
హైదరాబాద్: ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. నారాయణగూడ అడ్మిన్ ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం హిమాయత్‌నగర్ ఉర్దూ గల్లీలో సాయికృష్ణ గ్రాండ్యువర్ అపార్ట్‌మెంట్‌లో అరుణ్ కుమార్ జైన్ తన భార్య పూజజైన్(43) ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. కొంత కాలంగా పూజ జైన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది.
దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది. శనివారం ఉదయం ఆమె భర్త అరుణ్ కుమార్ బయటకు వెళ్లగానే ఐదో అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.