Narayanaguda police station
-
పని వారి విషయంలో నిలువెల్లా నిర్లక్ష్యమే!
హైదరాబాద్: నారాయణగూడ పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే కేడియా ఆయిల్స్ కంపెనీ యజమాని రోహిత్ కేడియా ఇంట్లో ఈ ఏడాది ఫిబ్రవరి 11న భారీ చోరీ జరిగింది. బీహార్, పశ్చిమ బెంగాల్ లకు చెందిన ముగ్గురు నిందితులు దాదాపు రూ.40 కోట్ల విలువైన సొత్తు దోచుకుపోయారు. వీరిని అరెస్టు చేసిన సందర్భంలో పోలీసులు పని వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పదేపదే సూచించారు. ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోని కాచిగూడ వాసి, పారిశ్రామిక వేత్త హేమ్ రాజ్ కుటుంబం నేపాలీలను ఎలాంటి ఆధారాలు లేకుండా పనిలో పెట్టుకుంది. ఫలితం... ఆదివారం రాత్రి రూ.2 కోట్ల సొత్తుతో ఆ నేపాలీలు ఉడాయించారు. ఈ కేసును ఈస్ట్‌జోన్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలో దింపిన డీసీపీ డాక్టర్ బి.బాలస్వామి కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పథకం ప్రకారం పనిలో చేరిన నేపాలీలు... కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో హేమ్ రాజ్ తన భార్య మీనా దుగ్గర్, కుమారుడు, కోడలు, మనుమళ్లతో కలిసి ఉంటున్నారు. కొన్నాళ్లుగా వీరి వద్ద నేపాల్‌కు చెందిన ఓ మహిళ పని చేస్తోంది. ఆ ఇంటి వ్యవహారాలు పూర్తిగా తెలిసిన ఆమె అదును చూసుకుని కొల్లగొట్టాలని పథకం వేసింది. త్వరలో తాను పని మానేసి తన స్వదేశానికి వెళ్లిపోతానంటూ ఇటీవల ఆ మహిళ చెప్పింది. తన స్థానంలో పని చేయడానికి తమ దేశం నుంచే వచి్చన మరో మహిళ సిద్ధంగా ఉందని దాదాపు నెల రోజుల క్రితం చేర్చింది. హేమ్రాజ్ ఇంట్లో ప్రస్తుతం రెన్నోవేషన్ పని నడుస్తోంది. దీంతో ఆ పనిలో సహకరించడానికి, ఇంటిని శుభ్రం చేయడానికి మరో మనిషి కావాలంటూ పది రోజుల క్రితం కొత్త పని మనిషికి చెప్పారు. ఆ పని చేయడానికి తన పరిచయస్తుడు ఉన్నాడని చెప్పిన ఈ కొత్త పనిమనిషి మరో నేపాలీని ఆ ఇంటికి తీసుకువచ్చింది. నేపాలీలు అంతా కలిసి అదును చూసుకుని... ఇలా కొత్తగా పనిలో చేరిన ఇద్దరి ఫొటోలు, వివరాలను హేమ్ రాజ్ కుటుంబం తీసుకోలేదు. కనీసం వాళ్లు చెప్పిన పేర్లు నిజమా? కాదా? అనేది పరిశీలించలేదు. వేసవి సెలవుల నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం హేమ్రాజ్ కుమారుడి కుటుంబం విదేశాలకు వెళ్లింది. వృద్ధ దంపతులే ఇంట్లో ఉండటంతో ఆ ఇంటిని కొల్లగొట్టడానికి ఇదే సరైన సమయమని ఇరువురు నేపాలీలు నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి వృద్ధ దంపతుల ఆహారంలో మత్తుమందు కలిపారు. వీళ్లు మత్తులో ఉండగా... అల్మారాలు, లాకర్లు పగులకొట్టిన నేపాలీ ద్వయం బంగారం, వజ్రాభరణాలు, నగదుతో సహా మొత్తం రూ.2 కోట్ల విలువైన సొత్తు కాజేశారు. ఇంటిని బయట నుంచి తాళం వేసి యజమాని కారులోనే సంతో‹Ùనగర్ వరకు వెళ్లిన ఇరువురూ వాహనం అక్కడ వదిలేశారు. ఆపై ఆటోలో శంషాబాద్ వైపు ఉడాయించారు. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో వచ్చిన ఫాల్స్ సీలింగ్ వర్కర్లు ఎంత పిలిచినా యజమానల నుంచి స్పందన లేకపోవడంతో సమీపంలో ఉండే బంధువులకు సమాచారం ఇచ్చారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లిన ప్రత్యేక బృందాలు... ఈ నేరంపై పోలీసులకు సోమవారం మధ్యాహ్నం సమాచారం అందింది. ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ బి.బాలస్వామి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. యజమానుల దగ్గర నేపాలీల పేర్లు తప్ప వారి వివరాలు, చిరునామాలు, ఫొటోలు లేకపోవడం దర్యాప్తును సంక్లిష్టం చేసింది. పాత పనిమనిíÙతో పాటు కొత్త పని వాళ్లు ఇద్దరి ఆచూకీ కోసం రాష్ట్రం చుట్టపక్కల ఉన్న సాధారణ, రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడు ప్రత్యేక బృందాలు ఉత్తరాదిలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లాయి. నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్ చెక్పోస్టునూ అప్రమత్తం చేశారు. శంషాబాద్ నుంచి నేపాలీలు ఎటు వెళ్లారనేది గుర్తించడానికి వివిధ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. అఫ్జల్‌గంజ్ ఫైరింగ్ కేసు అనుభవం నేపథ్యంలో ఈ నేరగాళ్లు దేశం దాటకముందే పట్టుకోవాలనే లక్ష్యంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
లాయర్ తలకు తుపాకీ గురి.. భూవివాదం
సాక్షి, హైదరాబాద్: భూ వివాదానికి సంబంధించి న్యాయస్థానంలో తాము కేసు ఓడిపోవడానికి న్యాయవాదే కారణమని భావించిన కక్షిదారులు దారుణానికి తెగబడ్డారు. సదరు న్యాయవాదిపై హత్యాయత్నం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతవారం జరిగిన ఈ విషయాన్ని అధికారులు రహస్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హిమాయత్‌నగర్ స్ట్రీట్ నంబర్ 7లో ఉండే హైకోర్టు న్యాయవాది జశ్వంత్ ఓ భూ వివాదానికి సంబంధించిన కేసు వాదిస్తున్నారు. ఈ కేసులో ఇటీవల కక్షిదారులకు వ్యతిరేకంగా తీర్పువచ్చింది. న్యాయవాది నిర్లక్ష్యం వల్లే తాము కేసు ఓడిపోయామని కక్షిదారులు భావించారు. దీంతో కక్షకట్టిన వాళ్లు ఈ నెల 17 సాయంత్రం 6 గంటల సమయంలో గౌడ హాస్టల్ సమీపంలో న్యాయవాదిని అడ్డగించి బాహాబాహీకి దిగారు. భూ యజమాని తరఫు వాళ్లు తమ వెంట తెచ్చుకున్న తుపాకీని న్యాయవాది తలకు గురిపెట్టడంతో పాటు కత్తితో పొడిచేందుకు సిద్ధపడ్డారు. అక్కడకు చేరిన స్థానికులు తమ ఫోన్లలో వీడియోలు తీస్తుండటాన్ని గమనించిన వాళ్లు వెనక్కు తగ్గారు. డయల్–100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువైపుల వారినీ అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం, సెక్టార్ ఎస్సై కాకుండా మరొకరికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
తాజ్ మహల్ హోటల్‌పై నుంచి దూకి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నారాయణగూడలోని ఓ అయిదంతస్తుల హోటల్ పై నుంచి ఓ యువకుడు దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషాద సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. తాజ్ మహల్ హోటల్లో పనిచేస్తున్న లక్ష్మయ్య(17) ఒక్కసారిగా హోటల్ ఐదో అంతస్తు పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే హోటల్ సిబ్బంది ఈ ఘటనను గోప్యంగా ఉంచగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఒడిశా వాసి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బాలిక అదృశ్యం
హైదరాబాద్ : నగరంలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఓ చిన్నారి అదృశ్యమైంది. మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసం వద్ద వంటపని చేస్తున్న శరణప్ప దంపతులకు వైష్ణవి (5) అనే కుమార్తె ఉంది. అయితే ఆ పాప బుధవారం మధ్యహ్నం నుంచి కనిపించడంలేదు. పాఠశాలకు వెళ్లిన చిన్నారి తిరిగి ఇంటికి రాకపోవడంతో.. తల్లిదండ్రులు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీ టీవీ ఫూటేజీలను పరిశీలిస్తున్నారు. చిన్నారి వైష్ణవిని 14 ఏళ్ల బాలిక తీసుకెళ్తున్నట్లు సీసీ టీవీ ఫూటేజీలో కనిపిస్తుండటంతో.. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
భక్తురాలిపై పూజారి అత్యాచారం
-
భక్తురాలిపై పూజారి అత్యాచారం
హిమాయత్‌నగర్: భక్తురాలికి మాయ మాటలు చెప్పి అత్యాచారం చేశాడు ఓ పూజారి. నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు ఎదురుగానే ఈ వైనం జరగడం పట్ల అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లా దౌల్తాబాద్‌కు చెందిన కరణం రాము(26) నారాయణగూడలోని అభిశ్రాయ్ హాస్టల్లో నివాసం ఉంటూ గత నాలుగు నెలలుగా నారాయణగూడలోని పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న సాయిబాబ గుడిలో పూజారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీలో నివాసం ఉండే 45సంవత్సరాల మహిళ ఆర్థిక తదితర ఇబ్బందులతో సతమతం అవుతుంది. ఈ నేపథ్యంలో పూజారి రామును కలసి ఆమె సమస్యలను విన్నవించుకుంది. దీంతో బుధవారం మధ్యాహ్నాం 12.30గంటల ప్రాంతంలో పసుపు, కుంకుమ తదితర సామాగ్రి తీసుకుని గుడికి రమ్మన్నాడు. వాచ్‌మెన్‌కు ఓ మహిళ వస్తుందనీ, గుడికి తాళాలు వేయోద్దని చెప్పాడు. మధ్యాహ్నానానికి ఆమె అవన్ని తీసుకుని వచ్చింది. ఆలయంలోని ఓ రూమ్‌లోకి ఆమెను తీసుకెళ్లి వస్త్రాలు తీయించి శరీరానికి పసుపు, కుంకుమలను పూసి ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో పూజారి నిర్వాకాన్ని ఎదురుగానే ఉన్న పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ భీమ్‌రెడ్డి తెలిపారు. -
పుట్టింటికే కన్నం..
- కన్నవారింట బంగారం కొట్టేసిన వివాహిత - నగలు అమ్ముతుండగా పట్టుకున్న పోలీసులు హైదరాబాద్: ప్రేమ వివాహం చేసుకుని సుదూరాలకు వెళ్లిపోయింది. భర్తతో గొడవపడ్డానంటూ పుట్టింటికి చేరింది. అదను చూసి ఇంట్లో నగానట్రా కాజేసీ అమ్ముకునే ప్రయత్నం చేసింది. పోలీసుల రంగప్రవేశంతో కటకటాలపాలైంది. హైదరాబాద్‌లో పుట్టింటికే కన్నం వేసిన సంఘటనలో 28 ఏళ్ల వివాహితను నారాయణగూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. హిమాయత్ నగర్, 13వ నంబంర్ వీధిలో షేక్ అఫ్జల్, మహబూబీ(55) దంపతులు నివసిస్తున్నారు. వీరి కుమార్తె షౌఖతున్నీసా ఆలియాస్ మునావర్.. కొద్దికాలం సత్యనారాయణ అనే వ్యక్తిని మతాంతర వివాహం చేసుకుంది. రేవతిగా పేరు మార్చుకుని చెన్నైలో నివసిస్తోంది. ఇటీవలే హిమాయత్ నగర్ లోని పుట్టింటికి చేరుకున్న ఆమె.. భర్తతో గొడవపడి వచ్చానని తల్లిదండ్రులకు చెప్పింది. ఇలా ఉండగా రెండు రోజుల కిందట ఆ ఇంట్లో బంగారం, వెండి నగలు మాయమయ్యాయి. సొమ్ములు పోయిన విషయాన్ని గుర్తించిన అప్జల్, మహబూబీ దంపతులు నారాయణగూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు షౌఖతున్నీసా ఆలియాస్ రేవతి తీరుపై అనుమానం వచ్చి ఆమెపై నిఘా పెట్టారు. దొంగిలించిన ఆభరణాలను ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓ దుకానంలో అమ్ముతుండగా రేవతిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. ఆమె నుంచి 67 తులాల బంగారు నగలు, 40 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కూతురి చర్యతో తల్లిదండ్రులు కుమిలిపోయారు. -
గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరి అరెస్టు
గ్యాంగ్ రేప్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ఐదుగురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. డార్జిలింగ్ నుంచి వచ్చి హిమాయత్‌నగర్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ బాలిక.. తనపై తన బోయ్‌ఫ్రెండు, అతడి ఆరుగురు స్నేహితులు సామూహిక అత్యాచారం చేశారని ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో నారాయణగూడ పోలీసుస్టేషన్ వద్దకు దాదాపు అపస్మారక స్థితిలో వచ్చిన ఆమె.. తనపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదుచేసింది. బ్యూటీపార్లర్‌లో పనిచేసే తనను బోయ్‌ఫ్రెండు ప్రేమ పేరుతో మోసం చేశాడని, స్నేహితులతో కలిసి తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదుచేసింది. తనను సికింద్రాబాద్‌లోని ఓ పార్కుకు పిలిచి స్నేహితులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపింది. ఆమె బోయ్‌ఫ్రెండు సహా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. -
నిందితులపై నిర్భయ కేసు నమోదు
హైదరాబాద్ : స్నేహితులతో కలిసి ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన మాజిద్ని నారాయణగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక నివేదిక వెలువడిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. -
స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారం
-
స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారం
హైదరాబాద్: ప్రియుడు, అతడి స్నేహితులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి (19) పోలీసులను అశ్రయించింది. బాధితురాలు ఈ ఘటనపై ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. డార్జిలింగ్‌కు చెందిన ఆమె గత కొంతకాలంగా గాంధీనగర్‌లో నివసిస్తోంది. ఆమె ఓ ప్రయివేటు బ్యూటీపార్లర్ లో పని చేస్తోంది. గత రాత్రి తన బాయ్‌ఫ్రెండ్ ... స్నేహితులు ఆరుగురితో కలిసి హిమాయత్ నగర్ సమీపంలో తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సమయంలో ఆమె అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రియుడితో పాటు అతని స్నేహితులపై కేసు నమోదు చేశారు. అయితే వారి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అత్యాచారం జరిగిందా, లేక ప్రేమికుల మధ్య ఏదైనా గొడవ జరిగి యువతి అతనిపై ఫిర్యాదు చేసిందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సివుంది. -
దొంగ దొరికాడు
నారాయణగూడ(హైదరాబాద్ క్రైం): ఉద్యోగం ఇచ్చిన కంపెనీలోనే దొంగతనానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధడు. ఈ సంఘటన నగరంలోని నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. వివరాలు.. హిమాయత్‌నగర్ రోడ్ నంబరు.9లో ఉన్న సన్‌రైజ్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన యజమాని సురేష్ కుమార్ రూ. 80,000 లాకర్లో భద్రపరుస్తుండగా చూశాడు. ఇదే అదునుగా ఎవరులేని సమయంలో లాకర్‌ను పగలగోట్టి సోమ్ముతో ఉడాయించాడు. దీంతో సురేష్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకున్నారు. తన పద్దతిలో అడగ్గా నేరం ఒప్పుకున్న వాచ్మెన్ డబ్బును సైతం తిరిగి ఇచ్చాడు. దీంతో పోలీసులు నిందితుడిని కోర్టులో హజరుపర్చారు.