
తిరువొత్తియూరు(తమిళనాడు): భర్తను మోసం చేసి భార్య రెండో వివాహం చేసుకుంది. భార్య మరొకరిని వివాహం చేసుకున్న దృశ్యం ఇన్స్టాగ్రామ్ లో చూసిన భర్త ఆవేదన చెందాడు. తన భార్యను విడిపించాలని పోలీసులకు మొర పెట్టుకున్నాడు. కన్యాకుమారి జిల్లా మైలాడి ప్రాంతానికి చెందిన మురుగేషన్ కుమారుడు అజిత్ కుమార్ తాపీ మేస్త్రి. ఇతనికి ఇతనికి కుల శేఖరం సమీపంలో తుంబకోడు ప్రాంతానికి చెందిన అభిషా(22) అనే యువతితో గత 2022వ సంవత్సరం వివాహమైంది.
దంపతులిద్దరూ కులశేఖరంలో ఉన్న అభిషా ఇంటిలో ఉంటున్నారు. పిల్లలు లేరు. ఈ క్రమంలో అభిషా అరుమలై సమీపంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనికి చేరింది. అభిషా గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలోనే ఉంటూ అక్కడే పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో గత 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తాను ఆసుపత్రిలోనే ఉండాలని చెప్పి వెళ్లిపోయింది. దీంతో 6వ తేదీ అజిత్ కుమార్ భార్యకు ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన అజిత్‌కుమార్ ఆసుపత్రిలో విచారణ చేయగా ఆమె ఎవరో బంధువులకు ఆరోగ్యం సరిలేదని 16 సంవత్సరాల యువకుడితో వెళ్లిందని తెలిపారు.
దీంతో 7వ తేదీన అరుమనై పోలీస్ స్టేషన్‌లో అజిత్ కుమార్ తన భార్య అదృశ్యమైనట్టు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో అజిత్‌కుమార్ స్నేహితుడు అతనికి ఒక వీడియో పంపిస్తాను చూడు అని, ఇన్‌స్ర్ట్రాగామ్ వీడియో ఒకటి పంపాడు. అది చూసిన అజిత్‌కుమార్ దిగ్భ్రాంతి చెందాడు. అందులో తన భార్య మరొక యువకుడిని వివాహం చేసుకున్న దృశ్యం ఉంది. దీంతో అజిత్‌కుమార్ భార్య చేసిన పని చూసి బోరున వినిపించాడు. అజిత్‌కుమార్ తర్వాత పోలీసులకు ఈ వీడియోను చూపించి తన భార్యను విడిపించాలని పోలీసులకు మొరపెట్టుకున్నాడు.