైంగిక దారికి పాల్పడ్డాడు. విషయం బయటికి తెలియవద్దని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెళ్లిపోయాడు. స్వామి వ్యవహార తీరును అనుమానించిన యువ వైద్యురాలు అతని గురించి విచారించగా భార్యకు విడాకులు ఇవ్వలేదని తెలుసుకున్నది. తనకు జరిగిన అన్యాయాన్ని స్వామి తల్లిదండ్రుల దృష్టికి యువ వైద్యురాలు తీసుకెళ్లింది. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె సోమవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మంగళవారం పోలీసులు డాక్టర్ స్వామి, అతని కుటుంబ సభ్యులపై బి.ఎన్.ఎస్ 64 (1), 318(4), 318(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించి పెళ్లాడి.. ఎస్ఐ భార్య ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం/ కృష్ణరాజపురం: కొందరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఓ ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు హెచ్బీఆర్ లేఔట్‌లోని గణపతి దేవాలయం వద్ద చోటుచేసుకుంది. కాడుగొండనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేసే నాగరాజు భార్య శాలిని (32) సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని తనువు చాలించింది. గోవిందపుర పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి.. శాలిని, నాగరాజుది సినిమా కథను పోలిన కథ. ఇద్దరూ కూడా ఇల్కల్ వాసులు. స్కూలు, కాలేజీ రోజుల నుంచి పరిచయం ఉంది. శాలిని ఎమ్మెస్సీ చేయగా, నాగరాజు ఇంజినీరింగ్ చదివేవాడు. తరువాత ఎస్ఐ ఉద్యోగానికి సిద్ధమవుతానంటే శాలిని అతనికి ఆర్థిక సహాయం చేసింది. అలా నాగరాజు ఐదేళ్ల కిందట ఎస్ఐ పోస్టుకు ఎంపికై బెంగళూరులో పనిచేసేవాడు. శాలిని కూడా సిలికాన్ సిటీలో ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ చిగురించి, శాలిని తన భర్తకు విడాకులు ఇచ్చి నాగరాజును పెళ్లి చేసుకుంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణం కావచ్చని అనుమానాలున్నాయి. -
స్పా ముసుగులో వ్యభిచారం
కర్ణాటక: మండ్య నగరంలోని బెంగళూరు -మైసూరు జాతీయ రహదారిలో క్లౌడ్ -11 పేరుతో నిర్వహిస్తున్న యూనిసెక్స్ సెలూన్ అండ్ స్పాపై ఒడనాడు సంస్థ సిబ్బంది, పోలీసులు సం యుక్తంగా దాడి చేశారు. ఇక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి సెలూన్ యజమాని ఎలిజబెతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. నలుగురు మహిళలకు విముక్తి కల్పించారు.ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి వారిని వ్యభిచారం ఊబిలోకి దింపారని పోలీసులు తెలిపారు. ఈ స్పా సమీపంలోనే విద్యా సంస్థలు ఉన్నాయి. స్పాలో చీకటి వ్యవహారాలు జరుగుతున్నట్లు ప్రజలనుంచి ఫిర్యాదులు రావడంతో ఒడనాడు సంస్థకు చెందిన స్వాన్లి పరశురామ్, సీఐ నవీన్ లు పోలీసులతో కలిసి దాడి చేశారు. -
వైద్యులు నా కుటుంబాన్ని నాశనం చేశారు
గుంటూరు: ఈ ఏడాది ఫిబ్రవరిలో నా భర్త సాయిబాబు బల్బు బిగిస్తూ కాలు జారి కింద పడ్డారు. దీంతో ఆయనకు చేయి మణికట్టు వద్ద విరిగింది. స్థానిక కొత్తపేటలోని హాస్పిటల్‌కు తీసుకెళితే సర్జరీ చేశారు. చేసిన మరుసటి రోజే ఆయనకు కుడివైపు పక్షవాతం వచ్చింది. కనీసం ఆసుపత్రి వైద్యులు చికిత్స చేయకపోగా హడావుడిగా మమ్మల్ని బయటకు పంపేశారు. నాకు ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబాన్ని నడిపించే నా భర్త అచేతనంగా పడి ఉండడానికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణం. మెడికల్ వెరిఫికేషన్ పెట్టించాలని మనవి.–జక్కంపూడి శ్రీవల్లి, గుంటూరునా కొడుకును అమృతే కడతేర్చి ఉంటుంది.. తండ్రి ఫిర్యాదు -
నా కొడుకును అమృతే కడతేర్చి ఉంటుంది.. తండ్రి ఫిర్యాదు
నాయుడుపేట టౌన్(తిరుపతి): ‘నా కుమారుడిది సహజ మరణం కాదు. అతని మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. నా కుమారుడు నివాసముంటున్న నివాసంలోనే అతని భార్య స్నేహితుడు కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని నా కోడలు చెప్పలేదు. దీనిపై విచారణ చేపట్టండి’ అంటూ శ్రీకాకుళానికి చెందిన మృతుడి తండ్రి పీ.నరసింహమూర్తి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. శీకాకుళం ప్రాంతానికి చెందిన పూతల గణేష్ కుమార్(34), అతని భార్య అమృత, వారి బాబుతో కలిసి నాయుడుపేట పట్టణంలోని మంగపతినాయుడు నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గణేష్‌కుమార్ మేనకూరు సెజ్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో గణేష్‌కుమార్ ఇంట్లో నిద్రలేచి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతన్ని స్థానిక ప్రభుత్వ వైద్య శాలకు తీసుకెళ్తుండగా గణేష్‌కుమార్ మృతి చెందినట్లుగా భార్య అమృత పేర్కొన్నారు. అయితే కోడలు అమృత చెప్పిన విషయాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. తన కుమారుడు నివాసముంటున్న ఇంట్లో కోడలు అమృత స్నేహితుడు కూడా ఉంటున్నాడు. ఆ విషయం చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది.. అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు గణేష్‌కుమార్‌ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంధువులు శ్రీకాకుళం నుంచి నాయుడుపేటకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. -
నాన్నే అమ్మను రాయితో గుద్ది చంపేశాడు..!
నాయుడుపేట టౌన్(తిరుపతి): ‘నాన్నే అమ్మను రాయితో గుద్ది చంపేశాడు.. మా కళ్లెదుటే అమ్మ చనిపోయింది’ అంటూ ఆ చిన్నారి కళ్ల నిండా నీళ్లు పెట్టుకుని తన తల్లిని చంపిన వైనాన్ని పోలీసులకు వివరించిన తీరు స్థానికులను కలచివేసింది. కన్న బిడ్డల ఎదుటే అతి కిరాతకంగా భార్యను కడతేర్చిన ఘటనపై పోలీసులు సోమవారం విచారణ చేపట్టారు. వివరాలు.. మండల పరిధిలోని మడపలం గ్రామ సమీపంలో కాలువ గట్టు వద్ద శనివారం రాత్రి మద్యం మత్తులో భార్య వీణమ్మ(28)ను భర్త రాపూరు శ్రీనివాసులు హత్య చేసిన విషయం తెలిసిందే. మృతురాలి తల్లి తుపాకులు పెంచలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలికి అఖిల(7), బత్తెయ్య(4), ఆదెయ్య(3) చిన్నారులున్నారు. శనివారం రాత్రి భర్త శ్రీనివాసులు పూటుగా మద్యం సేవించి భార్య వీణమ్మతో గొడవపడ్డాడు. ఆపై బండరాయితో తలపై మోది చంపేశాడు. తర్వాత పాము కాటు వేయడంతో వీణమ్మ మృతి చెందిందని నమ్మబలికాడు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి పెంచలమ్మ ఆదివారం ఉదయం బిక్కుబిక్కుమంటూ ఏడ్చుతున్న వీణమ్మ పిల్లల్ని అక్కున చేర్చుకుంది.పోలీసుల ఔదార్యం విచారణ అనంతరం వీణమ్మ మృతదేహానికి సోమవారం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతురాలి కుటంబ సభ్యులు నిరుపేద గిరిజనులు కావండతో వారికి పోలీసులు అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించారు. వీణమ్మ మృతదేహాన్ని సైతం తీసుకెళ్లందుకు వారి వద్ద నగదు లేక పోవడంతో పోలీసులే నాయుడుపేటలో వీణమ్మకు అంత్యక్రియలు జరిపించారు. పరారీలో ఉన్న ఆమె భర్త శ్రీనివాసులును త్వరలో పట్టుకుంటామని తెలిపారు. -
ముక్కులో దూది.. నోటికి పది రౌండ్లు టేపు చుట్టుకుని..
శ్రీకాకుళం రూరల్: నోటికి పది రౌండ్లు టేపు చుట్టుకున్నాడు. ఊపిరి ఆడకుండా ముక్కులో దూది పెట్టుకున్నాడు. చేతులను కుర్చీ వెనక్కి కట్టుకున్నాడు. ఇలా ప్రాణం పోకపోతే.. ఎలాగైనా చనిపోవాలని నాలుగు రకాల కత్తులను రెడీగా ఉంచుకున్నాడు. దిగ్భ్రాంతి కలిగించే రీతిలో దాసరి ఉమామహేశ్వరరావు (26) అనే యువకుడు సోమవారం రాత్రి జిల్లాకేంద్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం రూరల్ మండ లం రాగోలు గ్రామం షిర్డీ సాయినగర్‌లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దాసరి ఉమామహేశ్వరరావు హైదరాబాద్‌లో ని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి చిరంజీవి ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లినట్లు సమాచారం. తమ్ముడు బెంగళూరులో ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. ఉమామహేశ్వరరావుకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో ఒక్కడే ఇంటిలో ఉంటున్నాడు. ఏమైందో గానీ సోమవారం రా త్రి తలుపునకు గడియ పెట్టి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. భోజనం కోసం బంధువులు ఎంత తలుపు తట్టినా తీయకపోవడంతో బలవంతంగా తలుపు తెరిచి.. కుర్చీలో విగతజీవిగా పడి ఉన్న యువకుడిని చూసి నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధ తెలియకూడదనేనా.. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించా రు. మృతుడు యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నా రు. నొప్పి తెలియకుండా ఉండడానికే ఈ విధంగా బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని తెలిపారు. ముందుగా వీల్‌చైర్‌లో కూర్చుని నోటికి పది రౌండ్ల టేపును చుట్టుకున్నాడని, ముక్కులో దూది పెట్టుకుని, రెండు చేతులను కుర్చీ వెనక్కి కట్టుకునేలా ఏ ర్పాట్లు చేసుకున్నాడని పోలీసులు వివరించారు. ఈప్లాన్ సక్సెస్ కాకపోతే మరోలాగైనా చనిపోవడానికి నాలుగు రకాల కత్తులు ఉంచుకున్నాడని పేర్కొన్నారు. మృతుడి చిన్నాన్న దాసరి ప్రభాకర రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
ఇబ్రహీంపట్నం రూరల్(హైదరాబాద్): ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్రాష్ బారియర్‌ను ఢీకొట్టడంతో కారులోకి పది మీటర్ల మేర దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ బాలరాజు కథనం ప్రకారం.. బెంగాల్ రాష్ట్రానికి చెందిన కితాబ్‌అలీ అలియాస్ హిలాల్ (35) ఘట్కేసర్ మండలం, నాగారంలోని శిల్పానగర్, విశ్వసాయి బృందావనం అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. తుక్కుగూడ సమీపంలోని వివిధ కంపెనీలకు మ్యాన్‌పవర్ సప్లయ్ చేసేవాడు. సోమవారం ఉదయం తుక్కుగూడకు వచ్చి తిరిగి నాగారం వైపు కారులో వెళ్తున్నాడు. బొంగ్లూర్ ఎగ్జిట్ 12 వద్దకు రాగానే అతివేగం కారణంగా కారు అదుపుతప్పి క్రాష్ బారియర్‌ను ఢీకొంది. దీంతో కారు అద్దంలో నుంచి క్రాష్ బారియర్ పది మీటర్ల వరకు దూసుకెళ్లడంతో కితాబ్‌అలీ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో క్రాష్‌బారియర్ ఇరక్కుపోవడంతో మృతదేహం బయటకు తీయడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఔటర్‌రింగ్ రోడ్డు సిబ్బంది సహాయంతో కారు పైభాగం కట్ చేయించి గంటల తరబడి శ్రమించి మృతదేహాన్ని బయటికి తీశారు. సీఐ రాఘవేందర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మంచి మాటలు చెప్పినందుకు...
మేడ్చల్: మద్యానికి బానిసై సంసారాన్ని ఎందుకు చెడగొట్టుకుంటున్నావ్ మంచిగా ఉంటూ భార్యా పిల్లలను బాగా చూసుకో అంటూ నాలుగు మంచి మాటలు చెప్పినందుకు ఓ వ్యక్తి తన బావ వరుసైన వ్యక్తిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానిక సరస్వతీనగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుజరాత్‌కు చెందిన సోలంకి మోతీలాల్(43), అతడి మేనత్త కుమారుడు శంకర్(35) కుటుంబాలతో కలిసి రైల్వె స్టేషన్ సమీపంలోని సరస్వతీ నగర్లో ఉంటూ భవన నిర్మాణ కారి్మకులుగా పని చేస్తున్నారు. కాగా మద్యానికి బానిసైన శంకర్ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం కూడా మద్యం తాగి వచి్చన అతను కుటుంబ సభ్యులతో గొడవ పడి సమీపంలోని రైల్వే ప్లాట్ ఫారంపై పడుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మోతీలాల్ అక్కడికి వెళ్లి శంకర్‌కు నచ్చజెప్పేందుకు యతి్నంచాడు. అయితే మద్యం మత్తులో ఉన్న శంకర్ అతడిని దుర్బాషలాడాడు. అనవసరంగా భార్యా పిల్లలతో గొడవలు ఎందుకని అతడికి సర్దిచెప్పిన మోతీలాల్ శంకర్‌ను ఇంట్లో దిగబెట్టి తన ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం పనికి వెళ్లేందుకు సిద్ధమైన మోతీలాల్ తన బంధువుల ఇంటి వద్దకు వెళుతుండగా అతడిని అడ్డుకున్న శంకర్ తన కుటుంబ విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావంటూ అతడిని తిడుతూ దాడి చేసేందుకు వెళ్లాడు. దీంతో మోతీలాల్ ఈ విషయాన్ని శంకర్ తల్లికి చెప్పేందుకు వెళుతుండగా ఆగ్రహానికి లోనైన శంకర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో మోతీలాల్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతను అక్కడే కుప్పకూలడంతో శంకర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు మోతీలాల్‌ను 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. -
మామిడికాయ పచ్చడి విషయంలో గొడవ
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మామిడికాయ పచ్చడి పెట?్ట విషయంలో తలెత్తిన గొడవలో భార్యను గొంతు నులిపి చంపాడు భర్త. ఈ ఘటన పందిళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సూర అంజలి– సూర రాజ్‌కుమార్ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం మామిడికాయ పచ్చడి పెట్టేందుకు అంజలి సన్నద్ధమైంది. ఇందుకోసం అవసరమైన వెల్లుల్లి కొనుక్కు రావాలని భర్త రాజ్‌కుమార్‌కు సూచించింది. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన రాజ్‌కుమార్.. అంజలి(27)ను గొంతు నులిమి చంపేశాడు. ఈమేరకు మృతురాలి తండ్రి సంపంగి మల్లేశ్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు శవాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటేశ్ తెలిపారు. -
ఆత్మహత్య వెనుక.. ప్రొఫెసర్‌తో ప్రేమ
యశవంతపుర: ఓ ప్రొఫెసర్ ప్రేమ పురాణం యువ ఇంజినీరును బలిగొన్నట్లు తేలింది. దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థళకు చెందిన ఏరోనాటిక్స్ ఇంజినీరు ఆకాంక్ష ఎస్ నాయర్ (23) ప్రేమ వైఫల్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో బయట పడింది. ఈ నెల 17న ఆమె పంజాబ్‌లో జలంధర్ వద్ద పగ్వారలో ఎల్పీయూ విద్యాసంస్థలో నాలుగో అంతస్తు నుంచి కిందపడి చనిపోయారు. అక్కడి పోలీసుల విచారణలో పలు విషయాలు తెలిశాయి. అదే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కేరళ కొట్టాయంవాసి బిజిల్ మ్యాథ్యూతో ప్రేమలో పడిందని, అతనికి ఇదివరకే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసింది. అతని ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని అడిగింది. అతడు తిరస్కరించి కాలేజీకి వచ్చాడు. మళ్లీ అక్కడకు వచ్చిన ఆకాంక్ష మ్యాథ్యూతో గొడవ పడింది, పెళ్లి చేసుకోనని అతడు తెగేసి చెప్పడంతో మోసపోయానని బాధపడింది, అక్కడే నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె చావుకు కారణమయ్యాడని మ్యాథ్యూపై జలంధర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు ఆమె భౌతికకాయాన్ని ఇంటికి తీసుకువచ్చారు. దారి తప్పిన ప్రేమ ఎంతపని చేసిందని బంధుమిత్రులు శోకంలో మునిగిపోయారు. ఏరో ఇంజినీర్ అనుమానాస్పద మృతి -
విజయనగరం ఉగ్రమూలాల కేసు.. వెలుగులోకి కొత్త కోణాలు
సాక్షి, హైదరాబాద్: విజయనగరం ఉగ్రకుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పట్టుబడ్డ ఏపీ విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహా్మన్, హైదరాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్ భారీ విధ్వంసానికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. కర్ణాటక, మహా రాష్ట్ర యువకులు సైతం వీరి గ్యాంగ్‌లో ఉన్నట్టు తెలిసింది. వీరంతా ఇటీవలే హైదరాబాద్‌లో సమావేశమై బాంబుపేలుళ్ల కుట్రలకు సంబంధించి పలు అంశాలు పంచుకున్న ట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఏపీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా సిరాజ్, సమీర్‌లను ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విజయనగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రలింకుల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సైతం రంగంలోకి దిగారు. సోమవారం విజయనగరం వెళ్లి స్థానిక పోలీసులు, ఇరు రాష్ట్రాల ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి కీలక సమాచారం సేకరించారు. సౌదీ హ్యాండ్లర్ నుంచి వచి్చన ఆదేశాల మేరకు భారీ పేలుళ్ల కుట్రకు తెరతీసినట్టు కీలక ఆధారాలు ఉండటంతో ఎన్ఐఏ ప్రత్యేకంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలిసింది. ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్ గ్రూపు ఈ కుట్రలో సిరాజ్, సమీర్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారు కలిపి మొత్తం ఆరుగురు ఉన్నట్టు గుర్తించారు. వీరంతా ఇన్‌స్టా్రగామ్‌లో ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకోగా.. సౌదీ హ్యాండ్లర్ అన్ని కీలక విషయాలను వీరి గ్రూప్ కు పంపుతున్నాడు. ఇప్పటికే వీరంతా హైదరాబాద్‌లో సమీర్ సహాయంతో ఒక రహస్య ప్రాంతంలో 3 రోజులపాటు గడిపినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇందు లో ప్రధానంగా బాంబుల తయారీ, అందుకు అవసరమైన వస్తువుల కొనుగోలు, డమ్మీ బ్లాస్టులు చేయడం, ఆ తర్వాత ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరిని కలవాలి, తదుపరి కార్యాచరణ వంటి అనేక విషయాలు చర్చించుకున్నారు. సమీర్, సిరాజ్‌కు బాంబుల తయారీ పదార్థాల కొనుగోలు, తయారీ బాధ్యతను హ్యాండ్లర్ అప్పగించాడు. యూట్యూబ్‌లో వీరిద్దరూ బాంబుల తయారీ విధానం చూసినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేస్తే అనుమానం వస్తుందని, విజయనగరానికి చెందిన సిరాజ్‌కు ఆ బాధ్యత అప్పగించారు. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు అవసరమైన టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సెల్స్ అమెజాన్‌లో ఆర్డర్ చేసినట్లు తేలింది. ఏపీ రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఇప్పటికే పలుమార్లు రిహార్సల్స్ నిర్వహించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. హైదరాబాద్‌లో డమ్మీ బ్లాస్టింగ్స్, ఆ తరువాత వరుస పేలుళ్లకు కుట్ర చేసినట్టు గుర్తించారు. సమీర్ గురించి ఆరా.. సికింద్రాబాద్‌లో లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేస్తున్న సమీ ర్.. బోయిగూడ రైల్ కళారంగ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇక్కడే ఉంటూ ఇన్‌స్టా్రగామ్ గ్రూప్ ద్వారా ఇతర నిందితులకు, సౌదీలోని హ్యాండ్లర్కు టచ్‌లో ఉంటున్నాడు. హైదరాబాద్ కేంద్రంగా మిగిలిన ఆరుగురు సభ్యులకు షెల్టర్ ఇవ్వడం.. బాంబుల తయారీలో సిరాజ్‌కు సహకారం అందించడంలో కీలకంగా ఉంటున్నాడు. సమీర్ ఇంకా ఎవరెవరితో సన్నిహితంగా ఉండేవాడు.. సమీర్‌తో కాంటాక్ట్‌లో ఉన్న వారు ఎవరు అన్న విషయాలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది. -
తమ్ముడి మృతితో ఆగిన అక్క పెళ్లి
ఆలూరు రూరల్(కర్నూలు): అందరూ వివాహ వేడుకల్లో ఆనందంగా ఉన్నారు. మరి కొద్ది గంటల్లో కల్యాణ తంతు నిర్వహించాల్సి ఉంది. ఇంతలోనే విషాదం. వధువు తమ్ముడు రోడ్డు ప్రమా దంలో దుర్మరణం చెందడంతో అక్క వివాహం నిలిచిపోయింది. శనివారం రాత్రి హుళేబీడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆస్పరికి చెందిన ఆనంద్ (19) మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అతని స్నేహితులు పూర్ణచంద్ర, తిమ్మప్ప తీవ్రంగా గాయపడ్డారు. ఆదోని ఆస్పత్రిలో పూర్ణచంద్ర, కర్నూలు ఆస్పత్రిలో తిమ్మప్ప చికిత్స పొందుతున్నారు. ఆస్పరికి చెందిన తిమ్మన్న, శుకుంతల కుమారుడు ఆనంద్.. కాగా అతని సోదరి వివాహం హొళగుంద మండలం వందవాగిలి గ్రామంలో ఆదివారం ఉదయం జరగాల్సి ఉంది. ఆనంద్, పూర్ణచంద్ర, తిమ్మప్ప గుంటూరులోని ఆర్‌వీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. పూర్ణచంద్ర స్వగ్రామం ప్రకాశం జిల్లా కంభం గ్రామం కాగా తిమ్మప్పది ఆస్పరి మండలం చిగిళి గ్రామం. శనివారం రాత్రి ఆనంద్ సోదరి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆనంద్ మృతితో అతని సోదరి పెళ్లి ఆగిపోయింది. అక్క పెళ్లికి వచ్చి తమ్ముడి అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.ఎమ్మెల్యే పరామర్శ.. ఆనంద్ మృతి బాధాకరమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. ఆదివారం ఆయన ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆనంద్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
మాటలకందని విషాదం
అమ్మా... అందరం కలిసి ఆడుకుంటామంటే సరే అన్నారు.. అదే పిల్లల చివరి మాట అని ఆ తల్లులకు తెలియదు.. అక్కడే మృత్యువు కాపుకాసి ఉందని గుర్తించలేకపోయారు.. మూడు గంటల పాటు పిల్లలు కనిపించకపోయే సరికి తల్లిడిల్లిపోయారు.. ఏమయ్యారో అంటూ ఊరంతా గాలించారు.. చివరకు కారులో ప్రాణవాయువు అందక విలవిల్లాడుతూ విగత జీవులుగా కనిపించిన పిల్లలను చూసి కుప్పకూలిపోయారు.విజయనగరం క్రైమ్: సమయం మధ్యాహ్నం 2 గంటలు.. గ్రామంలోని పెళ్లివేడుకలో పెద్దలు, ఆటపాటల్లో చిన్నారులు నిమగ్నమయ్యారు. ఆటలాడుతూ గ్రామ బీసీ కాలనీ నీళ్ల ట్యాంకు వద్ద ఉన్న కారులోకి నలుగురు చిన్నారులు వెళ్లారు. పొరపాటున డోర్లు వేయడంతో లాక్ అయ్యాయి. అంతే.. వారికి ప్రాణ వాయువు అందలేదు. కాపాడాలంటూ వారి ఆర్తనాదాలు బయటకు వినిపించలేదు. మూడుగంటల తర్వాత వెతుకుతూ వెళ్లిన పెద్దలకు కొనఊపిరితో కారులో కొట్టుమిట్టాడుతున్న చిన్నారులు కనిపించారు. డోర్లు బద్దలగొట్టి చిన్నారులను బయటకు తీసినా ఫలితం లేకపోయింది. చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కారు రూపంలో మృత్యువు కాటేసింది. ఈ ఘటనతో విజయనగరం సమీపంలోని ద్వారపూడిలో మృత్యుఘోష వినిపించింది. సర్వజన ఆస్పత్రి ప్రాంగణం శోకసంద్రంగా మారింది. మాటలకందని విషాదం అందరూ పదేళ్లలోపు పిల్లలే. కూలి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులు వారిని అల్లారు ముద్దుగా సాకుతున్నారు. పిల్లలు ఆడుకుంటేంటే సంబర పడ్డారు. పెళ్లివేడుకలో బిజీ అయ్యారు. ఒకేసారి కారు రూపంలో కంది మణీశ్వరి (6), బూర్లె చారులత (7), పండి ఉదయ్ (7), బూర్లె జాస్రిత(8)ను మృత్యువు కాటేయడంతో కన్నీరుకార్చారు. విగతజీవులుగా మారిన చిన్నారులను పట్టుకుని బోరున విలపించారు. కడుపుకోత.. మృతిచెందిన చిన్నారుల్లో బూర్లె చారులత, జాస్రిత అక్కాచెల్లెళ్లు. వీరిద్దరూ ఒకే సారి మృతిచెందడంతో తల్లిదండ్రులు ఉమ, ఆనంద్‌లు విషాదంలో ముని గిపోయారు. దేవుడా.. కడుపుకోత మిగిల్చావా అంటూ విలపించారు. సర్వజన ఆస్పత్రి మార్చురీ వద్ద ఉన్న కుమార్తెల మృతదేహాలను చూసిన ఉమ ఓ దశలో సొమ్మసిల్లి పోయింది. ఉదయ్ తల్లిదండ్రులు బుచ్చిబాబు, భవానీ, మణీశ్వరి తల్లిదండ్రులు సురేష్ అరుణలు సైతం బిడ్డల మృతదేహాలను పట్టుకుని రోదించారు.ఇళ్ల మధ్యనే ఘటన... మృత్యువుకు కారణమైన కారు వీధిలో ఇళ్ల మధ్యనే ఉంది. దాని పక్కగుండానే అందరూ రాకపోకలు సాగించినా.. అందులో ఉన్న చిన్నారులను గుర్తించలేకపోయారు. వారి ఆర్తనాదాలను ఆలకించలేకపోయారు. కారు అద్దాలు నలుపువి కావడం కూడా దీనికి ఓ కారణంగా గ్రామస్తులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్, వన్‌టౌన్ ఎస్ఐ రామ్‌గణేష్‌లు హుటాహుటిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సర్వజన ఆస్పత్రికి వచ్చి మృతుల వివరాలు సేకరించారు.కారు ఎవరిది? బీసీ కాలనీ నీళ్ల ట్యాంకు వద్ద ఆగి ఉన్న కారు ఎవరిది..? అక్కడే ఎందుకు పార్క్ చేశారు? డోర్‌కు లాక్ ఎందుకు వేయలేదు అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ద్వారపూడిలో జరుగుతున్న పెళ్లి వేడుకకు సంబంధించి వైజాగ్ నుంచి ఆ కారు వచ్చినట్టు సమాచారం. కారు ఓనర్, డ్రైవర్ ఒక్కరేనని తెలిసింది. సంబంధిత వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. -
ఏరో ఇంజినీర్ అనుమానాస్పద మృతి
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన విద్యావంతురాలి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ధర్మస్థలం నివాసి అయిన ఏరోస్పేస్ ఇంజినీర్ పంజాబ్‌లో అనుమానాస్పద రీతిలో చనిపోయింది. ఆకాంక్ష (23) మృతురాలు. ధర్మస్థలంలోని బోళియార్ నివాసులైన సురేంద్ర, సింధూదేవి దంపతుల కుమార్తె ఆకాంక్ష, పంజాబ్‌లోని ఫగ్వాడాలో ఎల్పీయూ విద్యాసంస్థలో ఉన్నత విద్యను పూర్తి చేసి, 6 నెలల నుంచి ఢిల్లీలో ఏరోస్పేస్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తోంది. తరువాత జపాన్‌లో ఉద్యోగం సంపాదించుకున్న ఆకాంక్ష తాను చదివిన కాలేజీలో కొన్ని సర్టిఫికెట్లు పొందడానికి పంజాబ్‌కు వెళ్లింది. శనివారం మధ్యాహ్నం సర్టిఫికెట్లు తీసుకున్నట్టు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. జలంధర్ నగరంలో ఉన్నట్లు తెలిపింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఓ భవనంలో 3వ అంతస్తు పడి దుర్మరణం చెందింది. స్థానిక పోలీసులు ఆ మేరకు కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. వెంటనే తల్లిదండ్రులు పంజాబ్‌కు వెళ్లారు. ఏదో దారుణం జరిగిందని, ఇది ప్రమాదం కాదని తల్లిదండ్రులు వాపోయారు. -
సంగారెడ్డిలో ఉగ్రమూలాల కలకలం.. పాక్‌కు సమాచారం చేరవేత?
సంగారెడ్డి: జిల్లాలో ఉగ్రమూలాల కలకలం రేగింది. కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఇస్లాం(19) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే క్రమంలో షాకింగ్ విషయాలు బయడపడినట్లు తెలుస్తోంది. అస్సాం పోలీసుల ఆపరేషన్ ఘోస్ట్ సిమ్ లో భాగంగా ఇస్లాం బాగోతం వెలుగులోకి వచ్చింది.అస్సాంలో గుర్తింపు కార్డులు లేకుండా సిమ్ కార్డులు తీసుకుని సంగారెడ్డి జిల్లాలో పలువురికి విక్రయిస్తున్నట్లు తెలిసింది. గతంలో అస్సాంలో మొబైల్ షాపులో పని చేసిన ఇస్లాం.. అక్కడే కొందరి గుర్తింపు కార్డులతో నకిలీ సిమ్ లు తీసుకుని అధిక ధరకు విక్రయించాడు.ప్రస్తుతం గొల్లపల్లిలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. అదే సమయంలో తన వద్ద ఉన్న నకిలీ సిమ్ కార్డులను పాకిస్తానీయులకు అమ్మినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భారత్ ఫోన్ నెంబర్లతో పాకిస్తాన్ లో వాట్పాప్ అకౌంట్ లు క్రియేట్ కావడంతో ఈ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు.ఇటీవల జరిగిన భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధంలో భాగంగా మీడియాలో వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నట్లు సమాచారం.దేశ వ్యాప్తంగా ఏడుగురు అరెస్ట్.. అంతా అస్సాం వారేఆపరేషన్ ఘోస్ట్ సిమ్ లో భాగంగా దేశ వ్యాప్తంగా ఏడుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, అంతా అస్సాం రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఏడుగురు అనుమానితులువివిధ రాష్ట్రాల్లో ఉంటూ దేశ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాకిస్తాన్ లోని తమ మిత్రులకు సమాచారం చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సంగారెడ్డిలో మకాం వేసిన అస్సాం పోలీసులు తమ దర్యాప్తును అత్యంత గోప్యంగా సాగిస్తున్నట్లు సమాచారం.#OperationGhostSIMAssam police has arrested 7 people for helping people from Pakistan to use WhatsApp from Indian numbers by sharing OTPs.7 arrested, 948 SIMs seized.These SIMs were being used for cyber crimes and anti-national operations. pic.twitter.com/crLN5LMmpO— Incognito (@Incognito_qfs) May 18, 2025 Assam Police busts major fake SIM racket in ‘Operation GHOST SIM’; 7 arrested, 948 SIMs seized; WhatsApp OTPs linked to Pakistan. The public is urged to stay alert.Read Full Story: https://t.co/zhwxJLa7Cm#AssamPolice #OperationGhostSim #Crime #SimCardRacket pic.twitter.com/BU94CVK9o1— Pratidin Time (@pratidintime) May 17, 2025 -
భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య
ఉయ్యాలవాడ: విధి ఆటలో ఓ చిన్నారి అనాథగా మారింది. అభంశుభం తెలియని పసిపాప తొమ్మిది రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయింది. ఈ విషాద ఘటన ఆర్. పాంపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పొగాకు నారాయణ కూలీ పనులకు వెళుతూ జీవనం కొనసాగించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన మట్టి మిద్దె పనులకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ మిద్దె కూలి శిథిలాలు నారాయణపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి నుంచి అతని భార్య లలిత (40) తీవ్ర మనోవేదనకు గురైంది. మనస్తాపంతో వారం రోజులుగా ఆహారం తీసుకోకుండా భర్త గురించే ఆలోచించింది. తన 45 రోజుల చిన్నారికి కూడా పోతపాలు తాపింది. చివరకు జీవితంపై విరక్తి చెంది బుధవారం ఉదయం లలిత రసాయన పౌడర్‌ను నీళ్లలో కలుపుకుని అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన బంధువులు, స్థానికులు చికిత్స నిమిత్తం 108లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో లలిత మృతి చెందింది. తల్లిదండ్రుల మృతి చెంద డంతో 45 రోజుల చిన్నారి అనాథగా మిగిలింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పసిపాపకు తల్లిదండ్రులు లేకపోవడంతో నాయనమ్మ శివమ్మ దిక్కైంది. అమ్మపాల కోసం ఏడస్తున్న చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు. కాగా నారాయణ మొదటి భార్య విజయలక్ష్మి ఐదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో క్రిమి సంహారక మందు తాగి మృతి చెందింది. రెండేళ్ల క్రితం లలితను రెండవ వివాహం చేసుకున్నాడు. మృతురాలి తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.. ఇటీవల జిల్లాలో పలువురు ఆత్మహత్యకు కల్లాపికి ఉపయోగించే పేడ రంగును నీళ్లలో కలుపుకుని తాగి మృతి చెందుతుండటంతో కలెక్టర్ రాజకుమారి నెల క్రితం పేడ రంగు విక్రయాలను నిషేధించారు. అయినా కొందరు కిరాణ దుకాణ వ్యాపారులు విక్రయిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పేడ రంగు విక్రయించకుండా అధికారులు దుకాణాలపై దాడులు చేయా లని గ్రామస్తులు కోరుతున్నారు. -
కుటుంబం కోసం భార్య జాబ్.. అనుమానంతో భర్త ఏం చేశాడంటే?
సాక్షి, పహాడీషరీఫ్: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తలపై కర్రతో బాది.. గాజుతో చేయి నరాలు కోసి ఆపై చున్నీతో ఆమె గొంతు బిగించి భార్యను భర్త హతమార్చాడు.ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ ప్రాంతానికి చెందిన జాకీర్ అహ్మద్, నాజియాబేగం(30) దంపతులు. వీరికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు సంతానం. ఆటో నడుపుతూ జీవనం సాగించే జాకీర్ సంపాదనతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో నాజియా ప్రైవేట్ జాబ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమైపె అనుమానం పెంచుకున్నాడు జాకీర్. ఆమెపై అనుమానంతో 15రోజుల క్రితం తన మకాంను బాలాపూర్ ఠాణా పరిధిలోని కొత్తపేట న్యూ గ్రీన్‌సిటీ కాలనీకి మార్చాడు.అలాగే, అనుమానంతో రహస్యంగా భార్యను గమనిస్తున్నాడు. ఈనెల 13న రాత్రి 11గంటలకు ఇంటికి వచ్చాడు. పిల్లలు మరో గదిలో ఉండగా.. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తున్నావని భార్యను జాకీర్ నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అర్ధరాత్రి భార్యతో గొడవపడి కర్రతో తలపై మోది, గొంతుకు చున్నీ బిగించి హత్యచేశాడు. రక్తపు మడుగుల్లో పడి ఉన్నా.. ఆమెపై కోపం తగ్గలేదు. కిటికీకి ఉన్న అద్దాన్ని విరగ్గొట్టి ఓ ముక్కతో ఆమె కుడిచేయి నరాలను కోసేశాడు. అక్కడి నుంచి పారిపోయి, బుధవారం ఉదయం అత్త రుబీనాబీకి ఫోన్ చేసి చెప్పాడు. తల్లి, కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా నాజియా అప్పటికే మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
చేయి విరిగిందని వెళితే.. ప్రాణం పోయింది
తగరపువలస(విశాఖపట్నం): వాష్‌రూమ్‌లో జారిపడి చేయి విరిగిన ఓ మహిళ తొలుత సంగివలసలోని అనిల్ నీరుకొండ(ఎన్ఆర్ఐ) ఆసుపత్రిలో చికిత్స పొంది. అక్కడ పరిస్థితి విషమించడంతో నగరంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తన భార్య మృతికి అనిల్ నీరుకొండ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆమె భర్త జనార్థన్ ఆరోపించారు. కుటుంబసభ్యులతో ఆసుపత్రి ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వివరాలివి. భీమిలి మండలం చిప్పాడలో నివాసముంటున్న దివీస్ ఉద్యోగి జనార్థన్ భార్య యర్రంశెట్టి రేవతి ఈ నెల 10న ప్రమాదానికి గురైంది. వెంటనే ఆమెను ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చేర్పించగా.. అక్కడ వైద్యం వికటించి అపస్మారక స్థితికి చేరుకుంది. మెరుగైన వైద్యం కోసం జనార్థన్ ఆమెను నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె బుధవారం మృతి చెందింది. దీంతో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రేవతి మృతదేహంతో ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఎదుట ఆందోళన జరిగే అవకాశం ఉందని ముందే ఊహించిన సిబ్బంది.. మృతదేహాన్ని హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం ఆమె స్వగ్రామమైన అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరుకు మృతదేహాన్ని పంపే ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కేజీహెచ్ వద్ద ఆమె భర్త ఆందోళనకు సన్నద్ధమయ్యారు. తన భార్య అపస్మారక స్థితికి చేరుకోవడానికి కారణమైన వైద్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. జనార్థన్‌కు సంఘీభావంగా ఆయన స్వగ్రామానికి చెందిన బంధువులు, దివీస్ ఉద్యోగులు, పలు ప్రజా సంఘాల నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సాయంత్రం 8 గంటల తర్వాత వారంతా కలిసి సంగివలసలోని ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున బైఠాయించి ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆసుపత్రి యాజమాన్యం ఆందోళనకారులు, బాధితుల తరపున వచ్చిన ప్రజా సంఘాల ప్రతినిధులతో చర్చలు ప్రారంభించింది. భీమిలి పోలీసులు ఆసుపత్రి వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
మహిళ ఆత్మహత్య
నాగోలు(హైదరాబాద్): భర్త వేధింపుల కారణంగా ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్బీనగర్ పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.ఖమ్మం పట్టణానికి చెందిన కట్టా వెంకటేశ్వర్లు కుమార్తె జాస్మిన్(29)కు ఎల్బీనగర్, శివపురి కాలనీ చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పెండెం రాజశేఖర్‌తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 25 లక్షల నగదు, 20 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. వివాహం జరిగిన కొన్నాళ్లకే రాజశేఖర్, అతడి కుటుంబ సభ్యులు జాస్మిన్ను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్ద మనుషులు ఆమెకు నచ్చజెప్పి కాపురానికి పంపించారు. అయినా తన వైఖరి మార్చుకోని రాజశేఖర్ కొన్నాళ్లకే జాస్మిన్ను కొట్టి పుట్టింటికి పంపించాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజశేఖర్‌ను పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మంగళవారం ఆఫీస్‌కు వెళ్లిన రాజశేఖర్ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చూడగా లోపలి నుంచి గడియపెట్టి ఉంది. జాస్మిన్ను పిలిచినా స్పందన లేకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులు పగలకొట్టి చూడగా జాస్మిన్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. కిందకు దింపి చూడగా అప్పటికే ఆమె మృతి చెంది ఉంది. దీంతో అతను ఎల్బీనగర్ పోలీసులు, జాస్మిన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. జాస్మిన్ శరీరంపై గాయాలను గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు రాజశేఖర్ ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. మృతురాలి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యతో విడాకులు తీసుకుంటున్నానని చెప్పి..!
బంజారాహిల్స్(హైదరాబాద్): నా తల్లితో ఆస్తి గొడవలు ఉన్నాయి..నా భార్య నాతో సఖ్యంగా ఉండదు..అందుకే విడాకులు తీసుకుంటున్నాం..అందుకు సంబంధించిన విడాకులు పత్రాలు ఇవిగో అంటూ వైద్యురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. చివరకు సదరు వైద్యుడి అసలు నిజ స్వరూపం తెలియడంతో తాను మోసపోయానని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన భరత్ గెరా నగరంలోని కొండాపూర్ ప్రైమ్ స్ప్లైండర్లో ఉంటూ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని డెరెడియా లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో హెచ్ఆర్ ఆపరేషనల్ హెడ్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ఓ వైద్యురాలితో అతడికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో గత ఏప్రిల్‌లో భరత్ సదరు యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు తనకు గతంలోనే వివాహం జరిగిందని, తన భార్యతో గొడవల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. న్యాయవాది ఎదుట ఇద్దరూ సంతకం చేసిన పత్రాలను కూడా ఆమెకు చూపించాడు. తన తల్లికి తనకు ఆస్తి గొడవలు ఉన్నాయని, తల్లి, సోదరుడు ఢిల్లీలో ఉంటారని చెప్పాడు. ఈ క్రమంలో మార్చి 31న కంపెనీ పనిపై చంఢీఘడ్ వెళుతున్న భరత్ సదరు వైద్యురాలిని కూడా తీసుకెళ్లి అక్కడ హోటల్ రూంలో బస చేశారు. ఆ సమయంలో భరత్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత భరత్‌ను కంపెనీ యాజమాన్యం ఉద్యోగంలో నుంచి తొలగించగా, అతడితో పాటు సదరు యువతి కూడా ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇద్దరూ కలిసి సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెట్టుబడి నిమిత్తం ఆమె నుంచి భరత్ రూ.2.5 లక్షలు తీసుకున్నాడు. అంతేగాక భరత్ సదరు యువతి ఫోన్లో లోకేషన్‌ను ట్రాక్ చేసి ఆమె ఎక్కడికి వెళ్తుందని ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె భరత్‌తో మాట్లాడేందుకు అతని ఇంటికి వెళ్లగా అతడి భార్య ఇంట్లో ఉండటాన్ని చూసి షాక్‌కు గురైంది. ఆరు నెలల గర్భవతిగా ఉన్న అతని భార్య కూడా వైద్యురాలిని అసభ్యంగా దూషించడమేగాక వివాహితుడితో ఎందుకు సంబంధం కొనసాగిస్తున్నావంటూ నిలదీసింది. ఆ తర్వాత భరత్, అతని భార్య పూణెకు మకాం మార్చారు. కొన్ని రోజుల తర్వాత గర్భం దాల్చిన బాధితురాలు భరత్ తనను శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని మోసం చేశాడంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు బామ్మర్దులను బల్లెంతో పొడిచి చంపిన బావ
అల్లూరి సీతారామరాజు: జిల్లాలో సంచలనం సృష్టించిన బావమరుదుల హత్య కేసులో బావను సీలేరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను జీకే విధి సీఐ వరప్రసాద్, సీలేరు ఎస్ఐ రవీంద్ర విలేకరులకు తెలియజేశారు. నిందితుడు వంతల గెన్ను సీలేరు పంచాయతీ చింతపల్లి క్యాంపు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. గ్రామంలో ఆదివారం జరిగిన బంధువు దినకర్మకు బావమరుదులు కిముడు కృష్ణ, కిముడు రాజు హాజరయ్యారు. అనంతరం ఆదివారం రాత్రి నిందితుడి ఇంట్లోనే వారంతా ఉన్నారు. అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో గెన్ను తన తరచూ వేధిస్తున్న విషయాన్ని అన్నదమ్ములకు సోదరి(గెన్ను భార్య) చెప్పింది. దీంతో బావమరుదులు గెన్నును నిలదీశారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు గొడవ కొనసాగింది. ఆగ్రహించిన గెన్ను.. ఇంట్లో ఉన్న బల్లెంతో ముందుగా మూడో బావమరిది కిముడు రాజును పొడిచాడు. ఆయన తప్పించుకుని పారిపోయాడు. అప్పటికే ఇంట్లో ఉన్న ఆడవాళ్లు, పిల్లలు కేకలు వేయడంతో ఇంట్లో నిద్రిస్తున్న మరో బావమరిది కిముడు రాజు అడ్డుకున్నాడు. అతనిని కూడా బల్లెంతో కడుపులో పొడవడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఇంటి బయట కారులో నిద్రిస్తున్న కిముడు కృష్ణ చూసి ఇంట్లోకి పరిగెత్తి వెళ్లగా నిందితుడు దాడి చేసి హతమార్చాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై 2013లో కూడా ఓ హత్య కేసు ఉందన్నారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి, రిమాండ్ తరలించామని తెలిపారు.వేదన మిగిల్చిన హత్యలుసీలేరు మేజర్ పంచాయతీ చింతపల్లి క్యాంపు గ్రామంలో ఇద్దరు అన్నదమ్ముల హత్యలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందగా.. మరో సోదరుడు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. అన్నదమ్ముల అంత్యక్రియలకు కూడా తమ్ముడు రాలేని దీన పరిస్థితి నెలకొంది. సోమవారం సాయంత్రం పోస్టుమార్టం నిమిత్తం సీలేరు నుంచి చింతపల్లికి మృతదేహాలను తరలించారు. మంగళవారం మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పచెప్పినట్టు ఎస్ఐ రవీందర్ తెలిపారు. మృతదేహాలకు స్వగ్రామమైన ఒడిశా రాష్ట్రం చిత్రకొండ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించారు. సొంత కుటుంబ సభ్యులు అని కూడా చూడకుండా కిరాతకంగా చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు. -
ఎందుకురా నీ బతుకు చావరాదు..! అని తిట్టడంతో
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కులపెద్దలు చేసిన పంచాయితీ ఒకరి నిండు ప్రాణాన్ని తీసింది. పంచాయితీలో బూతులు తిట్టడంతో అవమాన భారంగా భావించిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన కడమంచి స్వామి(34) ఇంట్లో లేనప్పుడు అ తని భార్యపై అదే గ్రామానికి చెందిన టేకు ప్రేమ్‌కుమార్ లైంగికదాడికి యత్నించాడు. స్వామికి ఈ విషయం తెలియడంతో ప్రేమ్‌కుమార్‌ను నిలదీశా డు.మూడు రోజుల క్రితం కులపెద్దలు పంచాయితీ పెట్టి ప్రేమ్‌కుమార్‌కు జరిమానా విధించారు. దీంతో కోపోద్రిక్తుడైన ప్రేమ్‌కుమార్ స్వామిని అందరిముందే బూతులు తిట్టాడు. అంతేకాకుండా చావమని తిట్టడంతో అవమానంగా భావించిన స్వామి మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదుతో ప్రేమ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ట్రెయినీ ఎస్సై కె.వినీతారెడ్డి తెలిపారు. అయితే గ్రామానికి చెందిన కొందరు పెద్దమనుషులతోపాటు కొందరు విలేకరులు కలిసి ఈ పంచాయితీ నిర్వహించినట్లు తెలిసింది. వీరిద్దరి నుంచి రూ.4లక్షల చొప్పున మొత్తం రూ.8లక్షలు పంచాయితీ దరావతుగా తీసుకోవడంతోపాటు ఆ మొత్తం కూడా ఖర్చు అయినట్లు తెలిపారనే చర్చ సాగుతోంది. -
మామ వెంటనే నా భార్యను మా ఇంటికి పంపు..!
అనంతపురం/నందవరం: అప్పటికే ఆమెకు ఒక కుమారుడు. తర్వాత రెండో కాన్పులో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ ఇద్దరు బిడ్డలకు తల్లి ప్రేమను దూరం చేస్తూ ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పుట్టింటికి వెళ్లి వెంటనే రావాలని భర్త సూచించడంతో మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... మంత్రాలయం మండలం మాధవవరం గ్రామానికి చెందిన బోయ ఈరన్న చిన్న కుమార్తె ఉరుకుందమ్మ (24)కు 2020లో అదే జిల్లా నందవరం గ్రామానికి చెందిన నరసింహులు కుమారుడు పొపయ్యతో వివాహమైంది. వీరికి మూడేళ్ల వయస్సు, మూడు నెలల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తన సోదరుడు నాగరాజు వివాహ నిశ్చితార్థం ఉండడంతో ఉరుకుందమ్మ పుట్టింటికి వెళ్లింది. నిశ్చితార్థ వేడుక ముగిసిన తర్వాత స్వగ్రామానికి చేరుకోగానే సాయంత్రం పొపయ్య ఫోన్ చేసి తన భార్యను వెంటనే మా ఊరికి పంపాలని మామను కోరాడు. బుధవారం పిలుచకొస్తామని తెలిపినా అల్లుడు వినలేదు. దీంతో ఆదివారమే కుమార్తెను తండ్రి పిలుచుకెళ్లి భర్త వద్ద వదిలాడు. సోమవారం ఉదయం 11 గంటలకు పాపయ్య మరోసారి ఫోన్ చేసి ఉరుకుందమ్మ కనిపించడం లేదని తెలిపాడు. దీంతో కుమారుడు నాగరాజు, అల్లుళ్లు తాయన్న, రమేష్ తో కలసి నందవరం గ్రామానికి ఈరన్న చేరుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టాడు. అయినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం అనంతపురం త్రీ టౌన్ పోలీసులు ఫోన్ చేసి ఉరుకుందమ్మ రైల్వే స్టేషన్ క్వార్టర్స్ పక్కన చెట్టుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిపారు. దీంతో మృతురాలి కుటుంబసభ్యులు అనంతపురానికి చేరుకుని ఉరుకుందమ్మ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. అల్లుడి ఒత్తిళ్లు తాళలేకనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు అనంతపురం మూడో పట్టణ సీఐ కె.శాంతి లాల్ తెలిపారు. -
డీఎస్పీ ఇంట్లో భారీగా ఆస్తుల పత్రాలు గుర్తింపు
హైదరాబాద్: లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డ సూర్యాపేట డీఎస్సీ పార్థసారథి ఇంట్లో భారీగా ఆస్తుల పత్రాలు గుర్తించారు.పార్థసారథికి సంబంధించిన ఇళ్లలో సోదాలు నిర్వహించింది ఏసీబీ. హయత్ నగర్ లోని ఆయన నివాసంతో పాటు మరికొన్ని చోట్ల సోదాలు చేసింది ఏసీబీ. నిన్న (సోమవారం) డీఎస్పీ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. ఈ క్రమంలో నేడు(మంగళవారం) ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహించగా భారీగా ఆస్తులకు సంబంధించి పత్రాలను గుర్తించారు. ఈ సోదాలు నిర్వహించే క్రమంలో ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లను గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై హయత్ నగర్ పోలీసులకు ఏసీబీ ఫిర్యాదు చేసినట్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి ఏసీబీకి చిక్కారు. ఓ కేసులో రిమాండ్‌కు పంపించకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షలు డిమాండ్ చేసి.. రూ.16 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ అవినీతి కేసులో భాగంగా ఆధారాలతో సహా ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. -
ఏం కష్టం వచ్చిందో..?
కృష్ణరాజపురం(కర్ణాటక): విదేశాల్లో చదువుకుని ఇటీవలే ఇంటికి వచ్చిన యువకుడు ఏం కష్టం వచ్చిందో కానీ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.. ఇంటిలో ఉన్న సింగిల్ బ్యారెల్ గన్‌తో షూట్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ సంఘటన బెంగళూరు గ్రామీణ జిళ్లాలోని హోసకోటె నియోజకవర్గం పరిధిలోని దేవిశెట్టిహళ్ళి గ్రామంలో జరిగింది. గ్రామవాసి బైయేష్ (28) తుపాకీతో తలలో కాల్చుకోవడంతో తల ఛిద్రమై చనిపోయాడు. ఇంటిలోవారు ఆందరు ఆదివారం తిరుపతికి వెళ్లారు. అతడు ఒక్కటే ఇంట్లో ఉన్నాడు. సోమవారం కుటుంబీకులు తిరుపతి నుంచి తిరిగి వచ్చి చూడగా మృతదేహం కనిపించింది. వెంటనే తిరుమలశెట్టిహళ్ళి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నువ్వులేని లోకంలో నేనుండలేను కొడుకా..
కరీంనగర్ జిల్లా: ‘కొడుకా.. నువ్వే గుర్తొస్తున్నావ్... ఒక్కగానొక్క కొడుకని అపురూపంగా చూసుకున్నా.. చదువుకుంటా అంటే హైదరాబాద్ పంపిన. మాయ దారి బెట్టింగ్‌లో రూ.లక్షలు పోగొట్టుకున్నా.. సరే బిడ్డా అని ధైర్యం చెప్పిన. అయినా మమ్మల్ని మోసం చేస్తివి. బెట్టింగ్‌కు బలై ఈ లోకాన్నే విడిచిపోతివి. నిన్ను మర్చిపోలేకపోతున్నా కొడుకా.. నీవు లేని లోకం నాకు వద్దు బిడ్డా’అంటూ.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో ఓ తండ్రి పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మన్నెంపల్లి గ్రామానికి చెందిన తిరుపతిరావు(49) కొడుకు నిఖిల్‌రావు (21) ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు అలవాటుపడి రూ.లక్షల్లో అప్పు చేశాడు. అవి తీర్చలేక, మానసిక ఒత్తిడితో రెండు నెలల క్రితం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిఖిల్ ఒక్కగానొక్క కొడుకు కావడంతో, అతని మృతిని తిరుపతిరావు తట్టుకోలేకపోయాడు. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆదివారం తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగాడు. స్థానికులు వెంటనే అతన్ని హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. ఆన్లైన్ బెట్టింగ్తో కొడుకు.. అతని మరణం తట్టుకోలేక తండ్రి మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. -
బయో మెడికల్ విద్యార్థినిపై లైంగిక దాడి
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు జార్ఖండ్ నుంచి వచ్చిన ఓ యువతిపై ఇద్దరు యువకులు లైంగిక దాడి కి పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేష న్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. జార్ఖండ్ కు చెందిన యువతి (20) తమిళనాడులోని కలస లోకేషన్లింగం కాలేజీలో బయో మెడికల్ కోర్సు చదువుతోంది. అదే కాలేజీలో బాచుపల్లి హరితవనం కాలనీకి చెందిన అజయ్ (24) బీటెక్ చదువుతున్నాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్ప డింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో ఇంటర్న్íÙప్ చేయాలని యువతి నిర్ణయించుకుంది. దీంతో ఈ నెల 3న ఆమె హైదరాబాద్‌కు రాగా కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఆమెను అజయ్ ఉంచాడు. అదేరోజు సాయంత్రం పార్టీ చేసుకుందామని ఆమెను బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో ఉన్న తన స్నేహితుడు హరి ఇంటికి తీసుకెళ్లాడు. ముగ్గురు కలిసి అర్ధరాత్రి వరకు మద్యం సేవించిన అనంతరం అజయ్ యువతిపై లైంగిక దాడి చేశాడు. తర్వాత హరి కూడా యువతిపై లైంగిక దాడి చేయటానికి ప్రయతి్నంచగా యువతి కేకలు వేసింది. దీంతో చుట్టు పక్కలవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణæ అనంతరం 4వ తేదీన అజయ్, హరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహించి సురక్షితంగా స్వస్థలానికి వెళ్లేందుకు సహాయం చేశారు. ఓ బైక్, మద్యం బాటిల్, ఇతర సామగ్రిని సీజ్ చేశారు. -
Ameerpet: స్నేహితుడి భార్యపై లైంగిక దాడికి యత్నం
అమీర్‌పేట(హైదరాబాద్): స్నేహితుడి భార్యపై కన్నేసిన ఓ కామాంధుడు భర్త ఇంట్లో లేని సమయంలో ఆమెపై లైంగిక దాడికి యత్నించిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బల్కంపేటకు చెందిన మహిళ భర్త గతంలో ప్రైవేటు సంస్థలో పనిచేసేవాడు. అతడి స్నేహితుడైన పసుపులేటి వెంకట నరసింహారావు అలియాస్ పీవీ అనే వ్యక్తి అతడితో ఉద్యోగం మాన్పించి తన సొంత సంస్థ అయిన లోన్ వాలా డాట్ కామ్‌లో చేర్చుకున్నాడు. ఉద్యోగం ఇచ్చాననే సాకుతో తరచూ స్నేహితుడి ఇంటికి వెళ్లే వాడు. స్నేహితుడి భార్యపై కన్నేసిన అతను తన కోరిక తీర్చాలంటూ ఆమెను వేధిస్తున్నాడు. ఆమె ఫోన్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపేవాడు. బాధితురాలు ఈ విషయం భర్త దృష్టికి తీసుకెళ్లడంతో అతను పీవీ వద్ద పని మానేసి మరో సంస్థలో చేరాడు. ఆదివారం మధ్యాహ్నం స్నేహితుడు లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన పీవీ ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. అతడి భారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. గర్భవతినని చెప్పినా వినిపించుకోకుండా లైంగిక దాడికి యత్నించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇష్టపడిన యువతి దక్కలేదని..
కూకట్పల్లి(హైదరాబాద్): తాను ఇష్టపడిన యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఆమె భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా, అడవిపూడి గ్రామానికి చెందిన జగదీష్ అతడి సోదరుడు దుర్గా ప్రసాద్ కేపీహెచ్‌బీ కాలనీలోని సర్ధార్ పటేల్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరి సమీప బంధువు కాళ్ల వెంకటరమణ భగత్ సింగ్ నగర్లో ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దుర్గా ప్రసాద్ భార్య, వెంకట రమణ భార్య అక్కా చెల్లెళ్లు కావటంతో మూడు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంకట రమణ తరచూ దుర్గా ప్రసాద్, జగదీష్ ల వద్దకు వచ్చి వెళుతుండేవాడు. కాగా అదే గ్రామానికి చెందిన పవన్ ఎనిమిదేళ్ల క్రితం వెంకట రమణ భార్య శ్రావణి సంధ్యను వివాహం చేసుకునేందుకు ప్రయత్నించగా అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమెకు కాళ్ల వెంకటరమణతో వివాహం జరిపించారు. తనకు దక్కని శ్రావణి సంధ్య మరొకరిని పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేని పవన్ అప్పటి నుంచి వారిపై కక్ష పెంచుకున్నాడు. పథకం ప్రకారం నగరానికి మకాం మార్చిన పవన్ కూడా కూకట్పల్లి ప్రాంతంలోనే ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శ్రావణి సంధ్యను వివాహం చేసుకున్న వెంకటరమణపై కక్ష పెంచుకున్న పవన్ అతడిని హత్య చేసేందుకు అతడి కదలికలపై నిఘా ఏర్పాటు చేశాడు. వెంకటరమణ తరచూ జగదీష్ ఇంటికి వస్తున్నట్లు గుర్తించిన పవన్ అదను కోసం ఎదురు చూస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం దీనిని పసిగట్టిన జగదీష్ తన ఇంటి ఎదుట నిలుచుని ఉన్న పవన్‌ను గుర్తించి ఇక్కడ ఎందుకు ఉన్నావని నిలదీయగా తన స్నేహితుల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. వారం రోజుల క్రితం శ్రావణి సంధ్య, ఆమె సోదరి ఉమా మహేశ్వరితో కలిసి స్వగ్రామంలో పెళ్లికి వెళ్లింది. ఆదివారం రాత్రి వెంకటరమణ జగదీష్ ఇంటికి వచ్చినట్లు సమాచారం అందడంతో పవన్ తన స్నేహితులు మరో నలుగురితో కలిసి అక్కడికి వచ్చి మాటు వేశాడు. జగదీష్ ఇంటి గేటు స్కూటీని అడ్డు పెట్టి స్నేహితులతో కలిసి సిగరెట్ తాగుతూ ఉండటాన్ని గుర్తించిన జగదీష్ అతడిని నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పవన్ జగదీష్‌తో గొడవపడుతుండటాన్ని గుర్తించిన వెంకట రమణ బయటికి వచ్చి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా పవన్ కత్తితో వెంకటరమణ చాతిలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడికక్కడే కుప్పకూలడంతో పవన్, అతడి స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న డాక్టర్ సంజన సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని పరీక్షించగా వెంకటరమణ అప్పటికే మృతి చెందాడు. జగదీష్ ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడు పవన్పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
కిట్టువల్లనే కుటుంబంలో కల్లోలం, సంధ్య చచ్చిపోయింది!
పశ్చిమ గోదావరి: తనను ఆర్థికంగా మోసగించారన్న మనస్తాపంతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో భార్య మృతి చెందింది. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మాదు శ్రీనివాస్ దంపతులు ఆర్థిక ఇబ్బందులతో శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం భార్య సంధ్య (23) మృతి చెందడంతో బంధువులు విషాదంలో మునిగిపోయారు. దగ్గర బంధువైన కిట్టుకు 20 ఏళ్ల క్రితం నగదు ఇచ్చాడని ఆ నగదుతో పొలం కొన్నారని బంధువులు తెలిపారు. ప్రస్తుతం తాను అప్పుల్లో ఉన్నానని తన వాటాగా ఎంత వస్తే అంత ఇవ్వాలని శ్రీనివాస్ కిట్టును అడగ్గా.. ఇచ్చేది లేదని చెప్పడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. మేకా రామకృష్ణ (కిట్టు) వల్ల ఒక కుటుంబం నాశనమైందని బంధువులు ఆరోపించారు. ఈ చావుకు అతనిదే బాధ్యతని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, స్థానికులు ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. -
పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య
కుత్బుల్లాపూర్(హైదరాబాద్): గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం.. బొల్లారం ప్రాంతానికి చెందిన సిద్దిక్ మేడ్చల్‌లో నివాసం ఉంటూ వారాంతపు మార్కెట్లో బ్యాటరీ లైట్లు సప్లై చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కొంపల్లి మున్సిపల్ పరిధిలోని సెంట్రల్ పార్క్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మార్కెట్లో బ్యాటరీ లైట్లు సాయంత్రం ఇచ్చి.. తిరిగి రాత్రి తీసుకునే క్రమంలో ముగ్గురు వ్యక్తులు అతడిపై కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. గతంలో సిద్దిక్ బొల్లారం ప్రాంతంలో బ్యాటరీ లైట్లు ఏర్పాటు విషయంలో మరో వర్గంతో గొడవ పడ్డాడని... అది మనసులో పెట్టుకొని కక్షగట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాట్లాడుకుందాం.. అంటూ పిలిచి విచక్షణారహితంగా పొట్ట, ఛాతీ భాగాల్లో కత్తులతో పొడిచారు. ఇంతటితో ఆగకుండా నిందితుల్లో ఒకరు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న సిద్దిక్ మెడను కోసేసినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి సీసీ కెమెరాలు పరిశీలించారు. సిద్దిక్‌తో ఇటీవల జరిగిన గొడవలపై ఆరాతీశారు. ముగ్గురు నిందితులు వచి్చనట్లు స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకొని వారిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ రాములు పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని సీఐ విజయ్‌వర్ధన్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అజయ్ పరిశీలించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని...
సాక్షి, హైదరాబాద్:: చిన్న నాటి స్నేహితురాలిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికిలోనైన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి మండలం, యాపర్ల గ్రామానికి చెందిన తిమ్మరాజు రవి(25) కుటుంబం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి కూకట్పల్లి, శంషీగూడలో నివాసముంటోంది. రవి కూకట్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సమయంలో తన స్నేహితురాలు నీలవేణితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్ల క్రితం వారు పెద్దలను ఎదిరించి ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. గత 8 నెలలుగా వారు బౌరంపేటలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్నారు. రవి కారు డ్రైవర్‌గా పని చేస్తుండగా నీలవేణి ఇంటి వద్దనే ఉంటుంది. కొద్ది రోజులుగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ నెల 10న భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. అదే రోజు మధ్యాహ్నం తన ఇంటికి వచి్చన తల్లితో కలిసి నీలవేణి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన రవి తన తల్లికి ఫోన్ చేసి తన భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని, తనకు బతకాలని లేదని చెప్పి విలపించాడు. దీంతో ఇంటికి రావాలని కోరగా ఫోన్ పెట్టేశాడు. ఆదివారం ఉదయం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తల్లి, సోదరుడు బౌరంపేటకు వచ్చి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘పేడ నీళ్ల’ రచ్చ.. అసలేం జరిగిందంటే?
జమ్మలమడుగురూరల్(అన్నమయ్య): ఇంటి ముందు పేడ నీళ్లు చల్లే విషయంలో జరిగిన చిన్న చిన్న పాటి గొడవ పెద్దదై పరస్పరం దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. మండల పరిధిలోని పి. బోమ్మెపల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. బొగ్గు గురులక్ష్మి తన ఇంటి ముందు పేడ నీళ్లు చల్లుకుంటూ ఉండగా కొన్ని నీళ్లు పక్కన నివాసం ఉంటున్న రాజచౌడయ్య ఇంటి వద్ద పడ్డాయి. ఈ విషయమై ఇరువురి మధ్య తీవ్ర స్థాయి వాగ్వాదం జరిగింది. దీంతో ఇరు కుటుంబాల వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరు కుటుంబాలకు చెందిన వారు గాయపడ్డారు. గాయపడి వారిలో బొగ్గు నాగ అంజి, మహేష్, నాగేంద్ర, మల్లికార్జున, రామాంజనేయులు, గురులక్ష్మి, మరోవర్గంలో గూడెంచెరువు రాజ చౌడయ్య, సోమశేఖర్, పెద్ద చౌడప్ప, రమణమ్మ, రామ చౌడయ్య ఉన్నారు. రాజ చౌడయ్యకు తలపై బలమైన గాయం కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరుకు తరలించారు -
పెళ్లిలో ప్రతీకారం!
విశాఖపట్నం: భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ ఆశిపాలెంలో నల్ల తాతారావు అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు తాళ్లతో బంధించి హింసించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితుడి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. తాతారావును ఆసుపత్రికి తరలించారు. వివరాలివి. చిప్పాడ పంచాయతీలోని కంచేరుపాలేనికి చెందిన అబ్బాయికి, ఆశిపాలెం యువ తితో శుక్రవారం రాత్రి ఆశిపాలెంలో వివాహం జరిగింది. ఈ వివాహానికి అమనాంకు చెందిన నల్ల తాతారావు.. అతని అన్నయ్య అప్పన్న, తల్లి తవుడమ్మతో కలిసి వచ్చారు. వివాహం అనంతరం అప్పన్న, తల్లి అమనాంకు తిరిగి వెళ్లగా.. తాతారావు అక్కడే మంచంపై నిద్రించాడు. దీనిని గమనించిన పెళ్లి కుమార్తె బంధువులు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో తాతారావు కాళ్లు, చేతులను తాళ్ల తో కట్టేసి బంధించారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తాతారావు అన్నయ్య అప్పన్నకు ఈ విషయం తెలియడంతో తన తమ్ముడిని విడిచిపెట్టమని బంధువులను కోరాడు. అయితే వారు నిరాకరించారు. గతంలో తాతారావుకు కంచేరుపాలెం యువతితో వివాహం జరిగింది. వారి మధ్య వివాదాల కారణంగా ప్రస్తుతం తాతారావు అమనాంలో, అతని భార్య కంచేరుపాలెంలో ఉంటోంది. గతంలో తాతారావు తన మామ అనుకుని వేరే వ్యక్తిని తీవ్రంగా కొట్టాడని, అందుకు ప్రతీకారంగానే తాము అతన్ని బంధించామని పెళ్లి కుమార్తె బంధువులు ఆరోపించారు. తాతారావు అన్నయ్య ఫిర్యాదు మేరకు భీమిలి పోలీసులు శనివారం సాయంత్రం సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని విడిపించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు తన తమ్ముడికి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలని అప్పన్న డిమాండ్ చేశాడు. -
ఊహించని విధంగా పెళ్లి వాయిదా.. యువతి ఆత్మహత్య
అనంతపురం: ఊహించని విధంగా పెళ్లి వాయిదా పడటంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ గౌస్ మహమ్మద్‌బాషా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇల్లూరుకు చెందిన మస్తానయ్య, సుశీలమ్మ దంపతులు బతుకు తెరువు కోసం కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు వలస వెళ్లి అక్కడే జీవనం సాగిస్తున్నారు. కుమార్తె లక్ష్మీనరసమ్మ(23)కు గుంతకల్లు మండలంలోని ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 14, 15 తేదీల్లో వివాహం జరగాల్సి ఉంది. వారం క్రితమే కుటుంబ సభ్యులంతా స్వగ్రామం ఇల్లూరుకు చేరుకున్నారు. పెళ్లి ఏర్పాట్లల్లో తలమునకలయ్యారు. ఈ క్రమంలో బంధువు ఒకరు చనిపోవడంతో పెళ్లి వాయిదా వేశారు. రెండేళ్ల క్రితం కూడా బంధువొకరు చనిపోవడంతో పెళ్లి ఆగింది. వరుస ఘటనలతో మనస్తాపం చెందిన లక్ష్మీనరసమ్మ తనకు కళ్యాణ యోగం లేదేమోనన్న బాధతో శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అమ్మా.. నాన్న క్షమించండి
కర్నూలు: ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. అక్క క్షమించు.. అమ్మ నాన్న క్షమించు’ అంటూ ఒక లేఖ రాసి జేబులో పెట్టుకొని రైలు కింద పడి ఈడిగ వంశీక్రిష్ణ (29) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలులోని రామచంద్రనగర్‌లో నివాసం ఉంటున్న ఈడిగ వంశీక్రిష్ణ ఎంఎస్సీ వరకు చదువుకున్నాడు. తండ్రి శ్రీనివాసగౌడ్ ఫారెస్ట్ రేంజ్ అధికారి. శ్రీనివాసగౌడ్, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరి పెద్ద కుమారుడు రాకేష్ గౌడ్ పెళ్లి అయిన 20 రోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో కుమారుడు వంశీక్రిష్ణ పెళ్లి కాకుండానే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయంశమైంది. రైలు పట్టాలపై మృతదేహంలా.. వివాహ వేడుకకు ఈనెల 7వ తేదీన వేరే ఊరికి శ్రీనివాసగౌడ్, శ్రీదేవి వెళ్లారు. తిరిగి శుక్రవారం ఇంటికి వచ్చారు. కుమారుడు వంశీక్రిష్ణ ఇంట్లో లేకపోవడంతో కర్నూలు చుట్టుపక్కల అంతా గాలించారు. ఎండోమెంట్ కాలనీ సమీపంలో అబ్బాస్ నగర్ రైల్వే పట్టాల పక్కన శనివారం వంశీక్రిష్ణ మృతదేహమై కనిపించాడు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు రైల్వే ఎఎస్ఐ కేవీఎం ప్రేమ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అన్న మృతిని తట్టుకోలేక.. ఈడిగ వంశీక్రిష్ణ అన్న రాకేష్ గౌడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. పెళ్లి అయిన 20 రోజులకే నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి వంశీక్రిష్ణ మానసిక కుంగుబాటుతో బాధపడేవాడు. అన్న మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. -
16 ఏళ్ల యువకుడితో.. నా భార్య వెళ్ళిపోయింది సార్.!
తిరువొత్తియూరు(తమిళనాడు): భర్తను మోసం చేసి భార్య రెండో వివాహం చేసుకుంది. భార్య మరొకరిని వివాహం చేసుకున్న దృశ్యం ఇన్స్టాగ్రామ్ లో చూసిన భర్త ఆవేదన చెందాడు. తన భార్యను విడిపించాలని పోలీసులకు మొర పెట్టుకున్నాడు. కన్యాకుమారి జిల్లా మైలాడి ప్రాంతానికి చెందిన మురుగేషన్ కుమారుడు అజిత్ కుమార్ తాపీ మేస్త్రి. ఇతనికి ఇతనికి కుల శేఖరం సమీపంలో తుంబకోడు ప్రాంతానికి చెందిన అభిషా(22) అనే యువతితో గత 2022వ సంవత్సరం వివాహమైంది. దంపతులిద్దరూ కులశేఖరంలో ఉన్న అభిషా ఇంటిలో ఉంటున్నారు. పిల్లలు లేరు. ఈ క్రమంలో అభిషా అరుమలై సమీపంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనికి చేరింది. అభిషా గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలోనే ఉంటూ అక్కడే పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో గత 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తాను ఆసుపత్రిలోనే ఉండాలని చెప్పి వెళ్లిపోయింది. దీంతో 6వ తేదీ అజిత్ కుమార్ భార్యకు ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన అజిత్‌కుమార్ ఆసుపత్రిలో విచారణ చేయగా ఆమె ఎవరో బంధువులకు ఆరోగ్యం సరిలేదని 16 సంవత్సరాల యువకుడితో వెళ్లిందని తెలిపారు. దీంతో 7వ తేదీన అరుమనై పోలీస్ స్టేషన్లో అజిత్ కుమార్ తన భార్య అదృశ్యమైనట్టు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో అజిత్‌కుమార్ స్నేహితుడు అతనికి ఒక వీడియో పంపిస్తాను చూడు అని, ఇన్‌స్ర్ట్రాగామ్ వీడియో ఒకటి పంపాడు. అది చూసిన అజిత్‌కుమార్ దిగ్భ్రాంతి చెందాడు. అందులో తన భార్య మరొక యువకుడిని వివాహం చేసుకున్న దృశ్యం ఉంది. దీంతో అజిత్‌కుమార్ భార్య చేసిన పని చూసి బోరున వినిపించాడు. అజిత్‌కుమార్ తర్వాత పోలీసులకు ఈ వీడియోను చూపించి తన భార్యను విడిపించాలని పోలీసులకు మొరపెట్టుకున్నాడు. -
‘వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చంపేస్తా ’
హైదరాబాద్: పెళ్లి చేసుకోవాలని ఓ యువతిని ఒత్తిడి చేయడమే కాకుండా..ఆమె వివాహ నిశ్చితార్థాన్ని చెడగొట్టి.. వేరెవరినైనా పెళ్లి చేసుకుంటే చంపేస్తానని బెదిరించిన యువకుడిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్ జిల్లా బాల్కొండ ప్రాంతానికి చెందిన యువతి (21) నగరంలోని ఓ హాస్టల్లో ఉంటూ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. కామారెడ్డిలో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసే శేషుకుమార్ (28) గత తొమ్మిది నెలల క్రితం సదరు యువతిని బస్సులో కలిశాడు. నెల తర్వాత శేషు ఆమెను పెళ్లి చేసుకోమని అడిగాడు. దీనికి ఆమె నిరాకరించి స్నేహితులుగా ఉందామని చెప్పింది. ఈ క్రమంలో ఇరువురూ కలిసి ఫొటోలు దిగారు. ఇదిలా ఉండగా తన వివాహ నిశ్చితార్థం ఖరారు అయ్యిందని యువతి స్నేహితులకు చెప్పగా వారి ద్వారా శేషు ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. దీంతో ఈ నెల 6న సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో బేగంపేట ఫ్లైఓవర్ వద్ద ఆమెను కలుసుకుని ఘర్షణకు దిగాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆమెతో వివాహ నిశ్చితార్థం జరుపుకునే యువకుడి ఫోన్ నెంబర్ తీసుకుని వారిద్దరూ దిగిన ఫోటోలను అతనికి పంపించడంతో పాటు లేనిపోని ఆరోపణలు చేశాడు. దీంతో ఆ నిశితార్థం ఆగిపోయింది. అనంతరం తనను పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి పెంచాడు. తనను కాదని వేరే వారిని పెళ్లి చేసుకుంటే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లీబిడ్డను కాటేసిన కరెంట్
నిజాంసాగర్ (జుక్కల్): ఇంట్లోని ఇనుప కూలర్‌కు కరెంట్ సరఫరా కావడంతో తల్లీకూతురు మరణించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్ద గుల్లా తండాకు చెందిన చవాన్ ప్రహ్లాద్, శంకబాయి (36) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ప్రహ్లాద్ డ్రైవర్‌గా, శంకబాయి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి శంకబాయి, చిన్న కూతురు శ్రీవాణి (12), కుమారుడు ఇంట్లో నిద్రించారు. తల్లి, కూతురు ఒకేచోట ఇనుప కూలర్ ముందర నిద్రించగా, కుమారుడు ప్రతీక్ కొద్ది దూరంలో పడుకున్నాడు. రాత్రి వేళ కూలర్ అడుగు భాగంలోని నీటిలో శ్రీవాణి కాలుపడటంతో కరెంట్ షాక్ సరఫరా జరిగి శ్రీవాణితో పాటు పక్కనే పడుకున్న తల్లి శంకబాయి మృతి చెందింది. ఉదయం నిద్ర లేచిన ప్రతీక్ తల్లి, సోదరి మృతి చెందడాన్ని గమనించి తండా ప్రజలకు చెప్పాడు. సమాచారం తెలుసుకున్న బిచ్కుంద సీఐ నరేశ్, జుక్కల్ ఎస్సై భువనేశ్వర్, ట్రాన్స్‌కో ఏఈ బాలాజీ తండాకు చేరుకున్నారు. ఇనుప కూలర్‌కు కరెంట్ సరఫరా కావడంతోనే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Outer Ring Road: కారు దగ్ధం.. ఇద్దరు సజీవ దహనం
అబ్దుల్లాపూర్‌మెట్: ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. రహదారిపై ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులూ మంటల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరి«ధిలో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని తాడ్‌బండ్ బహదూర్‌పురా ప్రాంతం హెచ్‌బీ కాలనీలో నివాసం ఉండే రితేష్ కుమార్ కుమారుడు దీపేష్కుమార్ (23) శుక్రవారం రాత్రి 11 గంటలకు స్నేహితులను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి తన కారులో ఇంటి నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో తన స్నేహితులైన నగరంలోని వీటీసీ కాలనీకి చెందిన సంచయ్ మల్పనీ (22), మూసాపేట్‌కు చెందిన ప్రియాష్ మిఠల్ (23) కలిసి శంషాబాద్ వైపు వెళ్తున్నారు. పెద్దఅంబర్‌పేట శివారు గండిచెరువు వంతెన సమీపంలోకి రాగానే (రాత్రి 2 గంటలకు) ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా రోడ్డుపై నిలిపి ఉంచిన బొలేరోను ఢీకొట్టారు. వీరి కారు బొలేరో ముందు భాగంలో ఇరుక్కుని, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. యువకులు తేరుకునేలోపే ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో దీపేష్ కుమార్, సంచయ్ మల్పనీ కారులోనే సజీవ దహనమయ్యారు. కొన ఊపిరితో ఉన్న ప్రియాన్స్ మిఠల్‌ను అతికష్టమ్మీద బయటికి తీసిన స్థానికులు ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
హాస్టల్ గదిలో ఉరేసుకుని.. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: ఇబ్రహీంపట్నం పరిధిలోని గురునానక్ కళాశాల హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కురనవెల్లికి చెందిన ఆలూరి భావన (22) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ కళాశాల హాస్టల్లో ఉంటూ బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమె గదిలో ఉండే మరో ఇద్దరు విద్యారి్థనులు స్వగ్రామాలకు వెళ్లడంతో ప్రస్తుతం భావన మాత్రమే ఉంది. కారణాలేమిటో తెలియదు గానీ.. శనివారం తన గదిలోని ఫ్యాన్‌కు ఆమె ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించింది. కొద్దిసేపటి తర్వాత గమనించిన తోటి విద్యార్థినులు యాజమాన్యంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి శశిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాలేజీ వద్ద ఉద్రిక్తత విద్యార్థిని భావన ఆత్మహత్య విషయం తెలుసుకున్న మిత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. పలువురు ఎస్ఎఫ్ఐ నేతలు గేట్లు దూకి లోపలికి వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను ఏసీపీ రాజు, సీఐ జగదీశ్‌లు అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యలకు అడ్డాగా మారింది గురునానక్ కళాశాల హాస్టల్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయంగా మారిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్, కార్యదర్శి శంకర్ మండిపడ్డారు. భావన బలవన్మరణానికి పాల్పడిందనే విషయాన్ని బయటకు చెప్పకుండా, ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారని మండిపడ్డారు. కాలేజీలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్ పాటు ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
బావతో సహజీవనం చేస్తోందంటూ..
నెల్లూరు సిటీ: మహిళపై కొడవలితో దాడి చేసిన ఘటన నెల్లూరు రూరల్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తోటపల్లిగూడూరు మండలానికి చెందిన శేషమ్మ అనే మహిళను 20 ఏళ్ల క్రితం భర్త వదిలేశాడు. ప్రస్తుతం ధనలక్ష్మీపురంలో నివాసం ఉంటూ కేజీకే కల్యాణ మండపం వద్ద పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. తోటపల్లిగూడూరు మండలానికి చెందిన కరుణాకరన్‌తో ఆమె సహజీవనం చేస్తోంది. అతను ఇంటికి వెళ్లకుండా ఎక్కువ సమయం శేషమ్మ వద్ద ఉండటం అతడి బావమరిది శ్రీనివాసులుకు తెలిసింది. తన సోదరికి అన్యాయం జరుగుతోందని అతను శేషమ్మపై కోపం పెంచుకున్నాడు. శుక్రవారం పండ్ల దుకాణం వద్ద శ్రీనివాసులు కొడవలితో శేషమ్మ మెడపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యోగం కోసం వచ్చి ఐఫోన్లు మాయం చేశాడు
సనత్‌నగర్: ఉద్యోగం కోసం వచ్చినన ఓ వ్యక్తి రూ.1.40 లక్షల విలువైన రెండు ఐఫోన్లను చోరీ చేసిన ఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బేగంపేట డీఐ జి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..బేగంపేటలోని ఎఫ్డీఆర్ ఆర్డీ టవర్స్‌లో గల జెప్టో కార్యాలయానికి స్టోర్ ప్యాకర్‌గా పనిచేసేందుకు బాలానగర్‌లోని జింకలవాడకు చెందిన గౌతమ్ అంకిత్‌పాత్ర (24) ఈ నెల 3వ తేదీన వచ్చాడు. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత స్టోర్‌లో పనిచేసేందుకు అంగీకరించాడు. స్టోర్‌ను ఒకసారి చూసి వస్తానని చెప్పి స్టోర్‌లో కనిపించిన రెండు విలువైన ఐఫోన్లను తీసి దాచుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి కార్యాలయానికి రాలేదు. ఆ తర్వాత స్టోర్ ఆడిట్ చేసిన నిర్వాహకులు రెండు ఐఫోన్లు కనిపించడం లేదని గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా గౌతమ్ అంకిత్‌పాత్ర సెల్ఫోన్లను చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు స్టోర్ ఉద్యగి తిలక్‌కుమార్ బుధవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత అదృశ్యం సికింద్రాబాద్: భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచి్చన వివాహిత అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. ఒడిశా రాష్ట్రం పలపాతి గ్రామానికి చెందిన జడునాథ్ ముర్ము, మల్హో మణి ముర్ము(26) దంపతులు. ఈ నెల 6న సాయంత్రం 8 గంటల సమయంలో భార్యభర్తలు భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో జనరల్ టికెట్ తీసుకొని విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలెక్కారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి ప్లాట్ ఫాం నంబర్ 1లోని గేట్ నంబర్ 5 వద్ద కూర్చున్నారు. టూత్‌పేస్ట్ తీసుకొచ్చేందుకు భర్త జడునాథ్ బయటకు వెళ్లి వచ్చేసరికి భార్య కనిపించకుండా పోయింది. దీంతో పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా భార్య మల్హో మణి ఆచూకీ లభించకపోవడంతో జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెట్రో స్టేషన్లో యువకుడి ఆత్మహత్య చిక్కడపల్లి: పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్రో స్టేషన్లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాజు నాయక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గురువారం చిక్కడపల్లి మెట్రోస్టేషన్‌కు వచి్చన గుర్తుతెలియని యువకుడు అక్కడే వాంతులు చేసుకుని అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీనిని గుర్తించిన మెట్రో సిబ్బంది 108కు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతను పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏడేళ్ల ప్రేమ అంతలోనే .. ! పాపం ఆ యువకుడు..
జమ్మికుంట(కరీంనగర్): ఇటీవల యువతలో ఒకరిని ప్రేమించడం, మరొకరిని పెళ్లాడటం కామన్‌గా మారిపోయింది. అయితే కొందరు దీన్ని జీర్ణించుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతుండటమే బాధకరం. అలాంటి దారుణ ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల్లోకెళ్తే..కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దార ఎల్లేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే యువతితో ప్రేమలో పడ్డాడు. ఏడేళ్లుగా గాఢంగా ప్రేమించుకున్నారు. ఏమైందో ఏమో ఆమె ఇటీవలే వేరే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. ఇది తెలిసి మనస్తాపం చెందిన ఎల్లేష్ సెల్ఫీ వీడియో తీసుకోని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పైగా ఆ వీడియోలో తన ఫోన్లో ఆమెకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయని..యువతి వచ్చే వరకు తన శవాన్ని తీయవద్దని కోరాడు. అలాగే తనను ఇంతలా మోసం చేసిన ఆ యువతి కుటుంబంపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని రైలు కింద పడ్డ యువకుడు7 ఏళ్ళు ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వేరే పెళ్లి చేసుకుందని.. సెల్ఫీ వీడియో తీసి రైలు కింద పడి యువకుడి ఆత్మహత్యకరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దార ఎల్లేష్ అనే యువకుడితో ఏడేళ్ల నుండి ప్రేమ… pic.twitter.com/lx0DPxyUEd— Telugu Scribe (@TeluguScribe) May 8, 2025 -
ఐదేళ్లుగా వివాహేతర సంబంధం.. చివరికి..!
మహబూబ్‌నగర్ క్రైం: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళతో డబ్బుల విషయంలో ఏర్పడిన గొడవలో ఓ వ్యక్తి సదరు మహిళను గొంతు నులిమి హత్య చేశాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ హత్య తాజాగా వెలుగులోకి వచ్చింది. రూరల్ ఎస్ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని దొడ్డలోనిపల్లికి చెందిన శాంతమ్మ (35) ఒంటరిగా జీవనం సాగించేది. ఈ క్రమంలో ఆమెకు నవాబ్‌పేట మండలం తీగలపల్లికి చెందిన కృష్ణయ్యతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఐదేళ్లుగా ఇద్దరు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. అయితే డబ్బుల వ్యవహారంలో గత కొన్ని రోజులుగా ఇద్దరు గొడవ పడేవారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం కూడా గొడవ జరగగా కృష్ణయ్య, శాంతమ్మను గొంతు నులిమి హత్య చేసి పారిపోయాడు. ఇంట్లో మంచంపై పడి ఉన్న శాంతమ్మ మృతదేహన్ని స్థానికులు బుధవారం గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని ఏఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ గాం«దీనాయక్ పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
అంతుచూసిన అనుమానం..!
శ్రీకాకుళం: కోటబొమ్మాళిలో బ్యూటీపార్లర్, లేడీస్ కార్నర్ షాపు నిర్వహిస్తున్న మహిళ తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన బుధవారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. సంతబొమ్మాళి మండలం నర్సాపురం గ్రామానికి చెందిన నర్సిపురం లక్ష్మి (30) తన భర్త తిరుపతిరావుతో కలిసి కోటబొమ్మాళి విద్యుత్‌నగర్‌లో నివాసముంటోంది. లక్ష్మి స్థానికంగా హర్షిణి పేరుతో బ్యూటీ పార్లర్, లేడీస్ కార్నర్ నిర్వహిస్తోంది. తిరుపతిరావు కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. భార్యపై అనుమానంతో ఇద్దరికీ తరచూ గొడవలు జరుగుతుండేవి. గతంలో పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో భార్య లక్ష్మిని భర్త తిరుపతిరావు దారుణంగా గొంతు కోశాడు. దీంతో లక్ష్మి తీవ్ర రక్తస్రావంతో విగత జీవిగా పడిపోయింది. అనంతరం తిరుపతిరావు మద్యం షాపునకు వెళ్లిపోయాడు. సమాచారం తెలుసుకున్న కోటబొమ్మాళి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న లక్ష్మిని పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు మద్యం షాపు వద్ద ఉన్న తిరుపతిరావును అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భార్యపై అనుమానంతోనే ఈ హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి క్లూస్ టీం చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతురాలికి భర్తతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇన్చార్జి సీఐ విజయకుమార్, ఎస్ఐ సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలంలో దర్యాప్తు నిర్వహించి కేసు నమోదు చేశారు. -
డాడీ.. లే డాడీ..
తంగళ్లపల్లి (సిరిసిల్ల): తండ్రి నిద్రపోయాడనుకున్న ఆ రెండేళ్ల చిన్నారి చనిపోయిన తండ్రిని ‘డాడీ.. లే డాడీ’.. అంటూ పిలవడం అందరినీ కంటతడి పెట్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్‌నగర్ (డబుల్ బెడ్రూం సముదాయం)లోని బ్లాక్ నంబర్ 18, రూం నంబర్ 6లో నివాసముంటున్న తాడూరి రామ్‌కుమార్ (38) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. రామ్‌కుమార్ 14 ఏళ్ల కిత్రం వేములవాడకు చెందిన అనితను కులాంతర వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు సంతానం సుఖజిత్ (11), శ్రీవాస్తవ్ (5), విహాన్ (2). రామ్‌కుమార్ జిరాక్స్ మెషీన్ మెకానిక్‌గా, వివాహ ఈవెంట్లలోనూ పనిచేస్తుండేవాడు. పనులు సరిగాలేక రామ్‌కుమార్‌కు రూ.3 లక్షల వరకు అప్పులు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం మధ్యాహ్నం భార్య వంట గదిలో ఉన్న సమయంలో పెద్ద కొడుకు సుఖజిత్తో మాట్లాడిన రామ్‌కుమార్, తమ్ముళ్లను బాగా చూసుకోమని చెప్పి గదిలోకి వెళ్లి డోర్ వేసుకుని ఉరేసుకున్నాడు. ఎంతసేపటికి డోర్ తీయకపోవడంతో భార్య కేకలతో స్థానికులు వచ్చి తలుపు పగలగొట్టి చూడగా అప్పటికే మృతిచెందాడు. ట్రెయినీ ఎస్సై వినీతారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడితో వెళ్లిపోయిన పెళ్లి కూతురు
నారాయణపేట రూరల్: మూడు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. కాబోయే వధువు ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో పరువు పోయిందన్న మనస్తాపంతో పెళ్లి కొడుకు తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలంగాణలోని నారాయణపేటలో చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన కాంజి గోవిందరావు కుమారుడు అభిషేకు జ్ఞాని విజయ్‌కుమార్ కూతురు శ్వేతతో పెళ్లి కుదిరింది. నాలుగు నెలల క్రితం ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని సైతం ఘనంగా నిర్వహించారు.ఈ నెల 9వ తేదీన పెళ్లి ముహూర్తం నిశ్చయించి పెళ్లిపత్రికలు కూడా పంచారు. కాగా.. ఆదివారం ఉదయం పెళ్లి కూతురు శ్వేత తన ప్రియుడు వెంకటేశ్‌తో వెళ్లిపోయింది. దీంతో పెళ్లి ఆగిపోయింది. అయితే మంగళవారం తన కుమారుడిని పెళ్లి కొడుకుని చేయాల్సి ఉండగా ఇలా పెళ్లి ఆగిపోవడం భరించలేక.. మనస్తాపంతో తండ్రి గోవిందరావు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురి ప్రేమ వ్యవహారం తెలిసినా విజయ్‌కుమార్ దాచిపెట్టి.. పెళ్లికి సిద్ధమై పరువు తీశారని, అందుకే గోవిందరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వరుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన తమ్ముడి చావుకు కారణమైన వారిపై చర్య తీసుకోవాలని మృతుడి సోదరుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.చదవండి: కన్నీటి నిశ్చితార్థం.. తల్లిదండ్రులు, ముగ్గురు పిల్లలు దుర్మరణం -
కూతురి హత్యకు ప్రతీకారం
మండ్య(కర్ణాటక): గతేడాది జనవరిలో.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఓ యువతి.. ఆకస్మికంగా హత్యకు గురైంది. అప్పటినుంచి కేసు నడుస్తోంది. ఇంతలో ఆ కేసులో నిందితుని తండ్రి ప్రతీకార హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పౌరుషాల గడ్డ అయిన మండ్య జిల్లా పాండవపుర తాలూకా మాణిక్యనహళ్లిలో మంగళవారం జరిగింది. ఏం జరిగింది? వివరాలు.. నరసింహే గౌడ (55) అనే రైతు కత్తిపోట్లతో చనిపోయాడు. వెంటనే వెంకటేశ్, మంజునాథ్ అనే ఇద్దరిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. వెంకటేష్ కూతురు దీపికతో నరసింహేగౌడ కొడుకు నితీష్ కుమార్ చనువుగా ఉండేవాడు. దీపిక కు అదివరకే పెళ్లయి కొడుకు ఉన్నాడు. ఇద్దరూ రీల్స్ కూడా చేసేవారు. గతేడాది జనవరిలో మేలుకోటె కొండ అంచున దీపిక హత్యకు గురైంది. నితీష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసు నడుస్తోంది. అప్పటినుంచి ఇరుకుటుంబాల మధ్య వైరం కొనసాగుతోంది. నరసింహేగౌడ తన కూతురి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. ఓ టీ హోటల్ వద్ద అతన్ని కత్తితో పొడిచి చంపారు. తన కూతురి హత్యకు ప్రతీకారంగా వెంకటేష్ ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానాలున్నాయి. గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. -
ఓయో రూమ్‌కు తీసుకువెళ్లి.. రహస్య వీడియోలు
సాక్షి,హైదరాబాద్: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహిళను వేధిస్తున్న యువకుడికి నగర షీ–టీమ్స్ బృందాలు చెక్ చెప్పాయి. ఇతడితో పాటు మరికొందరు పోకిరీలు, నిరాధార ఫిర్యాదులు చేస్తున్న యువతిని పట్టుకున్నట్లు డీసీపీ డాక్టర్ ఎన్జేపీ లావణ్య మంగళవారం తెలిపారు. నగరానికి చెందిన ఓ యువకుడు (30) ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహిళతో కొన్నాళ్లు స్నేహం చేశాడు. ఆపై ఇరువురూ కలిసి ఓయో రూమ్‌కు వెళ్లగా... సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను రహస్య కెమెరాతో రికార్డు చేశాడు. ఆపై వాటిని బయటపెడతానంటూ ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. అలా కాకుండా ఉండాలంటే తాను చెప్పినట్లు చేయాలంటూ మూడు ఆప్షన్లు ఇచ్చాడు. తాను కోరినప్పుడల్లా రావాలని, తనతో సన్నిహితంగా ఉండటానికి మరికొందరు మహిళలను ఏర్పాటు చేయాలని, రూ.లక్ష ఇవ్వాలని చెప్పిన యువకుడు వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని కోరారు. ఎట్టకేలకు «ధైర్యం చేసిన ఆ మహిళ షీ–టీమ్స్‌ను ఆశ్రయిస్తూ తనకు ఉన్న నాలుగో ఆప్షన్ చూపింది. నిందితుడిని పట్టుకున్న బృందాలు అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచాయి. న్యాయమూర్తి అతగాడికి మూడు రోజుల సాధారణ జైలుశిక్ష విధించారు. బేగంపేటకు చెందిన ఓ యువతి తన సహోద్యోగులతో కలిసి ఓ వేడుక చేసుకున్నారు. దీన్ని వారికి తెలియకుండా పక్క ఇంట్లో ఉండే ప్లంబర్ (34) రికార్డు చేశాడు. మర్నాడు ఆ వీడియోలు చూపిస్తూ మహిళలను బెదిరించడం మొదలెట్టాడు. తనతో సన్నిహితంగా ఉండాలని లేదంటే ఆ వీడియోలు ఆన్లైన్లో పెడతానని వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన షీ–టీమ్స్ నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచాయి. న్యాయస్థానం అతడిని నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో నివసించే యువతి ఇటీవల ప్రజావాణిలో ఓ ఫిర్యాదు చేశారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి తనపై లైంగికదాడి చేశారని అందులో పేర్కొన్నారు. ప్రజావాణి నుంచి ఈ ఫిర్యాదు షీ–టీమ్స్‌కు రాగా.. అధికారులు బాధితురాలిని సంప్రదించి గోపాలపురం ఠాణాకు తీసుకువెళ్లారు. కేసు నమోదు చేసిన అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె చేస్తున్న దందా వెలుగులోకి వచి్చంది. పోలీసులనే టార్గెట్‌గా చేసుకుంటున్న ఈ యువతి వివిధ కారణాలు చెప్తూ వారి ఫోన్లు తీసుకుంటుంది. వాటి ద్వారా అశ్లీల చిత్రాలను తన నెంబర్‌కు ఫార్వర్డ్ చేసుకుంటుంది. వీటిని చూపిస్తూ ఆ పోలీసులనే బెదిరించి డబ్బు డిమాండ్ చేస్తుంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రజావాణిలో తప్పుడు ఫిర్యాదు చేసిన ఆరోపణలపై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే జీహెచ్ఎంసీ వాహనం డ్రైవర్ ఓ మహిళను వేధించారు. చెత్త వెయ్యడానికి వచ్చే ఆమెను చూస్తూ అభ్యంతరకర, అశ్లీల పనులు చేసేవాడు. దీనిపై బాధితురాలు షీ–టీమ్స్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా డెకాయ్ ఆపరేషన్ చేసిన అధికారులు సదరు డ్రైవర్‌ను పట్టుకుని కోర్టులో హాజరుపరిచాయి. న్యాయస్థానం అతడికి నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. ∙ బాలికలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, ఆపై బెదిరింపులకు దిగుతున్న ముగ్గురిని పట్టుకున్న షీ–టీమ్స్ వారిపై పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేయించాయి. ఛత్రినాక, జూబ్లీహిల్స్, మాదన్నపేటలకు చెందిన యువకులు బాలికల్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నారు. ఆపై డబ్బు కోసమో, తనతో సన్నిహితంగా ఉండాలనో బ్లాక్మెయిల్ చేశారు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న షీ–టీమ్స్ నిందితులపై సంబంధిత ఠాణాల్లో పోక్సో కేసులు నమోదు చేయించాయి. మరోపక్క బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, యువతుల్ని వేధిస్తున్న 49 మంది పోకిరీలను షీ–టీమ్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. -
బంగ్లాదేశ్ నుంచి నగరానికి వచ్చిన యువతి..
బంజారాహిల్స్: ట్రావెల్ ఏజెంట్ సహకారంతో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువతి వ్యభిచారం చేసేందుకు అర్ధరాత్రి ఆ దేశ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించింది. మొదట పశ్చిమ బెంగాల్ చేరుకున్న ఆమె అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లి, చివరకు హైదరాబాద్‌కు చేరుకుంది. జూబ్లీహిల్స్ పోలీసులు వ్యభిచార గృహంపై చేసిన దాడిలో పోలీసులకు చిక్కింది. వివరాల్లోకి వెళితే..బంగ్లాదేశ్, మాణిక్‌గోంజ్ జిల్లాకు చెందిన యువతి (23) 2024లో రకీబ్ అనే ట్రావెల్ ఏజెంట్ సహాయంతో అర్ధరాత్రి దేశ సరిహద్దు దాటి పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశించింది. కొంతకాలం పాటు అతను ఆమెకు ఆ రాష్ట్రంలోనే ఆశ్రయం కల్పించాడు. ఆమెకు సిమ్‌కార్డు సైతం సమకూర్చి బెంగళూరుకు తీసుకెళ్లి అక్కడ మూజమ్ అనే వ్యక్తికి అప్పగించాడు. నెల రోజుల పాటు గదిలో ఉంచిన మూజమ్ ఆమెతో వ్యభిచారం చేయించాడు. ఆ తర్వాత ఆమె బెంగళూరులోని కోరమంగళకు పారిపోయి, బంగ్లాదేశ్‌కు చెందిన మిస్తి అనే స్నేహితుడిని కలుసుకుంది. అతని వద్ద రెండు నెలల పాటు తలదాచుకుంది. మిస్తి ఆమెను అఖిల్ అనే వ్యక్తికి అప్పగించగా, వ్యభిచారం చేస్తే ఎక్కువ జీతం ఇస్తానని అఖిల్ హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో అఖిల్ సూచన మేరకు గత నెల 21న బస్సులో హైదరాబాద్ చేరుకున్న ఆమె అతని ఇంట్లో 10 రోజులు ఉంది. ఆ తర్వాత సదరు యువతి మరిన్ని డబ్బులు సంపాదించేందుకు నాయక్ అనే వ్యక్తిని ఫోన్లో సంప్రదించింది. నాయక్ ఆమెను గత నెల 30న జూబ్లీహిల్స్‌లోని మింట్ లీవ్స్ సరీ్వస్‌డ్ అపార్ట్మెంట్ రూం నెంబర్–112లో దించేందుకు క్యాబ్ ఏర్పాటు చేశాడు. కస్టమర్లను సంప్రదించి గదికి పంపుతానని నాయక్ ఆమెకు చెప్పాడు. అయితే వ్యభిచార దందాపై పోలీసులకు సమాచారం అందడంతో సదరు అపార్ట్మెంట్లోని గదిపై సోమవారం దాడులు నిర్వహించిన పోలీసులు బంగ్లాదేశ్ యువతితో పాటు కస్టమర్లను అరెస్టు చేశారు. యువతిని పునరావాస కేంద్రానికి తరలించిన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లి తప్పుదోవ.. తండ్రి రాసిన మరణ శాసనం
సంగారెడ్డి, సాక్షి: కొండాపూర్ మండలం మల్కపూర్ గ్రామంలో చోటు చేసుకున్న ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే మనస్థాపంతో సుభాష్ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి.. తాను బలవన్మరణానికి పాల్పడ్డారని తొలుత అంతా భావించారు. అయితే ఆమె వివాహేతర సంబంధమే ఈ ఘోరానికి కారణమైందని తేలింది ఇప్పుడు.సుభాష్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి మల్కపూర్‌లో నివాసం ఉండేవాడు. అతని భార్య మంజుల మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో భర్త ఎంత మంచి చెప్పినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ మధ్య ఓరోజు గొడవ ముదిరి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన సుభాష్.. తన ఇద్దరు పిల్లలు మారిన్ (13), ఆరాధ్య (10) ఉరివేసి చంపి తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘‘డబ్బు ఆశ చూపించి నా భార్యను వాడుకున్నారు. ఎంత మంచి చెప్పినా ఆమెలో మార్పు రాలేదు. అందుకే ఈ ఘాతుకానికి పాల్పడుతున్నాం..’’ అంటూ సుభాష్ రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
క్రెడిట్ కార్డు బిల్లు కట్టమన్నందుకు..
మదనపల్లె(అన్నమయ్య): క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోవడంతో, బ్యాంక్ సిబ్బంది ఇంటివద్దకు వచ్చి నిలదీయడంతో అవమానంగా భావించి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. వేంపల్లె పంచాయతీ జంగావారిపల్లెకు చెందిన రెడ్డెప్ప, కాంతమ్మ దంపతుల ఏకై క కుమారుడు శ్రీకాంత్(25) పట్టణంలోని ప్రైవేట్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో సేల్స్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ములకలచెరువు మండలం దేవలచెరువుకు చెందిన అనిల్‌కు తనపేరుపై ఉన్న క్రెడిట్‌కార్డు ద్వారా రూ.3లక్షల రుణం తీసిచ్చాడు. అయితే, అతను సకాలంలో రుణం చెల్లించకపోవడంతో బ్యాంక్ సిబ్బంది నుంచి వేధింపులు అధికమయ్యాయి. దీంతో తాను వ్యక్తిగతంగా దాచుకున్న డబ్బులతో పాటు కొంతమేర అప్పుచేసి మూడో వంతు రుణం చెల్లించాడు. ఇంకా రూ.40వేలు చెల్లించాల్సి ఉంది. ఈ నగదు చెల్లింపు కోసం శనివారం బ్యాంక్ సిబ్బంది శ్రీకాంత్ ఇంటివద్దకు వెళ్లి వెంటనే చెల్లించాలంటూ ఒత్తిడి చేసి నిలదీశారు. దీన్ని అవమానంగా భావించి మనస్తాపంతో ఆదివారం ఉదయం ఇంటివద్దే పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ గదికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
పాముకాటుకు వివాహిత మృతి
కడెం(మంచిర్యాల): పాముకాటుకు గురై వివాహిత మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. పెద్దూర్‌కు చెందిన నేరెళ్ల రజిత (35), దాసు భార్యభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసు కుంటూ జీవనం సాగిస్తున్నారు. అద్దె ఇంటి డబ్బుల భారంతో గత కొన్నినెలలుగా పెద్దూర్ సమీపంలోని డబుల్ బెడ్రూం ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటి పరిసరాల్లో రజిత తోటకూర తెంపుతుండగా పాము కాటేసింది. కుటుంబ సభ్యులు ఆమెను కడెంలో ప్రథమ చికిత్స చేయించి, నిర్మల్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది. తల్లి మృతదేహం వద్దమృతదేహం వద్ద రోదిస్తున్న కూతురు కూతుళ్ల రోదన అందరిని కంటతడి పెట్టించింది. పెద్ద కూతురు వివాహం నిశ్చయం కాగా, అంతలోనే తల్లి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయ లు అలముకున్నాయి. భర్త ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.కృష్ణసాగర్రెడ్డి తెలిపారు. -
ప్రియురాలి చేతిలో ట్రావెల్ ఏజెంట్ హత్య
అన్నానగర్(తమిళనాడు): మద్యం, మాంసంలో నిద్రమాత్రలు కలిపి దుబాయ్ ట్రావెల్స్ సీఈఓను హత్య చేసిన ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూత్తుక్కుడి కి చెందిన త్యాగరాజన్(69) ఇతను కోయంబత్తూరు వచ్చి ఖతీమా నగర్లో నివశించే సమయంలో గోమతి అనే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. గోమతికి నీల, శారద అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2016లో శారదతో గొడవపడిన ఆమె భర్త గుణవేల్ను హత్య చేసి త్యాగరాజన్ జైలుకు వెళ్లాడు. అనంతరం బెయిల్‌పై వచ్చాడు. ఈ క్రమంలో శారద పని నిమిత్తం దుబాయ్ వెళ్లింది. ఆ సమయంలో తిరువారూరు జిల్లాకు చెందిన ట్రావెల్ ఏజెంట్ సిగమణి(47)తో శారదకు అక్రమ సంబంధం ఏర్పడింది. శారదకు, సిగమణికి డబ్బులు ఇచ్చి పుచ్చుకునే దాంట్లో సమస్య వచ్చింది. దీంతో శారద కోవైకి తిరిగి వచ్చింది. శారదను శాంతింపజేసేందుకు సిగమణి 21న కోయంబత్తూరుకు వచ్చాడు. అతనిని శారద తన ఇంటికి తీసుకెళ్లింది. ఆ సమయంలో త్యాగరాజన్ నెల్లైకి చెందిన ప్రముఖ రౌడీ పశుపతిపాండియన్ సహచరుడు పుదియవన్ కోయంబత్తూరుకు ఆహ్వానించారు. ఆ తర్వాత 22వ తేదీ రాత్రి మద్యం, మాంసంలో 30కి పైగా నిద్ర, నొప్పి నివారణ మాత్రలు కలిపి సిగమణిని హత్య చేశారు. అనంతరం సిగమణి మృతదేహాన్ని త్యాగరాజన్, శారద, పుదియవన్ కారులో తీసుకెళ్లి కరూర్ పొన్నమరావతి పక్కన పడేసి, పారిపోయారు. మిగిలిన ఇద్దరు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. దీనిపై సిగమణి భార్య ప్రియా(69) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోయంబత్తూరు బీలమేడు పోలీసులు విచారణ చేపట్టారు. త్యాగరాజన్(69), ఇతని వివాహేతర ప్రియురాలు గోమతి (53), ఆమె కూతుళ్లు నీల (33), శారద (35), కోడలు స్వాతి (26), పుదియవన్(48) సిగమణిని హత్య చేసినట్లు తేలింది. ఆదివారం శారదతోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. -
నా చావుకు భార్య కుటుంబమే కారణం
అన్నానగర్(తమిళనాడు): తన చావుకు భార్య కుటుంబమే కారణం అని ప్రైవేట్ ఫారెస్ట్ ఉద్యోగి స్నేహితుడికి వీడియో పంపించి కోట్టూరుపురం వంతెన పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. చెన్నైలోని కేకే నగర్ కామరాజర్ రోడ్డులో నివాసం ఉంటున్న అజిత్ (32) పెరుంగుడిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు, ఇతనికి భార్య ఆర్తి (29), రెండేళ్ల కుమార్తె ఉన్నారు. ఆర్తి పల్లావరంలో సెంట్రల్ కార్యాలయంలో సెక్యూరిటీగా పనిచేస్తోంది. అజిత్‌కు అతని భార్యకు మధ్య తరచూ గొడవలు జరిగేవన్నారు. దీంతో అజిత్ భార్య ఆర్తి కుటుంబం కఠినంగా మాట్లాడిందని తెలుస్తుంది. దీంతో మనస్తాపంతో ఉంటు వచ్చాడు. గత 28వ తేదీన అజిత్, ఆయన భార్య మధ్య మరో వివాదం జరిగినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత అజిత్ కోట్టూరుపురం వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు యతి్నంచాడు. స్థానికులు తీవ్రంగా గాయపడిన అజిత్‌ను రాయపేట ప్రభుత్వం ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్ర చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కోట్టూరుపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. ‘తన ఆత్మహత్యకు నా భార్య బంధువులే కారణం’ అంటూ అజిత్ తన స్నేహితుల్లో ఒకరికి వీడియో పంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు ఆత్మహత్యకు సంబంధించి అజిత్ భార్య కుటుంబాన్ని విచారిస్తున్నారు. -
భర్త వివాహేతర సంబంధం.. గుండెపోటుతో భార్య మృతి..!
ఖమ్మంక్రైం: వరుసకు వదిన అయిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటన హైదరాబాద్‌లో జరగగా.. మృతురాలిది ఖమ్మం. వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన సాహితి (30)కి ఖమ్మం పట్టణానికి చెందిన రేగుల అనిల్‌తో కొన్నేళ్ల కిందట వివాహమైంది. అనిల్ హైదరాబాద్‌లోని పోలీస్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండటంతో దంపతులు అక్కడే ఉంటున్నారు. కాగా, అనిల్ వరుసకు వదిన అయిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. పద్ధతి మార్చుకోవాలని పెద్దల సమక్షంలో హెచ్చరించినా మార్పు రాలేదు. శనివారం రాత్రి సాహితిని విపరీతంగా కొట్టడంతో ఆమె మృతిచెందగా గుండెపోటుతో మృతిచెందినట్లు చిత్రీకరించేందుకు అనిల్ యత్నంచాడని మృతురాలి బంధువులు ఆరోపించారు.మృతురాలి శరీరంపై కూడా గాయాలున్నాయని, హైదరాబాద్ నుంచి మృతదేహన్ని తీసుకొచ్చి ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. సీఐ బాలకృష్ణ వారితో మాట్లాడి అనిల్‌పై ఫిర్యాదు చేయాలని, పోస్టుమార్టంలో హత్య అని తేలితే కేసు నమోదు చేస్తామని, సర్దిచెప్పగా మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. టూటౌన్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. అనిల్ పరారీలో ఉన్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. -
ప్రాణాలు తీసిన పెంపుడు కుక్క..!
వెంగళరావునగర్(హైదరాబాద్): తాను పెంచుకుంటున్న శునకమే ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొన్న ఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన డి.పవన్‌కుమార్ (37) తన స్నేహితుడు సందీప్‌తో కలిసి పదేళ్లుగా మధురానగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గదిలో నిద్రపోయాడు. పక్కనే అతని పెంపుడు కుక్క కూడా ఉంది. ఉదయం సందీప్ తలుపు తట్టగా పవన్ లేవలేదు. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారితో తలుపు పగులకొట్టి లోనికి వెళ్లి చూడగా పవన్ విగతజీవిగా కనిపించాడు. అతని మర్మాంగాలు రక్తంతో ఉన్నాయి. అతని పెంపుడు కుక్క నోటి నిండా రక్తం ఉంది. కుక్క అతడి మర్మాంగాలను గాయపర్చడం వల్లే మృతి చెంది ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. పవన్‌కుమార్‌కు గతంలో వివాహమైంది. భార్యతో విడాకులు కావడంతో నగరంలో ఉంటున్నాడు. స్నేహితుడు సందీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వృద్ధ దంపతుల దారుణ హత్య
అల్వాల్(హైదరాబాద్): వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు నగలతో పాటు, ఇంట్లో ఉన్న నగదు ఎత్తుకెళ్లిన సంఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సూర్యనగర్‌లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, మాణిక్యారం గ్రామానికి చెందిన కనకయ్య (70), రాజమ్మ (65) దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారికి పెళ్లిళ్లు కావడంతో బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి స్థిరపడ్డారు. ఊరిలో వ్యవసాయం చేసుకునే కనకయ్య, రాజమ్మ వయసు మీద పడడంతో పిల్లల వద్ద ఉందామనే ఆలోచనతో మూడేళ్ల క్రితం నగరానికి వచ్చారు. కనకయ్య అల్వాల్, సూర్యనగర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసేవాడు. కొన్నాళ్ల క్రితం అతను అనారోగ్యానికి గురి కావడంతో ఊరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సమీపంలో ఉంటున్న కూతురు లత ఇంటికి వెళ్లి సామన్లు సర్దుకునేందుకు అవసరమైన సంచులు కూడా తెచ్చుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున వారి కుమార్తె లత ఇంటికి వచ్చి చూడగా తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో మంచంపై విగతజీవులై పడి ఉన్నారు. ఇద్దరి తలలపై గాయాలు ఉన్నాయి. సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. లత కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జాగిలాలను రప్పించి పరిసరాల్లో తనిఖీలు చేశారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ఇంట్లో చొరబడి దొంగతనాలు పాల్పడి ఉంటారని, ఈ క్రమంలోనే వారిపై దాడి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. రాజమ్మ మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, వెండి పట్టీలు, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కనకయ్య తమ వద్ద ఉన్న నగదు అవసరమైన వారికి వడ్డీకి ఇచ్చే వాడని తాను ఊరికి వెళ్లి రూ. లక్ష తీసుకువచ్చానని, అవసరం ఉన్న వారికి వడ్డీకి ఇస్తానని చెప్పినట్లు స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న బాలానగర్ డీసీపీ సుధీర్ కుమార్, ఏసీపీ రాములు, సీఐ రాహుల్‌దేవ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
విమాన టికెట్‌కు డబ్బుల్లేక.. వ్యభిచార కూపంలోకి..
బంజారాహిల్స్(హైదరాబాద్): స్నేహితుడిని నమ్ముకుని భారత్‌కు వచ్చిన థాయ్‌లాండ్ యువతి మోసానికి గురైంది. తిరిగి తన స్వదేశం వెళ్లేందుకు విమాన టికెట్‌కు డబ్బులు లేక వ్యభిచారంలోకి దిగి పోలీసులకు పట్టుబడింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. థాయ్‌లాండ్‌కు చెందిన యువతి (30)కి, చెన్నైకి చెందిన యువకుడికి ఇన్‌స్టాలో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. అతడు రమ్మనడంతో గత మార్చిలో యువతి చెన్నైకి వచ్చేసింది. ఆమెను చెన్నైలోని ఓ హోటల్లో ఉంచి అతడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ముఖం చాటేయడంతో యువతి హోటల్ బిల్లు చెల్లించలేక.. థాయలాండ్ వెళ్లలేక ఇబ్బందుల పాలయ్యింది. థాయ్‌లాండ్‌కు చెందిన స్నేహితురాలిని సంప్రదించింది. థాయ్‌లాండ్ నుంచి పలువురు మహిళలను వ్యభిచార వృత్తి కోసం భారత్‌కు పంపించే ఓ స్నేహితురాలు నగరంలోని యువతితో మాట్లాడించడంతో గత నెల 30న బాధితురాలు నగరానికి చేరుకుంది. శ్రీనగర్ కాలనీలో ఓ ప్లాట్‌లో మరో యువతితో కలిసి వ్యభిచారానికి పాల్పడింది. విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దాడులు చేయగా బాధిత యువతి పట్టుబడింది. తనను బాయ్‌ఫ్రెండ్ మోసం చేశాడని, హోటల్ బిల్లు చెల్లించేందుకు, తిరిగి స్వదేశం వెళ్లిపోవడానికి విమాన చార్జీల కోసం తప్పనిసరి పరిస్థితుల్లోనే వ్యభిచార వృత్తిలోకి దిగినట్లు ఆమె తెలిపింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి ఆదివారం పునరావాస కేంద్రానికి తరలించారు. -
వివాహిత ఆత్మహత్య
జీడిమెట్ల(హైదరాబాద్): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ అపార్ట్మెంట్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మి(25)కి గత డిసెంబర్లో హరికృష్ణతో వివాహం జరిగింది. భార్యాభర్తలు సుభా‹Ùనగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. హరికృష్ణ ఓ ప్రైవేట్ పరిశ్రమలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం ఉదయం లక్ష్మి తాము ఉంటున్న అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి కిందకు దూకింది. దీనిని గుర్తించిన అపార్ట్మెంట్ వాసులు అక్కడకు వెళ్లి చూడగా తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించారు. కాగా లక్షి్మకి పెళ్లి ఇష్టం లేని కారణంగానే అత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని సమాచారం. మృతురాలి తల్లిదండ్రుల వచి్చన తర్వాత వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
బాలుడిపై లైంగిక దాడి కేసులో యువతి రిమాండ్
బంజారాహిల్స్(హైదరాబాద్): ఆ బాలుడికి 16 ఏళ్లు. అతడి తల్లిదండ్రులు జూబ్లీహిల్స్‌లోని ఓ బడా పారిశ్రామికవేత్త ఇంట్లో పని చేస్తూ అక్కడే ఉన్న సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. సదరు బాలుడు పదో తరగతి పరీక్షల కోసం గత జనవరిలో తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. అదే ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న మరో యువతి (28) వారు ఉంటున్న క్వార్టర్ పక్కనే మరో క్వార్టర్లో ఉంటోంది. ఆ బాలుడితో పరిచయం పెంచుకున్న ఆమె తరచూ అతడిని తన క్వార్టర్లోకి పిలిపించుకుని అతడిపై లైంగిక దాడికి పాల్పడేది. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ తల్లి మీద దొంగతనం కేసు పెట్టించి ఉద్యోగం నుంచి తీసివేయిస్తానని బాలుడిని బెదిరించేది. తన తల్లి ఉద్యోగం పోతుందనే భయంతోనే అతను ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. ఐదు రోజుల క్రితం సదరు యువతి గదిలో తన కుమారుడు ఉండడాన్ని గుర్తించిన అతడి తల్లి అక్కడికి వెళ్లి చూడగా సదరు యువతి తన కొడుకును బలవంతంగా ముద్దు పెట్టుకుంటుండగా చూసింది.ఈ విషయమై తన కుమారుడిని నిలదీయగా అతను తల్లికి పూర్తి వివరాలు చెప్పాడు. దీంతో బాధితుడి తల్లి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన యువతిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
అద్దెకు ఇల్లు పేరుతో.. మేనత్త సొమ్ముకు మేన కోడలి పథకం
హైదరాబాద్: వారాసిగూడ చోరీ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక మహిళను కట్టేసి ఆమె ఒంటిపై ఉన్న నగలతో పాటు సొమ్మును అపహరించుకుని వెళ్లిన ఘటనలో మేనకోడలే నిందితురాలిగా తేలింది. మేనత్త సొమ్మును కాజేయాలని మేనకోడలు జ్యోతి పథకం రచించి ఆ ఇంటికి యువకుడ్ని పంపించి చోరీకి పాల్పడేలా పురిగొల్పింది. ఈ కేసులో జ్యోతిపాటు మరో ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.కాగా, గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి యజమానురాలిని కట్టేసి నగలు, నగదుతో ఉడాయించిన సంఘటన వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుం ది. ఎస్సై సుధాకర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పార్శిగుట్టలోని ఓ ఇంట్లోని మొదటి అంత స్తులో పారిజాతం (56) అనే మహిళ నివాసముం టోంది. శుక్రవారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఇల్లు అద్దెకు కావాలంటూ ఇంట్లోకి చొరబడ్డారు.తలుపులు గ యపెట్టి ఆమెను కత్తితో బెదిరించి కుర్చీలో కట్టేశాడా ఇంట్లో ఉన్న 30 గ్రాముల బంగారు నగలు, 6 మే నగదు, సెల్ ఫోన్ ను తీసుకుని పరారయ్యారు. కొ సేపటికి కట్లు విప్పుకుని బయటికి వచ్చి పారిజాతం చుట్టుపక్కల వారికి విషయం చెప్పింది స్థానికులతో కలిసి శుక్రవారం సాయంత్రం ఆమె వారాసిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టగా మేనకోడలే నిందితురాలు అయ్యింది. -
గుంటూరు లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాల కలకలం
గుంటూరు: లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. గుంటూరు బ్రాడీపేటలోనీ శ్రీనివాసన్ లేడీస్ హాస్టల్లో బాత్రూం ముందు కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ విద్యార్థునులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో అసభ్యకరంగా మెసేజ్‌లు చేయటం.. అబ్బాయిల్ని తీసుకొని వచ్చి లేడీస్ హాస్టల్లో ఉంచడం చేస్తున్నారని హాస్టల్ విద్యార్థునులు చెబుతున్నారు. అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.గత ఏడాది కూడా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. లేడీస్ హాస్టల్ బాత్రూమ్లో హిడెన్ కెమెరా బయటపడింది. దీంతో విద్యార్థినులు హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు. ఈ కెమెరా ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు.తెలంగాణలోని ఈ ఏడాది మార్చి నెలలో సంగారెడ్డి జిల్లాలోని ఓ గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం రేపింది. హాస్టల్లో ఉండే విద్యార్థినిలు స్పై కెమెరాను గుర్తించి.. అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి హాస్టల్ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. -
భర్తను సర్జికల్ బ్లేడుతో హత్య చేసిన భార్య..!
పిఠాపురం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తాళి కట్టిన భర్తను ప్రియుడితో కలసి అతి కిరాతకంగా సర్జికల్ బ్లేడుతో హత్య చేసింది ఆమె. మార్చి మూడో తేదీన గొల్లప్రోలు మండలం చేబ్రోలులో 216 జాతీయ రహదారి పక్కన లభ్యమైన వ్యక్తి మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ గొల్లప్రోలు పోలీసు స్టేషన్లో శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. కత్తిపూడి–కాకినాడ జాతీయర రహదారి పక్కన కల్వర్టు వద్ద పంట బోదెలో ఓ వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో పోలీసులు గుర్తించారు. చేబ్రోలు వీఆర్వో ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినప్పటికీ మృతదేహంపై గాయాలు ఉండడంతో సీఐ జి.శ్రీనివాస్ హత్య కేసుగా మార్చి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ బిందుమాధవ్ పర్యవేక్షణలో ఎస్డీపీఓ దేవరాజ్ మనీష్ పాటిల్ మార్గదర్శకంలో సర్కిల్ ఎస్సైలు నాలుగు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టారన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంతో పాటు, సరిహద్దు రాష్ట్రాల మిస్సింగ్ కేసుల డేటా, హైవే సీసీ కెమెరా ఫుటేజీ, టోల్ ప్లాజా, సెల్ టవర్ సమాచారం ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 28న అనకాపల్లి జిల్లా ఎలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసుపై దర్యాప్తు బృందం దృష్టి సారించింది. అక్కడి ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వ్యక్తి వివరాలతో ఇక్కడి లభ్యమైన మృతదేహం వివరాలు పోలి ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుడు ధర్మవరం ప్రాంతానికి చెందిన తంగిళ్ల లోవరాజుగా గుర్తించారు.అనకాపల్లి జిల్లా యలమంచిలికి చెందిన అతని భార్య శ్యామల, భర్త బంధువు అయిన మోహన్ కుమార్‌తో వివాహేతర సంబంధం నెరపుతూ తమకు అడ్డంగా ఉన్న భర్తను తొలగించాలని భావించింది. పథకం ప్రకారం ప్రియుడు మోహన్ కుమార్, అతని స్నేహితుడు గంగాధర్, ముగ్గురూ కలిసి గత ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి లోవరాజును హత్య చేసి మృతదేహాన్ని చేబ్రోలు హైవే వద్ద పడవేసినట్టు దర్యాప్తులో గుర్తించారు. హత్య చేయడానికి రెండు సర్జికల్ బ్లేడ్లను సిద్ధం చేసుకుని, పిల్లలు పడుకున్నాక మోహన్‌కుమార్, గంగాధర్ ఇంటిలోకి ప్రవేశించి లోవరాజుపై దాడి చేసి బ్లేడ్లతో పీకకోసి, గుండెల్లో పొడిచినట్టు పోలీసులు తెలిపారు. రాంబాబు అరవడానికి ప్రయతి్నంచగా నోట్లో గుడ్డలు కుక్కేసారని, అప్పటికీ లోవరాజు చనిపోకపోవడంతో కాలి చీలమండ కోసి రక్తం పోయేలా చేసి హత్య చేసినట్టు ఎస్పీ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని కారులో తమకు పరిచయం ఉన్న ప్రాంతమైన చేబ్రోలు హైవే పక్కన పడేసి పరారయ్యారన్నారు. నిందితులను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ జి శ్రీనివాస్, ఎస్సై ఎన్.రామకృష్ణ, ఎస్ఐటీ సిబ్బందిని ఆయన ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు
హైదరాబాద్, క్రైమ్: ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్ (Na Anvesh)పై సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీతో పాటు పలువురు ప్రముఖులపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడనే అభియోగం అతనిపై నమోదు అయినట్లు సమాచారం.ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ.. తెగ ఎంజాయ్ చేసేస్తూ.. ఆ వీడియోలను అప్లోడ్ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బూలు సంపాదించుకుంటున్నాడు అన్వేష్. అయితే.. తాజాగా బెట్టింగ్ యాప్‌ల ప్రచారం పేరుతో.. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్‌రాజు తదితరులు రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అతను వ్యాఖ్యలు చేశారట. అయితే అన్వేష్ అవాస్తవ, తప్పుడు సమాచారం ప్రచారం చేశారంటూ పోలీసులు సుమోటో(Suo moto)గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు.. పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా.. ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా ఆ వీడియో ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలి అని సైబర్‌క్రైమ్ ఠాణా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ పోలీసులు అన్వేష్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై అన్వేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి. -
పిల్లలు పుట్టలేదు అని భార్యని చంపి తన ఇంట్లోనే..
జగిత్యాలక్రైం: నిండునూరేళ్లు కలిసి ఉంటామని.. ఏడడుగులు నడిచి ప్రమాణం చేసిన భర్తే కాలయముడై భార్యను హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలకేంద్రంలో జరిగింది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించగా ఎట్టకేలకు పోలీసులు కేసును ఛేదించారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వివరాలు వెల్లడించారు.ఇరవై ఏళ్ల క్రితం వివాహంకరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్‌కు చెందిన మమతను (35) ఇరవై ఏళ్ల క్రితం జగి త్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన అవుదుర్తి మహేందర్‌కు ఇచ్చి వివాహం చేశా రు. వివాహ సమయంలో కట్నకానుకలు ముట్టజెప్పారు. కానీ, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. మహేందర్ మద్యానికి బానిసై అప్పులు చేశాడు. రోజూ తాగి వచ్చి మమతను వివాహ సమయంలో కట్నం తక్కువగా ఇచ్చారని, పిల్లలు పుట్టడం లేదని తీవ్రంగా వేధించాడు. అతడితోపాటు తల్లి వజ్రవ్వ, తండ్రి లక్ష్మణ్, తమ్ముళ్లు అ నిల్, వెంకటేశ్ కూడా వేధింపులకు గురిచేసేవారు. మహేందర్ ఏ పని చేయకపోవడంతో మమత కరీంనగర్‌లోని ఓషాపింగ్‌మాల్‌లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.ఇరవై రోజుల క్రితం పంచాయితీతరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో 20 రోజుల క్రితం మల్లాపూర్‌లో పంచాయితీ నిర్వహించారు. దీంతో మమతను బాగా చూసుకుంటానని మహేందర్ కరీంనగర్‌లోని అద్దె ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం పుస్తెలతాడు ఇవ్వాలని మమతను కోరగా నిరాకరించింది. ఈనేపథ్యంలో మహేందర్ గతనెల 26న నల్లగొండ, వేములవాడ దైవ దర్శనానికని నమ్మించి, దైవ దర్శనం అనంతరం కొడిమ్యాలకు తీసుకెళ్లాడు. అదేరోజు నైలాన్ తాడును ఆమె మెడ చుట్టూ బిగించి హత్య చేశాడు. ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు ఆమె మెడకు నైలాన్‌తాడు చుట్టి ఇంటి స్లాబ్‌కు కట్టాడు. పుస్తెలతాడు తీసుకొని గంగాధరలోని ఓ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని అప్పులు తీర్చాడు. ఈక్రమంలో పోలీసులు లోతుగా విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. శనివారం నిందితుడు మోటారుసైకిల్‌పై పారిపోతుండగా చెప్యాల ఎక్స్‌రోడ్ వద్ద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులు, తమ్ములపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో మల్యాల సీఐ రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ పాల్గొన్నారు. -
టీచర్‌తో వివాహేతర సంబంధం.. భార్యను..!
హోసూరు(తమిళనాడు): ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ భర్త తప్పుదారి పట్టాడు, ప్రశ్నించిన భార్యను హతమార్చాడు. హోసూరు పారిశ్రామికవాడలో భార్యను హత్య చేశాడో భర్త. వివరాల మేరకు హోసూరు జూజువాడి ఉప్కర్ నగర్ రాజేశ్వరిలేఔట్కు చెందిన భాస్కర్ (34), భార్య శశికళ (33). గత 2018న ఫేస్బుక్లో పరిచయమై ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఈ దంపతులకు ఆరూష్ (4), శ్రీషా (2) అనే పిల్లలున్నారు. దంపతులు హోసూరులోని సీతారామ్‌దిన్న , కామరాజ్‌నగర్, జూజువాడి, రాజేశ్వరిలేఔట్ ప్రాంతాల్లో జిమ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. టీచర్‌తో అక్రమ సంబంధం ఈ నేపథ్యంలో భాస్కర్‌కు ఓ టీచర్‌తో అక్రమ సంబంధం ఏర్పడింది. ఆమెకు అలసనత్తం ప్రాంతంలో అద్దె గదిలో ఉంచాడు. విషయం తెలుసుకొన్న భార్య శశికళ భర్తతో గొడవపడుతూ వచ్చింది.గత 30వ తేదీన రాత్రి భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో దుస్తులతో గొంతు పిసికి హత్య చేశాడు. మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి ఆమెకు ముక్కులో రక్తం కారుతోందని, వైద్యం చేయాలని తెలిపాడు. పరిశీలించిన డాక్టర్లు శశికళ చనిపోయిందని ధృవీకరించారు. ఈ ఘటనపై శశికళ బంధువుల ఫిర్యాదు మేరకు సిఫ్‌కాట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని నింధితుడు భాస్కర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. శవపరీక్ష కోసం మృతదేహాన్ని క్రిష్ణగిరి ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. హత్య చేసినట్లు రుజువు కావడంతో నిందితున్ని అరెస్ట్ చేశారు. -
భీమిలి వివాహిత కేసు.. బయటపడ్డ సంచలన నిజాలు
సాక్షి, విశాఖపట్నం: భీమిలి మండలం దాకమర్రి వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన క్రాంతి కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఆరు బృందాలు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కేసు వివరాలను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మీడియాకు వెల్లడించారు. దాకమర్రి పంచాయతీ శివారు 26వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఫార్చ్యూన్ హిల్స్ వుడా లేఅవుట్లో నిన్న(శుక్రవారం) ఉదయం సగం కాలిన మహిళ మృతదేహాన్ని భీమిలి పోలీసులు గుర్తించారు.ఆ మహిళను హంతకులు గొంతు కోసి తరువాత పెట్రోల్‌తో దహనం చేసినట్టు గుర్తించారు. మెడలో కాలిన నల్లపూసల గొలుసు ఉండటంతో మృతురాలు వివాహితగా గుర్తించారు. ఆరు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. మృతురాలు వెంకటలక్ష్మికి క్రాంతి కుమార్‌తో అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.క్రాంతి కుమార్‌కు ఇద్దరు భార్యలు ఉండగా, అతడు రెండో భార్యతో మృతురాలి ఇంటి పక్కన ఉండేవాడు. క్రాంతికుమార్, మృతురాలికి మధ్య స్నేహం కుదిరింది. అతనికి వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం ఏర్పడటంతో రెండో భార్యకు, వెంకటలక్ష్మికి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో రెండో భార్యను వేరే బ్లాక్‌కు మార్చాడు. అయినా వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం కొనసాగించాడు.ఈ విషయంలో మొదటి భార్య, రెండో భార్యతో తరచు గొడవలు జరుగుతున్నాయి. మరో వైపు వెంకటలక్ష్మి.. తనతోనే ఎక్కువసేపు గడపాలని తనతోనే ఉండాలంటూ క్రాంతికుమార్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఎలాగైన వెంకటలక్ష్మిని వదిలించుకోవాలని.. ప్లాన్ చేశాడు. వెంకటలక్ష్మిని బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరు ఐస్‌క్రీమ్ తిన్నారు. అనంతరం బైక్‌లో పెట్రోల్ కొట్టించి.. బాటిల్లో కూడా కొట్టించాడు. ఇంటి వద్ద పెట్రోల్ దొంగలు ఉన్నారని.. అందుకే బాటిల్లో పెట్రోల్ కొట్టించానంటూ వెంకటలక్ష్మితో చెప్పాడు.శారీరకంగా కలుద్దామని చెప్పి దాకమర్రి లేవట్‌కి తీసుకెళ్లి వెంకటలక్ష్మిని కత్తితో గొంతు కోసి చంపేశాడు. తరువాత ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకుని.. తరువాత పెట్రోల్ పోసి తగలుపెట్టాడు. కేసు విచారణలో మొదట వెంకటలక్ష్మిని గుర్తించాము. తర్వాత కాంత్రితో వెళ్తున్నట్లు తన తల్లి చెప్పిందని కొడుకు పోలీసులకు చెప్పారు. ఆ కోణంలో విచారణ చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. -
విశాఖ జంట హత్యల కేసు.. వివాహేతర సంబంధమే కారణం!
విశాఖ: నగరంలో కలకలం సృష్టించిన జంట హత్యల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వృద్ధ దంపతుల డబుల్ మర్డర్ కేస్ లో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రసన్న కుమార్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. అప్పు తీర్చాలని అడిగినందుకు యోగేంద్ర బాబు, లక్ష్మీల హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఆర్థిక లావాదేవీలతో పాటు వివాహేతర సంబంధం కూడా కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రా.. హత్య గావించబడ్డ లక్ష్మీతో అత్యంత సన్నిహితంగా ఉంటూ వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యగావించబడ్డ యోగేంద్ర కుటుంబంతో నమ్మకంటూ వారిని మిశ్రా హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.హత్యకు గురైన దంపతులు ఏప్రిల్ 24వ తేదీ గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చారు. అక్కడ గ్లోరియా పాఠశాల అడ్మిన్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని వచ్చారు. అదే సమయంలో రాజీవ్‌నగర్‌లో గ్రామదేవత పండగ జరుగుతుండటంతో ఆ పరిసరాలు కాస్త సందడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హత్య పథకాన్ని ప్రసన్న కుమార్ మిశ్రా అమలు చేశాడు. దీనిపై విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడారు. డబుల్ మర్డర్ కేసు గురుంచి సీఎం కూడా మమ్మల్ని అడిగారు. అంతర్జాతీయ స్థాయిలో నేరాలకు పాల్పడ్డ వ్యక్తి నిందితుడు. హత్యలకు వివాహేతర సంబంధమే కారణం. నిందితుడు ప్రసన్న కుమార్ మిస్రాకు యోగి బాబు దంపతులతో కొన్ని ఏళ్లుగా పరిచయం. మిశ్రా భార్యకు లక్ష్మితో స్నేహం ఉంది. కోవిడ్ సమయంలో మిశ్రా భార్య మృతి చెందింది. అనంతరం లక్ష్మితో సాన్నిహిత్యం ఏర్పరుచుకున్నాడు మిశ్రా.నిందితుడు ఒరిస్సా రాష్ట్రం పూరీకి చెందినవాడు. 2012 లో దుబాయిలో ఓ జ్యువెలరీ షాప్ లో పని చేస్తూ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు మిశ్రా. 5 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి ఇండియాకు తిరిగి వచ్చాడు. ఐదు లక్షల రూపాయల అప్పు తీర్చుటకు ఈ ఘాతుకానికి పాల్పడ్డ నిందితుడు. అంతర్జాతీయ స్థాయిలో నేరాలకు పాల్పడ్డ వ్యక్తి నిందితుడులక్ష్మి మృతదేహం నుండి 4.5 తులాల బంగార ఆభరణాలు, స్కూటీ దొంగలించాడు నిందితుడు. దొంగలించిన సొత్తును పూరీలో అమ్మి సొమ్ము చేసుకొన్న నిందితుడు. నిందితుడు వద్ద నుండి నాలుగు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేసు చేదించడానికి పది బృందాలు నియమించాం’ అని సీపీ తెలిపారు. -
భీమవరంలో సైకో హల్చల్
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: భీమవరంలో సైకో ప్రజలను భయాందోళనలకు గురి చేశాడు. తన కూడా తెచ్చుకున్న కత్తితోనే తన శరీరాన్ని కోసుకున్న సైకో వీరంగం సృష్టించాడు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతిచెందాడు. ఉండి గ్రామంలోని పేదపేటకు చెందిన గాతల క్రాంతికుమార్‌గా పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు.మరో ఘటనలో.. అన్న కొడుకుపై కత్తితో దాడిమరో ఘటనలో ఇంట్లో ఫ్యాన్ ఏర్పాటుపై వివాదం ఏర్పడి అన్న కొడుకుపై చిన్నాన దాడి చేసిన సంఘటన పరిమెళ్లలో చోటు చేసుకొంది. పెంటపాడు ఎస్సై కె.స్వామి తెలిపిన వివరాల ప్రకారం పరిమెళ్లకు చెందిన అన్నదమ్ములు వెన్నపు రాంబాబు, తన అన్న వెన్నపు రామకృష్ణలు రెండు పోర్షన్ల ఇంట్లో ఉంటున్నారు. బుధవారం రాంబాబు తన ఇంట్లో సీలింగ్ ప్యాన్ బిగించుకుంటున్నాడు. ఈ విషయంపై అన్న కొడుకైన నాగరాజుతో వాగ్వాదం జరిగింది. రాత్రి మళ్లీ ఘర్షణ పడగా.. చాకుతో నాగరాజుపై రాంబాబు దాడికి చేశాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
బిర్యానీ తిని భార్యా మృతి.. భర్త పరిస్థితి విషమం
రాజేంద్రనగర్(హైదరాబాద్): ఫుడ్ పాయిజన్‌తో తన సోదరి మృతి చెందిందని రాజేంద్రనగర్ పోలీసులకు ఓ మహిళ శుక్రవారం ఉదయం ఫిర్యాదు చేసింది. పోలీసుల సమాచారం మేరకు... ఎర్రబోడ ప్రాంతానికి చెందిన రమేశ్(48), రాజేశ్వరి(38)లు భార్యాభర్తలు. రమేశ్ బాలానగర్‌లోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చే సమయంలో బాలానగర్‌లోని ఓ రెస్టారెంట్ నుంచి బిర్యానీ తీసుకొచ్చి అదే రోజు రాత్రి భుజించి నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజాము నుంచి వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందారు. గురువారం రాజేశ్వరి మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. రమేశ్ సైతం అనారోగ్యంతో ఉండటంతో ఉప్పర్‌పల్లిలోని ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ ఫాయిజన్ కారణంగా తన సోదరి మృతి చెందిన రాజేశ్వరి అక్క శుక్రవారం ఉదయం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
వైన్ షాపు పర్మిట్‌రూమ్‌లో గొడవ.. యువకుడి మృతి
మూసాపేట(హైదరాబాద్): వైన్ షాపు పర్మిట్ రూములో జరిగిన చిన్నపాటి గొడవ ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గాజులరామారానికి చెందిన ఆకుల ధనుష్ గౌడ్ (20) ఓ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పరీక్షలు ముగియటంతో ఏప్రిల్ 5న తన స్నేహితులు అభినవ్ గౌడ్ (22), నాగిరెడ్డి(21)లతో కూకట్‌పల్లిలోని దారువాలా వైన్ షాపులో మద్యం తాగడానికి వెళ్లారు. కావటి కేశవ్ (25) మూసాపేటలో ఉంటూ బ్లింకిట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కావటి కేశవ్ కూడా తన స్నేహితులతో పర్మిట్‌రూమ్‌లో మద్యం తాగుతున్నారు. అతడిని కొంచెం పక్కకు జరగాలని ధనుష్ గౌడ్ స్నేహితులు కోరారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి తారస్థాయికి వెళ్లింది. కావటి కేశవ్ ధనుష్ గౌడ్, అతని స్నేహితులను పిడిగుద్దులు గుద్దాడు. ధనుష్గౌడ్కు కడుపులో బలంగా తగలటంతో అక్కడి నుంచి బయటకు వెళ్లారు. మరుసటి రోజు ఉదయం కడుపు నొప్పిగా ఉందంటూ వాళ్ల అమ్మకు చెప్పటంతో వెంటనే కేపీహెచ్‌బీ కాలనీలోని రెమెడీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అత్యవసర చికిత్స నిమిత్తం నిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పెద్ద పేగు పగిలి ఇన్ఫెక్షన్ అయ్యిందని వైద్యులు తెలిపారు. సర్జరీ చేయగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా కావటి కేశవ్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. -
నాన్న చూపునకూ నోచుకోకుండానే..!
నిర్మల్/పెంబి: ‘నాన్న.. నువ్వేం ఫికర్ చేయకు. ఇటేం మనసు పెట్టుకోకు. అమ్మా మేము మంచిగనే ఉన్నం. మంచిగ చదువుకుంటున్నం. నువ్వు జాగ్రత్తగా ఉండు. తొందరలనే మనకు మంచి రోజులు వస్తయ్..’ అంటూ నిత్యం తమ తండ్రి మనసులో ఆశలు వెలిగించే ఆ ‘దీపాలు’ అవి నెరవేరకముందే అర్ధంతరంగా ఆరిపోయాయి. తన బిడ్డల చివరిచూపు కోసం ఆ తండ్రి దేశంకాని దేశంలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. రెక్కల కష్టంతో పెంచుకున్న బిడ్డలిద్దరూ అసువులు బాయడంతో ఆ తల్లి గుండె చెరువైంది. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ సమీపంలో ఎన్‌హెచ్ 44పై శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో నిర్మల్ జిల్లా పెంబి మండలం లోతొర్యతండాకు చెందిన అక్కాచెల్లెళ్లు అశ్విని(21), మంజుల(17) మృతిచెందారు. మారుమూల తండా నుంచి..గ్రామస్తులు, జక్రాన్‌పల్లి ఎస్సై ఎండీ మాలిక్ రహమాన్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమైన పెంబి మండలం లోతొర్య తండాలో మట్టిగోడలతో రేకుల ఇంట్లో ఉంటున్న బానావత్ సుగుణ, రెడ్డి దంపతులకు ముగ్గురు కూతుళ్లు కుమార్తెలు అశ్విని, మంజుల, నిహారికలతోపాటు కుమారుడు ఆకాశ్ ఉన్నారు. అందరూ చదువుకుంటున్నారు. ఎకరం భూమి మాత్రమే ఉండటంతో రోజువారీ వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. స్థానికంగా సరైన ఉపాధి లేకపోవడంతో మూడేళ్లక్రితం బానావత్ రెడ్డి దుబాయి వెళ్లాడు.ఎలాగైనా చదవాలని..తమకోసం తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూస్తూ పెరిగిన పిల్లలు బాగా చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెద్దకూతురు అశ్విని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇటీవల ఫైనలియర్ పూర్తిచేసింది. రెండోకూతురు మంజుల ఇచ్చోడలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసింది. మంజులకు ఈఏపీ ఎంట్రన్స్ టెస్ట్ ఉండటంతో అక్క అశ్విని సమీప బంధువు జాదవ్ హంసరాజుతో కలిసి గురువారం కారులో హైదరాబాద్ వెళ్లారు. అక్కడ పరీక్ష రాసి, శుక్రవారం తండాకు తిరిగి వస్తుండగా నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కాచెలెళ్లు అక్కడే చనిపోగా, బంధువు జాదవ్ హంసరాజు కాలు, చేయి విరిగాయి. అతడిని ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు.చివరిచూపునకూ నోచుకోలేక..మూడేళ్లక్రితం దుబాయి వెళ్లిన బాణావత్ రెడ్డి ఏడాదిపాటు ఓ కంపెనీలో పనిచేశాడు. ఆ ఏడాది పనిచేసినా కంపెనీ ఆయనకు డబ్బులు ఇవ్వలేదు. మోసపోయానని తెలుసుకున్న రెడ్డి బయటకు వచ్చి కలివెల్లి వీసాపై చిన్నచితకా పనులు చేసుకుంటున్నాడు. ఏడాదికాలంగా ఖర్చుల కోసం భార్య సుగుణనే ఇక్కడి నుంచి డబ్బులను పంపిస్తోంది. ప్రస్తుతం ఆయన స్వదేశానికి తిరిగి రావడానికీ డబ్బులు లేవు. తన కన్నబిడ్డలను చివరిచూపు కూడా చూడలేని దయనీయ పరిస్థితి. కనీసం విమాన చార్జీలకు డబ్బులు ఇస్తే.. తన బిడ్డల చివరిచూపైనా చూస్తానంటూ రెడ్డి విలపిస్తున్నాడు. -
భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. భార్య, ప్రియుడు సన్నిహితంగా ఉండగా చూసిన భర్త ఆగ్రహం పట్టలేక ఇద్దరినీ హతమార్చాడు. ఈ దారుణం కలబుర్గి జిల్లా ఆళంద తాలూకా మాదనహిప్పరగా గ్రామంలో చోటుచేసుకుంది. సృష్టి (22), ఖాజప్ప(23) హత్యకు గురైన వారు. శ్రీమంత నిందితుడు. శ్రీమంత, సృష్టి భార్యాభర్తలు. వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఆమెకు ఖాజప్పతో అనైతిక బంధం ఉన్నట్లు సమాచారం. శ్రీమంత గురువారం పని మీద పక్క ఊరికి వెళ్లి తిరిగి వచ్చాడు, ఈ సమయంలో ఇంట్లో బెడ్రూంలో సృష్టి, ఖాజప్ప కలిసి కనిపించడంతో శ్రీమంత కొడవలితో నరికి ఇద్దరినీ హత్య చేశాడు. తరువాత పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. హిప్పరగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వంట బాగా లేదని భార్య హత్య దొడ్డబళ్లాపురం: వంటను రుచిగా వండలేదని భార్యను భర్త హత్య చేసిన సంఘటన బాగలకోట జిల్లా ముధోళ తాలూకా ముగలఖోడ గ్రామంలో జరిగింది. భీరప్ప పూజారి అనే వ్యక్తి, భార్య సాక్షిత (27) ను గొంతు పిసికి హత్య చేశాడు. గురువారం రాత్రి సాక్షిత వండిన వంట బాగాలేదని, సాంబారు అసలు రుచిగా లేదని గొడవ చేశాడు. సాక్షిత కూడా ఎదురు తిరగడంతో పట్టలేని కోపంతో ఆమెను గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. ముధోళ పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. -
విద్యుత్ తీగకు కేబుల్ వైరు తగిలి సాఫ్ట్వేర్ ఉద్యోగిని..
మర్రిపాలెం(విశాఖపట్నం): విద్యుత్ షాక్‌కు గురై ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని దుర్మరణం పాలైంది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి మురళీనగర్‌లోని అయ్యప్పనగర్‌లో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జి.వి.పద్మావతి (29) తన భర్త అజయ్‌తో కలిసి అయ్యప్పనగర్‌లో నివాసముంటున్నారు. ఆమె నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ, ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. రెండవ అంతస్తులో నివాసం ఉంటున్న వీరు పాల ప్యాకెట్లను కింద సెల్లార్ నుంచి తెచ్చుకోవడానికి ప్లాస్టిక్ డబ్బాకు కేబుల్ వైరు కట్టి ఉపయోగిస్తున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో పద్మావతి ఎప్పటిలాగే రెండవ అంతస్తు నుంచి కేబుల్ వైర్ సహాయంతో సెల్లార్‌లోని పాల ప్యాకెట్లను తీసుకుంటున్నారు. అయితే గురువారం రాత్రి కురిసిన వర్షం కారణంగా కేబుల్ వైరు విద్యుత్ తీగలకు తగిలింది. ఇది గమనించని పద్మావతి విద్యుత్ షాక్‌కు గురైన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. భర్త అజయ్ వెంటనే కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ షేక్ సమీర్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కూర్మన్నపాలేనికి చెందిన పద్మావతికి నాలుగేళ్ల కిందట అజయ్‌తో వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. అజయ్ మిలటరీ ఇంజినీరింగ్ సరీ్వస్ (ఎంఈసీ)లో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. -
ఐదు ఫుల్ బాటిళ్లు కచ్చా తాగేసి.. విషాదం నింపిన పందెం
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అనే చెప్పే వైద్యులు.. పరిమితంగా తాగాలంటూ మరోవైపు సూచించడం ఆశ్చర్యం కలిగించేదే!. అయితే.. డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం ప్రపంచంలో ఏడాదిలో నమోదు అయ్యే మరణాల్లో 4.7 శాతం మరణాలు మద్యానికి సంబంధించినవే ఉంటున్నాయట. ఏడాదికి సుమారు 26 లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇదిలా ఉంటే..కర్ణాటకలోని కోలార్ జిల్లా ములబాగిల్‌లో ఘోరం జరిగింది. స్నేహితులతో రూ.10 వేల కోసం పందెం కాసిన ఓ యువకుడు 5 ఫుల్ బాటిళ్ల లిక్కర్‌ను.. అదీ నీరు కలపకుండా(కచ్చాగా) గడగడా తాగేశాడు. ఆపై తీవ్ర అస్వస్థతకు గురికాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్నేహితులతో సిట్టింగ్ వేసిన టైంలో తాను ఐదు సీసాల మద్యాన్ని నీరు కలపకుండా తాగగలనని కార్తీక్ (21) అనే యువకుడు సవాల్ విసిరాడు. దానికి స్పందించిన స్నేహితులు.. అలా తాగితే రూ. 10 వేలు ఇస్తానని పందెం కాశారు. దీంతో.. కార్తీక్ ఐదు బాటిళ్ల మద్యాన్ని నీరు కలపకుండా గడగడా తాగేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని ములబాగిల్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కార్తీక్ ప్రాణాలు కోల్పోయాడు. కార్తీక్‌కు ఏడాది క్రితమే వివాహమైంది. అతడి భార్య ఎనిమిది రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ ఘటనపై సమాచారం అందుకున్న నాన్‌గలి పోలీసులు కార్తీక్ స్నేహితులు వెంకటరెడ్డి, సుబ్రమణి సహా ఆరుగురిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. -
భూమికపై విచక్షణా రహితంగా దాడి చేసిన భర్త
గుడివాడరూరల్: అనుమానం పెనుభూతమై భార్యపై కత్తితో భర్త విచక్షణా రహితంగా దాడి చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన మట్టా అశోక్, భూమికలకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న అశోక్ చెడు అలవాట్లకు బానిసై తరచూ అనుమానంతో భార్యను వేధిస్తుండేవాడు. ఇటీవల జరిగిన గొడవతో భార్య భూమిక పిల్లలను తీసుకుని సమీపంలో నివాసముంటున్న తల్లి రాణి ఇంటికి వెళ్లింది. ఈక్రమంలో మంగళవారం తన బట్టలు తీసుకునేందుకు చెల్లి అనుష్కతో కలిసి భర్త అశోక్ ఇంటికి వెళ్లిన భూమికపై భర్త కత్తితో విచక్షణా రహితంగా మొఖంపై దాడి చేసి పొట్టలో పొడిచాడు. అడ్డుకోబోయిన చెల్లిపై కూడా దాడి చేయడంతో ఆమె చేతికి తీవ్ర గాయమైంది. అనంతరం అశోక్ పరారయ్యాడు. గాయపడిన వారు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి వారిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. భూమిక పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సేవల నిమిత్తం విజయవాడ తరలించారు. బాధితురాలి తల్లి రాణి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ వి.దీరజ్ వినీల్, స్థానిక పోలీస్ అధికారులతో కలిసి గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చి ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఇందిరానగర్ కాలనీలోని సంఘటనా స్థలానికి డీఎస్పీ వెళ్లి పరిశీలించారు. -
థాయ్‌లాండ్‌లో హ్యాండ్లర్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు మంగళవారం అరెస్టు చేసిన అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఈ దందాలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ థాయ్‌లాండ్‌లో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. హవాలా నెట్వర్క్ మీద దృష్టి పెట్టిన పోలీసులు సహకరించిన వారి కోసం ఆరా తీస్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీíÙయల్ రిమాండ్‌లో ఉన్న అభిష్ క్, హర్షవర్థన్, ధావల్, రాహుల్‌లను పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి అనుమతి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఓజీ కుష్ పండించేదీ అతడేనా..? ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్, మారువానా, హైడ్రాపోనిక్ గాంజా, ఓజీ కుష్ ఇలా వివిధ పేర్లతో పిలిచే గంజాయితో పాటు మ్యాజిక్ మష్రూమ్స్‌ను ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ సరఫరా చేస్తున్నాడు. ఈ గంజాయి థాయ్లాండ్లోనే ఎక్కువగా పండుతుంది. జబల్పూర్కు చెందిన హర్షవర్థన్‌కు ఓడల ద్వారా చేరింది కూడా థాయ్‌లాండ్ నుంచే. దీన్నిబట్టి ఈ ఓజీ కుష్‌ను హ్యాండ్లరే పండించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నుంచి ఈ ఓజీ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి అవుతోంది. హైడ్రోఫోనిక్ టెక్నిక్ విధానంలో కృత్రిమ కాంతితో పండిస్తుంటారు. ఆన్లైన్లో విత్తనాలు ఖరీదు చేసి, ఎల్ఈడీ లైట్లను ఉపయోగించి గంజాయి మొక్కలను పెంచుతారు. ఏమాత్రం మట్టితో అవసరం లేకుండా ప్రత్యేకంగా తయారు చేసిన కుండీలు, ట్రేల్లో ఇసుక, కంకర లేదా నీటిలో అదనపు పోషకాలతో ఉపయోగించి సాగు చేస్తుంటారు. కొందరు మాత్రం కొబ్బరి పొట్టు నారలు, గులకరాళ్లు కూడా వాడతారు. నేలమీద పండే గంజాయి కంటే ఈ ఓజీ నాణ్యత ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు. ఈ మొక్కలు ఓపెన్–రూట్ వ్యవస్థ ద్వారా పోషకాలు, ఆక్సిజన్‌ను నేరుగా తీసుకోవడమే దీనికి కారణం. వ్యవస్థీకృతంగా సాగుతున్న వ్యాపారం... ఈ డ్రగ్స్ క్రమవిక్రయాల దందా మొత్తం పక్కా వ్యవస్థీకృతంగా సాగుతోందని పోలీసులు చెప్తున్నారు. ఎన్‌క్రిపె్టడ్ యాప్స్ ద్వారా ఇండియా నుంచి తనకు వచ్చిన ఆర్డర్ల విషయాన్ని ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ ఆయా యాప్స్ ద్వారానే హర్షవర్థన్‌కు చేరవేస్తాడు. ఇతడు జబల్పూర్లో ఉన్న హవాలా ఏజెంట్‌కు ఆ కస్టమర్ వివరాలు పంపిస్తాడు. అతగాడు సదరు కస్టమర్ నివసించే ప్రాంతానికి చెందిన మరో హవాలా ఏజెంట్‌కు ఇవి అందిస్తాడు. ఆ వినియోగదారుడిని సంప్రదించే ఈ ఏజెంట్ డబ్బు ముట్టిన తర్వాత జబల్పూర్ ఏజెంట్‌కు బదిలీ చేస్తాడు. అతడి ద్వారా విషయం తెలుసుకునే హర్షవర్థన్ విషయాన్ని ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’కు చెప్తాడు. ఔన్స్ (28.34 గ్రాములు) డ్రగ్‌కు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు క్రిప్టో కరెన్సీ రూపంలో అతడికి పంపిస్తాడు. ఆపై డ్రగ్ హ్యాండ్లర్ నుంచి హర్షవర్థన్‌కు వచి్చ... అక్కడ నుంచి డీటీడీసీ, శ్రీ తిరుపతి, శ్రీ ఆంజనేయులు కొరియర్స్‌లో కస్టమర్‌కు చేరుతుంది. హర్షవర్థన్ కూడా పోలీసుల నిఘాకు చిక్కకుండా ఈ పార్శిల్ బుక్ చేస్తున్నాడు. అక్కడ కస్టమర్ చిరునామా, ఫోన్ నెంబర్ తప్పుగా ఇస్తాడు. దాని ట్రాకింగ్ ఐడీని వినియోగదారుడికి పంపిస్తాడు. దీని ద్వారా ట్రాక్ చేసే కస్టమర్ ఆ పార్శిల్ కొరియర్ ఆఫీసుకు చేరిందని గుర్తించిన వెంటనే అక్కడకు వెళ్లి తీసుకుంటారు. ఈ హవాలా, కొరియర్ నెట్వర్క్ పైనా హెచ్–న్యూ దృష్టి పెట్టింది. ఈ ముఠాలో కీలక పెడ్లర్‌గా ఉన్న హర్షవర్థన్‌కు చెందిన క్రిప్టో వాలెట్లో రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువైన బిట్కాయిన్లు డిపాజిట్ అవుతున్నట్లు గుర్తించామని అధికారులు చెప్తున్నారు. -
ఫ్రెండ్‌కి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెళ్తూ..
మక్కువ(విజయనగరం): మండలంలోని తూరుమామిడి గ్రామానికి చెందిన నూకమ్మ అలియాస్ ఉమ మంగళవారం తమ ఇంట్లో జరిగిన శుభ కార్యక్రమానికి తనతోపాటు డిగ్రీ చదువుతున్న ఫ్రెండ్స్‌ను ఆహ్వానించింది. స్నేహితులంతా కలిసి మంగళవారం ఆటపాటల్లో మునిగితేలారు. బుధవారం తన ఫ్రెండ్ షర్మిలకు సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై మక్కువ వెళ్తుండగా టాక్టర్ రూపంలో మత్యువు నూకమ్మను కబళించింది. అంతవరకు గ్రామంలో అందరితో కలివిడిగా ఉండి, ఫ్రెండ్‌ను మక్కువలో డ్రాప్ చేసి వస్తానని చెప్పి, తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిందంటూ గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. తూరుమామిడి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థినికురసాన నూకమ్మ అలియాస్ ఉమ(20) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై హెడ్ కానిస్టేబుల్ ఎస్. శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నూకమ్మ తన ఫ్రెండ్ షర్మిలకు సెండాఫ్ ఇచ్చేందుకు గ్రామం నుంచి మక్కువకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, మార్గమధ్యంలోని శాంతేశ్వరం గ్రామం సమీపంలో ఎదురుగా ట్రాక్టర్ మితిమీరిన వేగంతో వచ్చింది. టాక్టర్ను తప్పించే ప్రయత్నంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోవడంతో నూకమ్మ తలపై నుంచి ట్రాక్టర్ టైర్ వెళ్లగా అక్కడికక్కడే మృతిచెందింది. నూకమ్మ బొబ్బిలిలోని ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. తండ్రి జనార్దనరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సాలూరు ఆస్పత్రికి తరలించారు. -
నెల్లూరులో కారు బీభత్సం.. ఆరుగురి దుర్మరణం
నెల్లూరు, సాక్షి: కారు బీభత్సంతో బుధవారం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్లోకి కారు దూసుకెళ్లి ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కొవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతులంతా నారాయణ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్‌గా తెలుస్తోంది. పోతిరెడ్డిపాలెం వద్ద కారు బీభత్సం ఘటనలో మృతులు మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న నరేష్, అభిషేక్, జీవన్, యగ్నేష్, అభిసాయిలుగా పోలీసులు ప్రకటించారు. గాయపడిన నవనీత్ అనే విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక.. ఈ దుర్ఘటనలో షాప్‌లో ఉన్న రమణయ్య సైతం మృతి చెందాడు. బుచ్చిరెడ్డిపాలెం లో ఓ నిశ్చితార్థ వేడుకకు హాజరై కారులో విద్యార్థులు తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి హోటల్లోకి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నా బిడ్డకు న్యాయం చేయండి
ఆదోని అర్బన్(కర్నూలు): డీఎస్పీ, సీఐ కారణంగా తన బిడ్డ జీవితం అన్యాయమైపోయిందని ఓ యువతి తండ్రి ఆవేదన చెందుతున్నాడు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణంలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో నివాసముంటున్న యువతి, కౌతాళం మండలం కామవరానికి చెందిన యువకుడు వీరేష్ ప్రేమించుకున్నారు. గతేడాది డిసెంబర్ 1వ తేదీన పెద్దలకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు కానీ.. యువకుడు తన తల్లిదండ్రుల బలవంతంతో మరో యువతితో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న యువతి తండ్రి గత నెల 19న ఆదోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీఐ శ్రీరామ్ ఆ యువకుడిని పిలిపించి అడగగా, రెండో పెళ్లి చేసుకోవడం లేదని, ఒక నెల గడువు కోరి లలితను తీసుకెళ్తానని చెప్పాడు.ఇంతలోనే ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిసి యువకుడిని నిలదీయడంతో యువతి కుటుంబీకులపై దాడి చేశారు. ఈ మేరకు బాధిత యువతి తండ్రి ఆదోని డీఎస్పీకి ఈనెల 21న ఫిర్యాదు చేశాడు. అయితే ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగానే.. కామవరం వీరేష్ ఈనెల 25న రెండో పెళ్లి చేసుకున్నాడని, పోలీసులు డబ్బులు తీసుకుని తమ కేసును తారుమారు చేశారని ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై డీఎస్పీ హేమలతను వివరణ కోరగా.. యువకుడితో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశామని, కేసు దర్యాప్తులో ఉందన్నారు. -
కొడుకు మృతదేహంతో మూడురోజులు
మంచిర్యాల క్రైం: మతిస్థిమితం కోల్పోయిన ఒక తండ్రి.. చనిపోయిన కుమారుడి శవం పక్కనే మూడు రోజుల పాటు ఉన్న ఘటన వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్‌రోడ్‌లో జరిగిన ఈ ఘటనపై స్థానికులు, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాలివి. గూడెల్లి వెంకట్‌రెడ్డి అశోక్‌రోడ్డులో నివసిస్తున్నారు.ఈయనకు కుమారుడు లక్ష్మీనారాయణ ఉన్నాడు. వెంకట్‌రెడ్డి సింగరేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. మూడేళ్ల క్రితం భార్య రాధమ్మ అనారోగ్యంతో చనిపోయాక వెంకట్‌రెడ్డి మతిస్థిమితం కోల్పోయారు. తండ్రీకొడుకులు ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. ఎస్టీపీపీలో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తున్న కొడుకు లక్ష్మీనారాయణ.. తండ్రి బాగోగులు చూసుకునేవారు. ఇటీవల మద్యానికి బానిసైన లక్ష్మీనారాయణ.. ఆదివారం కూడా తాగి ఇంట్లోని సోఫాలో పడుకున్నారు. అప్పటి నుంచి బయటకు రాలేదు. మంగళవారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా.. సోఫాలో లక్ష్మీనారాయణ (30) శవమై కనిపించాడు. మరోవైపు వెంకట్‌రెడ్డి అచేతన స్థితిలో పడుకుని ఉన్నాడు. ‘నీ కొడుక్కి ఏమైంది..’ అని ప్రశ్నిస్తే.. ‘పడుకున్నాడు’.. అంటూ సమాధానం చెప్పారు. పోలీసులు లక్ష్మీనారాయణ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వెంకట్‌రెడ్డిని వైద్యం నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. వెంకట్‌రెడ్డి బంధువు గూడెల్లి శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
ఆడుకుంటూ వెళ్లి అసువులు బాసింది
చైతన్యపురి(హైదరాబాద్): ఇంటి పక్క నుంచి ఆడుకుంటూ వెళ్లిన ఆరేళ్ల బాలిక ప్రమాదవశాత్తు చెరువు నీళ్లలో పడి మృతి చెందిన ఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన పాలకుర్తి శ్రీను, శ్రావణి దంపతులు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి కూలిపనులు చేసుకుంటూ గ్రీన్‌పార్కు కాలనీ రోడ్‌నం.14లో నివసిస్తున్నారు. వీరికి నలుగురు కూతుళ్లు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో తల్లిదండ్రులు పక్కింటివారితో మాట్లాడుతుండగా రెండో కూతురు అభిత (6) ఆడుకుంటోంది. కొద్ది సేపటి తర్వాత తర్వాత చూడగా అభిత కనిపించలేదు. ఎక్కడ వెతికినా జాడ తెలియకపోవటంతో రాత్రి సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు అభిత మృతదేహం చెరువు నీటిలో తేలుతూ కనిపించింది. ఇంటి సమీపంలోనే చెరువు ఉండటంతో బాలిక ఆడుకుంటూ వెళ్లి అందులో పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తమ ఆరేళ్ల కూతురు మృతి చెందడంతో శ్రీను, శ్రావణి దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఇద్దరిని బలిగొన్న అతివేగం
బిట్రగుంట(నెల్లూరు): అతి వేగం ఇద్దరు స్నేహితుల ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన కొడవలూరు మండలం నార్తురాజుపాళెం సమీపంలో ఆంజనేయస్వామి గుడి వద్ద హైవేపై సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. బోగోలు పంచాయతీ బేతనీయపేటకు చెందిన షేక్ మన్సూర్‌బాషా (26), విశ్వనాథరావుపేట రామస్వామిపాళెంకు చెందిన బత్తుల ప్రవీణ్‌కుమార్ (26) చిన్ననాటి నుంచి స్నేహితులు. మన్సూర్‌కు వివాహమై రెండేళ్ల కుమారుడు ఉండగా, ప్రవీణ్‌కుమార్ అ వివాహితుడు. మన్సూర్ బిట్రగుంటలోనే వాహనాలకు నేమ్ బోర్డులు, స్టిక్కర్లు వేసే షాపు నిర్వహిస్తున్నాడు. ప్రవీణ్‌కుమార్ గౌరవరం టోల్‌ప్లాజా వద్ద పని చేస్తున్నాడు. స్నేహితులిద్దరూ పనిమీద సోమవారం నెల్లూరు వెళ్లారు. రాత్రి సుమారు 11.30 గంటల తర్వాత బైక్‌పై ఇంటికి బయలు దేరారు. బాగా ఆలస్యం కావడంతో త్వరగా ఇంటికి చేరుకొందామని బైక్‌ను వేగంగా నడుపుకొంటూ వచ్చారు. 12 గంటల ప్రాంతంలో నార్తురాజుపాళెం ఆంజనేయస్వామి గుడి వద్ద ఆగి ఉన్న లారీని అదే వేగంతో వెనుక వైపు ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న స్నేహితులు మన్సూర్, ప్రవీణ్‌కుమార్ అక్కడకక్కడే మృతి చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఏఎస్సై గంధం ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. -
వివాహేతర సంబంధం.. భార్య కళ్లెదుటే ప్రియుడ్ని..
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో సోమవారం పొలం కుమార్‌ను హతమార్చిన కేసులో నిందితులు వేల్పుల సంతోష్, వేల్పుల శైలజను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. విలేకరుల సమావేశంలో వివరాలను ఏసీపీ గజ్జి కృష్ణ వెల్లడించారు. కొన్నిరోజులుగా కుమార్‌తో శైలజ సన్నిహితంగా ఉండడాన్ని చూసి వివాహేతర ఉందని సంతోష్ అనుమానించాడు. పద్ధతి మార్చుకోవాలని శైలజను మందలించాడు. అయితే తన వెంటపడుతూ ఇబ్బంది పెడుతున్నాడని ఆమె చెప్పడంతో కుమార్‌పై సంతోష్ కోపం పెంచుకున్నాడు. అయితే బంధువుల వద్ద శైలజతో సంబంధం ఉందని కుమార్ చెబుతున్నాడు. శైలజకు కూడా ఫోన్లు చేస్తుండడంతో కుమార్‌ను చంపాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈక్రమంలో సోమవారం మాట్లాడుకుందాం రమ్మని కుమార్‌కు ఫోన్‌చేసి చెప్పడంతో వ్యవసాయమార్కెట్‌కు కారులో చేరుకున్నాడు. ఈలోగా పెద్దపల్లికి వచ్చిన సంతోష్.. జెండా వద్ద ఓ కత్తిని కొనుగోలు చేసి భార్య శైలజకు కుమార్‌ను చంపుదామనే విషయాన్ని చెప్పాడు. శైలజ దొంగతుర్తి నుంచి బస్సులో పెద్దపల్లికి చేరుకోగా.. ఆమెను బైక్‌పై తీసుకుని మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు కుమార్, సంతోష్ గొడవపడ్డారు. ఆ సమయంలోనే తన వద్ద ఉన్న కత్తి తీసి మెడ, చాతి, ముఖంపై పొడిచి చంపారు. కుమార్ చనిపోయాడని నిర్ధారించుకుని నిందితులు పరారయ్యారు. ఈమేరకు నిందితులైన భార్యాభర్తలు సంతోష్, శైలజు దొంగతుర్తిలో ఉన్నారనే సమాచారంతో అక్కడకు వెళ్లి పోలీసులు అరెస్టు చేశారు. సమావేశంలో సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై మల్లేశ్ పాల్గొన్నారు.వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..! -
టీడీపీ మెడకు...వీరముడి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, తెలుగుదేశం పార్టీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన అనుమానితులుగా అదే పారీ్టకి చెందిన నేతలు, సానుభూతిపరుల పేర్లు వినిపిస్తుండటం అధికార టీడీపీని కలవరపెడుతోంది. హత్యలో పాల్గొన్నది, మొదలు వ్యూహరచన చేసింది అందరూ ఆ పార్టీ వారేనని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇది తమ పార్టీకి ఎక్కడ చెడ్డపేరు తెస్తుందోనన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది. హత్యకు గురైన వీరయ్య చౌదరి, పోలీసుల అదుపులో ఉన్న ప్రధాన అనుమానితుడికి తెలుగుదేశం పార్టీ అధినాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నెల 22వ తేదీ రాత్రి 7.30 గంటలకు నగరంలోని ఎస్పీ కార్యాలయానికి, తాలూకా పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జాతీయ రహదారి పక్కనున్న భవనంలో వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యాడు. ముసుగులు ధరించిన నలుగురు యువకులు కేవలం మూడు నిముషాల్లోనే ఆయన శరీరంలోకి 53 కత్తి పోట్లు పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. హత్య జరిగిన రాత్రే హోం మంత్రి అనిత ఒంగోలు చేరుకున్నారు. మరుసటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా అమ్మనబ్రోలు చేరుకుని వీరయ్య చౌదరికి నివాళులర్పించారు. ఇంత దారుణానికి పాల్పడిన హంతకులు భూమి మీద ఉండడానికి అనర్హులని ప్రకటించారు. నిందితులు ఎంతటి వారైనా వదిలి పెట్టేదిలేదని హెచ్చరించారు. దీంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో గత శుక్రవారం చీమకుర్తి బైపాస్ వద్ద జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఒక దాబా సమీపంలో హంతకులు వినియోగించిన స్కూటీ లభించింది. దీంతో ఈ కేసులో పోలీసులకు కీలక ఆధారం లభించినట్లయింది. కేసు కీలక మలుపు తిరిగింది. స్కూటీ ఆధారంగా చేసిన విచారణలో వీరయ్య చౌదరి హత్య కేసులో అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన టీడీపీ యువనేత ప్రధాన నిందితుడిగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్కూటీ స్వా«దీనంతో లభించిన ఆధారాలతో నగరానికి చెందిన కొప్పోలు వాసి ప్రధాన పాత్రధారిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అలాగే రెండో వాహనాన్ని కూడా స్వా«దీనం చేసుకోవడంతో హత్యలో పాల్గొన్న మిగిలిన ముగ్గురూ జిల్లా వాసులుగానే గుర్తించారు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. జిల్లా టీడీపీ నేతల్లో కలకలం... వీరయ్య హత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా పోలీసులు అదుపులో ఉన్న టీడీపీ యువనేతకు ఆ పారీ్టలోని ముఖ్య నాయకులందరితోనూ సన్నిహిత సంబంధాలున్నాయని తెలుస్తోంది. స్థానిక నాయకులతో పాటు జిల్లాకు చెందిన కీలక ఎమ్మెల్యేలు, మంత్రులతో సదరు వ్యక్తి అత్యంత సన్నిహితుడిగా మెలిగేవాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడా నాయకులు తేలుకుట్టిన దొంగల్లా మౌనం పాటిస్తున్నారు. ఏం మాట్లాడితే ఏమవుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు. ఈ కేసు ఎటుపోయి ఎటు వస్తుందో, చివరికి ఎవరి తలకు చుట్టుకుంటుందోనని కలత చెందుతున్నారు. అలాగే ప్రచారంలో ఉన్న హవాలా వ్యాపారికి, రేషన్ బియ్యం డాన్‌కు సైతం టీడీపీ నేతలతో మంచి సంబంధాలున్నాయని ప్రచారం. అలాగే హత్యలో పాల్గొన్న ప్రధాన అనుమానితుడికి సైతం ఆ పారీ్టతో లింకులున్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులను ఇరుకున పెడుతోంది.వీరయ్య కేసును ఏం చేస్తారు... వీరయ్య చౌదరి అంత్యక్రియలకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిందితులు భూమి మీద ఉండేందుకు అర్హులు కారని చెప్పడం, నిందితులు ఎంతటి వారైనా ఒదిలిపెట్టేది లేదనడంతో ఈ కేసు గురించి ప్రజలు అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు. హత్యకు గురైన వీరయ్య చౌదరి టీడీపీకి చెందిన నాయకుడు కావడం, హత్యలో ప్రధాన అనుమానితుడిగా పోలీస్ కస్టడీలో ఉన్న యువనేత కూడా టీడీపీకి చెందిన నాయకుడే కావడంతో ఇప్పుడీ కేసును ఏం చేస్తారోనన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నిజంగా సీఎం చంద్రబాబు చెప్పినట్లు నిందితులను కఠినంగా శిక్షిస్తారా? లేక క్రమంగా నీరుగార్చేందుకు ప్రయత్నిస్తారా? అనే అంశాలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న మిగతా వారు కూడా అధికార పారీ్టకి చెందిన సామాజికవర్గానికి చెందిన వారు కావడం, అధికార పార్టీ స్థానిక నాయకులతో, రాష్ట్రంలోని కీలక నాయకులతో రాసుకుని పూసుకుని తిరిగిన వారు కావడంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న చర్చ జరుగుతోంది.డైలమాలో పోలీసులు...వీరయ్య కేసులో పోలీసుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. హత్య జరిగి దాదాపు ఎనిమిది రోజులు కావస్తున్నా ఇంతవరకూ ఒక కొలిక్కి రాలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి హతుడు వీరయ్య చౌదరి చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. మద్యం సిండికేట్, బియ్యం మాఫియా, భూ, ఆర్థిక వివాదాలున్నాయి. అయినా ఆయన టీడీపీ నాయకుడు కావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో సంబంధాలు కలిగి ఉండడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ ఈ కేసు పోలీసులకు పలు సవాళ్లు విసురుతోంది. విచారణలో అనుమానితులంతా టీడీపీ నాయకులే కావడంతో పాటు వారికి జిల్లా టీడీపీ నాయకులతో, మంత్రులతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నట్లు సమాచారం. స్కూటీ లభించిన రోజు టీడీపీ మీడియా చానళ్లలో అధికార పార్టీ నేతల ప్రమేయాన్ని పేర్లతో సహా ప్రసారం చేశారు. అయితే, ఆ తర్వాత ఏమైందో తెలియదు రోజుకో పేరు తెరపైకి వస్తున్నాయి. ఈ కేసు మరకలను ఇతర పారీ్టలకు అంటగట్టేలా ఆ పత్రికల్లో కథనాలు వస్తుండటంతో కేసు పక్కదోవ పడుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల వద్ద నుంచి కూడా పోలీసులకు ఒత్తిడి వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఇలా ఇతర పారీ్టలకు చెందిన వారి పేర్లను ప్రచారంలోకి తెస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
Tirupati: భవనం పైనుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి
తిరుపతి: నగరంలోని మంగళం సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తుడా క్వార్టర్స్‌లో నిర్మాణంలో ఉన్న హెచ్ఐజీ భవనం పైనుంచి కిందపడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మృతులు బోటతొట్టి శ్రీనివాసులు, వసంత్, కె.శ్రీనివాసులుగా గుర్తించారు. -
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
పెద్దపల్లిరూరల్: అక్రమసంబంధం నేపథ్యంలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. తన భార్యతో సన్నిహితంగా మెలగడాన్ని జీర్ణించుకోలేక.. ఈ విషయమై కొంతకాలంగా సదరు యువకుడితో గొడవ జరుగుతున్నా.. అతడిలో మార్పు రాకపోవడం.. తను కాదంటున్న వెంట పడుతున్నాడంటూ భార్య చెప్పడంతో రగిలిపోయిన భర్త.. మాట్లాడుకుందాం రా.. అని పిలిచి కిరాతకంగా చంపేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన పొలం కుమార్(35) తన భార్య అనిత, ముగ్గురు పిల్లలతో పెద్దపల్లిలోనే నివాసముంటూ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అలాగే ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్‌కుమార్‌కు కుమార్ భార్య అనిత పినతల్లి కూతురు శైలజతో పెళ్లయింది. వరసకు మరదలు అయ్యే శైలజతో కుమార్ చనువుగా మెదలుతుండడాన్ని సంతోష్ తట్టుకోలేక పోయాడు. ఈ విషయమై కుమార్‌తో గొడవకు దిగాడు. కొంతకాలంగా గొడవలు జరుగుతున్నా కుమార్ ప్రవర్తనలో తేడా కనిపించలేదు. తన భార్య శైలజను నిలదీయడంతో తను కాదంటున్న వెంటపడుతూ వేధిస్తున్నాడంటూ చెప్పడంతో సంతోష్‌లో కోపం ఉగ్రస్థాయికి చేరింది. ఈక్రమంలో సోమవారం సంతోష్ ‘మాట్లాడుకుందాం రా’ అని కుమార్‌ను పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు పిలిచాడు. మార్కెట్ యార్డు ఆవరణలో తన భార్య, అక్కడున్నవారు చూస్తుండగానే కుమార్‌ను సంతోష్ కత్తితో నరికిచంపాడు. ఘటన స్థలాన్ని డీసీపీ కరుణాకర్, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు లక్ష్మణ్‌రావు, మల్లేశ్ పరిశీలించారు.రమ్మని పిలిచి చంపేశారు..పొలం కుమార్ ఇంట్లో ఉండగా సంతోష్‌కుమార్, శైలజ నుంచి ఫోన్ వచ్చిందని మృతుడి భార్య అనిత తెలిపింది. వెంటనే బయటకు వెళ్తుండగా ఎక్కడికి అని అడిగితే ‘సంతోష్, శైలజ తనతో మాట్లాడుతారట. వ్యవసాయ మార్కెట్‌యార్డుకు రమ్మంటున్నారు’. అని బయటకు వెళ్లి ఇలా ప్రాణాలు కోల్పోయాడని రోదించింది. శైలజ తన భర్తతో చనువుగా ఉంటూ తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు వెంట పడుతున్నాడంటూ చెప్పి కోపం పెరిగేలా చేసిందని పేర్కొంది. అక్రమసంబంధం ఉందనే అనుమానంతో తన భర్తను దారుణంగా చంపారని విలపించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు విచారణ జరుపుతున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
సెల్‌ఫోన్ చూడొద్దంటావా?
కర్ణాటక: మొబైల్ ఫోన్ ఎక్కువ వాడొద్దని చెప్పిన భర్తపై భార్య కత్తితో దాడిచేసింది. ఈ ఘటన విజయపురలోని హాలకుంటె నగరంలో చోటు చేసుకుంది. గ్రామంలో అజిత్ రాథోడ్, తేజు రాథోడ్ దంపతులు నివాసం ఉంటున్నారు. తేజు రాథోడ్ నిత్యం సెల్‌ఫోన్ చూస్తుండేది. గమనించిన భర్త మందలించాడు. దీంతో అతనిపై కోపం పెంచుకుంది. ఆదివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో భర్త గాఢ నిద్రలో ఉండగా మెడ భాగంలో కత్తితో దాడి చేసింది. బాధితుడి కేకలు విన్న కుటుంబ సభ్యులు ఆయన్ను బీఎల్‌డీఈ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆదర్శనగర్ పోలీసులు తేజు రాథోడ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. చోరీ సొత్తు అప్పగింత రాయచూరు రూరల్: ఆటోలో మరచిపోయిన నగలను పోలసులు రికవరీ చేసి సొంతదారులకు అప్పగించారు. శక్తినగర్‌కు చెందిన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 22 న బస్టాండ్ నుంచి తీన్‌కందిల్ వరకు ఓ మహిళ అటోలో ప్రయాణించిన సమయంలో సంచి మరచిపోయింది. అందులో బంగారు నగలు ఉన్నాయి. దీంతో బాధితురాలు సదర బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలింపు చేపట్టి ఆటోను గుర్తించి రూ.2 లక్షల విలువ చేసే బంగారు, వెండి నగలను రికవరీ చేశారు. ఆ సొత్తును ఎస్పీ సొంతదారుకు అప్పగించారు. డీఎస్పీ శాంతవీర, సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే, ఎస్ఐ నరమమ్మ పాల్గొన్నారు. -
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
బంజారాహిల్స్(హైదరాబాద్): వివాహితపై కన్నేసిన ఆమెకు వరుసకు సోదరుడైన యువకుడు తన గదికి వచ్చి కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తానంటూ బెదిరించిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్‌లో నివసించే మహిళకు (26)కు ముగ్గురు సంతానం. ఆమెకు భర్తకు దూరపు బంధువైన నవీన్ అనే యువకుడు నగరంలోనే ఉంటూ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తరచూ ఇంటికి వచ్చే అతను ఆమెతో మాటలు కలుపుతూ తన కోరికను బయటపెట్టేవాడు. తాను అడిగింది ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించేవాడు. రెండు నెలల క్రితం బాధితురాలు ఈ విషయం తనకు భర్తకు చెప్పడంతో అప్పటి నుంచి నవీన్ ఆమెకు ఫోన్ చేయడం మానేశాడు. ఈ నెల 26న కొందరి వద్ద నవీన్ ఆమెపై అసభ్యకరంగా ప్రచారం చేశాడు. ఆమె పనిచేస్తున్న సెలూన్‌కు వెళ్లి నువ్వు బయటకు వస్తావా..? నన్ను లోపలికి రమ్మంటావా? అంటూ బెదిరించాడు. తాను బయటకు రానని చెప్పడంతో నువ్వు నా గదికి రాకపోతే మొహంపై యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు నవీన్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చంపేసి..లిఫ్ట్ గుంతలో పడేసి..
కవాడిగూడ: గుర్తుతెలియని ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి...సమీప భవనంలోని లిఫ్ట్ గుంతలో శవాన్ని పడేసి వెళ్లిన ఘటన దోమలగూడ పీఎస్ పరిధిలోని హిమాయత్‌నగర్ స్ట్రీట్ నెంబర్ 8లో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఆ యువకుడిని గుర్తు తెలియని దుండగలు ముందుగా బండరాయితో మోది హత్య చేశారు. అనంతరం మృతదేహన్ని బట్టలో చుట్టి ప్లాజా అపార్ట్మెంట్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు పక్కనే ఉన్న లిఫ్ట్ గుంతలో పడేసి పారిపోయారు. సోమవారం ఉదయం అపార్ట్మెంట్ ప్రాంగణాన్ని శుభ్రం చేసేందుకు వచ్చిన సిబ్బంది రక్తపు మరకలు, దుస్తులు పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే దోమలగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అపార్ట్మెంట్లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ పక్కనే ఉన్న లిఫ్ట్‌లో 32 సంవత్సరాల యువకుడి మృతదేహం నగ్నంగా పడి ఉంది. వెంటనే సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, గాందీనగర్ డివిజన్ ఇన్చార్జీ ఏసీపీ గురురాఘవేంద్ర దోమలగూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐలు నిరంజన్, సాయిచంద్‌లు, క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేశారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరిలించారు. ఇదిలా ఉండగా ప్రతి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో హత్య జరగడం సంచలనం సృష్టించింది. కాగా స్థానికుల వివరాల ప్రకారం..గుర్తుతెలియని యువకుడు ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో భోజనం చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ షట్టర్ ముందు నిద్రపోగా..మద్యం లేదా గంజాయి మత్తులో ఉన్నకొంత మంది దుండగులు అతని వద్దకు వచ్చి నిద్రలేపి పక్క వీధిలోకి తీసుకెళ్లి ఘర్షణ పడ్డారని తెలిసింది. ఈ క్రమంలోనే హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటన అర్ధరాత్రి రెండు నుంచి మూడు గంటల మధ్య జరిగినట్లు సమాచారం. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
అనకాపల్లి జిల్లా: జిల్లాలోని దేవరాపల్లి రిసార్ట్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక నడింపల్లి సత్యనారాయణ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు విశాఖ సీతమ్మధారకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తించారు. గత కొంతకాలంగా కుటుంబ సభ్యులు దూరంగా ఉన్న సత్యనారాయణ.. బకాయిలు ఉన్న వారికి బకాయిలు తీర్చకపోవడం వలన ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో వెల్లడించారు. తన ఆత్మహత్యకు సంబంధించి 12 పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
భార్య కళ్లెదుటే ప్రియుడ్ని?.. పట్టపగలే పెద్దపల్లిలో దారుణం
సాక్షి, క్రైమ్: పట్టపగలే.. అదీ అంతా చూస్తుండగానే పెద్దపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని కిరాతకంగా పొడిచి చంపడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సోమవారం వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి మండలం అప్పన్నపేటకు చెందిన పొలం కుమార్ అనే యువకుడు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో దారుణ హత్యకు గురయ్యాడు. ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన రైలుకుల సంతోష్(సతీష్) అనే వ్యక్తి కుమార్‌ను కత్తితో పొడిచి హతమార్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. అయితే.. ఆ మహిళ సంతోష్ భార్యగా నిర్ధారణ అయ్యింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని.. అందుకే భార్య కళ్ల ముందే ప్రియుడ్ని హతమార్చి ఉంటాడని భావిస్తున్నారు. నిందితుడు సంతోష్‌ను పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. అయితే కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. హత్యకు గల పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది. -
తిరుపతిలో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం
తిరుపతి, సాక్షి: జిల్లాలో ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. పాకాల మండలం తోటపల్లి దగ్గర ఓ కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న కంటైనర్ లారీని కారు వెనకనుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. -
పాకిస్థాన్ నుంచి ఆపరేట్.. విశాఖలో లోన్ యాప్ ముఠా అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: నగరంలో లోన్ యాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ లోన్ యాప్.. పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ. 200 కోట్ల రూపాయల లావాదేవీలను పోలీసులు గుర్తించారు.ఈ ముఠా లోన్ యాప్‌ల ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతోంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడితో సహా 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోన్ యాప్‌లో రూ. 2 వేల రూపాయలు అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడిని వేధించిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నరేంద్ర భార్య ఫోటోలను మార్ఫింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు.. బంధువులకు పంపించారు. దీంతో అవమాన భారంతో పెళ్లయిన 40 రోజులకే నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు.పాకిస్థాన్ కేంద్రంగా ఈ ముఠా నడుస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సుమారు భారత్ నుంచి 9 వేల మంది బాధితులు ఈ ముఠా చేతిలో మోసపోయినట్టు గుర్తించిన పోలీసులు.. 18 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, 54 సిమ్‌లు, రూ.60 లక్షల రూపాయల నగదును ఫ్రిజ్ చేశారు. -
ఆస్తి కోసం.. కన్న కొడుకే కాలయముడై..!
పూసపాటిరేగ( విజయనగరం జిల్లా): కడుపున పుట్టిన కొడుకే ఆస్తికోసం తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో గుద్దించి హతమార్చిన ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పాండ్రింకి అప్పలనాయుడు (55), పాండ్రింకి జయమ్మ (53)కు రాజశేఖర్, రాధ ఇద్దరు పిల్లలు. కుమార్తె రాధను ఆనందపురం మండలం నేలతేరుకు చెందిన వ్యక్తితో వివాహం చేశారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలం తరువాత ఆమె మృతిచెందింది. తమకు ఉన్న 80 సెంట్లు పొలంలో వివాహ సమయంలో 20 సెంట్లు భూమిని రాధ పేరిట తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై కుమారుడు రాజశేఖర్ తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్నాడు. భూమి విషయమై వారితో కొంత కాలంగా గొడవపడుతున్నాడు. తల్లిదండ్రుల నుంచి విడిపోయి తన భార్య, కుమార్తెతో కలిసి వేరుగా నివసిస్తున్నాడు. సొంతంగా ట్రాక్టర్ నడుపుతున్నాడు. వ్యసనపరుడు కావడంతో అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలోని నడుపూరి కల్లాల వద్ద రాధకు ఇచ్చిన భూమిని విక్రయించేందుకు సిద్ధపడ్డాడు. ఇందులో భాగంగా జేసీబీ, ట్రాక్టర్ సాయంతో చదునుచేసే పనులను సాయంత్రం చేపట్టాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లి కుమారుడిని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారిపై ఆగ్రహంతో ఊగిపోతూ ట్రాక్టర్‌తో ఢీకొట్టి హతమార్చాడు. వారు మృతి చెందినట్టు నిర్ధారణ అయ్యాక అక్కడ నుంచి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ, ఎస్ఐ ఐ.దుర్గాప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు. -
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
మునగాల(సూర్యాపేట జిల్లా): సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతి మృతిచెందింది. భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన చేడె జనార్దన్ కుమార్తె యశస్విని (24) మూడేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది.తన తండ్రికి బహుమతిగా ఇవ్వాలనుకుని యశస్విని బుల్లెట్ వాహనాన్ని కొనుగోలు చేసి శుక్రవారం రాత్రి తన సహ ఉద్యోగి బడ్డుకొండ అచ్యుత్‌కుమార్‌తో కలిసి అదే బుల్లెట్‌పై తమ స్వగ్రామమైన తుందుర్రుకు బయలుదేరింది. బుల్లెట్ బైక్‌ను అచ్యుత్‌కుమార్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆకుపాముల శివారులోకి రాగానే హైవేపై పడిఉన్న గేదె కళేబరాన్ని ఢీకొట్టారు. దీంతో యశస్విని బుల్లెట్‌పై నుంచి ఎగిరి రోడ్డుపై పడింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే లారీ అతివేగంతో వచ్చి రహదారిపై పడిఉన్న యశస్విని మీదుగా వెళ్లింది. దీంతో యశస్విని తల, మెడభాగం ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందింది. అచ్యుత్‌కుమార్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న మునగాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యశస్విని మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శనివారం మృతురాలి కుటుంబ సభ్యులు మునగాలకు చేరుకున్నారు. మృతురాలి బాబాయ్ చేడె సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. యశస్విని మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
చెల్లికి ఆస్తిలో వాటా.. తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో ఢీకొట్టి..
సాక్షి, విజయనగరం జిల్లా: పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీ నడుపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం తల్లిదండ్రులనే కన్న కొడుకు హత్య చేశాడు. తల్లిదండ్రులను కన్నకొడుకు ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేశాడు. అక్కడిక్కడే తండ్రి అప్పలనాయుడు (60), తల్లి జయమ్మ (58) మృతి చెందాడు. కుమారుడు పాండ్రంగి రాజాశేఖర్ (25) పరారీలో ఉన్నాడు.ఆస్తి తగాదా నేపథ్యంలోనే దాడి చేసినట్టు బంధువులు అంటున్నారు. తల్లిదండ్రులు ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వడంతో రాజశేఖర్ అనే వ్యక్తి వారిపై కక్ష పెంచుకున్నాడు. కొంతకాలంగా ఈ వివాదం నడుస్తోంది. కుమార్తెకు ఇచ్చిన భూమిని చదును చేస్తుండగా తనను అడ్డుకోవడంతో తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగిన రాజశేఖర్.. అనంతరం వారిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపాడు. పూసపాటిరేగ మండలంలో జరిగిన అమానవీయ ఘటనతో మృతుల బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
విజయవాడలో దారుణం.. డేటింగ్ పేరుతో హోటల్ రూమ్ బుక్ చేసి..
సాక్షి, విజయవాడ: మాయమాటలతో అమ్మాయిలను దోచేస్తున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సెంట్రల్ ఏసీపీ దామోదర్ మీడియాకు వెల్లడించారు. కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం విజయవాడకు వచ్చింది. వెటర్నరీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటున్న ఆ యువతికి నెల రోజుల క్రితం కిలారి నాగతేజతో లవ్లీ డేటింగ్ యాప్‌లో పరిచయమైంది. కాగా, నెల రోజుల నుంచి కిలారి నాగతేజ, సదరు యువతి రోజూ ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. డేటింగ్లో భాగంగా ఈ నెల 22 తేదీన ఓ హోటల్లో నాగతేజను ఆ యువతి కలిసింది.ఇద్దరి కోసం హోటల్లో రూమ్ బుక్ చేసిన నాగతేజ.. యువతి నగ్నవీడియోలు తీశాడు. అనంతరం కత్తి చూపించి ఆ యువతి ఒంటిపై బంగారాన్ని తీసుకుని నాగతేజ పారిపోయాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో నాగతేజను పోలీసులు అరెస్ట్ చేశారు.వ్యసనాలకు బానిసైన నాగతేజ.. డబ్బుల కోసం అమ్మాయిలను మోసగిస్తున్నాడు. గతంలోనూ పలువురు యువతులను మోసం చేసిన నాగతేజ.. జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు. నాగతేజ అరెస్ట్‌లో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. డేటింగ్ యాప్, టెలిగ్రామ్, ఫేస్ బుక్, ఇన్‌స్టా గ్రామ్ ద్వారా జరిగే మోసాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ దామోదర్ సూచించారు. -
కడపలో ట్రేడింగ్ పేరుతో భారీ మోసం.. రూ.12 కోట్లకు కుచ్చుటోపి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ట్రేడింగ్ పేరుతో యువతకు కుచ్చుటోపి పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. కడపకు చెందిన పాపిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి చేతిలో 35 కుటుంబాలు మోసపోయాయి. అధిక లాభాల పేరుతో సోమశేఖర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు 12 కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇచిన డబ్బును తిరిగి అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు లబోదిబో అంటున్నారు.మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. పెట్టుబడి పెట్టిన వారిలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహ్యతే గతి అంటూ మిగతా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం, భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని..
హైదరాబాద్: ఇటీవల కుప్పలుతెప్పలుగా వివాహేతర సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. అచ్చం అలాంటి పనిచేసే..ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్‌కి చెందిన శివ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం దీప్తి అనే మహిళతో పెళ్లి కాగా ఈ దంపతులకు మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే పెళ్లై, పిల్లలున్న శివ కొంతకాలంగా తన భార్యతో దూరంగా ఉంటున్నాడు. కారణం మరో మహిళతో వివాహేతర సంబంధమే. ఆ విషయం అతడి భార్య దీప్తి కనిపెట్టింది. ఎలాగైనా రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకోవాలని గట్టి నిఘా పెట్టింది.చివరికి తన భర్త శివ, సుష్మా అనే ఆమెతో కలిసి కూకట్‌పల్లిలో ఓ ఇంట్లో నివసిస్తున్నాడని తెలుసుకుని, కుటుంబసభ్యుల సాయంతో ఒకే గదిలో ఉన్న భర్త శివ, సుష్మలను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుంది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించింది. అంతేగాక తనను పట్టించుకోకుండా మరో మహిళతో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాట్లు ఫిర్యాదు కూడా చేసింది. pic.twitter.com/95aRDE2twc— Telugu Scribe (@TeluguScribe) April 26, 2025 -
జైలు శిక్ష విధిస్తావా..చంపేస్తాం
తమిళనాడు: గంజాయి అక్రమ రవాణా కేసులో 12 సంవత్సరాల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తిని కోర్టు ఆవరణలోనే చంపేస్తామని ఇద్దరు సోదరులు బెదిరించిన ఘటన తేని కోర్టు ఆవరణలో శుక్రవారం కలకలం రేపింది. వివరాలు.. మదురై జిల్లా విల్లాపురం తూర్పు వీధిలోని మునియాండి ఆలయం సమీపంలో కొంతమంది గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు కీరతురై పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి 25 కిలోల గంజాయి తరలిస్తున్న మురతంభత్రి ప్రాంతానికి చెందిన పాండియరాజన్, ప్రశాంత్, పాండియరాజన్ భార్య శరణ్యలను అరెస్టు చేశారు. విచారణలో, మధురైలోని కామరాజపురం ప్రాంతానికి చెందిన రౌడీ వెల్లైౖకలి మేనల్లుడు షణ్ముగవేలు తమకు 25 కిలోల గంజాయి ఇచ్చాడని వారు వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసు గురువారం మదురై జిల్లా నార్కోటిక్స్ కంట్రోల్ మొదటి అదనపు కోర్టు న్యాయమూర్తి హరిహరకుమార్ ముందు విచారణకు వచ్చింది. ఆ సమయంలో, ముగ్గురిని దోషులుగా నిర్ధారించి, ఒక్కొక్కరికి 12 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ పరిస్థితిలో, పోలీసులు వారిని జైలుకు తరలించారు. ఆ సమయంలో నిందితులు పాండియరాజన్, ప్రశాంత్, న్యాయమూర్తిని చూసి చంపేస్తామని బెదిరించారు. వారు న్యాయమూర్తిని దుర్భాషలాడుతూ కోర్టు భవనం కిటికీలను పగులగొట్టి వీరంగం చేశారు. న్యాయమూర్తిని చంపేస్తామని బెదిరించారు. పోలీసులు, న్యాయవాదులపై అసభ్యకర పదజాలంతో దూషించారు. పోలీసులు వారిద్దరిని వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. న్యాయమూర్తిని చంపుతామని బెదిరించారని ఆరోపిస్తూ అన్నానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
విశాఖలో దంపతుల దారుణహత్య
విశాఖపట్నం: విశాఖ నగరం గాజువాక సమీపంలోని రాజీవ్‌నగర్‌లో భార్యాభర్తలు దారుణహత్యకు గురయ్యారు. డాక్‌యార్డులో పనిచేసి రిటైరైన గంపాల యోగేంద్రబాబు (66), లక్ష్మి (58) దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వారు 35 ఏళ్లుగా రాజీవ్‌నగర్‌లో ఉంటున్నారు. రెండు రోజుల కిందట హైదరాబాద్ వెళ్లిన వారు గురువారం ఉదయం ఇంటికి చేరుకున్నారు.శుక్రవారం రాత్రి వరకు వారి ఇంటి తలుపులు తెరవకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్థానికంగా ఉన్న బంధువుల అమ్మాయి ఇంటికి వచ్చి చూసింది. ఇంటికి రెండువైపులా తాళం వేసి ఉండటాన్ని గమనించింది. అనుమానం వచ్చిన.. స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించింది. సౌత్ ఏసీపీ టి.త్రినాథ్, దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు అక్కడికి చేరుకుని తాళాలు పగలుగొట్టించి తలుపులు తెరిచారు. లోపలికి వెళ్లి చూస్తే హాల్లో యోగేంద్రబాబు, బెడ్రూమ్లో లక్ష్మి రక్తపుమడుగులో పడి ఉన్నారు. వారు అప్పటికే మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. యోగేంద్రబాబుది మచిలీపట్నం కాగా లక్ష్మిది శ్రీహరిపురం. 40 ఏళ్ల కిందట కులాంతర ఆదర్శ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారికి వివాహాలు జరిగి, అమెరికాలో స్థిరపడ్డారు. క్లూస్ టీం రంగంలోకి దిగి వివరాలు సేకరించింది. -
బిడ్డను చంపి తల్లిపై గ్యాంగ్‌రేప్!
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాల ప్రకారం.. సగటున రోజుకి వందకి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. వెలుగులోకి రానివి మరెన్నో?. తాజాగా.. హర్యానాలోని జింద్‌లో ఘోరమైన ఘటన జరిగింది. నలుగురు దుండగులు అయిదేళ్ల చిన్నారిని హత్య చేసి, ఆమె తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పాత గొడవల కారణాంగానే నిందితులు ఈ దారుణానికి తెగబడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత కుటుంబం చెత్త ఏరుకుంటూ జింద్ జిల్లా(Jind) శివారులోని గుడిసెల్లో నివసిస్తోంది. కొన్నిరోజుల కిందట అమిత్ అనే వ్యక్తికి, బాధిత మహిళ భర్తకి గొడవ జరిగింది. ఈ గొడవలో ఆమె భర్త తలకు గాయం కాగా పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు నిందితుడు అమిత్‌పై చర్యలు తీసుకోకుండా.. గొడవను సర్దిచెప్పి పంపించారు. ఇది మనసులో పెట్టుకున్న అమిత్, అతని మైనర్ సోదరుడు కోపంతో రగిలిపోయారు. మంగళవారం రాత్రి ఆమె భర్త లేని సమయం చూసి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గుడిసెలోకి చొరబడ్డారు. ముగ్గురు పిల్లలతో కలిసి నిద్రపోతున్న బాధితురాలిపై దాడి చేశారు. ఆమె స్పృహ కోల్పోయాక.. ఆమెతోపాటు అయిదేళ్ల చిన్నారిని పక్కనే ఉన్న ఖాళీ ప్రాంతానికి లాక్కెళ్లారు. అక్కడ చిన్నారి గొంతునులిమి హత్య చేసి, బాధితురాలిపై నలుగురూ అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న మహిళను అక్కడే వదిలేసి పారిపోయారు. చిన్నారి మృతదేహం రాత్రంతా చెత్తకుప్పలోనే ఉంది. శుక్రవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన ఓ మహిళ వాళ్లను గుర్తించి స్థానికులకు సమాచారం అందించింది. చిన్నారిని ఖననం చేశాక.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనతో పాటు తన ఐదేళ్ల వయసున్న బిడ్డపైనా నిందితులు అత్యాచారానికి ఒడిగొట్టారని చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్థానిక ఎస్సై యశ్వీర్, సమాధి నుంచి పసికందు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకి తరలించారు. మరోవైపు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు అమిత్‌తో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. -
వరకట్న వేధింపులకు వివాహిత బలి
కర్ణాటక: వరకట్న వేధింపులతో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తాలూకాలోని కాడదేనహళ్లిలో జరిగింది. వివరాలు.. హాసన జిల్లా అరసీకెరె తాలూకా గండసి ఫిర్కా కుడుకుంది గ్రామానికి చెందిన సోమశేఖర్ కుమార్తె కేఎన్ రశ్మి(24)కి మాలూరు తాలూకా సొసగెరె గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని కాడదేనహళ్లి గ్రామానికి చెందిన దినేష్ గౌడతో 14 నెలల క్రితం వివాహం చేశారు.వివాహం అనంతరం దినేష్ గౌడ ఇంట్లో ఇంకా ఎక్కువ మొత్తంలో వరకట్నం తీసుకు రావాలని రశ్మిపై ఒత్తిడి చేసేవారు. దీంతో విసుగు చెందిన రశ్మి పైఅంతస్తులో ఉన్న గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రశ్మి తండ్రి సోమశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాలూరు ఎస్ఐ వసంతకుమార్ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఘటనకు సంబంధించి మాలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని రశ్మి భర్త దినేష్గౌడ, మామ అప్పాజిగౌడ, రత్నమ్మ, సరోజమ్మలను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. -
టాపర్ కాస్త హంతకుడిగా..
చదివిన ప్రతి తరగతిలోనూ అత్యధిక మార్కులతో పాసైన ఓ కుర్రాడు బెట్టింగ్ అలవాటు మానుకోలేక చదువుకు దూరమై హొటల్లో సర్వర్‌గా మారి ఆఖరుకు హంతకుడిగా మిగిలాడు. చెడు సాంగత్యాన్ని మొదటిలోనే తుంచలేక ఓ వివాహిత చేతులారా బంగారం లాంటి బతుకును బుగ్గిపాలు చేసుకుంది. పైడి భీమవరంనడిబొడ్డున జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలు తెలిసే కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రణస్థలం: పైడిభీమవరంలో ఊరి నడిబొడ్డున ఈ నెల 19న జరిగిన అవాల భవానీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని జేఆర్ పురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు జేఆర్ పురం పోలీస్ స్టేషన్లో సీఐ ఎం. అవతారం గురువారం వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. అవాల భవానీ పైడిభీమవరంలోని ఓ హొటల్లో పనిచేసేది. అక్కడే సర్వర్‌గా పనిచేస్తున్న కొండక వీర్రాజు అనే వ్యక్తితో నాలుగు నెలల కిందట ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం హోటల్ యజమానికి తెలియడంతో వీర్రాజు ను పనిలో నుంచి మానిపించేశారు. ఆ తర్వాత భవానీ ఈ విషయం తమ ఇంటిలో తెలిసిపోతుందని వీర్రాజును దూరం పెట్టింది. ఫోన్ చేసినా మాట్లాడకపోవడంతో వీర్రాజు ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. మరొకరితో అక్రమ సంబంధం ఉండడం వల్లనే తనను దూరం పెడుతోందని భావించి ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ నెల 19న పైడిభీమవరంలోని ఒక దుకాణంలో చాకు కొను క్కుని తన దగ్గర ఉంచుకున్నాడు. పైడిభీమవరం నడిబొడ్డున ఉన్న గుర్రమ్మ గుడి వెనుక ఉన్న కాజావారి కోనేరుగట్టు వద్ద అవాల భవాని రావడం గమనించి ఆమెను పిలిచి కొంత సమయం గొడవ పడ్డాడు. అయితే ఆమె అతడితో మాట్లాడేందుకు నిరాకరించింది. దీంతో తనతో తెచ్చుకున్న చాకుతో భవాని గొంతును రెండు సార్లు బలంగా కోసినట్లు పోలీసులు తెలిపారు.తర్వాత అక్కడ నుంచి పారిపోయిన వీర్రాజు విజయవాడలోని ఇంటికి చేరుకుని ఎవరూ గుర్తు పట్టకుండా గుండు గీసుకుని తిరుపతి వెళ్లిపోయాడు. తిరిగి వస్తుండగా పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు రణస్థలం మండలంలోని కమ్మసిగడాం వద్ద అదుపులోకి తీసుకున్నారు. కేసును త్వరగా ఛేదించి జేఆర్ పురం సీఐ అవతారం, ఎస్ఐ ఎస్.చిరంజీవి, సిబ్బంది పి.హేమంత్ కుమార్, కేకే సింగ్, సీహెచ్ సురేష్ ను జిల్లా ఉన్నతాధికారులు ప్రశంసించారు.అన్నింటింలోనూ టాపరే..ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు కొండక వీర్రాజు స్వగ్రామం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో గల నడిపల్లి గ్రామం. కుటుంబ సభ్యులతో చిన్నతనం నుంచి విజయవాడ వలస వెళ్లి అక్కడే ఉండేవాడు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నాడు. పదిలో పదికి పది, ఇంటర్లో 965 మార్కులు, డిగ్రీ రెండేళ్లలోనూ 90శాతం మార్కులు సాధించాడు. డిగ్రీ చివరి ఏడాదిలో బెట్టింగులకు అలవాటు పడి డబ్బులు అప్పు చేసి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీంతో అన్నదమ్ములు నాలుగు నెలలు క్రితం స్వగ్రా మం నడిపిల్లి పంపించేశారు. తదుపరి నడిపిల్లి వచ్చిన అతను పైడిభీమవరంలోని ఒక హోటల్లో సర్వర్‌గా పనిలో జాయినయ్యాడు. అంత తెలివైన విద్యార్థి బెట్టింగ్ మానుకోలేక ఆఖరుకు హంతకుడిగా మిగిలాడు.వివాహిత దారుణహత్య -
భర్త దుబాయ్‌లో.. పక్కింటి వ్యక్తి ఇంట్లో రేఖ అనుమానాస్పద మృతి
గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరంలో గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి చెందారు. ఒకరు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా.. అక్కడే ఓ మహిళ మృతదేహం పడి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకే ఇంట్లో రెండు మృతదేహాలు కనిపించిన సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గజసింగవరం గ్రామానికి చెందిన ఉల్లి శ్రీకాంత్(27) తన ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే ఇంట్లో చెరుకూరి రేఖ(25) అనే వివాహిత మృతదేహం పడి ఉంది. ఆమె శరీరంపై గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీకాంత్‌కు వివాహం కాగా.. భార్య గురువారం పుట్టింటికి వెళ్లింది. రేఖ భర్త గల్ఫ్‌లో ఉంటున్నాడు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సీఐ శ్రీనివాస్‌గౌడ్, ఎస్సై ప్రేమానంద్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
కొడుకు అందంగా పుట్టాడని వేధింపులు
జగిత్యాల క్రైం: ‘అమ్మా, నాన్నా.. నా కొడుకును మీరే పెంచండి. భర్త, అత్తమామల వేధింపులు భరించలేకపోతున్నా. నా భర్త మారతాడని అనుకున్న. నా ఆశ నిరాశే అయ్యింది. కొడుకు అందంగా పుట్టాడన్న అనుమానంతో నిత్యం వేధిస్తున్నాడు. కట్నం వేధింపులు కూడా ఎక్కువయ్యా యి’.. అని సూసైడ్ నోట్ రాసి వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన ప్రసన్నలక్ష్మి (26)ని రెండేళ్ల క్రితం వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన తిరుపతికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.55 లక్షల కట్నం ఇస్తామని ఒప్పుకుని.. రూ.10 లక్షలు ముట్టజెప్పారు. దంపతులిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రసన్నలక్ష్మికి బాబు జన్మించాడు. అప్పటి నుంచి ఆమె ఇంటివద్దే ఉంటోంది. ప్రసన్నలక్ష్మి, తిరుపతి ఇద్దరూ చామన ఛాయలో ఉండగా.. బాబు తెల్లగా, అందంగా పుట్టాడన్న అనుమానం తిరుపతి మనసులో మొలకెత్తింది. అప్పటి నుంచి తరచూ ప్రసన్నలక్ష్మిని వేధిస్తున్నాడు. మిగతా కట్నం డబ్బు కావాలని ఒత్తిడి పెంచాడు. భర్త తిరుపతి, అత్త, మామ, ఆడబిడ్డలు వేధిస్తుండటంతో ఐదురోజుల క్రితం ప్రసన్నలక్ష్మి బెంగళూరు నుంచి జగిత్యాలలోని తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ఇంట్లో ఉన్న అద్దంపై ‘అమ్మా నాన్న నాకు బతకాలని లేదు. నా కొడుకు జాగ్రత్త. ప్లీజ్ వాళ్లకు మాత్రం నా బాబును ఇవ్వకండి’అని రాసి ఫ్యాన్‌కు ఉరేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రసన్నలక్ష్మి భర్త, అత్త మామలపై చర్యలు తీసుకోవాలని గురువారం ఉదయం ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. డీఎస్పీ రఘుచందర్, పట్టణ సీఐ వేణుగోపాల్ మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మృతురాలి తండ్రి ఉప్పునీటి గంగాధర్ ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తమామలు, ఆడబిడ్డలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
వికటించిన ప్రేమపెళ్లి
కర్ణాటక: ప్రేమించి కులాంతర వివాహం చేసుకొన్న ఓ యువతి.. నిండు గర్భిణిగా ఉండి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘోరం రాయచూరు జిల్లా సింధనూరు గ్రామీణలో చోటు చేసుకుంది. వివరాలు.. తాలూకాలోని బూదిహాల్కు చెందిన యువకుడు నాగరాజు బ్రతుకుతెరువు కోసం బెంగళూరులో పని చేయడానికి వెళ్లాడు. అక్కడ పనిచేసే దుకాణ యజమాని కూతురు, చామరాజనగర జిల్లా కొళ్లేగాళకు చెందిన పల్లవి అలియాస్ అనుపమతో పరిచయం పెరిగి ప్రేమగా మారింది. కట్న వేధింపులు పెరిగి సుమారు ఏడాది కిందట గంగావతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. పల్లవి తొమ్మిది నెలల గర్భిణి. పల్లవి అగ్రవర్ణురాలు కాగా, నాగరాజ్‌ది మరో కులం. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలు, కట్న వేధింపులు మొదలయ్యాయి. ప్రేమ కోసం అందరినీ వదులుకుని వస్తే జీవితం తలకిందులైందని పల్లవి ఆక్రోశించింది. గురువారం బూదిహాల్లో భర్త ఇంట్లోనే ఉరివేసుకుంది. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ తలవార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గొడవలు జరగకుండా బూదిహాళలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భర్త నాగరాజ్, అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేశామని సిఐ వీరారెడ్డి తెలిపారు. -
హైదరాబాద్‌లో భారీగా పట్టుబడిన హవాలా డబ్బు..
హైదరాబాద్: నెల రోజుల నుండి నిఘా ఉంచి రూ.74.56 లక్షల హవాలా డబ్బును రాయదుర్గం పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన మేరకు.. ఇద్దరు యువకులు యాక్టివాపై డబ్బు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో రాయదుర్గంలోని విస్పర్ వ్యాలీ జంక్షన్లో ఎస్ఐ శ్రీనివాస్ వాహనాల తనిఖీలు చేపట్టారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో వాహనంపై ఒక బ్యాగ్ కనిపించింది. తనిఖీ చేయగా ఆ బ్యాగ్‌లో రూ. 74,56,200 నగదు లభించింది. కరీంనగర్‌కు చెందిన బి.సాయికృష్ణ బీటెక్ పూర్తి చేసి చిత్రపురి కాలనీలో నివాసం ఉంటున్నాడు. రాయదుర్గంలో ఉండేరవితో కలిసి బేగంపేట్‌లోని సురేందర్ అగర్వాల్ నుంచి డబ్బు తీసుకొని వస్తున్నారు. రవి డ్రైవింగ్ చేస్తుండగా బ్యాగ్‌తో సాయి కృష్ణ వెనకాల కూర్చున్నాడు. మియాపూర్‌కు వెళ్లి ఫోన్ చేస్తే ఎవరికి ఇచ్చేది చెప్తారని పోలీసులకు తెలిపారు. స్వాధీనం చేసుకొని నగదును ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అప్పగించామన్నారు. కొంత కాలంగా బ్లాక్ మనీ అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. ఈ క్రమంలోనే రెండు మూడు సార్లు పట్టుకునేందుకు ప్రయతి్నంచినా పట్టుబడలేదు. ఎట్టకేలకు భారీ నగదును స్వా«దీనం చేసుకున్నారు. -
ఫోన్‌కాల్ రచ్చ ప్రాణం తీసింది..!
మంచిర్యాలక్రైం: ఫోన్ కాల్ విషయమై జరిగిన రచ్చ ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేలా చేసింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమిని మండలం జగ్గయ్యపేటకు చెందిన జంగంపల్లి గోపాల్, నాగమ్మ దంపతుల రెండో కూతురు లక్ష్మీప్రసన్న మంచిర్యాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకింది. కళాశాల విద్యార్థులు, సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం చనిపోయింది. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు కళాశాల సిబ్బంది, నైట్‌వాచ్‌మెన్ మహేశ్ వేధింపులే కారణమంటూ ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. అదనపు కలెక్టర్ మోతీలాల్ ఆస్పత్రికి చేరుకోగా.. విద్యార్థిని తండ్రి గోపాల్ ఆయన కాళ్లపై పడి న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు. లక్ష్మీప్రసన్నమృతికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రూ. 20లక్షలు పరి హా రం, కుటుంబంలో ఒకరికి ప్ర భుత్వ ఉద్యోగం ఇవ్వాలని అ న్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, నా యకులు పాల్గొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులతో మా ట్లాడిన అదనపు కలెక్టర్.. న్యాయం చేస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ వెల్లడించారు. అసలేం జరిగింది..ఈ నెల 23న రాత్రి 9.30గంటలకు లక్ష్మీప్రసన్న తన చిన్నమ్మ కొడుకు వెంకటేష్‌కు వాచ్మెన్ మహేశ్ సెల్‌ఫోన్ నుంచి ఫోన్ చేసింది. తర్వాత 9.45గంటలకు వెంకటేష్ వాచ్‌మెన్‌కు ఫోన్ చేసి ఇంత రాత్రి ఫోన్ ఎందుకు ఇచ్చావంటూ బెదిరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ మేనేజర్ మల్లేష్‌కు ఫోన్ ద్వారా వెంకటేష్ ఫిర్యాదు చేయడం, మహేశ్‌పై మల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని బెదిరించడం, ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ అనూష దృష్టికి తీసుకెళ్లడం వరకు వెళ్లాయి. అయితే ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం, వాచ్మెన్ మహేశ్ లక్ష్మీప్రసన్నపై ఒత్తిడి చేసి వేధించారని, భరించలేకనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, విద్యార్థిని చిన్నమ్మ కొడుకు వెంకటేష్ ఆరోపించారు. -
భార్య, అత్తపై అల్లుడి దాడి
మియాపూర్(హైదరాబాద్): భార్యా భర్తల మధ్య ఏర్పడిన వివాదం దాడికి దారి తీసింది. భార్యపై భర్త కత్తితో దాడి చేయగా..అడ్డుగా వచ్చిన అత్తను సైతం కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు..సీఐ క్రాంతి కుమార్ తెలిపిన ప్రకారం..కాకినాడకు చెందిన బండారులంక మహేష్ మియాపూర్ జనప్రియనగర్ రోడ్డు నెం.5 శ్రీ వెంకట నిలయంలో భార్య శ్రీదేవి, రెండేళ్ల కుమార్తెతో కలిసి ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా మహేష్ తన సంపాదనను ఇంటి ఖర్చులకు ఇవ్వకుండా..మద్యం తాగేందుకు ఖర్చుచేస్తున్నాడు. ఈ విషయంలో భార్య శ్రీదేవితో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం శ్రీదేవి చందానగర్ హుడాకాలనీలో ఉంటున్న తల్లి మంగ ఇంటికి వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం శ్రీదేవికి ఫోన్‌చేసి ఇంటికి తిరిగి రమ్మని మహేష్ కోరగా..ఆమె మధ్యాహ్నం ఒంటి గంటకు కుమార్తెతో కలిసి వచ్చింది. అదేరోజు సాయంత్రం మహేష్ తన సోదరుడు సాయికుమార్ పుట్టిన రోజు ఉందని, జనప్రియ కాలనీలో ఉంటున్న తమ తల్లిదండ్రుల ఇంటికి వెళ్దామని చెప్పాడు. దీనికి శ్రీదేవి నిరాకరించడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని శ్రీదేవి తల్లి మంగకు ఫోన్ చేసి చెప్పగా ఆమెకూడా ఇక్కడికి వచ్చింది. దాడిని ప్రశ్నించడంతో ఆవేశానికి లోనైన మహేష్ వంటగదిలోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తి తీసుకుని వచ్చి మొదట శ్రీదేవిపై దాడి చేశాడు. వారించేందుకు వెళ్లిన అత్త మంగను విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడగా..స్థానికులు గమనించి ఇద్దర్నీ సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరతించారు. ఘటనపై శ్రీదేవి భర్త మహేష్‌పై మియాపూర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడు మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
యువ ప్రేమజంట ఆత్మహత్య!
సాక్షి, బళ్లారి: ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వారం రోజుల క్రితం కనిపించకుండా పోయిన ప్రేమికులు శవాలై తేలారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి బళ్లారి జిల్లాలోని హరపనహళ్లి తాలూకా బిట్టినకట్టి గ్రామానికి చెందిన మద్దనస్వామి (18), బండ్రి గ్రామానికి చెందిన దీపిక (18) అనే ఇద్దరు ప్రేమించుకున్నారు. పీయూసీలో ఇద్దరు ప్రథమ శ్రేణిలో పాసయ్యారు. అయితే వారం రోజుల క్రితం ఏమైందో కాని ఇరువురు కనబడకుండా వెళ్లిపోయారు. దీనిపై పోలీసు స్టేషన్లో కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు గాలిస్తున్న నేపథ్యంలో హరపనహళ్లి పట్టణ శివారులోని ఐటీఐ కళాశాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరి వేసుకున్న స్థితిలో శవాలై తేలారు. స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. గ్రామంలో తీవ్ర విషాదం అలముకొంది. -
హత్యాయత్నం నిజమా.. నాటకమా?
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): మాజీ మాఫియా డాన్ దివంగత ముత్తప్ప రై చిన్న కుమారుడు రిక్కీ రై పై కాల్పులు జరిగిన కేసులో బిడది పోలీసులు అతని గన్‌మ్యాన్ మన్నప్ప విఠల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రిక్కీ రై తానే కాల్చుకుని హత్యాయత్నం డ్రామా ఆడుతున్నాడని పోలీసులు తాజాగా అనుమానిస్తున్నారు. రిక్కీ రైకి ఉన్న ముగ్గురు గన్ మ్యాన్లు ఒక్కొక్కరు ఒక్కో వాంగ్మూలం ఇస్తుండడంతో పోలీసుల అనుమానాలు బలపడుతున్నాయి. తన పిన్ని అనురాధ, రాకేశ్ మల్లి, మరో ఇద్దరిపై ఆరోపణలు చేసి రిక్కీ కేసును పక్కదారి పట్టిస్తున్నారా అని సందేహిస్తున్నారు. కాల్పులు జరగడానికి ముందు కుక్కలు అరవడంతో గాల్లోకి కాల్పులు జరిపామని గన్ మ్యాన్లు చెప్పిన మాటల్లో నిజం లేదని గుర్తించారు. హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేశ్ మల్లి తన లాయర్లతో కలిసి రామనగర ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. ఎస్పీ శ్రీనివాసగౌడ అతనిని విచారించారు. పిన్ని అనురాధకు ఊరట ఈ కేసులో ఏ2గా ఉన్న రిక్కి రై పిన్ని అనురాధకు హైకోర్టులో ఊరట దక్కింది. కేసులో నుంచి తన పేరు తొలగించాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా, ఆమెపై తొందరపాటు చర్యలు, బలవంతపు చర్యలు తీసుకోరాదని కోర్టు పోలీసులను ఆదేశించింది. అనురాధకు 14వ తేదీన యూరోప్‌కు వెళ్లిపోయిందని, 6 నెలల క్రితమే ఆస్తి గొడవలపై రాజీ చేసుకున్నారని ఆమె లాయర్ వాదించారు. నాపై హత్యాయత్నం చేసింది పిన్ని అనురాధ..? -
వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
వరంగల్ క్రైం : తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతోపాటు తనను గతంలో సస్పెండ్ చేయించాడనే కోపంతో సామాజిక కార్యకర్త ఛిడం సాయి ప్రకాశ్‌ను హత్య చేసిన కేసులో ఓ కానిస్టేబుల్‌తో సహా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా వెంకటాçపురం(ఎం) పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న బాషబోయిన శ్రీనివాస్ గతంలో వెంకటాçపురం(కె) పోలీస్ స్టేషన్లో విధులు నిర్వరిస్తున్న క్రమంలో ఓ భూమి విషయంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చింతం నిర్మలతో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ విషయంపై నిర్మల భర్తతో కలిసి మృతుడు సాయి ప్రకాశ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్‌ను సస్పెన్షన్ చేశారు. ఫోన్ సమాచారంతో కిడ్నాప్.. హత్యఈనెల 15వ తేదీన నిందితురాలు నిర్మల, ఆమె భర్తతో కలిసి మృతుడు సాయిప్రకాశ్ తన కారులో ఆస్పత్రికి వచ్చారు. ఈ విషయన్ని నిర్మల.. నిందితుడు శ్రీనివాస్‌కు ఫోన్లో తెలియజేయడంతో ప్రణాళిక ప్రకారం కారును వెంబడించి రాత్రి 11.30 గంటల సమయంలో గోపాల్‌పూర్‌లోని బేబిసైనిక్ స్కూల్ వద్ద కారును ఆటోతో ఢీకొట్టించాడు. అనంతరం సాయి ప్రకాశ్‌ను కారులోనే కిడ్నాప్ చేసి హసన్‌పర్తి పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి శాలువతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని హుస్నాబాద్ పీఎస్ పరిదిలోని జిల్లేడగడ్డ తండా గ్రామ శివారులోని ఓ బావి లో పడేశారు. అనంతరం వేలేరు మండలం మీదుగా హనుమకొండ ఏషియాన్ మాల్ దగ్గర కారు నిలిపి వేసి వెళ్లారు. నిందితుల అరెస్ట్..ప్రధాన నిందితుడు కానిస్టేబుల్ బాషబోయిన శ్రీనివాస్‌తో పాటు ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన డేవిలిసాయి, హనుమకొండకు చెందిన అలోతు అరుణ్‌కుమార్ అలియాస్ పండు, బాదావత్ అఖిల్ నాయక్, బాదావత్ రాజు, వాజేడు వెంకటాపూర్‌కు చెందిన చింతం నిర్మలను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు వినియోగించిన ఓ కారు, రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ఫోన్లు, పిస్టోల్‌ను స్వా«ధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు. అధికారులకు అభినందనలు..సామాజిక కార్యకర్త సాయి ప్రకాశ్ హత్య కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్, హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి, హనుమకొండ ఇన్స్పెక్టర్ సతీశ్, సిబ్బందిని సీపీ సన్‌ప్రీత్‌సింగ్ అభినందించారు. -
పని వారి విషయంలో నిలువెల్లా నిర్లక్ష్యమే!
హైదరాబాద్: నారాయణగూడ పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే కేడియా ఆయిల్స్ కంపెనీ యజమాని రోహిత్ కేడియా ఇంట్లో ఈ ఏడాది ఫిబ్రవరి 11న భారీ చోరీ జరిగింది. బీహార్, పశ్చిమ బెంగాల్ లకు చెందిన ముగ్గురు నిందితులు దాదాపు రూ.40 కోట్ల విలువైన సొత్తు దోచుకుపోయారు. వీరిని అరెస్టు చేసిన సందర్భంలో పోలీసులు పని వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పదేపదే సూచించారు. ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోని కాచిగూడ వాసి, పారిశ్రామిక వేత్త హేమ్ రాజ్ కుటుంబం నేపాలీలను ఎలాంటి ఆధారాలు లేకుండా పనిలో పెట్టుకుంది. ఫలితం... ఆదివారం రాత్రి రూ.2 కోట్ల సొత్తుతో ఆ నేపాలీలు ఉడాయించారు. ఈ కేసును ఈస్ట్‌జోన్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలో దింపిన డీసీపీ డాక్టర్ బి.బాలస్వామి కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పథకం ప్రకారం పనిలో చేరిన నేపాలీలు... కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో హేమ్ రాజ్ తన భార్య మీనా దుగ్గర్, కుమారుడు, కోడలు, మనుమళ్లతో కలిసి ఉంటున్నారు. కొన్నాళ్లుగా వీరి వద్ద నేపాల్‌కు చెందిన ఓ మహిళ పని చేస్తోంది. ఆ ఇంటి వ్యవహారాలు పూర్తిగా తెలిసిన ఆమె అదును చూసుకుని కొల్లగొట్టాలని పథకం వేసింది. త్వరలో తాను పని మానేసి తన స్వదేశానికి వెళ్లిపోతానంటూ ఇటీవల ఆ మహిళ చెప్పింది. తన స్థానంలో పని చేయడానికి తమ దేశం నుంచే వచి్చన మరో మహిళ సిద్ధంగా ఉందని దాదాపు నెల రోజుల క్రితం చేర్చింది. హేమ్రాజ్ ఇంట్లో ప్రస్తుతం రెన్నోవేషన్ పని నడుస్తోంది. దీంతో ఆ పనిలో సహకరించడానికి, ఇంటిని శుభ్రం చేయడానికి మరో మనిషి కావాలంటూ పది రోజుల క్రితం కొత్త పని మనిషికి చెప్పారు. ఆ పని చేయడానికి తన పరిచయస్తుడు ఉన్నాడని చెప్పిన ఈ కొత్త పనిమనిషి మరో నేపాలీని ఆ ఇంటికి తీసుకువచ్చింది. నేపాలీలు అంతా కలిసి అదును చూసుకుని... ఇలా కొత్తగా పనిలో చేరిన ఇద్దరి ఫొటోలు, వివరాలను హేమ్ రాజ్ కుటుంబం తీసుకోలేదు. కనీసం వాళ్లు చెప్పిన పేర్లు నిజమా? కాదా? అనేది పరిశీలించలేదు. వేసవి సెలవుల నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం హేమ్రాజ్ కుమారుడి కుటుంబం విదేశాలకు వెళ్లింది. వృద్ధ దంపతులే ఇంట్లో ఉండటంతో ఆ ఇంటిని కొల్లగొట్టడానికి ఇదే సరైన సమయమని ఇరువురు నేపాలీలు నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి వృద్ధ దంపతుల ఆహారంలో మత్తుమందు కలిపారు. వీళ్లు మత్తులో ఉండగా... అల్మారాలు, లాకర్లు పగులకొట్టిన నేపాలీ ద్వయం బంగారం, వజ్రాభరణాలు, నగదుతో సహా మొత్తం రూ.2 కోట్ల విలువైన సొత్తు కాజేశారు. ఇంటిని బయట నుంచి తాళం వేసి యజమాని కారులోనే సంతో‹Ùనగర్ వరకు వెళ్లిన ఇరువురూ వాహనం అక్కడ వదిలేశారు. ఆపై ఆటోలో శంషాబాద్ వైపు ఉడాయించారు. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో వచ్చిన ఫాల్స్ సీలింగ్ వర్కర్లు ఎంత పిలిచినా యజమానల నుంచి స్పందన లేకపోవడంతో సమీపంలో ఉండే బంధువులకు సమాచారం ఇచ్చారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లిన ప్రత్యేక బృందాలు... ఈ నేరంపై పోలీసులకు సోమవారం మధ్యాహ్నం సమాచారం అందింది. ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ బి.బాలస్వామి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. యజమానుల దగ్గర నేపాలీల పేర్లు తప్ప వారి వివరాలు, చిరునామాలు, ఫొటోలు లేకపోవడం దర్యాప్తును సంక్లిష్టం చేసింది. పాత పనిమనిíÙతో పాటు కొత్త పని వాళ్లు ఇద్దరి ఆచూకీ కోసం రాష్ట్రం చుట్టపక్కల ఉన్న సాధారణ, రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడు ప్రత్యేక బృందాలు ఉత్తరాదిలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లాయి. నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్ చెక్పోస్టునూ అప్రమత్తం చేశారు. శంషాబాద్ నుంచి నేపాలీలు ఎటు వెళ్లారనేది గుర్తించడానికి వివిధ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. అఫ్జల్‌గంజ్ ఫైరింగ్ కేసు అనుభవం నేపథ్యంలో ఈ నేరగాళ్లు దేశం దాటకముందే పట్టుకోవాలనే లక్ష్యంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
అంతా చేసి..భర్త కన్పించలేదంటూ ఫిర్యాదు
కేపీహెచ్‌బీ కాలనీ(హైదరాబాద్): కూతురు పెళ్లి విషయంలో తలదూర్చవద్దని, ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించిన భర్తను కరెంటు షాక్ పెట్టి హత్య చేసిన కేసులో భార్యతో పాటు సహకరించిన మరో ఇద్దరిని కేపీహెచ్‌బీ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డిలు హత్య కేసు వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా లింగాయపల్లికి చెందిన సాయిలును భార్య కవిత గత శుక్రవారం రాత్రి పథకం ప్రకారం విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేసిన విషయం విదితమే. ఈ కేసులో కవితకు సహకరించిన సోదరి జ్యోతి, ఆమె భర్త మల్లేష్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా నిందితులు మృతదేహాన్ని గుర్తు పట్టకుండా కవర్లో చుట్టి ఆటోలో తరలించి జోగిపేట వద్ద పూడ్చి పెట్టేందుకు యత్నంచగా ఆటో డ్రైవర్ నిలదీయడంతో తిరిగి వారు నివాసం ఉంటున్న మిత్ర హిల్స్‌కు చేరుకొని అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చి పెట్టారు. అనంతరం ఆటో డ్రైవర్ ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుట్టు రట్టు చేసిన ఆటో డ్రైవర్... కవర్లో మూటకట్టిన మృతదేహాన్ని చెత్త కుప్పగా నమ్మించి సంగారెడ్డి చెరువులో పడవేసేందుకు ఆటోను మాట్లాడుకొని శనివారం రాత్రి బయలుదేరి వెళ్లగా నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చిపెట్టేందుకు యతి్నస్తున్న విషయాన్ని ఆటోడ్రైవర్ వలీనాయక్ కనిపెట్టాడు. అనుమానం వచ్చి కవితను గట్టిగా నిలదీశాడు. దీంతో ఆమె తిరిగి తమను ఎక్కడ ఎక్కించుకున్నావో అక్కడే దించాలని చెప్పడంతో మిత్రహిల్స్ వద్ద దించాడు. అప్పటికే కవర్లో మూటగట్టిన మృతదేహం వాసన రావడంతో అనుమానం వచి్చన ఆటోడ్రైవర్ వలీనాయక్ మరుసటి రోజు కేపీహెచ్‌బీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డిని కలిసి విషయం చెప్పాడు. దీంతో హత్య కేసు గుట్టు రట్టయింది. ధైర్యంగా ముందుకు వచ్చి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పిన వలీనాయక్ను పోలీస్ అధికారులు అభినందించారు. -
ఐదేళ్లుగా అదే పని.. మహిళలు స్నానం చేస్తుండగా..
వెంగళరావునగర్(హైదరాబాద్): మహిళలు స్నానం చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీస్తున్న వ్యక్తిని మధురానగర్ అసోసియేషన్ నేతలు పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం... మధురానగర్‌కాలనీ కమ్యూనిటీహాల్లో కొన్నేళ్లుగా ఓ కుటుంబం విధులు నిర్వర్తిస్తోంది. వారి కుమార్తె సమీపంలోని చీరల దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా పని చేస్తోంది. ఆమె సోమవారం ఉదయం విధులకు వెళ్లడానికి స్నానం చేస్తూ సబ్బు కోసం వెతికింది. అయితే ఆమెకు అక్కడ మొబైల్ ఫోన్ చేతిని తాకింది. భయపడి దుస్తులు ధరించి బయటకు వచ్చి చూడగా కమ్యూనిటీహాల్లో ఎలక్ట్రిషియన్‌గా విధులు నిర్వర్తించే వై.మరియాలి కుమార్ స్నానం గది కిటికీ పక్కన దాక్కుని ఉన్నాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజేయగా అతడు వచ్చి మరియాలి కుమార్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఫోన్‌తో సహా అతను పారిపోయాడు. విషయాన్ని బాధితురాలు సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రతాప్‌రెడ్డి తదితరులకు తెలియజేసింది. సంఘం నేతలు పోలీసులకు ఫోన్ చేసి ఎలక్ట్రిషియన్‌ను పట్టుకుని విషయాన్ని సేకరించారు. ఐదేళ్లుగా మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు, ఫొటోలు తీస్తున్నట్లుగా అంగీకరించాడు. తాను తీసిన వీడియోలు, ఫొటోలు అన్నీ తొలగించినట్టుగా తెలియజేశాడు. అనంతరం నిందితుడిని కాలనీ నేతలు మధురానగర్ పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదు రోజులుగా గూగుల్‌లో అదే పని..
బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు(Om Prakash Case) దర్యాప్తులో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. గూగుల్‌లో వెతికి మరీ భర్త ఓం ప్రకాశ్‌ను పల్లవి(Wife Pallavi) హతమార్చినట్లు వెల్లడైంది. అంతేకాదు తన భర్త తనపై విష ప్రయోగం చేశాడని.. ఆయన పెట్టే హింస భరించలేకే హత్య చేశానని ఆమె పోలీసుల ఎదుట చెప్పినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తున్నాయి. హత్యకు ఐదు రోజుల ముందు నుంచి పల్లవి గూగుల్‌లో విపరీతంగా వెతుకుతూ వస్తోంది. ఎక్కడ నరాలు తెగితే మనిషి త్వరగా చనిపోతాడోనని వెతికిందామె. చివరకు మెడ దగ్గరి నరాలను దెబ్బ తీస్తే చనిపోతారని నిర్ధారించుకుని హత్య చేసింది. ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాల నేపథ్యంలో తన భర్త, కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ను పల్లవి హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే..ఓం ప్రకాశ్ కొడుకు కార్తీక్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. స్కిజోఫ్రెనియా అనే మానసిక సమస్యతో బాధపడుతున్న ఆమె.. భర్త నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఊహించుకుంటూ వస్తోంది. ఈలోపు ఆస్తి తగదాలు కూడా మొదలు కాగా.. భర్తకు మరో మహిళతో సంబంధం ఉందంటూ కుటుంబ వాట్సాప్ గ్రూపుల్లో కొన్నిరోజులుగా ఆమె సందేశాలు ఉంచుతూ వస్తోంది. పీటీఐ కథనం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నాం ఓం ప్రకాశ్ భోజనం చేస్తున్న సమయంలో పల్లవి భర్త ఓం ప్రకాశ్ కళ్లలో కారం కొట్టింది. ఆపై కాళ్లు చేతులు కట్టేసి విచక్షణరహితంగా పొడిచి హత్య చేసింది. భర్త ప్రాణం పోతుండగానే పోలీసులకు ఆమె సమాచారం అందించింది. పోలీసులు వచ్చి చూసే సరికి ఆయన రక్తపు మడుగులో పడి ఉండగా.. ఆమె రిలాక్స్‌గా ఓ కుర్చీలో కూర్చుని ఉంది. హత్య అనంతరం.. ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్‌లో సందేశం ఉంచిన ఆమె.. ఓ మాజీ అధికారికి తానొక మృగాన్ని చంపినట్లు సందేశం కూడా పంపినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక ఈ హత్య తన సోదరి కృతి పాత్ర కూడా ఉండొచ్చని ఓం ప్రకాశ్ తనయుడు కార్తీక్ ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ కేసులో పల్లవిని ప్రాథమిక నిందితురాలిగా అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆమె నుంచి కీలక వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. -
ఎంత పని చేశావమ్మా..
మెదక్: కన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లే వారిని కడతేర్చింది. చుట్టుముట్టిన ఆర్థిక పరిస్థితులతో జీవితం భారమై వారిని వాగులోకి తోసి అంతమొందించింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించింది. అయితే.. తృటిలో ప్రాణాలతో బయటపడింది. ఈ హృదయ విదారకరమైన సంఘటన తూప్రాన్‌లో సోమవారం జరిగింది. ఎస్ఐ శివానందం, గ్రామస్తుల కథనం ప్రకారం.. మాసాయిపేటకు చెందిన వడ్డేపల్లి స్వామి– మమత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మద్యానికి బానిసైన స్వామి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ పెద్ద లేకపోవడంతో కుటుంబం గడవడం కష్టతరంగా మారింది. ఇద్దరు చిన్నారులతో కూలి పనులకు వెళ్ల లేక పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. చిన్న తనంలోనే మమత తల్లిదండ్రులను కోల్పోవడంతో చిన్నమ్మ పెద్ద చేసి పెళ్లి చేసింది. ఈక్రమంలో భర్త చనిపోవడంతో కుటుంబం రోడ్డున పడింది. దీంతో శివ్వంపేట మండలం దంతాన్‌పల్లిలో ఉండే చిన్నమ్మ మైసమ్మ వద్దకు ఇద్దరు చిన్నారులతో కలిసి చేరింది. కూలికి వెళ్లి వచ్చిన డబ్బులతో తన ఇద్దరు పిల్లలను పోషించుకుంటుంది. పెద్ద కూతురు పూజిత (7) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుండగా, రెండో కూతురు తేజస్విని (5) అంగన్వాడీ స్కూల్లో చదువుకుంటుంది. దశదినకర్మకు వెళ్తున్నానని.. దుబ్బాక మండలం వడ్డెపల్లిలో బంధువుల ఇంట్లో దశదిన కర్మకు వెళ్తున్నానని చిన్నమ్మకు చెప్పిన మమత.. ఇద్దరు కూతుర్లతో కలిసి ఇంటి నుంచి ఉదయం 8.30 గంటలకు బయలు దేరింది. నాగులపల్లి సమీపంలోని రైలు పట్టాలపై కూర్చొని తన బిడ్డలతో ‘నాన్న వద్దకు వెళుదాం’అని చెప్పింది. అనంతరం దంతాన్‌పల్లిలోని తన ఇంటి పక్కన ఉన్న కుటుంబ సభ్యులతో ఫోన్లో పిల్లలతో మాట్లాడించింది. ‘మా అమ్మ మమ్మల్ని.. మా నాన్న వద్దకు తీసుకెళుతానంటుంది, మేము అక్కడికే వెళ్తున్నాం’ఆ చిన్నారులు ఫోన్లో మాట్లాడారు. అనుమానం వచ్చిన పక్కింటి వారు రైలు పట్టాల వద్ద వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఫోన్ పని చేయలేదు. గంట అనంతరం హల్దీవాగులో ఇద్దరు చిన్నారులతో కలిసి దూకింది. మమత ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడగా.. పిల్లలు మృత్యువాతపడ్డారు. గజ ఈతగాళ్ల సహాయంతో వాగు నుంచి ఇద్దరు చిన్నారుల మృతదేహాలపై బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించా రు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటన స్థలా నికి చేరుకొని బో రున విలపించారు. పోలీసులు తల్లి మమతను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
కానిస్టేబుల్‌తో నిర్మల వివాహేతర సంబంధం..
వరంగల్ క్రైం: ములుగు జిల్లా వెంకటాపూర్ (కె) మండల కేంద్రానికి చెందిన ‘చేయూత’స్వచ్ఛంద సంస్థ కార్యకర్త చేడం సాయి ప్రకాశ్(30)ను కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సాయి ప్రకాశ్ ఈనెల 15న వెంకటాపూర్ నుంచి హనుమకొండకు తన బంధువులను ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత తన ఆచూకీ తెలియకపోవడంతో ఈనెల 16, 17 తేదీల్లో వెతికిన అనంతరం 18న బంధువులు హనుమకొండ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా సాయిప్రకాశ్ హనుమకొండకు వచ్చిన ఆస్పత్రి, ఆ తరువాత వెళ్లిన దృశ్యాలను సీసీ టీవీ ఫుటేజీల ద్వారా పరిశీలించారు. తన ఫోన్ ద్వారా ఆచూకీ కనిపెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికి వివరాలు రాకపోవడంతో ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే సాయి ప్రకాశ్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు కరీంనగర్లో హత్య చేసినట్లు తెలిసింది. దీంతో సాయి ప్రకాశ్‌కు ఎవరితో శతృత్వం ఉందనే కోణంలో విచారణ చేపట్టడంతో నిందితుల సమాచారం తెలిసినట్లు తెలిసింది. నిందితుల్లో కానిస్టేబుల్? సాయి ప్రకాశ్ హత్య సంఘటనలో పాల్గొన్న నిందితుల్లో ఓ కానిస్టేబుల్ ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. హనుమకొండలో సాయి ప్రకాశ్‌ను కిడ్నాప్ చేసి కరీంనగర్లో హత్య చేసినట్లు గుర్తించారు. ఈ హత్యకు గతంలో వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన ఓ కానిస్టేబుల్ ప్రధాన కారణమని తెలిసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కానిస్టేబుల్ శ్రీనివాస్‌తో కలిసి ప్రకాష్‌ను సుపారీ గ్యాంగ్‌తో పిన్ని నిర్మల హత్య చేయించింది. కానిస్టేబుల్ వివాహేతర సంబంధం విషయంలో సాయి ప్రకాష్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలిసింది. దానిని మనస్సులో పెట్టుకుని సాయి ప్రకాశ్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు తెలిసింది. -
ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్‌పై దాడి కేసులో ట్విస్ట్
బెంగళూరు: ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్‌పై దాడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. బెంగళూరులో తమపై కొందరు దాడి చేశారని వింగ్ కమాండర్ షీలాదిత్యా బోస్, ఆయన భార్య, స్క్వాడ్రన్ లీడర్ మధుమిత ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే.. తొలుత బోస్ దాడికి దిగినట్లుగా కన్పిస్తున్న సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని ఓ పోలీసు అధికారి ధ్రువీకరించారు కూడా.భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ బోస్ సంచలన ఆరోపణలకు దిగారు. కారులో వెళ్తున్న తమను కొందరు వ్యక్తులు బైక్‌పై వచ్చి అడ్డగించి దాడి చేశారని ఆరోపించారు. ఆయన భార్య, స్క్వాడ్రన్ లీడర్ మధుమిత కూడా.. పోలీసులకు ఈ విషయం చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో బోస్ ముఖం, మెడ నిండా రక్తం కనిపించింది. పక్కనే ఆయన భార్య కారు నడుపుతూ కనిపించింది. ఈ వ్యవహారం ‘కన్నడిగ వర్సెస్ నాన్ కన్నడిగ’గా మారింది. అయితే వీడియో ఆధారంగా విచారణ జరిపిన ఈస్ట్ జోన్ డీసీపీ దేవ్‌రాజ్ షాకింగ్ విషయం తెలియజేశారు. తొలుత బోస్ వాళ్లపై దాడికి దిగారని తెలియజేశారు. అంతేకాదు.. ఈ ఘటనకు సంబంధించిన నిందితుడు కూడా బోస్పై ఫిర్యాదు చేశారని అన్నారు. అయితే పరస్పర దాడికి కారణాలు పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే తెలియజేస్తామన్నారు. బోస్, మధుమిత వీడియోలో.. ‘‘కారులో వెళ్తున్న మమ్మల్ని మా వెనకే బైక్‌పై వచ్చిన వ్యక్తులు అడ్డగించారు. మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. మా కారుపై ఉన్న డీఆర్డీఓ స్టిక్కర్‌ను చూశారు. నా భార్యను తిట్టడంతో తట్టుకోలేకపోయాను. దాంతో నేను కారు నుంచి బయటకు రావడంతో.. ఒక వ్యక్తి కీతో నా ముఖంపై కొట్టాడు. దాంతో నా ముఖమంతా రక్తం కారింది. మిమ్మల్ని రక్షించే వ్యక్తులతో మీరు ఇలాగేనా వ్యవహరించేదని’’ నేను గట్టిగా మాట్లాడాను. కానీ ఆశ్చర్యంగా ఇంకా చాలా మంది వ్యక్తులు వచ్చి, మమ్మల్ని దూషించడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి రాయి తీసుకొని, కారు అద్దాలను, నా తలను పగలగొట్టాలని ప్రయత్నించాడు. అదీ నా పరిస్థితి. వెంటనే అప్రమత్తమైన నా భార్య నన్ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. ఫిర్యాదు చేద్దామని వెళ్తే అక్కడ ఎలాంటి స్పందనా రాలేదు. కర్ణాటకలో ఇలాంటి పరిస్థితులు ఆశ్చర్యంగా ఉన్నాయి.’’ అంటూ ఆ భార్యాభర్తలు వీడియోలో వ్యాఖ్యానించారు.#BREAKINGWing commander assault case in #BengaluruCCTV tells a different story.. Wing Commander Shiladitya Bose seen brutally assaulting the biker at Tin Factory JunctionDespite locals stepping in to stop the violence, the officer can be seen continuing the attack...blowing… pic.twitter.com/ovMg9g4xcS— Nabila Jamal (@nabilajamal_) April 21, 2025 -
Domalguda: నీటి సంపులో యువతి అస్తిపంజరం
కవాడిగూడ(హైదరాబాద్): లోయర్ ట్యాంక్ బండ్, డీబీఆర్ మిల్స్‌లోని నీటి సంపులో గుర్తుతెలియని యువతి అస్తిపంజరం బయటపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచి్చన ఈ ఘటన ఆదివారం దోమల గూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. డీఆర్ఆర్మిల్స్ 40 ఏళ్ల క్రితమే మూతపడింది. సెక్యురిటీ సిబ్బంది ఆదివారం సాయంత్రం మూత్ర విసర్జన కోసం పురాతన భవనం వైపు వెళ్లాడు. అనంతరం నీటి కోసం 3వ అంతస్తులో ఉన్న సంపు మూత తెరిచి చూడగా యువతి మృత దేహం కనిపించింది. దీంతో అతను వెంటనే దోమల గూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం ఉదయం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉంటుందని భావిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి సంపులో పడవేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మృత దేహం పూర్తిగా కుళ్లిపోవడంతో నీటి సంపును పగల గొట్టారు. క్లుస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. గుర్తుతెలియని వ్యక్తులు సదరు యువతిని ఇక్కడికి తీసుకువచ్చి అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తీసుకెళ్లలేని పరిస్థితి ఉండటంతో గాంధీ ఆసుపత్రి ఫోరెన్సిక్ సిబ్బందిని రప్పించి సోమవారం మధ్యాహ్నం అక్కడే పోస్టు మార్టం నిర్వహించారు. దోమల గూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ నిరంజన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ
కాచిగూడ(హైదరాబాద్): వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచి్చంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో పారిశ్రామికవేత్త హేమ్రాజ్ (62), అతడి భార్య మీనా దుగ్గర్ (59) నివాసముంటున్నారు. కొద్ది రోజుల క్రితం వారు నేపాల్‌కు చెందిన దంపతులను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇటీవల వారి కొడుకు, కోడలు విదేశీ యాత్రకు వెళ్లడంతో హేమ్రాజ్, అతడి భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన పనివారు ఆదివారం రాత్రి భోజనంలో మత్తు మందు కలిపారు. వారు మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించారు. ప్రతి రోజూ వాకింగ్‌కు వెళ్లే హేమరాజ్ సోమవారం వాకింగ్‌కు రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచి్చంది. దీంతో అతను స్నేహితుడి ఇంటికి వచ్చి తలుపు కొట్టడంతో మత్తులో ఉన్న హేమ్రాజ్ డోర్ తీశాడు. భార్య మీనా పూర్తిగా మత్తులోకి జారుకుంది. దీనిని గుర్తించిన అతను వారిని హైదర్‌గూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చించాడు. ప్రస్తుతం హేమ్రాజ్ స్పృహలో ఉన్నాడని, అతని భార్య ఇంకా స్పృహలోకి రాలేదని స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఈస్ట్‌జోన్ డీసీపీ, అడిషనల్ డీపీసీ, కాచిగూడ డిఐ, ఎస్ఐ పరిశీలించారు. క్లూస్‌టీంను రప్పించి ఆధారాలను సేకరించారు. నాలుగు టీంలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బ్లాక్‌మెయిల్‌కు బలైన ప్రతిభా కుసుమం
రాయచూరు రూరల్(కర్ణాటక): పాగల్ ప్రేమికుని వేధింపులకు ప్రతిభా కుసుమం రాలిపోయింది. పరువు పోతుందనే వ్యథతో ఓ వ్యాయామ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన గదగ్ జిల్లా అసుండి గ్రామంలో చోటు చేసుకుంది. మాజీ ప్రియుడు బ్లాక్మెయిల్ చేస్తుండటంతో భయపడి గదగ్ తాలూకా అసుండి సైరా బాను నదాఫ్ (29) డెత్‌నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మే 8న సైరాబానుకు ఓ యువకునితో పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. పెళ్లి కోసం ఆమె తల్లిదండ్రులు వస్తుసామగ్రిని కొనుగోలు చేశారు. గతంలో ఆమెకు మైలారి అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉండేది. మరొకరిని పెళ్లాడతావా అనే దుగ్ధతో మైలారి రగిలిపోయాడు. గతంలో తామివద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వీడియోలను, అలాగే ఆడియోలను వైరల్ చేస్తానంటూ సైరాబానును బెదిరించసాగాడు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే పెళ్లి ఆగిపోతుంది, పరువు పోతుందని ఆమె బాధపడింది. తన చావుకు మైలారి కారణమని నోట్ రాసి ఉరివేసుకుని చనిపోయింది. ఆటల్లో ఆమె మేటి సైరాబాను చిన్నచాటి నుంచి ఆటపాటల్లో మేటిగా ఉండేది. క్రీడాంశాల్లో ప్రతిభావంతురాలు. స్కూలు, కాలేజీ రోజుల్లో క్రీడాకారిణిగా ట్రోఫీలను సాధించింది. కుస్తీ పోటీలలో రాష్ట్ర స్థాయిలో పేరు సంపాదించింది. అదే నైపుణ్యంతో పీఈటీ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం ఓ ప్రైవేటు స్కూల్లో డ్రిల్ టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. గదగ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మైలారిని అరెస్టుచేశారు. -
ఇంటి కలహం.. అంతు చూసింది
కర్ణాటక: విశ్రాంత డీజీపీ ఓం ప్రకాష్ ఆదివారం ఇంట్లో డైనింగ్ టేబుల్‌పై చేపల కూరతో భోజనం చేస్తుండగా హత్య చేసినట్లు తెలిసింది. బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్ లోని నివాస భవనంలో ఆయన దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. ఆయన భార్య పల్లవి, కూతురు కృతిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. హత్యా సంగతులు క్రమంగా బయటపడుతున్నాయి. మధ్యాహ్నం ఓంప్రకాష్ చేపల కూరను తెప్పించుకున్నారు. డైనింగ్టేబుల్పై ఆరగిస్తుండగా భార్య గొడవకు దిగింది. రగడ తారాస్థాయికి చేరుకుంది, భార్య ఆవేశం పట్టలేక ఓంప్రకాష్ కళ్లలో కారంపొడి చల్లి కత్తితో పొడిచి చంపింది. తరువాత పై అంతస్తు గదిలోకి వెళ్లిన భార్య, కుమార్తె పోలీసులకు సమాచారం అందించారు. హెచ్‌ఎస్‌ఆర్‌లేఔట్ పోలీసులు వెళ్లగానే కూతురు కృతి తలుపులను లాక్ చేసింది. హత్య చేసింది ఎవరు అని పోలీసులు ప్రశ్నించగా భార్య పల్లవి నేనే అని బదులిచ్చింది. క్రైంసీన్ పరిశీలనలో భోజనం ప్లేట్ డైనింగ్టేబుల్పై కనబడింది. డైనింగ్ హాల్ రక్తసిక్తమైన ఓంప్రకాష్ శవం పడి ఉంది. కళ్లలో కారంపొడి చల్లిన గుర్తులు కనబడ్డాయి. చాకుతో , బీర్ బాటిల్‌తో పొడిచారు. పగిలిన బీర్ బాటిల్ లభించింది. సోమవారం ఉదయం తల్లీకూతురిని హెచ్ఎస్ఆర్ లేఔట్ ఠాణాకు తరలిస్తుండగా గొడవకు దిగారు. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు అని కేకలు వేస్తూ జీపు నుంచి దిగలేదు. పోలీసులు సముదాయించి తీసుకెళ్లారు. ఓంప్రకాష్ హత్య కేసు విచారణను మడివాళ ఏసీపీ వాసుదేవ్ కు అప్పగించారు. కాగా, కుటుంబసభ్యులు సంప్రదాయరీతిలో అంత్యక్రియలను నిర్వహించారు. మరో మహిళతో ఎఫైర్ ఓంప్రకాష్ చిక్కమగళూరుకు చెందిన మహిళతో ఆత్మీయంగా ఉంటున్నారు. సదరు మహిళ 2015లో ఓంప్రకాష్ డీజీపీగా ఉండగా ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేసింది. ఓంప్రకాష్ మోసం చేశాడని ఆరోపించింది. ఈ సంఘటన ఓంప్రకాష్ దంపతుల మధ్య కలహాలకు కారణమైంది. ఇప్పుడు ఆమెను కూడా కనిపెట్టి విచారణ చేయాలని పోలీసులు తీర్మానించారు. శాంతిభద్రతలు ఉన్నాయా: విపక్ష నేత దొడ్డబళ్లాపురం: రిటైర్డ్ డీజీపీ ఓం ప్రకాశ్ తన కుటుంబ సభ్యుల చేతుల్లో దారుణ హత్యకు గురికావడం రాష్ట్రంలో శాంతిభద్రతల దుస్థితికి అద్దం పడుతోందని బీజేపీ పక్ష నేత ఆర్ అశోక్ విమర్శించారు. బెంగళూరులో మాట్లాడుతూ ఈ హత్య విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ అసలు ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు రోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయన్నారు.దాండేలిలో ఫాంహౌస్, రిసార్టు ఓంప్రకాష్ గతంలో ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఆయనకు దాండేలిలో కోట్లాది రూపాయలు విలువచేసే ఆస్తులు ఉన్నాయి. సామజోయిడా గ్రామంలో 2 ఎకరాలకు పైగా భూమిలో సుందరమైన ఫాంహౌస్‌ను నిర్మించారు. శ్రీగంధం, అరటి తోట వేశారు. అక్కడే కాళీనది పక్కన ఐదెకరాల భూమి ఉంది ఈ స్దలంలో రిసార్టు నిర్మించి పర్యాటకులకు రివర్ ర్యాఫ్టింగ్ కూడా చేస్తున్నారు. ఈ ఆస్తి ఓంప్రకాష్ కుమారుడు కార్తీకేశ్ పేరులో ఉంది.ఇప్పుడే చెప్పలేను: హోంమంత్రి రిటైర్డ్ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసులో సమగ్ర విచారణ జరిగేవరకు ఏమి చెప్పేందుకు సాధ్యపడదు. తనిఖీలో ఎలాంటి సమాచారం లభిస్తుంది అనేది చూడాల్సి ఉందని హోం మంత్రి పరమేశ్వర్ అన్నారు. ఉత్తమ అధికారికి, మంచి వ్యక్తి. ఈ విధంగా జరుగకుండా ఉండాల్సిందని అన్నారు. విచారణ పూర్తయ్యేవరకు ఘటనకు కారణం ఏమిటనేది చెప్పలేమని అన్నారు. క్రూరంగా హత్య చేశారు బనశంకరి: విశ్రాంత డీజీపీ ఓంప్రకాష్ హత్యకు గురయ్యే గంట ముందు వరకు వ్యక్తిగత సిబ్బందితో బాగానే మాట్లాడారు, ఇలా హత్యకు గురికావడం దురదృష్టకరమని వీవీఐపీ సెక్యూరిటీ విభాగం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఓంప్రకాష్ ఇంటి వద్ద ఆయన మాట్లాడుతూ.. ఆదివారం మధ్యాహ్నం 3.05 నిమిషాలకు ఓంప్రకా‹Ùకు ఫోన్ చేస్తే సంతోషంగా మాట్లాడారు, సోమవారం ఇంటికి వస్తాను సార్ అని చెప్పా, వద్దు ఇంట్లో మేడం ఉన్నారని సార్ చెప్పారు అని పేర్కొన్నారు. చాలా క్రూరంగా హత్య చేశారని, గొంతు భాగంలో రెండుసార్లు పొడిచారు, మృతదేహాన్ని చూడగానే సారేనా హత్యకు గురైంది అని దిగ్భ్రాంతికి లోనయ్యాను అన్నారు. కుమార్తెకు పెళ్లి చేసి, కొడుకుతో ఉంటానని చెప్పేవారన్నారు. -
‘నేను లేని టైమ్ చూసి నాన్నను చంపేశారు’
బెంగళూరు: ఓ రాష్ట్రానికి డీజీపీగా పని చేసిన వ్యక్తి దారుణంగా హత్య గావించబడటం చాలా విచారకరం. అది కూడా భార్య, కూతురు కలిసి చేసిన మాస్టర్ ప్లాన్ కు బలికావడం ఇంకా దురదృష్టకరం. కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓమ్ ప్రకాష్ హత్య అనంతరం అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య పల్లవి బాధ పడలేక తన సోదరి సరితా కుమారి ఇంటి వద్దే ఉంటున్న ఓమ్ ప్రకాష్ ను ఇంటికి రప్పించి మరీ హత్య చేయడం సమాజంలోని పరిస్థితులు ఇంతలా దిగజారిపోవడానికి అద్దం పడుతోంది. నేను ఇంట్లో లేని సమయంలోనే నాన్న హత్యఅయితే ఈ విషయంలో కుమారుడు కార్తీకేష్ ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం తల్లి, సోదరి పాత్రలను ప్రముఖంగా ప్రస్తావించాడు. గత కొంతకాలంగా తల్లి పల్లవి.. నాన్నను చంపుతానంటూ బెదిరిస్తోందనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే గతంలో నాన్నపై హత్యాయత్నం చేయడానికి అమ్మ యత్నించిందన్నాడు. పెద్ద రాయి తీసుకుని తలపై కొట్టి చంపాలని చూసిందన్నాడు.‘ మా తండ్రిని చంపుతానని పదే పదే అమ్మ బెదిరిస్తూ వస్తోంది. ఈ బెదిరింపులతో మా నాన్న కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయి బయటే ఉంటున్నారు. నాన్న సోదరి( మా అత్త) సరితా కుమారి ఇంటికి వెళ్లిపోయి అక్కడే ఉంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం నా సోదరి కృతి.. నాన్న వద్దకు వెళ్లింది. ఇంటికి తిరిగి రావాలని పట్టుబట్టింది. నేను రానని నాన్న చెప్పినా పట్టుబట్టుకుని కూర్చొంది. దాంతో నాన్న తిరిగి ఇంటికి వచ్చారు.నాన్నను వెంట తీసుకునే వచ్చింది కృతి. ఇష్టంలేకుండానే నాన్న ఇంటికి వచ్చారు. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. నేను ఇంట్లో లేని సమయం చూసి వాళ్లిద్దరూ కలిసి నాన్నను హత్య చేశారు. నాకు ఓ స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడు. మీ నాన్నకు ఇలా అయ్యిందనే విషయాన్ని చెప్పాడు. నేను సరిగ్గా నిన్న సాయంత్రం(ఆదివారం) గం. 5.45 ని.లకు ఇంటికి తిరిగి వచ్చేశాను. అప్పటికే మా ప్రాంగణమంతా పోలీసులు, చుట్టుపక్కల వారితో నిండిపోయి ఉంది. నేను మా నాన్న రక్తమడుగులో పడి ఉండటం చూశాం. ఆయన శరీరమంతా గాయాలతో నిండిపోయింది. నాన్న శరీరంలో పగిలిన బాటిల్, కత్తి ఉండటాన్ని గమనించాను. అప్పుడు సెయింట్ జాన్స్ హాస్పిటల్ప్ కి నాన్నని తీసుకెళ్లాం. మా అమ్మ, చెల్లి కూడా పూర్తి డిప్రెషన్ లో ఉన్నారు. అమ్మా, సోదరి కలిసే నాన్నను హత్య చేశారనే విషయాన్ని బలంగా నమ్ముతున్నా’ అని పోలీస్ లకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో కార్తీకేష్ చెప్పుకొచ్చాడు.12 ఏళ్లుగా.. భయం భయంగానే? -
తెల్లారితే భార్య ప్రసవం.. పిడుగు పాటుతో భర్త మృతి
ఎమ్మిగనూరురూరల్(కర్నూలు): తెల్లారితే తన రక్తాన్ని పంచుకుని పుట్టే శిశువును ఆ యువకుడు చూడాల్సి ఉంది. అయితే విధి పగపట్టింది. పసికందును చూడకుండానే పిడుగు రూపంలో మృత్యు ఒడికి చేర్చింది. ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి ఎమ్మిగనూరు మండలం గుడేకల్ కొండపై చోటుచేసుకుంది. పెద్దకడుబూరు మండలం హనుమాపురం గ్రామానికి చెందిన గొల్ల ఈరన్న(25) ఎమ్మిగనూరు యాక్సిస్ బ్యాంక్‌లో బంగారు నగలపై తీసుకున్న రుణాలు రికవరీ చేసే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ యువకుడు అదే గ్రామానికి చెందిన గొల్ల సరస్వతిని పెళ్లి చేసుకున్నాడు. సరస్వతి నేడు (సోమవారం) ప్రసవం అవుతుందని వైద్యులు చెప్పారు. గొల్ల ఈరన్న తల్లి లక్ష్మీకి అనారోగ్యంగా ఉండటంతో గుడేకల్ కొండపై ఉండే సుంకాలమ్మకు మొ క్కు తీర్చుకుంటే తగ్గుతుందని పెద్దలు చెప్పారు. దీంతో ఆదివారం సాయంత్రం గొల్ల ఈరన్న, అతని స్నేహితులు, బంధువులైన సహదేవుడు, ఈరన్న, రామాంజనేయులు కలసి కొండపై శ్రీ సుంకాలమ్మ గుడి దగ్గరకు వెళ్లారు. మొక్కుబడి తీర్చుకొని అక్కడే వంట చేసుకొని భోజనం చేశారు. ఆకస్మాత్తుగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు రావడంతో చెట్టు కిందకు నలుగురు వెళ్లారు. చెట్టు కింద కూర్చున్న గొల్ల ఈరన్నపై పిడుగు పడటంతో అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. పక్కనే ఉన్న సహదేవుడు, ఈరన్న, రామాంజనేయులకు స్వల్ప గాయాలయ్యాయి. గ్రామంలో ఉన్న బంధువులకు సమాచారం అందించటంతో అక్కడికి వచ్చి గొల్ల ఈరన్నతో పాటు మరో ముగ్గురిని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే గొల్ల ఈరన్న(25) మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన భార్య సరస్వతికి సోమవారం ప్రసవం ఉందని బంధువుల దగ్గర గొల్ల ఈరన్న చెప్పారు. భార్య ఒకరికి ప్రాణం పోసేలోపే భర్త ప్రాణం పిడుగు రూపంలో తీసుకుపోవటంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. రూరల్ ఏఎస్ఐ రామేశ్వరావు, కానిస్టేబుల్ బి.గోపాల్ ప్రభుత్వాసుపత్రికి వచ్చి ప్రమాదం జరిగిన తీరును మృతుడి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎమ్మిగనూరు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు చెప్పారు. -
Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు దర్యాప్తు లోతుకు వెళ్లే కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. భార్య పల్లవి ఆయనపై ఓ బాటిల్‌తో దాడి చేసి.. ఆపై కారం పొడి చల్లి కట్టేసి మరీ కడతేర్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రాణం పోతున్న టైంలో పోలీసులకు సమాచారం అందించిన ఆమె.. భర్త ముఖం మీద గుడ్డ కప్పి తాపీగా కుర్చీలో కూర్చుని చూస్తున్నట్లు తేలింది.బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(Ex DGP Om Prakash) తనయుడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఓం ప్రకాశ్ భార్య పల్లవి, కూతురు క్రుతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత 12 ఏళ్లుగా స్కిజోఫ్రెనియా(Schizophrenia)తో బాధపడుతోంది. నగరంలోని ఓ ప్రముఖ వైద్యుడి దగ్గర ఆమె చికిత్స కూడా తీసుకుంటోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా భర్తపైనా ఆమె సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. తన ప్రాణాలకు తన భర్త నుంచి ముప్పు పొంచి ఉందని.. తుపాకీతో పలుమార్లు బెదిరించడాన్ని ఫ్యామిలీకి చెందిన ఐపీఎస్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో మెసేజ్‌లు పెడుతూ వచ్చింది. అయితే ఆమె మానసిక స్థితి గురించి తెలిసిన ఓం ప్రకాశ్.. ఆ చేష్టలను తేలికగా తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో.. ఈ మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఈ కారణాలతోనే ఆమె భర్తను హత్య చేసి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకి వచ్చినట్లు ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. ఆదివారం సాయంత్రం నుంచి పల్లవి(Pallavi)ని, క్రుతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఈ కేసులో అరెస్టులు చేస్తామని బెంగళూరు కమిషనర్ బీ దయానంద్ చెబుతున్నారు. ఈ ఘటనను దురదృష్టకరమైందిగా అభివర్ణించిన హోం మంత్రి పరమేశ్వర.. ఓం ప్రకాశ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాశ్ స్వస్థలం బిహార్‌లోని చంపారన్. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి, 2017లో పదవీ విరమణ పొందారు. ఆపై కుటుంబంతో బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ‘ఐ హ్యావ్ ఫినిష్డ్ మాన్స్టర్’ అంటూ ఫోనులో మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఛాతీలో, మెడ వద్ద, కడుపులో, చేతిలో కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తీవ్ర రక్త స్రావం కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన టైంలో కూతురు క్రుృతి కూడా ఇంట్లోనే ఉంది. దీంతో ఆమె పాత్ర కూడా ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.స్కిజోఫ్రెనియా(Schizophrenia).. ఈ సమస్యతో బాధపడేవారు ఎప్పుడూ ఒక రకమైన భ్రమలో ఉంటారు. లేనిపోనివి ఊహించుకుని భయపడిపోతుంటారు. మనస్సులో ఏదో ఊహించుకుంటూ నిరంతరం ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు వాస్తవానికి దూరంగా ఊహల్లో ఉంటారు. తమలో తాము మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఇతరులను పట్టించుకోకుండా తన మానాన తానుండటం, నిరంతర ఆలోచనలు, నిద్రలేమి, ఎవరో పిలుస్తున్నట్టుగా, తనతో మాట్లాడుతున్నట్టుగా భావించి సమాధానం ఇవ్వడంలాంటివి వ్యాధి లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సైకియాట్రిస్టును సంప్రదించాల్సి ఉంటుంది. -
చిన్నారిని ఛిదిమేసిన కారు
గోదావరిఖని(రామగుండం): రెండోకాన్పు కోసం తల్లిగారింటికి వచ్చింది.. పండంటి పాపకు జన్మనిచ్చింది. అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఆమె మొదటి సంతానం మూడేళ్ల బాలున్ని కారు రూపంలో మృత్యువు బలితీసుకుంది. గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై భూమేశ్ కథనం ప్రకారం.. స్థానిక గంగానగర్‌లో శివరాజ్‌కుమార్(3) ఆదివారం కారు ఢీకొని మృతిచెందాడు. ముత్తారం మండలం మచ్చుపేట గ్రామానికి చెందిన పులిపాక రమేశ్ కొండగట్టు జేఎన్టీయూలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి గంగానగర్‌కు చెందిన సంధ్యతో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల శివరాజ్‌కుమార్ ఉండగా, సంధ్య రెండో కాన్పుకోసం తల్లిగారింటికి గంగానగర్ వచ్చింది. పాప జన్మించి మూడు నెలలు అయ్యింది. ఆదివారం కుటుంబ సభ్యులతో శివరాజ్‌కుమార్ ఆడుకుంటూ అనుకోకుండా ఒక్కసారిగా రోడ్ పైకి రాగా, మంచిర్యాల్ నుంచి గంగానగర్‌కు వెళ్తున్న కార్ ఢీకొట్టింది. ఈప్రమాదంలో శివరాజ్‌కుమార్ మెడపై భాగంలో గాయాలయ్యాయి. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అప్పటివరకు అందరితో ఆడుకుంటూ క్షణాల్లో మాయమైన కుమారున్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. -
ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
దుండిగల్(హైదరాబాద్): ఓఆర్ఆర్పై వేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు సాఫ్వేర్ ఇంజినీర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన భాను ప్రకాశ్ (36), నళినికంఠ బిస్వాల్ (37)లు స్నేహితులు. వీరు తమ కుటుంబాలతో కలిసి రాజేంద్రనగర్ మంచిరేవులలోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరు ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మేడ్చల్ నుంచి పటాన్చెరు వైపు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో మల్లంపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భాను ప్రకాశ్, బిస్వాల్ అక్కడికక్కడే మృతి చెందారు. భాను ప్రకాశ్ భార్య సాయి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమత్తుతో పాటు అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. -
బెట్టింగ్ యాప్స్‌లో గెలిచిన డబ్బులు తీసుకోలేని పరిస్థితి..!
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం ఆత్మహత్య చేసుకున్న పవన్.. షాద్‌నగర్ ఠాణా పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చిన సాయిరాహుల్ హత్య.. మూడు రోజుల వ్యవధిలోనే ఈ రెండు దారుణాలకు బెట్టింగ్ యాప్సే కారణం. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినప్పటికీ... వీటి కార్యకలాపాలు మాత్రం ఆగట్లేదు. ఈ బెట్టింగ్, గేమింగ్స్ యాప్స్ వెనుక చైనీయులే ఉంటున్నారు. ఉత్తరాదిలోని మెట్రో నగరాల కేంద్రంగా, స్థానికులతో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి దందా నడిపిస్తున్నారు. ప్రత్యేక ఆల్గర్‌థెమ్ ఆ«ధారంగా పని చేసే ఈ యాప్స్ నిర్వాహకులకే లాభం చేకూర్చేలా పని చేస్తుంటాయి. వీటిలో డబ్బు వేయడానికి పరిమితులు లేకపోయినా.. డ్రా చేసుకోవడానికి మాత్రం పరిమితులు ఉంటాయి. ఇలా గెలిచినా, ఓడినా ఆ మొత్తం తమ అ«దీనంలోనే ఉండేలా డిజైన్ చేస్తున్నారు. మరో రెండు ప్రాణాలు బలి.. సీరియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రారంభించిన ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ ప్రచారం తర్వాత ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్స్ కేసుల దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది. అయినప్పటికీ యాప్స్ తమ కార్యకలాపాలు మాత్రం ఆపలేదు. ఇప్పటికీ కొన్ని యాప్స్ ఆన్లైన్ ద్వారా తమ ప్రచారం కొనసాగిస్తున్నాయి. బెట్టింగ్‌కు బానిసగా మారిన యువకుడు అత్తాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నాళ్లుగా ఈ బెట్టింగ్‌కు అలవాటుపడిన పవన్ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి డబ్బు తీసుకున్నాడు. చివరకు తాను ఎంతో ముచ్చటపడి ఖరీదు చేసుకున్న బుల్లెట్, ఐఫోన్ సైతం అమ్మేశాడు. బెట్టింగ్ విషయంలో నగరంలోని ఓ హాస్టల్లో ఉంటున్న సాయి రాహుల్, వెంకటేష్ మధ్య ఏర్పడిన వివాదం రాహుల్ ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. ఓ చోట కంపెనీ, మరోచోట అకౌంట్లు.. ఈ గేమింగ్ యాప్స్‌లో లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి. ఈ నేపథ్యంలో కరెంట్ బ్యాంకు ఖాతాలు నిర్వాహకులకు అనివార్యం. చైనీయులకు నేరుగా ఖాతాలు తెరిచే అవకాశం లేకపోవడంతో దళారుల ద్వారా ఉత్తరాదికి చెందిన వారిని సంప్రదిస్తున్నారు. డమ్మీ డైరెక్టర్లను ఏర్పాటు చేసి షెల్ కంపెనీలు రిజిస్టర్ చేయించుకుంటున్నారు. ఓ నగరంలో కంపెనీ రిజిస్టర్ చేస్తే.. మరో నగరంలో దాని పేరుతో బ్యాంకు ఖాతాలను తెరుస్తున్నారు. డమ్మీ కంపెనీల పేరుతో వెబ్‌సైట్స్‌ను రిజిస్టర్ చేస్తున్నారు. వీటి ముసుగులోనే బెట్టింగ్, గేమింగ్ యాప్స్ నిర్వహిస్తున్నారు. ఆ కంపెనీల పేరుతోనే పేమెంట్ గేట్వేస్ అయిన కాష్ ఫ్రీ, పేటీఎం, రేజర్ పే, ఫోన్ పే, గూగుల్ పేలతో లావాదేవీలకు ఒప్పందాలు చేసుకున్నారు. లింకుల ద్వారానే యాప్స్ చలామణి.. ఈ యాప్స్‌ను నిర్వాహకులు ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్స్‌లో హోస్ట్ చేయట్లేదు. కేవలం టెలిగ్రాం, వాట్సాప్ గ్రూపుల ద్వారా లింకుల రూపంలో మాత్రమే చలామణి చేస్తున్నారు. ఈ లింకు ద్వారా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై అందులో నగదు నింపడాన్ని లోడింగ్‌గా పిలుస్తారు. ఒక వ్యక్తి, ఒక రోజు ఎంత మొత్తమైనా లోడ్ చేసుకోవచ్చు. ఎదుటి వ్యక్తికి తమ గేమ్‌కు బానిసలుగా మార్చడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ఆల్గర్‌థెమ్ ద్వారా నడుస్తుంటాయి. దాని ప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్‌లోనూ వాళ్లే గెలిచేలా చేసి బానిసలుగా మారుస్తారు. ఆపై గెలుపు–ఓటములు 3:7 రేషియోలో ఉండేలా ఆల్గర్‌థెమ్ పని చేస్తుంది. రోజుకు విత్‌డ్రా రూ.500.. ఈ బెట్టింగ్, గేమింగ్‌లో ఓ వ్యక్తి ఎంత మొత్త గెలిచాడనేది ఆయా యాప్స్‌కు సంబంధించిన వర్చువల్ అకౌంట్లలో కనిపిస్తూ ఉంటుంది. ఆ మొత్తాన్ని గేమింగ్‌లో వెచి్చంచడానికి పరిమితులు ఉండవు. విత్‌డ్రా చేసుకోవడానికి ఆ మొత్తాన్ని తొలుత యాప్ నుంచి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మాత్రం నిర్వాహకులు పరిమితులు విధిస్తున్నారు. కనిష్టంగా రూ.500 నుంచి రూ.1000 వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఈ కారణంగా ఎవరైనా ఆయా గేమ్స్, బెట్టింగ్‌లో గెలిచినా.. డబ్బు డ్రా చేసుకోలేని పరిస్థితి ఉంటోంది. దీంతో అప్పటికే బానిసై ఉండటంతో ఆ మొత్తం వెచ్చించి ఆడటానికే ఆసక్తి చూపి నష్టపోతున్నారు. ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న ఆన్లైన్ గేమింగ్‌కు రాష్ట్రంలో అనుమతి లేదు. ఇక్కడ ఎవరైనా ఆ యాప్‌ను ఓపెన్ చేస్తే.. జీపీఎస్ ఆధారంగా విషయం గుర్తించే నిర్వాహకులు గేమ్‌కు అక్కడ అనుమతి లేదంటూ స్క్రీన్‌పై సందేశం కనిపించేలా చేస్తారు. అయితే ఫేక్ జీపీఎస్ యాప్స్‌ను ఇన్‌స్టల్ చేసుకుంటున్నారు. -
అందంగా లేదని చిత్రహింసలు
రాయచూరురూరల్(కర్ణాటక): ఎన్నో ఆశలతో అత్తింటిలోకి అడుగు పెట్టిన నవ వధువుకు కొద్ది రోజుల్లోనే వేధింపులు ఎదురయ్యాయి. అందంగా లేవని సూటిపోటి మాటలతో చిత్రహింసలు పెట్టడంతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గదగ్ జిల్లాలో చోటు చేసుకుంది. గదగ్ బేటిగేరిలోని శరణ బసవేశ్వర కాలనీకి చెందిన అమరేష్‌కు బళ్లారికి చెందిన పూజాతో నాలుగు నెలల క్రితం వివాహమైంది. భర్త అమరేష్ యాదగరి జిల్లా శహపురలోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవలే ఇతర ప్రాంతానికి బదలీ చేశారు. కొద్ది రోజలు పాటు బేటిగేరిలోనే ఉండాలని, అనంతరం బదిలీ అయిన ప్రాంతానికి తీసుకెళ్తాని భర్త చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం ఆమెకు అత్తింటిలో వేధింపులు మొదలయ్యాయి. అందంగా లేవని, వంటలు సరిగా చేయడం లేదని అత్త శశికళ, బావ వీరన గౌడలు సూటిపోటిమాటలతో మనస్సు నొచ్చుకునేలా వ్యవహరించేవారు. ఈ విషయాన్ని పుట్టింటి వారికి చెప్పగా కొద్ది రోజులు సర్దుకొని వెళ్లాలని సూచించారు. అయితే వేధింపులు ఎక్కువ కావడంతో పూజా ఈనెల 15న ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వెళ్లి పరిశీలించగా సూసైడ్ నోట్ లభించింది. అత్త శశికళ, బావ వీరన గౌడ వేధించినట్లు అందులో ఉండటంతో వారిని పోలీసుల అరెస్ట్ చేశారు. -
నిశ్చితార్థం వేళ.. చితి మంటల ఘోష!
తూర్పు గోదావరి(పిఠాపురం): తెల్లారితే కాబోయే ధర్మపత్నికి దండ వేసి, ఉంగరాలు మార్చుకోవాల్సిన ఆ యువకుడి బతుకు అంతలోనే తెల్లారిపోయింది. నిత్యం వేదం పలికే ఆ గొంతు మూగబోయింది. తాంబూలాలు అందుకోవాల్సిన తండ్రి తల కొరివి పెట్టాల్సి వచ్చింది. కొద్ది గంటల్లో ఓ యువతితో నిశ్చితార్థం చేసుకోవాల్సిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన కాకినాడ జిల్లా పిఠాపురంలో చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. వింజమూరి వెంకటేష్ (30) పిఠాపురంలో పురోహితుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం అతని వివాహ నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో శనివారం ఉదయమే కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెళ్లి, వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని వచ్చాడు. నిశ్చితార్థంలో వధువుకు, తనకు కావాల్సిన ఉంగరాలను తమ వేలి ముద్రలు ఉండేలా ప్రత్యేకంగా ముంబయిలో ఆర్డరు ఇచ్చి మరీ తయారు చేయించుకున్నాడు. కొత్త దుస్తులు, ఇతర సామగ్రి సిద్ధం చేసుకున్నాడు. స్నేహితులకు, తోటి పురోహితులకు ఆహా్వనం పలికాడు. సంప్రదాయం ప్రకారం ఇంట్లో వారు నిశి్చతార్థానికి అన్ని ఏర్పాట్లూ చేశారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ.. ఊహించని విధంగా శనివారం అర్ధరాత్రి పిఠాపురం సమీపంలో వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి, రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. సామర్లకోట రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆత్మహత్య చేసుకునేంత సమస్యలేవీ లేవని చెబుతూ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి శర్మ, తల్లి లక్ష్మి గుండెలవిసేలా రోదించారు. నిశి్చతార్థం కోసం తెచి్చన పూలను అంతిమ యాత్రకు వినియోగించాల్సి వచ్చింది. నిశ్చయ తాంబూలాలకు వచ్చిన పెద్దలు, బంధువులు బరువెక్కిన గుండెలతో అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఏదో బలమైన ఒత్తిడి... ఎవరో బెదిరించడం వల్లే వెంకటేష్ ఇలా అఘాయిత్యానికి పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. -
నిశ్చితార్థంలో కాబోయే భార్య చేసిన పనికి.. పెళ్లిరోజే వరుడు షాకింగ్ నిర్ణయం
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కాబోయే భార్య వేధింపులకు తాళలేక పెళ్లి రోజే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాసిక్‌కు చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారి హరేరామ్(36)కి, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన మోహినికి నిశ్చితార్థం జరిగింది.మోహిని తన లవర్‌ను హగ్ చేసుకోవడం చూసిన హరేరామ్.. నిలదీశాడు. ఈ సంఘటన ఆమె ప్రేమ వ్యవహారాన్ని బట్టబయలు చేయడంతో ఈ విషయం బయటకు చెబితే తనతో పాటు కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెడతానని ఆమె బ్లాక్‌మెయిల్‌కు దిగింది.నిరంతరం తీవ్ర వేధింపులకు గురిచేయడంతో మానసిక ఒత్తిడికి గురై విసిగిపోయిన హరేరామ్.. నాసిక్‌లోని ఉత్తమ్‌నగర్ ప్రాంతంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువతితో పాటు ఆమె లవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. -
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి.. కన్నతల్లే..
సాక్షి, హైదరాబాద్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో దారుణం జరిగింది. కన్నతల్లే నాలుగేళ్ల కూతురికి కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి ఇచ్చి చంపేసింది. అనంతరం తల్లి కృష్ణ పావని సైతం విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రగతినగర్ ఆదిత్య గార్డెన్లో ఓ అపార్ట్మెంట్లో సాంబశివరావు, తన భార్య నంబూరి కృష్ణ పావని, కూతురు జశ్వికలతో కలిసి నివాసం ఉంటున్నారు 18వ తేదీ (శుక్రవారం) సాయంత్రం ఇంట్లో భర్త లేని సమయంలో కృష్ణ పావని.. తమ కూతురు జశ్వికకు కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు తాగించి.. ఆ తర్వాత తాను తాగింది. 19వ తేదీ తెల్లవారుజామున విషం తాగినట్లు గుర్తించిన భర్త.. భార్య, కూతురిని ఆసుపత్రికి తరలించారు.ఇవాళ తెల్లవారుజామున చికిత్స పొందుతూ చిన్నారి జశ్విక మృతి చెందింది. తల్లి కృష్ణ పావని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కృష్ణ పావనికి ఆరోగ్య సమస్యల కారణంగానే దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం కృష్ణ పావని పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలోని ఐసీయులో చికిత్స అందిస్తున్నారు. -
వివాహేతర సంబంధం.. వాట్సప్ స్టేటస్‌లో ప్రియురాలి ఫొటో..
అచ్చంపేట (మహబూబ్‌నగర్): పట్టపగలే ఓ వ్యక్తిపై గొడ్డలి, సుత్తితో దాడిచేసి హతమార్చిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 15న అచ్చంపేట మండలం నడింపల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై చోటు చేసుకున్న హత్య కేసు వివరాలను శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాసులుతో కలిసి ఏఎస్పీ రామేశ్వర్ వెల్లడించారు. వివరాలిలా.. నడింపల్లి గ్రామానికి చెందిన బూరం వీరయ్య చిన్న కుమారుడు పరమేశ్ అదే గ్రామానికి చెందిన సుగూరు మహేశ్ భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. గత నెల 10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా గురుజాలకు ఆమెను తీసుకెళ్లాడు. తన భార్య అదృశ్యంపై అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో భర్త మహేశ్ ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న మహేశ్ బంధువులు గురుజాలకు వెళ్లి పరమేశ్‌పై దాడిచేసి సదరు మహిళను ఇంటికి తీసుకువచ్చారు. ఆ తర్వాత పరమేశ్ వైఖరిలో మార్పు రాక పోవడం.. వాట్సప్ స్టేటస్‌లో ఈ నెల 15న మహిళతో ఉన్న ఫొటోలను పెట్టాడు. ఈ క్రమంలో భర్త మహేశ్ అదే గ్రామానికి చెందిన పదిర శివ, ఎడ్ల మహేశ్‌లతో కలిసి పరమేశ్ కుటుంబ సభ్యులను హత్య చేసేందుకు పథకం రచించారు. ఈ నెల 15న అచ్చంపేట నుంచి నడింపల్లికి బైక్‌పై వెళ్తున్న పరమేశ్ తండ్రి బూరం వీరయ్య, సోదరుడు వెంకటేశ్ ను కారు, బైక్‌తో వెంబడించారు. నడింపల్లి సమీపానికి రాగానే ఒక్కసారిగా వీరయ్యపై గొడ్డలి, సుత్తితో దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్‌పై దాడికి యత్నించగా.. సమీప గ్రా మస్తులు రావడంతో వదిలిపెట్టి వెళ్లారు. హత్యలో పాల్గొన్న ముగ్గురు నిందితులు గతంలో నేర చరిత్ర కలిగి ఉండటంతో వారిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్టుచేసి కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. హత్య కేసును చేధించిన డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్, ఉప్పునుంతల ఎస్ఐ వెంకట్‌రెడ్డి, ఇందిర, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ రమేశ్, కానిస్టేబుళ్లు విశ్వనాథ్, బాలస్వామి, మల్లేష్, విష్ణు ఉన్నారు.భర్త, ఇద్దరు పిల్లలున్న మహిళతో వివాహేతర సంబంధం -
ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన భార్య
వనపర్తి(మహబూబ్‌నగర్): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నా డని కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. సూగూరు గ్రామానికి చెందిన రవి, అతడి భార్య సునీత మేస్త్రి నరేశ్ వద్ద పనిచేస్తుండే వారు. క్రమంలో శ్రీరంగాపూర్‌కు చెందిన అరవింద్‌తో సునీతకు పరిచయమై వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్త రవికి తెలియడంతో అరవింద్‌ను హెచ్చరించాడు. అప్పటి నుంచి రవి తన భార్య సునీతను ఇబ్బంది పెడుతుండేవాడు. ఈ క్రమంలో తన భర్త అడ్డు తొలగించాలని ప్రియుడు అరవింద్‌కు చెప్పడంతో గత నెల 18న అతడు తన స్నేహితులైన భగవంతు, గిరితో కలిసి అయ్యవారిపల్లిలో మద్యం తాగుతూ రవి హత్యకు పథకం రచించారు. ఈ మేరకు మార్చి 19న సాయంత్రం అరవింద్ తన స్నేహితుడైన సూగూరుకు చెందిన బాష కారును అవసరం ఉందని తీసుకుని అయ్యవారిపల్లిలో భగవంతు, గిరిని ఎక్కించుకున్నాడు. వెంకటాపురంలో ఒక కిరాణం షాపులో మద్యం, వాటర్ బాటిల్స్, నల్ల కవర్స్ తీసుకున్నారు. అక్కడి నుంచి సూగూరుకు వెళ్లి ఆంజనేయులు అనే వ్యక్తితో రవికి ఫోన్ చేయించి మద్యం తాగుదామని పిలిపించారు. వారి వద్దకు వచ్చిన రవిని కారులో ఎక్కించుకుని గ్రామ సమీపంలోని శ్మశానవాటిక వద్దకు వెళ్లి మద్యం తాగారు. రవి మత్తులోకి వెళ్లిన తర్వాత అందరూ కలిసి అతడి ముఖానికి ప్లాస్టిక్ కవర్లు చుట్టి ఊపిరాకుండా చేసి చంపారు. ఎవరికీ అనుమానం రాకూడదని కొత్త సూగూరు ఊరి బయట రోడ్డు పక్కన శవాన్ని ఉంచి, నేరానికి ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్లను బూడిదపాడు వద్ద వాగులో పడేసి వెళ్లిపోయా రు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టారు. సునీతను తమదైన శైలిలో విచారించగా.. చేసిన నేరాన్ని ఒప్పుకుంది. హత్య లో పాల్గొన్న వారిని అరెస్టు చేసి.. వారి నుంచి కారు, సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్ విధించినట్టు ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ రాంబాబు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, పెబ్బేరు ఎస్ఐ యుగంధర్ రెడ్డి ఉన్నారు. -
క్షేమంగా ఊరికి పంపిస్తామని.. కాటేశారు
కర్ణాటక: ఆ కూలీ యువతికి భాష తెలియదు, ఊరు తెలియదు, క్షేమంగా ఊరికి పంపిస్తానని నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డారు కామాంధులు. మంగళూరు నగరం వద్ద ఉళ్లాలలోని మున్నూరు బంగ్లా వద్ద బెంగాల్ యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలో కొత్త నిజాలు బయటపడ్డాయి. వివరాలు.. బాధిత యువతి 3నెలల క్రితం తన ప్రియుని కలిసి పశ్చిమబెంగాల్ నుంచి కేరళకు కూలీ పనికి వచ్చింది. ఏప్రిల్ 16న ఇద్దరి మధ్య గొడవ జరిగి ప్రియుడు ఆమె మొబైల్ ని పగలగొట్టి వెళ్లగొట్టాడు. దీంతో యువతి కేరళ నుండి మంగళూరుకు వచ్చే రైలు ఎక్కింది. మంగళూరులో దిగిన ఆమె స్వంత ఊరికి వెళ్లడానికి డబ్బులు లేక రైల్వేస్టేషన్లో చాలామంది వద్ద డబ్బులు అడిగింది. ఈ క్రమంలో నిందితుడు ఆటోడ్రైవర్ ప్రభురాజ్ ఆమైపె కన్నేసి మొబైల్ రిపేరీ చేయించి ఆమె అక్కకు కాల్ చేయమని చెప్పాడు. అక్క ఆమెకు ఆన్లైన్లో రూ.2 వేలు పంపించి ప శ్చిమ్ బెంగాల్ రైలు ఎక్కాలని చెప్పింది, ప్రభురాజ్ తో కూడా మాట్లాడిండి.కూల్‌డ్రింకులో మత్తు కలిపిరైలు ఆలస్యంగా వస్తుందని యువతిని నమ్మించి ప్రభురాజ్ తన ఆటోలో ఆమెను 6 గంటలపాటు ఊరంతా తిప్పాడు. రాత్రి కాగానే మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగించి ఆమె స్పృహ కోల్పోయాక మిత్రులు మణి, మిథున్‌ను పిలిపించాడు. ముగ్గురూ కలిసి మున్నూరు బంగ్లా వద్ద నిర్జన ప్రదేశంలో అత్యాచారం చేసి పరారయ్యారు. బాధితులు ఓ ఇంటి వద్దకు వచ్చి పడిపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. నిందితులను కంకనాడి పోలీసులు అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్నారు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పటి వరకూ బాధితురాలి కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదని తెలిసింది. -
అద్దె చెల్లించమన్నందుకు ట్రాన్స్జెండర్లతో హల్చల్
హైదరాబాద్: అద్దె వివాదంలో ఇంటి యజమానిపైకి ట్రాన్స్ జెండర్లతో పాటు రౌడీలను పంపించి దౌర్జన్యానికి దిగిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో నివాసం ఉంటున్న మాజీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని ఇందుకూరి నిర్మలాదేవికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనక భవనం ఉంది. ఈ భవనాన్ని గత ఏడాది జూన్‌లో ఆద్య ఎడ్యుకేషన్ సొసైటీకి లీజుకు ఇచ్చేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ముందుగానే అడ్వాన్స్ చెల్లించడంతో పాటు నెలనెలా అద్దె ఇస్తానంటూ ఆద్య ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వాహకులు, మాజీ ఐఏఎస్ కుమారుడు గొబ్బూరు సాయి కృష్ణకిషోర్ చెప్పారు. కాగా యజమాని నిర్మలాదేవికి, సాయి కృష్ణకిషోర్ మధ్య అద్దె విషయమై గొడవ జరుగుతోంది. దీనికితోడు గతంలో బంజారాహిల్స్ రోడ్ నెం 14లో ఉన్న అధ్యాస్ జూనియర్ కాలేజీకి సంబంధించిన 16 నెలల అద్దె బకాయిలు ఉండడంతో గత ఫిబ్రవరిలో ఖాళీ చేయించారు. ఈ నేపథ్యంలో నిర్మలాదేవిని కలిసిన కృష్ణకిషోర్ ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ఎన్టీఆర్ భవన్ పక్కనున్న కొత్త భవనాన్ని ఇవ్వాలని కోరాడు. అయితే తనకు గతంలోనే అద్దె సరిగా ఇవ్వలేదని, గతంలో అనేక వివాదాలు ఉన్నందున కళాశాల ఏర్పాటుకు ఒప్పుకునేది లేదని చెప్పింది. అయితే అప్పటికే ఈ భవనాన్ని ఇంటరీ్మడియట్ సెంటర్‌గా ప్రకటించడంతో చివరి క్షణంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఏకంగా జిల్లా కలెక్టర్ కోరడంతో అందుకు ఆమె అంగీకరించింది. కాగా పరీక్షల అనంతరం భవనాన్ని ఖాళీ చేయాలని నిర్మలాదేవి కోరినా పట్టించుకోకపోవడంతో నాలుగురోజుల క్రితం ఆమె వచ్చి తాళాలు వేసుకుంది. శనివారం మధ్యాహ్నం నిర్మలాదేవి అక్కడ ఉండగా సుమారు 10మంది రౌడీలతో పాటు హిజ్రాలు ఒక్కసారిగా భవనంలోకి ప్రవేశించి వీరంగం సృష్టించడమేగాక నిర్మలాదేవిని బయటకు తరిమివేశారు. దీంతో ఆమె బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరుగురు ట్రాన్స్ జెండర్లు, మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మలాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
గొంతుకోసి..కత్తులతో పొడిచి..
హైదరాబాద్: ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా చోటు చేసుకున్న వివాదం హత్యకు దారి తీసిన సంఘటన షాద్‌నగర్ శివారులో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. శంషాబాద్ ఇన్చార్జి, రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 13న షాద్‌నగర్ లింగారెడ్డిగూడెం శివారులోని ఎంఎస్ఎన్ పరిశ్రమ సమీపంలో జాతీయరహదారి పక్కన కత్తిపోట్లకు గురైన గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని గుర్తించిన షాద్‌నగర్, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి కుడి చేయిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా అతను నంద్యాల జిల్లా, బండి ఆత్మకూరు మండలం, చిన్నదేవులాపురం గ్రామానికి చెందిన కిలారి సాయిరాహుల్(23) గుర్తించారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసిన సాయి రాహూల్ ఉద్యోగం కోసం నగరానికి వచ్చాడు. 11 విన్నర్స్ అనే ఆన్లైన్ క్యాసినో బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో నగరంలోని ఓ పీజీ హాస్టల్లో ఉంటున్న తన ఊరికే చెందిన చిన్ననాటి స్నేహితుడు శాఖమురి వెంకటేష్‌కు కూడా బెట్టింగ్ అలవాటు చేశాడు. ఈ క్రమంలో వెంకటేష్ రూ.15 లక్షలు పోగొట్టుకున్నాడు. మూడు నెలల క్రితం కూడా సాయిరాహుల్ మరోమారు అదే గేమ్స్‌లో డబ్బులు పెట్టి తిరిగి సంపాదించుకుందామని చెప్పి వెంకటే‹Ùతో రూ. 3 లక్షలు బెట్టింగ్ పెట్టించాడు. అయితే డబ్బులు పోవడంతో వెంకటేష్ తనకు రూ. 3 లక్షలు ఇవ్వాలని సాయిరాహుల్పై ఒత్తిడి చేశాడు. దీంతో సాయిరాహుల్ తనను డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరించాడు. భయంతోనే హత్యకు కుట్ర.. గతంలోనూ ఓ మారు సాయిరాహుల్ రూ. 20 వేల విషయమై వెంకటేష్‌పై బీరుబాటిల్‌తో దాడి చేశాడు. ఆ తర్వాత తిరిగి స్నేహితులయ్యారు. సాయి తనను హత్య చేస్తాడనే భయంతో వెంకటేష్ తనతో కలిసి హాస్టల్లో ఉంటున్న స్నేహితులతో కలిసి సాయిని అంతమొందించాలని పథకం వేశాడు. ఇందుకు రూ. 2 లక్షలు ఇస్తానని చెప్పి కొంత అడ్వాన్స్‌గా ఇచ్చాడు. దీంతో వారు సురారం వెళ్లి కత్తులు కొనుగోలు చేసి అద్దెకారు తీసుకున్నారు. ఈ నెల 12 సాయిని బెట్టింగ్ పేరుతో లింగారెడ్డిగూడెం రప్పించారు. అతడికి మద్యం తాగించి గొంతుకోయడంతో పాటు కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశారు. అనంతరం బహదూర్‌పల్లి గండిమైసమ్మ సమీపంలోని బంధువుల ఇంట్లో తలదాచుకుని అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు వెంకటేష్ శనివారం ఉదయం ఆ«రాంఘర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మిగతా నలుగురు నిందితులతో పాటు కారును అద్దెకిచ్చిన వ్యక్తి పరారీలో ఉన్నారు. నిందితుడి నుంచి మూడుఫోన్లు, కారు స్వా«దీనం చేసుకున్నారు. కేసును చేధించిన షాద్‌నగర్ సీఐ విజయ్‌కుమార్, ఎస్ఓటీ పోలీసులను డీసీపీ అభినందించారు. -
నా భార్య వేధింపులు భరించలేకపోతున్నా.. ఇక సెలవు
భార్యాభర్తల సంబంధం అనేది చాలా సున్నితమైనది. ఇది ప్రేమ అనే బంధంతో ముడిపడి ఉంటుంది. చిన్నపాటి దారంతో మెలివేసి ఉంటుంది. ఈ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి చిన్న పొరపాటు సరిపోతుంది. ప్రేమ దారంతో ముడిపడాల్సిన బంధం.. అనుమానం అనే ఆయుధంతో దాడి చేస్తే కాపురాలు నాశనం అవుతాయి. ఆ బంధాలు శాశ్వతంగా నిలబడువు. ఈ ఘటనలో అదే జరిగింది.వారిది పెద్దగా అన్యోన్యమైన దాంపత్యం కాదు. పెళ్లై ఐదేళ్లే అవుతుంది. అప్పట్నుంచీ ఇంట్లో రోజూ చికాకులు. భార్యాభర్తల మధ్య గొడవలు. ఒకరి కంఫర్ట్ జోన్ లోకి ఇంకొకరు రాలేకపోయారు. దాంతో భర్త ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. తాను చేయని తప్పుకు భార్య నిందించడంతోపాటు కేసును కూడా పెట్టడంతో భర్త ప్రాణాలు వదిలేశాడు. సమాజం, కుటుంబం తానేమిటీ అన్న విషయాన్ని నమ్మాలంటే అది తన ఆత్మహత్య ద్వారానే సాధ్యమవుతుందని భావించి విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు.34 ఏళ్ల మోహిత్ త్యాగి అనే వ్యక్తికి పెళ్లైన దగ్గర్నుంచీ భార్య నుంచి ఏవో వేధింపులకు గురవుతూనే ఉన్నాడట. 2020, డిసెంబర్లో ప్రియాంక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మోహిత్.. ఆపై నరకం చూసాడట.తనకు రెండో పెళ్లి కావడంతో భార్య తన ఆస్తి కోసం, తన సంపాదన కోసమే చేసుకుని ప్రతీరోజూ నరకం చూపించేదని సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ భార్య ప్రియాంకను, ఆమె తరఫు బంధువులు పేర్లు పేర్కొంటూ సూసైడ్ నోట్ రాశాడు. తాను చనిపోవడానికి నిర్ణయించుకున్న కొన్ని సెకన్ల ముందే ఆ నోట్ తన ఫ్రెండ్స్ అందరికీ పంపించాడు. ఆ వెంటనే విషం తాగాడు. రెండు రోజుల మృత్యువుతో పోరాడి చనిపోయాడు.2024లో మోహిత్ తల్లి చనిపోయిన క్రమంలో భార్య ప్రియాంక బాగా గొడవపడిందట. ఆ సమయంలోనే భార్య కొంతమందిని ఇంటికి తీసుకొచ్చి రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల విలువైన బంగారాన్ని మొత్తం అపహరించిందట. ఈ విషయాన్ని మోహిత్ సోదరుడు తాజాగా వెల్లడించాడు.సూసైడ్ నోట్ లో ఏముందంటే..నాపై అనుమానంతో ఒక తప్పుడు కేసును భార్య పెట్టించింది. ఆ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒక ప్లాన్ ప్రకారమే నన్ను పెళ్లి చేసుకుంది. అనేక సార్లు గర్భం వస్తే దాన్ని తీయించుకుంది. నన్ను చాలా హింసించింది. నేను ఇక తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నాపై పోలీస్ కేసు పెట్టడంతో నా జీవితం ఇక అనవసరం. నేనూ ఏ తప్పూ చేయలేదు. నేను చనిపోతున్నందుకు నాకు బాధేమీ లేదు. కాకపోతే నాకు పుట్టిన కొడుకు పరిస్థితి ఏమౌంతుందో అని ఆలోచిస్తున్నా. నాకు అదొక్కటే విచారంగా ఉంది. వీరంతా నా కొడుకును చంపేసే అవకాశం కూడా ఉంది. మీరు నిజాన్ని నమ్మాలంటే నాకు చావు ఒక్కటే శరణ్యం’ అని పేర్కొన్నాడు. భార్య ప్రియాంక, ఆమె తరుఫు బంధువులే తన చావుకు కారణమని తెలిపాడు. తన చావు తర్వాత భార్య ప్రియాంక కచ్చితంగా చింతిస్తుందని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఏప్రిల్ 15వ తేదీన సూసైడ్ చేసుకోగా, రెండు రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అత్తతో గొడవపడి వెళ్లిపోయిన కోడలు
వికారాబాద్: ఇంట్లో అత్త తో గొడవ పడిన కోడలు ఎటో వెళ్లిపోయిన సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సంగెం గ్రామానికి చెందిన కూడళ్ల బాలమణికి నలుగురు సంతానం. అందులో రెండో కూతురు స్పందనను ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన బట్టు సురేష్ కు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం జరిపించారు. భార్యాభర్తలు వేములనర్వ గ్రామంలో ఆర్ఎంపీ వైద్యులుగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం అత్తాకోడళ్లు గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన స్పందన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ కోసం భర్త సురేష్ వెతకగా లభ్యం కాలేదు. దీంతో స్పందన తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజ్‌కుమార్ తెలిపారు. ట్రాన్స్జెండర్లపై కేసు నమోదు మీర్‌పేట: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ట్రాన్స్‌జెండర్స్‌పై మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ నాగరాజు కథనం ప్రకారం.. స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో కొందరు ట్రాన్స్జెండర్లు రాత్రివేళల్లో అసభ్యకర దుస్తులు ధరించి వికృత చేష్టలు చేయడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడు తూ అసౌకర్యం కలిగిస్తున్నారన్న సమాచారం రావడంతో మీర్‌పేట పోలీసులు గురువారం రాత్రి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మందమల్లమ్మ చౌరస్తా, ఆర్సీఐ రహదారిపై 7 మంది ట్రాన్స్జెండర్లను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.