భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త..! | Kalburgi Incident | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త..!

May 3 2025 9:59 AM | Updated on May 3 2025 10:11 AM

Kalburgi Incident

కలబుర్గి జిల్లాలో ఓ భర్త దురాగతం  

దొడ్డబళ్లాపురం(కర్ణాటక): అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. భార్య, ప్రియుడు సన్నిహితంగా ఉండగా చూసిన భర్త ఆగ్రహం పట్టలేక ఇద్దరినీ హతమార్చాడు. ఈ దారుణం కలబుర్గి జిల్లా ఆళంద తాలూకా మాదనహిప్పరగా గ్రామంలో చోటుచేసుకుంది.     సృష్టి (22), ఖాజప్ప(23) హత్యకు గురైన వారు.

 శ్రీమంత నిందితుడు. శ్రీమంత, సృష్టి భార్యాభర్తలు. వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఆమెకు ఖాజప్పతో అనైతిక బంధం ఉన్నట్లు సమాచారం. శ్రీమంత గురువారం పని మీద పక్క ఊరికి వెళ్లి తిరిగి వచ్చాడు, ఈ సమయంలో ఇంట్లో బెడ్‌రూంలో సృష్టి, ఖాజప్ప కలిసి కనిపించడంతో శ్రీమంత కొడవలితో నరికి ఇద్దరినీ హత్య చేశాడు. తరువాత పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. హిప్పరగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

వంట బాగా లేదని భార్య హత్య  
దొడ్డబళ్లాపురం: వంటను రుచిగా వండలేదని భార్యను భర్త హత్య చేసిన సంఘటన బాగలకోట జిల్లా ముధోళ తాలూకా ముగలఖోడ గ్రామంలో జరిగింది. భీరప్ప పూజారి అనే వ్యక్తి, భార్య సాక్షిత (27) ను గొంతు పిసికి హత్య చేశాడు. గురువారం రాత్రి సాక్షిత వండిన వంట బాగాలేదని, సాంబారు అసలు రుచిగా లేదని గొడవ చేశాడు. సాక్షిత కూడా ఎదురు తిరగడంతో పట్టలేని కోపంతో ఆమెను గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. ముధోళ పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు.   


 

Advertisement
 
Advertisement
Advertisement