దొంగ దొరికాడు | A thief caught by police, and produced in court | Sakshi
Sakshi News home page

దొంగ దొరికాడు

Feb 26 2015 12:51 AM | Updated on Sep 2 2017 9:54 PM

ఉద్యోగం ఇచ్చిన కంపెనీలోనే దొంగతనానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధడు.

నారాయణగూడ(హైదరాబాద్ క్రైం): ఉద్యోగం ఇచ్చిన కంపెనీలోనే దొంగతనానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధడు. ఈ సంఘటన నగరంలోని నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. వివరాలు.. హిమాయత్‌నగర్ రోడ్ నంబరు.9లో ఉన్న సన్‌రైజ్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలోనే తన యజమాని సురేష్ కుమార్ రూ. 80,000 లాకర్‌లో భద్రపరుస్తుండగా చూశాడు. ఇదే అదునుగా ఎవరులేని సమయంలో లాకర్‌ను పగలగోట్టి సోమ్ముతో ఉడాయించాడు. దీంతో సురేష్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకున్నారు. తన పద్దతిలో అడగ్గా నేరం ఒప్పుకున్న వాచ్‌మెన్ డబ్బును సైతం తిరిగి ఇచ్చాడు. దీంతో పోలీసులు నిందితుడిని కోర్టులో హజరుపర్చారు.

Advertisement
 
Advertisement
Advertisement