కూల్‌డ్రింక్‌లో విషం కలిపి.. కన్నతల్లే.. | Mother Gives Daughter Cool Drink With Poison In Bachupally Hyderabad | Sakshi
Sakshi News home page

కూల్‌డ్రింక్‌లో విషం కలిపి.. కన్నతల్లే..

Apr 20 2025 3:39 PM | Updated on Apr 20 2025 4:16 PM

Mother Gives Daughter Cool Drink With Poison In Bachupally Hyderabad

సాక్షి, హైదరాబాద్: బాచుపల్లి పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో దారుణం జరిగింది. కన్నతల్లే నాలుగేళ్ల కూతురికి కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి ఇచ్చి చంపేసింది. అనంతరం తల్లి కృష్ణ పావని సైతం విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

ప్రగతినగర్ ఆదిత్య గార్డెన్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో సాంబశివరావు, తన భార్య నంబూరి కృష్ణ పావని, కూతురు జశ్వికలతో కలిసి నివాసం ఉంటున్నారు 18వ తేదీ (శుక్రవారం) సాయంత్రం ఇంట్లో భర్త లేని సమయంలో కృష్ణ పావని.. తమ కూతురు జశ్వికకు కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు తాగించి.. ఆ తర్వాత తాను తాగింది. 19వ తేదీ తెల్లవారుజామున విషం తాగినట్లు గుర్తించిన భర్త.. భార్య, కూతురిని ఆసుపత్రికి తరలించారు.

ఇవాళ తెల్లవారుజామున చికిత్స పొందుతూ చిన్నారి జశ్విక మృతి చెందింది. తల్లి కృష్ణ పావని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కృష్ణ పావనికి ఆరోగ్య సమస్యల కారణంగానే దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం కృష్ణ పావని పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలోని ఐసీయులో చికిత్స అందిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement