స్నేహితులతో కలిసి ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన మాజిద్ని నారాయణగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ : స్నేహితులతో కలిసి ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన మాజిద్ని నారాయణగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక నివేదిక వెలువడిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.