పని వారి విషయంలో నిలువెల్లా నిర్లక్ష్యమే! | Huge Robbery at Businessman House in Kacheguda | Sakshi
Sakshi News home page

పని వారి విషయంలో నిలువెల్లా నిర్లక్ష్యమే!

Apr 23 2025 9:42 AM | Updated on Apr 23 2025 9:42 AM

Huge Robbery at Businessman House in Kacheguda

 కాచిగూడలో భారీ చోరీ ఉదంతమే తాజా ఉదాహరణ 

యజమానుల వద్ద లేని పని వారి ఫొటోలు, వివరాలు 

 వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ఈస్ట్‌జోన్‌ పోలీసులు

హైదరాబాద్: నారాయణగూడ పోలీసుస్టేషన్‌ పరిధిలో నివసించే కేడియా ఆయిల్స్‌ కంపెనీ యజమాని రోహిత్‌ కేడియా ఇంట్లో ఈ ఏడాది ఫిబ్రవరి 11న భారీ చోరీ జరిగింది. బీహార్, పశ్చిమ బెంగాల్ లకు చెందిన ముగ్గురు నిందితులు దాదాపు రూ.40 కోట్ల విలువైన సొత్తు దోచుకుపోయారు. వీరిని అరెస్టు చేసిన సందర్భంలో పోలీసులు పని వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పదేపదే సూచించారు. ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోని కాచిగూడ వాసి, పారిశ్రామిక వేత్త హేమ్‌ రాజ్‌ కుటుంబం నేపాలీలను ఎలాంటి ఆధారాలు లేకుండా పనిలో పెట్టుకుంది. ఫలితం... ఆదివారం రాత్రి రూ.2 కోట్ల సొత్తుతో ఆ నేపాలీలు ఉడాయించారు. ఈ కేసును ఈస్ట్‌జోన్‌ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలో దింపిన డీసీపీ డాక్టర్‌ బి.బాలస్వామి కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.  

పథకం ప్రకారం పనిలో చేరిన నేపాలీలు... 
కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో హేమ్‌ రాజ్‌ తన భార్య మీనా దుగ్గర్, కుమారుడు, కోడలు, మనుమళ్లతో కలిసి ఉంటున్నారు. కొన్నాళ్లుగా వీరి వద్ద నేపాల్‌కు చెందిన ఓ మహిళ పని చేస్తోంది. ఆ ఇంటి వ్యవహారాలు పూర్తిగా తెలిసిన ఆమె అదును చూసుకుని కొల్లగొట్టాలని పథకం వేసింది. త్వరలో తాను పని మానేసి తన స్వదేశానికి వెళ్లిపోతానంటూ ఇటీవల ఆ మహిళ చెప్పింది. తన స్థానంలో పని చేయడానికి తమ దేశం నుంచే వచి్చన మరో మహిళ సిద్ధంగా ఉందని దాదాపు నెల రోజుల క్రితం చేర్చింది. హేమ్‌రాజ్‌ ఇంట్లో ప్రస్తుతం రెన్నోవేషన్‌ పని నడుస్తోంది. దీంతో ఆ పనిలో సహకరించడానికి, ఇంటిని శుభ్రం చేయడానికి మరో మనిషి కావాలంటూ పది రోజుల క్రితం కొత్త పని మనిషికి చెప్పారు. ఆ పని చేయడానికి తన పరిచయస్తుడు ఉన్నాడని చెప్పిన ఈ కొత్త పనిమనిషి మరో నేపాలీని ఆ ఇంటికి తీసుకువచ్చింది.  

నేపాలీలు అంతా కలిసి అదును చూసుకుని... 
ఇలా కొత్తగా పనిలో చేరిన ఇద్దరి ఫొటోలు, వివరాలను హేమ్‌ రాజ్‌ కుటుంబం తీసుకోలేదు. కనీసం వాళ్లు చెప్పిన పేర్లు నిజమా? కాదా? అనేది పరిశీలించలేదు. వేసవి సెలవుల నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం హేమ్‌రాజ్‌ కుమారుడి కుటుంబం విదేశాలకు వెళ్లింది. వృద్ధ దంపతులే ఇంట్లో ఉండటంతో ఆ ఇంటిని కొల్లగొట్టడానికి ఇదే సరైన సమయమని ఇరువురు నేపాలీలు నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి వృద్ధ దంపతుల ఆహారంలో మత్తుమందు కలిపారు. వీళ్లు మత్తులో ఉండగా... అల్మారాలు, లాకర్లు పగులకొట్టిన నేపాలీ ద్వయం బంగారం, వజ్రాభరణాలు, నగదుతో సహా మొత్తం రూ.2 కోట్ల విలువైన సొత్తు కాజేశారు. ఇంటిని బయట నుంచి తాళం వేసి యజమాని కారులోనే సంతో‹Ùనగర్‌ వరకు వెళ్లిన ఇరువురూ వాహనం అక్కడ వదిలేశారు. ఆపై ఆటోలో శంషాబాద్‌ వైపు ఉడాయించారు. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో వచ్చిన  ఫాల్స్‌ సీలింగ్‌ వర్కర్లు ఎంత పిలిచినా యజమానల నుంచి స్పందన లేకపోవడంతో సమీపంలో ఉండే బంధువులకు సమాచారం ఇచ్చారు.  

వివిధ రాష్ట్రాలకు వెళ్లిన ప్రత్యేక బృందాలు... 
ఈ నేరంపై పోలీసులకు సోమవారం మధ్యాహ్నం సమాచారం అందింది. ఈస్ట్‌జోన్‌ డీసీపీ డాక్టర్‌ బి.బాలస్వామి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. యజమానుల దగ్గర నేపాలీల పేర్లు తప్ప వారి వివరాలు, చిరునామాలు, ఫొటోలు లేకపోవడం దర్యాప్తును సంక్లిష్టం చేసింది. పాత పనిమనిíÙతో పాటు కొత్త పని వాళ్లు ఇద్దరి ఆచూకీ కోసం రాష్ట్రం చుట్టపక్కల ఉన్న సాధారణ, రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడు ప్రత్యేక బృందాలు ఉత్తరాదిలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లాయి. నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్‌ చెక్‌పోస్టునూ అప్రమత్తం చేశారు. శంషాబాద్‌ నుంచి నేపాలీలు ఎటు వెళ్లారనేది గుర్తించడానికి వివిధ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. అఫ్జల్‌గంజ్‌ ఫైరింగ్‌ కేసు అనుభవం నేపథ్యంలో ఈ నేరగాళ్లు దేశం దాటకముందే పట్టుకోవాలనే లక్ష్యంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement