క్షేమంగా ఊరికి పంపిస్తామని.. కాటేశారు | Three Arrested in Mangalore Incdent | Sakshi
Sakshi News home page

క్షేమంగా ఊరికి పంపిస్తామని.. కాటేశారు

Apr 20 2025 11:55 AM | Updated on Apr 20 2025 11:55 AM

Three Arrested in Mangalore Incdent

పశ్చిమ బెంగాల్‌ యువతిపై సామూహిక అత్యాచారం కేసు...

మంగళూరులో ముగ్గురు అరెస్టు

కర్ణాటక: ఆ కూలీ యువతికి భాష తెలియదు, ఊరు తెలియదు, క్షేమంగా ఊరికి పంపిస్తానని నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డారు కామాంధులు. మంగళూరు నగరం వద్ద ఉళ్లాలలోని మున్నూరు బంగ్లా వద్ద బెంగాల్‌ యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలో కొత్త నిజాలు బయటపడ్డాయి. వివరాలు.. బాధిత యువతి 3నెలల క్రితం తన ప్రియుని కలిసి పశ్చిమబెంగాల్‌ నుంచి కేరళకు కూలీ పనికి వచ్చింది. ఏప్రిల్‌ 16న ఇద్దరి మధ్య గొడవ జరిగి ప్రియుడు ఆమె మొబైల్‌ ని పగలగొట్టి వెళ్లగొట్టాడు. 

దీంతో యువతి కేరళ నుండి మంగళూరుకు వచ్చే రైలు ఎక్కింది. మంగళూరులో దిగిన ఆమె స్వంత ఊరికి వెళ్లడానికి డబ్బులు లేక రైల్వేస్టేషన్‌లో చాలామంది వద్ద డబ్బులు అడిగింది. ఈ క్రమంలో నిందితుడు ఆటోడ్రైవర్‌ ప్రభురాజ్‌ ఆమైపె కన్నేసి మొబైల్‌ రిపేరీ చేయించి ఆమె అక్కకు కాల్‌ చేయమని చెప్పాడు. అక్క ఆమెకు ఆన్‌లైన్‌లో రూ.2 వేలు పంపించి ప శ్చిమ్‌ బెంగాల్‌ రైలు ఎక్కాలని చెప్పింది, ప్రభురాజ్‌ తో కూడా మాట్లాడిండి.

కూల్‌డ్రింకులో మత్తు కలిపి
రైలు ఆలస్యంగా వస్తుందని యువతిని నమ్మించి ప్రభురాజ్‌ తన ఆటోలో ఆమెను 6 గంటలపాటు ఊరంతా తిప్పాడు. రాత్రి కాగానే మత్తుమందు కలిపిన కూల్‌ డ్రింక్‌ తాగించి ఆమె స్పృహ కోల్పోయాక మిత్రులు మణి, మిథున్‌ను పిలిపించాడు. ముగ్గురూ కలిసి మున్నూరు బంగ్లా వద్ద నిర్జన ప్రదేశంలో అత్యాచారం చేసి పరారయ్యారు. 

బాధితులు ఓ ఇంటి వద్దకు వచ్చి పడిపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. నిందితులను కంకనాడి పోలీసులు అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్నారు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పటి వరకూ బాధితురాలి కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదని తెలిసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement