తాజ్‌ మహల్‌ హోటల్‌పై నుంచి దూకి ఆత్మహత్య | boy suicide | Sakshi
Sakshi News home page

Dec 30 2017 3:01 PM | Updated on Jul 12 2019 3:02 PM

సాక్షి, హైదరాబాద్: నారాయణగూడలోని ఓ అయిదంతస్తుల హోటల్‌ పై నుంచి ఓ యువకుడు దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషాద సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. తాజ్‌ మహల్‌ హోటల్‌లో పనిచేస్తున్న లక్ష్మయ్య(17) ఒక్కసారిగా హోటల్ ఐదో అంతస్తు పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే హోటల్‌ సిబ్బంది ఈ ఘటనను గోప్యంగా ఉంచగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఒడిశా వాసి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement