AIADMK
-
పళనిస్వామికి భారీ షాక్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం నిర్వహణకు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం బృందం సిద్ధమైంది. ఇందు కోసం 1000 మంది సభ్యుల చేత సంతకాలు చేయించి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామికి పంపించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే సర్వసభ్య సమావేశం విషయంగా ఎవ్వరూ సంతకాలు చేయవద్దని సభ్యులకు పళనిస్వామి సూచించారు.వివరాల మేరకు.. అన్నాడీఎంకేలో పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం శిబిరాల మధ్య వివాదం ముదిరింది. పళనిస్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి గద్దె దించడం లక్ష్యంగా ఎస్పీ వేలుమణి వ్యూహాలకు పదును పెట్టారు. ఇందుకు పార్టీ సర్వ సభ్య సమావేశాన్ని అస్త్రంగా చేసుకున్నారు. అన్నాడీఎంకేలో 1,800 మంది మేరకు సర్వ సభ్య సభ్యులు ఉన్నారు. వీరిలో 1000 మందిని తమ వైపునకు ఎస్పీ వేలుమణి శిబిరం తిప్పుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వీరితో సంతకాలు చేయించి, సర్వ సభ్య సమావేశం లక్ష్యంగా పట్టుబట్టే పనిలో పడ్డారు. పార్టీపరంగా తమతో ఉన్న 28 జిల్లాల కార్యదర్శుల ద్వారా మిగిలిన జిల్లాల కార్యదర్శులకు గాలం వేసే పనిలో నిమగ్నమై ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి.సంతకాలు చేయవద్దు పార్టీ సర్వ సభ్య సభ్యులకు పళనిస్వామి సూచనలు చేస్తూ ఆదివారం ప్రకటన చేశారు. సర్వ సభ్య సమావేశం పేరిట సంతకాలు చేయవద్దని, పార్టీని సర్వనాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల చర్యలకు చెక్ పెట్టేవిధంగా చట్ట పరమైన పోరాటానికి సైతం పళనిస్వామి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా పళణి స్వామికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకునేందుకు సీఎం విజయ్ కుట్రలు చేస్తున్నారని అమ్మమక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్ ఆరోపించారు. ఈ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన పక్షంలో సీబీఐ విచారణ కోరుతామని హెచ్చరించారు. -
అన్నాడీఎంకేలో సంక్షోభం.. పళనిస్వామి కొత్త స్కెచ్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి పళని స్వామి రాజీనామా చేయాలన్న నినాదాన్ని తిరుగుబాటు ఎమ్మెల్యేలు అందుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎస్పీ వేలుమణి దూకుడు పెంచారు. నమదు అమ్మ పత్రిక వ్యవస్థాపకుడి స్థానంలో పళని స్వామి పేరును తొలగించి, తనపేరును వేసుకున్నారు. వివరాలు.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు ముక్కలైన విషయం తెలిసిందే.ఓ శిబిరం సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తుండగా, మరో శిబిరం పళణి స్వామితో కలిసి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఈ అంతర్గత కలహాలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై మాజీ మంత్రులు ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం బహిరంగంగానే యుద్ధం ప్రకటించారు.ఎన్నికల ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ ఎడప్పాడి పళనిస్వామి తన ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని వేలుమణి, షణ్ముగం నేతృత్వంలోని 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం నినాదాన్ని అందుకుంది. ఎడప్పాడిని లొంగదీసుకోవడానికి వేలుమణి వర్గం పార్టీ ప్రత్యేక సర్వసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేపట్టింది.ఇందుకోసం సర్వసభ్య కమిటీ సభ్యుల నుంచి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే పత్రిక నమదు అమ్మకు వ్యవస్థాపకుడిగా ఇది వరకు పళనిస్వామి పేరు ఉండేది. అయితే, తాజాగా ఆయన పేరు ను తొలగించి తన పేరును ఎస్పీవేలుమణి వేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం పార్టీ పత్రికను తనగుప్పెట్లోకి తెచ్చుకున్న ఎస్పీ వేలుమని మరి కొద్ది రోజులలో పార్టీని కూడా కైవశం చేసుకోవడం ఖాయం అని పళని వ్యతిరేక ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.ఇదే సమయంలో తిరుగుబాటు చేసిన 25 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఎడప్పాడి పళనిస్వామి తరఫున తమిళనాడు గవర్నర్ కార్యాలయానికి, అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శికి ఇప్ప టికే వినతిపత్రం సమర్పించారు. ఒకవేళ స్పీకర్ లేదా గవర్నర్ ఈ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే, కోర్టులకు వేసవి సెలవులు ముగిసిన తర్వాత న్యాయపరమైన చర్యల ప్రయత్నాలు ముమ్మరం చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే గవర్నర్‌ను కలిసి స్వయంగా విన్నవించేందుకు పళణిస్వామి అనుమతి కోరి ఉండటం గమనార్హం.ఇక, ఎస్పీ వేలుమణి బృందం అయితే, పార్టీ ఫిరాయింపు ల నిరోధక చట్టం నుండి తప్పించుకుని, అసెంబ్లీలో ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందాలంటే కనీసం మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేల మద్ద తు అవసరంగా గుర్తించారు. దీంతో తమ వైపు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను 32కు పెంచుకోవడానికి వేలుమణి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.పళణి స్వామి వెనుక ఉన్న 22 మంది ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు వ్యూహ రచనలో ఉన్నట్టు సంకేతా లు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా, ఇరు శిబిరాల్లో ఈ వివాదం భగ్గుమంటోంది. విల్లుపురంలో సీవీషణ్ముం, పళని స్వామి వర్గం కయ్యానికి కాలు దువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే కార్యాలయాలకు భద్రతను పెంచారు. -
ఎంజీఆర్.. జయ.. పళని.. అది షరా మామూలే!
సాక్షి, చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకేలో చీలిక ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్‌కు ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు 24 మంది మద్దతు ప్రకటించడం.. రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చేసింది. ఈ తరుణంలో వాళ్లను కీలక పదవుల నుంచి తొలగిస్తూ పార్టీ జనరల్ సెక్రటరీ పళనిస్వామి నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఆ పార్టీలో ‘చీలిక’ కొత్తేమీకాదు. కాంగ్రెస్ పాలనకు చరమ గీతం పాడేందుకు అన్నాదురై నేతృత్వంలో డీఎంకే పేరిట తమళనాట తొలి ప్రాంతీయ ద్రావిడ పార్టీ ఆవిర్భవించిన కాలం నుంచి చీలిక పర్వం సాగుతున్నది. డీఎంకే దివంగత అధ్యక్షుడు కరుణానిధితో పొడసూపిన విభేదాల కారణంగా సినీ నటుడు ఎంజీఆర్ చేతుల మీదుగా పురుడు పోసుకున్న పార్టీ అన్నాడీఎంకే. ఎంజీఆర్ జీవించి ఉన్నంత కాలం సైన్యం తరహాలో కదిలిన ఈ పార్టీ ఆయన మరణానంతరం తదుపరి చీలికను ఎదుర్కొంది. 1972లో పార్టీ స్థాపించిన నాటినుంచి నేటి వరకు అనేకసార్లు వర్గ పోరును ఎదుర్కొంది. ఈ సమయంలో రెండుసార్లు అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నాన్ని ఎన్నికల కమిషన్ స్తంభింపచేసింది. ఆ చీలిక పర్వం సాగిందిలా.. ∙1972 అక్టోబర్ 18న డీఎంకే నుంచి బహిష్కరణకు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) పార్టీని స్థాపించారు. ∙1987 డిసెంబర్ 24న ఎంజీఆర్ మరణంతో ఆయన సతీమణి జానకీ రామచంద్రన్, పార్టీ ప్రచార కార్యదర్శి జయలలిత మధ్య తలెత్తిన విభేదాలు అన్నాడీఎంకే చీలికకు దారి తీసింది. 1988లో నాటి ఎంజీఆర్ విశ్వాసపాత్రుడు ఆర్ఎం వీరప్పన్ 98 మంది ఎమ్మెల్యేలతో జానకి వర్గానికి మద్దతు ఇచ్చారు. అసెంబ్లీలో హింసాత్మక ఘటనలు జరగడంతో అప్పట్లో రాష్ట్రపతి పాలన విధించారు. ∙1989 ఎన్నికలలో జయలలిత వర్గం 27 సీట్లు గెలవగా.. జానకి వర్గం 1 సీటుకే పరిమితమైంది. ఆ సమయంలో అన్నాడీఎంకే రెండాకుల గుర్తును ఎన్నికల కమిషన్ తాత్కాలికంగా స్తంభింపచేసింది. దీంతో జానకి రాజకీయాల నుంచి తప్పుకోగా పార్టీ జయలలిత నాయకత్వం గుప్పెట్లోకి చేరింది. ∙1990లో పార్టీ సీనియర్ నేత తిరునావుక్కరసు తిరుగుబాటుతో జయలలిత ఆయనను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. తన రాజకీయ గురువు పేరిట ఆయన ‘ఎంజీఆర్ ఏడీఎంకే’ను స్థాపించారు. ∙1995లో జయలలితతో విభేదాల నేపథ్యంలో ఆర్ఎం వీరప్పన్ పార్టీ నుంచి విడిపోయి ‘ఎంజీఆర్ కళగం’ఏర్పాటు చేశారు. ఆ తరువాత అన్నాడీఎంకే పూర్తిగా జయలలిత వశమైంది. ∙2011 ఎన్నికలలో గెలుపొందిన అన్నాడీఎంకే 2016 ఎన్నికలలో మరోసారి గెలిచి చరిత్ర సృష్టించిన జయలలిత నిష్క్రమణతో అన్నాడీఎంకేలో మళ్లీ చీలిక మొదలైంది. ∙2016 డిసెంబర్ 5న జయలలిత మరణం పార్టీలో చీకటి రోజుగా మిగిలింది. జయలలిత జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిన సమయంలో ఆమె నమ్మిన బంటు సీఎంగా బాధ్యతలు చేపట్టిన పన్నీరు సెల్వం ఆమె మరణంతో మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ∙జయలలిత మరణానంతర పరిణామాలతో 2017 ఫిబ్రవరిలో ఆమె నెచ్చెలి శశికళ సీఎం కావాలనుకోవడంతో పన్నీరు సెల్వం ధర్మయుద్ధం చేశారు. దీంతో పార్టీలో చీలిక అనివార్యమైంది. అనంతరం అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లగా.. కూవత్తూరులో జరిగిన రాజకీయ క్యాంప్‌తో పళణిస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. జయలలిత మరణం నేపథ్యంలో చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం మరోమారు స్తంభింపబడింది. ∙2017 ఆగస్టులో సీఎం పళణిస్వామి , పన్నీరు సెల్వం ఏకమయ్యారు. వీరి కలయికతో అదే ఏడాది మరోసారి పారీ్టలో చీలిక తప్పలేదు. శశికళ ప్రతినిధి దినకరన్‌ను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించడంతో ఈ చీలిక నెలకొంది. ఆ తరువాత అన్నాడీఎంకే నుంచి ఆవిర్భవించినదే అమ్మమక్కల్ మున్నేట్ర కళగం. ∙2021 అసెంబ్లీ ఎన్నికల తరువాత మరోసారి అన్నాడీఎంకేలో చీలిక తప్పలేదు. పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య ఏకనాయకత్వం విషయంలో తలెత్తిన వివాదం ఇందుకు కారణం. పన్నీరు సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పరిరక్షణ కోసం ఇయక్కం పేరిట శిబిరంతో రాజకీయాన్ని సాగించారు. ∙2022–23 మధ్యకాలంలో సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత పళణి స్వామి పార్టీపై పూర్తి పట్టు సాధించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా చక్రం తిప్పారు. పార్టీని పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకుని లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొన్నా డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇదే వరుసలో తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థలు, నగర పాలక సంస్థలు, ఉప ఎన్నికలలోనూ అన్నాడీఎంకేకు ఓటమి తప్పలేదు. ∙ఎన్నికల్లో వరుస ఓటముల నేపథ్యంలో.. 2026లో పళనిస్వామి నాయకత్వం బలహీనపడింది. ఇదే సమయంలో పార్టీలో కీలక నేతగా ఉన్న ఎస్పీ షణ్ముగం నాయకత్వంలో 24 మంది ఎమ్మెల్యేలు విడిపోవడంతో పార్టీ భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. బుధవారం అసెంబ్లీ వేదికగా పళణిస్వామి ఆజ్ఞను ఆ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు ధిక్కరించారు. టీవీకే చీఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. అంతే కాదు, పార్టీని సైతం కైవశం చేసుకునే దిశగా సర్వసభ్య సమావేశానికి ఈ ఎమ్మెల్యేల శిబిరం పిలుపునివ్వడం కొసమెరుపు. -
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం ప్రభుత్వానికి ఫ్లోర్ టెస్ట్‌లో మద్దతు ఇవ్వడంతో, ఏఐఏడీఎంకే కఠిన చర్యలకు ఉపక్రమించింది. టీవీకేకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పార్టీ పదవుల నుంచి తొలగించింది.జిల్లా కార్యదర్శి పదవులతో సహా వివిధ బాధ్యతలలో ఉన్న 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మొత్తం 29 మంది ఏఐఏడీఎంకే నాయకులను పదవుల నుంచి తొలగించారు. ఈ జాబితాలో సీనియర్ నేతలు సి.వి. షణ్ముగం, ఎస్.పీ. వేలుమణి, ఆర్. కామరాజ్, సి. విజయభాస్కర్, తంగమణి, కేపీ అన్బళగన్, కేసీ వీరమణి, ఎంఆర్. విజయభాస్కర్ వంటి పలువురు కీలక నాయకులు ఉన్నారు.ఈ చర్యతో ఏఐఏడీఎంకేలో అంతర్గత విభేదాలు మరింతగా బహిర్గతమయ్యాయి. పార్టీ అధినేత ఎడప్పాడి పళని స్వామి ఎమ్మెల్యేలను నియంత్రించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఫ్లోర్ టెస్ట్‌లో మెజారిటీని నిరూపించుకోవడం ద్వారా తన స్థిరత్వాన్ని బలపరచుకుంది. -
DMK వాక్అవుట్ .. బలపరీక్షలో 144 MLAల సపోర్ట్
-
అసెంబ్లీ లో అన్నాడీఏంకే హైడ్రామా
-
TVKలో షణ్ముగం వర్గం విలీనం..!? AIADMK చాప్టర్ క్లోజ్!
-
నేడు విజయ్ సర్కార్‌కు బలపరీక్ష
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. శాసనసభలో విజయ్ సర్కార్ బలపరీక్షకు సిద్ధమైంది. అయితే అధికార టీవీకేకు చెందిన ఒక ఎమ్మెల్యే ఓటింగ్‌కు దూరంగా ఉండాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.తమిళనాడు ఎన్నికల్లో 234 స్థానాలకుగానూ విజయ్ పార్టీ 108 సీట్లు గెలిచింది. విజయ్ రెండు చోట్లా పోటీ చేయడంతో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో టీవీకే బలం 107కి పడిపోయింది. కాంగ్రెస్ 5, వామపక్షాలు 4, వీసీకే 2 సీట్ల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ 118ని టీవీకే చేరుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే.. ఒక ఓటు తేడాతో నెగ్గిన తిరుప్పత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి ఓటింగ్‌లో పాల్గొనడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కౌంటింగ్‌లో తేడా జరిగిందని.. శ్రీనివాస ఎన్నిక చెల్లదంటూ డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియాకరుప్పర్ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో.. హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ టీవీకే ఎమ్మెల్యే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ జరగనుంది. అయితే.. శ్రీనివాస్ దూరం అయిన నేపథ్యంలో టీవీకే సంకీర్ణ ప్రభుత్వ బలం 117కి పడిపోయింది. అయితే ఏఎంఎంకే పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ తన అధిష్టానాన్ని ఎదురించి మరీ విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించారు. అలాగే అన్నాడీఎంకే పార్టీలో చీలిక ఏర్పడిన సంగతి తెలిసిందే. అందులోని 28 మంది ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి విజయ్ (Vijay) సీవీ షణ్ముగం నివాసానికి వెళ్లి భేటీ కావడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో.. ఇవాళ్టి బలనిరూపణ ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
అరవ చదరంగం అదుర్స్
-
వీసీకే అధినేతను సీఎంను చేయడానికి సంప్రదింపులు జరిగాయా?
చెన్నై: కులం-ముఖ్యమంత్రి పదవి గురించి విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) అధినేత తొల్ తిరుమావళవన్ ఇటీవల చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. తమిళనాడు ఎన్నికల్లో 2 స్థానాలు గెలిచి, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకేకు వీసీకే మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. టీవీకే అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కూటమి ఏర్పాటు జరిగితే తనను ముఖ్యమంత్రిని చేస్తామంటూ అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు సంప్రదించాయంటూ వచ్చిన వార్తలను తిరుమావళవన్ ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యల అర్థాన్ని వక్రీకరించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని తిరుమావళవన్ మీడియాను కోరారు. “మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలని కొందరు ప్రయత్నించారని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రయత్నాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని అంటున్నారు” అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారని తిరుమావళవన్ తెలిపారు. దానికి తాను స్పందిస్తూ.. “అలాంటి ప్రయత్నం జరిగిందని నాకు కూడా సమాచారం వచ్చింది” అని అన్నారు.ఎవరూ నన్ను సంప్రదించలేదు తనకు పరిచయం ఉన్న కొంతమంది స్నేహితులు వచ్చి తనను ముఖ్యమంత్రిగా చేసే ప్రయత్నాల గురించి మాట్లాడారని తెలిపారు. అంతేగానీ, డీఎంకే, ఏఐఏడీఎంకే నుంచి అధికారికంగా ఎవరూ తనను ముఖ్యమంత్రి విషయంపై సంప్రదించలేదని, తానూ ఈ విషయం గురించి ఎవరితోనూ చర్చించలేదని చెప్పారు. ఆ ప్రశ్నకు తాను వివరణ ఇచ్చానని.. కానీ, దానికి వేరే అర్థం వచ్చేలా శీర్షికలు పెట్టి వార్తలు ప్రచారం చేసి సంచలనం సృష్టించడం మీడియాకు సరికాదని తెలిపారు. నిన్న, ఇవాళ దీని గురించి మీడియాలో నిర్ధారణ కాని వార్తలు వస్తూనే ఉన్నాయని తెలిపారు. తమిళనాడులో దళిత సమాజానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిని చేసేందుకు తమిళ సమాజం ఇంకా సిద్ధంగా లేదన్నది అందరికీ తెలిసిన చేదు నిజమని చెప్పారు.భారతదేశంలో ఉత్తరప్రదేశ్, ఆంధ్ర, మహారాష్ట్ర, బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లో దళితులు ముఖ్యమంత్రులుగా పాలనా పీఠంపై నిలిచిన చరిత్ర ఉందని తెలిపారు. కానీ, తమిళనాడులో ఇంకా 100 సంవత్సరాలు గడిచినా అది కలగానే మిగులుతుందని తనకు తెలుసని చెప్పారు. అయినా, నేటి రాజకీయ పరిస్థితుల్లో అలాంటి చర్చ జరిగిందని చెప్పారు. దాన్ని వక్రీకరించి వేరే అర్థం వచ్చే ఉద్దేశంతో కొన్ని మాధ్యమాలు వార్తలు ప్రచారం చేయడం బాధ కలిగిస్తోందని తిరుమావళవన్ చెప్పారు. కాగా, టీవీకేకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ఉంది. కాంగ్రెస్‌కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలకు తలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్నికల్లో టీవీకే 108 అసెంబ్లీ స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. -
కోట్లాది మందిని ఏలిన పార్టీలు ఇప్పుడు ముక్కలు
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాంలో ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల్లో తగాదాలు రేపాయి. ఎన్నికలు ముగిసే వరకు తమలో ఉన్న విభేదాలను బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాయి ఆయా పార్టీలు. ఎన్నికల తర్వాత ఒక్కసారిగా అవి గుప్పుమంటున్నాయి. ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న పార్టీల ఓటమి (తమిళనాడు, పశ్చిమ బెంగాల్), అసోంలో కాంగ్రెస్ ఘోర ఓటమి ఇప్పుడు అసంతృప్తిని వెలుగులోకి తెచ్చాయి. ఆ మూడు రాష్ట్రాల విపక్షాల్లో ఏం జరుగుతోంది? తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గతంగా నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకేలో నాయకత్వ మార్పు కోరుతూ బహిరంగంగానే నేతల మధ్య డిమాండ్ మొదలైంది. అస్సాంలో అఖిల్ గోగోయి సొంత కూటమిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.టీఎంసీలో పెరుగుతున్న అసంతృప్తిపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎదుర్కొన్న ఘోర ఓటమి పార్టీలో అసంతృప్తికి దారితీసింది. పలువురు నేతలు, ప్రతినిధులు బహిరంగంగా మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. అంతర్గత విభేదాలపై ఇప్పటికే టీఎంసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో టీఎంసీ ముగ్గురు పార్టీ ప్రతినిధులను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది.మాజీ టీఎంసీ ప్రతినిధి రిజు దత్తా ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేసి.. సీఎం, బీజేపీ నేత సువేందు అధికారి సహా బీజేపీ నేతలకు క్షమాపణలు చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సువేందు అధికారి మీద దాడి చేయాలని టీఎంసీలోని కొందరు తనపై ఒత్తిడి, బెదిరింపులు తెచ్చారని దత్తా ఆరోపించారు. తనకు మద్దతు, రక్షణ ఇచ్చినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. టీఎంసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకావాలని పిలిచినా దత్తా వెళ్లలేదు.అన్నాడీఎంకేలో అలజడితమిళనాడులోని అన్నాడీఎంకేలో ఎన్నికల నిరాశాజనక ఫలితాల తర్వాత అంతర్గత విభేదాలు పెరిగాయి. పార్టీ 167 స్థానాల్లో పోటీ చేసి కేవలం 47 స్థానాలు మాత్రమే గెలిచింది. అధికారంలో ఉన్న టీవీకేకు మద్దతు ఇవ్వాలా? వద్దా? అన్న విషయంపై విభేదాలు వచ్చాయి. పార్టీ అధినేత పళనిస్వామి రాజీనామా చేయాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. చీలిక దిశగా అన్నాడీఎంకే సాగుతోంది. వేర్వేరుగా పళనిస్వామి, సీవీ షణ్ముగం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. టీవీకే అధినేత, సీఎం విజయ్ను షణ్ముగం మంగళవారం కలిశారు.అస్సాంలోనూ అసంతృప్తిఅస్సాంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష వ్యూహంపై విమర్శలు వచ్చాయి. ప్రాంతీయ పార్టీ రైజోర్ దళ్ ప్రతిపక్షంలో సీటు నిలబెట్టుకున్న పార్టీల్లో ఒకటిగా నిలిచింది. అఖిల్ గోగోయి సిబ్సాగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కుశల్పై 17,272 ఓట్ల తేడాతో గెలిచారు. గోగోయ్‌కు 86,521 ఓట్లు రాగా, దోవారికి 69,249 ఓట్లు వచ్చాయి.సీటు నిలబెట్టుకున్నప్పటికీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమిపై గోగోయ్ బహిరంగ విమర్శలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా స్పష్టమైన వ్యూహం లేదని అన్నారు. “బీజేపీ వద్ద మంచి ప్రణాళిక ఉంది. మా వైపు చివరి నిమిషంలో ప్రణాళిక లేని, అస్తవ్యస్తమైన, అర్ధహృదయ ప్రచారం జరిగింది” అని గోగోయ్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. -
విజయ్ ఎత్తులు : పళని స్వామికి షాక్, కొత్త నాయకత్వం
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీ AIADMK (అన్నాడీఎంకే) చీలిక దిశగా వెళ్తుండటంతో, ఆ పార్టీకి చెందిన రెబల్ వర్గం ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. బుధవారం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించు కోవాల్సి ఉన్న తరుణంలో సీఎం విజయ్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో CV షణ్ముగం, SP వేలుమణిలతో భేటీ కావడంతో తమిళనాట రాజికీయాలు మరింత వేడెక్కాయి.ముఖ్యమంత్రి విజయ్, టీవీకే కూటమికి మద్దతు ప్రకటించిన అన్నాడీఎంకే కీలక నేతలతో సమావేశ మయ్యారు. ఎడప్పాడి పళనిస్వామి (EPS) ప్రతిపాదనపై వ్యతిరేకత కారణంగా అన్నాడీఎంకేకు చెందిన సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఈ రెబల్ క్యాంపులో ఉన్నట్లు సమాచారం. ఇది తమ ఎమ్మెల్యేలలో అత్యధికుల నిర్ణయమని షణ్ముగం మంగళవారం తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూసిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.కొత్త నాయకత్వంరెబల్ వర్గం తమ సొంత నాయకత్వాన్ని ఎన్నుకుంది:శాసనసభాపక్ష నేతగా ఎస్.పి. వేలుమణిని, డిప్యూటీ లీడర్‌గా జి. హరిని ఎన్నుకోవడం సంచలనం రేపింది.విజయ్‌తో అన్నాడీఎంకే రెబల్ నేతల భేటీఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కేవలం 47 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి, బద్ధశత్రువైన DMK (డీఎంకే) మద్దతుతో ముఖ్యమంత్రి కావాలని భావించడం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని షణ్ముగం తెలిపారు.డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే అన్నాడీఎంకే మనుగడకే ముప్పు అని మెజారిటీ ఎమ్మెల్యేలు భావించారు. 53 ఏళ్లుగా డీఎంకేకు వ్యతిరేకంగానే తమ రాజకీయం ఉందని, అందుకే విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. అన్నాడీఎంకేలో మరో చీలిక తమకు ఇష్టం లేదని ఎస్.పి. వేలుమణి పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పళనిస్వామిని కోరారు. పార్టీ శ్రేయస్సు కోసమే తాము ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.కాగా తమిళనాడులో ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో టీవీకే (108 సీట్లు) అతిపెద్ద పార్టీగా అవతరించగా, డీఎంకే 59 సీట్లు, అన్నాడీఎంకే 47 సీట్లు గెలుచుకున్నాయి. ఇప్పుడు అన్నాడీఎంకేలోని ఒక వర్గం మద్దతుతో విజయ్ ప్రభుత్వం మరింత బలోపేతం కానుంది. -
TVK అధినేత, సీఎం విజయ్ కు మద్దతు ప్రకటన
-
తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్!
తమిళనాడులో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మిత్రపక్షం అన్నాడీఎంకేలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. టీవీకే విజయ్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ వెంటనే టీవీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే కూడా అదే ప్రకటన చేసింది. ‘‘డీఎంకేతో చేతులు కలిపి సీఎం కావాలని పళనిస్వామి కుట్ర చేశారు. పార్టీ సిద్దాంతాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారు. అందుకే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నాం. ఇకపై ఎన్డీయే కూటమికి.. మాకు సంబంధం లేదు. మాదే అసలైన అన్నాడీఎంకే. విజయ్ ప్రజల సీఎం. అందుకే మా మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని అన్నాడీఎంకే రెబల్ వర్గ ఎమ్మెల్యే సీవీ షణ్ముగం ప్రకటించారు. ఆ వెంటనే.. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(AMMK) ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అయితే ఈ విషయంలో ఆ పార్టీ అధినేత టీవీవీ దినకరన్ హైడ్రామా నడిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న టీవీకేకు తొలుత కామరాజ్ మద్దతుగా సంతకం చేశారు. అయితే తమ ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ దినకరన్ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ విషయంపై గవర్నర్‌కు, పోలీసులు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. తమ మిత్రపక్షం అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటునకు సిద్ధంగా ఉందని.. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. అయితే.. టీవీకే ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ కామరాజ్ సంతకం చేసిన వీడియోను రిలీజ్ చేసింది. అయినా కూడా దినకరన్ తన ఆరోపణలను కొనసాగించారు. ఈ తరుణంలో.. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ప్రకటన చేయడం గమనార్హం. అయితే తన ఎమ్మెల్యే కామరాజ్ దినకరన్ సూచన మేరకే విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటన చేశారా?.. లేదంటే రెబల్‌గా సంతకం చేశారా? ఎన్డీయే కూటమి నుంచి దినకరన్ పార్టీ కూడా బయటకు వచ్చేసినట్లేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి మొత్తం 234 స్థానాలకుగానూ.. 223 స్థానాల్లో పోటీ చేసింది. వీటిలో అన్నాడీఎంకే 178 స్థానాల్లో పోటీ చేసి 47 గెల్చుకుంది. బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు నెగ్గింది. ఏఎంఎంకే 11 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో గెలిచింది. పట్టాలి మక్కల్ కట్చి(PMK) 18 స్థానాల్లో పోటీ చేసి 4 సీట్లు గెలిచింది. ఫలితంగా, ఈ కూటమి మొత్తం 53 స్థానాలు గెలుచుకుంది.ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఎన్డీయే కూటమిలో.. లుకలుకలు బయటపడ్డాయి. మెజారిటీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు (24-30) మంది కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్‌కు మద్దతు ప్రకటించారు. ఇటు దినకరన్ ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కూడా మద్దతు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో పళని వర్గ ఎమ్మెల్యేలు, పీఎంకే 4 ఎమ్మెల్యేలు, బీజేపీ ఏకైక ఎమ్మెల్యే మాత్రమే మిగిలినట్లైంది!. -
ఎన్డీయేకు ఝలక్.. విజయ్‌కు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు
అన్నాడీఎంకే పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యే వర్గం సంచలన ప్రకటన చేసింది. ఎన్టీయే కూటమి నుంచి బయటకు వచ్చి.. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామిపై తీవ్ర విమర్శలు గుప్పించింది. అలాగని ఇది పార్టీని చీల్చే ప్రయత్నం ఏమాత్రం కాదని ఆ వర్గ ఎమ్మెల్యే సీవీ షణ్ముగం తేల్చి చెప్పారు. సీవీ షణ్ముగంలో నేతృత్వంలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు(24 మంది అని కొన్ని తమిళ మీడియా సంస్థలు చెబుతున్నాయ్) విజయ్‌కు మద్దతు ప్రకటించారు. తాము ఏ పదవులనూ ఆశించబోవడం లేదని.. బయటి నుంచే విజయ్ సర్కార్‌కు సపోర్ట్ ఇస్తామని అన్నారు. చెన్నైలో మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకేలో అంతర్గత పోరు నిజమేనని ఆయన అంగీకరించారు. ‘‘విజయ్ ప్రజల సీఎం. ఆయన ఆ కుర్చీలో కూర్చోవాలని తమిళ ప్రజలు కోరుకున్నారు. ప్రజా నిర్ణయమే మాకు శిరోధార్యం. అందుకే ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం’’ అని షణ్ముగం ప్రకటించారు. అదే సమయంలో.. పార్టీ లుకలుకలను ఆయన మీడియాకు వివరించారు. డీఎంకేతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పళని స్వామి కుట్ర చేశారు. ఎలాగైనా ఆయన సీఎం కావాలని అనుకున్నారు. ఆ ప్రతిపాదనను మేం ఒప్పుకోలేదు. అన్నాడీఎంకే స్థాపన లక్ష్యం డీఎంకేను ఎదుర్కోవడం. అలాంటి పార్టీతో చేతులు కలపడం పార్టీ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమే కాదు.. అత్యంత ప్రమాదకరం కూడా. ఈ విషయంలో పళనిస్వామి మాకు విరుద్ధంగా వ్యవహరించారు. అందుకే ఎన్డీయే కూటమికి గుడ్‌బై చెప్పాం అని షణ్ముగం వివరించారు. వరుస ఓటములకు పళనినే కారణమన్న షణ్ముగం.. ఆయన అన్ని పదవుల నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి మాదే అసలైన అన్నాడీఎంకే కూటమి.. ఎన్డీయేతో మాకు సంబంధం లేదు.. మేం బయటకు వచ్చేశాం. ఎన్నికల ఫలితాలపై, భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే సమీక్షా సమావేశం నిర్వహిస్తాం అని స్పష్టం చేశారాయన. దీంతో పళనిస్వామి ఎలా స్పందిస్తారు? ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుంది?. కూటమి విచ్ఛిన్నంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో? అనే ఉత్కంఠ నెలకొంది.ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 53 సీట్లు నెగ్గింది. అన్నాడీఎంకే 47 స్థానాల్లో.. పీఎంకే 4, ఏఎంకే, బీజేపీలు చెరో సీటు చొప్పున నెగ్గాయి. అయితే ఫలితాల తర్వాత విజయ్‌కు మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక మొదలైంది. బీజేపీ మద్దతు నేపథ్యంతో పళనిస్వామి అందుకు ఒప్పుకోలేదు. రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీ కంటే విజయ్‌కు మద్దతు పార్టీకి ప్రజల్లో సింపథీ క్రియేట్ చేస్తుందని.. రాబోయే రోజుల్లో అది పనికి వస్తుందని వాదించింది. అంతేకాదు.. ఆ పార్టీ తరఫున శాసనసభా పక్షనేత, ఉప నేత ఎంపికలోనూ ఈ వర్గపోరు మరింత ఉధృతంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. తనకు, తన అనుచర గణానికి ఆ పదవులు దక్కాలని పళనిస్వామి భావిస్తున్నారు. అయితే షణ్ముగం వర్గం మాత్రం సీనియర్ నేత ఎస్పీ వేలుమణికి శాసనసభా పక్ష నేత, డిప్యూటీ పదవిని జీ హరి, సీ భాస్కర్లలో ఎవరికో ఒకరికి ఇవ్వాలని పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే పోరు ముదిరి బయటకు వచ్చి ప్రకటన చేసింది. రేపు తమిళనాడు అసెంబ్లీలో విజయ్ సంకీర్ణ ప్రభుత్వం బల పరీక్ష ఎదుర్కొనుంది. ఈ తరుణంలో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల ప్రకటన బూస్ట్ కానుంది. -
విజయ్ ఎఫెక్ట్‌తో పళని విలవిల
ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగానే సాగుతున్నాయి. తప్పు చేయను, తప్పు చేయనివ్వను అంటూ సీఎంగా ప్రమాణం చేసేటప్పుడు విజయ్ ప్రకటించారు. మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యతను నిర్వర్తిస్తామని డీఎంకే ఎంకే స్టాలిన్ హుందాగా ప్రకటించుకున్నారు. ఇంకోవైపు.. విజయ్ దెబ్బకు మరో విపక్షం అన్నాడీఎంకే మాత్రం వర్గపోరుతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. టీవీకేకు తగిన సంఖ్యా బలం లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటునకు నాలుగు రోజుల హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. ఈ గ్యాప్‌లో విజయ్ను దెబ్బ తీయాలని పళనిస్వామి తీవ్రంగా ప్రయత్నించినట్లు ఊహాగానాలు వినిపించాయి. కేవలం 47 మంది స్థానాలు నెగ్గిన అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు చేస్తోందని.. ఇందుకోసం బద్ధశత్రువు డీఎంకే మద్దతు తీసుకోనుందనే ప్రచారం ఉవ్వెత్తున సాగింది. చివరకు ఆ ఎపిసోడ్ తుస్సుమంది. గ్రూపు రాజకీయాలతో.. అదీ విజయ్‌కు మద్దతు ఇచ్చే విషయంలోనే మొదలైన సంక్షోభంతో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామి తల పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నాడీఎంకేలో వర్గపోరు మునుపెన్నడూ లేనంత తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికల్లో వరుస పరాజయాల కారణంగా పళనిస్వామి నాయకత్వంపై ఆ పార్టీలో అసంతృప్తి పెరిగింది. ఆయన డీఎంకేతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించారని.. మరో సీనియర్ నేత సీవీ షణ్ముగం నేతృత్వంలోని వర్గం దీనిని వ్యతిరేకించిందని.. అదే సమయంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చర్చలు జరిపిందని జోరుగా ప్రచారం నడిచింది. పళనిస్వామి ఎమ్మెల్యేల మద్దతు కోసం వారిని పుదుచ్చేరి రిసార్ట్‌కి తరలించినా ఈ విభేదాలు చల్లారలేదు. చివరకు తన నివాసంలో కూర్చోబెట్టి బుజ్జగించినా ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆయన ‘‘మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి..’’ అని తెగేసి చెప్పినట్లు సమాచారం. అటుపై మే 10 రాత్రి జరిగిన మరో సమావేశం తీవ్ర వాగ్వాదాలతో ముగియడంతో.. షణ్ముగం వర్గం విడిగానే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది.తాజాగా.. సోమవారం తమిళనాడు కొత్త అసెంబ్లీ సమావేశమైంది. దీనికి పళనిస్వామి నేతృత్వంలో 17 మంది ఎమ్మెల్యేలు, అలాగే షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేలు విడివిడిగా శాసనసభకు వచ్చి ప్రమాణం చేసి వెళ్లిపోయారు. పళని స్వామిని శాసనసభా పక్ష నేతగా గుర్తించాలని ఆయన మద్దతుదారులు.. లేదు ఎస్పీ వేలుమణిని గుర్తించాలని షణ్ముగం వర్గం ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి విడిగా లేఖలు ఇచ్చారు. దీంతో అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత ఎంపికపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. విజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుతో అన్నాడీఎంకేలో మొదలైన విభేదాలు.. మరింత ముదిరి ఇంకో మలుపు తీసుకునే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ఇవాళ జరగబోయే స్పీకర్ ఎన్నికలో షణ్ముగం వర్గం టీవీకేకు మద్దతు ఇవ్వవచ్చన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇది జరిగితే, పళనిస్వామికి సొంత పార్టీలోనే షాక్ తప్పదు.విజయ్ ప్రభావం అన్నాడీఎంకేలోని అంతర్గత సమీకరణాలను గణనీయంగా మార్చేస్తోంది. పళనిస్వామి తన నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడం ఆయనను విలవిలాడే స్థితిలోకి నెట్టింది. మొత్తం మీద, అన్నాడీఎంకేలోని ఈ చీలిక పార్టీ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది. అయితే.. ఈ పరిణామాలతో సైలెంట్‌గా లాభపడేది టీవీకే, బీజేపీ అనే విశ్లేషణ నడుస్తోంది. అసెంబ్లీలో విజయ్ టీవీకే బలనిరూపణ ఎదుర్కొనుంది. అన్నాడీఎంకేలోని చీలిక వర్గం ఆ సమయంలో టీవీకేకు మద్దతు ప్రకటిస్తే పెనుసంచలనమే కానుంది. అయితే.. బయట మద్దతు తీసుకోవచ్చని.. మంత్రివర్గంలో స్థానం ఇవ్వకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు.. ఈ విబేధాలను అన్నాడీఎంకే కూటమి పార్టీ బీజేపీ తమ వ్యూహంలో భాగంగా ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదు. బలహీనమైన అన్నాడీఎంకే ద్వారా టీవీకేపై ప్రభావం చూపించే ప్రయత్నం చేయొచ్చని విశ్లేషకులు అంటున్నారు.షణ్ముగం వర్గం బలపడితే, పళనిస్వామి నాయకత్వం కూలిపోవడం ఖాయం. ఇక స్పీకర్ ఎన్నికలో టీవీకే పార్టీ అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతు పొందితే, ఆ ప్రభావం తమిళనాడు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. -
అన్నాడీఎంకేలో చీలిక!
సాక్షి, చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ సాక్షిగా అన్నాడీఎంకే పార్టీలో విభేదాలు వెలుగుచూశాయి. తాజా ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యం చెందడంతో పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి కె.పళనిస్వామి నాయకత్వంలో ముందుకు సాగేది లేదని మెజార్టీ ఎమ్మెల్యేలు తెగేసి చెప్పారు. దీంతో పార్టీలో చీలిక అనివార్యమని స్పష్టమవుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు పార్టీ సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం సారథ్యం వహిస్తున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు వీళ్లిద్దరికే మద్దతు తెలపడంతో తాజాగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు తమిళ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. పార్టీ ఘోర పరాభవానికి పళనిస్వామే కారణమని, అలాంటి వ్యక్తి అసెంబ్లీలో పార్టీ తరపున శాసనసభాపక్ష నేతగా కొనసాగే అర్హత కోల్పోయారని వేలుమణి, షణ్ముగం వర్గం ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. షణ్ముగంను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని తిరుగుబాటు వర్గం నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా ప్రొటెం స్పీకర్ కరుప్పయ్యను కలిసి వినతి పత్రం అందజేసింది. అయితే పళనిస్వామినే పార్టీ తరఫున శాసనసభాపక్ష నేతగా అనుమతించాలంటూ థలవై సుందరం సారథ్యంలోని ఎమ్మెల్యేల బృందం మరో వినతి పత్రాన్ని ప్రొటెం స్పీకర్‌కు అందజేసింది. శాసన సభాపక్ష నేత పదవి కోసం.. 17వ శాసనసభ తొలి సమావేశానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు బృందాలుగా రావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. పళనిస్వామితోపాటు కొద్ది మంది ఎమ్మెల్యేలే సభకు వచ్చారు. షణ్ముగం, వేలుమణి వెంట మిగతా ఎమ్మెల్యేంతా నడిచారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలంటూ షణ్ముగం పేరును తాత్కాలిక స్పీకర్ పిలిచినప్పటికీ ఆయన ముందుకురాలేదు. వేలుమణి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అన్నాడీఎంకేలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బల్లలు చరిచి మద్దతు తెలిపి తాము తిరుగుబాటు జెండా ఎగరేశామని అసెంబ్లీ సాక్షిగా పరోక్షంగా ప్రకటించారు. ఎమ్మెల్యేగా పళనిస్వామి ప్రమాణం చేస్తున్నప్పుడు కొద్దిమంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతుగా బల్లలు చరిచారు. దీంతో పార్టీలో విబేధాలు పొడచూపాయని అసెంబ్లీలో అందరికీ అర్థమైపోయింది. మరోవైపు మాజీ మంత్రి, ప్రస్తుతం డీఎంకేలో ఉన్న సెంథిల్ బాలాజీతో వేలుమణి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ భేటీ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎవరికెంత బలం? ప్రస్తుత పార్టీ చీఫ్ పళనిస్వామి వెంట కేవలం 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. షణ్ముగం, వేలుమణి వర్గంలో ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. శాసనసభాపక్ష నేత ఎన్నిక వ్యవహారం చినికిచినికి గాలివానగా చివరకు పార్టీ చీలికకు ప్రధాన కారణంగా నిలుస్తుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. విజయ్‌కి మద్దతు విషయంలో.. ప్రభంజనంలా వచ్చి సీఎం పదవిని ఒడిసిపట్టిన టీవీకే చీఫ్ విజయ్‌కు బయటి నుంచి మద్దతు ఇవ్వాలని మొదట్నుంచీ షణ్ముగం, వేలుమణి బృందం పట్టుబడుతోంది. ఈ ధోరణిని పళనిస్వామి తప్పుబట్టారు. దీంతో బేధాభిప్రాయాలు మరింత ముదిరి పార్టీలో అంతర్గత చీలికలు పెద్దవైపోయి ఇప్పుడు బహిర్గతమయ్యాయి. పళనిస్వామి గనక పార్టీ ఎమ్మెల్యేలందరినీ సమావేశపరిచి శాంతపరచకపోతే పార్టీ శాశ్వతంగా చీలిపోయే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు సత్యాలయ రామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. షణ్ముగం వర్గంతో కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని, పార్టీ ఐక్యతకు అది అత్యంత కీలకమని పళనిస్వామి భావించకపోతే పార్టీ మరింత బలహీనపడి ద్రవిడ పార్టీల్లో ఏకైక బలమైన పార్టీగా డీఎంకే మాత్రమే కొనసాగుతుందని ఆయన విశ్లేషించారు. అవస్థల కడలిలో అన్నాడీఎంకే అన్నాడీఎంకేలో చీలికలు ఉంటే ఐదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు తేల్చేశారు. గత కొంతకాలంగా పార్టీ తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ చోట్ల పార్టీ గెలిచింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ పార్టీ ప్రదర్శన పేలవంగా ఉంది. తాజా ఎన్నికల్లోనూ పార్టీ 47 స్థానాలకే పరిమితమైంది. -
AIADMKలో చీలిక! రెండు వర్గాలుగా అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు
-
విజయ్‌కు భారీ గుడ్‌న్యూస్..
చెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటు తర్వాత రాజకీయం ఆసక్తికరంగా మారింది. అన్నాడీఎంకేలో విజయ్‌కి మద్దతు భారీగా పెరుగుతోంది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత ఏఐఏడీఎంకేలో అశాంతి సంకేతాలు తీవ్రమైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎంతగా అంటే.. పార్టీ ఓటమికి పళనిస్వామిని బాధ్యుడిని చేసి అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో, అన్నాడీఎంకేలో అంతర్గత పోరు పీక్ స్టేజ్‌కు చేరుకుంది.కాగా, అన్నాడీఎంకేలో మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు వేలుమణి వర్గం బలంగా ఎదుగుతోంది. పార్టీలో పళనిస్వామి నాయకత్వంపై తిరుగుబాటు పెరుగుతుండగా వేలుమణి–శణ్ముగం వర్గానికి మద్దతు భారీగా పెరిగింది. ఎన్నికల్లో గెలిచిన 47 మందిలో 36 మంది ఎమ్మెల్యేలు వీరితోనే ఉన్నారు. కాగా, వీరంతా టీవీకే విజయ్‌కి మద్దతు ఇవ్వాలని, ప్రభుత్వానికి అండగా నిలవాలని ముందు నుంచే అనుకూలంగా ఉన్నారు. ఈ వర్గం ఫ్లోర్ టెస్ట్‌లో కూడా టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.మరోవైపు.. పళనిస్వామి నాయకత్వాన్ని సవాలు చేస్తూ అన్నాడీఎంకే లెజిస్లేచర్ పార్టీ కొత్త నేతగా వేలుమణిని ఎన్నుకోవాలని చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఇది పార్టీ విభజనకు దారితీసే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా వేర్వేరుగా వచ్చి అసెంబ్లీలో ప్రమాణం చేయడం గమనార్హం. A split in AIADMK again..🔥🔥🔥- Edappadi Palaniswami resigns as AIADMK General Secretary.- SP Velumani takes over AIADMK.- CV Shanmugam directly alleges that Edappadi is not even qualified to form an alliance.. pic.twitter.com/8Kvop8IGBj— Muthukumar Subbaiah (@smkumarlakshmi) May 9, 2026ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం సీవీ షణ్ముగంతో పొత్తులో ఉన్న ఎమ్మెల్యేలు, పలువురు మాజీ మంత్రులు కలిసి.. ఆయన నాయకత్వాన్ని ఇకపై అంగీకరించడానికి సిద్ధంగా లేమని ఈపీఎస్‌కు తెలియజేశారు. వరుసగా నాలుగు ఎన్నికల ఓటముల తర్వాత ఈపీఎస్ వర్గానికి, షణ్ముగంతో ఉన్న నాయకులకు మధ్య విభేదాలు పెరిగాయి. ఓటములు అన్నాడీఎంకేలో నైతిక స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. నాయకత్వం రాజకీయ వ్యూహంపై అంతర్గత ఆగ్రహాన్ని తీవ్రతరం చేశాయని వర్గాలు తెలిపాయి.అన్నాడీఎంకే పరిస్థితి ఇలా..అన్నాడీఎంకే వరుసగా ఎదుర్కొన్న ఓటములు పార్టీ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.నాయకత్వ సంక్షోభం: ఈపీఎస్ నాయకత్వంపై తిరుగుబాటు పెరుగుతుండగా, వేలుమణి–శణ్ముగం వర్గం బలపడుతోంది.పార్టీ విభజన: రెండు వర్గాల మధ్య విభేదాలు పెరిగితే, పార్టీ విభజనకు దారితీసే అవకాశం ఉంది.డీఎంకేతో చర్చలు: డీఎంకేతో బ్యాక్‌చానల్ చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు, పార్టీ అంతర్గత అసంతృప్తిని మరింత పెంచాయి.టీవీకే ప్రభావం..విజయ్ నేతృత్వంలోని టీవీకే తమిళనాడు రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదుగుతోంది.విజయం: 108 స్థానాలు గెలిచి భారీ మెజారిటీ సాధించింది.పొత్తు: అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గం టీవీకేకు మద్దతు ఇస్తే, టీవీకే బలం మరింత పెరుగుతుంది. ఇది డీఎంకేకు సైతం ఎదురుదెబ్బ. -
బీజేపీకి సినిమా చూపెట్టిన సీఎం విజయ్
-
అన్నాడీఎంకేలో చీలిక!?
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో తాజా అసెంబ్లీ ఎన్నికల ఓటమి పరిస్థితులు మళ్లీ చీలికకు దారి తీస్తాయా అన్న చర్చ ఊపందుకుంది. శనివారం పరిణామాలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. 36 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామితో సమావేశానంతరం ప్రత్యేక శిబిరంగా ఏర్పాటై సమాలోచనలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్నాడీఎంకే సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి, విజయ భాస్కర్, మహిళా ఎమ్మెల్యే లీమా రోజ్ సహా 36 మంది చెన్నై ఎంఆర్సీ నగర్లో సమావేశం కావడంతో అన్నాడీఎంకేలో చీలిక వస్తోందన్న చర్చ జోరందుకుంది. వీరంతా సీవీ షణ్ముగం కార్యాలయంలో సమావేశమయ్యారు.ఆయన ఆది నుంచి టీవీకేకు మద్దుతిద్దామని, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని చెబుతున్నట్లు తెలుస్తోంది. కీలక నిర్ణయం తీసుకునేందుకే ఈ సమావేశమైనట్టుగా చర్చ ఊపందుకుంది. పళణి స్వామికి వ్యతిరేకంగా వ్యవహరించినా, తమపై ఎలాంటి క్రమ శిక్షణ చర్య తీసుకునేందుకు వీల్లేని విధంగా ఇంత పెద్ద సంఖ్యలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఒక చోట చేరినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో వీరంతా టీవీకేకు మద్దతు ఇవ్వొచ్చని, రానున్న కాలంలో విజయ్‌కు ఏదేని గడ్డు పరిస్థితులు ఎదురైనా అండగా నిలవొచ్చన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో అన్నాడీఎంకే నుంచి ఎవరు వచ్చినా పదవికి రాజీనామా చేసే టీవీకేలోకి ఆహ్వానించాలన్న స్పష్టమైన ఆదేశాలను టీవీకే ముఖ్య నేతలకు విజయ్ జారీ చేసినట్టు తెలుస్తోంది. కాగా, విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా పళణిస్వామి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటాం: స్టాలిన్నూతన ప్రభుత్వానికి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని, అందుకే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాము ఎలాంటి అడ్డంకులు సృష్టించబోమని స్పష్టం చేశారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పారు. -
టీవీకే సర్కార్ ఏర్పాటుపై ట్విస్ట్.. పళనిస్వామి సంచలన పోస్ట్
చెన్నై: తమిళనాడు రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తున్నాయి. ఇప్పటికి మద్దతు లెక్కలు తేలలేదు. విజయ్ ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నేత పళనిస్వామి పోస్ట్ వైరల్‌గా మారింది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. పళనిస్వామి కీలక పోస్ట్‌తో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీకి అభినందనలు అంటూ ఎడప్పాడి పళనిస్వామి ట్వీట్ చేశారు. దీంతో విజయ్‌తో వీసీకే పొత్తు ఖాయమైందంటూ ప్రచారం జరుగుతోంది.తమిళనాడు ఎన్నికల తర్వాత ప్రతిష్టంభన ఒక కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తున్న తరుణంలో పళనిస్వామి వ్యూహాత్మక పోస్ట్ కొత్త చర్చకు దారితీసింది. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్‌కు అవసరమైన మద్దతు లభించిందా? అనే కోణంలో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఏ పార్టీ పేరునూ నేరుగా ప్రస్తావించకుండానే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న పార్టీకి పళనిస్వామి అభినందనలు తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి.మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీ మార్కు 118. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 107 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, స్పష్టమైన మెజారిటీకి కొద్దిగా దూరంలో నిలిచింది. ఈ ఉత్కంఠభరిత వాతావరణంలో ఈపీఎస్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను నివారించడానికి.. అలాగే బీజేపీ పరోక్ష జోక్యాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్, సీపీఐ, CPI(M) పార్టీలు ఇప్పటికే విజయ్‌కు మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు అందరి దృష్టి తోల్ తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే (విడుతలై చిరుతైగల్ కట్చి) పార్టీపై పడింది. ఆ పార్టీ తీసుకునే నిర్ణయమే విజయ్ మెజారిటీ మార్కును దాటడానికి అత్యంత కీలకం కానుంది.తెరవెనుక విజయ్‌కు అవసరమైన పూర్తి మద్దతు లభించిందనే బలమైన నమ్మకం విపక్ష కూటమిలో వ్యక్తమవుతోందని.. అందుకే పళనిస్వామి ఈ తరహా వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత రెండు రోజులుగా తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటుపై తీవ్ర సస్పెన్స్ కొనసాగుతోంది. వీసీకే పార్టీ తన తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
తమిళనాడు రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్
చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆ రాష్ట్ర రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. డీఎంకే-అన్నాడీఎంకే ప్రత్యామ్నాయాలపై తీవ్ర స్ధాయిలో చర్చలు జరుపుతున్నాయి. డీఎంకే-అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా తిరుమావళవన్ తెరపైకి రాగా.. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, డీఎంకే ప్రతిపాదను అన్నాడీఎంకే వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.సాయంత్రం 4 గంటలకు వీసీకే చీఫ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. వీకేసీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. టీవీకేకు వీసీకే మద్దతుపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు ఒక స్థానంలో దూరంలో టీవీకే ఉండగా.. వీసీకే మద్దతు కోసం విజయ్ ఎదురుచూస్తున్నారు. వీసీకే పార్టీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పళనిస్వామి నివాసానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఆరుగురు ముఖ్య నేతలతో పళనిస్వామి కీలక చర్చలు జరుపుతున్నారు. -
పుదుచ్చేరి రిసార్ట్ ఖాళీ.. చెన్నైకి అన్నాడీఎంకే ఎమ్మెల్యేల పరుగు!
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎమ్మెల్యేల కొనుగోళ్ల భయం పట్టుకోవడంతో అన్నాడీఎంకే అప్రమత్తమైంది. ఎవరూ చేజారిపోకుండా ఉండేందుకు క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ఇందులో భాగంగా పుదుచ్చేరిలోని ఓ విలాసవంతమైన రిసార్ట్‌లో 40 మందికి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు బస ఏర్పాట్లుచేసింది. అయితే శనివారం ఉదయం వారిని హుటాహుటిన అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించడం తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది.ఉత్కంఠ రేపుతున్న తరలింపుపుదుచ్చేరిలోని ఒక లగ్జరీ రిసార్ట్‌లో గత కొద్ది రోజులుగా బస చేస్తున్న 40 మందికి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆకస్మికంగా అక్కడి నుంచి బయలుదేరారు. ఎమ్మెల్యేలంతా ఒకేసారి గ్రూపులుగా రిసార్ట్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో ముందుస్తు జాగ్రత్తగా, కట్టుదిట్టమైన భద్రత నడుమ వారిని అక్కడి నుంచి తరలించినట్లు సమాచారం.గమ్యంపై గోప్యతరిసార్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు ఎమ్మెల్యేలను పలకరించే ప్రయత్నం చేశారు. ‘మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు?' అని ప్రశ్నించగా.. చాలా మంది నేతలు సమాధానం దాటవేశారు. తమకు ఏమీ తెలియదంటూ చేతులతో సైగ చేస్తూ వేగంగా వెళ్లిపోయారు. అన్నాడీఎంకే అగ్రనేతలు ఎమ్మెల్యేల కదలికలపై డేగకన్ను వేశారు. సమాచారం బయటకు పొక్కకుండా పూర్తి గోప్యత పాటిస్తూ ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.చెన్నైకే మకాం మార్పు?ప్రత్యర్థి పార్టీలు తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకుంటాయన్న భయమే ఈ తాజా పరిణామాలకు ప్రధాన కారణమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. క్రాస్ ఓటింగ్ లేదా పార్టీ ఫిరాయింపులు జరగకుండా ఎమ్మెల్యేలందరినీ ఒకే గొడుగు కింద ఉంచేందుకే ఈ వ్యూహం పన్నారు. శనివారం మధ్యాహ్నానికి వీరందరినీ చెన్నైలోని మరో సురక్షిత ప్రాంతానికి తరలించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం
పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేసే చాన్స్ఎనిమిది మంత్రుల పేర్ల జాబితాను గవర్నర్‌కు అందజేసిన విజయ్ విజయ్‌తో పాటు ఎనిమిది మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశంరేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారంనెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు విజయ్ ప్రమాణంప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుమతి కోరిన విజయ్ఎమ్మెల్యేల మద్దతు జాబితా గవర్నర్‌కు అందజేతప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన విజయ్అందుకు గవర్నర్ సమ్మతిప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగుమంఈ నెల 13లోగా బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశం తమిళనాడు రాజకీయాల్లో వరుస ట్విస్ట్లుకేరళం పర్యటన రద్దు చేసుకున్న గవర్నర్సాయంత్రం 6.30 గంటలకు విజయ్‌కు గవర్నర్ అపాయింట్మెంట్తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్విజయ్కు అపాయింట్మెంట్ ఇవ్వని గవర్నర్లోక్భవన్కు వచ్చిన విజయ్ మళ్లీ వెనుదిరిగారు.కేరళంకు వెళ్తున్న గవర్నర్ రాజేంద్ర అర్లేకర్విజయ్కు సమయం ఇవ్వని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్గవర్నర్కు ముందస్తు అపాయింట్మెంట్ ఉండటంతో విజయ్‌కు సమయం ఇవ్వలేదు అన్నాడీఎంకేలో చీలిక సంకేతాలు?పీవీ షణ్ముగం నేతృత్వంలో రెబల్ ఎమ్మెల్యేలుఈపీఎస్ అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేల డుమ్మాసస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తున్న తమిళనాడు రాజకీయాలురాత్రి 7.10 గంటలకు కేరళ వెళ్లనున్న గవర్నర్ రాజేంద్రగవర్నర్ వెళ్లిపోతే విజయ్ ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యంసస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తున్న తమిళనాడు రాజకీయాలుఇప్పటికి తేలని మద్దతు లెక్కలువిజయ్ ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న సస్పెన్స్టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు తొలగిన అడ్డంకులుటీవీకేకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన వీసీకేకాసేపట్లో వీసీకే మీడియా సమావేశంవీసీకే అధికారిక ప్రకటన తర్వాత గవర్నర్‌ను కలవనున్న విజయ్తమిళనాడు రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్వీసీకే చీఫ్ తిరుమావళవన్‌కు ముఖ్యమంత్రి పదవి?డీఎంకే-అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా తిరుమావళవన్డీఎంకే ప్రతిపాదన అన్నాడీఎంకే వ్యతిరేకిస్తున్నట్లు వార్తలుసాయంత్రం 4 గంటలకు వీసీకే చీఫ్ ప్రెస్మీట్తమిళనాడు సంక్షోభంపై సుప్రీం కోర్టులో పిటిషన్టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్‌కు ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్విజయ్ను ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ ఆహ్వానించాల్సి ఉందికానీ, అలా చేయలేదుసుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన మాజీ ఐపీఎస్ అధికారివిచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠమ్యాజిక్ ఫిగర్ దగ్గరే ఆగి.. తమిళనాట అధికారానికి మ్యాజిక్ ఫిగర్ 118విజయ్ టీవీకే ప్రస్తుత బలం 108-1=107 (ఒక్క స్థానంలో విజయ్ తప్పుకోవాల్సిందే)కాంగ్రెస్ 5వామపక్షాలు 4ఏఎంఎంకే 1లోక్‌భవన్‌కు నిన్న సమర్పించిన మద్దతు ఎమ్మెల్యేల సంఖ్య 117ఏఎంఎంకే ఎమ్మెల్యే విత్‌డ్రా అయితే 116వీసీకే కలిస్తే .. 118 మ్యాజిక్ ఫిగర్ పూర్తిసాయంత్రం దాకా ఆగాల్సిందే!తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో కొనసాగుతున్న సస్పెన్స్ఎటూ తేల్చని విడుదలై చిరుతైగల్ కట్చి(2 సీట్లు)విజయ్ను వెయిటింగ్లో పెట్టిన వీసీకేమద్దతు ఇస్తే తమిళనాడు పొలిటికల్ థ్రిల్లర్‌కు ఎండ్ కార్డ్కొనసాగుతున్న వీసీకే హైలెవల్ మీటింగ్సాయంత్రం దాకా జరగనున్న చర్చలుసాయంత్రం వీసీకే చీఫ్ తిరుమావళవన్ మీడియా సమావేశంకీలక ప్రకటన చేసే అవకాశం తమిళనాడు సంక్షోభంపై లెఫ్ట్ పార్టీల కీలక ప్రకటనవామపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు జరిగిందని తమిళనాట ఆరోపణలుహార్స్ ట్రేడింగ్‌కు మేం వ్యతిరేకం: సీసీఐ,సీపీఎంబేరసారాలకు గవర్నరే అవకాశం ఇచ్చారు: సీసీఐ,సీపీఎంఢిల్లీ పెద్దల సూచనతోనే తమిళనాడు స్క్రీన్‌ప్లే నడుస్తోంది: సీసీఐ,సీపీఎంబీజేపీ బ్యాక్‌డోర్ పాలిటిక్స్ నడిపిస్తోంది: సీసీఐ,సీపీఎంఅతిపెద్ద పార్టీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి : సీసీఐ,సీపీఎంకానీ, ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు : సీసీఐ,సీపీఎంఅందుకే టీవీకేకు మద్దతు ఇచ్చాం: సీసీఐ,సీపీఎంమా రెండు పార్టీలు కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాయి : సీసీఐ,సీపీఎంఇదే విషయాన్ని డీఎంకేకు సమాచారం అందించాం : సీసీఐ,సీపీఎంఏ పరిస్థితుల్లో మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో వివరించాం: సీసీఐ,సీపీఎంఆ తర్వాతే మేం మా మద్దతు లేఖను గవర్నర్‌కు పంపాం: సీసీఐ,సీపీఎంవీసీకే పార్టీ కొన్ని కారణాలతో ఇంకా లేఖ పంపలేదు: సీసీఐ,సీపీఎంసాయంత్రంకల్లా ఆ పార్టీ నుంచి స్పష్టత రావొచ్చు: సీసీఐ,సీపీఎంప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తారనే ఆశిస్తున్నాం: సీసీఐ,సీపీఎంమద్దతిస్తారా? ప్రతిపక్షంలో కూర్చుంటారా?వీసీకే పార్టీ నిర్ణయంపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠవిజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తుందా? లేదా? అనే చర్చచెన్నైలోని కార్యాలయంలో వీసీకే హైలెవల్ మీటింగ్ప్రతిపక్షంలో కొనసాగుతారా? అధికార పార్టీతో కలుస్తారా?బయటి నుంచి మద్దతు ఇచ్చే అవకాశమూ!ఏ నిర్ణయం అనేది స్వేచ్ఛగా తీసుకోవాలని వీసీకే అధిష్టానానికి డీఎంకే అధినేత స్టాలిన్ సూచనడీఎంకే నేతృత్వం సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్‌లో భాగంగా పోటీ చేసి రెండు సీట్లు నెగ్గిన వీసీకేమరికాసేపట్లో స్పష్టమైన ప్రకటన వెలువడే చాన్స్వీసీకే చీఫ్ తిరుమావళవన్ నిర్ణయం ఎలా ఉండనుందో?గవర్నర్ తీరు వల్లే గందరగోళం: ముకుల్ రోహత్గీతమిళనాడు సంక్షోభంపై మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కీలక వ్యాఖ్యలుదేశం మొత్తం తమిళనాడు వైపే చూస్తోందిఇది కృత్రిమంగా సృష్టించిన సంక్షోభంవారంరోజులైనా ఏ విషయం తేల్చలేకపోవడం దారుణంగవర్నర్ తీరు వల్లే ఈ గందరగోళంసింగిల్ లార్జెస్ట్ పార్టీకి గవర్నర్ అవకాశం ఇవ్వాలిఅత్యధిక సీట్లు నెగ్గిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాల్సిందిఅసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాల్సిందిబలనిరూపణ లోక్‌భవన్‌లో కాదు.. అసెంబ్లీలో జరిగాలిపీపీ నరసింహారావు ప్రభుత్వం చాన్నాళ్లు మైనారిటీలో నడిచిందిగవర్నర్ ఏదీ తేల్చకపోతే.. విజయ్ కోర్టును ఆశ్రయించొచ్చుగతంలో ఇలాంటి కేసులు చాలా కోర్టుకు వచ్చాయి.. నేనూ వాదించారాష్టపతి పాలన, మరోసారి ఎన్నికలు నిర్వహించాలనడం సరికాదు.. ఇది అప్రాజాస్వామికంఅది ఏఐ వీడియోనేమో!: దినకరన్టీవీకేపై ఏఎఎంకే చీఫ్ దినకరన్ ఆగ్రహంతమ ఎమ్మెల్యే మద్దతు ఇవ్వనేలేదని మరోసారి వ్యాఖ్యఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ సంతకం చేసిన వీడియోను రిలీజ్ చేసిన టీవీకేఆ వీడియోపై దినకరన్ అనుమానాలుఅది అసలు వీడియో కాదు : దినకరన్అందులో లేఖ.. మా పార్టీ నోట్‌ప్యాడ్ వేర్వేరుగా ఉన్నాయి : దినకరన్అది ఫేక్ లెటర్ : దినకరన్మా పార్టీ లేఖను ఫోర్జరీ చేశారు: దినకరన్పూర్తి వీడియోను టీవీకే ఎందుకు రిలీజ్ చేయడం లేదు?: దినకరన్అది ఏఐ వీడియో అయ్యి ఉండొచ్చు: దినకరన్ వీసీకే ఆఫీస్ వద్ద కోలాహలంచెన్నైలోని విడుదలై చిరుతైగల్ కట్చి ఆఫీస్ వద్దకు భారీగా చేరుకుంటున్న జనంకాసేపట్లో మీడియా ముందుకు వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అనేదానిపై ఉత్కంఠమద్దతు ప్రకటిస్తే.. అనిశ్చితికి తెరపడే అవకాశంస్వయంగా వీకేసీ ఆఫీస్‌కు వెళ్లి కృతజ్ఞతలు తెలియజేయనున్న విజయ్దాదాపుగా మద్దతు ఇవ్వొచ్చనే ఊహాగానాలుఇవ్వకుంటే.. కొనసాగనున్న సస్పెన్స్వీకేసీ మద్దతు ఇస్తే.. 119కి చేరనున్న టీవీకే బలంఏఎంఎంకే మద్దతు ఉపసంహరించుకున్నా.. టీవీకే మెజారిటీ 118మ్యాజిక్ ఫిగర్ (118) కావడంతో ప్రభుత్వ ఏర్పాటునకు లైన్ క్లియర్ అన్నాడీఎంకే కీలక భేటీపళనిస్వామి ఇంట్లో సమావేశమైన అన్నాడీఎంకే నేతలుప్రభుత్వ ఏర్పాటుపై చర్చ?టీవీకే మెజారిటీ చూపించుకోలేకపోతే.. ఏం చేయాలన్నదానిపై సీనియర్లతో పళని మంతనలుఅన్నాడీఎంకు ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు ఏఎంఎంకే చీఫ్ దినకరన్ లేఖమొన్నటిదాకా విజయ్‌కు మద్దతు ఇస్తారని ప్రచారంనిన్ననేమో బద్ధశత్రువు డీఎంకేతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ప్రచారంఇవాళ.. తగిన సంఖ్యా బలం లేకున్నా అన్నాడీఎంకేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రచారం మరికాసేపట్లో కీలక ప్రకటనవిడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే) మద్దతుపై ఉత్కంఠమరికాసేపట్లో మీడియా ముందుకు వీసీకే చీఫ్ తిరుమావళవన్విజయ్ టీవీకేకు మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అనేది స్పష్టీకరణమద్దతు ఇస్తే.. టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు లైన్ క్లియర్ ఇవాళే సీఎంగా విజయ్ ప్రమాణం చేసే చాన్స్ఇవ్వకపోతే.. కొనసాగనున్న సస్పెన్స్దినకరన్పై డీఎంకే ఫైర్ఏఎంఎంకే అధినేత దినకరన్‌పై డీఎంకే ఆగ్రహంమిత్రపక్షం అన్నాడీఎంకే తరఫున ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వాన విజ్ఞప్తి గవర్నర్‌కు అందించిన దినకరన్ఏ ప్రతిపాదికన గవర్నర్‌కు ప్రభుత్వ ఏర్పాటు లేఖ అందించారని ప్రశ్నించిన డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్అన్నాడీఎంకేకు సంఖ్యా బలం ఎక్కడ ఉంది?: ఇళంగోవన్ఎమ్మెల్యేల సంఖ్యా బలం చెప్పకుండా.. సపోర్ట్ లెటర్ లేకుండా దినకనర్ డ్రామాలు చేస్తున్నారా?: ఇళంగోవన్త్రిషకు నిరాశ తప్పదా?తిరుచ్చి ఈస్ట్‌కు రాజీనామా చేయనున్న విజయ్ఆ స్థానంలో త్రిష పోటీ చేస్తుందని ప్రచారండిప్యూటీ సీఎం చేస్తారనే ఊహాగానాలుతిరుచ్చి ఈస్ట్‌తో పాటు డిప్యూటీ సీఎం పోస్ట్ కావాలంటున్న విడుదలై చిరుతైగల్ కట్చిఅలాగైతేనే విజయ్‌కు మద్దతు ఇస్తామని స్పష్టీకరణసంబంధిత కథనం: త్రిష ఆశలు గల్లంతు!116 కాదు.. 117!విజయ్ మద్దతుపై తమిళనాడు లోక్‌భవన్ క్లారిటీ117 ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్‌కు లేఖ సమర్పించిన విజయ్తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాలు నెగ్గిన టీవీకేవిజయ్ రెండు చోట్ల పోటీ చేసిన నెగ్గడంతోనే ఆ ఫిగర్ఒక సీటు మైనస్ చేసి 107 బలంగానే చూపించిన టీవీకేకాంగ్రెస్ సపోర్ట్‌తో 112బయటి నుంచి మద్దతు ఇచ్చిన లెఫ్ట్ పార్టీలు 4ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ మద్దతు కూడా చూపించిన విజయ్మొత్తం 117 మంది ఎమ్మెల్యేల సంతకాలుమెజారిటీకి తక్కువైన ఒక్క స్థానంవీసీకే పార్టీ(2) మద్దతుపై టీవీకేకు అందని లేఖఅది అంది ఉంటే.. 119కి పెరగనున్న బలంఏఎంఎంకే ఎమ్మెల్యే విషయంలో ఆ పార్టీ అధినేత దినకరన్ కిరికిరివీసీకే మద్దుతు ఇస్తే.. ఏఎంఎంకే ఎమ్మెల్యే వైదొలగినా 118 పూర్తి మెజారిటీనేడు వీసీకే ఆఫీస్‌కు విజయ్మద్దతుపై సాయంత్రంలోగా రానున్న స్పష్టతతమిళనాట జోరుగా క్యాంపు పాలిటిక్స్తమిళనాడులో మొదలైన నెంబర్ గేమ్మ్యాజిక్ ఫిగర్ 2 తక్కువైన టీవీకే విజయ్ సీఎం ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న అనిశ్చితిటీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు ససేమీరా అంటున్న గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్రేపటితో టీవీకేకు గవర్నర్ ఇచ్చిన గడువు పూర్తి?!పొత్తు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న టీవీకేమహాబలిపురం రిసార్ట్‌కే పరిమితమైన టీవీకే ఎమ్మెల్యేలుచెన్నైలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల క్యాంపునేడు ఎమ్మెల్యేలతో భేటీ కానున్న అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిఅన్నాడీఎంకేకు ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు ఏఎంఎంకే లేఖఅన్నాడీఎంకే తరఫున లేఖ సమర్పించిన ఏఎంఎంకే చీఫ్ దినకరన్పళనిస్వామి గవర్నర్‌ను కలిస్తే మారనున్న నెంబర్లుకాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అన్నాడీఎంకే దృష్టికాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్న ఏఐసీసీ ఇంచార్జీ గిరీష్ చోడంకర్కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసులతో బెదిరింపులు.. డబ్బు ఆశ చూపిస్తున్నారని ఆరోపణలుఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంప్ రాజకీయం మొదలుపెట్టిన కాంగ్రెస్రాత్రికి రాత్రే బెంగళూరు.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలింపుహైదరాబాద్లోనే తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శిబిరం మరో వివాదంలో టీవీకే అధినేత విజయ్నిన్న విజయ్‌తో జన నాయగన్ ప్రొడ్యూసర్ భేటీఅనంతరం లోక్‌భవన్‌కు విజయ్, మద్దతుదారు పార్టీల నేతలతో వెళ్లిన నిర్మాత లేఖ సమర్పించే సమయంలో గవర్నర్ పక్కనే నిల్చున్న నిర్మాత వెంకట్ కే నారాయణప్రొటోకాల్కు విరుద్ధంగా తీసుకెళ్లారని విజయ్‌పై రాజకీయ ప్రత్యర్థుల విమర్శలుప్రభుత్వ ఏర్పాటులో ప్రొడ్యూసర్‌కు ఏం పని అంటూ మండిపాటుప్రొడ్యూసర్ ద్వారా వామపక్షాలకు డబ్బులు పంచి ఉంటారని ఆరోపణలువిజయ్ హార్స్‌ట్రేడింగ్‌కు పాల్పడుతున్నారంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేసే అవకాశంగవర్నర్కు(శాలువా కప్పుకున్న వ్యక్తి) ఎడమ వైపు ఉంది జన నాయగన్ నిర్మాత వెంకట్ కే నారాయణఆ ఇద్దరు ముందుకు వస్తే.. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కంటిన్యూవిజయ్కు మద్దతిచ్చే విషయంలో పార్టీల హైడ్రామావీసీకే తరఫున ఎమ్మెల్యేలుగా నెగ్గిన జ్యోతిమణి, వన్నీరసు పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు చోట్ల నెగ్గిన విజయ్ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితిడిప్యూటీ సీఎం పోస్టుతో పాటు విజయ్ వదులుకునే తిరుచ్చి ఈస్ట్ సీటును డిమాండ్ చేస్తున్న వీసీకేవీటితో పాటు మరో రెండు డిమాండ్లుచివరి నిమిషంలో మద్దతు లేఖ ఇవ్వకుండా హ్యాండిచ్చిన వీసీకేటీవీకే మద్దతు అంశం పక్కన పెట్టి.. డీఎంకే అధినేత స్టాలిన్‌తో వీసీకే చీఫ్ తిరుమావళవన్ భేటీఇవాళ స్పష్టమైన నిర్ణయం ప్రకటించే చాన్స్మద్దతు ఇస్తే సీఎంగా విజయ్‌కు లైన్ క్లియర్ఇవ్వకుంటే.. కొనసాగనున్న ఉత్కంఠ ఆ మిస్టేక్ చేయకుండా ఉండాల్సింది.. చిన్నతప్పిదంతో గవర్నర్ దగ్గర బుక్కైన టీవీకే అధినేత విజయ్6న గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను తొలిసారి కలిసిన విజయ్గవర్నర్కు సమర్పించిన జాబితాలో కాంగ్రెస్ మద్దతు ఎమ్మెల్యేల పేర్లు కూడాకూటమిగా.. టీవీకేను అతిపెద్ద పార్టీగా ప్రొజెక్ట్ చేసుకోలేకపోయిన విజయ్అక్కడే గవర్నర్‌కు దొరికిపోయిన విజయ్ఆ మరుసటి రోజే.. మరోసారి గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తినిన్న.. 116 ఎమ్మెల్యేల సంతకాలతో మూడోసారి గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి118 ఎమ్మెల్యేల సంతకాలే కావాలని పట్టుబడుతున్న గవర్నర్మొదటిసారి..రెండో‘సారీ’..మూడోసారి 116 వర్సెస్ 116తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులుక్షణక్షణానికి మారిపోతున్న లెక్కలునెంబర్ గేమ్‌తో టీవీకే చీఫ్ విజయ్ సతమతంతమిళనాడు మ్యాజిక్ ఫిగర్ 118విజయ్ టీవీకేకు ప్రస్తుత బలం 116ప్రభుత్వ ఏర్పాటునకు విజయ్‌కు అవకాశం ఇవ్వాలంటున్న డీఎంకే అధినేత స్టాలిన్ఇవాళ పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే కీలక భేటీవిజయ్ చేతులెత్తేస్తే.. డీఎంకే అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయంటూ ఊహాగానాలు అన్నాడీఎంకేకు బయటి నుంచి డీఎంకే మద్దతు ఇస్తుందంటూ జోరుగా ప్రచారండీఎంకే-అన్నాడీఎంకే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన బలం 116ఇరు వైపులా.. ఇద్దరు ఎమ్మెల్యే మద్దతు అవసరంవీసీకే పార్టీ మద్దతు ఇస్తేనే విజయ్ పార్టీకి సంపూర్ణ బలంఇదే అదనుగా టీవీకేకు డిమాండ్లు చేస్తున్న వీసీకేకీలకమైన మంత్రిత్వ శాఖ, విజయ్ ఖాళీ చేసే స్థానంలో పోటీ, మరో రెండు డిమాండ్లు చేస్తున్న వీసీకేఇవాళ తమ నిర్ణయం ప్రకటిస్తామన్న వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ఇవాళ వీసీకే మద్దతు ఇస్తే విజయ్ సీఎంగా ప్రమాణం చేసే చాన్స్ఈరోజు ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠటీవీకేను టెన్షన్ పెడుతున్న పళనిస్వామిమరోవైపు.. టీవీకేకు గుబులు పుట్టిస్తున్న అన్నాడీఎంకేడీఎంకేతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ ప్రచారంమరోవైపు.. అన్నాడీఎంకేకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు లేఖ ఇచ్చిన మిత్రపక్షం ఏఎంఎంకేగవర్నర్ ఆర్వీ ఆర్లేకర్‌ను శుక్రవారం సాయంత్రం కలిసిన ఏఎంఎంకే చీఫ్ దినకరన్నేడు అన్నాడీఎంకే కీలక సమావేశంసీనియర్ నేతలతో భేటీ కానున్న అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామిగవర్నర్ను కలిసి టీవీకేపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్న పళని!విజయ్‌కు మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడిందని మొన్నటిదాకా ప్రచారంతమ కూటమి ఎమ్మెల్యేలను విజయ్ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ దినకరన్ ఆరోపణ.. గవర్నర్‌కు ఫిర్యాదుస్టాలిన్ పరోక్ష సాయం!తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో తమ జోక్యం ఉండబోదన్న డీఎంకే చీఫ్ స్టాలిన్టీవీకే పార్టీకి ఎలాంటి అవాంతరం కలిగించబోమని వ్యాఖ్యప్రజా తీర్పును గౌరవిస్తామని ఇప్పటికే స్పష్టీకరణవిజయ్ పాలనను ఆరు నెలలపాటు గమనిస్తామని.. ఆ తర్వాతే ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తామని ప్రకటనఅన్నాడీఎంకేతో కూటమి ప్రభుత్వం ఉండబోదన్న సంకేతాలిచ్చిన స్టాలిన్ విజయ్‌కు మద్దతు ఇచ్చే విషయంలో తన ఒత్తిడి ఏం ఉండదని.. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని మిత్రపక్షాలకు సూచనఆ సూచన తర్వాతే విజయ్‌కు మద్దతు విషయంలో ముందుకు వచ్చిన వామపక్షాలువిజయ్ కేబినెట్లో కాంగ్రెస్‌కు చోటుతమకు చోటు అక్కర్లేదని.. బయటి నుంచే మద్దతు(డీఎంకేలో కొనసాగుతూ) ఇస్తామని స్పష్టం చేసిన లెఫ్ట్ పార్టీలువీసీకే కూడా తమ నిర్ణయాన్ని గౌరవించిందన్న సీపీఐ, సీపీఎంలుఅయితే.. కేబినెట్ బెర్త్‌తో పాటు విజయ్ వదులుకునే సీటు తమకు ఇవ్వాలంటున్న వీసీకే!ఈ క్రమంలోనే మద్దతుపై ఇంకా ఏదీ తేల్చని వీసీకే చీఫ్ తిరుమావళవన్తిరుమావళవన్ ఎక్కడ?క్షణక్షణానికి మారుతున్న తమిళనాడు రాజకీయంటీవీకేను టెన్షన్ పెడుతున్న వీసీకే అధినేత తిరుమావళవన్చివరి నిమిషంలో మద్దతుపై ట్విస్ట్ ఇచ్చిన విడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే)డీఎంకే సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ కూటమిలో ఉన్న వీసీకేమొన్నటిదాకా విజయ్‌కు మద్దతు ఇవ్వమంటు వ్యాఖ్యవిజయ్ విజ్ఞప్తి మేరకు ఆలోచన చేస్తామని ప్రకటనసాయంత్రానికి సానుకూలంగా స్పందించినట్లు ప్రచారంస్టాలిన్తో భేటీ తర్వాత ఎవరికీ అందుబాటులో లేకుండా పోయిన తిరుమావళవన్అర్ధరాత్రి వరకు నిరీక్షించిన టీవీకేవీసీకే మద్దతు లేఖపై ఉత్కంఠనేడు అధికారిక ప్రకటన వెలువడే చాన్స్విజయ్ ఉక్కిరి బిక్కిరితమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న ఉత్కంఠటీవీకేకు ఇంకా పూర్తిగా దక్కని మద్దతుప్రస్తుత బలం 116గా ఉందన్న గవర్నర్ కార్యాలయంఇంకా ఇద్దరు తక్కువడీఎంకే కూటమిలోని పార్టీలకు విజ్ఞప్తి చేసిన విజయ్టీవీకే విజయ్ పార్టీ బలం (108.. ఇందులో విజయ్ రెండు చోట్ల నెగ్గడంతో ఒక చోట రాజీనామా చేయాల్సిన పరిస్థితి.. దీంతో 107కి పడిపోనున్న సంఖ్యడీఎంకేతో కటీఫ్ చెప్పి విజయ్‌కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్(5)డీఎంకే కూటమిలోనే ఉంటూ బయటి నుంచి విజయ్‌కు మద్దతు ప్రకటించిన లెఫ్ట్ పార్టీ(4)మద్దతు ఇవ్వబోమని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ((2))అన్నాడీఎంకే కూటమిలోని ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే మద్దతు కూడా!దినకరన్‌కు టీవీకే కౌంటర్మా ఎమ్మెల్యే విజయ్‌కు మద్దతు ఇవ్వలేదు: దినకరన్తమ ఏకైక ఎమ్మెల్యే సంతకం టీవీకే ఫోర్జరీ చేసిందంటూ ఏఎంఎంకే చీఫ్ దినకరన్ ఆరోపణచెన్నై కమిషనర్‌కు ఫోర్జరీ కంప్లయింట్దినకరన్కు టీవీకే స్ట్రాంగ్ కౌంటర్ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా సంతకం చేస్తున్న వీడియోను విడుదల చేసిన టీవీకే గవర్నర్‌కు విజయ్ సమర్పించిన ఎమ్మెల్యేల సంతకాల్లో.. కామరాజ్ సంతకం కూడా!దినకరన్ ఎంట్రీతో మారిన సీన్తెరపైకి అమ్మ మక్కల్ మున్నేట్ర కగళం(AMMK) చీఫ్ దినకరన్జయలలిత నెచ్చెలి శశికళ మేనల్లుడు దినకరన్సొంత పార్టీతో అన్నాడీఎంకే కూటమి తరఫున పోటీ చేసిన దినకరన్ఒక్క స్థానంలో నెగ్గిన ఏఎంఎంకే అభ్యర్థిమన్నార్గుడి నుంచి నెగ్గిన ఏఎంఎంకే అభ్యర్థి కామరాజ్మొదటి నుంచి టీవీకే విజయ్‌కు మద్దతు ఇస్తారనే ప్రచారంఅందుకు తగ్గట్లే గవర్నర్‌కు సమర్పించిన ఎమ్మెల్యేల మద్దతులో కామరాజ్ సంతకం కూడాదినకరన్ సంచలన ఆరోపణలుతమ ఏకైక ఎమ్మెల్యే సంతకం ఫోర్జరీ చేశారంటూ ఆరోపణనిన్న సాయంత్రం గవర్నర్‌ను కలిసిన దినకరన్అన్నాడీఎంకేను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలంటూ గవర్నర్‌కు విజ్ఞప్తితమిళ రాజకీయం.. హైదరాబాద్‌కు షిఫ్ట్తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠహైదరాబాద్కు మారిన తమిళనాడు రాజకీయంహైదరాబాద్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుతమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటయ్యే దాకా హైదరాబాద్‌లోనే ఐదుగురు ఎమ్మెల్యేల మకాంఏర్పాట్లు చూసుకోనున్న టీపీసీసీ చీఫ్తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మళ్లీ అవాంతరంగవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను ముచ్చటగా మూడోసారి కలిసిన టీవీకే అధినేత విజయ్మ్యాజిక్ ఫిగర్ 118టీవీకే గెలిచిన స్థానాలు 108కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2.. మొత్తం మ్యాజిక్ ఫిగర్ గవర్నర్‌కు చూపించిన విజయ్ప్రమాణ స్వీకారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారంవిజయ్కు సీఎం స్థాయి భద్రతను పునరుద్దరించాలని పోలీస్ శాఖను గవర్నర్ ఆదేశించినట్లు ప్రచారందీంతో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసిన టీవీకేఅయితే వీసీకే ఇద్దరు ఎమ్మెల్యేల సంతకం మిస్సింగ్!116 మంది మద్దతే ఉందని ప్రకటించిన లోక్భవన్వీసీకే నిర్ణయం వెలువడేది ఇవాళేనేటి విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్దత -
టీవీకేకు కొత్త కష్టం.. ఫోర్జరీ కేసు నమోదు?
చెన్నై: తమిళనాడులో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయితున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న రాజకీయ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇంకా సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్.. టీవీకేపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు చెప్పుకొచ్చింది. దీంతో, టీవీకే విజయ్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..టీవీకే చీఫ్ విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరినా.. ఈ అంశంపై లోక్‌భవన్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇంతలో తమ ఎమ్మెల్యే కామరాజు మద్దతు ఇచ్చినట్లు టీవీకే నకిలీ పత్రాన్ని ఫోర్జరీ చేసి గవర్నర్‌కు ఇచ్చిందని దినకరన్ షాకింగ్ ఆరోపణలు చేశారు. తమిళనాడు గవర్నర్‌కు ఒరిజినల్ కాపీ చూపించామన్న ఆయన, టీవీకేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, దినకరన్‌కు టీవీకే కూడా కౌంటర్ ఇచ్చింది. ఎమ్మెల్యే కామరాజు మద్దతు లేఖపై సైన్ చేస్తున్న వీడియో రిలీజ్ చేసింది. తొలుత దీనిని దినకరన్ ఆమోదించారని.. కానీ అంతలోనే ఆయన యూటర్న్ తీసుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.#WATCH | Chennai, Tamil Nadu | AMMK Party General Secretary TTV Dhinakaran visited the office of Assistant Commissioner of Police, Guindy RangeThis comes amid Dhinakaran's claim that TVK shared 'forged copy' of MLA Kamaraj's letter with the Governor and that he is filing a… pic.twitter.com/GgF0T6Eaz8— ANI (@ANI) May 8, 2026ఇదిలా ఉండగా.. ఏఎంఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి దినకరన్ గవర్నర్‌కు లేఖ రాయడం సంచలనంగా మారింది. తమిళనాడులో అన్నాడీఎంకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు మాజీ సీఎం పళనిస్వామిని ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వెలువడిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏఎంఎంకే ఒక స్థానంలో గెలిచిన విషయం తెలిసిందే.కాగా, ఆ వీడియోలో దినకరన్ ఆమోదంతోనే తాను టీవీకేకి మద్దతు ఇస్తున్నట్లు చెబుతూ కామరాజ్ లేఖను రాయడం కనిపిస్తుంది. విజయ్ పార్టీకి తాము అధికారికంగా ఎటువంటి మద్దతు ఇవ్వలేదని దినకరన్ ఖండించడంతో ఆయన తప్పుడు వార్తలు, అవాస్తవ సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని టీవీకే ఆరోపించింది. వాస్తవాలను దాచిపెడుతున్నారని టీవీకే మండిపడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తమ ప్రయత్నంలో ఎవరితోనూ బేరసారాలు లేదా చర్చలు జరపాల్సిన అవసరం తమకు లేదని కూడా ఆ పార్టీ స్పష్టం చేసింది. #WATCH | TVK shares a video of AMMK MLA Kamaraj, saying "These are the video visuals of AMMK MLA Kamaraj voluntarily and happily writing a letter expressing his support for the Tamilaga Vettri Kazhagam. He had stated that he was extending support to the Tamilaga Vettri Kazhagam… pic.twitter.com/sM3xtyXx12— ANI (@ANI) May 8, 2026విజయ్ను అడ్డుకునే ప్రయత్నాలు :కాంగ్రెస్ ఎంపీఇదిలా ఉండగా, తమిళనాడులో విజయ్ను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కాంగ్రెస్ ఆరోపించింది. ప్రజల మద్దతు కోల్పోయిన రాజకీయ శక్తులు ఇప్పుడు విజయ్ను తమిళనాడు ముఖ్యమంత్రిగా అవ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ విమర్శించారు. టీవీకేకు ఇంకా మెజారిటీకి అవసరమైన 118 స్థానాల సంఖ్య చేరేందుకు చిన్న పార్టీల మద్దతు ఆలస్యమవుతోందని అంగీకరించిన ఆయన, అధికారం ప్రజల తీర్పును ఆలస్యం చేయగలదు కానీ శాశ్వతంగా అణచలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య తీర్పుకు ఇంకా ఎన్ని అడ్డంకులు సృష్టిస్తారంటూ ఎక్స్‌లో ప్రశ్నించారు. ప్రజల హక్కులు, న్యాయం కోసం ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.టీవీకేకు మద్దతు లేఖ పంపాం: వీసీకేఇదిలా ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతిస్తున్నట్లు వీసీకే వెల్లడించింది. ఈ- మెయిల్ ద్వారా తమ లేఖను పంపినట్లు తెలిపింది. ఈ మేరకు వీసీకే పార్టీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. తమ మద్దతుకు సంబంధించి అధికారిక ప్రకటన శనివారం చేస్తామని మరో ట్వీట్లో పేర్కొంది. వీసీకే, టీవీకే శ్రేణులంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. -
విజయ్ సిద్ధం.. రేపే ప్రమాణ స్వీకారం?
-
కాంగ్రెస్ తో కటీఫ్.. స్టాలిన్ సంచలన నిర్ణయం
-
సంచలనం పళని స్వామి కాబోయే సీఎం...!
-
DMK-AIADMK పొత్తు.. స్టాలిన్ నమ్మక ద్రోహి
-
అలా జరిగితే విజయ్ మళ్లీ ఎన్నికలకు వెళ్లడం ఖాయం..
-
డీఎంకే, అన్నాడీఎంకే పొత్తు...! సీఎం ఎవరంటే?
-
ఇండియా కూటమికి డీఎంకే గుడ్‌బై
సాక్షి,చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలో, డీఎంకే ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పింది. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది.డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసి, డీఎంకే ఎంపీలకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కూర్చోబోమని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ లేఖతో డీఎంకే-కాంగ్రెస్ మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయి.కాంగ్రెస్ ఇటీవల టీవీకేకు మద్దతు ప్రకటించడం డీఎంకేకు పెద్ద షాక్‌గా మారింది. డీఎంకే నేతృత్వం దీనిని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌కు ద్రోహంగా అభివర్ణించింది. దీంతో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే-కాంగ్రెస్ పొత్తు ఒక్కసారిగా ముగిసింది.డీఎంకే ఈ నిర్ణయం వల్ల ఇండియా కూటమి బలహీనపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, టీవీకే-కాంగ్రెస్ కూటమి బలపడుతుందని అంచనా. తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు,కొత్త వ్యూహాలు రూపుదిద్దుకునే అవకాశం ఉంది. -
టీవీకే విజయ్ ప్రభుత్వ ఏర్పాటు.. పరువు పోగొట్టుకుంటున్న గవర్నర్
సాక్షి,చెన్నై: తమిళనాడు ఏఐసీసీ ఇన్చార్జ్ గిరీష్ చోడంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో తీసుకున్న నిర్ణయాల వల్ల తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ పరువు పోగొట్టుకుంటున్నారని ఆయన అన్నారు.తమిళనాడులో డీఎంకే–అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో చోడంకర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే బెదిరిస్తున్నదని, కుట్రలో భాగంగా ఈడీ పేరుతో ఒత్తిడి తెస్తున్నదని ఆరోపించారు.కాంగ్రెస్‌ను వీడి అన్నాడీఎంకేలో చేరేది లేదని ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టంగా తెలిపారు. బెదిరింపులు, భేరసారాసాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిలబడుతున్నారని, విజయ్‌కు ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ ముందుండి నడిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా గవర్నర్ రాజేంద్రపై తీవ్ర విమర్శలు గుప్పించిన చోడంకర్.. ‘దేశం ఎప్పుడూ చూడని విధంగా తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం ఇవ్వడం లేదు. టీవీకే కాకుండా ఇతర పార్టీలు సంఖ్యాబలం నిరూపిస్తే అవకాశం ఇస్తానని చెప్పి నవ్వులు పాలవుతున్నారు’ అని అన్నారు.టీవీకేకు మద్దతు ఇవ్వాలని వీసీకేతో పాటు మరో రెండు పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని, ఆ మూడు పార్టీల నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
TVK విజయ్ పై DMK, AIADMK పెద్ద కుట్ర..
-
DMK, AIADMK లకు సినిమా చూపించిన TVK విజయ్
-
మెజారిటీకి ఇంకా 6 మంది ఎమ్మెల్యేల అవసరం
-
టీవీకేపై కుట్ర.. మరో బాంబు పేల్చిన అన్నాడీఎంకే ఎంపీ
చెన్నై: తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ కొనసాగుతున్న వేళ అన్నాడీఎంకే ఎంపీ మరో బాంబు పేల్చారు. తమిళనాడు ప్రజలకు అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, అసలు తమిళనాడులో ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అన్నాడీఎంకే రాజ్యసభ ఎంపీ తంబిదురై తమిళనాడు రాజకీయ పరిస్థితులపై తాజాగా స్పందించారు. ఎంపీ తంబిదురై మీడియాతో మాట్లాడుతూ.. తమిళ ప్రజలు అన్నాడీఎంకే సర్కార్‌ను కోరుకుంటున్నారు. అన్నాడీఎంకే తిరిగి అధికారంలోకి రావాలనే ప్రజాభిప్రాయం ఉంది. తప్పకుండా మేము అధికారంలోకి వస్తాం. దైవానుగ్రహంతో తగిన సమయంలో అది జరగవచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై తమిళనాడులో చర్చ మొదలైంది.ఇక, తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ఇప్పటికీ రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. గవర్నర్ ఆర్లేకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. మెజారిటీ చూపిస్తూ ఏ పార్టీ తన వద్దకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. దీంతో, డీఎంకే, అన్నాడీఎంకేలు జత కడతాయా? అనే చర్చ తెరపైకి వచ్చింది. అదే సమయంలో అన్నాడీఎంకే ఎంపీ ఇలా కామెంట్స్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా? అనే చర్చ నడుస్తోంది.#WATCH | Chennai | AIADMK MP M Thambidurai says, "...The public sentiment is there that AIADMK has to come back to power...That may happen in the due course of time with the grace of God" pic.twitter.com/8JtjU5Jr5H— ANI (@ANI) May 8, 2026ఇదిలా ఉండగా.. తమిళనాడులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రిసార్ట్ రాజకీయం కొనసాగుతోంది. రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలు తిరిగి చెన్నై చేరుకోవాలని పార్టీ చీఫ్ పళనిస్వామి సూచించారు. మరోవైపు.. వివిధ పార్టీల మద్దతు తమకు ఇవ్వాలని టీవీకే నేతలు మంతనాలు జరుపుతున్నారు. లెఫ్ట్, వీఎంసీ పార్టీల మద్దతుపై ఈరోజు సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
తమిళనాడు గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడులో పొలిటికల్ ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది. ఇలాంటి తరుణంలో గవర్నర్ ఆర్లేకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. మెజారిటీ చూపిస్తూ ఏ పార్టీ తన వద్దకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. దీంతో, డీఎంకే, అన్నాడీఎంకేలు జత కడతాయా? అనే చర్చ తెరపైకి వచ్చింది.ప్రభుత్వ ఏర్పాటు విషయమై గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్‌తో టీవీకే చీఫ్ విజయ్.. గురువారం రెండోసారి సమావేశమైన విషయం తెలిసిందే. వీరి భేటీ అనంతరం, ఆర్లేకర్ పొలిటికల్ బాంబు పేల్చారు. మెజారిటీపై తాను సంతృప్తి చెందాకే టీవీకేకు అవకాశమిస్తానని స్పష్టంచేశారు. ఆయన గురువారం రాత్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని టీవీకే ఏర్పాటు చేయకుండా తాను అడ్డుకుంటున్నట్లు వస్తున్న వాదనను ఖండించారు. అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆర్లేకర్..‘ప్రభుత్వ ఏర్పాటుకు నా వద్దకు వచ్చిన పార్టీని అందుకు కావాల్సిన మెజారిటీ చూపించాలని అడిగాను. టీవీకేనే కాదు, ఏ పార్టీ వచ్చినా అదే అడుగుతాను. తర్వాత అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవచ్చు. ప్రక్రియను నేనేమీ ఆలస్యం చేయడం లేదు. విజయ్ 118 నంబరును రాతపూర్వకంగా ఇస్తే చాలు’ అని అన్నారు.అనంతరం, ఒకవేళ డీఎంకే, అన్నాడీఎంకే వచ్చి 118 మందిని చూపిస్తామంటే అంగీకరిస్తారా అని ప్రశ్నించగా.. ఎవరు మెజార్టీ చూపించినా నాకు ఓకే. అది సాధ్యమైనా సరే.. తప్పో, ఒప్పో వారికి మెజారిటీ ఉంది కాబట్టి కాదనలేను. ఇది రాజ్యాంగపరమైన ప్రక్రియ. నేను ప్రజల్ని మర్చిపోను. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఇక్కడున్నాను. వెరిఫై చేయకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా అనుమతిస్తాను? ముందు నేను సంతృప్తి చెందాకే ఆ పనిచేస్తా’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, తమిళనాడు రాజకీయం మరో పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, విజయ్ మరో 2-3 రోజుల్లో మెజారిటీ చూపించుకోలేకపోతే ఏం చేస్తారని అడగ్గా, తనకున్న అవకాశాల మేరకు తదుపరి ప్రక్రియకు వెళ్తానని చెప్పారు. తనకు సలహా బృందం ఉందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యవహారంపై కాంగ్రెస్.. నేడు తమిళనాడు వ్యాప్తంగా నిరసనలకు సిద్దమైంది. ఇందులో భాగంగా లోక్‌భవన్ ముట్టడికి కాంగ్రెస్ అధిష్టానం పిలుపు నిచ్చింది. అయితే, కాంగ్రెస్ నిరసనలో టీవీకే పాల్గొంటుందా లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది. కేంద్రంలోని బీజేపీ ఆదేశాలతోనే గవర్నర్.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
పొలిటికల్ ట్విస్ట్.. విజయ్ సంచలన నిర్ణయం?
చెన్నై: తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడే సీట్లు రాకపోవడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ.. రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. ఇలాంటి తరుణంలో విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.తమిళనాడులో మాజీ సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే గానీ, ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే గానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే.. టీవీకే తన 107 మంది ఎమ్మెల్యేలందరితో సామూహిక రాజీనామాలను పరిశీలించవచ్చని పార్టీ వర్గాలు గురువారం తెలిపాయి. ఈ మేరకు విజయ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు బయటకు వచ్చాయి. రాజకీయ ప్రతిష్టంభన మధ్య విజయ్ శిబిరంలో పెరుగుతున్న అసంతృప్తికి ఇది సంకేతమని పలువురు చెబుతున్నారు. విజయ్ స్వయంగా అధికారికంగా ఈ హెచ్చరిక చేయనప్పటికీ, ఎన్నికల అనంతర చర్చలు అసంపూర్తిగా మిగిలిపోవడం, సంఖ్యాబలం ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకుంటుండటంతో పార్టీలో పెరుగుతున్న అసంతృప్తిని ఇది ప్రతిబింబిస్తోంది. టీవీకే అధికారం చేపట్టకుండా నిరోధించే ప్రయత్నంలో, డీఎంకే తన చిరకాల ప్రత్యర్థి ఏఐఏడీఎంకేతో రహస్య చర్చలు ప్రారంభించిందన్న వార్తలు వెలువడిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.Some reports are now claiming that if DMK and AIADMK come together and form the government, TVK MLAs may resign from their seats.Honestly, that would be a very risky political move.If 100+ MLAs resign, by-elections will happen in all those constituencies. In that situation,… pic.twitter.com/84LpB5f7xc— TVK Pulse (@TVKpulse) May 7, 2026పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, అసెంబ్లీలో విజయ్ పార్టీ ఏకైక అతిపెద్ద కూటమిగా అవతరించినప్పటికీ, ఆయనను అధికారంలోకి రాకుండా నిరోధించడానికి డీఎంకే, అన్నాడీఎంకే మధ్య రహస్య పొత్తు ఉందని భావిస్తున్న టీవీకే నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఏ పార్టీకి స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సంఖ్యాబలం లేనప్పటికీ, టీవీకేను అధికారానికి దూరంగా ఉంచే ప్రయత్నంగానే ఈ రెండు ప్రధాన ద్రవిడ పార్టీల ప్లాన్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలను గెలుచుకుంది, ఇందులో విజయ్ గెలిచిన రెండు స్థానాలు కూడా ఉన్నాయి. రాజ్యాంగ నియమం ప్రకారం విజయ్ ఒక సీటును ఖాళీ చేసే అవకాశం ఉన్నందున, పార్టీ వాస్తవ బలం 107 మంది ఎమ్మెల్యేలుగా ఉంది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు లభించింది. దీనితో మరో ఐదుగురు సభ్యులు మొత్తం సభ్యుల సంఖ్య 112కు చేరింది. అయితే, 234 మంది సభ్యులు కలిగిన ఈ సభలో మెజారిటీకి అవసరమైన 118 స్థానాల సంఖ్యను ఇది ఇంకా చేరుకోలేదు. ఈ నేపథ్యంలో టీవీకే.. డీఎంకే మిత్రపక్షాలైన విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK), వామపక్ష పార్టీలు మరియు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML)లను సంప్రదిస్తోంది. అయినప్పటికీ, వారి నుండి ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన హామీ లభించలేదు.ఈ సందర్బంగా ఐయూఎంఎల్ అధ్యక్షుడు కేఎం కాదర్ మొహిదీన్ స్పందిస్తూ.. పొత్తు కోసం టీవీకే తమను సంప్రదించిందని, అయితే తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. డీఎంకే నేతృత్వంలోని అలయన్స్ ఉన్న IUML, స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము అంగీకరిస్తామని అన్నారు. కాగా, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో IUML రెండు సీట్లను గెలుచుకుంది. -
విజయ్‌కు మళ్లీ గవర్నర్ మొండిచేయి.. సారీ.. రెండోసారి!
సాక్షి, చెన్నై: తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టినట్లు తమ మొదటి ఎన్నికల్లోనే అత్యధిక స్థానాల్లో గెలిచి దాదాపు అధికారతీరాలకు చేరిన టీవీకే గంటలు గడుస్తున్నా ప్రభుత్వ ఏర్పాటు గండాన్ని దాటలేక అవస్థలు పడుతోంది. మ్యాజిక్ ఫిగర్ సాధించాకే తన వద్దకు రావాలని ఓవైపు గవర్నర్ అర్లేకర్ స్పష్టంచేయడం, మరోవైపు పదవీయోగం దక్కకుండా చేసేందుకు ద్రవిడ దిగ్గజ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే కలిసి పనిచేయనున్నాయనే వార్తల నడుమ టీవీకే చీఫ్ విజయ్ వేగంగా పావులు కదుపుతున్నారు. తమ ప్రియతమ హీరో, నేతను ముఖ్యమంత్రికాకుండా అడ్డుతగిలితే మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకూ వెనుకాడబోమని టీవీకే ఎమ్మెల్యేలు ప్రతినబూనారన్న వార్త తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో రెండుసార్లు ప్రత్యేకంగా కలిసి అభ్యరి్థంచినా గవర్నర్ మనసు మార్చుకోకపోవడంతో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయపోరాటానికి సిద్ధపడేందుకు టీవీకే రెడీగా ఉందన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఆలోపు భావసారూప్య పార్టీల మద్దతు కూడగట్టేందుకూ టీవీకే శతథా ప్రయత్నిస్తోంది. టీవీకే అభ్యర్థనతో మద్దతు ఇచ్చే ఆలోచన ఉన్నా బీజేపీ ఒత్తిడి కారణంగా అంతటి సాహసం చేసే దమ్ములేక అన్నాడీఎంకే మిన్నకుండిపోయిందని వార్తలు వినవస్తున్నాయి. టీవీకే కూటమిలోకి దూకేయకుండా తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఇప్పటికే అన్నాడీఎంకే రిసార్ట్ రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. అటు అన్నాడీఎం కలిసిరాక, ఇటు ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు సరిపోక విజయ్ ఇతర పార్టీల అగ్రనేతలతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాట ఏ పార్టీ/కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందనే దానిపై తలపండిన రాజకీయ పండితులు సైతం ఎటూ తేల్చలేకపోతున్నారు. మరోసారి లోక్‌భవన్‌కు.. గవర్నర్ అర్లేకర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విజయ్ గురువారం లోక్‌భవన్‌కు వెళ్లారు. తమకు అవకాశమిస్తే అసెంబ్లీ బల నిరూపణ చేసుకుంటామని గవర్నర్‌ను లిఖితపూర్వకంగా అభ్యరి్థంచారు. ఇందుకు గవర్నర్ నుంచి సానుకూల స్పందన కరువైంది. 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో వస్తేనే సాధారణ మెజార్టీ సాధించినట్లు భావించి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిస్తానని విజయ్‌కు గవర్నర్ స్పష్టంచేశారు. తమకంటే ముందుగా మరే పార్టీ లేదా కూటమికి ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వొద్దని విజయ్ కోరారని, అందుకు గవర్నర్ సమ్మతి తెలిపారని లోక్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్‌తో విజయ్ భేటీ 40 నిమిషాల్లోపే ముగిసింది. అనూహ్యంగా షణ్ముగం రాజీనామా అన్నాడీఎంకే సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం గురువారం రాత్రి అనూహ్యంగా తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. ఢిల్లీకొచ్చి సంబంధిత ఉన్నతాధికారికి తన రాజీనామా లేఖను అందజేశారు. విజయ్‌తో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుంటే రాష్ట్రానికి క్షేమదాయకమని ఫలితాలు వెల్లడయ్యాక షణ్ముగం వ్యాఖ్యానించడం తెల్సిందే. దీంతో అన్నాడీఎంకేను చీల్చి తన వర్గం ఎమ్మెల్యేలను టీవీకేకు మద్దతు ఇచ్చేలాచేసి ప్రభుత్వ ఏర్పాటుకు షణ్ముగం ప్రయత్నిస్తున్నారని వార్తలొచ్చాయి. దీనిపై ఆయన స్పందించారు. ‘‘దీనిపై నేనేమీ మాట్లాడను. నాకేమీ తెలియదు’’ అని అన్నారు. డీఎంకేతో అన్నాడీఎంకే పొత్తు ప్రతిపాదనలను మొదట్నుంచీ షణ్ముగం వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. పనయూర్‌లో టీవీకే ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఇక్కడ ఏ నిర్ణయాలు తీసుకున్నారనేది తెలియరాలేదు. అందరూ ఐక్యంగా ఉండాలని విజయ్ కోరుకుంటున్నారని పార్టీ ముఖ్యనేత తెలిపారు. ముందస్తుగా జాబితా ఎందుకు? ‘‘పార్టీ అనేది అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటుంది. మొత్తం ఎమ్మెల్యేల జాబితాను ముందస్తుగా అడగాల్సిన అవసరం గవర్నర్‌కు ఏముంది? ఉద్దేశపూర్వకంగా బీజేపీ గవర్నర్‌తో తమిళనాట రాజకీయ అస్థిరతను సృష్టిస్తోంది. గవర్నర్ వైఖరిపై శుక్రవారం నిరసనర్యాలీలు కొనసాగుతాయి’’ అని కాంగ్రెస్ తెలిపింది. టీవీకే అభ్యర్థనపై శుక్రవారం సమావేశమై నిర్ణయం తీసుకుంటామని సీపీఎం తెలిపింది.6 నెలల వరకు ఇబ్బంది పెట్టం: స్టాలిన్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు తమ వైపు నుంచి ఎలాంటి అడ్డంకులు ఉండవని డీఎంకే చీఫ్ స్టాలిన్ స్పష్టంచేశారు. ఈ మేరకు గురువారం ఆయన ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకాన్ని నిర్విరామంగా కొనసాగించాలని కోరారు. సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్, ఎండీఎంకే పార్టీల నేతలతో గురువారం స్టాలిన్ సమావేశమయ్యారు. ఐక్యంగా ఉందామని కోరారు. తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనూ మాట్లాడారు. ఏ నిర్ణయానికైనా కట్టుబడాల్సిందేనని స్టాలిన్ స్పష్టంచేశారు.మూడు పార్టీల నేతలతో భేటీలు.. టీవీకే నేత నిర్మల్ నేతృత్వంలోని బృందం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్, వీసీకే నేత తిరుమావళవన్‌తో వేర్వేరుగా సమావేశమైంది. తమతో కలిసిరావాలని వీళ్లను నిర్మల్ కోరారు. ఈ మూడు పార్టీలు శుక్రవారం సాయంత్రంలోగా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. డీఎంకేతో చర్చించాక చెప్తామని ఐయూఎంఎల్ నేత ఖాదర్ వెల్లడించారు. పుదుచ్చేరి క్యాంప్‌లో పళనిస్వామి పుదుచ్చేరి క్యాంప్‌లో ఉన్న తమ ఎమ్మెల్యేలతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి గురువారం రాత్రి సమావేశమయ్యారు. ఉదయం అంతా చెన్నైలో ముఖ్య నేతలతో సమావేశమైన పళనిస్వామి సరిగ్గా తొమ్మిదిన్నర గంటలకు పదుచ్చేరిలో ఏర్పాటు చేసిన క్యాంప్‌కు చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశంలో నిమగ్నమయ్యారు. -
హాట్ హాట్‌గా తమిళ పాలిటిక్స్..షణ్ముగంకి విజయ్ బంపరాఫర్!
సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో గందరగోళం మరింత పెరిగింది. టీవీకే నేతలు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలతో రహస్య చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సీనియర్ నేత సి.వి. షణ్ముగం (మరో ఏక్నాథ్ షిండేలా) అనుచరులైన 28 మంది ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలోని రిసార్టులో తిష్టవేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి దగ్గరగా ఉన్నప్పటికీ, ఇంకా ఐదు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో, ఏఐఏడీఎంకేలోని కొంతమంది ఎమ్మెల్యేలతో టీవీకే రహస్య చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.పుదుచ్చేరిలోని పూరంకుప్పం రిసార్టులో ఉన్న 28 మంది ఎమ్మెల్యేలు షణ్ముగం అనుచరులే. వీరిని టీవీకేకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం చేయడం కోసం వ్యూహాత్మకంగా తరలించినట్లు సమాచారం. చర్చల్లో షణ్ముగంకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, కీలక మంత్రిత్వ శాఖలు కేటాయించడం వంటి పవర్-షేరింగ్ ఫార్ములా చర్చలో ఉందని తెలుస్తోంది. మాజీ మంత్రి, టీవీకే అభ్యర్థి కె.ఏ. సెంగొట్టయన్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.అయితే, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి మాత్రం టీవీకేకు మద్దతు ఇవ్వడాన్ని అంగీకరించలేదని సమాచారం. దీంతో పార్టీ లోపలే విభేదాలు తలెత్తాయి. ఒకవైపు షణ్ముగం, ఓ.ఎస్. మణియన్ వంటి నేతలు టీవీకేకు మద్దతు ఇవ్వాలని భావిస్తుండగా, మరోవైపు పళనిస్వామి వర్గం దీనికి వ్యతిరేకంగా ఉంది.గురువారం సాయంత్రం 4 గంటలకు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌తో పళనిస్వామి భేటీ కావాల్సి ఉంది. కానీ ఆ సమావేశాన్ని ఆకస్మికంగా రద్దు చేసి, హుటాహుటిన పుదుచ్చేరి వెళ్లి రిసార్టుల్లో ఉన్న ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యేందుకు పయనమయ్యారు. ఈ క్రమంలో షణ్ముగంకు విజయ్ చేసిన ఆఫర్ వెలుగులోకి వచ్చింది.రిసార్టుల్లో ఉన్న ఎమ్మెల్యేల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, “చల్లటి గాలికోసం రిసార్ట్‌కు వచ్చాం” అని సమాధానం ఇచ్చారు. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో “అసలైన రాజకీయ నాయకులు మీరే” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.2021లో 66 సీట్లు గెలిచిన ఏఐఏడీఎంకే, తాజా ఎన్నికల్లో కేవలం 47 సీట్లు మాత్రమే గెలుచుకుంది. డి. జయకుమార్, పి. థంగమణి వంటి సీనియర్ నేతలు ఓటమి పాలయ్యారు. కోయంబత్తూరు జిల్లాలో పార్టీ బలమైన కోటగా ఉన్నప్పటికీ, ఈసారి కేవలం ఒకే సీటు (థొండముతూర్) గెలిచింది. దీంతో పార్టీ బలం రాష్ట్రంలో మూడో స్థానానికి పరిమితమైంది.ఈ నేపథ్యంలో, గెలిచిన ఎమ్మెల్యేలు టీవీకేలో చేరేందుకు పావులు కదుపుతున్నారని సమాచారం. షణ్ముగంకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని మూడు రిసార్టులకు తరలించి, వ్యూహాత్మకంగా రిసార్టులు మారుస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని తెలుస్తోంది.ఏఐఏడీఎంకే సీనియర్ నేత కేపీ అన్బళగన్ మాట్లాడుతూ.. విజయ్‌కు మద్దతు ఇవ్వడానికి మేం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అర్హత లేదు. విజయ్ కేవలం సినిమా నటుడు మాత్రమే. సినిమాల ద్వారా వచ్చిన ఖ్యాతిని ఉపయోగించి ప్రజలను పాలించాలనుకోవడం సరైంది కాదు. ఏఐఏడీఎంకే ఎప్పటికీ విజయ్‌కు మద్దతు ఇవ్వదు. మా పార్టీ ఎమ్మెల్యేలు చెన్నైలో వేడి తట్టుకోలేక పుదుచ్చేరి రిసార్ట్‌లో ఉన్నారు. పార్టీ ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో నడుస్తోంది. తమిళనాడులో 47, పుదుచ్చేరిలో ఒకరు మొత్తం 48 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి వెంటే ఉన్నారు’ అని స్పష్టం చేశారు. -
రసవత్తరంగా తమిళ రాజకీయం గవర్నర్ ను కలిసిన పళనిస్వామి
-
టీవీకే విజయ్ను ఉద్దేశిస్తూ.. తమిళనాడు గవర్నర్ అధికారిక ప్రకటన
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింతగా పెరిగింది. తాజాగా తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కలిశారు. ఈ సమావేశం అనంతరం గవర్నర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ప్రకటనలో ‘ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మద్దతు ఇంకా లభించలేదు. అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ నిరూపించకపోతే ప్రభుత్వం ఏర్పాటు ఆహ్వానం ఇవ్వలేం’ అని పేర్కొంది. దీంతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది.234 సభ్యుల అసెంబ్లీలో టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. విజయ్ రెండు నియోజకవర్గాల్లో గెలవడంతో ఒక సీటు వదులుకోవాలి. దీంతో పార్టీ బలం 107కి తగ్గుతుంది. కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో సంఖ్య 112కి చేరింది. కానీ మెజారిటీకి కావలసిన 118కి ఇంకా తక్కువ. ఇక ఇతర పార్టీల వైఖరి కీలకంగా మారింది. సీపీఐ,సీపీఎం, వీసీకే మద్దతు ఇవ్వాలని ఆలోచిస్తున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్ విజయ్‌కు మద్దతు ఇచ్చే అంశాన్ని వామపక్షాలకే వదిలేశారు. అయితే ఏఐఏడీఎంకే మాత్రం టీవీకేకు మద్దతు ఇవ్వబోమని స్పష్టంగా తెలిపింది.టీవీకే మద్దతుదారులు లోక్‌భవన్ వద్ద నిరసనలు చేపట్టారు. గవర్నర్ ఆలస్యం పై పలువురు ప్రముఖులు విమర్శలు చేశారు. టీవీకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. మొత్తం మీద, టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినప్పటికీ, మెజారిటీకి కావలసిన సంఖ్య ఇంకా తక్కువ. గవర్నర్ ఆహ్వానం ఇవ్వడానికి ముందు స్పష్టమైన మెజారిటీ నిరూపణ కోరుతున్నారు. చిన్న పార్టీల నిర్ణయం, కాంగ్రెస్ మద్దతు, డీఎంకే తాత్కాలిక వెనుకడుగు వంటి అంశాలు తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠను మరింతగా పెంచుతున్నాయి. Governor Tells Vijay, Majority Not Yet EstablishedChennaiThe #LokBhavan, Tamil Nadu, has issued a press statement stating that Governor Rajendra Vishwanath Arlekar met C. Joseph #Vijay, President of the Tamilaga Vettri Kazhagam (#TVK), in #Chennai today. During the… pic.twitter.com/c1OQza05RK— Yasir Mushtaq (@path2shah) May 7, 2026 -
పొలిటికల్ థ్రిల్లర్
-
విజయ్‌కు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్
చెన్నై: తమిళ రాజకీయాల్లో ఉత్కంఠకు తెర పడింది. ప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే పార్టీకి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అనుమతి ఇచ్చారు. విజయ్‌తో భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. అయితే, లోక్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ అధికారిక ప్రకటన కోసం టీవీకే శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు.. న్యాయ సలహా తీసుకున్న తర్వాత తన నిర్ణయం చెబుతానని గవర్నర్ వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. ఒకవేళ గవర్నర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడితే ఈరోజే విజయ్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీంతో, విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. గవర్నర్ గ్రీన్‌సిగ్నల్‌తో టీవీకే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కాసేపటి క్రితమే లోక్‌భవన్ వేదికగా గవర్నర్, విజయ్ మధ్య కీలక సమావేశం జరిగింది. 24 గంటల్లో రెండోసారి గవర్నర్‌ను విజయ్ కలిశారు.40 నిమిషాల భేటీ తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. వీరి భేటీ సందర్భంగా గవర్నర్‌కు విజయ్.. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను అందించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. ఇదే సమయంలో అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామని విజయ్ చెప్పారు. 113 మంది ఎమ్మెల్యే జాబితాను సమర్పించారు. #WATCH | Chennai | TVK Chief Vijay leaves from Lok Bhavan after meeting Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar pic.twitter.com/ygxHkVNi4q— ANI (@ANI) May 7, 2026విజయ్‌కు అనుమతి ఇవ్వాలి..ఇదిలా ఉండగా.. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి విజయ్‌కు అనుమతి ఇవ్వాలని వీసీకే గవర్నర్‌ను కోరింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించే అవకాశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇద్దరేసి ఎమ్మెల్యేలున్న వీసీకే, సీపీఐ సానుకూలంగా స్పందించినా, ఇంకా అధికారికంగా చెప్పలేదు. టీవీకేకు తొలుత అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని డీఎంకే కూడా వ్యక్తంచేసింది. -
గంటగంటకూ ఉత్కంఠ..! తమిళ రాజ్యమేలేదెవరు..?
-
నిప్పు-నీరు కలిసే చాన్సే లేదా?
అధికారం అయితే నీది లేదంటే నాది.. ద్రవిడ సిద్ధాంతం ఆధారంగా నడిచే తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న తంతు ఇదే . అయితే ఈసారి విజయ్ అనే రూపంలో ‘మార్పు’ ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకును గట్టిగా దెబ్బ కొట్టింది. వాటిని పక్కన నెట్టేసి అధికారం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనైనా వైరాన్ని పక్కన పెట్టి డీఎంకే–అన్నాడీఎంకేలు చేతులు కలుపుతాయా?.. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రహస్య చర్చలు జరుపుతున్నాయి. ఈ రెండూ కలిసి అధికారం ఏర్పాటు చేయబోతున్నాయి. తద్వారా అత్యధిక స్థానాలు గెల్చుకున్న విజయ్‌కు భారీ షాక్ తగలబోతోంది. అదే టైంలో.. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నచందాన తమను ఇంతకాలం అవసరానికి వాడుకున్న జాతీయ పార్టీలనూ దెబ్బ కొట్టబోతున్నాయి. ఇది నిన్న సాయంత్రం నుంచి తమిళనాట జరుగుతున్న ప్రచారం. అయితే అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే రెండూ ఈ ప్రచారాన్ని కొట్టిపారేశాయి. ఇది టీవీకే ఆడుతున్న చిల్లర మైండ్‌గేమ్ అని తిట్టిపోశాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమనే మాట ఒకటి ఉంది. అలాంటప్పుడు డీఎంకే-అన్నాడీఎంకే.. ఈ పార్టీల మధ్య స్నేహం ఎందుకు అసాధ్యం?. తమిళ రాజకీయాల పేజీలను తిరగేస్తే.. ఏనాడూ ఈ పార్టీలు జట్టు కట్టిన సందర్భం కనిపించదు. స్థానిక ఎన్నికల దగ్గరి నుంచి ఎందులో అయినా సరే మద్దతు అనేది భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. కేవలం ద్రవిడ ఉద్యమ వారసత్వం, తమిళ భాషా హక్కుల అంశాల్లో రెండు పార్టీలూ ఒకే వేదికను పంచుకోవడం తప్పించి. ఈ రెండు పార్టీలు కలవకపోవడానికి ప్రధానంగా మూడు బలమైన కారణాలు కనిపిస్తాయిపుట్టుకే..1972లో కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే నుంచి ఎంజీ రామచంద్రన్ (MGR) బహిష్కరించింది. ఆ అవమానానికి ప్రతీకారంగా ఎంజీఆర్ అన్నాడీఎంకే (AIADMK) స్థాపించారు. కొత్త పార్టీ ప్రకటన సమయంలో.. డీఎంకేలో అవినీతి పెరిగిపోయిందని సంచలన ఆరోపణలు చేశారాయన. నాటి నుంచి నేటి దాకా.. ఒక పార్టీ ఉనికి మరొక పార్టీని వ్యతిరేకించడం మీదనే ఆధారపడి ఉంది. ఒకవేళ ఈ రెండూ కలిస్తే, అవి తమ మౌలిక సిద్ధాంతాన్ని తామే తుడిచేసుకున్నట్లు అవుతుంది.భిన్న ధృవాల రాజకీయం (Bipolar Politics)గత 50 ఏళ్లుగా తమిళ ప్రజలకు ఈ రెండు పార్టీలే ప్రత్యామ్నాయాలు. డీఎంకే పాలన నచ్చకపోతే అన్నాడీఎంకేకి.. అది నచ్చకపోతే మళ్ళీ డీఎంకేకు ఓటు వేస్తూ అధికారం కట్టబెట్టుకుంటూ వస్తున్నారు. ఒకవేళ ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే.. అప్పటివరకు ఈ రెండు పక్షాల మధ్య చీలి ఉన్న 70-80 శాతం ఓటు బ్యాంకు గందరగోళానికి గురవుతుంది. ఇది మూడవ శక్తికి (తాజాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే వంటి పార్టీలకు) రెడ్ కార్పెట్ పరిచినట్లు అవుతుంది. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికే ఇవి ఎప్పుడూ ప్రత్యర్థులుగానే ఉండాలని కోరుకుంటాయి.కేడర్ స్థాయి ఘర్షణదశాబ్దాలుగా కొనసాగుతున్న వైరంలో.. కేవలం నాయకులే కాదు, క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా భాగస్వాములు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి చోటా ఈ రెండు పార్టీల నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గత ఐదు దశాబ్దాలుగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ, ఒకరినొకరు విమర్శించుకుంటూ.. దాడులు చేసుకుంటూ..ఆఖరికి హత్యలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. పెరిగిన క్యాడర్, అకస్మాత్తుగా పొత్తు పెట్టుకుంటే దానిని అంగీకరించడం అసాధ్యం. నాయకులు పైన కలిసినా, కింద కార్యకర్తలు కలవడం కష్టమైన పని.మరి జాతీయ పార్టీలతో జట్టు?.. తమిళ గడ్డపై ఎట్టి పరిస్థితుల్లో మత శక్తులకు చోటు ఉండకూడదు.. అనేది ద్రవిడ సిద్ధాంత ప్రాథమిక సూత్రం. అయినప్పటికీ డీఎంకే, అన్నాడీఎంకేలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో పొత్తులు పెట్టుకుంటాయి. ఎందుకనేది పరిశీలిస్తే.. 👉ఢిల్లీలో పట్టు కోసం (Influence in Delhi)తమిళనాడులో ఈ రెండు పార్టీలు ఎంత బలంగా ఉన్నా.. జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపడం కూడా ఎంతో అవసరం. కేంద్రంలో చట్టాలు చేయాలన్నా లేదంటే రాష్ట్రానికి నిధులు రావాలన్నా జాతీయ పార్టీల మద్దతు అవసరం. పైగా కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. కేంద్ర క్యాబినెట్లో తమ ఎంపీలకు మంత్రి పదవులు దక్కుతాయి. తద్వారా రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో ఒత్తిడి తీసుకురావచ్చనేది ఒక లెక్క.👉విడదీసి పాలించడం (Cutting the Competition)తమిళనాడులో కాంగ్రెస్‌కు, బీజేపీకి సొంతంగా గెలిచే సత్తా తక్కువ (సుమారు 5% నుండి 10% ఓటు బ్యాంకు మాత్రమే ఉంది). ఈ చిన్న ఓటు బ్యాంకు కూడా మూడో పార్టీకి వెళ్తే తమకు నష్టం జరుగుతుందని ద్రవిడ పార్టీలు భయపడతాయి. అందుకే, ఆ జాతీయ పార్టీని తమ వైపు తిప్పుకోవడం ద్వారా ప్రత్యర్థిని బలహీనపరచడం వీరి వ్యూహం. 👉సిద్ధాంతం vs అధికారం (Ideology vs Pragmatism)ద్రవిడ సిద్ధాంతం (Dravidian Ideology) ప్రకారం మతతత్వానికి వ్యతిరేకంగా ఉండాలి. కానీ ఎన్నికల రాజకీయాల్లో 'గెలవడమే' ముఖ్యం. సాధారణంగా "సెక్యులరిజం" పేరుతో డీఎంకే కాంగ్రెస్‌తో జతకడుతుంది. అదే సమయంలో బీజేపీని "మతతత్వ పార్టీ" అని విమర్శిస్తూ ద్రవిడ ఓటర్లను ఆకట్టుకుంటుంది. అయితే.. జయలలిత ఉన్నప్పుడు హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికి కొన్నిసార్లు బీజేపీతో సాఫ్ట్‌గా ఉండేవారు. అదే ఆ తర్వాతి కాలంలో ఎన్డీయే పొత్తునకు కారణమైంది. అయితే అది కేవలం రాజకీయ అవసరం కోసమే తప్ప సిద్ధాంతపరంగా కాదు. అందుకే ఈ రెండు పార్టీలు ఏ క్షణమైనా జాతీయ పార్టీలతో బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధంగా ఉంటాయి. విజయ్ రాకతో సీన్ మారేనా?2026 అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడుకు మునుపెన్నడూ లేని రీతిలో ఆసక్తికర రాజకీయం అందించాయి. అగ్రనటుడు విజయ్ రెండేళ్ల కిందట స్థాపించిన టీవీకే తొలి ఎన్నికల్లోనే అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. డీఎంకే అధికారం కోల్పోయి రెండో స్థానంలోకి, ప్రతిపక్ష అన్నాడీఎంకే మూడో ప్లేస్‌లోకి పడిపోయాయి. తమిళనాట హంగ్ ఏర్పడటంతో.. ప్రభుత్వ ఏర్పాటులో టీవీకే (TVK) పార్టీని అడ్డుకోవడానికైనా ఈ రెండు పార్టీలు కలుస్తాయేమోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. తమ 50 ఏళ్ల సిద్ధాంత పోరాటాన్ని ఒక్క ఎన్నిక కోసం వదులుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారా? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఇదే అసలు సమస్య.. నాయకత్వ అహంకారం-పట్టుదల ఈ రెండు పార్టీలకు ఇప్పటికీ కొనసాగుతున్న ఓ కామన్ గుణం. జనతా సర్కార్ ఉన్న టైంలో.. ఇందిరా గాంధీని దెబ్బ కొట్టడానికి ఈ తమిళ శక్తులను ఒక్కటి చేసే ప్రయత్నం జరిగింది. కానీ, చివరి నిమిషంలో ఆ ప్రయత్నం ఎందుకనో ఫలించలేదు. ఎంజీఆర్ తదనంతరం జయలలిత అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టారు. అయితే కరుణానిధి-జయలలిత ఉన్న కాలంలో ఈ వైరం వ్యక్తిగత స్థాయికి చేరింది. అది ఎంతలా అంటే.. 1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత పట్ల జరిగిన అవమానం(ఆమె చీరను లాగడం..), 75 ఏళ్ల వయసులో కరుణానిధిని అర్ధరాత్రి పూట ఇంట్లోంచి లాక్కొచ్చి మరీ జయ సర్కార్ అరెస్ట్ చేయించడం.. ఇలాంటి సంఘటనలు ఈ రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక చర్చలు అనే దారులు పూర్తిగా మూసివేశాయి. బద్ధ శత్రువులుగా మారిపోయాయి. ఆ తర్వాతి కాలంలో.. ఆ పార్టీల అధినేతలుగా స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి (EPS) కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరి కింద మరొకరు పని చేయడానికి ఏ నాయకుడూ సిద్ధపడరు. ముఖ్యమంత్రి పదవి విషయంలో రాజీ పడటం అనేది ద్రావిడ రాజకీయాల్లో దాదాపు అసాధ్యమైన విషయం.తమిళనాడు రాజకీయ చరిత్రలో డీఎంకే, డీఎంకే పార్టీల మధ్య ఉన్న వైరం కేవలం అధికార పోరాటం మాత్రమే కాదు. అది ఒక చారిత్రక భావోద్వేగ ఘర్షణ. అందుకే నిప్పు నీరు కలవడం అసాధ్యమనే చెప్పచ్చు. ఒకవేళ కలిసే ప్రయత్నాలు జరిగితే.. ఆ క్షణమే ద్రావిడ రాజకీయాల అస్తిత్వం దెబ్బతింటుందని వారి నమ్మకం. అందుకే వారు 'మొండిగా' విడివిడిగానే పోరాడతారు తప్ప, చేతులు కలపరు. -
తమిళ రాజకీయంలో సంచలనం.. విజయ్ సీఎం కానట్టే...!!
-
అధికారం కోసం కొత్త పొత్తు.. మాజీ శత్రువులు ఇప్పుడు కొత్త మిత్రులు?
-
తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య పొత్తు వార్తలతో వేడెక్కిన పాలిటిక్స్.
-
రేపు తమిళనాడులో కాంగ్రెస్ ధర్నా
తమిళనాడు రాజకీయానికి సంబంధించిన అప్డేట్స్.. తమిళనాడు గవర్నర్‌ను కలిసిన సీఎస్, డీజీపీవిజయ్కు కాన్వాయ్ ఎలా ఇచ్చారని డీజీపీని ప్రశ్నించిన గవర్నర్ఏ బేస్ చేసుకుని కాన్వాయ్, భద్రత కేటాయించారన్న గవర్నర్రేపు తమిళనాడు వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన కాంగ్రెస్తమిళనాడు గవర్నర్, బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరనలుగవర్నర్ తీరుకు నిరసనగారేపు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నవిజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అడ్డుకుంటున్నారని విమర్శలుగవర్నర్ తీరుకు నిరసనగా ఆందోళనకు ధర్నాకు దిగనున్న కాంగ్రెస్ శ్రేణులు రేపు వామపక్షాల ఎగ్జిక్యూటివ్ సమావేశంటీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయంప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన మద్దతు కూడగట్టే ప్రయత్నాలు వేగవంతంవామపక్షాలతో చర్చలు జరిపేందుకు రంగంలోకి టీవీకే నేత నిర్మల్ కుమార్వామ పక్షాలతో చర్చలు జరిపే బాధ్యతల్ని కుమార్‌కు అప్పగించిన విజయ్ రేపు వామపక్షాల ఎగ్జిక్యూటివ్ సమావేశంసమావేశం తర్వాతే విజయ్‌కు మద్దతు అంశంపై క్లారిటీ అప్పటి వరకు కొనసాగనున్న ఉత్కంఠలోక్భవన్ అధికారిక ప్రకటనతమిళనాడు గవర్నర్ కార్యాలయం లోక్‌భవన్ అధికారిక ప్రకటనగవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఈ రోజు చెన్నైలో విజయ్‌ని కలిశారుప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మద్దతు తమిళనాడు శాసనసభలో ఇంకా లభించలేదని స్పష్టంలోక్భవన్ ఎదుట విజయ్ అభిమానుల ఆందోళనప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ప్లకార్డులతో ప్రదర్శననాది భరోసాటీవీకే చీఫ్ విజయ్‌కు గవర్నర్ భరోసా ప్రభుత్వ ఏర్పాటు ఇతర పార్టీలను ఆహ్వానించబోమని హామీ తగిన మెజారిటీతో రావాలని సూచన 118 మంది జాబితాతో వచ్చి మెజారిటీ నిరూపించుకోవాలని సలహా విజయ్‌కి మద్దతు ఇస్తారా?డీఎంకే మిత్రపక్షాల నిర్ణయంపై ఉత్కంఠవామపక్షాలతో పాటు వీసీకే పార్టీ మద్దతు కోరిన విజయ్మద్దతు కోరుతూ లేఖ రాసిన టీవీకే అధినేతడీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ అయిన మిత్రపక్షాల నేతలువిడిగా పార్టీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం తమ నిర్ణయం ఏంటన్నది రేపు భేటీల తర్వాత ప్రకటించే చాన్స్విజయ్కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన సీపీఐ(2)ఏదీ తేల్చని సీపీఎం (2)మద్దతు ఇవ్వమని ఇదివరకు ప్రకటించిన వీసీకే(2)విజయ్ లేఖ నేపథ్యంలో పునరాలోచనలో వీసీకేమద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(2)తమిళనాడులో కొనసాగుతున్న సస్పెన్స్..విజయ్ సమర్పించిన సంఖ్యా బలం పట్ల సంతృప్తి చెందని గవర్నర్.గవర్నర్ ఆఫీసు నుంచి టీవీకేకి ఫోన్.118 మంది మెజార్టీ ఫిగర్‌తో లేఖ సమర్పించాలని టీవీకేకు స్పష్టం చేసిన గవర్నర్ ఆఫీస్.కోర్ కమిటీతో సమావేశమైన టీవీకే నేతలుసంబంధిత వార్త: 113తో ప్రభుత్వమా? అలా ఎలా?కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలుఎంపీ కమల్‌హాసన్ ట్వీట్.ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.తమిళనాడు ప్రజల ఆకాంక్షలను గవర్నర్ అవమానిస్తున్నారు.లోక్‌భవన్ కాదు.. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాలి.ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించాలి. తమిళనాడు చర్రితలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. தமிழ்நாடு சட்டமன்றத் தேர்தலில் தனித்து ஆட்சியமைக்கும் அதிகாரத்தை மக்கள் எந்தக் கட்சிக்கும் வழங்கவில்லை. இந்த முடிவு தமிழ்நாட்டு வரலாற்றில் முன்னெப்போதும் நிகழாதது. என் சகோதரர் திரு. @mkstalin அவர்கள் ‘மக்கள் தீர்ப்பை மதிக்கிறோம்; பொறுப்பான எதிர்க்கட்சியாகச் செயல்படுவோம்’ என்று…— Kamal Haasan (@ikamalhaasan) May 7, 2026విజయ్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్40 నిమిషాల భేటీ తర్వాత కీలక పరిణామంటీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ సానుకూలంగా స్పందనముగిసిన భేటీ.. లోక్‌భవన్‌లో గవర్నర్‌తో ముగిసిన విజయ్ భేటీ.24 గంటల్లో రెండోసారి గవర్నర్‌ను కలిసిన విజయ్.కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను గవర్నర్‌కు ఇచ్చిన విజయ్.ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరిన విజయ్.అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామన్న విజయ్.113 మంది ఎమ్మెల్యే జాబితాను సమర్పించిన విజయ్.కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న అన్నాడీఎంకే పళనిస్వామి. పళనిస్వామికి టెన్షన్!విజయ్‌కు మద్దతుగా నిలవాలని పళనిస్వామిపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ఒత్తిడి.ఈపీఎస్ ఒప్పుకోకుంటే టీవీకేకి మద్దతు పలికే ఆలోచనలో 25 మందికిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.25 నుంచి 28 మంది ఎమ్మెల్యేలతో టీవీకే నేతలు వేలుమణి, షణ్ముగం సంప్రదింపులు.పుదుచ్చేరి రిసార్టులో 25 మందికిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.విజయ్ పార్టీకి మద్దతు తెలిపిన ఇద్దరు వీసీకే ఎమ్మెల్యేలు. లోక్‌భవన్‌లో గవర్నర్‌తో విజయ్ సమావేశం..ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరిన విజయ్.అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామన్న విజయ్అతిపెద్ద పార్టీ కనుక ముందుగా తనకే అవకాశం ఇవ్వాలని కోరిన విజయ్.కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను గవర్నర్‌కు ఇచ్చిన విజయ్.ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం ఉంది: విజయ్ తమిళనాడులో ట్విస్ట్‌ల మీద ట్విస్టులుగవర్నర్ ఆర్లేకర్ అపాయింట్మెంట్ కోరిన అన్నాడీఎంకే పళనిస్వామివిజయ్ భేటీ అనంతరం గవర్నర్‌ను కలవనున్న పళనిస్వామి.మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్‌తో పళనిస్వామి భేటీ. గవర్నర్‌తో పళనిస్వామి సమావేశంపై పలు రకాల ఊహాగానాలుటీవీకే విజయ్‌కి మద్దతు ఇవ్వాలని పుదుచ్చేరిలో 25 మంది ఎమ్మెల్యేల క్యాంపుతాజా పరిణామాల నేపథ్యంలో టీవీకేకు అన్నాడీఎంకే మద్దతు ఇచ్చే ఛాన్స్అన్నాడీఎంకే మద్దతిస్తే సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న విజయ్గవర్నర్, విజయ్ భేటీపై సర్వత్ర ఉత్కంఠ👉గవర్నర్‌ను కలిసిన విజయ్👉లోక్‌భవన్‌లో గవర్నర్‌తో విజయ్ భేటీ. ప్రజల అండ విజయ్‌కు ఉంది: ప్రకాశ్రాజ్తమిళనాడు రాజకీయాలపై స్పందించిన ప్రకాశ్రాజ్ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోన్న వేళ ప్రకాశ్‌రాజ్ పోస్ట్విజయ్కు ప్రజామోదం ఉందంటూ వ్యాఖ్యలు.ప్రజలు అండగా ఉన్నారని కితాబు. గవర్నర్ ప్రవర్తన అత్యంత అభ్యంతరకరం, ఆమోదయోగ్యం కానిది మరియు రాజ్యాంగ విరుద్ధమైనది.మన మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు..కానీ విజయం ప్రజల తీర్పు ద్వారా లభించింది.సభలో తన హక్కును నిరూపించుకునే అవకాశం అతనికి కల్పించాలి.This Governor s behaviour is Disgusting .. unacceptable and unconstitutional. We may have differences … but Vijay has got the mandate . He should be allowed to claim his right on the floor of the house. #justasking https://t.co/T72CVedXhJ— Prakash Raj (@prakashraaj) May 7, 2026క్షణక్షణం.. ఉత్కంఠ.. 👉లోక్‌భవన్‌కు బయలుదేరిన విజయ్👉కాసేపట్లో గవర్నర్‌తో కీలక భేటీ. 👉 కేరళ పర్యటన రద్దు చేసుకున్న గవర్నర్ ఆర్లేకర్. విజయ్ కాన్వాయ్ వద్దన్నారు: టీవీకే ప్రమాణ స్వీకారం చేసేంత వరకు విజయ్ కాన్వాయ్ వద్దన్నారు: టీవీకే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రొటోకాల్ ప్రకారం ఆయనకు కాన్వాయ్ కేటాయించినట్లు వెల్లడించిన అధికారులుసుప్రీంకోర్టుకు విజయ్కాసేపట్లో గవర్నర్‌తో విజయ్ భేటీతమిళ రాజకీయంపై ఉత్కంఠకాసేపట్లో లోక్‌భవన్‌కు విజయ్.ఉదయం 11 గంటలకు గవర్నర్ ఆర్లేకర్‌తో భేటీ కానున్న విజయ్.నిన్న గవర్నర్‌ను కలిసిన విజయ్118 మంది సంతకాలతో రావాలన్న గవర్నర్అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలవలేదనే పాయింట్ మీద కోర్టుకు వెళ్లనున్న టీవీకే.సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నాల్లో విజయ్ ఉన్నట్టు సమాచారం. అన్నాడీఎంకేలో ఏం జరుగుతోంది? పుదుచ్చేరి రిసార్టులోనే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.అన్నాడీఎంకే బలం-47టీవీకే మద్దతు ఇవ్వాలన్ని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను రిసార్ట్‌లకు తరలింపు.టీవీకేకే మద్దతు ఇవ్వాలంటున్న ఓ వర్గం.టీవీకేకి దూరంగా ఉండాలంటున్న మరో వర్గం.చెన్నైలోనే పళనిస్వామి వర్గం.పుదుచ్చేరిలో షణ్ముగం వర్గం.పుదుచ్చేరి రిసార్టులో దాదాపు 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రిసార్టు నుంచి ఒక్కొక్కొరుగా పార్టీ ఆఫీసుకు వస్తున్న టీవీకే ఎమ్మెల్యేలు. నేడు విజయ్ కీలక సమావేశం.. నేడు టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశం.రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలతో విజయ్ కీలక భేటీ.తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం. మళ్లీ ఎన్నికలు జరపండి: శ్రీధర్ వేంబుతమిళనాడులో మళ్లీ ఎన్నికలు జరపాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు వ్యాఖ్యలు.టీవీకే విజయ్‌కి ప్రభుత్వ ఏర్పాటు కోసం తగినంత సంఖ్యా బలం లేదు.సంఖ్యలు సరిపోతున్నట్లు కనిపించడం లేదు.ఏ ప్రభుత్వం ఏర్పడినా, అది వివిధ రకాల ఆకర్షణలు, ఒత్తిళ్లతో అస్థిరంగా ఉండే అవకాశం ఉంది.తమిళనాడు ఇంతకంటే మెరుగైన ప్రభుత్వానికి అర్హమైనది.అందుకే రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి.విజయ్ సూపర్ మెజారిటీతో తిరిగి వస్తారని నేను భావిస్తున్నాను.ఒకవేళ డీఎంకే-అన్నాడీఎంకే దానిని ఆపాలనుకుంటే, వారిద్దరూ కలిసి పోరాడాలి.సున్నా సీట్లు వచ్చినా సరే, బీజేపీ ఒంటరిగా పోరాడాలి.తమిళనాడులో బీజేపీకి ఇది ఒక కొత్త ఆరంభం.ప్రజలే మళ్లీ నిర్ణయించనివ్వండి అంటూ కీలక వ్యాఖ్యలు. The numbers don't seem to add up. Whatever government is cobbled together is likely to be unstable with various pulls and pressures. Tamil Nadu deserves better.President's rule with fresh elections may be the best course, this time with a very strict "no cash for votes"…— Sridhar Vembu (@svembu) May 7, 2026తమిళనాడులో అల్లర్లకు చాన్స్..తమిళనాడులో ఇంటెలిజెన్స్ హెచ్చరికపలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలకు సమాచారం.దీంతో, పలు జిల్లాల్లో భద్రత కట్టుదిట్టం చేసిన సీఎస్, డీజీపీపొత్తులపై కొత్త ట్విస్ట్.. పొత్తులపై ప్రచారాన్ని ఖండించిన డీఎంకేఅవన్నీ ఫేక్ అంటూ డీఎంకే నేతలు వ్యాఖ్యలు.విజయ్ ప్రభుత్వంలో తమ జోక్యం ఉండదన్న స్టాలిన్మరోవైపు.. విజయ్‌కు తమ మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే.ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతుపై ఉత్కంఠ.టీవీకేకు మద్దతు ఇచ్చేది లేదని చెబుతున్న లెఫ్ట్ పార్టీలు, అన్నాడీఎంకే.కాంగ్రెస్ మద్దతులో 112కు చేరిన టీవీకే బలంమరో ఆరుగురు ఎమ్మెల్యే కోసం టీవీకే ప్రయత్నాలు. రిసార్ట్ రాజకీయాలు..గత మూడు రోజులుగా మహాబలిపురంలోని రిసార్ట్‌లో టీవీకే ఎమ్మెల్యేలు.మరోవైపు.. 15 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా పుదుచ్చేరిలోని రిసార్ట్‌కు తరలింపు.'ది షోర్ త్రిశ్వం'లో 20కి పైగా గదులను బుక్ చేసుకున్న అన్నాడీఎంకే సీవీ షణ్ముగంPuducherry: AIADMK MLAs have gathered at a private resort in Puducherry amid uncertainty over government formation in Tamil Nadu. With TVK lacking a clear majority and seeking support, political maneuvering is underway. Heavy police security has been deployed to maintain law and… pic.twitter.com/hsUdAsgbSE— IANS (@ians_india) May 6, 2026ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్ లోక్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను టీవీకే నేతలు కలిశారు.విజయ్ వెంట టీవీకే ముఖ్యనేతలు బస్సీ ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున, కేఏ సెంగొట్టయాన్, సీటీ నిర్మల్కుమార్టీవీకే పార్టీలో 108 మంది ఎమ్మెల్యేలున్నా విజయ్ రెండుచోట్ల గెలవడంతో ఆ సంఖ్య 107కు తగ్గింది.వీళ్లకు కాంగ్రెస్‌లోని ఐదుగురి పేర్లను జతచేసి మొత్తం 112 పేర్ల జాబితాను గవర్నర్‌కు అందజేత.ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తిఅందుకు గవర్నర్ విముఖత.118 మంది ఎమ్మెల్యేలతో స్పష్టమైన మెజార్టీ వచ్చాక తిరిగి తన వద్దకు రావాలని విజయ్‌కు గవర్నర్ సూచన.దీంతో నిరాశతో వెనుతిరిగిన విజయ్. రసవత్తరంగా తమిళ రాజకీయం..గంట గంటకూ మారుతున్న తమిళనాడులో రాజకీయ సమీకరణాలుకొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కొనసాగుతున్న ఉత్కంఠ..నేడు ఏం జరగబోతోందని అనేది సస్పెన్స్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయా పార్టీల బలం ఇలా.. టీవీకే - 108డీఎంకే - 59అన్నాడీఎంకే - 47కాంగ్రెస్ - 05పీఎంకే - 04ఐయూఎమ్ఎల్- 02సీపీఐ - 02సీవీకే - 02సీపీఎం - 02బీజేపీ - 01డీఎండీకే - 01అన్నామక్కల్ మున్నేట్ర కళగం - 01రెండు పార్టీల మంతనాలుతమిళనాట కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.డీఎంకే, అన్నాడీఎంకే తెరవెనుక రహస్యంగా మంతనాలు చేస్తున్నట్లు వార్తలుఈ రెండు పార్టీలు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు సమాచారం.డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలుకు 106 సీట్లువామపక్షాలు మిగిలిన చిన్న పార్టీలు కూడా మద్దతు ఇచ్చేందుకు సముఖంగా ఉన్నాయట!దీంతో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ లేకుండానే 120 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం. -
తమిళ రాజకీయంలో ఊహించని ట్విస్ట్...
-
మద్దతు ఇస్తాం.. మంత్రి పదవులు కావాలి..
-
బాబొచ్చారు ఓటమి తెచ్చారు
-
ఆ పార్టీలతో విజయ్ పొత్తు ఖరారు.. ఎల్లుండే ప్రమాణ స్వీకారం
-
టీవీకే ఎఫెక్ట్.. అన్నాడీఎంకేలో బిగ్ ట్విస్ట్!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులోకి ఉంది. ఎన్నికల్లో 108 స్థానాల్లో విజయం సాధించడంతో టీవీకే మరో 10 మంది బలం కావాల్సి ఉంది. ఈ క్రమంలో పది మంది కోసం టీవీకే కసరత్తు మొదలు పెట్టింది. దీంతో, అన్నాడీఎంకే లుకలుకలు మొదలైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టీవీకేకి మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో రెండు వర్గాల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామికి పార్టీలో చీలికలు చుక్కలు చూపిస్తున్నాయి. కాగా, ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకేకు మద్దతు ఇవ్వాలని ఒక వర్గం.. మరో వర్గం ఇవ్వొద్దని వాదించుకుంటున్నట్టు సమాచారం. ఇలాంటి తరుణంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమా రోజ్.. విజయ్ టీవీకేతో చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రకటించడం సంచలనంగా మారింది. ఇక, తమిళనాడు ఎన్నికల్లో రిచ్చెస్ట్ అభ్యర్థిగా లాలూగుడి నుంచి లీమా గెలుపొందారు.అయితే, ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న అన్నాడీఎంకే.. విజయ్‌కు మద్దతు ఇవ్వడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ విషయమై నేడు పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే కీలక సమావేశం జరగనుంది. ప్రస్తుతానికి పళనిస్వామి.. ఎమ్మెల్యేలను చేజారకుండా అప్రమత్తమై ఉన్నారు. అయినప్పటికీ టీవీకేతో 10 మంది అన్నాడీఎంకేలు టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో, కూటమి నుంచి బయటకు వచ్చి పది మంది.. విజయ్‌కు మద్దతు ఇస్తారా? అనే చర్చ ఊపందుకుంది. నేడు జరగబోయే సమావేశంలో నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మరోవైపు.. సీపీ షణ్ముగం ఆఫీసులో 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. దీంతో, వారంతా ఏ నిర్ణయం తీసుకోనున్నారనే సస్పెన్స్ నెలకొంది. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే మద్దతుపై విజయ్ ఏమాత్రం ఆసక్తిగా లేరనే వార్త కూడా ప్రచారంలో ఉంది. గతంలో జయలలిత టైంలో పలు చేదు అనుభవాలు దృష్ట్యా విజయ్ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో 47 సీట్లతో అన్నాడీఎంకే మూడో స్థానంలో ఉంది. -
30 వేల మెజారిటీతో గెలుపు.. వెంటనే రాజీనామా..!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సీవీ షణ్ముగం సీనియర్ నేత. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. గత ఎన్నికలలో ఓటమి పాలు కావడంతో పార్టీ వద్ద పట్టుబట్టి మరీ రాజ్యసభ సీటును రాబట్టుకున్నారు. ఈ సారి ఆయన మైలం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. డీఎంకే, టీవీకే అభ్యర్థులతో సహా 21 మంది సీవీ షణ్ముగంను ఓడించే దిశగా ఇక్కడ పోటీచేశారు.అయితే, గత కొన్నేళ్లుగా సీవీ షణ్ముగం ఇక్కడి ప్రజలతో మమేకం కావడం విజయాన్ని వరించింది. 82,535 ఓట్లను ఆయన రాబట్టుకున్నారు. సుమారు 30 వేల ఓట్లమెజారిటీతో గెలిచిన సీవీ షణ్ముగం రాష్ట్ర రాజకీయాలే తనకు ముఖ్యం అన్న నిర్ణయానికి వచ్చారు. ఎమ్మెల్యేగా ధ్రువీకరణ పత్రం అందుకున్న సీవీ షణ్ముగం అదే చేతితో రాజ్య సభ పదవికి రాజీనామా చేయడం గమనార్హం. -
DMK, AIADMK పట్టిన గతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు
-
విజయ్ వ్యూహం.. డీఎంకే, అన్నాడీఎంకే విలవిల
టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీవీకే తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతున్నందున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీని వెనక మరో వ్యూహం ఉండొచ్చనే చర్చా జోరందుకుంది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ 108 సీట్ల విక్టరీతో సంచలన విజయం నమోదు చేసింది తెలిసిందే. డీఎంకే 59, అన్నాడీఎంకే 47 స్థానాలకు పరిమితం అయ్యాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మెజారిటీకి టీవీకే దగ్గర్లోనే ఆగిపోయింది. అయినప్పటికీ తమ పార్టీకి పూర్తి మెజారిటీ ఉందని.. ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు ఇవ్వాలని విజయ్ తమిళనాడు గవర్నర్‌ను కోరారు. ఆ వెంటనే.. నెగ్గిన వాళ్లందరినీ పార్టీ ప్రధాన కార్యాలయానికి రప్పించిన ఆయన.. అటు నుంచి అటే పూంజేరీలోని ఓ స్టార్ హోటల్‌కు తరలించాలని నిర్ణయించారు. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదాకా అక్కడే వాళ్లకు బస ఏర్పాటు చేయాలని పార్టీ కీలక నేతలను ఆయన ఆదేశించారు. అయితే..విజయ్ మాస్టర్ ప్లాన్?టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు మరో 10 సీట్లు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, ఒకట్రెండు సీట్లు నెగ్గిన పార్టీలు విజయ్ పార్టీతో అధికారంలో భాగమయ్యేందుకు ముందుకు వచ్చాయి. మద్దతు అంశం పరిశీలిస్తామని బహిరంగంగా ప్రకటనలు సైతం చేస్తున్నాయి. అయితే ఆయన ఈ విషయంలో ఆచితూచీ అడుగేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే పూర్తిగా ఆయన నిర్ణయమేనని.. అందులో తమ పాత్ర ఏదీ ఉండబోదని టీవీకే శ్రేణులు చెబుతున్నాయి. ఈ తరుణంలో.. రెండు వారాల గడువు కోరడం వెనుక వేరే ఉద్దేశం ఉండొచ్చన్న విశ్లేషణ నడుస్తోంది. ఈలోపు సమీకరణాలు ఎలాగైనా మారొచ్చని ఆయన లెక్కేస్తున్నట్లు లీకులు అందుతున్నాయి. చిన్న చిన్న పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎప్పటికైనా రిస్క్ ఉండొచ్చు. అందుకే పెద్ద చేపలకే ఆయన గాలం వేసి ఉంటారనే విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ గ్యాప్‌లో డీఎంకే లేదంటే అన్నాడీఎంకే నుంచి పలువురు బయటకు వచ్చి విజయ్‌కు మద్దతు ప్రకటించే అవకాశం లేకపోలేదు(అసలే అన్నాడీఎంకేలో ఆ అసంతృప్తుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది). ఇందుకు అవకాశం ఉండడంతోనే.. డీఎంకే, అన్నాడీఎంకేలు అప్రమత్తం అయ్యాయి. ఇవాళ చెన్నైలో ఆ పార్టీలు కీలక సమావేశాలు పెట్టుకున్నాయి. ఎమ్మెల్యేలంతా చెన్నైకు తరలి రావాలని ఆదేశించాయి. అటు నుంచి అటే వాళ్లను కూడా రిసార్ట్‌లకు తరలించవచ్చనే చర్చా అక్కడ జోరందుకుంది. మొత్తానికి విజయ్ మాస్టర్ స్ట్రోక్‌కు తమిళనాట దిగ్గజ పార్టీలు విలవిలలాడిపోతున్నాయి. -
ఊరిస్తున్న సీఎం కుర్చీ.. 108 సీట్లు వచ్చినా.. విజయకి కష్టాలే
-
విజయ్ వెంట ఎవరెవరు? ఆప్షన్స్ ఇవే
-
MGR తర్వాత.. విజయ్ రికార్డ్ TVK విజయ దుందుభి
-
విజయకి జేజేలు అయ్య.. అమ్మ.. అన్న
-
TVK సంచలనం. 50 ఏళ్ల పార్టీలను మట్టి కరిపించిన విజయ్
-
హాట్ న్యూస్: ఎన్డీయే కూటమితో విజయ్ పొత్తు!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు తేదీ దగ్గర పడుతున్న వేళ.. తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. డీఎంకే-అన్నాడీఎంకే-టీవీకే పార్టీలు ఇవాళ వరుస మీటింగ్‌లు పెట్టుకున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత సమీకరణాలు మారుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా అభివర్ణించిన టీవీకే అధినేత విజయ్.. ఇప్పుడు అదే ఎన్డీయే కూటమితో పొత్తుకు చేయి చాస్తాడా? అనే చర్చ జోరుందుకుంది. తమిళనాడులో డీఎంకే పార్టీదే మళ్లీ అధికారమని ఎగ్జిట్ పోల్స్‌లో ఎక్కువ సర్వేలు తేల్చి చెప్పాయి. ఒకటి రెండు మాత్రం అన్నాడీఎంకేకు అధికారం దక్కవచ్చని చెప్పాయి. యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం టీవీకే ప్రభంజనం తప్పదని.. ఆ పార్టీ ఏకంగా అధికారం కైవసం చేసుకుంటుందని చెప్పింది. అయితే మిగతా సర్వేలు మాత్రం విజయ్ పార్టీ డబుల్ డిజిట్‌ను కైవసం చేసుకోవచ్చని అంచనా వేశాయి. ఈ తరుణంలో.. విజయ్ పార్టీలో జోష్ కనబడుతోంది. సర్వేలు అంచనా వేసినట్లు.. నిజంగానే ఫలితాల్లో టీవీకే జోరు కొనసాగుతుందా? అనే చర్చ నడుస్తోంది. ఈ తరుణంలోనే పొత్తుల సమీకరణాలు తెర మీదకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఎన్డీయే కూటమిలో ఉన్న అన్నాడీఎంకేతో పవర్‌షేరింగ్ కోసం విజయ్ చేతులు కలపబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఒకవేళ నిజంగా అదే జరిగితే.. తమిళ రాజకీయాల్లో విజయ్ నిర్ణయం సంచలనమనే చెప్పొచ్చు.వాస్తవానికి ఎన్నికలకు ముందు విజయ్ ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. అధికారంలో భాగం కోరుకునే పార్టీలను తాము ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో చిన్నచిన్న పార్టీల నేతలతో పాటు అన్నాడీఎంకేలో అసంతృప్తితో ఉన్న కీలక నేతలు కూడా టీవీకే వైపు మొగ్గు చూపించారు. చివరకు అధిష్టానం జోక్యంతో వాళ్లంతా మెత్తబడ్డారు. మరోవైపు టీవీకే కూడా అన్నాడీఎంకేతో పొత్తు ప్రయత్నాలు ఏనాడూ చేసింది లేదు. అయినప్పటికీ.. బీజేపీ, కాంగ్రెస్‌లు విజయ్‌తో పొత్తు కోసం ఉవ్విళ్లూరాయి. సరిగ్గా అదే టైంలో TVK–AIADMK కలిసి పని చేస్తాయంటూ ఓ ప్రచారం ఉధృతంగా జరిగింది. ఇది ఇరు పార్టీల శ్రేణుల్లో గందరగోళానికి దారి తీయడంతో.. అలాంటిదేం ఉండబోదని కీలక నేతలు స్పష్టత ఇచ్చారు. అయితే.. ఇప్పుడు కూడా అలాంటిదేం ఉండబోదని.. ఎగ్జిట్‌పోల్స్ తర్వాత మీడియా అత్యుత్సాహం, టీఆర్పీ మోజుతోనే కొత్త ఊహాగానాలు తెరపైకి వచ్చి ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారం కోసం బీజేపీతో పొత్తులో ఉన్న అన్నాడీఎంకేతో విజయ్ పొత్తుకు వెళ్తారా? అనేది ఇప్పటికైతే అనుమానామే. -
విజయ్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అన్నాడీఎంకే వ్యూహం..!
-
తమిళనాడులో భారీగా ఎన్నికల పోలింగ్
తమిళనాడులో నేడు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. కట్టుదిట్టమైన పోలీస్ భద్రత నడుమ ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది.. -
నేడే తమిళనాడు సమరం
సాక్షి, చెన్నై: వరుసగా రెండోసారి విజయం దక్కించుకోవాలని ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్... ఐదేళ్ల క్రితం దూరమైన అధికారాన్ని తిరిగి హస్తగతం చేసుకోవడానికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి... తొలి పోటీలోనే సత్తా చాటాలని సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్ తహతహలాడుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమయ్యింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాల్లో ఒకే విడతలో జరిగే ఓటింగ్‌లో 5.73 కోట్ల మంది ఓటర్లు 4,023 మంది అభ్యర్థుల తలరాతలను నిర్దేశించబోతున్నారు. ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యే పోటీ నెలకొన్నప్పటికీ విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) గణనీయమైన ప్రభావం చూపడం తథ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విజయ్ పార్టీ ఏ కూటమి ఓట్లను చీలుస్తుంది? లాభపడేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎన్నికల సర్వేలు స్టాలిన్ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేయడం గమనార్హం. డీఎంకే–కాంగ్రెస్ కూటమి 40.1 శాతం ఓట్లతో 181 నుంచి 189 స్థానాలు గెల్చుకోనున్నట్లు సర్వేలు తెలిపాయి. అన్నాడీఎంకే–బీజేపీ కూటమి 29 శాతం ఓట్లతో 38 నుంచి 42 సీట్లు సాధిస్తుందని వెల్లడించాయి. విజయ్ పార్టీ టీవీకే 23.9 శాతం ఓట్లతో 8 నుంచి 10 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేశాయి. యువ ఓటర్లకు గాలం ఎన్నికల్లో ప్రధాన పార్టీలు యువత ఓట్లపై గురిపెట్టినట్లు స్పష్టమవుతోంది. అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని హామీ ఇచ్చాయి. దేశ విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు రప్పిస్తామని పేర్కొన్నాయి. తమ ఎన్నికల ప్రణాళికలో ఈ అంశానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోపాటు స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు ప్రకటించాయి. యువత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వీలుగా వడ్డీ లేని రుణాలు అందజేస్తామని వెల్లడించాయి. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అన్నాడీఎంకే హామీ ఇవ్వడం విశేషం. దళపతి విజయ్ యువ ఓటర్లనే నమ్ముకున్నారు. ఆయన సభలకు యువత పోటెత్తారు. విజయ్ అభిమానుల్లో యువత, మహిళలు అధికంగా ఉండడం ఆయనకు అనుకూలాంశంగా మారింది. అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 చొప్పున అందజేస్తామని విజయ్ హామీ ఇవ్వడం ఆకట్టుకుంటోంది. నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం పలు పథకాలు ప్రకటించారు. యువతకు చేరువకావడానికి పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేశాయి. తొలిసారి ఓటర్లు 14.59 లక్షల మంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. చివరి నిమిషంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా అధికారులు నిఘా ముమ్మరం చేశారు. రాష్ట్రంలో మొత్తం 5.73 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 2.93 కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులు, 7,728 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు తమిళనాడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అర్చనా పటా్నయక్ తెలిపారు. 14.59 లక్షల మంది యువ ఓటర్లు తొలిసారిగా ఓటు వేయబోతున్నట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75,064 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోసం 1,06,418 బ్యాలెట్ యూనిట్లు, 75,064 కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాలు సిద్ధం చేసినట్లు ప్రకటించారు. ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తితే ఓటింగ్‌లో జాప్యం జరగకుండా అదనపు యంత్రాలను సమకూర్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 249 మోడల్ పోలింగ్ స్టేషన్లు, పూర్తిగా మహిళలే నిర్వహించే 325 పింక్ స్టేషన్లు, దివ్యాంగులు నిర్వహించే 71 పోలింగ్ స్టేషన్లు, యువత నిర్వహించే 29 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టంచేశారు. 83,875 మంది స్థానిక పోలీసులతోపాటు 300 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలను మోహరించినట్లు వివరించారు. ఎన్నికల్లో అక్రమాలను చాలావరకు అరికట్టామని, ఇప్పటిదాకా స్వా«దీనం చేసుకున్న వస్తువుల విలువ రూ.1,262 కోట్లకు చేరిందని, అందులో నగదు, ఇతర సామగ్రి విలువ రూ.543 కోట్లు అని అర్చనాపట్నాయక్ తెలియజేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 163 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు పేర్కొన్నారు. విదేశాల నుంచి రాక తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు స్వరాష్ట్రానికి తరలివచ్చారు. గత రెండు రోజుల్లో చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి విమానాశ్రయాలకు పది వేల మందికి పైగా తరలిరావడం విశేషం. ఓటింగ్ ప్రక్రియను స్వయంగా తిలకించడానికి కొందరు విదేశీయులు సైతం వచ్చారు. -
తమిళ పార్టీలకు చిక్కని ఓటరు నాడి
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ద్రవిడవాదం తమిళ ప్రజల గుండెల్లో పాతు కుపోయింది. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) ఆ నినాదం దన్నుతోనే ఒకరి తర్వాత మరొకరు అధికారంలోకి వస్తున్నారు. దివంగత సీఎంలు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత బాటలోనే ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కె.స్టాలిన్ కూడా ద్రవిడ సిద్ధాంతమే ప్రధానాస్త్రంగా అధికారాన్ని నిలుపుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.స్టాలిన్ మహా మెగా కూటమిజయలలిత మాదిరిగా వరుసగా తమిళనాట రెండోసారి విజయం సాధించిన ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిలుస్తారా అన్నది ఈసారి ఆసక్తికరమైన అంశంగా మారింది. ఎన్నికలను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్, డీఎండీకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ వంటి 21 పార్టీలతో మహా మెగా కూటమికి తెర తీశారు. స్టాలిన్‌తో పాటు డిప్యూటీ సీఎం ఉదయనిధి తదితరులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ద్రావిడ మోడల్ 2.0 పాలన నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహిణులకు రూ.1,000 ప్రోత్సాహం వంటి పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్న వైనాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈసారి గెలిపిస్తే రూ.8,000 విలువైన కూపన్లు తదితర హామీలతో మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. అయితే అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కంటే కొత్తగా బరిలో దిగిన సినీ నటుడు జోసెఫ్ విజయ్ డీఎంకేకు గుబులు పుట్టిస్తున్నారు. ఆయన ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొడతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ స్టాలిన్ వదులుకోవడం లేదు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణను అందివచ్చిన అస్త్రంగా వాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. లోక్‌సభ స్థానాల పెంపులో తమిళనాడుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయనుందంటూ ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై కేంద్రంతో ఢీ అంటే ఢీ అనడం ద్వారా ప్రధాని మోదీని ఎదుర్కొంటున్న నేతగా నిలిచే ప్రయత్నంలో పడ్డారు. మైనారిటీ ఓట్లు కూడ ఎంతో కొంత గట్టెక్కిస్తాయని డీఎంకే నమ్ముతోంది.అన్నా కూటమి ఆపసోపాలుఅన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలన్నీ పెట్టుకుంది. బీజేపీతో పాటు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, అన్బుమణి రాందాసు నేతృత్వంలోని పీఎంకే, జికే వాసన్ సారథ్యంలోని తమిళ మానిల కాంగ్రెస్ తదితర పార్టీలను కలుపుకుని పోరాడుతోంది. డీఎంకే కుటుంబ రాజకీయాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాష్ట్రంలో పేట్రేగుతున్న హింస తదితరాలను అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి ప్రధాన ప్రచారాస్త్రా లుగా మలచుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తమిళనాడులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే మాదిరిగానే అన్నాడీఎంకేకు కూడా విజయ్ పార్టీ గుబులు పట్టుకుంది. ఆయన పార్టీ అంతిమంగా ఎవరి ఓట్లు చీలుస్తోందన్నది ఆసక్తికరంగా మారింది. ఒంటరిగానే బరిలో ఉన్న మరో సినీ నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలో నామ్ తమిళర్ కట్చి కూడా ప్రధాన కూటముల ఓట్లను చీల్చేలా కన్పిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 8 శాతానికి పైగా ఓట్లు సాధించింది. ఈసారి ఏకంగా 116 మంది మహిళలకు, ఒక ట్రాన్స్‌జెండర్‌కు కూడా టికెటిచ్చింది! వీరికి తోడు జయలలిత నెచ్చెలి శశికళ పార్టీ కూడా పలు నియోజకవర్గాల్లో బరిలో ఉంది!ఓటరు నాడి ఎటో..!ఈసారి తమిళ ఓటరు నాడి ఎవరికీ అందడం లేదు! ఇప్పటిదాకా జరిగిన సర్వేలు కూడా ఈ విషయంలో ఎటూ తేల్చిచెప్పలేకపో యాయి. కాకపోతే విజయ్ పార్టీ టీవీకే కనీసం 15 నుంచి 30 స్థానాల దాకా గెలుచుకోవచ్చని పలు సర్వేల్లో తేలింది. అయితే టీవీకే ప్రధాన కూటముల్లో దేని ఓటు బ్యాంకుకు గండి కొట్టవచ్చన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు.మూడో శక్తిగా విజయ్తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాష్ట్రంలో మూడో శక్తిగా అవతరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో విజయ్‌కి ఉన్న ఆదరణనే టీవీకే నమ్ముకుంది. ఆ ఆదరణ ఏ మేరకు ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందన్నది ప్రశ్నగా మారింది. దీనికి తోడు విజయ్‌ని మినహాయిస్తే పార్టీలో పెద్దగా ప్రజాదరణ ఉన్న నేతలంటూ ఎవరూ లేకపోవడం ప్రతికూలాంశంగా కనిపిస్తోంది. టీవీకేతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా చివరికి ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోలేక పోయినా భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఎదగాలన్న భావన టీవీకేలో కనిపిస్తోంది. పార్టీలో జోష్ నింపేందుకు విజయ్ రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. యువత, మహిళల్లో డీఎంకే, అన్నాడీఎంకే ఓటు బ్యాంకుకు ఈసారి టీవీకే భారీగా గండి కొట్టవచ్చన్న విశ్లేషణలున్నాయి. -
ఎన్టీకే అభ్యర్థిగా ట్రాన్స్‌జెండర్ రోహిణి
విల్లివాక్కం నియోజకవర్గంలో రాజకీయ సమరం రసవత్తరంగా మారింది. డీఎంకే అభ్యర్థిగా పోటీలో ఉన్న అన్నానగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మోహన్ వారసుడు కార్తీక్ మోహన్‌కు విల్లివాక్కం ఓటర్లు గెలుపు కిరీటాన్ని అందించేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. అలాగే టీవీకే అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆపార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జునను ఓటర్లు ఆదరించేనా అన్న చర్చ జోరందుకుంది. ఇక, ఈ ఇద్దరి మధ్య తాను సైతం అంటూ అన్నాడీఎంకే అభ్యరి్థ, మాజీ ఎంపీ ఎస్ఆర్ విజయకుమార్ దూసుకెళ్తున్నారు. తమకూ అవకాశం ఇవ్వాలని ఎన్టీకే అభ్యర్థి రోహిణి ఓట్ల వేటలో ఉన్నారు.సాక్షి, చెన్నై : చెన్నై నగరంలో విల్లివాక్కం ఒకప్పుడు దేశంలోనే అతి పెద్ద అసెంబ్లీ స్థానం. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో డీఎంకే ఐదుసార్లు విజయఢంకా మోగించింది. అన్నాడీఎంకే రెండు సార్లు, సీపీఐ రెండు సార్లు, కాంగ్రెస్, టీఎంసీలు తలా ఓ సారి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. చెన్నై నగరం విస్తరణ పరిధిలో శరవేగంగా దూసుకెళ్తున్న ప్రాంతంగా విల్లివాక్కం ఉంది. ఐసీఎఫ్ గడ్డగా రైల్వే కారి్మకుల ఓటు బ్యాంక్, తెలుగు వారి ఓటు బ్యాంక్ అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సమరం రసవత్తరంగా సాగుతోంది. 2011 పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గం రూపురేఖలు మార్చుకుంది. ఈ పరిధిలో ఐసీఎఫ్, తిరుమంగళం, అన్నానగర్(కొంత భాగం), కెల్లీస్, ఐనావరం వంటి నగరంలో అత్యంత ముఖ్యమైనప్రాంతాలు అనేకం ఉన్నాయి. ప్రసిద్ధ రైలు పెట్టెల తయారీ కేంద్రం ఐసీఎఫ్‌తో పాటుగా సిడ్కో పారిశ్రామక వాడ, కీల్పాకం మానసిక చికిత్సాలయం వంటివి ఆధవ్ను ఆదరించేనా.. విజయ్ తమిళగ వెట్రి కళగం(టీవీకే) ఎన్నికల ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి, పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆధవ్ అర్జున ఇక్కడ పోటీ చేస్తున్నారు. యువ ఓటర్లను గురి పెట్టడమే కాదు, మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా నియోజకవర్గంలో ఆధవ్ తిష్ట వేశారు. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అదే సమయంలో గతంలో ఇక్కడ అన్నాడీఎంకే తరపున పోటీ చేసి గెలిచిన జేసీడీ ప్రభాకర్‌కు మద్దతు గణం ఇక్కడ ఉంది. తాజాగా ఆయన టీవీకేలో చేరిన దృష్ట్యా, ఆ మద్దతు తనకు కలివచ్చిందన్న ధీమాతో ఆధవ్ ఉన్నారు. టీవీకే అధినేత విజయ్ పోటీ చేస్తున్న పెరంబూరు తదుపరి ఈ విల్లివాక్కం నియోజకవర్గం ఉండటంతో తమ అధినేత చరిష్మా మరింతగా కలిసి వస్తుందన్న ధీమాతో ఆధవ్ దూసుకెళ్తున్నారు. విజయకుమార్ ఎదురీత అన్నాడీఎంకే అభ్యరి్థగా ఎస్ఎస్ఆర్ విజయకుమార్ పోటీలో ఉన్నారు. ఆయన మాజీ ఎంపీ కూడా, కూటమి బలం, పార్టీకి ఇక్కడ అనాదిగా ఉన్న రెండుకుల గుర్త మద్దతు తనను గట్టెక్కిస్తాయన్న ధీమాతో ఉన్నారు. ప్రచారంలో దూసుకెళ్లడమే కాకుండా, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు తాను ఈ పరిసరాలకు చేసిన మంచి పనులను గుర్తు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇక, సీమాన్ నాన్ తమిళర్ కట్చి( ఎన్టీకే ) అభ్యరి్థగా సామాజిక కార్యకర్త, ట్రాన్స్‌జెండర్ అయిన రోషిణిని బరిలో ఉనర్నారు.సామాజిక మార్పు కోరుకునే ఓటర్లను ఆమె ఆకట్టుకుంటున్నారు.హోరాహోరీ సమరం... విల్లివాక్కం డీఎంకే కంచుకోట. ఈ కూటమిలోని వామపక్షాలకు సైతం ఇక్కడ కారి్మక ఓటు బ్యాంక్ మరీ ఎక్కువే. అయితే ఈసారి సమీకరణాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెట్రి అళగన్కు ఈసారి డీఎంకే సీటు ఇవ్వలేదు. అన్నానగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంకే మోహన్ కుమారుడు కార్తీక్ మోహన్‌ను ఈసారి డీఎంకే రంగంలోకి దించింది. అధికార డీఎంకే కూటమి బలం, పటిష్ట ఓటు బ్యాంక్ గెలుపు కిరీటాన్ని కార్తీక్ ఓటర్లకు అప్పగించే అవకాశాలు ఎక్కువే. అదే సమయంలో ఆయన స్థానికేతరుడు అన్న ముద్ర ఉండటం సవాలుగా మారింది. యువకుడైన కార్తీక్‌ను గెలిపించేందుకు ఓ వైపు ఆయన తండ్రి మోహన్, మంత్రి శేఖర్‌బాబుతో పాటూ చెన్నై మేయర్ ఆర్ ప్రియ ఉరకలు తీస్తున్నారు. ఇక, కార్తీక్ కోసం స్వయంగా సీఎం స్టాలిన్ అల్లుడైన శబరీషన్ సైతం రంగంలోకి దిగి వ్యూహాలకు పదును పెట్టడం గమనార్హం.ఓటరు ఎటో ఈ నియోజకవర పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ 76947 పురుçషులు, 82785 మహిళలు, 32 మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 1,59,765గా ఉంది. వన్నియర్, నాయుడు , ఆది ద్రావిడ సామాజిక వర్గాల ఓట్లు కూడా ఇక్కడ కీలకం. వీరితో పాటు ముదలియార్ , నాడార్ ఓట్లు కూడా గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. డీఎంకే వారసత్వ రాజకీయాల పై వ్యతిరేకత అన్నది ఇక్కడ పనిచేస్తుందా లేక సంక్షేమ పథకాలు కాపాడుతాయా?, అన్నాడీఎంకే పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుందా? లేక విజయ్ పార్టీ ’విజిల్’ కొత్త చరిత్ర సృష్టిస్తుందా? అన్నది ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. -
బీజేపీకి ఝలక్.. ఎన్నికల వేళ ట్విస్ట్ ఇచ్చిన అన్నామలై!
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. అన్నాడీఎంకేతో సీట్లు సర్దుబాటు విషయమై రాష్ట్ర బీజేపీ మాజీ సారథి కె.అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇందుకు నిరసనగా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్టు వార్తలొస్తున్నాయి.ఈ మేరకు కేంద్ర నాయకత్వానికి అన్నామలై ఇప్పటికే లేఖ కూడా రాశారు. బీజేపీ సులువుగా గెలవగలిగే కినతుకడవు వంటి స్థానాలను అన్నాడీఎంకే అట్టిపెట్టుకోవడంపై అందులో తీవ్రంగా ఆక్షేపించారు. కినతుకడవు నుంచి బీజేపీ పోటీ చేయకపోవడాన్ని నిరసిస్తూ నియోజకవర్గంలో పలుచోట్ల ఆ పార్టీ శ్రేణులు రెండు రోజులుగా ఆందోళనకు కూడా దిగుతున్నాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే 169, బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎన్డీయేలోని ఇతర భాగస్వాములు పీఎంకేకు 18, ఏఎంఎంకేకు 11 స్థానాలు దక్కాయి. బీఎల్ సంతోష్‌కు ఝలక్..ఇదిలా ఉండగా.. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ గురువారం చైన్నెలో నిర్వహించిన సమావేశానికి అన్నామలై గైర్హాజరు కావడం చర్చకు దారి తీసింది. గురువారం బీఎల్ సంతోష్ నేతృత్వంలో బీజేపీరాష్ట్ర కమిటీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో మాజీ అధ్యక్షుడు అన్నామలై పాల్గొన లేదు. తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదన్న లేఖను ఆయన పార్టీ అధిష్టానానికి పంపించడం చర్చకు దారి తీసింది. ఆయన కోయంబత్తూరులోని సింగానల్లూరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధమై, గత కొంత కాలంగా తన దృష్టిని కేంద్రీకరించారు. అయితే ఆ స్థానాన్ని అన్నాడీఎంకే నుంచి రాబట్టడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారు. దీంతో తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదని అధిష్టానానికి అన్నామలై లేఖ పంపించడం చర్చకు దారి తీసింది. ఆయన ఎన్నికలలో పోటీ చేయాలని మహిళా నేత, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ పిలుపు నిచ్చినా ఆయన స్పందించక పోవడం గమనార్హం.ఢిల్లీకి అభ్యర్థుల జాబితా27 మంది అభ్యర్థుల ప్రాథమిక జాబితాను సిద్ధం చేసి ఢిల్లీకి పంపించినట్టు సమాచారం. ఇందులో అవినాశి–కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, మైలాపూర్– మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కోయంబత్తూరు నార్త్– ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్, నాగర్‌కోయిల్– మాజీ కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, సాత్తూరు– బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, తళి – అమరప్రసాద్ రెడ్డి, తిరుప్పూర్ సౌత్ – ఎ.పి. మురుగానందం, విలవంకోడ్ – విజయధరణి, మదురై సౌత్–రామ శ్రీనివాసన్, తిరువణ్ణామలై– అశ్వత్థామన్, తంజావూరు– కరుప్పు మురుగానందం, మొడకురిచ్చి –కృతికా శివకుమార్, పుదుక్కోట్టై– రామచంద్రన్..రామనాథపురం– జి.పి.ఎస్. నాగేంద్రన్,రాశిపురం– డాక్టర్ ప్రేమ్ కుమార్,వాసుదేవనల్లూర్ – ఆనందన్ అయ్యాస్వామి, ఆవడి– అశ్విన్, ఊటి– భోజ రాజన్ లేదా ఉమాదేవి, గంధర్వకోట్టై – పురట్చి కవి దాసన్, తిరుపత్తూరు– చోళ పళనిస్వామి, అరంతంగి– కవిత శ్రీకాంత్, రాధాపురం– బాలకృష్ణన్, తిరువారూర్ – శివ, మనమదురై– పొన్పాల గణపతి, తిరుచెందూర్– ఆర్.ఎం. రాధాకృష్ణన్, పద్మనాభపురం– ఎడ్విన్ జోస్,కులచల్– శివకుమార్ పేర్లు ఉన్నాయి. సుమారు 20 మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తూ సిద్ధం చేసిన జాబితాను ఢిల్లీ ఆమోదంతో రెండు రోజులలో ప్రకటించనున్నారు. -
‘మాయ’ఫెస్టోలు!
రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా విడుదల చేసే మానిఫెస్టోలు ఆర్థిక, రాజకీయ, సామాజిక సమసల్యపై వాటి వైఖరిని తేటతెల్లం చేయాలి. ఆ క్రమంలో వాగ్దానాలుంటే ఉండొచ్చు. కానీ చాలా పార్టీలకు గెలుపే లక్ష్యంగా అసంబద్ధమైన, ఆచరణ సాధ్యంకాని హామీలు గుప్పించి ఓటర్లను మాయచేసి అధికారంలోకి రావాలనే యావ తప్ప మరేమీ ఉండటం లేదు. ఈమధ్యే సుప్రీంకోర్టు ఎన్నికల ముందు ఓటర్లను ఆకర్షించటానికి పార్టీలు చేసే వాగ్దానాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీస్తాయన్నది. అయితే రాజ్యాంగ ఉల్లంఘనలు లేనంత కాలమూ వాటిలో జోక్యం చేసుకోవటం సాధ్యం కాదని తెలిపింది. ఈ విషయంలో చట్టం చేయటం ప్రభుత్వాల బాధ్యతేనని తేల్చిచెప్పింది. నిజానికి అతిగా వాగ్దానాలు చేయటం ఎన్నికల రంగంలో ఉండాల్సిన సమానావకాశాలను దెబ్బతీయడం కిందికి వస్తుంది. అన్నా డీఎంకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన మానిఫెస్టో గత రికార్డులను తలదన్నింది. అందులో 2.22 కోట్లమందికి ఉచితంగా రిఫ్రిజిరేటర్లు పంచడం, వ్యవసాయ రుణాల మాఫీ, అన్ని కుటుంబాలకూ ‘కారుణ్య భత్యం’ కింద రూ. 10,000 చొప్పున ఇవ్వటం, మహిళలతో పాటు మగవారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం, ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం వగైరాలున్నాయి. అధికార డీఎంకే ఇప్పటికే రెండు దఫాలుగా 1.31 కోట్లమంది మహిళల ఖాతాల్లోకి రూ. 8,000 చొప్పున బదిలీ చేసింది. తిరిగి అధికారంలోకొచ్చాక నెలకు రూ.2000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది.జన సంక్షేమాన్ని ఉద్దేశించి చేసే వాగ్దానాలకూ, సహేతుకత లేని ఉచితాలకూ వ్యత్యాసం ఉంటుంది. ఎన్నికల ముందు వాగ్దాన కర్ణులుగా మారడం, తీరా అధికారం రాగానే వాటిని మరిచి, ప్రశ్నించినవారిని బెదిరించటం అలవాటైపోయింది. ఈ ధోరణి ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్లుగా బాహాటంగా కనబడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 ఎన్నికల్లో ఇంటికొక కలర్ టీవీతో మొదలుపెట్టి చంద్రబాబు ఇచ్చిన హామీలకు లెక్కే లేదు. 2011లో డీఎంకే, అన్నాడీఎంకే పోటాపోటీగా చేసిన వాగ్దానాలు వేలంపాటల్ని తలపించాయి. ఇక 2014లో మరోసారి ఏపీలో చంద్రబాబు మహా వాగ్దాన కర్ణుడి అవతారం ఎత్తారు. ఆ హామీల గురించి అడిగేవారు ఎక్కువవుతుండటంతో అధికారంలోకొచ్చిన కొన్నాళ్లకే మేనిఫెస్టోను కాస్తా పార్టీ వెబ్సైట్ నుంచి తొలగించారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీల గతి ఎలావుందో కనబడుతూనే ఉంది. ఇందుకుభిన్నంగా 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ మానిఫెస్టో ఆచరణ సాధ్యమైన హామీలనే పొందుపరిచింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరిట ఇచ్చిన హామీల అమలు సంగతి అందరికీ గుర్తుండేలా సెక్రటేరియట్లో ప్రముఖంగా కనబడేలా అమర్చారు. ఫలితంగా 99 శాతం హామీలు నెరవేరాయి. సంక్షేమ రాజ్యంలో పేదవర్గాలకు విద్య, వైద్యం, ఆహారం అందుబాటులో ఉండేలా చూడటం రాజ్యం కర్తవ్యం. అందుకే వాటిని నెరవేరుస్తామంటే ఎవరూ అభ్యంతర పెట్టరు. వీటితోపాటు ఆ వర్గాలు స్వశక్తిపై ఎదిగేందుకు అనువైన పథకాల రూపకల్పన వైపు ప్రభుత్వాలు దృష్టి సారించాలి. కానీ మానిఫెస్టోలంటే వేలం వెర్రిగా మారింది. కలర్ టీవీలు, గ్రైండర్లు ఇస్తామనటం నుంచి ఏకంగా రిఫ్రిజిరేటర్లు ఉచితంగా పంచిపెడ తామనే వరకూ వచ్చింది. గెలిచి అధికారంలోకొచ్చాక ఇవ్వలేకపోతే లేదా ఏవో సాకులు చూపి కొంతమందికే పరిమితం చేస్తే వీటిని న్యాయస్థానాలు ప్రశ్నించజాలవన్న ధైర్యమే పార్టీలకు ఇలాంటి బూటకపు వాగ్దానాలు చేసే సాహసాన్నిస్తోంది.పార్టీలు విడుదల చేసే మానిఫెస్టోలను నమ్మడం ‘న్యాయబద్ధమైన ఆశ’గా పరిగణించలేమనీ, కనుక వాటిని నెరవేర్చాలని ప్రభుత్వాలను ఆదేశించటం సాధ్యం కాదనీ 1995లో ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. అలాగే 2013లో తమిళనాడుకు చెందిన పౌరుడు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ వాగ్దానాలు చేసి, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన పార్టీకి మానిఫెస్టో హామీలను అమలు చేయాలంటూ ఆదేశాలివ్వజాల మని తెలిపింది. అయితే ఈ విషయంలో కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. అటుతర్వాత అవి రూపొందినా రాజకీయ పక్షాలపై వాటి ప్రభావం శూన్యం. కనుక మోసగాళ్లెవరో, నిజాయితీపరులెవరో... ఎవరు జవాబుదారీ తనంతో ఉంటారో గ్రహించటం ప్రజల కర్తవ్యం. -
పొసగని పొత్తులతోనే పోరాటం
తమిళనాడు శాసనసభకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరుగనున్నాయి. కొన్ని దశాబ్దా లుగా రాష్ట్రం ద్విముఖ పోటీలనే చవి చూస్తూ వచ్చింది. ఇపుడు మూడవ గణనీయమైన పార్టీ ప్రవేశంతో ఎన్నికలు ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. సినీ నటుడు విజయ్ రాజకీయ బరిలోకి దిగడంతో ఆయనకు విజయావకాశాలు ఎంతవరకు ఉంటాయన్న దానిపై ఎక్కువగా చర్చలు సాగుతున్నాయి. రాజకీయ అనుభవం సంపాదించడానికి కాక, ఏకంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకే బరిలోకి దిగుతున్నట్లు విజయ్ స్పష్టం చేశారు. విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళగం (టీవీకే)ను జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్డీయే) లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన అన్నా డీఎంకే ఆయన డిమాండ్లు చూసి ఖంగుతింది. జన నాయకుడు కాగలడా?బీజేపీ 2024 లోక్ సభ ఎన్నికలలో కన్నా మెరుగైన ఫలితాలను కోరుకుంటోంది. అన్నా డీఎంకేతో పొత్తు ఏదో ఒరగబెట్టగలదనే ఆశ బీజేపీకే లేదు. కానీ టీవీకే ఆగమనం ఈ కూటమికి ఇపుడు లేని ఆధి క్యాన్ని తెచ్చిపెట్టగలదు. ఎన్నికల ప్రచార ఖర్చులు రూ. 40 లక్షలు మించకూడదని ఎన్నికల కమిషన్ నిర్దేశిస్తోంది. వాస్తవంలో, రూ. 5 కోట్లు అవసరమవుతాయని అంచనా. టీవీకే అభ్యర్థులలో కొందరికి అంత స్తోమత లేదని ఇటీవల జరిగిన ఆ పార్టీ సమావేశంలో చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. ఫలితంగా, ఏదైనా పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, దాని పైన కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని అంటున్నారు. విజయ్ గతంలో బీజేపీని తన ‘సైద్ధాంతిక శత్రువు’గా అభివర్ణించారు. హిందుత్వ పార్టీతో పొత్తు పెట్టుకుంటే, క్రైస్తవ, ముస్లిం మైనా రిటీల ఓట్లకు గండిపడవచ్చని ఆయన సందేహిస్తున్నారు. ఆయన అనుయాయుల్లో ఆ రెండు వర్గాలవారే ఎక్కువగా ఉన్నట్లు చెబు తున్నారు. టీవీకే వచ్చి చేరడం పట్ల అన్నా డీఎంకేకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను అది చీలుస్తుందని దానికి తెలుసు. అయినా టీవీకే తనకు కూడా గ్రహణం పట్టిస్తుందే మోనని అన్నా డీఎంకే లోలోపల ఆందోళన చెందుతోంది. సినిమాలలో మాదిరిగానే ప్రత్యర్థుల దుమ్ము దులిపి ‘జన నాయగన్’ అనిపించుకోవాలని ఆయన ఉవ్విళ్ళూరుతున్నారు. ఎన్ని కల బరిలో నిలిచిన అభ్యర్థి హీరోగా నటించిన సినిమా విడుదల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం అవుతుందా? ఇది ఎన్నికల కమిషన్‌కు ఎదురవుతున్న ప్రశ్న. రెండు ద్రవిడ కూట ములలో విజయ్ దేనిని దెబ్బతీస్తారనే దానిపైనే దాని జవాబు ఆధారపడి ఉంటుందని గత కొద్ది ఏళ్ళ చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. చిత్ర దర్శకుడు సీమాన్ కూడా నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) పేరుతో ఒక చిన్న తమిళ జాతీయవాద పార్టీని ఇదివరకే ప్రారంభించారు. దాని ఓట్ల శాతం క్రమంగా వృద్ధి చెందుతూ వస్తోంది. విజయ్ రాకతో ఎక్కువ దెబ్బతినేది ఆ పార్టీయేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యుద్ధం స్టాలిన్‌తోనే!అభిమానులు దళపతిగా పిలుచుకునే విజయ్ తన విమర్శ నాస్త్రాలన్నింటినీ పాలక డీఎంకే పైన, దాని నాయకుడు, ముఖ్య మంత్రి ఎం.కె. స్టాలిన్ పైన మాత్రమే ఎక్కుపెడుతున్నారు. విజయ్ 2025 సెప్టెంబర్‌లో కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఆ ఘటన తర్వాత ఆయన కొద్ది బహిరంగ సభలలోనే పాల్గొన్నారు. కానీ, ఆ తర్వాత, ఏ బహిరంగ సభలో మాట్లాడినా ఆయన ఎన్నికల ‘యుద్ధం’ తనకూ, స్టాలిన్‌కూ మధ్యనేనని చెబుతూ వస్తున్నారు. పాలకడీఎంకే పాల్పడినట్లు చెబుతున్న అవినీతి, దుష్పరిపాలనను తొల గించగల వ్యక్తిగా విజయ్ తనను తాను చాటుకుంటున్నారు. పెరి యార్, కె. కామరాజ్, సి.ఎన్. అన్నాదురై, ఎమ్జీఆర్ల సిసలైన వారసుడిని తానేనని చెప్పుకుంటున్నారు. ఆయన అన్నా డీఎంకే ప్రస్తావనే తీసుకురావటం లేదు. తన ‘సైద్దాంతిక శత్రువు’ను కూడా విమర్శించడం లేదు. తమిళ నాడు నాయకత్వాన్ని కోరుకుంటున్నా, ఇంతకూ రాష్ట్రానికి సంబంధించి విజయ్ ప్రణాళికలేమిటో స్పష్టం కాలేదు. మీడియా ఇంటర్వ్యూలకు కూడా ఆయన దూరంగాఉంటున్నారు. స్టాలిన్ మాత్రం తన వంతుగా, అభివృద్ధికి సంబంధించి ‘ద్రావిడ నమూనా’ను పరిరక్షించుకునేందుకు సాగుతున్న నిర్ణయా త్మక పోరాటంగా ఈ ఎన్నికలను అభివర్ణిస్తున్నారు. కేంద్రం నుంచి ఒత్తిడులను ఎదుర్కొంటూ కూడా, ‘డబుల్ ఇంజిన్’ సర్కారు ఉన్న రాష్ట్రాలకన్నా తమిళనాడు మెరుగైన పనితీరును కనబరచిందని ఆయన చెబుతున్నారు. అయినా ఆయన దేనినీ తేలికగా తీసు కోవడం లేదు. ఇతర రాష్ట్రాల్లో మాదిరి కాకుండా, తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేకత ప్రతి ఐదేళ్ళ కొకసారి పొడసూపుతూఉంటుంది. జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే మాత్రమే గత దశాబ్దంలో ఒకేసారి 2016లో వరుసగా రెండవ విడత విజయాన్ని నమోదు చేసుకోగలిగింది. అన్నా డీఎంకే గురించి విజయ్ ఎలా ప్రస్తావించడం లేదో, అలాగే స్టాలిన్ కూడా విజయ్ పేరును ఎత్తడం లేదు. విజయ్‌పై ధ్వజమెత్తే పనిని ఆయన పార్టీలోని ఇతరులకు వదిలేశారు. కానీ, కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత కూడా, ఆయన జన సమ్మోహక శక్తి తరగక పోవడంతో డీఎంకే ఆందోళనకు లోనవుతోంది. పైగా, ప్రధాన మిత్రపక్షమైన కాంగ్రెస్‌తో డీఎంకే సంబంధాలు గత ఎన్నిక లప్పుడున్నంత బలంగా లేవు. సీట్ల పంపంకంపై అవి బాహాటంగానే కీచులాడుకున్నాయి.అన్నా డీఎంకే అంతంతే!ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకే పాత్ర కుంచించుకుపోయినట్లుగా కనిపిస్తోంది. దాని కూటమిలో బీజేపీతో పాటు టి.టి.వి. దినకరన్ కూడా ఉన్నారు. జయలలితకు సన్నిహితురాలైన శశికళకు ఆయన మేనల్లుడు. కాగా, శశికళ సొంత కుంపటి ఉండనే ఉంది. ఆమె పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో అన్నా డీఎంకేను చికాకు పరచగలదని భావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, అంతో ఇంతో పలుకుబడి కలిగిన ఒ.పన్నీర్ సెల్వం కూడా అన్నా డీఎంకేను వీడి డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. మహారాష్ట్ర, బిహార్ వంటి రాష్ట్రాల్లో కాషాయ పార్టీతో జత కట్టిన ప్రాంతీయ పార్టీలు ఎటువంటి ఫలితాలు సాధించిందీ పార్టీ నాయకుడు ఎళప్పాడి పళనిస్వామి గమనించకపోలేదు. అన్నా డీఎంకే కూటమిలో కెమిస్ట్రీ లోపించిందని తెలుస్తూనే ఉంది. మొత్తం 234 మంది సభ్యులు గల అసెంబ్లీలో 2021 ఎన్నికల్లోడీఎంకే 133 సీట్లు సాధించింది. డీఎంకేను ఎన్డీయే ఓడించలేక పోయినా, మహా అయితే, హంగ్ అసెంబ్లీ ఏర్పడే విధంగా, డీఎంకే కూటమికి చిల్లు పెట్టవచ్చు. ఎన్డీయేతో కలిసో లేదా కలవకుండానో విజయ్ తన వంతు పాత్ర తాను పోషిస్తారు. విజయ్ ‘రాజు కాలేరు. రాజుగా ఎవరినో కూర్చోపెట్టనూ లేరు. ఓట్లను చీలుస్తారంతే’ అని తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ పీయూష్ గోయల్ అందుకే వ్యాఖ్యానించినట్లుంది!-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్-నిరుపమా సుబ్రమణియన్ -
తమిళనాట ఎన్డీఏ డీల్ ఖరారు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23వ తేదీన జరిగే ఎన్నికలకు ఏఐఏడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నడుమ సీట్ల పంపిణీ దాదాపు ఖరారైంది. బీజేపీ సహా భాగస్వామ్య పార్టీలకు 56 సీట్లను కేటాయించేందుకు ఇచ్చేందుకు పళని స్వామి సారథ్యంలోని ఏఐఏడీఎంకే అంగీకరించింది. దీని ప్రకారం..బీజేపీ 27, పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) 18, ఏఎంఎంకే 11 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపనున్నాయి. ఏఐఏడీఎంకే ఎన్ని స్థానాల్లో పోటీ చేసేదీ త్వరలోనే ప్రకటిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పళనిస్వామి తెలిపారు. మరికొన్ని భాగస్వామ్య పార్టీలతో సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. సోమవారం ఏఐఏడీఎంకే ప్రధాన కార్యాలయంలో బీజేపీ నేత పీయూష్ గోయల్, పీఎంకే నేత అన్బుమణి రాందాస్, ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్‌లతో కలిసి పళనిస్వామి మీడియాతో మాట్లాడారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తమ పార్టీ ఏఐఏడీఎంకే పోటీ చేసే సీట్ల సంఖ్యపైనా త్వరలో స్పష్టత వస్తుందని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ సారథ్యంలోని తమిళ మానిల కాంగ్రెస్(మూపనార్), ఇందియ జననాయగ కట్చి(ఐజేకే)లతో సంప్రదింపులు కొనసాగుతున్నాయన్న పళనిస్వామి..ఆయా పార్టీలతో త్వరలోనే ఒప్పందం ఖరారవుతుందని స్పష్టం చేశారు. 234 సీట్లకు గాను తమ కూటమి కనీసం 210 చోట్ల గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
ముక్కోణపు పోరు
ఇటు కాంగ్రెస్ తదితర పార్టీలతో కూడిన అధికార డీఎంకే కూటమి. అటు బీజేపీ–అన్నాడీఎంకేల విపక్ష కూటమి. మరోవైపు కొత్తగా దూసుకొచ్చిన సినీ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే. దాంతో తమిళనాడులో ఈసారి అత్యంత ఆసక్తికరమైన ముక్కోణపు పోరుకు రంగం సిద్ధమైంది. ముఖ్యంగా డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ నాయకత్వ పటిమకు ఈ అసెంబ్లీ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. దశాబ్దాలుగా తనకు ఏ మాత్రమూ కొరుకుడు పడని తమిళ గడ్డపై ఎలాగైనా కాషాయ జెండా పాతాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ప్రజల్లో, ముఖ్యంగా యువత, మహిళల విశేషమైన ఆదరణ కచి్చతంగా ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందని విజయ్ భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అన్నా కూటమిని, విజయ్ పార్టీని స్టాలిన్ ఏ మేరకు నిలువరిస్తారన్నది ఆసక్తికరం. మరోసారి అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా బరిలో దిగుతున్న సీమన్ సారథ్యంలోని ఎన్టీకే ఎవరి ఓటు బ్యాంకును చీలుస్తుందన్నది కూడా కీలకంగా మారనుంది...డీఎంకే కూటమికి... మోదమో, ఖేదమో! తమిళనాడులో ఈసారి అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగనుంది. అన్నాడీఎంకే కూటమితో పాటు కొత్త పార్టీ టీవీకే నుంచి గట్టి పోటీ తప్పదని తేలిపోవడంతో అధికార డీఎంకే సర్వశక్తులూ ఒడ్డుతోంది. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (ఎస్పీఏ) పేరిట కాంగ్రెస్, వామపక్షాలతో పాటు దాదాపు 20 పార్టీలతో మరోసారి జట్టు కట్టి ఎన్నికల బరిలోకి దిగుతోంది! కాంగ్రెస్, ఎండీఎంకేతో పాటు విజయ్‌కాంత్ స్థాపించిన డీఎంఎంకేలతో సీట్ల సర్దుబాటు ఇప్పటికే పూర్తయింది. ఎప్పట్లా ద్రవిడ నినాదంతో పాటు ప్రధానంగా సంక్షేమ పథకాలనే స్టాలిన్ పార్టీ నమ్ముకుంటోంది. విద్యార్థులకు ఉచిత అల్పాహారం, మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం తదితర పథకాలే తమను ఒడ్డున పడేస్తాయని భావిస్తోంది. దీనికి తోడు తమిళ అస్తిత్వం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీతో తలపడుతున్న యోధునిగా స్టాలిన్‌కు ఉన్న ఇమేజీ కూడా కలిసొస్తుందని ఆశిస్తోంది. ముస్లింలు, మైనారిటీల ఓట్లపైనా ఆశలు పెట్టుకుంది. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేకత, మంత్రుల విచ్చలవిడి అవినీతి, రాష్ట్రంలో పెచ్చరిల్లుతున్న నేరాలు, డ్రగ్స్ వంటివి డీఎంకేకు పెద్ద తలనొప్పిగా మారాయి. కుటుంబ రాజకీయాల ముద్ర కూడా ప్రతికూలంగా మారుతుందేమోనన్న భయం డీఎంకేను వెంటాడుతోంది. దీనికి తోడు సీమన్ పార్టీ నామ్ తమిళార్ కట్చి (ఎన్టీకే) కూడా స్టాలిన్ పార్టీకి తలనొప్పిగా మారేలా ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీకే సీట్లేమీ గెలుచుకోకపోయినా 6 శాతం ఓట్లు సాధించింది. దాని ఓటు షేరు ఈసారి 10 నుంచి 15 శాతానికి పెరగవచ్చని పలు సర్వేలు చెబుతున్నాయి! ఎన్టీకే ప్రధానంగా డీఎంకే ఓటు బ్యాంకుకే గండి కొట్టవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఆ అంచనాలే గనక నిజమైతే ముక్కోణపు పోరులో కోలుకోలేని నష్టం తప్పదేమోనని డీఎంకే కలవరపడుతోంది.డీఎంకే కూటమి సానుకూలతలు → భాగస్వాములతో సజావుగా సాగిన పొత్తుల ఖరారు → డీఎంకేకు బూత్ స్థాయి దాకా పటిష్టమైన నిర్మాణం → సంక్షేమ పథకాలు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు మొదలుకుని గిగ్ వర్కర్ల దాకా నగదు బదిలీ పథకాలు → డీఎంకే వ్యతిరేక ఓట్లను టీవీకే చీల్చనుందన్న సంకేతాలు → మైనారిటీల మద్దతు ప్రతికూలతలు → మంత్రులు, నేతలపై అవినీతి ఆరోపణలు → రాష్ట్రంలో బాగా పెరిగిన నేరాలు → తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతఅన్నాడీఎంకే... కష్టాలకు ఎదురీత!జయలలిత మరణానంతరం పదేళ్లుగా ఒక్క ఎన్నికల్లో కూడా గెలుపు ముఖం చూడని అన్నాడీఎంకే ఈసారి కూడా కష్టాలకు ఎదురీదుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మాజీ సీఎం ఒ.పన్నీర్‌సెల్వంతో పాటు పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి డీఎంకే, టీవీకే గూటికి చేరారు. దీనికి తోడు నాయకత్వ లేమి పార్టీని తీవ్రంగా బాధిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఇప్పటికీ బలంగానే ఉండటం అన్నాడీఎంకేకు అతి పెద్ద సానుకూలత. దానికి బీజేపీ బలం కూడా తోడవుతోంది. కన్యాకుమారి తదితర జిల్లాలతో పాటు రాష్ట్రంలో పశి్చమ ప్రాంతాల్లో కొన్నేళ్లుగా కాషాయ పార్టీ క్రమంగా పుంజుకుంటూ వస్తోంది. తన క్షేత్రస్థాయి బలానికి బీజేపీ ఆర్థిక వెన్నుదన్ను తోడై మెరుగైన ఫలితాలు సాధిస్తానని అన్నాడీఎంకే నమ్ముతోంది. అయితే విజయ్ పార్టీని కూటమిలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీకి రుచించడం లేదు. ఇది అంతిమంగా వాటి మధ్య సామరస్యాన్ని దెబ్బతీసే ఆస్కారం లేకపోలేదు. పైగా బీజేపీ హిందూత్వ ఎజెండా తమిళనాడులో పెద్దగా ఫలించకపోవచ్చని గత అనుభవాలు చాటుతున్నాయి.అంతేగాక బీజేపీకి ఉన్న మైనారిటీ వ్యతిరేక ముద్ర అంతిమంగా కూటమికి చేటు చేయవచ్చన్న అంచనాలూ లేకపోలేదు. పైగా జయలలిత నెచ్చెలి శశికళ పెట్టిన కొత్త పార్టీ కూడా అన్నాడీఎంకే ఓట్లకు ఎంతోకొంత గండి కొట్టవచ్చంటున్నారు. ఇన్ని సవాళ్ల నేపథ్యంలో పార్టీ పునాదులను పదిలంగా కాపాడుకోవడమే ఎడప్పాడి కె.పళనిస్వా మికి పరీక్షగా నిలవనుంది. అయితే కావేరీ డెల్టాలో రైతుల దుస్థితి తదితర సమస్యలపై గళమెత్తడం ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ఆయన గట్టిగానే చెమటోడుస్తున్నారు.అన్నాడీఎంకే–బీజేపీ కూటమి సానుకూలతలు → బీజేపీ రూపంలో అపారమైన అర్థ, అంగ బలాలు → అన్నాడీఎంకేకు క్షేత్రస్థాయి దాకా ఉన్న పట్టు → జయలలిత పట్ల ప్రజల్లో చెక్కుచెదరని ఆదరణ ప్రతికూలతలు → నాయకత్వ లేమి → శశికళ సొంత పార్టీతో ఓట్లు చీలే ఆస్కారం → ముఖ్య నేతల వలసలు → బీజేపీపై హిందూత్వ, తమిళ వ్యతిరేక ముద్రవిజయ్ పార్టీ... ఆశల పల్లకీలో! సినీ నటుడు విజయ్ తమిళ రాజకీయాల్లో ఎక్స్ ఫ్యాక్టర్‌గా దూసుకొచ్చారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు ఆందోళన కలిగించింది. వాటికి మూడో ప్రత్యామ్నాయంగా కనిపించింది. విజయ్ రోడ్ షోలు, సభలకు జనం విరగబడ్డారు. కానీ వీఎంకే జోరుకు కొన్నాళ్లుగా బ్రేకులు పడుతూ వస్తున్నాయి. గత సెప్టెంబర్‌లో కరూర్ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట ఉదంతం విజయ్‌కి బాగా మైనస్‌గా మారింది. ఏకంగా 41 మంది కార్యకర్తలు దుర్మరణం పాలైతే వేదిక నుంచి హడావుడిగా నిష్క్రమించారన్న ప్రచారం చేటు చేసింది. కనీసం ఆ తర్వాతైనా చనిపోయిన వారి కుటుంబాలను కలిసేందుకు అయిష్టత వెలిబుచ్చడం విజయ్ ఇమేజీని మసకబార్చింది. తొక్కిసలాటపై ఆయన పలుమార్లు సీబీఐ విచారణకు హాజరు కావాల్సి వచి్చంది. బీజేపీతో పొత్తు దిశగా ఒత్తిడి పెంచేందుకు దీన్ని మోదీ సర్కారు వాడుకుంటోందన్న ప్రచారాన్ని విజయ్ గట్టిగా ఖండించకపోవడం టీవీకేకు మరింత చేటు చేస్తోంది. దీనికి తోడు ఎన్నికలు సమీపించిన తరుణంలో విజయ్‌తో విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టుకెక్కడం మరో మైనస్‌గా మారింది. సినీ నటి త్రిషతో ఆయన బంధమే ఇందుకు కారణమన్న ప్రచారం మహిళల్లో ప్రతికూలంగా మారేలా కనిపిస్తోంది. పైపెచ్చు డీఎంకే, అన్నాడీఎంకేలతో పోలిస్తే టీవీకేకు రాష్ట్రవ్యాప్తంగా బలమైన వ్యవస్థాగత నిర్మాణం లేకపోవడం పెద్ద లోటే. ఇప్పటికైతే ఒంటరి పోరుకే విజయ్ పార్టీ మొగ్గుతోంది. అదే జరిగితే డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో దేని ఓట్లకు టీవీకే గండికొడుతుందన్నది అంతిమ ఫలితాల్లో నిర్ణాయకంగా మారేలా కనిపిస్తోంది.టీవీకే సానుకూలతలు → విజయ్ కరిష్మా. యువత, మహిళల్లో భారీ ఫాలోయింగ్ → కొత్త పార్టీ కావడంతో క్లీన్ ఇమేజీ → మూడో ప్రత్యామ్నాయంగా తటస్థ ఓటర్లను ఆకట్టుకునే అవకాశం ప్రతికూలతలు → బలహీనమైన వ్యవస్థాగత నిర్మాణం → ఆదరణను ఓట్లుగా మలిచే యంత్రాంగం లేకపోవడం → నాయకుల లేమి, అనుభవ రాహిత్యం → విజయ్ విడాకుల కేసు, ఆయనపై సీబీఐ విచారణ -
నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్
తమిళనాడులో ఎన్నికల సంగతేమో గానీ పలువురు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు.. స్టార్ హీరోయిన్లని అవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం నైనర్ నాగేంద్రన్ అనే నాయకుడు.. విజయ్‌ని విమర్శిస్తూ, ముందు నువ్వు త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి అని అనేశాడు. తర్వాత త్రిష సీరియస్ కావడంతో సదరు నాయకుడు క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు ఏకంగా ఓ ఎంపీ.. నయనతారని ఉద్దేశిస్తూ చీప్ కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: చిరంజీవితో సినిమా.. హరీశ్ శంకర్ ఆశ పెద్దదే!)మహిళల భద్రత, గౌరవం కోసం అన్నాడీఎంకే(AIADMK) పార్టీ.. మంగళవారం చెన్నైలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఇందులోనే ఆ పార్టీకి చెందిన ఎంపీ సీవీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు అంతటా పెను దుమారాన్ని రేపుతున్నాయి. హీరోయిన్ నయనతారని ఉద్దేశిస్తూ అసభ్యకర రీతిలో మాట్లాడేసరికి విమర్శలు గట్టిగానే వస్తున్నాయి.అసలు విషయానికొస్తే.. కొన్నిరోజుల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రజలని ఉద్దేశిస్తూ మాట్లాడారు. తమ కలలని పంచుకోవాలని, వాటిని ప్రభుత్వం నెరవేర్చేందుకు కృషి చేస్తుందని పిలుపునిచ్చారు. వీటి గురించి మాట్లాడిన అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగం.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలం, నయనతార పేర్లని ప్రస్తావిస్తూ అసభ్యకర కామెంట్స్ చేశారు.'అబ్దుల్ కలాం గారు మనల్ని కలలు కనమన్నారు. స్టాలిన్ కూడా తనతో కలలు పంచుకోమంటున్నారు. ఒకవేళ నాకు నయనతార కావాలని కల వస్తే.. నా కోరికని స్టాలిన్ తీరుస్తారా? ఎవరైనా వెళ్లి నయనతారతో తమకు పెళ్లి చేయమని అడిగితే.. ఆ కల కూడా నెరవేరుస్తారా?' అని ఎంపీ అన్నారు. అయితే ఈయన ఇలా మాట్లాడుతున్నప్పుడు పక్కనే నిలుచుని ఉన్న పార్టీ నేతలు.. వారించాల్సింది పోయి, నవ్వుతుండేసరికి విమర్శలు గట్టిగా వస్తున్నాయి. మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి?(ఇదీ చదవండి: త్వరలోనే విజయ్‌తో పెళ్లి.. ఇలా హింట్ ఇచ్చిన త్రిష తల్లి!)‘எனக்கு நயன்தாரா வேண்டும்’சி.வி.சண்முகம் அநாகரீக பேச்சு#ADMK #CVShanmugam #SPARK pic.twitter.com/dFBcCXmGjj— Spark+ (@SparkPluz_) March 17, 2026 -
విజయ్ వైపు.. ఆ ముగ్గురి చూపు
సాక్షి, చెన్నై: తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో చేరే పార్టీల జాబితా దాదాపుగా ఖరారైంది. అయితే టీవీకే అధినేత విజయ్ ఇచ్చిన పిలుపునకు ఎట్టకేలకు ముగ్గురు స్పందించారు. ఈ ముగ్గురి విజయ్‌తో కలిసి మెగా కూటమి దిశగా కసరత్తులలో ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. డీఎంకే మెగా కూటమి అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఇందులో ఏఏ పారీ్టలు ఉన్నాయో దాదాపుగా క్లారిటీ వచ్చినట్లే. ఇక, అన్నాడీఎంకే– బీజేపీ కూటమిలోనూ అదే పరిస్థితి. కాగా సంకీర్ణ ధర్మం మేరకు పాలనలోనూ భాగస్వామ్యం అన్న నినాదంతో తనతో కలిసి వచ్చేవారికి అధికారంలో వాటా ఇస్తానన్న విజయ్ వైపుగా ఇంత వరకు ఎవ్వరూ దృష్టి పెట్ట లేదు. చివరకు ఒంటరిగానైనా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్‌కు మరింత బలాన్ని ఇచ్చేందుకు పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ ఓ వైపు ,దివంగత సీఎం జె. జయలలిత నెచ్చెలి శశికళ మరోవైపు సన్నద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్బుమణి పీఎంకే అన్నాడీఎంకే కూటమిలో చేరిన దృష్ట్యా, డీఎంకేలో తమకు అవకాశం లేక పోవడంతో ఇక విజయ్ పక్షాన నిలబడేందుకు రాజకీయ అనుభవజు్ఞడైన రాందాసు నిర్ణయించి, అందుకు సంబంధించిన సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అదే సమయంలో రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన దివంగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ సైతం రాందాసు పిలుపునకు స్పందించినట్టు ప్రచారం. రహస్యంగా చర్చలు.. ఈ ప్రచారానికి అద్దం పట్టే విధంగా ఆమె మంగళవారం రాత్రి తైలాపురంలో రాందాసుతో భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసినట్లయ్యింది. తనకు వెన్నుపోటు పొడిచిన పళణిస్వామి, టీటీవీ దినకరన్‌కు గట్టిగా బుద్ది చెప్పే రీతిలో అన్నాడీఎంకే కేడర్‌ను విజయ్ వైపుగా మళ్లించే దిశగా చిన్నమ్మవ్యూహాలకు పదును పెట్టనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వన్నియర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్, ముక్కళత్తోర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్‌ను విజయ్ వైపుగా మళ్లించే దిశగా ఆయనకు దన్నుగా నిలబడేందుకు సన్నద్ధమవుతున్నట్టు చర్చలు జోరందుకున్నాయి. అదే సమయంలో దక్షిణ తమిళనాడులో వెనుకబడిన సామాజిక వర్గం ఓటు బ్యాంక్‌ను కలిగిన పుదియ తమిళగం నేత కృష్ణస్వామి సైతం విజయ్‌కు దన్నుగా నిలబడే రీతిలో సిద్ధమైనట్టు ఆయన మద్దతు దారులు పేర్కొంటున్నారు. అయితే సజావుగా వ్యవహారాలన్నీ సాగి, వ్యూహాలు ఫలించిన పక్షంలో విజయ్ నేతృత్వంలోమెగా కూటమి తథ్యమని రాందాసు ,చిన్నమ్మ శశికళ శిబిరంలోని కొందరు నేతలు పేర్కొంటుండటం గమనార్హం. -
డీఎంకేలో చేరిన పన్నీర్ సెల్వం
చెన్నై: అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు రాజకీయాల్లో సంచలనాత్మకమైన మార్పులు జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీ ఎంకే బహి ష్కృత నేత ఓ.పన్నీర్ సెల్వం (ఓపీఎస్) డీఎంకేలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో ఆయన డీఎంకే కండువాను కప్పుకొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకేలో చేరడం తన సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందన్నారు. సీఎం స్టాలిన్ అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని, అన్నాదురై, కరుణానిధి చూపిన దారిలో ప్రతి ఒక్కరినీ కలుపుకొనిపోతూ పార్టీని, ప్రభుత్వాన్ని ఆదర్శంగా నడిపిస్తున్నారని కొనియాడారు. ‘దేశం మొత్తం స్టాలిన్ నాయకత్వాన్ని నిశితంగా గమనిస్తోంది. రాజకీయ పార్టీని ఎలా నడపాలో ఆయన కొత్త వ్యాకరణం నిర్దేశించారు. తమిళనాడు ప్రజలకు సమర్థవంతమైన, గొప్ప ప్రశంసనీయమైన పరి పాలనను అందిస్తున్నారు’అని కొనియాడారు. -
అన్నా డీఎంకేకి బిగ్ షాక్.. డీఎంకే గూటికి పన్నీర్ సెల్వమ్
-
ఇక పురుషులకూ ఉచిత ప్రయాణం
తమిళనాడులో ఎన్నికల వేడి మొదలైంది. ఇతర పార్టీలు ఎన్నికల కోసం కమిటీలు ఏర్పాటు చేస్తుంటే.. ప్రతిపక్ష అన్నాడీఎంకే మాత్రం దూకుడు ప్రదర్శించింది. మొదటి దశ మేనిఫెస్టోను శనివారం ప్రకటించింది. ఎంజీఆర్ జయంతి సందర్భంగా చేసిన ఈ ప్రకటనలో.. తాము అధికారంలోకి వస్తే ఏయే హామీలను నెరవేరుస్తామని వివరించింది. ఇందులో పురుషులకు ఉచిత బస్సు ప్రయాణంతో సహా ఐదు కీలక హామీలు ఉన్నాయి.అన్నాడీఎంకే(AIADMK) జనరల్ సెక్రటరీ పళని స్వామి శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తొలి దశ మేనిఫెస్టోను ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఆర్థిక సాయం, మగవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం, అమ్మ టూ వీలర్ స్కీమ్ తదితరాలు ఉన్నాయి. వీటి ప్రకారం..👉మహిళల సంక్షేమం కోసం.. కులవిలక్కు స్కీమ్ అమలు చేస్తామని అంటోంది. ఈ పథకం ప్రకారం రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు రూ.2 వేల సాయం అందిస్తారు. ఇవి నేరుగా ఆ ఇంటి మహిళల ఖాతాలో జమ అవుతాయి.👉ఉచిత బస్సు ప్రయాణం.. నగరాల్లోని బస్సుల్లో ప్రస్తుతం మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం అమలవుతోంది. అధికారంలోకి వస్తే దానిని కొనసాగిస్తూ.. పురుషులకూ వర్తింపజేస్తామని తెలిపింది.👉అమ్మా ఇల్లమ్ స్కీమ్.. గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని వారికి ప్రభుత్వమే జాగా కొని.. కాంక్రీట్ ఇల్లు కట్టి ఇస్తుంది. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే అపార్ట్మెంట్లు నిర్మించి ఉచిత నివాసం అందిస్తుంది. ఇందులోనే దీనామణి ఉప పథకం కింద.. ఎస్సీ కులంలో పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని వేరుగా నివసించాలనుకుంటే.. ప్రభుత్వమే ఆ ఇళ్లను నిర్మించి ఇస్తుంది.👉కేంద్రం 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచిన సంగతి తెలిసిందే. దీనిని 150 రోజులకు పొడిగిస్తామని అన్నాడీఎంకే ప్రకటించింది. 👉అమ్మా.. టూ వీలర్ స్కీమ్ కింద.. మహిళలకు రూ.5 లక్షల లోన్ అందిస్తారు. ఇందులో ప్రభుత్వ సబ్సీడీ రూ.25,000 ఉంటుంది.Chennai, Tamil Nadu: AIADMK General Secretary Edappadi K Palaniswami announces the first phase of the party's election promises1) Women’s Welfare (Kulavilakku Scheme) Under the Kulavilakku Scheme, a monthly financial assistance of Rs 2,000 will be provided to all ration… pic.twitter.com/gvwHa0126I— ANI (@ANI) January 17, 2026రామచంద్రన్ 109వ జయంతి సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నట్లు పళని స్వామి తెలిపారు. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని.. ప్రజలు స్టాలిన్ సర్కార్‌పై ఆగ్రహంతో ఉన్నారని రాబోయేది ఎన్డీయే సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు. 2023 నుంచి అన్నాడీఎంకే బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అన్నాడీఎంకే మేనిఫెస్టో.. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలకు కొనసాగింపుగా ఉందని, మరీ ముఖ్యమగా అమ్మ ఇల్లమ్ స్కీమ్.. కళైంగర్ హౌజింగ్ స్కీమ్ మాదిరే ఉందని తమిళ మీడియా విశ్లేషిస్తోంది. తమిళనాడులో ఏప్రిల్ లేదంటే మే నెలలో జరిగే అవకాశం ఉంది. -
తిరుమలలో రాజకీయ పోస్టర్ కలకలం
-
టీవీకేలో చేరిన సెంగొట్టయన్
చెన్నై: ఏఐఏడీఎంకే బహిష్కృత నేత సెంగొట్టయన్.. సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళిగ వెట్రి కజగం(టీవీకే) పార్టీలో చేశారు. బుధవారం శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన, గురువారం టీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో ఆ పార్టీలో చేరారు. ఆయనతో ఓ మాజీ ఎంపీతోపాటు, అతని మద్దతు దారులు కూడా చేరారు. పసుపు–ఎరుపు మిశ్రమంతో రంగులతో ఉన్న టీవీకే శాలువాను విజయ్ ఆయనకు కప్పారు. సెంగొట్టయన్‌కు పార్టీ ఆర్గనైజింగ్ చీఫ్ బాధ్యతలు అప్పగించారు. తరువాత విలేకరులతో మాట్లాడిన సెంగొట్టయన్ తాను రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలనను తీసుకురావడానికే టీవీకేలో చేరానని చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య ఎలాంటి తేడా లేదని, ప్రజలు పారదర్శకమైన పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. మంచి పాలన అందించే నాయకుడిని కోరుకుంటున్నారని, అందుకు విజయ్ సరైన వ్యక్తని సెంగొట్టయన్ అన్నారు. ఆ సమయంలోనూ ఆయన జేబులో ఏఐఏడీఎంకే వ్యవస్థాపకురాలు జయలలిత ఫొటో ఉంది. ఫొటోపై మీడియా ప్రశ్నించగా.. ‘నేను అన్నా డీఎంకేకు విధేయుడిగా ఉన్నాను. 50 ఏళ్లపాటు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశాను. చివరకు నాకు లభించిన బహుమతి పార్టీ నుంచి తొలగించటం. పార్టీని బలోపేతం చేద్దామన్న నా ఆలోచననను సమరి్థంచిన నా మద్దతుదారులు కూడా బహిష్కరణకు గురయ్యారు’అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అత్యంత సీనియరైన ఆయన చేరికతో టీవీకే పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన స్వస్థలం ఈరోడ్ జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం అవుతుందని టీవీకే వర్గాలు భావిస్తున్నాయి. -
అన్నాడీఎంకేకు షాక్.. టీవీకే విజయ్‌తో ఆ ఎమ్మెల్యే భేటీ
చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకేకు షాక్ తగిలింది. సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్‌తో ఎమ్మెల్యే సెంగొట్టయన్ భేటీ అయ్యారు. కొంతకాలంగా పళనిస్వామితో సెంగొట్టయన్‌కు విభేదాలు నేపథ్యంలో పార్టీ నుంచి ఎమ్మెల్యేని పళనిస్వామి సస్సెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సెంగొట్టయన్ త్వరలోనే టీవీకేలోకి చేరతారన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి.జయలలిత మృతి తర్వాత వరుసగా మూడు ఎన్నికల్లో ఓటమి పాలైన ఏఐఏడీఎంకే తిరిగి బలపడాలంటే శశికళ, పన్నీర్ సెల్వం, టి.టి.వి. దినకరన్‌లను తిరిగి పార్టీలోకి తీసుకోవాలంటూ ఇటీవల సెంగొట్టయ్యన్ బహిరంగంగానే తన వాదనలను వినిపించారు. ఎంజీఆర్ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఏఐఏడీఎంకేలో ఉన్న సెంగొట్టయ్యన్.. పార్టీ ప్రచార రూపకల్పన చేసిన కీలక వ్యూహకర్తగా గుర్తింపు పొందారు.జయలిత పర్యటనలు, సభలు, సమావేశాలు, కేడర్ మొబిలైజేషన్ వంటి అంశాలను సమన్వయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. టీవీకేలోకి చేరబోతున్నారా? అంటూ మీడియా వేసిన ప్రశ్నకు ‘ఒక రోజు వేచి చూడండి’ అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. 2026 ఎన్నికలకు ముందు పార్టీని బలపర్చేందుకు విజయ్, సెంగొట్టయ్యన్‌కు కీలక పదవి ఇవ్వవచ్చంటూ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.సెంగొట్టయన్ ఇటీవల.. పార్టీ బహిష్కృత నేతలు పన్నీరు, సెల్వం, టీటీవీ దినకరన్, దివంగత సీఎం జె. జయలలిత నెచ్చెలి శశికళతో ఆయన భేటీ కావడం చర్చకు దారి తీసింది. దీంతో ఆయన్ని పార్టీ నుంచి తొలగించారు. ప్రాథమిక సభ్యత్వం నుంచి సైతం తొలగిస్తూ ఇక అన్నాడీఎంకే వర్గాలు ఎవ్వరూ ఆయనతో సంప్రదింపు జరకూడదని పళణి స్వామి ఆదేశించారు.అన్నాడీఎంకేలో ఏకాధిపత్యం సాగుతుందని సెంగొట్టయన్ ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు. అందరూ సమష్టిగా ముందుకెళ్దామని పిలుపు నిస్తే, పార్టీ పదవి నుంచి తప్పించారని, ఇప్పుడేమో పార్టీ నుంచి తొలగించారని పేర్కొన్నారు. తనను పార్టీ నిబంధనలకు విరుద్ధంగా తొలగించినట్టు స్పష్టం చేశారు. అన్నాడీఎంకే నిబంధనల మేరకు తొలగింపు జరగ లేదని, ఇది చట్ట విరుద్ధం అని వ్యాఖ్యలు చేశారు.అమ్మ జయలలిత మరణం తర్వాత పార్టీని నడిపించాలని చిన్నమ్మ శశికళ తనకు ఆదేశాలు ఇచ్చారని, అయితే పళణి స్వామి పేరును ప్రతిపాదించింది తానే అని వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని పళణి స్వామి చేపట్టినానంతరంపార్టీ కనీసం ఒక్కటంటే ఒక్క ఎన్నికలలోకూడా గెలవ లేదని, అంతా పతనమే అంటూ సెంగొట్టయన్ ధ్వజమెత్తారు. -
విజయ్ మౌనం.. అయోమయంలో టీవీకే, అభిమానులు!
కరూర్ తొక్కిసలాట ఘటన.. తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీ భవితవ్యాన్ని గందరగోళంలోకి నెట్టేసింది. అయితే తాము తొణకని కుండలా ఉంటామని టీవీకే చెబుతున్నప్పటికీ.. బీజేపీ తన మైండ్ గేమ్ ప్రారంభించిందనే విశ్లేషణ అక్కడి రాజకీయ నిపుణులు చేస్తున్నారు. అందుకు విజయ్ పాటిస్తున్న మౌనం ప్రధానమైన కారణంగా కనిపిస్తోంది.కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత.. బీజేపీ అధికార డీఎంకేనే టార్గెట్ చేసింది. భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అంటోంది. అయితే టీవీకే ఆరోపిస్తున్నట్లు కుట్ర కోణాన్ని మాత్రం సమర్థించడం లేదు. ఈ క్రమంలో.. ఆ పార్టీ అగ్రనేత ఒకరు విజయ్‌కు సంఘీభావం ప్రకటించారని, డీఎంకే గనుక లక్ష్యంగా చేసుకుంటే మద్దతు కూడా ఇస్తామని చెప్పారని తమిళ మీడియా చానెల్స్ మొన్నీమధ్య కథనాలు ఇచ్చాయి. ఆ వెంటనే.. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఎన్డీయే కూటమి బలపడే ప్రయత్నాలు మొదలయ్యాయి అంటూ వ్యాఖ్యానించారాయన. ఆ సమయంలో అన్నాడీఎంకే ర్యాలీలో టీవీకే జెండాలు కనిపించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే.. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ అక్టోబర్ 9వ తేదీన టీవీకే ఒక ప్రకటన విడుదల చేసింది. అన్నాడీఎంకే (AIADMK) ర్యాలీల్లో టీవీకే జెండాలు పట్టుకున్నవాళ్లు తమ పార్టీ వాళ్లు కాదని స్పష్టత ఇచ్చింది. కట్ చేస్తే.. తమిళనాడు బీజేపీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ తాజాగా ఓ ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో బలైమన చేరికలతో ఎన్డీయే కూటమి మరింత బలోపేతం కానుందని, అదెవరనేది మీరు ఊహించుకోవచ్చు’’ అంటూ చెబుతూ నవ్వులు చిందించారామె. దీంతో అది విజయ్ అని మళ్లీ చర్చ మొదలైందక్కడ. అయితే.. కరూర్ ఘటన తర్వాత తనకు సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీకి, సదరు బీజేపీ అగ్రనేతకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో తాను ఏ కూటమిలో ఉండబోనని, డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని విజయ్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరే ఉంటుందని, కలిసొచ్చే పార్టీలను చేర్చుకుని ముందుకు వెళ్తామని స్పష్టత ఇచ్చారాయన.కరూర్ ఘటనపై సుప్రీం కోర్టు తాజాగా సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణ పర్యవేక్షణకు రిటైర్డ్ జడ్జితో సిట్‌ను సైతం ఏర్పాటు చేసింది. తాము కోరుకున్నట్లే సీబీఐ దర్యాప్తు రావడంతో విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. సత్యం గెలుస్తుంది అంటూ ఓ పోస్ట్ కూడా చేశారు. అయితే పొత్తులపై ఉధృతంగా జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం ఖండించడం లేదు. దీంతో ఇటు టీవీకే కేడర్, అటు అభిమానులు అయోమయంలో పడిపోయారు. ఎన్డీయే చేరాలనే ప్రచారంపై విజయ్ ఇప్పటిదాకా స్పందించకపోవడంపై టీవీకేలో ఇతర నేతలు అసంతృప్తిగా ఉన్నారనే కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలో.. ఆయన మౌనం తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉందని.. పరిస్థితి మరింత ముదరక ముందే స్పందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
తమిళనాట ప్లాన్ ‘బీ’.. కొత్త పొ(ఎ)త్తులు ఫలించేనా?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందస్తు ప్రచారాల్లో.. అక్కడి పార్టీలు తలమునకలై పోయాయి. అయితే కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత ఆ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అధికార డీఎంకేను కార్నర్ చేస్తూ.. కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ప్లాన్ బీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.ఎన్డీయే కూటమిలో(TN NDA Alliance) భాగంగా.. ప్రతిపక్ష అన్నాడీఎంకే బీజేపీతో పొత్తులో ఉంది. అయితే గత కొంతకాలంగా ఆ పార్టీలో అసంతృప్త నేతల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. బహిష్కృత నేత పన్నీర్ సెల్వం ఎన్డీయే నుంచి నిష్క్రమించిన తర్వాత.. మరికొందరు కూడా ఆ బాటలోనే గుడ్‌బై చెప్పేస్తున్నారు.ఈ క్రమంలో బీజేపీ కొత్తు పొ(ఎ)త్తులకు తెర తీసింది. డీఎంకే వ్యతిరేక ఓట్లను ఏకీకృతం చేయడం లక్ష్యంతో.. ఎన్డీయేను బలపర్చాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో చిన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి.. తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ జయ్ పాండా, కో-ఇన్చార్జ్ మురళీధర్ మొహోల్ ఇటీవల రాష్ట్ర బీజేపీ నేతలు, అన్నాడీఎంకే నాయకులతో వ్యూహాత్మక చర్చలు జరిపారు.ఇందులో ప్రధానంగా.. విజయ్ టీవీకే పార్టీ(Vijay TVK Party) గురించే చర్చ నడిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సర్వే సంస్థల అంచనాల ప్రకారం.. టీవీకే పార్టీకి 20% ఓటు షేర్ కలిగి ఉందట. ఇందులో.. 60 శాతం NDA వ్యతిరేక ఓట్లే ఉన్నాయని ఓ అంచనాకి వచ్చింది. ఈ క్రమంలో.. విజయ్ ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యూహం అమలు చేస్తోంది. తాజాగా కరూర్ ఘటన తర్వాత టీవీకే అధినేత విజయ్‌కు బీజేపీ సంఘీభావం ప్రకటించింది. జరిగిన దానికి ప్రభుత్వ బాధ్యత కూడా ఉందని, ఏకపక్షంగా టీవీకేను లక్ష్యంగా చేసుకుంటే తమ మద్దతు ఉంటుందని బీజేపీ అగ్రనేత ఒకరు విజయ్‌కు హామీ ఇచ్చినట్లు జాతీయ మీడియా సంస్థలు మొన్నీమధ్యే కథనాలు ఇచ్చాయి. ఈ క్రమంలో.. విజయ్ అభిమాన గణాన్ని ఆకర్షించడంతో పాటు మరో ప్రణాళికను బీజేపీ అమలు చేస్తోందన్న విశ్లేషణ తమిళనాట జోరుగా సాగుతోంది. కరూర్ ఘటనకు ముందు దాకా.. ఏ కూటమిలో టీవీకే భాగంకాదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, అయితే అధికారం కోసం కదిలొచ్చే పార్టీలను స్వాగతిస్తామని టీవీకే అధినేత విజయ్ ప్రకటించారు. దీంతో.. తమిళనాట చిన్నపార్టీలన్నీ టీవీకే వైపు ఒక్కసారిగా తిరిగాయి. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. మాజీ సీఎం పన్నీర్ సెల్వం, శశికకళ వర్గం, టీవీకే దినకరన్ వర్గం సహా పలు పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడం.. విజయ్‌కి మద్దతు ఇచ్చేందుకేనని చర్చా జరిగింది. అంతెందుకు.. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న పట్టాలి మక్కల్ కచ్చి(PMK)లోనూ అంతర్గత విభేదాలు తలెత్తి.. ఆ పార్టీ సీనియర్ నేత రామదాస్ తనయుడు ఏ రామదాస్.. టీవీకేలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. నవంబర్ లేదా డిసెంబర్‌లోపు ఆయా వర్గాలు విజయ్ కూటమికి మద్దతు ఇచ్చే ప్రకటనలు చేస్తాయని దాదాపు ఖరారైంది. అయితే.. ఈలోపు కరూర్ ఘటనతో టీవీకే పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ అనిశ్చితి నెలకొన్న సమయంలో విజయ్‌కు మద్దతు ప్రకటించడం మంచిది కాదనే పునరాలోచనలో ఉన్న ఆ వర్గాలకు బీజేపీ గాలం వేస్తోందని తెలుస్తోంది. తద్వారా ఓట్ల చీలికను నివారించడమే కాకుండా.. ఎన్డీయే కూటమిని బలపర్చుకునే యోచనలో బీజేపీ ఉంది. అయితే.. ఈ విషయంలో అన్నాడీఎంకే నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం లేకపోలేదు. బహిష్కృత నేతలను ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకునేది లేదని అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామి.. బీజేపీ అగ్రనేత అమిత్ షాతో జరిగిన భేటీలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో.. వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోయే డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంలోపు పళనిని ఒప్పించే బాధ్యతలను ఎన్నికల ఇంచార్జిలకు బీజేపీ అప్పగించినట్లు తమిళ వెబ్సైట్లు కథనాలు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: అమిత్ షాపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు -
ప్రమాదమా.. కుట్రా?
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రికళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ ప్రచార కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ప్రమాదమా.. లేక ఏదైనా కుట్ర జరిగిందా? అనే అనుమానాలు తీవ్రమవుతున్నాయి. ఈ ఘటనపై సీబీఐ లేదా సిట్ విచారణ కోరుతూ ఆ పార్టీ న్యాయవాద విభాగం మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది. తొక్కిసలాట ఘటనతో తమిళనాడు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో పాటు పలువురు మంత్రులు రాత్రికి రాత్రే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏడీజీపీ డేవిడ్సన్ దేవాశీర్వాదంతో పాటు ఐదుగురు ఐజీలు, డీజీఐలు ఘటనా స్థలంలో విచారణను వేగవంతం చేశారు. ఈ ఘటనలో మొత్తం 40 మంది మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 14 మంది పురుషులు, 17 మంది మహిళలు, 9 మంది చిన్నారులు ఉన్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మరో వంద మందికి పైగా చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత పళణిస్వామితో పాటు డీఎండీకే, బీజేపీ, తదితర పార్టీ ల నేతలంతా కరూర్‌కు చేరుకుని బాధితులను పరామర్శించారు. ఈ ఘటన ప్రభుత్వ భద్రతా వైఫ్యలమే కారణమని పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం పెద్దఎత్తున తరలి వస్తున్నారన్న విషయాన్ని గ్రహించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. విజయ్ సైతం ముందస్తు ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేసుకుని ఉండాల్సిందని హితవు పలికారు. కాగా.. ఈ ఘటనపై 24 గంటల్లో నివేదిక సమర్పించాలని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి డీఎంకే ప్రభుత్వాన్ని ఆదేశించారు. సీబీఐ దర్యాప్తునకు టీవీకే డిమాండ్ కరూర్‌లో బాధితుల సమాచారం, మరికొందరు వైరల్ చేస్తున్న వీడియోల ఆధారంగా ఈ ఘటన ప్రమాదమా? లేక కుట్ర జరిగిందా..? అన్న అనుమానాలకు దారితీసింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ టీవీకే న్యాయవాది విభాగం బృందం చెన్నైలో న్యాయమూర్తి దండపాణిని కలిసి సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. ప్రచారంలో రాళ్లు విసిరినట్టు, లాఠీచార్జ్ జరిగినట్టు వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా ఈ ఘటన పథకం ప్రకారం జరిగిన కుట్రగా న్యాయమూర్తికి వివరించారు. కేసును సీబీఐ లేదా సిట్ ద్వారా విచారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పిటిషన్ దాఖలు చేస్తే సోమవారం మధ్యాహ్నం విచారణకు స్వీకరిస్తామని న్యాయమూర్తి సూచించగా.. ఆ దిశగా మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలుకు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాల వారికి రూ.20 లక్షల చొప్పున విజయ్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ప్రకటించారు. తాను సైతం కరూర్ వెళ్లేందుకు సిద్ధమైనా, పోలీసుల నుంచి అనుమతి రాలేదు. కాగా.. విజయ్ ఇంటివైపు కొన్ని విద్యార్థి సంఘాలు దూసుకెళ్లడంతో ఆ పరిసరాలన్నీ సీఆర్పీఎఫ్ భద్రతా వలయంలోకి తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో విజయ్ ప్రచారాలపై నిషేధం విధించాలని కోరుతూ సెంథిల్ కన్నన్ అనే బాధితుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇదిలావుండగా కరూర్ ఘటనకు బాధ్యులుగా టీవీకే పార్టీ కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి మది అళగన్, ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, సీనియర్ నేత నిర్మల్‌కుమార్‌తో పాటు ఇతరులు అని పేర్కొంటూ మొత్తం నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ విచారణ ప్రారంభించింది. వేలుస్వామిపురంలో పరిశీలన, విచారణ జరిగింది. ఘటన సమయంలో విద్యుత్ సరఫరా ఆపేశారంటూ కొందరు, ఒక్కసారిగా జనం తోసుకొచ్చారంటూ మరికొందరు, అంబులెన్స్‌లు వరుసగా రావడంతో వాటికి దారి ఇచ్చే సమయంలో తోపులాట జరిగిదంటూ మరికొందరు తెలిపారు. -
అన్నాడీఎంకేలో కలకలం.. రంగంలోకి అమిత్ షా!
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో తమిళనాట రాజకీయ కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. ఎన్నికల బరిలో దిగేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అధికార డీఏంకే మరోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తుండగా, ప్రతిపక్ష అన్నాడీఎంకే ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని విశ్వప్రయత్నం చేస్తోంది. అగ్ర కథానాయకుడు విజయ్.. తొలిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నాయకుడు టీటీవీ దినకరన్ తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు.ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని అన్నాడీఏంకే గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీతో జట్టు కట్టింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె పళనిస్వామితో (Edappadi K Palaniswami) పాటు బీజేపీ అగ్ర నేతలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ జాతీయ నాయకుడు అమిత్ షా.. తమిళనాడుకు వరుస పర్యటనలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నవంబర్ నుంచి వరుస పర్యటనలు చేపట్టేలా కసరత్తు జరుగుతోంది.ఇదిలావుంటే పార్టీలో అంతర్గత విభేదాలు అన్నాడీఎంకేకు తల నొప్పిగా మారాయి. పళనిస్వామి వ్యవహారంపై సొంత పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి, సీనియర్ నేత కేఏ సెంగోట్టయన్ (KA Sengottaiyan) పట్ల వ్యవహరించిన తీరును అన్నాడీఎంకే నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనను పార్టీ పదవుల నుంచి తప్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. పళనిస్వామి ఒంటెత్తు పోకడలతో నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.అసలేం జరిగింది?పార్టీని వదిలిపెట్టిన వారిని, బహిష్కరించిన వారిని మళ్లీ అక్కున చేర్చుకోవాలని సెంగోట్టయన్ పిలుపు ఇవ్వడంతో అన్నాడీఏంకేలో ఒక్కసారిగా కలకలం రేగింది. పార్టీ అధినేత పళనిస్వామికి సెంగోట్టయన్ వ్యాఖ్యలు ఏమాత్రం రుచించలేదు. దీంతో ఆయనను పార్టీ పదవుల నుంచి తప్పించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఈరోడ్ రూరల్ పశ్చిమ జిల్లా కార్యదర్శి పదవి నుంచి సెంగోట్టయన్‌ను తీసిపారేశారు. అక్కడితో ఆగకుండా ఆయన మద్దతుదారులపైనా కొరడా ఝళిపించారు. సెంగోట్టయన్ మద్దతురాలైన మాజీ ఎంపీ సత్యభామను పార్టీ పదవుల నుంచి తొలగించారు.పార్టీ మంచి కోరే..పళనిస్వామి నిర్ణయంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతా కలిసి సమిష్టిగా పోరాడితే అధికారంలోకి వస్తామన్న ఉద్దేశంతోనే తాను మాట్లాడానని అన్నారు. పార్టీ మంచి కోరే ఐక్యత రాగం అందుకున్నానని, మరో అభిప్రాయం లేదని స్పష్టం చేశారు. ఎటువంటి వివరణ అడకుండానే తనను పార్టీ పదవులకు దూరం చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సెంగోట్టయన్ వ్యాఖ్యలను బహిష్కృత నేతలతో పాటు బీజేపీ, డీఎండీకే పార్టీలు స్వాగతించగా.. పళనిస్వామి ఫైర్ కావడం చర్చనీయాంశంగా మారింది.ఓపీఎస్ భరోసా!సెంగోట్టయన్‌కు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్ బాసటగా నిలిచారు. సెంగోట్టయన్‌కు తన మద్దతు ఉంటుందని, ఆయనను త్వరలో కలుస్తానని పన్నీర్ సెల్వం (Panneerselvam) ప్రకటించారు. జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళ కూడా తెర ముందుకు వస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే అసంతృప్త నాయకులందరూ ఒక వేదికపైకి వచ్చే అవకాశముందన్న వాదనలు విన్పిస్తున్నాయి.చదవండి: డీఎంకేకు నిద్రలేకుండా చేస్తున్న విజయ్!రంగంలోకి అమిత్ షా!అన్నాడీఎంకే పార్టీలో రేగిన దుమారాన్ని కట్టడి చేసేందుకు బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah) రంగంలోకి దిగినట్టు కనబడుతోంది. మంగళవారం సెంగోట్టయన్‌ను ఢిల్లీకి పిలిపించుకుని ఆయనతో మాట్లాడారు. అమిత్ షాతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయినట్టు సెంగోట్టయన్ వెల్లడించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని బలోపేతం చేయడానికి, బహిష్కృత అన్నాడీఎంకే నేతలను తిరిగి చేర్చుకోవడంపై తన అభిప్రాయాలను వారితో పంచుకున్నానని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో సెంగోట్టయన్ భవిష్యత్ కార్యాచరణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
రాజీ కుదిరింది.. ఎన్డీయే తమిళనాడు సీఎం అభ్యర్థిగా ఆయనే!
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నన్ అన్నామలై, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తమ మధ్య విబేధాలను పక్కనపెట్టి ఒక్కటయ్యారు. ఇద్దరూ కలిసి ఒకే వేదికపై సందడి చేయడమే కాదు.. సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపైనా స్పష్టత ఇచ్చేశారు. గతంలో ఈపీఎస్ మీద అన్నామలై ఏ స్థాయిలో విరుచుకుపడిందో తెలిసిందే. ‘‘పళనిస్వామి ఓ తెలివితక్కువోడు’’.. అంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పించారాయన. దీనికి కౌంటర్‌గా ‘‘అన్నామలై బుద్ధిహీనుడని, ఆస్పత్రిలో చేర్పించాలి’’ అని ఈపీఎస్ వర్గం కౌంటర్ ఇచ్చింది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య వైరం కొనసాగుతూ వచ్చింది. అంతేకాదు.. ఈ ఇద్దరూ ఏ ఎన్డీయే మీటింగ్‌లోనూ కలిసి మెలిగినట్లు కనిపించేది కూడా కాదు. అలాంటిది.. శనివారం చెన్నైలో జరిగిన జీకే మూపనార్ వర్ధంతి కార్యక్రమంలో ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు.. మాజీ ముఖ్యమంత్రి, ఎన్డీయే తరఫున సీఎం అభ్యర్థి ఎడపాడి పళనిస్వామి ఇప్పుడు మాట్లాడారు అంటూ అన్నామలై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘2026లో మార్పు రావాలి, పేదల అభివృద్ధికి ప్రభుత్వం పని చేయాలి. ఎన్డీయే సీఎం అభ్యర్థిగా ఈపీఎస్ ఉన్నారు’’ అని అన్నారు. దీంతో వీళ్ల రాజకీయ ఐక్యతపై చర్చకు దారి తీసింది. పళనిస్వామి (EPS), అన్నామలై మధ్య విభేదాలు తమిళనాడు ఎన్డీయే కూటమిలో రాజకీయంగా గణనీయమైన ప్రభావం చూపించాయి. వ్యక్తిగత విమర్శలతో పాటు అన్నాడీఎంకే అవసరం ఎన్డీయేకు లేదన్నట్లుగా అన్నామలై వ్యవహరించారు. పైగా సీఎం అభ్యర్థిగా ఈపీఎస్ వర్గం చేసిన ప్రకటనను ఖండించారు. ఈ తీరుతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. అయితే.. ఈ రాజకీయంతో ఈపీఎస్ వర్గం బలపడగా.. బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో.. అన్నామలై వైఖరినే మార్చాల్సిన అవసరం బీజేపీకి ఏర్పడింది. అందుకే 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహం మార్చి.. ఈపీఎస్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అన్నామలై కూడా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ EPS కు మద్దతు ప్రకటించినట్లు ఆయన మాటల్లోనే తెలుస్తోంది.వీళ్ల కలయికపై ఆదివారం అన్నామలైకి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. ‘‘పార్టీ చెప్పింది, ప్రధాని మోదీ చెప్పారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానిని శిరసావహించడం కేడర్‌గా నా బాధ్యత. అది అర్థం చేసుకోండి’’ అని అన్నామలై వ్యాఖ్యానించారు. గత విమర్శలపై ప్రశ్నించగా.. వ్యక్తిగత అభిప్రాయాలు వేరే. పార్టీ కేడర్‌గా క్రమశిక్షణ పాటించాలి కదా. ఉదాహరణకు డీఎంకే మంత్రిపై నాకు ఎంత కోపం ఉన్నా.. వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని నేను గౌరవిస్తాను. ఇది అంతే. పార్టీ చెప్పినట్లే అన్నామలై వింటాడు’’ అని ఆయన వివరణ ఇచ్చారు.అన్నామలై 2011 బ్యాచ్‌కు చెందిన మాజీ IPS అధికారి. కర్ణాటకలో ఆయన పోలీసాధికారిగా సేవలందించారు. 2019లో పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. 2020లో BJPలో చేరారు. తమిళనాడు BJP అధ్యక్షుడిగా పనిచేసి.. ‘సింగం’గా ప్రజాదరణ పొందారు. అయితే వరుసగా ఎన్నికల్లో పార్టీ సరైన ఫలితాలు రాబట్టకపోవడంతో బీజేపీ అధిష్టానం ఆయన్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది.తాజా పరిణామం.. అన్నాడీఎంకే బీజేపీల మధ్య విభేదాలు తొలిగాయనడానికి సంకేతంగా నిలిచింది. 2026 ఎన్నికల కోసం ఈపీఎస్ నాయకత్వంలో కూటమి ముందుకు సాగుతుందన్న సంకేతాలు స్పష్టంగా అందిస్తోంది. -
షాకింగ్ సర్వే.. ఆ పార్టీ నెత్తిన పాలు పోసే పనిలో విజయ్!!
ఏ పార్టీతో పొత్తు ఉండదు. సింహం ఎప్పటికీ సింహమే!. సింగిల్‌గానే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతాం అంటూ తమిళగ వెట్రి కళగం (Tamilaga Vetri Kazhagam) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మధురైలో జరిగిన టీవీకే మానాడు సూపర్ సక్సెస్ కావడంతో విజయ్ను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలను ప్రముఖ పార్టీలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో.. తమిళనాడులో జరిగిన ఓ సర్వే వెల్లడించిన విషయాలు టీవీకే సహా అక్కడి రాజకీయ పక్షాలకు ఝలక్ ఇచ్చాయి. తమిళనాడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. డీఎంకే అత్యధిక సీట్లు కైవసనం చేసుకుంటుందని తెలిపింది. ప్రతిపక్ష ఎన్డీయే కూటమికి 3 సీట్లు దక్కవచ్చని, అదే సమయంలో విజయ్ టీవీకేకు జీరో ఎదురుకావొచ్చని ఆ సర్వే పేర్కొంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి తమిళనాడులో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 39 స్థానాలను కూటమిలోనే పార్టీలోనే కైవసం చేసుకున్నాయి. అయితే ఇప్పటికిప్పడు జరిగితే మాత్రం 36 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. సంక్షేమ పథకాలతో పాటు హిందీ భాషా వ్యతిరేక ఉద్యమం, నీట్ పోరాటాలు డీఎంకే గెలుపును ప్రభావితం చేసే అంశాలుగా పేర్కొంది.ఇక.. బీజేపీ అన్నాడీఎంకే ఎన్డీయే కూటమికి మూడు స్థానాలు మాత్రమే దక్కవచ్చని పేర్కొంది. అయితే.. ఓటు శాతం మాత్రం 18% నుంచి 37%కి పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. 2024లో ఈ కూటమికి ఒక్క సీటు కూడా రాలేదు. ఇక తమిళనాడులో రాబోయే కాలంలో జరిగే ఎన్నికలకు విజయ్ టీవీకే పార్టీ అదనపు ఆకర్షణగా నిలవబోతోంది. ఈ పార్టీ ఇప్పటిదాకా ఏ ఎన్నికల్లో పోటీ చేసింది లేదు. అయితే ఇప్పటికప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఏ స్థానం దక్కకపోవచ్చని(0 సీట్లు) ఆ సర్వే వెల్లడించింది. విజయ్ పార్టీ పెట్టి ఏడాది పైనే అవుతోంది. అయితే అందులో ముఖాలేవీ జనాలకు పెద్దగా తెలిసినవి కావు. జనాలకు తెలిసిన ముఖాలు టీవీకేలో చేరేందుకు ప్రయత్నిస్తున్నా.. విజయ్ అందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు జనాల్లోకి ఇంకా బలంగా ఆ పార్టీ చొచ్చుకుపోవాల్సిన అవసరం ఉంది. అయితే డీఎంకే వ్యతిరేకతను టీవీకే ఓట్ల రూపంలో మార్చుకోవాలని విజయ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. టీవీకే పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా డీఎంకేకే లాభం కలగించవచ్చని సర్వే పేర్కొంది. తద్వారా.. టీవీకేతో ఎన్డీయే కూటమికే భారీ నష్టం కలగవచ్చని స్పష్టం చేసింది. ఇండియా టుడే సీవోటర్ Mood of the Nation ఆగస్టు 2025 పేరిట నిర్వహించిన ఈ సర్వే నిర్వహించింది. జూలై 1 నుండి ఆగస్టు 14, 2025 మధ్య 2 లక్షల మందికి పైగా ప్రజల అభిప్రాయాలను సేకరించి రూపొందించబడింది. సర్వే లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో జరిగినప్పటికీ మరో ఏడేనిమిది నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకూ సమీకరణాలు ఇలాగే కొనసాగితే మాత్రం.. డీఎంకే నెత్తిన విజయ్ టీవీకే పాలు పోసినట్లే అవుతుందన్న చర్చ జోరుగా నడుస్తోందక్కడ. -
అన్నాడీఎంకేకు పునర్జీవం పోయబోతున్నా!
సాక్షి, చెన్నై: బలహీన పడ్డ అన్నాడీఎంకేకు పునర్జీవం పోయేబోతున్నానని, తనకు ఉన్న అనుభవంతో కార్యాచరణను విస్తృతం చేయనున్నట్టు దివంగత సీఎం జే జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ వ్యాఖ్యానించారు. పోయేస్ గార్డెన్లో మంగళవారం శశికళ మీడియాతో మాట్లాడారు. జయలలిత రాజకీయ ప్రయాణంలో తన పాత్రను గుర్తు చేశారు. ఆమెకు వెన్నంటి ఉంటూ అన్ని అంశాలను నిశితంగా పరిశీలించానన్నారు. 2011లో అధికారంలోకి వచ్చినానంతరం 2016లోమళ్లీ అధికారం దిశగా ముందడుగు వేసి విజయకేతనం ఎగుర వేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె మరణం గురించి పేర్కొంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం కొందరి రూపంలో అన్నాడీఎంకే బలహీన పడిఉందని, అందర్నీ ఏకం చేయడం, బలహీన పడ్డ పారీ్టకి పునర్జీవం పోయడం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టనున్నట్టు, క్రియా శీలక రాజకీయాలోకి రానున్నట్టు ప్రకటించారు. అన్నాడీఎంకేను అధికారంలోకి తీసుకు రావడమే తన లక్ష్యమని, ఇందుకుగాను తనవంతుగా పారీ్టకి పునర్జీవం పోయనున్నట్టు, ఇందుకు సంబంధించిన కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానన్నారు. -
సీఎంల పేర్లు, ఫొటోలను పథకాలకు ఉపయోగించుకోవచ్చు
న్యూఢిల్లీ: తమిళనాడులో ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే రాష్ట్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం నుంచి భారీ ఊరట లభించింది. మీకు అండగా స్టాలిన్( విత్ యూ స్టాలిన్) పేరిట తమిళనాట డీఎంకే సర్కార్ అమలుచేస్తున్న సంక్షేమ పథకం పేరులో ముఖ్యమంత్రి(స్టాలిన్), ఇతర మంత్రుల పేర్లు ఉండటాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. సంక్షేమ పథకంలో స్టాలిన్ పేరు ఉండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ అన్నాడీఎంకే నేత సీవీ షణ్ముగం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేయగా ఆయనకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వు వచ్చింది. దీంతో మద్రాస్ హైకోర్టు తీర్పును డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌చేయగా బుధవారం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజారియాల సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్ షణ్ముగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దురుద్దేశంతో పిటిషన్ వేశారని మండిపడుతూ షణ్ముగంపై రూ.10 లక్షల జరిమానా విధించింది. ‘‘పిటిషనర్ షణ్ముగం అత్యుత్సాహాన్ని మేం ఏమాత్రం ప్రోత్సహించట్లేము. ఆయన కేవలం ఒకే ఒక్క రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకుని పిటిషన్ వేశారు. రాజకీయ పారీ్టలు ప్రభుత్వ నిధులను నాయకుల పేర్లతో వృథాగా ఖర్చుచేస్తున్నారన్న స్పృహ ఆయనకు నిజంగా ఉంటే ఆయన దేశంలో ఇలాంటి అన్ని రాజకీయ పారీ్టలు అమలు చేస్తున్న అన్నీ పథకాలను ఆయన సవాల్చేయాలి. వాస్తవానికి దేశవ్యాప్తంగా ఇలా ముఖ్యమంత్రుల పేర్లను ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఉపయోగిస్తున్నారు. రాజకీయ నాయకుల పేర్లతో పథకాలు ఉండొద్దనే న్యాయబద్ధమైన నిషేధాజ్ఞలు లేవు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ రాజకీయ యుద్ధాలను ఎన్నికల్లో తేల్చుకోవాలి. రాజకీయ యుద్ధాల కోసం కోర్టులను ఉపయోగించుకోవద్దు’’ అని ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. ‘‘షణ్ముగం వేసిన పిటిషన్ న్యాయబద్ధంగా లేదు. చట్టప్రకారం లేదు. అందుకే ఆయనకు అనుకూలంగా గతంలో వచి్చన తీర్పును పక్కనబెడుతున్నాం. ఈమేరకు హైకోర్టు తీర్పును పక్కనబెట్టేందుకు ఉద్దేశించిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను అనుమతిస్తున్నాం’’ అని కోర్టు తెలిపింది. -
‘సర్’ ని ఎవరు కాపాడే యత్నం చేశారు?
చెన్నై: అన్నామలై యూనివర్శిటీ క్యాంపస్‌లో ఓ యువతిపై గతేడాది జరిగిన అత్యాచార కేసులో 39 ఏళ్ల జ్ఞానశేఖరన్ అనే వ్యక్తికి జీవితఖైదు విధిస్తూ చెన్నై మహిళా కోర్టు ఈరోజు(సోమవారం, జూన్ 2) తీర్పునిచ్చింది. జ్ఞానశేఖరన్‌ను దోషిగా తేల్చిన మహిళా కోర్టు.. కనీసం 30 ఏళ్ల జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెల్లడించింది. 2024లో అన్నామలై యూనివర్శిటీ క్యాంపస్‌లో జరిగిన అత్యాచార కేసుకు సంబంధించి గత కొన్నాళ్లుగా అధికార డీఎంకే, ప్రధాన ప్రతిపక్ష అన్నా డీఎంకేల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఈ తీర్పులో ఇప్పటివరకూ నిందితుడిగా ఉన్న జ్ణానశేఖర్‌ను ఎట్టకేలకు దోషిగా తేల్చింది మహిళా కోర్టు. ఆధారాలు నిరూపణ కావడంతో జీవితఖైదు విధించింది. ఈ తీర్పు తర్వాత ప్రధాన ప్రతిపక్షం అన్నా డీఎంకే.. డీఎంకే పార్టీని టార్గెట్ చేసింది. డీఎంకే మద్దతుదారుడైన జ్ఞానశేఖరన్‌ను కాపాడటానికి అధికార పార్టీ తన వంతు కృషి చేసిందంటూ సెటైర్లు వేసింది. ఎఫ్ఐఆర్లో ‘సర్’ అని పేర్కొనడాన్ని ఇక్కడ ఉదహరిస్తూ అన్నాడీఎంకే నేత పళనిస్వామి.. డీఎంకే ప్రెసిడెంట్, సీఎం ఎంకే స్టాలిన్‌పై విమర్శలు గుప్పించారు. ‘ ఇంతకాలం ‘సర్’ని ఎవరు కాపాడారు?, ఈ కేసులో జ్ఞానశేఖరన్ తప్ప ఎవరు నిందితులు కాదు. మరి ఇంతకాలం పాటు విచారణ జరపడానికి డీఎంకే ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేసింది?, కాపాడే ప్రయత్నం చేశారు. సాక్ష్యాలన్నీ బలంగా ఉండటంతో ఇంకేమీ చేయలేకపోయారు’ అంటూ పళనిస్వామి విమర్శించారు. తమ ప్రభుత్వం ఒకసారి అధికారంలోకి వస్తే అన్నింటికీ సమాధానం దొరుకుతుందని పేర్కొన్నారు.దీనికి సీఎం స్టాలిన్ బదులిస్తూ.. ‘ మేము పారదర్శకంగా ఉన్నాం కాబట్టే.. తొందరగా తీర్పు వచ్చింది. కోర్టు కూడా ఈ కేసులో పోలీసుల సాధించిన పురోగతిని కొనియాడింది. మహిళల రక్షణ అనేది మా ప్రభుత్వానికి అత్యంత ముఖ్యం అనే విషయం గుర్తించుకోండి’ అని ట్వీట్ చేశారు. ఇంతకీ ఈ కేసు ఏంటంటే..గతేడాది డిసెంబర్ 23వ తేదీన జ్ఞానశేఖరన్ అన్నామలై క్యాంపస్‌లోకి ప్రవేశించాడు. ముందుగా ఆ బాధిత విద్యార్థిని స్నేహితురాలిపై దాడికి పాల్పడ్డాడు. ఆపై తాను టార్గెట్ చేసిన యువతిపై లైంగిక వేధింపులకు దిగడమే కాకుండా, యూర్శివర్శిటీ సాక్షిగా అత్యాచార యత్నం చేశాడు. దీన్ని వీడియోగా చిత్రీకరించి ఆ యువతిని అక్కడే బ్లాక్ మెయిల్ చేశాడు. దీనిపై యువతి ఫిర్యాదు చేయగా, డిసెండర్ 24వ తేదీన కేసు నమోదైంది. ఆరు నెలల తర్వాత వచ్చిన తీర్పులో అతనికి 30 ఏళ్ల పాటు జీవితఖైదుతో పాటు రూ, 90 వేల జరిమానా విధించింది మహిళా కోర్టు. రోడ్డు పక్కన బిర్యానీలు అమ్ముకునే జ్ఞానశేఖరన్‌పై సుదీర్ఘమైన క్రిమినల్ రికార్డు కూడా ఉన్నట్లు పోలీస్ దర్యాప్తులో తేలింది. -
కత్తులతోనే పొత్తు పొడుపు!
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధి ఉండగానే తమిళనాడులో ప్రత్యర్థి పార్టీల మధ్య చిట పటలు మొదలైపోయాయి. ఈసారి ఎలాగైనా నిలదొక్కుకుని పార్టీ జెండా రెపరెపలాడించాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉన్నట్టు కనబడుతోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై విమర్శల జోరుపెంచారు. స్టాలిన్ కూడా అంతే దీటుగా బదులిస్తున్నారు. రెండేళ్ల క్రితం తమను వీడివెళ్లిన అన్నా డీఎంకేతో బీజేపీ చెలిమిని ఖరారు చేసుకుంది. అందుకోసం అమిత్ షా చెన్నై రావటాన్ని చూస్తే రాబోయే పోరులో తమది కీలకమైన పాత్రని ఆ పార్టీ చెప్పదల్చుకున్నట్టు అర్థమవుతుంది. అయితే ఈ సాన్నిహిత్యం ఏమంత సజావుగా లేదని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. కేవలం ఈ చెలిమి కోసం బీజేపీ అన్నామలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో నయనార్ నాగేంద్రన్ను నియ మించింది. అన్నామలై గత రెండేళ్లుగా డీఎంకే సర్కారుపైకి దూకుడుగా పోతున్నారు. నిరుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఆధిపత్య కులాల వోట్లు రాబట్టడంలో, యువతను సమీకరించటంలో ఆయన విజయం సాధించారు. సీట్లయితే రాలేదుగానీ... బీజేపీ వోటు శాతం 11.24 శాతా నికి చేరుకుంది. కానీ ఆ దూకుడు పొత్తు రాజకీయాల్లో చిచ్చు పెడుతుందన్న భయం బీజేపీ అధిష్ఠా నంలో వుంది. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం పళనిస్వామిపై అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. అవి వ్యక్తిగత స్థాయికి వెళ్లి పోయాయి. అందుకే ఎన్నికల వరకూ పొత్తు సజావుగా వుండాలంటే అన్నామలైని తప్పించటమే మంచిదని కేంద్ర నాయకత్వం భావించింది. నాగేంద్రన్ అన్నాడీఎంకే నుంచి వచ్చినవారే. జయ సర్కారులో పళని స్వామి, ఆయనా సహచరులు కూడా. 2016లో జయ మరణం తర్వాత నాగేంద్రన్ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ మాటెలావున్నా రెండు పార్టీలకూ ఇది ఇష్టం లేని పొత్తే. కొన్ని సీట్లయినా సాధించుకోగలిగితే ద్రవిడ కోటలో పాగా వేశామన్న అభిప్రాయం కలిగించ వచ్చని బీజేపీ ఆశిస్తోంది. అటు అన్నాడీఎంకే పరిస్థితీ ఏమంత బాగోలేదు. జయ మరణంతో అది అనాథగా మారింది. అంత ర్గత కీచులాటల మధ్య 2021 వరకూ ప్రభుత్వం మనుగడ సాగించినా తర్వాత అది మూడు ముక్క లైంది. పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకేకు అసెంబ్లీ ఎన్నికల్లో 66 స్థానాలొచ్చాయి. కానీ గత లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం 39 స్థానాలనూ డీఎంకే కూటమి గెల్చుకుంది. అందుకే అటు బీజేపీకి, ఇటు అన్నాడీఎంకేకు ప్రస్తుత పొత్తు ప్రాణావసరమైంది.సమస్యేమంటే రెండు పార్టీల మధ్యా పొత్తు ఏర్పడినా, అది ఎన్డీయే కూటమిగా ఉంటుందని అమిత్ షా చెప్పినా ఈ చెలిమితో ఇరుపక్షాలూ ఇబ్బంది పడుతున్న వైనం కనబడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే లేకుండానే తాము 11.24 శాతం వోట్లు రాబట్టుకోగలిగామని బీజేపీ ధీమాగా వుంది. కానీ ఆ పరిస్థితి అన్నాడీఎంకేలో లేదు. అధికారంలో పాలుపంచుకుంటామో, లేదో ఎన్నికల తర్వాతే చెబుతామని షా అంటే... ఎన్నికల్లో పోటీవరకే పొత్తులని పళనిస్వామి ప్రక టించారు. తమిళనాడు రాజకీయ ధోరణులు గమనిస్తే అక్కడ కూటమి ప్రభుత్వాలు ఎప్పుడూ లేవు. పొత్తులున్నా రాష్ట్ర మంత్రివర్గంలో ఏనాడూ జాతీయ పార్టీలకు చోటీయలేదు. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందనుకుంటే తప్ప తమిళ వోటర్లు కనికరించరని పళనిస్వామి, అమిత్ షాలు అనుకుని వుండొచ్చు. అయితే డీఎంకేపై విరుచుకుపడటానికి తగిన ఆయుధాలు లేకపోవటం ఎన్డీయే కూటమికున్న ప్రధాన సమస్య. కాశీకి ప్రత్యేక రైలు నడపటం, కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్, వీణ పెట్టడం ద్రవిడ రాజకీయ ప్రాబల్యంగల తమిళనాడును అంతగా ఆకర్షించినట్టు లేదు. స్టాలిన్ అమ్ములపొదిలో చాలా అస్త్రాలున్నాయి. ముఖ్యంగా ఆయన తమిళుల ఆత్మగౌరవంఅంశాన్ని ముందుకు తెచ్చారు. తమిళులు అనాగరికులని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యా నించటం, అనంతరం క్షమాపణ చెప్పటం ప్రస్తావిస్తున్నారు. బలవంతంగా హిందీ రుద్దాలని చూస్తు న్నారని ఆరోపిస్తున్నారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం నవీన్ పట్నాయక్‌కు సన్నిహి తుడైన తమిళ ఐఏఎస్ అధికారి వీకే పాండ్యన్‌పై బీజేపీ రేపిన దుమారాన్ని గుర్తుచేస్తున్నారు. ఒడిశా ప్రజలపై తమిళులు పెత్తనం ఎలా చేస్తారని ప్రశ్నించటాన్ని ఎత్తిచూపుతున్నారు. గత పదేళ్లలో తమిళ నాడుకు కేంద్ర నిధులు మూడు రెట్లు పెరిగినా కొందరికి ఏడవటం అలవాటైపోయిందన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలనూ ఆయన తనకు అనుకూలంగా మలుచుకున్నారు. తమ వంతు వాటా అడగటం తమ హక్కని, అందుకు ఏడవటం లేదా బానిసత్వం చేయటం చేతకాదని స్టాలిన్ జవాబి చ్చారు. 234 స్థానాలుగల అసెంబ్లీలో గత ఎన్నికల్లో డీఎంకే సొంతంగా 133, మిత్రులతో కలిసి 159 గెల్చుకుంది. 46 శాతం వోట్లు రాబట్టింది.ఇప్పటికైతే తమిళనాట సామాజిక న్యాయం, రాష్ట్రాల హక్కులు, ఆత్మగౌరవం ప్రధానాంశాలు. గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లుల్ని దీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచటం, సుప్రీంకోర్టు ఆయన్ను మందలించటంతోపాటు వాటిని ఆమోదించినట్టుగా భావించాలని చెప్పటం స్టాలిన్‌కు మరింత శక్తినిచ్చింది. అవినీతి పెరిగిందని, వేలకోట్ల ప్రజాధనాన్ని డీఎంకే నేతలు దోచు కుంటున్నారని, శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని బీజేపీ చేస్తున్న ఆరోపణలు ప్రజల్ని ఎంతవరకూ కదలించగలవో చూడాలి. అంతకన్నా ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగే వచ్చే ఏప్రిల్‌నాటికైనా తమ పొత్తు విషయంలో ఆత్మవిశ్వాసాన్ని కనబర్చటం అవసరమని ఎన్డీయే గుర్తించాలి. -
వారి చేతిలో బందీగా మారిన బానిసలు: ఎంకే స్టాలిన్
చెన్నై: తమిళనాడులో అన్నా డీఎంకే, బీజేపీల పొత్తుపై ఆ రాష్ట్ర సీఎం , డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. ఇదొక ఓడిపోయే అవినీతి కూటమి అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర స్వయంప్రతిపత్తిని తాకట్టు పెట్టి అధికారం కోసం అర్రులు చాస్టున్న కూటమి, బీజేపీ చేతిలో బందీగా మారిన బానిస పార్టీ అంటూ మండిపడ్డారు. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్త పెట్టుకున్న సంగతి తెలిసిందే. అన్నా డీఎంకేతో పొత్తు విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న(శుక్రవారం) అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో(2026 అసెంబ్లీ ఎన్నికల్లో) ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పడినట్లు అమిత్ షా పేర్కొన్నారు.దీనిపై స్టాలిన్ మాట్లాడుతూ.. ‘ రెండు పార్టీల సిద్ధాంతాల్లో క్లారిటీ అనేది లేదు. ఏదో పొత్తు పెట్టుకోవాలి కాబట్టి.. అన్నా డీఎంకేతో సంధి కుదుర్చుకున్నారు. నీట్ అంశాన్ని ఏఐఏడీఎంకే వ్యతిరేకించింది. ఇదే తరహాలో రాష్ట్రంలో త్రి భాషా విధానంలో హిందీ భాషను రుద్దే అంశాన్ని, వక్ప్ యాక్ట్ ను, డీలిమిటేషన్ అంశాన్ని కూడా అన్నాడీఎంకే వ్యతిరేకించింది. మరి అటువంటప్పుడు బీజేపీతో అన్నాడీఎంకే ఎలా పొత్తు పెట్టుకుంది.ఇరు పార్టీలు పొత్తు పెట్టుకునేటప్పుడు కామన్ మినిమమ్ ప్రాగ్రామ్(సీఎంపీ) అనేది ఒకటి ఉంటుంది కదా. మరి వీటి గురించి హోంమంత్రి అమిత్ షా ఏమీ మాట్లాడలేదు. అలాగే అన్నాడీఎంకే నేతలు కూడా ఏమీ నోరు విప్పలేదు. ఏదో ప్రెస్ మీట్ పెట్టి పొత్తు కుదుర్చుకున్నారు. అదే పనిగా డీఎంకేపై, నాపై వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. నీట్ ను సీబీఐ దర్యాప్తు చేస్తుంది కదా.. అటువంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎందుకు చేశారు అమిత్ షా. సీబీఐ అనేది కేంద్రం చేతుల్లోనే కదా ఉండేది’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు స్టాలిన్. -
ఆపరేషన్ 2026 ఎలక్షన్స్ ... అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు
-
పళనిస్వామి (ఏఐఎడీఎంకే) రాయని డైరీ
ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లో ఉన్న అమిత్‌షా నివాసానికి వెళ్లి, ఆయన్ని కలిసి బయటికి రాగానే... ఆ చీకట్లో మీడియా వాళ్లు నిలబడి మిణుగురుల్లా మెరుస్తూ ఉన్నారు!‘‘సర్! వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయబోతు న్నారట కదా? పొత్తు కుదుర్చుకోవటం కోసమే మీరు అమిత్‌షాను కలిసేందుకు వచ్చారా?’’ – ఆరంభ ప్రశ్న.‘‘లేదు లేదు, ఢిల్లీలో మా పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం పని మీద వచ్చాం...’’ అన్నాను. ‘‘సర్! మీ ఢిల్లీ ఆఫీస్‌ని మీరు ఫిబ్రవరి 10 నే వర్చువల్‌గా చెన్నై నుంచి ప్రారంభించారు కదా, మళ్లీ ఇప్పుడేమిటి! అమిత్షాతోగంటన్నరకు పైగా మాట్లాడారు. ఏడాదిన్నర క్రితం బీజేపీకి బ్రేకప్ చెప్పాక, తిరిగి ఇన్నాళ్లకు ఇప్పుడే కదా మీరు అమిత్‌షాను కలవటం!ఇంతసేపూ ఆయనతో ఏం మాట్లాడారు సర్ మీరు?’’ – ఆరాలు తీస్తున్న ప్రశ్న. ‘‘అలా ఏం లేదు. అమిత్జీని అనుకోకుండా కలిశాం...’’ అన్నాను.‘‘కానీ సర్, చెన్నై నుంచి ఉదయాన్నే మీరు ఢిల్లీ వచ్చారు. మధ్యాహ్నానికి మీ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కేపీ మునుస్వామి, సీనియర్ లీడర్ వేలుమణి మీ వెనుకే ఢిల్లీకి రీచ్ అయ్యారు. సాయంత్రానికి ఢిల్లీలోనే ఉంటున్న మరో ఇద్దరు సీనియర్ లీడర్లు తంబిదొరై,సీవీ షణ్ముగం మీతో జాయిన్ అయ్యారు.అంతా కలిసి చీకటి పడ్డాక అమిత్‌షా నివాసానికి వెళ్లారు. అమిత్‌షాను కలవాలని అందరూ అనుకునే కలిశాక, అదెలా సర్ అమిత్‌షాను అనుకోకుండా కలవటం అవుతుంది?’’ – ఆధారాలు సేకరించిన ప్రశ్న!‘‘మీరనుకుంటున్నట్లు మేమేమీ చీకటి పడ్డాక అమిత్జీని కలవలేదు. అమిత్జీని కలిసేటప్పటికే చీకటి పడినట్లుంది. వెళ్లి కలిశాం, శాలువా కప్పాం, కాసేపు మాట్లాడాం. వచ్చేశాం...’’ అని నవ్వుతూ చెప్పాను.‘‘మరి, బీజేపీ వాళ్లు ఇంకోలా చెబుతు న్నారు కదా సర్?’’ – చీకట్లో విసిరిన ప్రశ్న!‘‘మేము లోపలికి వెళ్లినప్పుడు లోపల ఉన్నది మీరంటున్న బీజేపీ వాళ్లలో అమిత్జీ ఒక్కరే. ఆయనే మీకు చెప్పారంటారా,ఇంకోలా?’’ అని అడిగాను. ‘‘లేదు సర్, ‘కలిసి పోటీ చేద్దాం’ అని మీరు అమిత్‌షాను అడిగినప్పుడు, అందుకాయన ‘మీరు 117 సీట్లలో, మేము 117 సీట్లలో సగం సగం పోటీ చేయటానికి ఒప్పుకుంటేనే మీతో కలుస్తాం...’ అని మీకు కండిషన్ పెట్టారట కదా?! – ఊహించి వేసిన ప్రశ్న.‘‘ఇంకా?!’’ అన్నాను.‘‘పార్టీ నుంచి బహిష్కరించిన దినకరన్‌ని, శశికళను, పన్నీర్‌సెల్వంను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని కూడా అమిత్‌షా మీకు కండి షన్ పెట్టారట కదా సర్...’’ – ఇదైతే కచ్చితంగా బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై వేయించిన ప్రశ్న!పొత్తు కోసం నేను అమిత్జీ దగ్గరకు వెళ్లకుండా, అమిత్జీనే పొత్తు కోసం నా దగ్గరకు వచ్చి ఉంటే, ముందు ఆ అన్నామలైని మార్చి, వేరెవరినైనా బీజేపీ ఛీప్‌గా పెట్టమని నేనే కండిషన్ పెట్టి ఉండేవాడిని.‘‘చెప్పండి సర్! బీజేపీతో పొత్తు కోసం కాదా మీరు అమిత్‌షాను కలిసింది?’’ – తిరిగి మళ్లీ అదే ఆరంభ ప్రశ్న. ‘‘తమిళనాడులో డ్యామ్‌ల సమస్య ఉంది. స్కామ్‌ల సమస్య ఉంది. లాంగ్వేజీల సమస్య ఉంది. డీ–లిమిటేషన్ సమస్య ఉంది. డీఎంకే సమస్య ఉంది. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మేము వాటి గురించి మాట్లాడి ఉండొచ్చని మీరెందుకు అనుకోరు?’’ అని అడిగాను. ‘‘బీజేపీతో పొత్తు కోసం మీరిక్కడికి వస్తే, అక్కడ చెన్నైలో అన్నామలై మీరంటే పడని వాళ్లందరితో పొత్తు పెట్టుకుంటున్నారు. దీనికేమంటారు సర్?’’ – ఇంకేదో రాబట్టే ప్రశ్న. నేనేమీ అనలేదు. డ్యామ్‌లు, స్కామ్‌లు, లాంగ్వేజీలు, డీ–లిమిటేషన్, డీఎంకే... వీటన్నిటికన్నా తమిళనాడుకు అతి పెద్ద సమస్య అన్నామలై... అని నాతో చెప్పించటానికే ఈ మిణుగురులు ఇక్కడికి చేరినట్లు నాకర్థమైంది! -
తమిళనాట ‘విజయ్’ ట్విస్ట్.. పీకే కీలక ప్రకటన
సాక్షి, చైన్నె: తమిళనాట రాజకీయం ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ పొత్తులు, కీలక నేతల పోటీ విషయంలో ఆసక్తి నెలకొంది. ఇక, సినీ నటుడు విజయ్ కొత్త పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు.తమిళనాడులో 2026 ఎన్నికలలో విజయ్ తమిళగ వెట్రి కళగం అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఎన్నికల ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. తమిళగ వెట్రి కళగం నేత విజయ్ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ఆయన్ని సీఎం చేయడమే లక్ష్యంగా రంగంలోకి ప్రశాంత్ కిషోర్ దిగారు. గత వారం జరిగిన విజయ్ పార్టీ రెండో ఆవిర్భావ వేడుక వేదికపై ప్రశాంత్ కిషోర్ సైతం కూర్చున్నారు. ప్రత్యేక ప్రసంగం కూడా చేశారు.2026లో విజయ్ను సీఎం చేయడమే లక్ష్యంగా తన సహకారం, మద్దతును ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఓ తమిళ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు శనివారం వైరల్ అయ్యాయి. 2026 ఎన్నికలలో విజయ్ పార్టీ అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయన్న చర్చకు ముగింపు పలికే విధంగా ప్రశాంత్ కిషోర్ స్పందించారు. అన్నాడీఎంకేతో విజయ్ పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆయన ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటారని, ఆ దిశగానే వ్యూహ రచనలు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. ఒంటరిగానే తన బలాన్ని చాటి, అధికారం చేజిక్కించుకునే దిశగా ముందుకెళ్తున్నట్టు ప్రశాంత్ కిషోర్ పేర్కొనడం గమనార్హం. -
విజయ్ Y కేటగిరీ భద్రతపై రాజకీయ దుమారం
చెన్నై: అగ్రనటుడు, టీవైకే పార్టీ అధినేత విజయ్‌కు కేంద్రం ‘వై’ కేటగిరీ భద్రతను కేటాయించింది. రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా మారడం, పైగా తరచూ జనాల్లోకి వెళ్తుండడంతో ఆయన ప్రాణాలకు ముప్పు కలగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంతోనే హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది.నటుడు, రాజకీయనేత అయిన విజయ్(Vijay)తో పాటు పలువురు ప్రముఖుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తాజాగా కేంద్ర హోం శాఖకు నివేదికలు ఇచ్చాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో(Intelligence Bureau) సూచనల మేరకు వాళ్లందరికీ ‘ఎక్స్, వై, జెడ్’ కేటగిరీల కింద ప్రత్యేక భద్రత కల్పించేందుకు కేంద్ర హోం శాఖ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఫిబ్రవరి 13వ తేదీన ఓ నోటిఫికేషన్ కూడా రిలీజ్చేసింది. తాజా నిర్ణయంతో.. ఒకరు లేదా ఇద్దరు కమాండోలతో పాటు 8-11 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది విజయ్‌కు భద్రతగా ఉండనున్నారు. అయితే..ఈ వ్యవహారం(Vijay Security Row) తమిళనాట రాజకీయ విమర్శలకు దారి తీసింది. విజయ్‌కు రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి భద్రత ఎందుకు కల్పించలేకపోయిందని బీజేపీ ప్రశ్నలు సంధించింది. ‘‘విజయ్ తమిళనాట ప్రజాదరణ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి భద్రతకు ముప్పు పొంచి ఉందనే సమాచారం ఉన్నప్పుడు.. ఇక్కడి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. డీఎంకే ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించేందుకు ముందుకు రావొచ్చు కదా?’’ అని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ప్రశ్నించారు. దీనిపై డీఎంకే నుంచి బదులు రావాల్సి ఉంది.మరోవైపు.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో విజయ్ను ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ ఆడుతున్న డ్రామా ఇదని అన్నాడీఎంకే(AIADMK) ఆరోపిస్తోంది. నిజాయితీగా విజయ్‌కు కేంద్రం భద్రతను ఇచ్చి ఉంటే ఫర్వాలేదు. కానీ, రాజకీయం కోసం చేసి ఉంటే మాత్రం.. తమిళనాడులో అలాంటి పాచికలు పారవు’’ అని అన్నాడీఎంకే నేత మునుస్వామి చురకలటించారు.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కు తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కిందటి ఏడాది ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కజగం అనే పార్టీని ప్రకటించారు. రాష్ట్రంలో డీఎంకే, కేంద్రంలోని బీజేపీకి తన పార్టీ ప్రత్యామ్నాయమని ప్రకటించారాయన. ఆ మధ్య నిర్వహించిన ఓ బహిరంగ సభకు అశేషమైన స్పందన లభించింది కూడా. తరచూ జనాల్లో వెళ్తున్నారు కూడా. ఇక విజయ్ కదలికలను రాజకీయ వర్గాలు నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నాయి. అలాగే.. మాజీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తోనూ ఆయన తరచూ భేటీ అవుతూ వస్తున్నారు. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలనే లక్ష్యంగా ఆయన టీవీకేను ముందుకు తీసుకెళ్తున్నారు.ఇదీ చదవండి: కళ్లు చెదిరిపోయేలా.. జయలలిత ఆస్తులు! -
అవును.. నిందితుడు మా పార్టీ మద్దతుదారుడే: సీఎం స్టాలిన్
చెన్నై: అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఘటన తమిళనాట రాజకీయ దుమారం రేపుతోంది. అసెంబ్లీని సైతం దద్దరిల్లిపోయేలా చేసిన ఈ ఘటనపై బుధవారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. నిందితుడు తమ పార్టీ మద్దతుదారుడేనని ప్రకటించారాయన. అయితే..అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజు సీఎం స్టాలిన్(CM Stalin) మాట్లాడుతూ.. ‘‘అన్నా వర్సిటీ ఘటనలో నిందితుడు కేవలం డీఎంకే మద్దతుదారుడేనని, ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నట్లు పార్టీ సభ్యుడు ఎంతమాత్రం కాదు’’ స్పష్టత ఇచ్చారు. అంతేకాదు.. మహిళల భద్రతే ప్రాధాన్యంగా పని చేస్తున్న తమ ప్రభుత్వం.. నిందితుడికి రక్షణ కల్పించలేదని, భవిష్యత్తులోనూ కల్పించబోదని, పైగా అతనిపై గుండా యాక్ట్ ప్రయోగించామని ప్రకటించారు. అన్నా వర్సిటీ ఘటన.. ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును సీఎం స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు.‘‘విద్యార్థినిపై లైంగిక దాడి(Sexual Assault) క్రూరమైన ఘటన. అయితే.. చట్ట సభ్యులు ఇవాళ ఈ అంశం మీద ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని విమర్శించడమే అంతా పనిగా పెట్టుకున్నారు. బాధితురాలి తరఫు నిలబడి సత్వర న్యాయం చేకూర్చాలనే మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సాధారణంగా.. ఘటన జరిగాక నిందితుడు తప్పించుకుంటేనో.. అరెస్ట్‌లో జాప్యం జరిగితేనో.. లేకుంటే నిందితుడ్ని రక్షించే ప్రయత్నాలు జరిగితేనో విమర్శలు వినిపిస్తాయి. కానీ, ఇక్కడ వీలైనంత త్వరగా అరెస్ట్ చేసినా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేసే రాద్ధాంతం కాకపోతే ఇంకేంటి?’’ అని ప్రశ్నించారాయన. అన్నా వర్సిటీ(Anna University) ఘటనకు నిరసనగా ప్రతిపక్ష అన్నాడీఎంకే సభ్యులు నల్లదుస్తులతో అసెంబ్లీకి వచ్చారు. వాళ్లను ఉద్దేశిస్తూ సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.గతంలో ఇదే ప్రతిపక్ష అన్నాడీఎంకే అధికారంలో ఉండగా.. పొల్లాచ్చి లైంగిక దాడి కేసు సంచలనం సృష్టించింది. ఆ టైంలో ప్రభుత్వం ఏం చేసింది?.. ఆలస్యంగా స్పందించడంతో నిందితుడు పారిపోలేదా? అని ప్రశ్నించారాయన. ప్రతిపక్షాలంతా నిందితుడు ఎవరు? మీ పార్టీ వాడు కాదా అని ప్రశ్నిస్తున్నాయి. అవును.. అతను మా పార్టీ మద్దతుదారుడే. కానీ, సభ్యుడు మాత్రం కాదు. ఈ విషయాన్ని మేం ముందు నుంచే చెబుతున్నాం. అరెస్ట్ విషయంలోనూ ఎక్కడా రాజకీయ జోక్యం జరగలేదు. ఒకవేళ.. అలా జరిగిందని ఆధారాలు ఉంటే సిట్‌కు సమర్పించండి. దర్యాప్తు అయ్యేదాకా ఎదురుచూడడండి. అంతేగానీ స్వప్రయోజనాల కోసం చిల్లర రాజకీయాలు చేయొద్దు అని ప్రతిపకక్షాలను ఉద్దేశించి హితవు పలికారాయన. ఈ తరుణంలో అసెంబ్లీ నుంచి అన్నాడీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. ఇదిలా ఉంటే.. అన్నా వర్సిటీ ఉందంతంపై దాఖలైన ఓ పిటిషన్ విషయంలోనూ మదద్రాస్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘అసలు మహిళల భద్రతపై ఎవరికీ అసలు చిత్తశుద్ధి లేదు. అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసును అంతా రాజకీయం చేస్తున్నారు. కేవలం వాళ్ల అవసరం వాడుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించింది. డిసెంబర్ 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో క్యాంపస్‌లో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని(19) తన స్నేహితుడితో మాట్లాడుతుండగా.. దాడి చేసి ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగాయి. అదే సమయంలో.. క్యాంపస్‌కు దగ్గర్లో బిర్యానీ సెంటర్ నడిపే జ్ఞానేశ్వర్‌ను నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతను డీఎంకే సభ్యుడంటూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. మరోవైపు.. ఈ కేసులో ఇంకొంతమంది నిందితులు ఉన్నారని.. వాళ్లను రక్షించే ప్రయత్నం జరుగుతోందంటూ డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు.ఇదీ చదవండి: బీజేపీ నేత నోటి దురుసు! ఫలితంగా.. -
సోషల్‌మీడియాలో వివాదస్పద పోస్టు.. నటుడికి జైలు శిక్ష
సినీ నటుడు, రాజకీయ ప్రముఖుడు ఎస్వీ శేఖర్‌కు నెల రోజులు జైలు శిక్షను ఖరారు చేస్తూ మద్రాసు హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. 2018లో ఎస్వీ శేఖర్ సామాజిక మాధ్యమాలలో పెట్టిన ఓ పోస్టు వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. మహిళా జర్నలిస్టును ఉద్దేశించి ఆయన ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు విచారణలో తేలింది. చైన్నె మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా జర్నలిస్టులకు వ్యతిరేకంగానే ఆయన నోరు జారినట్టు విచారణలో వెలుగు చూసింది. అదే సమయంలో పశ్చాత్తాపం వ్యక్తంచేస్తూ ఎస్వీ శేఖర్ క్షమాపణ చెప్పుకున్నా, కేసు మాత్రం కొనసాగుతూ వచ్చింది. ఈ కేసును రద్దు చేయాలని హైకోర్టును సైతం శేఖర్ ఆశ్రయించారు. విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు సైతం స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు చైన్నె కలెక్టరేట్ ఆవరణలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయ వేల్ విచారించారు. విచారణను ముగించిన ప్రత్యేక కోర్టు గత ఏడాది ప్రారంభంలో తీర్పు వెలువరించింది. ఎస్వీశేఖర్‌కు నెల రోజులు జైలు శిక్ష, రూ. 15 వేలు జరిమాన విధించారు. అదే సమయంలో అప్పీల్‌కు అవకాశం కల్పించాలని ఎస్వీశేఖర్ తరపున న్యాయమూర్తికి న్యాయవాదులు విజ్ఞప్తి చేయడంతో సమయం కేటాయించారు. అప్పీలు పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించడంతో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రాలేదు. ఈ పిటిషన్ విచారణ ప్రస్తుతం ముగిసింది. తీర్పును న్యాయమూర్తి వేల్ మురుగన్ వెలువరించారు. ప్రత్యేక కోర్టు విధించిన నెల రోజుల జైలు శిక్షను ఖరారు చేశారు. అప్పీల్ పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఎస్వీ శేఖర్ తెలుగు వారికి కూడా పరిచయమే.. ఆకలి రాజ్యం,అందమైన అనుభవం,వల్లభ,ఒకే ఒక్కడు వంటి చిత్రాలలో ఆయన నటించారు. 100కు పైగా తమిళ సినిమాలలో మెప్పించారు. 2006లో ఏఐఏడీఎంకే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు.మహిళా జర్నలిస్ట్‌పై నీచమైన కామెంట్తమిళనాడులో చదువుకోని, ఇంగితజ్ఞానం లేని అమ్మాయిలే ఎక్కువగా మీడియాలో పనిచేస్తున్నారని ఒక మహిళా జర్నలిస్ట్‌ను ఉద్దేశిస్తూ.. 2018లో ఆయన ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. 'విశ్వవిద్యాలయాల కంటే, మీడియాలో లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. వారు తమ బాస్‌లతో సన్నిహితంగా ఉంటూ అందుకు ఫలితంగా రిపోర్టర్లు, న్యూస్ యాంకర్లుగా ఉద్యోగాలు పొందుతున్నారు. సాధారణంగా, తమిళనాడులోని మీడియా మొత్తం నేరస్థులు, కిరాతకులు, దోపిడీదారుల చేతుల్లో చిక్కుకుంది.' అని పేర్కొన్నాడు. -
తమిళగ వెట్రి కళగం పార్టీపై వార్తలు.. నిజమేనా?
చెన్నై : 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళగ వెట్రి కగళం (టీవీకే) పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకి నెటింట్లో ట్రెండ్ అవుతున్న ఆ వార్త నిజమేనా? దీనిపై దళపతి విజయ్ ఏమన్నారు2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే- ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పొత్తు పెట్టుకోనున్నాయని తమిళ ప్రధాన మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. అందుకు గత అక్టోబర్ నెలలో టీవీకే పార్టీ తొలి బహిరంగ సభలో విజయ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని కొన్ని ఆధారాల్ని జత చేశాయి.అక్టోబర్‌లో విల్లుపురం జిల్లా విక్రవాండిలోని వీసాలై గ్రామంలో తమిళగ వెట్రి కళగం ఆవిర్భావోత్సవం, సిద్ధాంతాల వేడుకైన పార్టీ తొలి బహిరంగ సభ జరిగింది. ఆ సభలో విజయ్ డీఎంకే, బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అయితే ఎక్కడా ఏఐఏడీఎంకే గురించి ఎక్కడా మాట్లాడలేదని హైలెట్ చేశాయి.అయితే, ఈ కథనాలపై విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏఐఏడీఎంకేతో టీవీకే పొత్తు అనేది పూర్తిగా అబద్ధమని ఖండించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలు లేకుండా టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుంది. ప్రజల మద్దతుతో మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ విశ్లేషకుల ముసుగులో మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందని, ఇలాంటి అవాస్తవ, తప్పుడు వార్తలను పట్టించుకోవద్దని తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను’అని టీవీకే ఎక్స్ వేదికగా వివరణిచ్చింది. தலைமை நிலையச் செயலக அறிவிப்புதமிழக வெற்றிக் கழகத்தின் முதல் மாநில மாநாட்டில் கழகத்தின் கொள்கைகள், கொள்கை எதிரி, அரசியல் எதிரி, தேர்தல் நிலைப்பாடு குறித்தும் தமது உரையில் கழகத் தலைவர் அவர்கள் தெளிவாக, விளக்கமாக எடுத்துரைத்துள்ளார். கழகத் தலைவர் அவர்களின் வழிகாட்டுதலின்படி…— TVK Party Updates (@TVKHQUpdates) November 18, 2024 -
‘విజయ్ పార్టీది.. కాపీ, కాక్టెయిల్ భావజాలం’
చెన్నై: తమిళనాడు స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఇప్పటికే తమిళగ వెట్రి కళగం(టీవీకే) పేరుతో పార్టీని స్థాపించారు. ఆయన పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనుంది. ఈ సందర్భంగా ఆదివారం విల్లుపురంలో నిర్వహించిన సభలో.. టీవీకే పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఈ భారీ బహిరంగ సభకు లక్షల సంఖ్యలో విజయ్ అభిమానులు హాజరైన విషయం తెలిసిందే.అయితే.. తాజాగా రాజకీయాల్లో విజయ్ చెప్పిన భావజాలాన్ని డీఎంకే పార్టీ కొట్టిపారేసింది. ఆయన పార్టీ సిద్ధాంతాలపై అధికార డీఎంకే పార్టీ నేత విమర్శలు గుప్పించారు. విజయ్ తన పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని ఇతర పార్టీల నుంచి కాపీ కొట్టారని డీఎంకే నేత టీకేఎస్ ఇలంగోవన్ అన్నారు. విజయ్ పార్టీ సిద్ధాంతాలు, భావజాలం.. ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే, ఇతర పార్టీల ప్రస్తుత రాజకీయ దృక్కోణాల ‘కాక్టెయిల్’ అని ఎద్దేవా చేశారు. ‘‘అవన్నీ మా విధానాలు, కానీ విజయ వాటిని కాపీ చేశాడు. ఆయన ఏది చెప్పినా.. అది మేం ఇప్పటికే చెప్పాం, ఇప్పటికీ మేం వాటిని అనుసరిస్తున్నాం’’అని అన్నారు.ఇక.. నిన్న( ఆదివారం) విజయ్ తన తొలి బహిరంగ సభ ప్రసంగంలో అధికార డీఎంకే పార్టీ లక్ష్యంగా విమర్శలు చేశారు. ద్రవిడియన్ మోడల్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను తమ పార్టీ అనుసరిస్తామని తెలిపారు. తమిళనాడు గడ్డకు అవీ రెండు కళ్ల లాంటివన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా పార్టీ భావజాలమని ఆయన స్పష్టం చేశారు. పెరియార్ ఈవీ రామస్వామి, కె.కామరాజ్, బాబాసాహెబ్ అంబేడ్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని విజయ్ వెల్లడించారు. నాకు రాజకీయ అనుభవం లేకపోయినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తొలి సభలోనే డీఎంకే, బీజేపీపై విమర్శలు గుప్పించారు. -
జ్యోతిష్యం ఫలిస్తుంది!
సాక్షి, చెన్నై: జ్యోతిష్యం ఫలిస్తుందని, 2026లో రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని ఆపార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం సేలంలో జరిగిన పార్టీ నేతల సమావేశానంతరం పళణిస్వామి మీడియాతో మాట్లాడారు. డీఎంకే కూటమిలో పొగచిచ్చుగా మారడం ఖాయం అన్నారు. 41 నెలల డీఎంకే పాలనలో నోరెత్తని కూటమి పారీ్టల నేతలు ఇప్పడు విమర్శలు గుప్పించడాన్ని ప్రతిఒక్కరూ పరిగణించాలన్నారు. ఈ పరిణామం చీలిక కాదా అని ప్రశ్నించారు. పళని స్వామి జ్యోతిష్కుడు అయ్యాడని సీఎం వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. వాస్తవమే జ్యోతిష్యం ఫలిస్తుందని 2026లో రాష్ట్రంలో అధికారం అన్నాడీఎంకే గుప్పెట్లోకే అని ధీమా వ్యక్తంచేశారు. దేశంలోనే తమిళనాడు అవినీతిలో ముందంజలో ఉందని ధ్వజమెత్తారు. అన్నాడీఎంకేలో యువత రావాలని, యువతను ఆకర్షించే కార్యక్రమాలు విస్తృతంచేయనున్నట్టు పేర్కొన్నారు. పళణికి నోటీసులు.. పళణిస్వామికి మద్రాసు హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో గతంలో సినీ నిర్మాత జాఫర్ సాధిక్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను అస్త్రంగా చేసుకుని డీఎంకేపై పళణిస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పేరుకు కళంగం తెచ్చే విధంగా వ్యవహరించారని ఆయనపై డీఎంకే సీనియర్ నేత ఆర్ఎస్ భారతీ రూ.కోటి పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి టికారాం విచారించారు. వాదనల అనంతరం వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పళణిస్వామికి నోటీసులు జారీ చేశారు. -
టైం వచ్చింది.. నా రీఎంట్రీ మొదలైంది: శశికళ
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే రాజకీయాలలో తన ప్రవేశానికి సమయం ఆసన్నమైందని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ వ్యాఖ్యానించారు. చైన్నెలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే కార్యకర్తల పార్టీ అని అన్నారు. ఈ పార్టీని దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత చెక్కు చెదరకుండా పరిరక్షించారని వివరించారు. అయితే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన, మనో వేదనకు గురి చేస్తున్నాయన్నారు. కుల మతాలకు అతీతంగా అన్నాడీఎంకేలో అందర్నీ దివంగత నేత జయలలిత చూసే వారు అని గుర్తుచేశారు. కుల, మతం చూసి ఉంటే తనను దగ్గర చేర్చి ఉంటారా? అని ప్రశ్నించారు. ఆమెకు అందరూ సమానం అని, అందుకే ఆమెను ప్రజలు అమ్మగా కొలుస్తూ వస్తున్నారన్నారు. అయితే ప్రస్తుతం అన్నాడీఎంకేలోకి కులం ప్రవేశించిందని, ఓ సామాజిక వర్గంకు చెందిన వారు వ్యక్తిగత స్వలాభం, ఆధిపత్యం దిశగా చేస్తున్న ప్రయత్నాలు పార్టీని పాతాళంలోకి నెడుతున్నదని ఆరోపించారు. అన్నాడీఎంకే అంటే ఒకే కుటుంబం అని, ఇది కార్యకర్తల పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. డీఎంకే అంటే ఒకే కుటుంబం అని ఆ కుటుంబానికి చెందిన వారికే అందులో పదవులు ఉంటాయని విమర్శించారు. డీఎంకే విధానాన్ని అన్నాడీఎంకేలోకి అనుమతించే ప్రసక్తేలేదన్నారు. తన లక్ష్యం ఒక్కటే అని అందర్నీ ఏకం చేయడం అన్నాడీఎంకేను బలోపేతం చేసి రానున్న ఎన్నికలలో విజయంతో అధికారం చేజిక్కించుకోవడమేనని అన్నారు. ఇందుకోసం తన ప్రయత్నం మొదలెట్టానని, తన ప్రవేశానికి సమయం ఆసన్నమైందని, ఇక, మరింత వేగంగా ముందుకెళ్లబోతున్నట్టు శశికళ తెలిపారు. -
అన్నాడీఎంకేలో నా పార్టీ విలీనం చేయను: టీటీవీ దినకరన్
చెన్నై: తమిళనాడు లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అన్నాడీఎంకే ఘోర ఓటమికి ఆ పార్టీ నేత ఎడప్పాడి కె పళనిస్వామి క్షమాపణలు చెప్పాలని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ అన్నారు. తంజావురులో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే పార్టీ ప్రస్తుతం డబ్బులు ఉన్నవారి చేతిలో చిక్కుకుందన్నారు.కేవలం కార్యర్తలు మాత్రమే దివంగత జయలలిత అభిమానులని తెలిపారు. ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీకి నాయకత్వం దారితప్పిందని విమర్శలు చేశారు. అటువంటి పార్టీలో తన పార్టీని ఎట్టిపరిస్థితుల్లోను విలీనం చేయబోనని నకరన్ అన్నారు. అన్నాడీఎంకే తన పార్టీని విలీనం అస్సలు సాధ్యంకాదని తేల్చిచెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో సుమారు 20 స్థానాల్లో అన్నాడీఎంకే ఓటు షేర్ తగ్గిందని తెలిపారు. మరోవైపు ఎన్డీయే కూటమి అనూహ్యంగా 18.5 శాతం ఓటు షేర్‌ను సాధించిందని అన్నారు. అన్నాడీఎంకే తగ్గిన ఓటు షేర్‌ను గమనిస్తే.. ఆ పార్టీకి మైనార్టీ కులాల నుంచి మద్దతు పడిపోయిందన్నారు. విక్రవంది అసెంబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థిని ఎన్డీయే కూటమి పక్షాలు అన్నీ చర్చించుకోని నిర్ణయిస్తామని అన్నారు. ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఎలాంటి నిబంధనలు లేకుండా టీటీవీ దినకరన్ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. -
TN: జయలలితపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మాజీ సీఎం, దివంగత జయలలితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో జయలలిత ‘‘హిందుత్వ నాయకురాలి’గా ఉందని అన్నారు. ఆమె అందరికంటే ఉన్నతమైన హిందుత్వ నాయకురాలిగా అభివర్ణించారు. ఇటీవల ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే హిందుత్వ భావజాలానికి దూరమైందని అన్నారు. అనంతరం తమిళనాడులో ఏర్పడిన శూన్యతను పూరించడానికి బీజేపికీ మంచి అవకాశం ఉందని అన్నారు.‘జయలలిత జీవించి ఉన్నంత వరకు ఆమె తమిళనాడులో అందరికన్నా చాలా ఉన్నతమైన హిందుత్వ నాయకురాలు. 2014కి ముందు, బీజేపీతొ జయలలిత వంటి లీడర్లు కలిసి ఉన్నప్పుడు, హిందుత్వ భావజాలం ఉన్న ఓటర్ల సహజంగానే జయలలితను తమ ఛాయిస్‌గా ఎన్నుకుంటారు. ఆమె తన హిందూత్వ భావజాలాన్ని బహిరంగంగా ప్రదర్శించేవారు’ అని అన్నామలై పేర్కొన్నారు. బీజేపీ నేతలు కాకుండా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మద్దతు పలికిన వారిలో దేశంలోనే తొలి రాజకీయ నాయకురాలు జయలలిత అని తెలిపారు. 2002-03లో తమిళనాడులో మతమార్పిడి నిరోధక చట్టాన్ని రూపొందించారని ప్రస్తావించారు. మరోవైపు అన్నామలై ప్రకటనపై జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ ఘాటుగా స్పందించారు., అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలు జయలలితపై ఆయనకున్న అజ్ఞానాన్ని, అపార్థాన్ని తెలియజేస్తున్నాయని పేర్కొంది. జయలలిత లాంటి ప్రజానాయకురానికి ఎవరూ ఇరుకున పెట్టలేరని శశికళ అన్నారు.జయలలిత తన చివరి శ్వాస వరకు ఎంజీఆర్ చూపిన బాటలోనే నిజమైన ద్రవిడ నాయకురాలిగా జీవించారని తెలిపారు. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ఇలా అన్ని వర్గాల వారు కీర్తించుకునే నాయకురాలని, అమ్మ కుల మత అడ్డంకుల్ని అధిగమించిన గొప్ప నాయకురాలని కొనియాడారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. జయలలితకు దేవుడిపై నమ్మకం ఉందనే విషయం అందరికీ తెలిసిందేనని, అయితే ఆమె ఎప్పుడూ ఒకే మతాన్ని నమ్మలేదని శశికళ అన్నారు. అందరినీ సమానంగా చూసే ఏకైక నాయకురాలు జయలలిత అని శశికళ అన్నారు. -
Lok sabha elections 2024: ఆ ఏడు స్థానాల్లోబిగ్ ఫైట్
లోక్‌సభ సీట్లపరంగా దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొత్తం 39 స్థానాలకూ శుక్రవారం తొలి దశలోనే ఎన్నికలు పూర్తవనున్నాయి. ఈ ద్రవిడనాడులో ఎప్పుడూ డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ద్విముఖ పోటీయే రివాజు. ఈసారి అన్నాడీఎంకే బలహీనపడిపోగా దాని స్థానాన్ని క్రమంగా బీజేపీ చేజిక్కించుకుంటున్నట్టు కని్పస్తోంది. డీఎంకేకు కమళదళం గట్టి పోటీ ఇస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. సొంతంగా రికార్డు సంఖ్యలో స్థానాలు గెలిచినా ఆశ్చర్యం లేదంటున్నారు. అంతేగాక చాలా స్థానాల్లో డీఎంకే భాగ్యరేఖలను బీజేపీ మార్చేసేలా కని్పస్తోందని సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఏకంగా 38 సీట్లు కైవసం చేసుకుంది. ఈ విడత వాటికి సీట్లు బాగా తగ్గుతాయని అంచనా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాదయాత్రతో బీజేపీకి తమిళనాట సానుకూల వాతావరణం ఏర్పడినట్టు కనిపిస్తోంది. దీంతో బీజేపీ ఓటు బ్యాంక్ ఏకంగా రెండంకెలకు చేరుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు హాట్ సీట్లలో పోటీ మరింత రసవత్తరంగా మారింది... కోయంబత్తూర్ బీజేపీ గెలుపుపై గట్టిగా నమ్మకం పెట్టుకున్న స్థానాల్లో ఇదొకటి. అన్నామలై ఇక్కడ పోటీలో నిలిచారు. తాను గెలిస్తే నియోజకవర్గంలో ఐఐఎంతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) శాఖలను ఏర్పాటు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దివంగత సీఎం కె.కామరాజ్ పేరిట 24 గంటలూ మొబైల్ ఆహారశాలలు అందుబాటులో ఉండేలా చూస్తామన్నది బీజేపీ హామీల్లో మరొకటి. ఇక్కడ 1999లో బీజేపీ తరఫున సి.పి.రాధాకృష్ణన్ విజయం సాధించారు. తర్వాత డీఎంకే మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎం గెలుస్తూ వస్తున్నాయి. 2014లో మాత్రం అన్నాడీఎంకే అభ్యర్థి పి.నాగరాజన్ నెగ్గారు. అయితే గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఇక్కడ రెండో స్థానంలో ఉండటం విశేషం. ఈసారి మోదీ మేనియాకు అన్నామలై పాపులారిటీ తోడై బీజేపీ గెలుస్తుందన్న అంచనాలున్నాయి. డీఎంకే నుంచి పి.రాజ్‌కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ పోటీలో ఉన్నారు. తూత్తుకుడి ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. డీఎంకే తరఫున సిట్టింగ్ ఎంపీ, దివంగత సీఎం కరుణానిధి కూతురు, సీఎం స్టాలిన్ సోదరి కనిమొళి మరోసారి బరిలోకి దిగారు. ఎన్డీఏ భాగస్వామి తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్) నుంచి విజయశీలన్, అన్నాడీఎంకే నుంచి ఆర్.శివస్వామి వేలుమణి బరిలో ఉన్నారు. కనిమొళి 2019లో వేలుమణిపై ఏకంగా 3.47 లక్షల మెజారిటీతో ఘనవిజయం సాధించడం విశేషం. అయితే వేలుమణి స్థానికంగా బాగా పట్టున్న నేత. పుత్తూర్ బోన్ అండ్ జాయింట్ సెంటర్ అధినేత. చారిత్రకంగా ఇక్కడి నుంచి డీఎంకే లేదంటే అన్నాడీఎంకే గెలుస్తూ వస్తున్నాయి. ఈసారి మాత్రం స్థానిక అంశాలను బాగా ప్రస్తావిస్తూ విజయశీలన్ ఓటర్లకు దగ్గర అవుతున్నారు. బీజేపీ దన్ను కూడా ఆయనకు బాగానే కలిసొస్తోంది. ఈసారి సౌత్ నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తమిళసై సౌందరరాజన్ 2019 తూత్తుకుడిలో 2,15,934 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలవడం విశేషం! చెన్నై సౌత్ ఈ ఎన్నికల ముందు దాకా తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ హుటాహుటిన రాజీనామా చేసి చెన్నై సౌత్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. బీజేపీ నేతగానే గాక డాక్టర్‌గా కూడా ఈ నియోజకవర్గానికి ఆమె చిరపరిచితులే. దీనికి తోడు ఇక్కడ బ్రాహ్మణ ఓటర్లు బాగా ఉండడం ఆమెకు మరింత కలిసొచ్చే అంశం. 2019లో ఇక్కడ డీఎంకే తరఫున తమిళాచి తంగపాండియన్ 2.62 లక్షల ఓట్ల మెజారిటీతో అన్నాడీఎంకే అభ్యర్థి జయవర్ధన్‌పై గెలిచారు. ఆమె మాజీ మంత్రి తంగపాండియన్ కుమార్తె కావడంతో తమ సంస్థాగత బలంతో మరోసారి గెలుపు తమదేనన్న ధీమాతో డీఎంకే ఉంది. ఇక్కడ కూడా త్రిముఖ పోటీ ఉంది. నీలగిరీస్ ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. డీఎంకే నేత ఎ.రాజా ఇక్కడ బలమైన నేతగా ఉన్నారు. 2009, 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 2019లోనైతే ఏకంగా 5.47 లక్షల ఓట్లు (54.2 శాతం) సొంతం చేసుకున్నారు! అయితే యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా 2జీ కుంభకోణం ఆరోపణల దెబ్బకు 2014 ఎన్నికల్లో ఇక్కడ ఆయన ఓటమి చవిచూశారు. గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ పోటీ చేయలేదు. ఈ విడత కేంద్ర మత్స్య శాఖ మంత్రి ఎల్.మురుగన్‌ను బరిలో దింపింది. ఈ నియోజకవర్గంలో బడగాస్ సామాజికవర్గ ప్రాబల్యం ఎక్కువ. సనాతన ధర్మాన్ని హేళన చేస్తూ రాజా చేసిన వ్యాఖ్యలు వారిలో తీవ్ర ఆగ్రహం కలిగించాయి. దాంతో ఈసారి రాజా గెలుపు సులభం కాదన్నది విశ్లేషకుల అంచనా. కృష్ణగిరి ఒకప్పుడు మూడు రాష్ట్రాల పోలీసులను గజగజలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పెద్ద కుమార్తె విద్యారాణి వీరప్పన్ బరిలో దిగడంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. వృత్తిరీత్యా ఆమె న్యాయవాది అయిన ఆమె నామ్ తమిళార్ కచ్చి (ఎన్టీకే) పార్టీ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విద్యారాణి 2020లో బీజేపీలో చేరి పార్టీ యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా చేశారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి కె.గోపీనాథ్, అన్నాడీఎంకే నుంచి వి.జయప్రకాశ్, బీజేపీ నుంచి సి.నరసింహన్ పోటీలో ఉన్నారు. 2019లో కాంగ్రెస్ తరఫున ఎ.చెల్లకుమార్ ఘన విజయం సాధించారు. 1991 దాకా ఇక్కడ కాంగ్రెస్ హవాయే నడిచింది. తర్వాత ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే పోటీ ఉండేది. ఈ విడత కాంగ్రెస్ సిటింగ్ ఎంపీని మార్చడం, వీరప్పన్ కుమార్తె బరిలో ఉండటం పోటీపై ఆసక్తిని పెంచింది. రామనాథపురం ఏకంగా మూడుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా (రెండుసార్లు జయలలిత న్యాయ సమస్యల్లో చిక్కినప్పుడు, మూడోసారి ఆమె మరణానంతరం) పనిచేసిన ఒ.పన్నీర్‌సెల్వం రాజకీయ భవిష్యత్ ఇప్పుడు రామనాథపురం ఓటర్ల చేతిలో ఉంది. జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఆయనను అంతా ఓపీఎస్ అని పిలుచుకుంటారు. జయ మరణానంతరం అన్నాడీఎంకే ఆయన్ను బయటకు పంపేసింది. దాంతో ఓపీఎస్ ఈసారి బీజేపీ మద్దతుతో రామనాథపురం నుంచి పోటీలో ఉన్నారు. దీనికి తోడు ఇక్కడి కుల సమీకరణాలు కూడా ఓపీఎస్‌కు బాగా అనుకూలంగా ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీ కె.నవాన్ ఖని (ఐయూఎంఎల్) ఓపీఎస్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. మత్య్సకారుల సమస్య ఇక్కడ ప్రధానాంశం. ఈ నేపథ్యంలో కచ్చతీవు దీవి అంశాన్ని బీజేపీ ఇటీవల ప్రముఖంగా ప్రస్తావిస్తుండడం ఓపీఎస్‌కు మరింత కలిసొస్తుందని భావిస్తున్నారు. తేని జయలలిత తర్వాత అన్నాడీఎంకే సారథి కావాలన్న శశికళ కల కూడా నెరవేరకపోయినా ఆమె వారసుడైన టీటీవీ దినకరన్ తేని లోక్‌సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఆయన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ఓపీఎస్ దన్నుంది. వీరిద్దరూ ఒకే కులానికి చెందినవారు. ఒకరి విజయానికి ఒకరు సంపూర్ణంగా సహకరించుకుంటున్నారు. వీరిద్దరికీ బీజేపీ మద్దతిస్తోంది. పైగా తేని సిట్టింగ్ ఎంపీ పి.రవీంద్రనాథ్ పన్నీర్‌సెల్వం కుమారుడే. తండ్రి ఆదేశాల మేరకు ఆయన కూడా దినకరన్ విజయానికి పూర్తిగా సహకరిస్తున్నారు. దీనికి తోడు ఓపీఎస్ స్వస్థలం తేని జిల్లాయే. దాంతో ఇక్కడ ఆయనకున్న పట్టు దినకరన్‌కు మరింత కలిసొస్తుందని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
త్రిముఖ పోరు : తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై గెలిచేనా?
చెన్నై : దక్షిణ చెన్నై పార్లమెంట్లో త్రిముఖ పోరు సాగుతోంది. గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేసుకుంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పార్లమెంట్ స్థానం అధికార పార్టీ డీఎంకేకి కంచుకోటే అయినప్పటికీ అక్కడ హోరాహోరీ పోరు కొనసాగనుంది. అయితే ఈ త్రిముఖ పోరులో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విజయం సాధిస్తారా? తమిళనాడులో దక్షిణ చెన్నై లోక్‌సభ స్థానం హాట్‌సీట్ మారింది. డీఎంకే కంచుకోటలో త్రిముఖపోరు జరగబోతుంది. ప్రస్తుత డీఎంకే సిట్టింగ్ అభ్యర్ధి తమిళచి తంగపాండియన్‌పై తమిళనాడు మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, ఏఐఏడీఎంకే తరుపున జే. జయవర్ధన్ తలపడనున్నారు. గవర్నర్ పదవినే వదులుకున్నా ఈ తరుణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళసై సౌందరరాజన్ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తమిళసై మాట్లాడుతూ.. ‘ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధిస్తాననే నమ్మకం నాకుంది. గెలిచిన వెంటనే దక్షిణ చెన్నైలో మంచి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నియోజకవర్గంతో నాకు ఎనలేని అనుంబంధం ఉంది. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు గవర్నర్ పదవిని సైతం వదులుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి రోగ నిరోధక శక్తి పెరగాలి తమిళసై స్వతహాగా వైద్యురాలు కావడంతో ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం దక్షిణ చెన్నైకి ఎలాంటి మందులు ఇస్తారంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు నియోజకవర్గం మొత్తం చెత్త, డంపింగ్ యార్డులతో నిండిపోయింది. ముందు నియోజకవర్గానికి రోగనిరోధక శక్తి పెరగాలి. ఆపై రవాణా, పరిశుభ్రత, దోమల బెడదపై దృష్టి సారిస్తామని సూచించారు. వారిదే కీలకం ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)తో సైతం పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటి చేస్తుంది. తమిళనాడులోని ఉత్తర ప్రాంతంలో పీఎంకే ప్రాభవం ఎక్కువగా ఉంది. ఇక్కడ అత్యంత వెనుకబడిన తరగతులకు (ఎంబీసీలు) చెందిన వన్నియార్లు ఎక్కువ శాతం నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్ధుల గెలుపు, ఓటుముల్ని నిర్ధేశించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాల్సి ఉంది. -
ద్రవిడ నేలపై కమలం వికసించేనా?
స్టేట్ స్కాన్ దక్షిణాదిని పాదాక్రాంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రధా నంగా తమిళనాడుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ద్రవిడ పార్టీల ఆవిర్భావంతో దశాబ్దాలుగా జాతీయ పార్టీలకు ఆ రాష్ట్రం కొరకరాని కొయ్యగా మారిపోయింది. డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఏదో ఒకదానికి తోక పార్టీగా కొనసాగడం మినహా కాంగ్రెస్, బీజేపీలకు మరో దారి లేని పరిస్థితి! ఈసారి ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలని బీజేపీ కంకణం కట్టుకుంది. కె.అన్నామలై రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన నాటినుంచీ దూకుడుగా వెళ్తున్నారు. రాష్ట్రమంతటా కలియదిరుగుతూ ఇటు జనాన్ని ఆకట్టుకుంటున్నారు. మంత్రుల అవినీతిపై వీడియోలు విడుదల చేస్తూ అటు అధికార డీఎంకేకు వణుకు పుట్టిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకూ ఏప్రిల్19న తొలి విడతలోనే పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తమిళనాట ఎన్నికల వేడి ఇప్పటికే పరాకాష్టకు చేరింది... జాతీయ పార్టీలతో కుర్చిలాట తమిళనాట 50 ఏళ్లుగా ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలదే హవా. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 1967లో డీఎంకే తొలిసారి ఓటమి రుచి చూపింది. 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా డీఎంకే 179 చోట్ల గెలవగా కాంగ్రెస్ 51 స్థానాలకు పరిమితమైంది. నాటినుంచి నేటిదాకా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది! కరుణానిధితో విభేదాలతో 1972లో ఎంజీ రామచంద్రన్ డీఎంకేను చీల్చి అన్నాడీఎంకేను ఏర్పాటు చేశారు. నాటినుంచీ వాటి మధ్యే ప్రధాన పోరు సాగుతూ వస్తోంది. జాతీయ రాజకీయాల్లో సంకీర్ణ యుగం ఆవిర్భావంతో 1989 నుంచి రెండు దశాబ్దాల పాటు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో డీఎంకే, అన్నాడీఎంకే కీలక పాత్ర పోషించాయి. ఆ క్రమంలో రాష్ట్రంలోనూ కాంగ్రెస్, బీజేపీలతో మార్చి మార్చి పొత్తు పెట్టుకుంటూ వస్తున్నాయి. డీఎంకే 2004 దాకా కాంగ్రెస్‌కు బద్ధ విరోధిగా కొనసాగింది. అన్నాడీఎంకే కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో 1999లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరింది. కానీ 2004లో అన్నాడీఎంకే మళ్లీ ఎన్డీఏ గూటికి చేరడంతో డీఎంకే తన వైఖరి మార్చుకుని కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. నాటినుంచీ 2014లో మినహాయిస్తే వాటి బంధం అన్ని ఎన్నికల్లోనూ కొనసాగుతూ వస్తోంది. ఇక అన్నాడీఎంకే తాను తొలిసారి ఎన్నికల బరిలో 1977లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. తర్వాత 1984 నుంచి 1991 ఎన్నికల దాకా వాటి బంధం సాగింది. 1998లో తొలిసారి బీజేపీతో చేతులు కలిపినా ఏడాదికే మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరింది. 2004లో మళ్లీ బీజేపీతో జట్టు కట్టింది. అప్పటినుంచీ కాంగ్రెస్‌ను దూరం పెట్టింది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో 2009, 2014 ఎన్నికల్లో బీజేపీతో బంధం తెంచుకుంది. 2019లో మళ్లీ ఎన్డీఏలో చేరినా ఈసారి మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తోంది. చిన్న పార్టీలైన పీఎంకే, ఎండీఎంకే కూడా పరిస్థితిని బట్టి డీఎంకే, అన్నాడీఎంకేలతో పొత్తు పెట్టుకుంటూ వస్తున్నాయి. పొత్తులు ఇలా... డీఎంకే ఈసారి కూడా చిరకాల మిత్రులు కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకోగా అన్నాడీఎంకే మాత్రం బీజేపీతో దూరం పాటిస్తోంది. దివంగత నటుడు విజయ్‌కాంత్‌కు చెందిన డీఎండీకేతో పొత్తు పెట్టుకుంది. ఇక బీజేపీ ఈసారి పీఎంకే, ఏఎంఎంకే, టీఎంసీ (ఎం) వంటి చిన్న పార్టీలతో జట్టు కట్టింది. 1999లో రాష్ట్రంలో అత్యధికంగా 4 లోక్‌సభ స్థానాల్లో నెగ్గిన బీజేపీ ఈసారి ఆ రికార్డును అధిగమించాలని పట్టుదలతో ఉంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాట పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే రాష్ట్రానికి ఆయన ఏకంగా ఆరుసార్లు వచ్చారు. ఎవరి సర్వేలు ఏమంటున్నాయి... సీఎన్ఎన్–న్యూస్ 18 సర్వే ఈసారి ఎన్డీఏకు రాష్ట్రంలో 5 సీట్ల దాకా వస్తాయని పేర్కొనగా ఇండియాటుడే సర్వే మాత్రం మొత్తం 39 సీట్లనూ విపక్ష ఇండియా కూటమి క్లీన్‌స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పింది. ఎవరెన్ని సీట్లలో... తమిళనాట ఎన్డీఏ, ఇండియా, అన్నాడీఎంకే కూటముల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇండియా కూటమిలో డీఎంకే 22 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌కు 9, వామపక్షాలకు 4, ఇతర పార్టీలకు మరో 4 స్థానాలు కేటాయించింది. ఎన్డీఏ కూటమి విషయానికొస్తే బీజేపీ 20 చోట్ల, పీఎంకే 10, టీఎంసీ(ఎం) 3, ఏఎంఎంకే 2 చోట్ల, ఇతర పార్టీలు మూడింట బరిలో ఉన్నాయి. మరోచోట ఎన్డీఏ మద్దతుతో ఒ.పనీర్‌సెల్వం స్వతంత్రునిగా బరిలో దిగుతున్నారు. ఇక అన్నాడీఎంకే 32 స్థానాల్లో పోటీ చేస్తోంది. డీఎండీకేకు 5, ఇతరులకు 2 సీట్లు కేటాయించింది. యువ ఓటర్లపైనే బీజేపీ ఆశలు... తమిళనాట బీజేపీ ప్రధానంగా యువ ఓటర్లపైనే ఆశలు పెట్టుకుంది. ద్రవిడ పార్టీలతో విసిగిపోయారని, మార్పు కోసం చూస్తున్నారని నమ్ముతోంది. బీజేపీ రాష్ట్ర సారథి అన్నామలైకి వారిలో ఆదరణ నానాటికీ పెరుగుతోందని పరిశీలకులు చెబుతున్నారు. దీనికితోడు ద్రవిడ పార్టీల నేతలపైనా బీజేపీ కన్నేసింది. ఇప్పటికే అన్నాడీఎంకేకు చెందిన ఒక మాజీ ఎంపీ, 17 మంది మాజీ ఎమ్మెల్యేలు ఇటీవలే బీజేపీలో చేరారు. దక్షిణ తమిళనాట పదేళ్లుగా తమకు గట్టి పునాదే ఏర్పడిందని పార్టీ భావిస్తోంది. అక్కడి కొంగు ప్రాంతంలో పార్టీకి సంస్థాగతంగా చెప్పుకోదగ్గ బలమే ఉంది. దీనికితోడు కోయంబత్తూరు నుంచి రాష్ట్ర పార్టీ సారథి అన్నామలై పోటీ చేస్తున్నారు. పీఎంకేతో పొత్తు ద్వారా ఉత్తర తమిళనాడులో తన బలహీనతను అధిగమిస్తానని బీజేపీ భావిస్తోంది. 2014లోనూ ఇలాగే చిన్న పార్టీలతో జట్టు కట్టి బీజేపీ ఏకంగా 19 శాతం ఓట్లు రాబట్టడమే గాక ఒక లోక్‌సభ స్థానాన్ని గెలుచుకుందని ఆ పార్టీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. కాకపోతే అప్పటి భాగస్వాముల్లో డీఎండీకే, ఎండీఎంకే ఇప్పుడు ఎన్డీఏతో లేవు. పైగా ముక్కోణపు పోటీలో విపక్షాల ఓట్లు చీలి ఇండియా కూటమికే లబ్ధి చేకూరవచ్చన్న విశ్లేషణలున్నాయి. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుత ఇండియా కూటమి ఏకంగా 53 శాతం ఓట్లు ఒడిసిపట్టింది! ఎన్డీఏ కేవలం 10 శాతంతో సరిపెట్టుకోగా అన్నాడీఎంకే కూటమికి 21 శాతం వచ్చాయి. అయితే ఈసారి ఏఎంఎంకే వంటి భాగస్వాములు అన్నాడీఎంకే ఓటు శాతానికి గండి కొట్టి తమవైపు మళ్లిస్తాయని బీజేపీ ఆశ పెట్టుకుంది. అన్నాడీఎంకే ఓట్లను ఏకంగా మూడొంతల దాకా ఒడిసిపట్టడంతో పాటు మోదీ చరిష్మా, స్టాలిన్ సర్కారుపై వ్యతిరేకత సాయంతో ఇండియా కూటమి ఓట్లలోనూ 10 శాతం దాకా ఎన్డీఏ కొల్లగొట్టగలిగితే 7 సీట్ల దాకా నెగ్గవచ్చని విశ్లేషకుల అంచనా. కాకపోతే అన్నాడీఎంకే ఓటు శాతానికి అంతగా గండి పెట్టడం బీజేపీకి పెనుసవాలే! ప్రచారంలో సినీ తళుకులు.. బీజేపీ తరఫున సినీ నటులు ఖుష్బూ, ఇటీవలే తన పార్టీని విలీనం చేసిన శరత్ కుమార్, సెంథిల్ ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. డీఎంకేకు కమల్‌హాసన్, అన్నాడీఎంకేకు గౌతమి, గాయత్రీ రఘురాం తదితర సినీ స్టార్లు ప్రచారం చేయనున్నారు. -
డీఎంకే ప్రజా వ్యతిరేకం.. మండిపడ్డ అన్నాడీఎంకే నేత
తమిళనాడు: సార్వత్రిక ఎన్నికలకు దేశం మొత్తం సిద్ధమవుతోంది. జాతీయ పార్టీల దగ్గర నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్నీ కూడా తమదైన రీతిలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఈ తరుణంలో తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే కూడా పోటాపోటీగా బరిలో నిలిచాయి. ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని, ప్రజలకు చేసిందేమీ లేదని ఏఐఏడీఎంకే అభ్యర్థి జే జయవర్ధన్ ఆరోపించారు. ఈయన సౌత్ చెన్నై లోక్‌సభ స్థానం నుంచి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. డీఎంకే ప్రజావ్యతిరేక పార్టీ, ప్రజావ్యతిరేక ప్రభుత్వం అని జయవర్ధన్ పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వంలో ఏ నియోజక వర్గంలోనూ అభివృద్ధి జరగలేదని అన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఏమీ చేయలేదని, హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ చెన్నై నియోజకవర్గంలో ఏఐఏడీఎంకే తప్పకుండా గెలుస్తుంది. పార్టీ విజయం కోసం కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను గురువారం అన్నాడీఎంకే ప్రకటించింది. అన్నాడీఎంకే కూటమిలో ఏఐఏడీఎంకే 32 స్థానాల్లో, డీఎండీఎంకే 5 స్థానాల్లో, ఎస్డీపీఐ 1 స్థానంలో, పుతియా తమిళగం 1 స్థానంలో పోటీ చేయనున్నాయి. మొత్తమ్ ఈ 39 స్థానాలకు ఏప్రిల్ 19న సార్వత్రిక ఎన్నికల తొలి దశలో ఓటింగ్ జరగనుంది. ఆ తరువాత జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. #WATCH | Tamil Nadu: Dr J Jayavardhan, AIADMK candidate from South Chennai says, "This is a consultation meeting with regards to how to work for the coming Lok Sabha election in South Chennai constituency...It is very well seen that the party cadres are with much enthusiasm… pic.twitter.com/Ff6u5pa6CA — ANI (@ANI) March 26, 2024 -
లోక్‌సభ ఎన్నికల బరిలో ‘కెప్టెన్’ విజయ్ కాంత్ కుమారుడు
చెన్నై, తమిళనాడు : డీఎండీకే అధినేత, దివంగత నటుడు విజయ్‌కాంత్ తనయుడు వి.విజయ్ ప్రభాకర్ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ ప్రోగ్రెసివ్ ద్రావిడియన్ లీగ్ (డీఎండీకే) పార్టీ, రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకేల మధ్య పొత్తు కుదిరింది. అలయన్స్‌లో భాగంగా విజయ్ ప్రభాకర్ విరుధ్ నగర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇదే స్థానం నుంచి ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ బీజేపీ తరుపున టికెట్ దక్కించుకున్నారు. డీఎంకే - ఇండియా అలయన్స్ మాత్రం అభ్యర్ధిని ప్రకటించలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి కెప్టెన్ కుమారుడు తమిళనాడు ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకే విడుదల చేసిన 16 మంది లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలో కెప్టెన్ విజయ్ కాంత్ కొడుకు విజయ్ ప్రభాకర్ పేరును ప్రకటించింది. ఈ సందర్భంగా డీఎండీకే జనరల్ సెక్రటరీ, విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత మాట్లాడుతూ.. తన కుమారు విజయ్‌కి రాజకీయాల పట్ల నిబద్ధత, ఇష్టం ఉన్నాయని, రానున్న లోక్‌సభ ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెడుతున్నట్లు తెలిపారు. ఏఐఏడీఎంకే మేనిఫెస్టో విడుదల ఏఐఏడీఎంకే పలు పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. వాటిల్లో డీఎండీకే, సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, పుతియా తమిజగం నేతృత్వంలో మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు గాను 32 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోని సైతం విడుదల చేసింది. -
‘హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా’
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మరణించి ఏడేళ్లు అవుతోంది. నేడు(శనివారం) ఆమె 76వ జయంతి సందర్భంగా ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్), పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు జయలలిత(అమ్మ)కు నివాళులు అర్పించారు. అయితే ఈసారి వినూత్నంగా ‘అమ్మ’ జయంతిని పురస్కరించుకొని.. పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపడానికి ఏఐఏడీఎంకే సరికొత్తగా ఆలోచించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో తయారుచేసిన ‘అమ్మ’వాయిస్ క్లిప్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ‘అమ్మ’తో ఉన్న అనుబంధాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. ఏఐ వాయిస్ క్లిప్‌లో అచ్చం ‘అమ్మ’నే పార్టీ నేతలు, కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడినట్టు ఉండటం విశేషం. ఆ ఏఐ క్లిప్‌లో దివంగత నేత జయలలిత ప్రసంగం ఇలా ఉంది... ‘హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా. ఈ సాంకేతికతకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకుంటే నేను మీతో మాట్లాడే అవకాశం ఇచ్చింది. మన పార్టీ చాలా ఎత్తుపల్లాలను చూసింది. మనం అధికారంలో ఉన్నో సమయంలో మహిళలు, విద్యార్థులకు అనేక సంక్షేమ పథకలు ప్రవేశపెట్టి అమలు చేశాం. மாண்புமிகு இதயதெய்வம் புரட்சித்தலைவி அம்மா அவர்களின் 76வது பிறந்தநாள் விழாவினை முன்னிட்டு, மாண்புமிகு கழக பொதுச்செயலாளர் புரட்சித்தமிழர் @EPSTamilNadu அவர்களின் வழிகாட்டுதலின்படி இன்றைக்கு தகவல் தொழில்நுட்பத்தின் உச்சமாகக் கருதப்படும் செயற்கை நுண்ணறிவு (Artificial Intelligence)… pic.twitter.com/APuSq7u6AW — AIADMK (@AIADMKOfficial) February 24, 2024 ...ప్రస్తుతం ఒకవైపు మనకు ద్రోహం చేసే కేంద్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు అవినీతితో నిండిపోయిన పనికిరాని రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నా పుట్టిన రోజు సందర్భంగా ఒకటి చెబుతున్నా.. మన పార్టీ నేతృత్వంలో ప్రజల ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలి. మన కార్యకర్తలంతా నా మార్గంలో పార్టీ కోసం నడవాలని కోరుతున్నా. పార్టీకి, సోదురుడు ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) మద్దతుగా నిలవాలి. ఈపీఎస్ నాయకత్వాని బలోపేతం చేయాలి. ఎందుకంటే మనం ప్రజల కోసమే ఉన్నాం’ అని జయలలిత స్వయంగా మాట్లాడినట్లు వాయిస్ వచ్చింది. దీంతో జయలలిత ఏఐ వాయిస్ క్లిప్ విన్న కార్యకర్తలంతా తమ అధినేత్రి జీవించి ఉన్నట్లుగానే అనిపించిందని భావోద్వేగం వ్యక్తం చేశారు. ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) 2022లో ఏఐఏడీఎంకేకు నాయకత్వం వహిస్తున్నారు. పన్నీర్ సెల్వం పార్టీ నుంచి తొలగించబడిన అనంతరం ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) పార్టీ చీఫ్‌గా కొనసాగుతున్నారు. -
రాజకీయ నాయకుడు అసభ్యకర కామెంట్స్.. త్రిష కీలక నిర్ణయం!
అన్నాడీఎంకే బహిష్కృత నేత ఏవీ రాజు హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన కామెంట్స్‌పై పలువురు సినీతారలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈ విషయంలో త్రిష చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇప్పటికే వెల్లడించింది. తన లీగల్ టీం దీనిపై న్యాయపరంగా ముందుకెళ్తుందని తెలిపింది. తాజాగా ఏవీ రాజు కామెంట్స్‌పై త్రిష టీం చర్యలకు దిగింది. ఆయనపై త్రిష పరువునష్టం దావా కేసు వేశారు. దీనికి సంబంధించిన నోటీసులను తన ట్విటర్లో పంచుకున్నారు. తన లీగల్ టీం ద్వారా ఏవీ రాజుకు నోటీసులు పంపించారు. కాగా.. గతంలో త్రిషపై లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ అసభ్యకర కామెంట్స్ చేశారు. కానీ ఆ తర్వాత తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరారు. తాజాగా మరోసారి అన్నాడీఎంకే మాజీ లీడర్ ఏవీ రాజు త్రిషను ఉద్దేశించి చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన కామెంట్లను కోలీవుడ్ సినీ తారలంతా మూకుమ్మడిగా ఖండించారు. త్రిషకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. గతంలో ఓ ఎమ్మెల్యే త్రిషకు డబ్బులిచ్చి రిసార్ట్‌కు తీసుకొచ్చారంటూ ఏవీ రాజు చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. pic.twitter.com/DmRXHibIYx — Trish (@trishtrashers) February 22, 2024 -
'త్రిషపై వ్యాఖ్యలను ఖండించడం ఇష్టం లేదు'.. విశాల్ ట్వీట్ వైరల్!
స్టార్ హీరోయిన్ త్రిషపై అన్నాడీఎంకే మాజీ లీడర్ చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. త్రిషను ఉద్దేశించి ఏవీ రాజు చేసిన కామెంట్స్ తీవ్ర దుమారానికి దారితీశాయి. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున వైరలైంది. ఈ నేపథ్యంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు త్రిష కూడా ట్వీట్ చేసింది. దీనిపై మా లీగల్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఏవీ రాజు వ్యాఖ్యలపై పలువురు సినీ తారలు మండిపడుతున్నారు. త్రిషకు మద్దతుగా ట్వీట్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై హీరో విశాల్ స్పందించారు. ఇలాంటి కామెంట్స్‌పై ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన ఒక మూర్ఖుడు మా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి గురించి చాలా అసహ్యంగా మాట్లాడారని విన్నా.. ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తారని నాకు తెలుసు అన్నారు. సెలబ్రిటీల గురించి నెగిటివ్ ప్రచారం చేసి డబ్బు సంపాదించడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. భూమిపై ఉన్న అలాంటి రాక్షసుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ట్వీట్ చేయడం నాకు నిజంగా బాధ కలిగించిందని విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్ తన ట్వీట్లో రాస్తూ..'ఒక రాజకీయ పార్టీకి చెందిన తెలివితక్కువ మూర్ఖుడు. మన సినీ వర్గానికి చెందిన ఒకరి గురించి చాలా అసహ్యంగా మాట్లాడారని విన్నా. ఇది పబ్లిసిటీ కోసం చేశారని నాకు తెలుసు. కాబట్టి మీ పేరును ప్రస్తావించను. మీరు టార్గెట్ చేసిన తన పేరును కూడా ప్రస్తావించను. ఎందుకంటే మేము మంచి స్నేహితులం మాత్రమే కాదు.. సినిమాల్లో సహచరులం కూడా. మీరు చేసిన పని తర్వాత మీ ఇంట్లో ఉన్న స్త్రీలు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని నేను కోరుకుంటున్నా.' అని రాసుకొచ్చారు. ఆ తర్వాత ప్రస్తావిస్తూ..' ఈ భూమిపై ఉన్న ఇలాంటి రాక్షసుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ట్వీట్ చేయడం నాకు నిజంగా బాధ కలిగించింది. మీరు చేసిన పనిని చెప్పేందుకు కూడా మాటలు రావడం లేదు. నిజాయితీగా చెప్పాలంటే నాకు నిన్ను ఖండించడం ఇష్టం లేదు.. ఎందుకంటే నీకు ఇది చాలా తక్కువే అవుతుంది. అందుకే మీరు నరకంలో కుళ్లిపోవాలని కోరుకుంటున్నా. కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఈ ప్రకటన చేయాలనే ఉద్దేశ్యం నాకు లేదు. కానీ ఒక మనిషిగా చెబుతున్నా. మీరు భూమిపై ఉన్నంత వరకు మనిషిలాగా ఎప్పటికీ ఉండలేరు. ప్రస్తుతం సెలబ్రిటీల గురించి నెగిటివ్ ప్రచారం చేసి డబ్బు సంపాదించడం ఒక ట్రెండ్‌గా మారింది. డబ్బు కోసమే అయితే మంచి ఉద్యోగం సాధించండి. లేదా కనీసం ప్రాథమిక క్రమశిక్షణ నేర్చుకోవడానికి బిచ్చగాడిగానైనా కెరీర్ ప్రారంభించండి' అంటూ తనదైన శైలిలో విశాల్ కౌంటరిచ్చారు. I just heard that a stupid idiot from a political party spoke very ill and disgustingly about someone from our film fraternity. I will not mention your name nor the name of the person you targeted because I know you did it for publicity. I definitely will not mention names… — Vishal (@VishalKOfficial) February 20, 2024 -
త్రిషపై మరోసారి అలాంటి కామెంట్స్.. ఇంతటి నీచానికి దిగుజారుతారా?
గతేడాది లియోతో సూపర్ హిట్ కొట్టిన భామ త్రిష. విజయ్ సరసన హీరోయిన్గా నటించి బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించిన నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ పెద్దఎత్తున వివాదస్పదమయ్యాయి. ఏకంగా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు సినీతారలు మండిపడ్డారు. అయితే తాజాగా అన్నాడీఎంకే మాజీ లీడర్ ఏవీ రాజు చేసిన అసభ్యకర కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. త్రిషపై ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్స్ అతనిపై మండిపడుతున్నారు. తక్షణమే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో త్రిషకు పలువురు అండగా నిలుస్తున్నారు. త్రిషను ఉద్దేశించి ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున వైరలవుతోంది. (ఇది చదవండి: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఫైనల్‌గా వివరణ ఇచ్చిన మన్సూర్!) తాజాగా ఈ విషయంపై హీరోయిన్ త్రిష స్పందించింది. ఫేమస్ కావడం కోసం ఏంతటి నీచానికైనా దిగజారిపోయే జీవితాలు అవీ.. పదే పదే ఇలాంటి నీచమైన మనుషులను చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. దీనిపై త్వరలోనే న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపింది. దీనిపై మా లీగల్ డిపార్ట్మెంట్ తదుపరి చర్యలు తీసుకుంటుందని ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ టాపిక్ కోలీవుడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా.. త్రిష ప్రస్తుతం మెగాస్టార్ సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే.. గతంలో ఓ ఎమ్మెల్యే డబ్బులిచ్చి త్రిషను రిసార్ట్‌కు తీసుకొచ్చారని ఇటీవలే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఏవీ రాజు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇది చూసిన పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా త్రిషపై అసభ్యంగా మాట్లాడిన ఏవీ రాజును అరెస్ట్ చేయాలని నటుడు, దర్శకుడు చేరన్ డిమాండ్ చేశారు. ఇలాంటి వారిపై నటీనటుల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా బహిరంగంగా సినీ పరిశ్రమలోని సభ్యులను కించపరిచేలా మాట్లాడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. WTF this Trisha should file legal action against him,nowdays these guys are behaving very cheaply #Trisha | #TrishaKrishnan pic.twitter.com/Ip1ZClB8xS — Sekar 𝕏 (@itzSekar) February 20, 2024 It's disgusting to repeatedly see low lives and despicable human beings who will stoop down to any level to gain https://t.co/dcxBo5K7vL assured,necessary and severe action will be taken.Anything that needs to be said and done henceforth will be from my legal department. — Trish (@trishtrashers) February 20, 2024 வன்மையாக கண்டிக்கிறேன்.. எந்த ஆதரமுமின்றி பொது வெளியில் திரைத்துறையினர் பற்றி பெயர் சொல்லி அவதூறு கிளப்பிய இவரை சட்டமும் காவல்துறையும் உரிய நடவடிக்கை எடுக்க வேண்டும்... @VishalKOfficial @Karthi_Offl நடிகர் சங்கம் இதற்கு தகுந்த பதிலும் நடவடிக்கையும் எடுக்கும் என நம்புகிறேன் https://t.co/fRNYxH5DAV — Cheran (@directorcheran) February 20, 2024 Shocked & disgusted by the behaviour of Ex AIADMK functionary A. V. Raju for making unwarranted , baseless, loose and completely false allegations about Trisha. It is 2024; we talk about women empowerment & equality - why drag an unrelated person into personal mud slinging. There… — Aditi Ravindranath (@aditi1231) February 20, 2024 -
అన్నాడీఎంకేలో చేరిన సీనియర్ నటి గౌతమి
-
ట్రాన్స్ జెండర్‌పై అనుచిత వ్యాఖ్యలు..
చెన్నై: ట్రాన్స్‌జెండర్ వ్యాపారవేత్త, ఏఐఏడీఎంకే అధికారి ప్రతినిధి అప్సరా రెడ్డిని అప్రతిష్టపాలు చేసిన ఓ యూట్యూబర్‌కు మద్రాస్ హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది! ఆమె ప్రొవోగ్ మేగజీన్‌లో పని చేసిన రోజుల్లో మైకేల్ ప్రవీణ్ అనే సహోద్యోగితో విభేదాలొచ్చాయి. దాంతో అతను అప్సరను కించపరుస్తూ 10 వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ప్రవీణ్ నుంచి రూ.1.25 కోట్లు పరిహారం కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆమెకు రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ‘‘సోషల్ మీడియాలో పోస్టులతో ఇతరుల గోప్యతకు భంగం కలిగించొద్దు. ఏ హక్కయినా పరిమితులకు లోబడి ఉంటుంది’’ అని పేర్కొంది. -
తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్?
చెన్నై: డీఎంకే నేత, క్రీడా శాఖా మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో స్టాలిన్ విదేశీ పర్యటనకు వెళ్లే క్రమంలో ఉదయనిధిని డిప్యూటీ సీఎం హోదాలో ఉంచనున్నారని డీఎంకే వర్గాలు తెలిపాయి. జనవరి 21న సేలంలో జరగనున్మ పార్టీ యూత్ వింగ్ సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేసేది ముఖ్యమంత్రి మాత్రమేనని డీఎంకే ఆర్గనైజేషనల్ సెక్రటరీ ఎళంగోవన్ అన్నారు. ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేయనున్నారనే విషయం తనకు తెలియదని చెప్పారు. అయినప్పటికీ ఉదయనిధి పార్టీలో చాలా చురుకుగా ఉంటారు.. డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదని చెప్పారు. ఈ అంశంపై ఉదయనిధిని ప్రశ్నించగా.. ఆయన పుకారుగా పేర్కొన్నారు. ఉదయనిధిని ఉపముఖ్యమంత్రిగా చేస్తున్నారనే వార్తలపై అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం(ఏఐఏడీఎంకే) విమర్శించింది. ఉదయనిధికి ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు.. ఆ తర్వాత మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ఉపముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. 2026లో ఉదయనిధిని ముఖ్యమంత్రిని కూడా చేయాలనుకుంటారు. డీఎంకేలో పరివార్ వాదానికే ప్రాధాన్యం ఉందని, ప్రజాస్వామ్యం లేదని ఏఐఏడీఎంకే నేతలు విమర్శించారు. ఇదీ చదవండి: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాసానికి పిలుపు -
అన్నాడీఎంకేలో చీలికకు బీజేపీ యత్నం
అన్నాడీఎంకేలో చిచ్చుపెట్టే దిశగా బీజేపీ వ్యూహాలు పన్నుతోందనే ప్రచారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ పార్టీలో సీనియర్‌గా ఉన్న ఎస్పీ వేలుమణిని అస్త్రంగా చేసుకుని పళణి స్వామికి వ్యతిరేకంగా కేంద్రపెద్దలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఫలితంగా అన్నాడీఎంకే నుంచి త్వరలో ఓ ఏక్నాథ్ షిండే వస్తారని, మహారాష్ట్ర తరహా రాజకీయం తమిళనాడులో చూడబోతున్నామనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఊపందుకుంది. సాక్షి, చైన్నె: ఎన్డీయే కూటమి నుంచి అన్నాడీఎంకే ఇటీవల బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో పళణిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే వర్గాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే పనిలో పడ్డారు. రాయబారానికి, సామరస్యానికి చోటు లేదని స్పష్టం చేస్తూ, ఇక బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఈ పరిణామాలను బీజేపీ అధిష్టానం పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటిస్తున్నారు. అదే సమయంలో కొత్త వ్యూహాలకు సైతం పదును పెట్టినట్లు తెలుస్తోంది. చిచ్చు ప్రయత్నాలు అన్నాడీఎంకే సీనియర్లలో ఎస్పీ వేలుమణి కీలక నేత. ఆయనపై అనేక కేసులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులను అస్త్రంగా చేసుకుని ఆయన్ని తమ దారికి తెచ్చుకునేందుకు బీజేపీ వ్యూహ రచన చేస్తున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఎస్పీ వేలుమణి ద్వారా అన్నాడీఎంకేలో చిచ్చు పెట్టే అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నట్లు చర్చ జోరందుకుంది. అన్నాడీఎంకేలో ఎస్పీ వేలుమణి ఓ ఏక్నాథ్ షిండే (మహారాష్ట్ర సీఎం) అన్న ట్యాగ్‌లైన్‌తో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌గా మారాయి. మహారాష్ట్రలో శివసేన నేత ఉద్దవ్ ఠాక్రేను ఏవిధంగా ఏక్నాథ్ షిండే కూల దోశాడో..అదే తరహాలో పళణిస్వామికి ఎస్పీ వేలుమణి చుక్కలు చూపించబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఇది కాస్త అన్నాడీఎంకేలో కొత్త చర్చకు దారి తీశాయి. దీంతో ఎస్పీ వేలుమణి స్పందించారు. తాను అప్పుడు.. ఇప్పుడు..ఎల్లప్పుడూ అన్నాడీఎంకేకు విశ్వాస పాత్రుడినే అని స్పష్టం చేశారు. తాను సైకిల్ యాత్ర చేసిన ఫొటోను ట్యాగ్ చేస్తూ తన సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాలకు ముగింపు పలికే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే కూటమి సీఎం అభ్యర్థిగా అన్నామలైను ప్రకటించాలని బీజేపీ ఒత్తిడి తీసుకు రావడంతోనే కూటమి నుంచి తాము బయటకు వచ్చామని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి కరుప్పన్నన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బీజేపీకి వారి బలం ఏమిటో లోక్ సభ ఎన్నికలు స్పష్టం చేస్తాయని మరో సీనియర్ నేత కేపీ మునుస్వామి వ్యాఖ్యానించారు. నేడు అమిత్ షాతో అన్నామలై అన్నాడీఎంకే కటీఫ్ ప్రకటన నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో అన్నామలై అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆదివారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. దూకుడు మీదున్న అన్నామలై అమిత్ షా ముందు కొత్త ప్రతిపాదనను ఉంచేందుకు సిద్ధమైనట్లు చర్చ ఊపందుకుంది. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయడానికి అనుమతి ఇవ్వాలని అమిత్‌షాను ఆయన కోరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అప్పుడే తమిళనాడులో బీజేపీ బలం ఏమిటో తెలుస్తుందని, అందుకు అనుగుణంగా భవిష్యత్తుకు కార్యాచరణ సిద్ధం చేయవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ ఓ నివేదికను సిద్ధం చేసుకుని మరీ ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. పళణి కొత్త ప్రయత్నాలు బీజేపీతో ఇక దోస్తీ లేదని తేల్చిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి కొత్త కూటమి ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు సమాచారం. బలమైన కూటమి దిశగా తమతో కలిసి రావాలని పీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్, డీఎండీకేలకు ఆహ్వానం పలికేవిధంగా రాయబార ప్రయత్నాలు మొదలెట్టినట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ మూడు పార్టీలతోపాటు కొన్ని చిన్న పార్టీలను తన వైపునకు తిప్పుకునే దిశగా ప్రయత్నాలను జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. డీఎంకేలో అసంతృప్తిగా ఉన్న కొన్ని చిన్న పార్టీలను సైతం కలుపుకునే ప్రయత్నంలో పళణిస్వామి ఉన్నట్లు అన్నాడీఎంకే నేతలు పేర్కొంటున్నారు. -
తమిళనాట బీజేపీ పాలి‘ట్రిక్స్’.. మరో కొత్త ఎత్తుగడ?
చెన్నై: తమిళనాడులో పొలిటికల్ హీట్ కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనతో సంప్రదింపులు జరుపుతోందని వ్యాఖ్యలు చేశారు. దీంతో, తమిళనాడు రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ కొత్త ప్లాన్.. అయితే, తమిళనాడులో అన్నాడీఎంకే.. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త కూటమిని ఏర్పాటు చేయనున్నట్టు పార్టీ ప్రతినిధి మునుస్వామి స్పష్టం చేశారు. 2024 ఎన్నికల నాటికి కొత్త కూటమితోనే బరిలోకి దిగుతామన్నారు. మరోవైపు.. అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీరు సెల్వం బాంబు పేల్చారు. పళనిస్వామి.. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న వెంటనే ఆ పార్టీ తనను సంప్రదించినట్టు తెలిపారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనతో సంప్రదింపులు జరుపుతున్నదని, కూటమిపై బీజేపీ ప్రకటన చేసిన తర్వాతనే తన వైఖరి వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. Chennai | Former Tamil Nadu CM O Panneerselvam said, "The BJP leadership has been in regular touch with me (in recent times)... Will the AIADMK accept if the BJP asks for replacing (AIADMK general secretary) Palaniswami? Will they replace him? Then how can they ask to change BJP… pic.twitter.com/7xCrBCzHbZ — ANI (@ANI) September 29, 2023 పళణిస్వామిపై సెటైర్లు.. ఇదే సమయంలో అన్నాడీఎంకేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలైని మార్చాలని అన్నాడీఎంకే.. కమలం పార్టీపై ఒత్తిడి తీసుకువచ్చిందనే ప్రచారంపై ఆయన స్పందించారు. అన్నాడీఎంకేకు పళనిస్వామిని మార్చాలని బీజేపీ కోరితే ఆ పార్టీ అంగీకరిస్తుందా అని ఎదరు ప్రశ్నించారు. బీజేపీ ఒత్తిడికి తలొగ్గి పళనిస్వామిని మార్చేస్తుందా అని అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలని ఎలా అడుగుతారని విమర్శలు చేశారు. అలా అడిగే హక్కు పళనిస్వామి పార్టీకి లేదని సీరియస్ అయ్యారు. అయితే, పన్నీరు సెల్వం.. బీజేపీతో కలిస్తే ఇప్పటి వరకు అన్నాడీఎంకేతో ఉన్న కేడర్ కమలం పార్టీ సపోర్టు చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో, పళనిస్వామి వర్గానికి ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ ఉందంటున్నారు. ఇది కూడా చదవండి: ఇస్కాన్‌పై సంచలన ఆరోపణలు.. మేనకా గాంధీకి బిగ్ షాక్ -
తమిళనాట రసవత్తర రాజకీయం.. అన్నాడీఎంకే కీలక ప్రకటన
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవలే ఎన్డీయేకు గుడ్ బై చెప్పిన అన్నాడీఎంకే తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామని అన్నాడీఎంకే వెల్లడించింది. ఈ క్రమంలో తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే, బీజేపీ పార్టీపై అన్నాడీఎంకే నేతలు ఘాటు విమర్శలు చేశారు. 2024 ఎన్నికల నాటికి కొత్త కూటమి.. అయితే, తమిళనాడులోకి క్రిష్ణగిరిలో అన్నాడీఎంకే నేత మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ చెబుతున్నట్టు తాము బీజేపీతో తాము కూటమిలో లేమని స్పష్టం చేశారు. మేం బీజేపీతో పొత్తు తెంచుకుంటే ఎలా ఉంటుందో వారికి తెలుసు. అందుకే భయంతో వారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీతో నాలుగేళ్ల బంధాన్ని తెంచుకున్నట్టు తెలిపారు. పళానిస్వామి సారథ్యంలో కొత్త కూటమిని ఏర్పాటు చేసి నాయకత్వం వహిస్తామన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామన్నారు. అన్నామలైపై కీలక ప్రకటన.. ఇదే సమయంలో తాము తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలైని పదవి నుంచి తొలగించాలని కోరలేదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే వంటి పెద్ద పార్టీ ఒక పార్టీని వారి రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించాలని కోరుతుందని అనుకోవడం చిన్నపిల్లల మనస్తత్వం. మేం అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయం. వేరే పార్టీ ఎలా పని చేయాలో చెప్పే అనాగరిక నేతలం మేం కాము. అన్నాడీఎంకే అలాంటి పార్టీ కాదని వివరణ ఇచ్చారు. మరోవైపు.. అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఇకపై కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. కొత్త కూటమి విషయంగా ఎన్నికల సమయంలో నిర్ణయం ఉంటుందని, తమ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి అన్ని విషయాలను త్వరలో ప్రకటిస్తారన్నారు. స్పీడ్ పెంచిన పళణిస్వామి.. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టిన అనంతరం పళణి స్వామి పార్టీలో మార్పులు చేర్పులకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న ఆరు జిల్లాలకు కొత్త కార్యదర్శులను బుధవారం నియమించారు. మరికొన్ని జిల్లాల కార్యదర్శులలో స్వల్ప మార్పులు చేశా రు. అనుబంధ విభాగాలకు కార్యదర్శులను నియమించారు. ఈ మేరకు కన్యాకుమారి జిల్లా కార్యదర్శిగా మాజీ మంత్రి దళవాయి సుందరం, తిరుచ్చి మహానగర కార్యదర్శిగా మాజీ డిప్యూటీ మేయర్ శ్రీనివాసన్, పెరంబలూరు జిల్లా కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే తమిళ్ సెల్వం, తంజావూరు తూర్పు కుంబకోణం కార్యదర్శి రామనాథన్, తంజావూరు సెంట్రల్ జిల్లా కార్యదర్శిగా శరవణన్, తేని జిల్లా (తూర్పు) కార్యదర్శిగా రామర్, (పశ్చిమం) జక్కయ్యన్ను నియమించారు. అలాగే, రాణి పేట, తిరువణ్ణామలై, తిరునల్వేలి, తదితర మరికొన్ని జిల్లాలలో కార్యదర్శులు మార్పు జరిగింది. అయితే, ఒక జిల్లా నుంచి మరోజిల్లాకు కార్యదర్శుల పోస్టులను బదిలీ చేసే రీతిలో నియామకాలు జరిగాయి. అన్నామలైకి ఢిల్లీ నుంచి పిలుపు.. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే తమను పక్కన పెట్టిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు ఢిల్లీ నుంచి పిలుపురావడం గమనార్హం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో అన్నామలై భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయో వేచి చూడాల్సిందే. అదే సమయంలో ఈ భేటీ తర్వాత తమను టార్గెట్ చేసి ఐటీ, ఈడీ దాడులకు బీజేపీ సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నట్లు కొందరు అన్నాడీఎంకే సీనియర్లు పేర్కొంటుండడం గమనార్హం. ఇది కూడా చదవండి: మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. రంగంలోకి సీనియర్ ఐపీఎస్.. ఎవరీ రాకేష్ బల్వాల్! -
బీజేపీ – అన్నాడీఎంకే బంధానికి బ్రేక్.. ఎన్డీఏ కూటమికి బై..బై!
అనుకున్నదే అయ్యింది.. విమర్శలు ప్రతివిమర్శలు, అపనమ్మకాలు..ఆరోపణలు, ఎత్తులు.. పైఎత్తులతో ఇన్నాళ్లూ పడుతూ లేస్తూ సాగిన అన్నాడీఎంకే– బీజేపీ బంధానికి సోమవారం తెరపడింది. ఎన్డీయే కూటమని నుంచి ప్రధాన భాగస్వామి అయిన అన్నాడీఎంకే బయటకు వచ్చినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో స్పష్టం చేశారు. రాష్ట్రంలోని బీజేపీ నేతల తీరే ఈ నిర్ణయానికి కారణమని వెల్లడించారు. సాక్షి, చైన్నె: బీజేపీ – అన్నాడీఎంకే బంధానికి బ్రేక్ పడింది. ఎన్డీఏ కూటమికి బై..బై చెబుతూ సోమవారం అన్నాడీఎంకే కీలక ప్రకటన చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నేతృత్వంలోనే కూటమి ఏర్పాటు అవుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు చైన్నెలో జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ నేతలు, ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రకటనతో అన్నాడీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి. వివరాలు.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తదుపరి చోటు చేసుకున్న పరిణామాలతో ఈ పార్టీ ప్రభుత్వంలో బీజేపీ జోక్యం పెరిగిన విషయం తెలిసిందే. సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం పళణి స్వామి 2017 నుంచి బీజేపీతో స్నేహ పూర్వకంగా మెలుగుతూ వచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలోనూ బంధం పదిలం అన్నట్లుగానే ముందుకు సాగారు. అయితే, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలై పగ్గాలు చేపట్టినానంతరం రెండు పార్టీల మధ్య క్రమంగా దూరం పెరుగుతూ వచ్చింది. బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా మిత్రపక్షం అన్నాడీఎంకేను సైతం అన్నామలై టార్గెట్ చేయడం వివాదానికి ఆజ్యం పోసింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో పాటు దివంగత నేతలు అన్నాదురై, జయలలితకు వ్యతిరేకంగా అన్నామలై తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. ఢిల్లీ పర్యటన తర్వాత మారిన సీను.. వారం క్రితం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఢిల్లీ పర్యటన అనంతరం పరిణామాలు వేగంగా మారాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను పళణి తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. తమ శత్రువులు పన్నీరు, దినకరన్‌ను బీజేపీ అక్కున చేర్చుకునే ప్రయత్నాలు చేస్తుండ డం, పుదుచ్చేరితోపాటు తమిళనాడులో 20 సీట్లను ఆశించడం వంటి సమాచారంతో బీజేపీతో ఇక కటీఫ్ అన్న నినాదాన్ని అన్నాడీఎంకే నేతలు అందుకున్నారు. సుదీర్ఘచర్చ తర్వాత కఠిన నిర్ణయం.. అన్నాడీఎంకే జిల్లాల కార్యదర్శుల సమావేశం సోమవారం సాయంత్రం రాయపేటలోని ఎంజీఆర్ మాళిగైలో జరిగింది. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో జిల్లాల కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ నేతలు ముక్తకంఠంతో బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని నినాదించారు. ఢిల్లీలో అమిత్‌షా చర్చల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు, అన్నామలైపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన పార్టీ నేతలకు ఎదురైన నిరాశపూరిత పరిణామాల గురించి సైతం ఈ సమావేశంలో చర్చించడం గమనార్హం. కూటమి నుంచి బయటకు వచ్చిన పక్షంలో ఎదురయ్యే పరిణామాలు, ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు, వాటిని తిప్పికొట్టే విధంగా నేతలు సిద్ధమయ్యే విధంగా చర్చించారు. సుదీర్ఘర సమాలోచన అనంతరం పార్టీ నేతలు మునుస్వామి, జయకుమార్, ఎస్పీ వేలుమణి, నత్తం విశ్వనాథన్, దిండుగల్ శ్రీనివాసన్ మీడియా ముందుకు వచ్చారు. పళణి నేతృత్వంలోనే కూటమి మీడియాతో నేతలు మాట్లాడుతూ, తమ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరిగిన సమావేశంలో నేతలందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశామని వివరించారు. గత ఏడాది కాలంగా పథకం ప్రకారం రాష్ట్ర బీజేపీ నేతలు అన్నాడీఎంకే దివంగత నేతలను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని గురిపెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తు చేశారు. పురట్చి తమిళర్ పళణి స్వామి నేతృత్వంలో మదురై వేదికగా జరిగిన భారీ మహానాడును సైతం విమర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు కోట్ల మంది అన్నాడీఎంకే కేడర్ మనోభావాలకు వ్యతిరేకంగా బీజేపీ చర్యలు ఉంటున్నాయని ధ్వజమెత్తారు. అందుకే ఆ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించామన్నారు. ఎన్డీఏ కూటమి నుంచి తాము బయటకు వచ్చేశామని ప్రకటించారు. కేవలం రాష్ట్రంలోని బీజేపీ నేతల తీరు కారణంగానే కూటమి నుంచి బయటకు వచ్చేశామని, ఇక, బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో అన్నాడీఎంకే నేతృత్వంలో కూటమి అని, దీనికి తమ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నేతృత్వం వహిస్తారని ప్రకటించారు. స్వీట్లు పంచి.. ఎన్డీఏకు బై..బై....చెప్పేశామని మునుస్వామి ప్రకటన చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి. ఇక బీజేపీతో ఆరేళ్ల బంధం వీడడంతో అన్నాడీఎంకే వర్గాలు బాణా సంచా పేల్చుతూ సందడి చేశారు.ి అన్నాడీఎంకే కార్యాలయం ఎంజీఆర్‌మాళిగై పరిసరాలు సంబరాల కోలాహలంలో మునిగింది. ఆనంద తాండవం చేస్తూ నేతలు పళణికి మద్దతుగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా, జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే కీలంగా ఉన్న నేపథ్యంలో తాజా నిర్ణయం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనే ఉత్కంఠం ప్రస్తుతం నెలకొంది. రాష్ట్రనేతలెవరూ మాట్లాడొద్దు– బీజేపీ అధిష్టానం అన్నాడీఎంకే నిర్ణయంపై తమ పార్టీ అధిష్టానం సరైన సమయంలో స్పందిస్తుందని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు. కోయబత్తూరులో నా మట్టి... నా ప్రజలు యాత్రలో పాల్గొంటున్న ఆయన్ని మీడియా ప్రతినిధులు సాయంత్రం అన్నాడీఎంకే నిర్ణయంపై ఆయన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అధిష్టానం అన్ని అంశాలను గమనిస్తోందని, తగిన సమయంలో స్పందిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన యాత్ర విజయవంతంగా కొనసాగుతోందని, తమ పార్టీకి ఏ నిర్ణయమైనా అధిష్టానం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. తాను కూడా త్వరలో మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలను తెలియజేస్తానని ముగించారు. బీజేపీ ఎమ్మెల్యే, జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ కూడా అన్నామలై తరహాలోనే స్పందించారు. ఇక అన్నాడీఎంకే ప్రకటనపై బీజేపీ అధిష్టానం సోమవారం రాత్రి స్పందించింది. పొత్తు అంశంపై రాష్ట్రనేతలెవరూ మాట్లాడకూడదని స్పష్టం చేసింది. ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ముందే చెప్పిన ‘సాక్షి’ అన్నాడీఎంకే, బీజేపీ మధ్య అంతరాలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు బెడిసికొట్టే అవకాశం ఉందనే విషయంపై గతంలోనే ‘సాక్షి’ పలుమార్లు విశ్వసనీయ కథనాలు ప్రచురించింది. అన్నాడీఎంకే కార్యదర్శుల సమావేశంలో పళణి స్వామి ఈమేరకు ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. సోమవారం అదే నిజమైంది. -
NDA నుంచి బయటకు వచ్చిన అన్నాడీఎంకే
-
తమిళనాట ట్విస్ట్.. ఎన్డీఏకు అన్నాడీఎంకే గుడ్‌బై..
సాక్షి, చెన్నై: దేశ, తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీఏ కూటమి నుంచి తాము వైదొలగుతున్నట్టు అన్నాడీఎంకే ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సందర్బంగా అన్నాడీఎంకే నేతలు తమిళనాడు బీజేపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్బంగా అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుస్వామి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు నుంచి బీజేపీ, ఎన్డీయే కూటమితో అన్నాడీఎంకే తెగతెంపులు చేసుకుంటోంది. నేడు జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు అన్నాడీఎంకే ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మా పార్టీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. గత ఏడాది కాలంగా మా పార్టీ జనరల్ సెక్రటరీ పళనిస్వామి, పార్టీ కేడర్‌పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. VIDEO | AIADMK announces to break alliance with BJP in #TamilNadu. "We are breaking our alliance with BJP and NDA. AIADMK will form a new alliance and face upcoming Parliamentary elections," says party. pic.twitter.com/TWpbMrQKPT — Press Trust of India (@PTI_News) September 25, 2023 ఇదే సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు మునుస్వామి. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అన్నాడీఎంకే కొత్త కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఇక, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో డీఎంకే భారీ మెజార్టీతో విజయం సాధించింది. Chennai, Tamil Nadu | K P Munusamy, AIADMK Deputy Coordinator says, "AIADMK unanimously passed a resolution in the meeting. AIADMK is breaking all ties with BJP and NDA alliance from today. The state leadership of the BJP has been continuously making unnecessary remarks about our… pic.twitter.com/HSx3NJKKOJ — ANI (@ANI) September 25, 2023 అయితే, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దివంగత ముఖ్యమంత్రి జయలలితను విమర్శించడంతో మొదలుపెట్టి ఆ పార్టీ హయాంలో జరిగిన అవినీతి జాబితాను విడుదల చేస్తానని అనడం, అలాగే, దివంగత సీఎం అన్నాదురై పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అన్నాడీఎంకే నేతలకు అస్సలు మింగుడుపడలేదు. దీంతో ఆ పార్టీలో సీనియర్లంతా అన్నామలై తీరుపై నిప్పులు చెరిగారు. ఇదే తరుణంలో మాజీ మంత్రి జయకుమార్ సైతం అన్నామలై తీరుపై ఇటీవల కాస్త ఘాటుగానే స్పందించడం, ఢిల్లీలో బీజేపీ నేతలను అన్నాడీఎంకే నేతలు కలవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగా, అన్నామలై తీరుపై బీజేపీ పెద్దలకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, వారి ప్రోద్బలం లేకుండా ఆయన అలా మాట్లాడి ఉండరని పళనిస్వామి భావించినట్టు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో అన్నాడీఎంకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు.. ఎన్డీయే కూటమి నుంచి అన్నాడీఎంకే బయటకు రావడంతో ఆ పార్టీ నేతలు తమిళనాడులో సంబురాలు చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో బాణాసంచా కాల్పి సంబురాలు జరుపుకుంటున్నారు. #WATCH | Tamil Nadu | AIADMK workers burst crackers in Chennai after the party announces breaking of all ties with BJP and NDA from today. pic.twitter.com/k4UXpuoJhj — ANI (@ANI) September 25, 2023 అన్నాడీఎంకే ప్రకటనపై తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై స్పందించారు. ప్రస్తుతం తాను దుర్గ పూజలో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడదలచుకోలేదని స్పష్టం చేశారు. దీనిపై తర్వాత మాట్లాడుతానని తెలిపారు. #WATCH | Coimbatore | On AIADMK breaking alliance with BJP and NDA, Tamil Nadu BJP president K Annamalai says, "I will speak to you later, I don't speak during Yatra. I will speak later." pic.twitter.com/yObr5hSeT3 — ANI (@ANI) September 25, 2023 ఇది కూడా చదవండి: మీరు డమ్మీ సీఎం, అబద్దాల కోరు.. అందుకే పక్కన పెట్టేశారు -
చరిత్ర లేని వాళ్లకు చరిత్ర గురించి మాట్లాడే అర్హత లేదు
సాక్షి, చైన్నె : కమలంతో కటీఫ్...ఇదే పార్టీ నిర్ణయం అని అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారి తీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను టార్గెట్ చేసి అన్నాడీఎంకే మాజీ మంత్రులు మాటల దాడికి దిగారు. ఇదే సమయంలో ఇరు పార్టీల మధ్య మంగళవారం పోస్టర్ల యుద్ధం జోరందుకుంది. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ తదుపరి పరిణామాలతో కమలానికి వ్యతిరేకంగా పళణి సేన రూ టు మార్చడం ఎన్డీఏ కూటమిలో కొత్త చర్చకు దారి తీసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తమను టార్గెట్ చేసి గతంలో తీవ్ర విమర్శలు చేసినా, దివంగత అమ్మ జయలలితకు వ్యతిరేకంగా ఆరోపణలు గుప్పించినా స్పందించని అన్నాడీఎంకే వర్గాలు, తాజా ఆయనపై ముప్పెట దాడికి దిగడం గమనార్హం. నా మాటే పార్టీ శాసనం.. దివంగత ముఖ్యంత్రి అన్నాదురైకు వ్యతిరేకంగా అన్నామలై చేసిన కొన్ని వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని అన్నాడీఎంకే మాజీ మంత్రులు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఓ అడుగు ముందుకు వేసిన అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ మాట్లాడుతూ, ఇక కమలంలో కటీఫ్ అని ప్రకటించారు. తన వ్యాఖ్యలే పార్టీ నిర్ణయం అని స్పష్టం చేయడం చర్చకు దారి తీసింది. ఇక అన్నామలైపై మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ కూడా తీవ్రంగా మండిపడ్డారు. చరిత్ర లేని వాళ్లకు చరిత్ర గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. తమ నేతకు ఎన్డీఏ కూటమి ప్రాధాన్యతను ఇస్తుంటే, ఎలాంటి అర్హత, అనుభవం లేని అన్నామలై విమర్శలు ఎక్కుబెట్టడం మంచి పద్ధతేనా..? అని ప్రశ్నించారు. నేడు చస్తే..రేపు పాలు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మరో మాజీ మంత్రి ఎస్పీ వేలు మణి మాట్లాడుతూ, చరిత్రనే మార్చేయడమే ఒక పార్టీ అధ్యక్షుడికి తగదు అని చురకలు అంటించారు. అన్నా గురించి మాట్లాడే అర్హత అన్నామలైకు లేదని మండి పడ్డారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి జయరామన్ మాట్లాడుతూ, అన్నాడీఎంకే కూటమిలోకి ఉండే వారు డాలర్ నోటుతో సమానం అని వ్యాఖ్యలు చేశారు. అదే కూటమి నుంచి బయటకు వెళ్లే వారి పరిస్థితి చెల్లని నోటే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నామలైకు హితవు పలికారు. తమ కూటమిలో ఉంటూ, తమనే విమర్శిస్తే,సహంచబోమని హెచ్చరించారు. బీజేపీ, అన్నాడీఎంకే మధ్య పోస్టర్ల యుద్ధం ఓవైపు మాజీ మంత్రులు ఈ మాటల తూటాలను పేల్చుతున్న నేపథ్యంలో తూత్తుకుడిలో అన్నాడీఎంకే వర్గాల నేతృత్వంలో వెలిసిన పోస్టర్లు మరో చర్చకు దారి తీశాయి. ఇదే మంచి నిర్ణయం. ఇక కాషాయానికి ఫుల్స్టాప్ పెట్టేద్దామనే నినాదాలతో ఆ పోస్టర్లు ఉండడం గమనార్హం. అదే సమయంలో మదురైలో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన పోస్టర్లు వివాదానికి దారి తీశాయి. ఇక, చర్చల్లేవు...దాడులే అన్న నినాదాలతో అన్నాడీఎంకేకు ఆ పోస్టర్ల ద్వారా హెచ్చరికలు చేశారు. అలాగే, ఈరోడ్‌తో పాటు మరికొన్ని చోట్ల అన్నాడీఎంకే నుంచి తాము కూడా బయటకు వచ్చేశామంటూ కమలనాథులు స్వీట్లు పంచుకోవడం గమనార్హం. అన్నామలై, జయకుమార్ కారణం ఇదేనా..? ఢిల్లీలో జరిగిన భేటీలో పుదుచ్చేరితోపాటు రాష్ట్రంలోని 40 ఎంపీ స్థానాల్లో 20 సీట్లను బీజేపీ ఆశిస్తున్నట్లు తెలిసింది. 14 సీట్లు తమకు, మిగిలిన సీట్లు మిత్రులకు తామే పంచే యోచనలో బీజేపీ ఉన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో పుదియ తమిళగం, ఐజేకే, పుదియ నీధి కట్చి, తమిళ మానిల కాంగ్రెస్ ఉన్నాయి. అలాగే తమ శతృవులుగా ఉన్న పన్నీరు సెల్వం శిబిరానికి రెండు , దినకరన్ నేతృత్వంలోని అమ్మమక్కల్ మున్నేట్ర కళగంకు శివగంగై సీటును కట్టబెట్టే యోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. ఇక తాము దూరం పెట్టిన వ్యక్తులను బీజేపీ అక్కున చేర్చుకోబోతుండడాన్ని గ్రహించే, తాజాగా అన్నామలైను టార్గెట్ చేసి కాషాయంతో కటీఫ్ అన్న నినాదాన్ని పళణి శిబిరం అందుకుందనే చర్చ సాగుతోంది. -
'బీజేపీతో, అన్నాడీఎంకే పొత్తు ఉండదు'
చెన్నై: తమిళనాట బీజేపీ, అన్నాడీఎంకే మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోదని అన్నాడీఎంకే స్పష్టం చేసింది. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. ఎన్నికల సమయంలోనే చూసుకుంటామని పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు డీ జయకుమార్ సోమవారం చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురైపై ఇటీవల తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై ఏఐడీఎంకే తీవ్రంగా స్పందించింది. దివంగత నేత జయలలితతో సహా అన్నాడీఎంకే నేతలపై అన్నామలై ఇటీవల విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని అన్నారు. అన్నామలైపై విమర్శలు గుప్పిస్తూ.. అన్నాదురైని అవమానిస్తే పార్టీ కార్యకర్తలు సహించరని అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు డి జయకుమార్ అన్నారు. బీజేపీ కార్యకర్తలు కోరుకుంటున్నప్పటికీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి అన్నామలైకి ఇష్టం లేనట్లుంది. మా నేతలపై చేస్తున్న ఈ విమర్శలన్నీ మేం సహించాలా? బీజేపీ ఇక్కడ ఖాతా ఓపెన్ చేయలేదు. బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు మాకు తెలుసు.” అని అన్నాడీఎంకే నేత జయకుమార్ మండిపడ్డారు. ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా అని జయకుమార్‌ను ప్రశ్నించగా.. వ్యక్తిగతంగా తాను మీడియాతో ఇలా మాట్లాడనని, పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో మాత్రమే మాట్లాడతానన్నారు. ఇదీ చదవండి: తల్లిగా లాలిస్తూ.. మేయర్‌గా పాలన చేస్తూ.. -
మాజీ ఎమ్మెల్యే ఇంట్లో డీవీఏసీ సోదాలు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే నేత, టీనగర్ మాజీ ఎమ్మెల్యే సత్యను డీవీఏసీ బుధవారం టార్గెట్ చేసింది. చైన్నె, కోయంబత్తూరు తదితర 16కు పైగా ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఈ తనిఖీలకు వ్యతిరేకంగా పలు చోట్ల అన్నాడీఎంకే వర్గాలు ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. వివారాలు.. డీఎంకే అధికారంలోకి వచ్చినానంతరం అన్నాడీఎంకే మాజీ మంత్రులను, పలువురు మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. తమకు గతంలో అందిన సమాచారం, ఆధారాలు, ఫిర్యాదుల మేరకు డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరెప్షన్ (డీవీఏసీ – అవినీతి నిరోధక శాఖ) వర్గాలు దూకుడుగా ముందుకెళ్తున్నాయి. మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, తంగమణి, వీరమణి, విజయ భాస్కర్, ఎంఆర్ విజయ భాస్కర్ , కేపీ అన్భళగన్ల తదితరులతో పాటు మాజీ సీఎం పళని స్వామి సన్నిహితులు, కాంట్రాక్టర్లు తదితరుల ఇళ్లు, వారికి సంబంధించిన సంస్థలు, కార్యాలయాలు, సన్నిహితులను గురిపెట్టి ఇప్పటికే సోదాలు ముగిశాయి. ఈ కేసులన్నీ ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. అదే సమయంలో తాజాగా టీ నగర్ సత్యను ఏసీబీ టార్గెట్ చేసింది. కోర్టు ఆదేశాలతో దూకుడు.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆస్తుల వివరాలను సత్య దాచి పెట్టి తప్పుడు సమాచారం నామినేషన్లో పేర్కొన్నట్లు ఇప్పటికే ఫిర్యాదులు హోరెత్తాయి. అలాగే ఆదాయానికి మించి ఆయన ఆస్తులు గడించినట్లు వచ్చిన ఫిర్యాదులను డీవీఏసీ విచారించింది. అదే సమయంలో హైకోర్టులో న్యాయమూర్తి ఆనంద వెంకటేషన్ బెంచ్ సైతం ఈ ఫిర్యాదులపై దృష్టి పెట్టింది. రెండు నెలల్లో కేసును ముగించాలని, విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇదే అదనుగా అస్సలే అన్నాడీఎంకే వర్గాల మీద తీవ్ర ఆక్రోశంతో ఉన్న పాలకులు తాజాగా కోర్టు ఆదేశాలతో సత్యను టార్గెట్ చేసి దూకుడు పెంచారు. భారీగా అక్రమాస్తులు.. తమ విచారణలో వెలుగు చూసిన అంశాల మేరకు మాజీ ఎమ్మెల్యే సత్య అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఏసీబీ గుర్తించింది. 2016–21లో ఆయన ఆదాయానికి మించి రూ. 2.64 కోట్లు ఆస్తులు గడించినట్టు గుర్తించిన డీవీఏసీ కేసు నమోదు చేసింది. సత్యతో కలిసి పలు వ్యాపారాలు చేస్తున్నట్టుగా పేర్కొంటున్న, అన్నాడీఎంకే ఉత్తర చైన్నె తూర్పు జిల్లా కార్యదర్శి రాజేష్‌ను కూడా టార్గెట్ చేశారు. తండయార్ పేటలోని రాజేష్ నివాసంలో ఐదుగురు అధికారులతో కూడిన బృందం సోదాలు చేపట్టింది. వడపళణిలోని సత్య నివాసంతో పాటు చైన్నె, కోయంబత్తూరు, తిరువళ్లూరు తదితర 16 ప్రాంతాలలో పలు బృందాలుగా ఏసీబీ అధికారులు సోదాల్లో నిమగ్నమయ్యారు. గుమ్మిడి పూండి సమీపంలోని ఆరపాక్కంలోని సత్య మిత్రుడు దిలీప్‌కుమార్‌కు చెందిన కల్యాణ మండపం, రియల్ ఎస్టేట్ సంస్థలలోనూ సోదాలు చేపట్టారు. ఈ సోదాల సమాచారంతో సత్య మద్దతు అన్నాడీఎంకే వర్గాలు రంగంలోకి దిగాయి. అధికారపక్షం కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఏసీబీని ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి. ఆందోళన కారులను అడ్డుకున్నారు. ఆయా ప్రాంతాలలో తిష్ట వేసిన అన్నాడీఎంకే వర్గాలు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనంను సత్య మద్దతుదారులు సరఫరా చేయడం గమనార్హం. గట్టి భద్రత నడుమ అనేక చోట్ల పొద్దుపోయే వరకు సోదాలు జరిగాయి. ఇందులో పలు రికార్డులు, ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
అమ్మ డీఎంకే పేరుతో సెల్వం కొత్తపార్టీ..!
సాక్షి, చైన్నె: మాజీ సీఎం పన్నీరు సెల్వం కొత్త పార్టీ కసరత్తుల్లో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.ఈ పార్టీకి అమ్మ డీఎంకే అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. వివరాలు.. అన్నాడీఎంకేను కై వశం చేసుకునేందుకు మాజీ సీఎం పన్నీరు సెల్వం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో, కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద చుక్కెదురైంది. పళణి స్వామి అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయి. చివరకు సర్వ సభ్య సమావేశ తీర్మానాల విషయంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఎదురుచూసి భంగ పడ్డారు. ఈ వ్యవహారంలోనూ పళణి స్వామినే విజయం వరించింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ పగ్గాలను పూర్తిగా పళణి స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. దీంతో పన్నీరుకు భంగపాటు తప్పలేదు. ఇక, అన్నాడీఎంకే కై వశం ప్రయత్నాలను పక్కన పెట్టి తనను నమ్మి వచ్చిన వారి కోసం, తనకు అండగా ఉన్న కేడర్ చేజారకుండా జాగ్రత్తలకు పన్నీరు సెల్వం సిద్ధమయ్యారు. ఇందుకోసం కొత్త పార్టీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమ కంటూ ఓ పత్రికను ఏర్పాటు చేశారు. ఈ పత్రిక ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కొత్త వ్యూహాలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆయన అన్నాడీఎంకేను ఇరకాటంలో పెట్టే రీతిలో కొత్త పార్టీ వైపుగా అడుగులు వేస్తున్నట్టు మద్దతుదారులు పేర్కొంటున్నారు. ఈ పార్టీకి అమ్మడీఎంకే అన్న పేరును పరిశీలిస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పటికే అన్నాడీఎంకే నుంచి చీలికతో దినకరన్ నేతృత్వంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఆవిర్భవించి ఉంది. ఇది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి ఉంది. ఈ దృష్ట్యా, అన్నా డీఎంకేకు ప్రత్యామ్నాయంగా అమ్మడీఎంకే అన్న పేరును పరిశీలిస్తున్నామని ఓ నేత పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో పార్టీ ప్రకటన, మహానాడుకు సిద్ధమవుతున్నామని ఆ నేత తెలిపారు. లోక్‌సభ ఎన్నికలలో పన్నీరు పార్టీ పోటీకి దిగడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ తమను మోసం చేసిందని అందుకే ఆ కూటమికి ప్రత్యామ్నాయంగా అమ్మ డీఎంకే అడుగుల వేగం పెంచడం ఖాయం అని మరో నేతపేర్కొనడం గమనార్హం. -
మాజీ సీఎం పన్నీరుసెల్వంకు షాక్
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే పూర్తిగా పళణిస్వామి గుప్పెట్లోకి చేరింది. ఆయన నేతృత్వంలో జరిగిన సర్వసభ్య సమావేశ తీర్మానాలన్నీ చెల్లుతాయని శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో మాజీ సీఎం పన్నీరుసెల్వంకు షాక్ తప్పలేదు. పళణిస్వామి మద్దతు నేత డాక్టర్ సునీల్ నేతృత్వంలో పార్టీ ప్రధాన కార్యాలయం ఆవరణలో భారీ విజయోత్సవ సందడి నెలకొంది. కోర్టు తీర్పులు, ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో అన్నాడీఎంకేను పళణిస్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మదురై వేదికగా బ్రహ్మాండ మహానాడును పళణిస్వామి విజయవంతం చేశారు. అదేసమయంలో అన్నాడీఎంకేను కై వసం చేసుకుంటాననే ధీమాను మాజీ సీఎం పన్నీరుసెల్వం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇప్పటివరకు వచ్చిన తీర్పులు ఓ ఎత్తు అయితే, అన్నాడీఎంకే తీర్మానాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ తనకు అనుకూలంగానే ఉంటుందని పన్నీరు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. తీర్మానంలోని అంశం ఇదే.. గత ఏడాది వానగరంలో పళణిస్వామి నేతృత్వంలో జూలై 11న సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో పన్నీరుసెల్వంతో పాటు ఆయన మద్దతుదారులను తొలగిస్తూ తీర్మానం చేశారు. పళణిస్వామిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తమను తొలగించారని సర్వసభ్య సమావేశానికి, తీర్మానాలకు వ్యతిరేకంగా పన్నీరుసెల్వం, ఆయన మద్దతుదారులు వైద్యలింగం, మనోజ్ పాండియన్, జేసీటీ ప్రభాకర్‌లు కోర్టు తలుపుతట్టారు. సర్వసభ్య సమావేశానికి అనుకూలంగా ఇప్పటికే హైకోర్టు, ఆతర్వాత సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో పళణిస్వామి పార్టీని తన గుప్పెట్లోకి తెచ్చుకుని ఎన్నికల ప్రక్రియ ద్వారా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు ఏకగ్రీవంగా చేపట్టారు. అయితే, తీర్మానాల వ్యవహారం సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు చేరడంతో ఈ విచారణలో తీర్పు ఉత్కంఠ తప్పలేదు. తమకు అనుకూలంగానే ఈ తీర్పు ఉంటుందని భావించిన పన్నీరుసెల్వంకు పెద్ద షాక్ తగిలింది. పళణికి అనుకూలంగా తీర్పు.. పన్నీరు అండ్ బృందం దాఖలు చేసిన ఈ పిటిషన్ పై కొన్ని నెలలుగా విచారణ జరిగింది. వాదనలు ముగిశాయి. ఇటీవల లిఖిత పూర్వక వాదనలు సైతం పళణి, పన్నీరులు వేర్వేరుగా కోర్టు ముందు ఉంచారు. శుక్రవారం న్యాయమూర్తులు ఆర్ మహదేవన్, మహ్మద్ షఫిక్ బెంచ్ తీర్పు వెలువరించింది. సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలు చెల్లుతాయని ప్రకటించింది. పన్నీరుసెల్వం పిటిషన్‌ను తోసిపుచ్చారు. అలాగే, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళణి ఎంపికను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించారు. దీంతో పళణిస్వామి గుప్పెట్లోకి పూర్తిగా అన్నాడీఎంకే చేరినట్లైంది. అనంతరం మీడియాతో పళణిస్వామి మాట్లాడుతూ న్యాయానికి, ధర్మానికి, నిజాయితీకి దక్కిన గెలుపుగా అభివర్ణించారు. లోక్‌సభ ఎన్నికలలో మరింత ఉత్సాహంతో పనిచేస్తామని, పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని 40 స్థానాలను కై వసంచేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సంబరాలు... పళణిస్వామికి అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో అన్నాడీఎంకే వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. బాణసంచాలు పేల్చాయి. స్వీట్లు పంచి పెట్టి ఆనందాన్ని పంచుకున్నాయి. చైన్నె రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఆవరణలో ఎంజీఆర్ యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ నేతృత్వంలో మద్దతుదారుల విజయోత్సవాలు జరిగాయి. దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత ఫ్లెక్సీలు, ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ఫ్లెక్సీలను ఊరేగించారు. బాణసంచాలు పేల్చుతూ ఆనంద తాండవం చేశారు. ఈసందర్భంగా అందరికీ కొబ్బరి బొండాల పంపిణీ జరిగింది. మాజీమంత్రి జయకుమార్ కొబ్బరి బొండాలను అందజేశారు. పార్టీ నేతలు తమిళ్ మగన్ హుస్సేన్, ఇలంగోవన్ పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. -
డీఎంకే మంత్రులకు హైకోర్టు ఝలక్
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం 2006–11 మధ్య అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ కాలంలో మంత్రులుగా ఉన్న వారి భరతం పట్టే విధంగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే దూకుడు పెంచింది. డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరెప్షన్(డీవీఏసీ) విభాగాన్ని రంగంలోకి దించింది. డీఎంకే మాజీ మంత్రులే కాదు, పలువురు ఎమ్మెల్యేలపై కేసుల మోత మోగించారు. ఈ క్రమంలో అక్రమాస్తులు, స్థలాల కబ్జా, ఆదాయానికి మించిన ఆస్తులు కూడ బెట్టారని, ప్రభుత్వ నిధులను మింగేశారని అనేక కేసులు పలువురిపై నమోదు అయ్యాయి. మరికొందరిపై పరువు నష్టం దావాలు కూడా దాఖలయ్యాయి. అక్రమాస్తుల కేసులు అత్యధికంగా అప్పటి డీఎంకే సీనియర్లు, మాజీ మంత్రులపై నమోదు అయ్యాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే పదేళ్లు అధికారంలో ఉండడంతో ఈ కేసుల విచారణ నిమిత్తం డీఎంకే నేతలు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తప్పలేదు. అధికారంలోకి వచ్చాక.. వరుస తీర్పులు... డీఎంకే 2021లో మరోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. 10 ఏళ్ల అనంతరం అధికారం చేజిక్కించుకున్న తర్వాత గతంలో మంత్రులుగా పనిచేసిన సీనియర్లు అధిక శాతం మంది మళ్లీ పదవులు దక్కించుకున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయ్యింది. అయితే, ఆదాయానికి మించిన ఆస్తులు, అక్రమాస్తుల కేసులలో పలువురు మంత్రులకు కింది కోర్టులో ఆగమేఘాలపై విముక్తి కల్గించే తీర్పులు ఇస్తుండటాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. గత కొన్ని నెలల్లో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, రెవెన్యూ మంత్రి కేకేఎస్ఎస్ ఆర్. రామచంద్రన్, ఉన్నత విద్యా మంత్రి పొన్ముడి వంటి వారిపై , వారి బంధువులు, కుటుంబీకులపై నమోదైన కేసుల్లో కింది కోర్టులు ఇస్తున్న తీర్పులు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. జస్టిస్ ఆనంద్ వెంటకేషన్ కన్నెర్ర కింది కోర్టులు తీర్పు వెలువరించి నెలలు గడస్తున్నా అవినీతి నిరోధక శాఖ అప్పీల్‌కు వెళ్లక పోవడం అనుమానాలకు దారి ల్సింది. పొన్ముడిని అక్రమాస్తుల కేసులో విడుదల చేస్తూ వేలూరు కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ వెంకటేషన్ అప్పీల్ వ్యవహారంపై స్పందించని అవినీతి ని రోధక శాఖకు అక్షింతలు వేసే విధంగా వ్యాఖ్యలు చేశారు. అలాగే, పొన్ముడి విడుదలను వ్యవహారంలో సుమోటోగా కేసు నమోదు చేసి విచారించనుల్ట్లు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో బుధవారం మరో ఇద్దరు మంత్రులను ఆనంద్ వెంకటేషన్ టార్గెట్ చేశారు. గతంలో విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు తంగం తెన్నరసు, బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్నప్పుడు కేకేఎస్ఎస్ఆర్లపై నమోదైన కేసులలో తాజాగా వెలువడ్డ తీర్పులు ఒకే రకంగా ఉండడాన్ని న్యాయమూర్తి ఆనంద్ వెంకటేషన్ తీవ్రంగా పరిగణించారు. డీఎంకే మంత్రులు, వారి బంధువులు, కుటుంబీకులను విడుదల చేస్తూ కింది కోర్టులు ఇస్తున్న తీర్పులన్నీ ఒకే విధంగా ఉండడంతో అనుమానించారు. న్యాయమూర్తి ఆనంద్ వెంకటేషన్ బుధవారం ఓ కేసు విచారణ సమయంలో మంత్రులను విడుదల చేస్తూ కింది కోర్టులు ఇస్తున్న తీర్పులను ప్రస్తావించారు. ఈ తీర్పులను చదివినానంతరంమూడు రోజులు తనకు నిద్ర రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తంగం తెన్నరసు, కేకేఎస్ఎస్ఆర్ను విడుదల చేస్తూ అనుసరించిన విధానం సరిగ్గా లేదని, కింది కోర్టుల తీర్పు అసంతృప్తిని కలిగించినట్లు పేర్కొన్నారు. తీర్పుల తేదీలను మార్చారేగానీ, సారంశమంతా ఒకే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఎవరు అధికారంలోకి వచ్చినా తమపై కేసులను నిర్వీర్యం చేసుకోవడం, నీరుగార్చి విముక్తి పొందడం పరిపాటిగా మారిందన్నారు. తన మనసాక్షికి కట్టుబడి ఈ కేసులను సుమోటోగా విచారించేందుకు నిర్ణయించానని తెలిపారు. తాను కూడా కళ్లు మూసుకుంటే , న్యాయ వ్యవస్థ తన బాధ్యతల నుంచి తప్పుకున్నట్టేనని అందుకే కింది కోర్టులు ఇచ్చిన తీర్పులపై విచారించేందుకు సిద్ధమైనట్టు ప్రకటించారు. న్యాయమూర్తి వ్యా ఖ్యలు డీఎంకే మంత్రులకు షాక్ గురి చేశాయి. ఇప్పటికే పదేళ్లు న్యాయ పోరాటం చేసిన, తమకు మళ్లీ విచారణ తప్పదన్న బెంగ వారిలో కనిపిస్తోంది. అలాగే ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ స్పందించాలని ఆదేశిస్తూ, విచారణను సెప్టెంబరు 20వ తేదీకి వాయిదా వేశారు. సుమోటోగా కేసులు అధికారంలోకి వచ్చినానంతరం డీఎంకే మంత్రులు పలువురికి ఆదాయానికి మించిన ఆస్తులు, అవినీతి తదితర కేసుల నుంచి క్రమంగా విముక్తి కలుగుతోంది. అయితే కింది కోర్టు తీర్పులన్నీ ఒకే రకంగా ఉండడం పలు అనుమానాలకు దారి తీశాయి. ఈ తీర్పులను చదివిన హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ వెంకటేషన్ తీవ్రంగా స్పందించారు. జిల్లా కోర్డులు ఇచ్చిన ఆదేశాలను పరిశీలించిన అనంతరం మూడు రోజులు తనకు నిద్ర రాలేదని, అందుకే ఆ కేసులను సుమోటోగా విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు బుధవారం సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే గవర్నర్ తీరుతో తలబొప్పికట్టిన స్టాలిన్ ప్రభుత్వానికి హైకోర్టు నిర్ణయం అశనిపాతంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
నాయకుడొచ్చాడు..! అన్నాడీఎంకే పూర్తిగా పళణి స్వామి గుప్పెట్లోకి
అనుమానాలు తొలగిపోయాయి.. ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకూ అన్నాడీఎంకే పూర్తిగా పళణి స్వామి గుప్పెట్లోకి చేరింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయనకి కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు కల్పించింది. ఆయన నేతృత్వంలో 79 మంది రాష్ట్ర కమిటీ, 69 జిల్లాల కార్యదర్శులు, ఇతర రాష్ట్రాలలోని కార్యదర్శులకు ఆమోద ముద్ర వేస్తూ.. ఆ వివరాలను మంగళవారం కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. ఇది అన్నాడీఎంకే శ్రేణుల్లో అమితానందాన్ని నింపింది. సాక్షి, చైన్నె: అమ్మ జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాల క్రమంలో ఆ పార్టీలోని ముఖ్య నేతలు నాలుగు శిబిరాలుగా విడిపోయి ముందుకెళ్తున్నారు. ఓ ఓ వైపు తానే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శినంటూ జయలలిత నెచ్చెలి శశికళ, మరోవైపు పార్టీలో చీలిక కారణంగా ఏర్పడిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం గొడుగు నీడన దినకరన్, ఇంకో వైపు సమన్వయ కమిటీ కన్వీనర్ హోదాతో అంటూ పన్నీరు సెల్వం శిబిరం అన్నాడీఎంకేను కై వశం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. అయితే, కేడర్ బలం, ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతుతో అన్నాడీఎంకే తనదే అని చాటే విధంగా పళణి స్వామి నిత్యం వ్యూహాలకు పదును పెట్టి చివరికి సఫలీకృతులయ్యారు. అన్నాడీఎంకే వ్యవహారాలు అనేకం కోర్టుల్లో ఉన్నా, పార్టీకి కీలకం ఎవరు? అనే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా మరోమారు తేల్చింది. సర్వ సభ్య సమావేశం, పార్టీ నిబంధనలకు అనుగుణంగా సంస్థాగత ఎన్నికలు, ఏకగ్రీవంగా పదవులకు ఆమోదం లభించడంతో పళనిస్వామి పై చేయి సాధించారు. నూతనోత్సాహంతో.. సుప్రీంకోర్టు ఇటీవల వచ్చిన తీర్పు, అందుకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులతో వ్యూహాలకు పదును పెట్టి అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం దిశగా పళణి స్వామి అడుగులు వేసి విజయం సాధించారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టి బలోపేతం దిశగా పరుగులు తీస్తున్నారు. ఆగస్టులో మదురై వేదికగా భారీ మహానాడు నిర్వహణకు సిద్ధమవున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన కార్యదర్శిగా తన ఎంపికతో పాటుగా, రాష్ట్ర కమిటీ, జిల్లాల కమిటీ, ఇతర రాష్ట్రాల కమిటీల ఎంపిక వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అన్నాడీఎంకే వర్గాలు పంపించాయి. ఇందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోద ముద్ర వేసింది. ఇక, అన్నాడీఎంకేను సొంతం చేసునే అవకాశం ఇతర గ్రూపులకు లేని విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పెట్టిన ఉత్తర్వులు మంగళవారం పళణి స్వామికి అందాయి. ఇందులో అన్నాడీఎంకేలో ఇక ఏక నాయకత్వం అని చాటే విధంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పళణి స్వామికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే, 69 జిల్లాలకు కార్యదర్శులు, రాష్ట్ర కమిటీలో జంబో జట్టుగా 79 మంది నియామకానికి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, ఢిల్లీ, తెలంగాణ, అండమాన్ తదితర ప్రాంతాలకు పార్టీ కార్యదర్శుల గుర్తింపునకు ఆమోదం లభించింది. దీంతో ఆపార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. రాష్ట్ర కమిటీలో 79 మందికి చోటు పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా తమిళ్ మగన్ హుస్సేన్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులుగా కేపీ మునుస్వామి, నత్తం ఆర్. విశ్వనాథన్, కోశాధికారిగా దిండుగల్ శ్రీనివాసన్, ఆల్ ఇండియా ఎంజీఆర్ మండ్రం కార్యదర్శిగా సి. పొన్నయ్యన్‌ను నియమించారు. పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శిగా సి. తంబి దురై, నిర్వాహక కార్యదర్శులుగా సెంగోట్టయన్, తంగమణి, జయకుమార్, సీవీ షణ్ముగం, సెమ్మలై, దళవాయి సుందరం, పార్టీ ప్రధాన కార్యాలయ కార్యదర్శిగా ఎస్పీ వేలుమణి, పార్టీ ఎన్నికల విభాగం కార్యదర్శిగా పొల్లాచ్చి వి. జయరామన్, మహిళా విభాగం కార్యదర్శిగా వలర్మతికు పదవులు కల్పించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ తమకే అన్నాడీఎంకే అని స్పష్టం చేయడంతో పళణి స్వామి మద్దతు దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అన్నాడీఎంకే జెండాను గానీ,పార్టీ చిహ్నాన్ని గానీ మరెవరైనా ఉపయోగిస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని జయకుమార్ హెచ్చరించారు. పళణిస్వామికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి గుర్తింపు వచ్చిందో లేదో వెంటనే ఏన్డీఏ కూటమి ఆహ్వానం కూడా దక్కింది. ఈనెల 18వ తేదీ ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ పార్టీల సమావేశానికి అన్నాడీఎంకే తరపున హాజరు కావాలంటూ పళణికి పిలుపు రావడం విశేషం. ఈ పరిణామాలతో అన్నాడీఎంకే వర్గాలు ఆనంద తాండవం చేస్తున్నాయి. అంగీకరించే ప్రసక్తే లేదు.. కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను తాము అంగీకరించే ప్రసక్తే లేదని పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారం కోర్టులో ఉందని, తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పళణి సీఎంగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న (దివంగత సీఎం జయలలితకు చెందిన ఎస్టేట్) కొడనాడు ఘటనను ఈసందర్భంగా పన్నీరు సెల్వం ప్రస్తావిస్తూ, ఈ కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయాని కోరారు. ఈ విషయంపై ఆగస్టు 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని ప్రకటించారు. కాగా, ఎన్డీఏ కూటమి సమావేశానికి పళణి స్వామికి, పీఎంకే తరపున అన్భుమణి రాందాసుకు, తమిళ మానిల కాంగ్రెస్ తరపున జీకే వాసన్‌కు ఆహ్వానాలు వచ్చినా తనకు మాత్రం ఎలాంటి ఆహ్వానం అందలేని పన్నీరు పేర్కొనడం గమనార్హం. -
తమిళనాట మరో ట్విస్ట్.. అన్నాడీఎంకేకు షాక్!
చెన్నై: తమిళనాడులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అన్నాడీఎంకే ఎంపీ ఓపీ రవీంద్రనాథ్‌కు షాక్ తగిలింది. తేనీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన ఎన్నిక చెల్లదంటూ మద్రాస్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో ఆయన ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది. వివరాల ప్రకారం.. పన్నీరు సెల్వం కుమారుడు రవీంద్రనాథ్‌కు ఎదురుదెబ్బ తగలింది. పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి ఎంపీగా గెలుపొందిన రవీంద్రనాథ్ ఎన్నికను రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. అయితే, ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి ఈవీకేఎస్ ఎలంగోవన్‌పై 76,672 ఓట్ల ఆధిక్యతతో రవీంద్రనాథ్ గెలుపొందారు. కాగా, ఆయన ఎన్నికపై మిలానీ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సందర్భంగా రవీంద్రనాథ్ ఆస్తులకు సంబంధించి తప్పుడు పత్రాలు ఇచ్చారని ఆరోపించారు. అలాగే, గెలుపు కోసం అవినీతికి పాల్పడినట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక, ఈ పిటిషన్‌పై కోర్టులో విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఆయన ఎన్నికను మద్రాస్ హైకోర్టు రద్దు చేస్తున్నట్టు తీర్పు వెల్లడించింది. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే నుంచి రవీంద్రనాథ్ 2022లో పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీపై తిరుగుబాటు చేసిన నేపథ్యంలో అన్నాడీఎంకే ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమి నుంచి రవీంద్రనాథ్ మాత్రమే గెలుపొందడం గమనార్హం. డీఎంకే-కాంగ్రెస్ కూటమి రాష్ట్రంలోని మొత్తం 39 సీట్లలో 38 గెలుచుకుంది. ఇది కూడా చదవండి: ఎన్సీపీ విద్యార్ధి నాయకుల వినూత్న పోస్టర్ -
పళనికి ప్రత్యేక అనుమతి
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎడపాడి కే పళనిస్వామికి కేంద్ర విమానయాన శాఖ ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఆయన తన కారులో నేరుగా విమానం వద్దకు వెళ్లే అవకాశం కల్పించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. పళనిస్వామి గతంలో సీఎంగా ఉన్నప్పుడు వీఐపీ, వీవీఐపీ ప్రోటోకాల్ మేరకు రన్ వేకు సమీపంలో ఆగి ఉండే విమానం వద్దకు ఆయన వాహనానికి అనుమతి ఉండేది. పదవి కోల్పోవడంతో సాధారణ ప్రయాణికుడిలా ఆయన బోర్డింగ్ వ్యవహారాలు ముగించుకుని ఆయా విమాన సంస్థల బస్సులో విమానం వద్దకు ప్రయాణించాల్సి ఉంది. ఇటీవల ఈ ప్రయాణ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో పళనిస్వామికి భద్రత కల్పించాల్సిన అవశ్యం విమాన యాన శాఖకు ఏర్పడింది. మదురైలో బస్సు ప్రయాణం సమయంలో ఆయనకు వ్యతిరేకంగా రాజేశ్వరన్ అనే వ్యక్తి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, పళని భద్రతా సిబ్బంది అడ్డుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో పళనిస్వామికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, తమిళనాడు ప్రధాన ప్రతి పక్ష నేత హోదాలో నేరుగా విమానం వద్దకు కారులో వెళ్లేందుకు వీలు కల్పిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రోడ్డు ట్యాక్స్‌కు వ్యతిరేకత.. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ట్యాక్స్‌ను పెంచేందుకు కసరత్తులు చేపట్టిన విషయం తెలిసిందే. ఐదు శాతం మేరకు పన్ను వడ్డనకు సిద్ధమవుతున్నారు. దీనిని వ్యతిరేకంగా పళనిస్వామి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మంగళవారం ప్రకటన చేశారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం ఆస్తి, నీటి పన్నులు, విద్యుత్ చార్జీలను వడ్డించినట్టు ధ్వజమెత్తారు. ప్రస్తుతం రోడ్డు ట్యాక్స్ పెంపుతో సామన్యుడి సొంత వాహన కలను చెదరగొట్టే ప్రయత్నంలో ఉన్నారని ఽఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని దోచుకోవడం లక్ష్యంగా డీఎంకే పాలకులు ముందుకెళ్తున్నారని, తక్షణం ఈ ప్రయత్నం వీడాలని డిమాండ్ చేశారు. పదేళ్ల పాటు తమ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క భారం ప్రజల నెత్తిన వేయలేదని, ఈ డీఎంకే పాలకులు రెండేళ్లల్లో ప్రజల జేబులు చిల్లు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. -
తమిళనాడు నుంచి ప్రధాని మోదీ పోటీ?
సాక్షి, చైన్నె: రాష్ట్రం నుంచి ఈసారి ఎలాగైనా తమ ప్రతినిధులు పార్లమెంట్లో అడుగు పెట్టాలన్న లక్ష్యంగా బీజేపీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇందులోభాగంగా తమిళనాడులో కీలక స్థానాలపై గురి పెట్టి కార్యక్రమాలను విస్తృతం చేయబోతున్నది. మదురై నుంచి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కోయంబత్తూరు నుంచి ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్‌ను పోటీలో నిలబెట్టేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో తమ బలాన్ని చాటుకునేందుకు బీజేపీ తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తోంది. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ ఉన్నట్టు ౖపైపెకి చెప్పకుంటున్నా, లోలోపల ఆ పార్టీకి ఎసరు పెట్టే పరిస్థితులకు సంబంధించిన వ్యూహాలకు బీజేపీ పెద్దలు పదును పెట్టారు. ఈసారి ఎలాగైనా తమిళనాడు నుంచి ప్రతినిధి పార్లమెంట్లో అడుగు పెట్టడమే కాకుండా, అధిక స్థానాలను కై వసం చేసుకుని తీరాలన్న లక్ష్యంతో కార్యక్రమాలను విస్తృతం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలను అవినీతి పార్టీలుగా చిత్రీకరించి తాము లాభపడే విధంగా వ్యూహాలకు పదును పెట్టారు. అదే సమయంలో తమిళనాడు నుంచే ప్రధాని అంటూ రెండు రోజుల క్రితం చైన్నె, వేలూరు పర్యటన సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొత్త ప్రకటనను తెరపైకి తెచ్చి వెళ్లారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు నుంచి పోటీ చేస్తారా అనే చర్చ ఊపందుకుంది. అదే సమయంలో తమిళనాడులో ఏకంగా 15కు పైగా స్థానాలను గురి పెట్టి బీజేపీ కార్యక్రమాలను విస్తృతం చేసి ఉండడం గమనార్హం. ఈ పరిస్థితులలో తమిళనాడులో పోటీ చేసే అభ్యర్థుల జాబితా కసరత్తుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా బిజీగా ఉన్నట్టు సమాచారం. ఈమేరకు కొందరు ముఖ్య అభ్యర్థుల పేర్లను ముందుగానే వెల్లడించి, ఆయా నియోజకవర్గాలపై వారు పూర్తి స్థాయిలో పట్టు బిగించేందుకు తగిన కార్యాచరణలో ఉన్నట్టుంది. ఇందులో భాగంగా తాజాగా రెండు కీలక నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు సూచనప్రాయంగా వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు మదురై లోక్‌సభ నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కోయంబత్తూరు లోక్‌సభ నుంచి ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ పోటీలోకి దిగడం ఖాయం అన్నట్టుగా ఢిల్లీ నుంచి సమాచారాలు వెలువడుతున్నాయి. ఇది వరకటి వరకు రాజ్యసభ పదవితో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వ్యవహరిస్తూ వచ్చారు. ఈ సారి ఆమె ప్రత్యక్ష ఎన్నికలలో తనకు నచ్చిన మదురై నుంచి పోటీ చేయడానికి ఉత్సాహంగానే ఉన్నట్టు బీజేపీలో ప్రచారం ఊపందుకుంది. -
అన్నామలైకి వ్యతిరేకంగా అన్నాడీఎంకే తీర్మానం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే మాజీ చీఫ్ దివంగత జయలలితను ఉద్దేశించి పరోక్షంగా ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అమ్మను తెరపైకి తెచ్చి అవినీతి విమర్శ చేశాడంటూ అన్నామలైపై ఏఐఏడీఎంకే కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో మిత్రధర్మాన్ని బీజేపీ పాతరేస్తోందని మండిపడుతోంది. అదే టైంలో పొత్తు తెగిపోతోందనే ఊహాగానాల నడుమ ఇవాళ(మంగళవారం) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ అన్నామలైకి వ్యతిరేకంగా అన్నాడీఎకేం ఓ తీర్మానం చేసి.. ఆమోదించింది. అన్నామలై చేసిన వ్యాఖ్యలు అనుభవలేమి, బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవంటూ ఆ తీర్మానంలో పేర్కొంది పార్టీ. గత కొంతకాలంగా మిత్రపక్షంతో అన్నామలై తీరు సరిగా ఉండడం లేదని, తన వ్యాఖ్యలకు గానూ ఆయన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో మిత్రపక్షం(బీజేపీ) దృష్టిసారించాల్సిన అవసరం ఉందంటూ అందులో పేర్కొంది. వాస్తవానికి ఇవాళ జరిగిన ఏఐఏడీఎంకే జిల్లా కార్యదర్శలు సమావేశమే. కొత్త సభ్యత్వం నమోదు గురించి చర్చించాల్సి ఉంది. అయితే అన్నామలై వ్యాఖ్యలు మంట పుట్టించిన నేపథ్యంలో అనూహ్యంగా ఇలా ఆయనకు వ్యతిరేక తీర్మానం ఆమోదించింది పార్టీ. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నామలై.. జయలలితపై నమోదు అయిన అక్రమాస్తుల కేసు గురించి పరోక్షంగా ప్రస్తావించాడు. ‘‘ఈ రాష్ట్రంలో(తమిళనాడు) అవినీతి పేరుకుపోయి ఉంది. మాజీ ముఖ్యమంత్రులు సైతం అవినీతి కేసుల్లో దోషులుగా తేలారు. ఈ కారణం వల్లే తమిళనాడు ఇవాళ దేశంలోనే అవినీతి రాష్ట్రాల జాబితాలో నిలిచింది. అలాంటి ప్రభుత్వాలను బీజేపీ నిలదీసి తీరుతుంది’’ అంటూ వ్యాఖ్యానించారాయన. దీంతో ఏఐఏడీఎంకే క్యాడర్ నొచ్చుకుంది. 1998లో బీజేపీ అధికారంలోకి రావడానికి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే సాయం చేసిన విషయాన్ని మరిచిపోయి ఉంటుందంటూ అన్నామలైకు చరకలు అంటించారు పలువురు నేతలు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై అన్నామలై వెనక్కి తీసుకోకపోతే.. పొత్తు తెంచుకునే విషయంపై ఆలోచన చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది పార్టీ. ఇక ఇవాళ ఏకంగా అన్నామలైకి వ్యతిరేకంగా తీర్మానం చేయడం గమనార్హం. ఇక బీజేపీ కూడా ఈ విషయంలో తగ్గడం లేదు. అన్నామలై వ్యాఖ్యలను అన్నాడీఎంకే తప్పుగా అర్థం చేసుకుందని అంటోంది. మరోవైపు తీవ్ర వ్యాఖ్యలు చేసిన అన్నాడీఎంకే నేత డీ జయకుమార్‌పై బీజేపీ మండిపడింది. అన్నామలై అసలు ఓ పార్టీ చీఫ్‌గా ఉండేందుకు అర్హుడే కాదు. ఆయన మాటలు జారవిడిచి ఉండాల్సింది కాదు. ఆయన తీరు చూస్తుంటే మాతో పొత్తు కొనసాగించేందుకు ఆసక్తితో లేనట్లు కనిపిస్తోంది. లేదంటే.. మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించాలని అనుకోవట్లేదమో అంటూ జయకుమార్ మండిపడ్డారు. ఇక అక్రమాస్తుల కేసులో A1 నిందితురాలుగా జయలలితే ఉన్నారు. అయితే తీర్పు వెలువడడానికి కంటే ముందే జయలలిత కన్నుమూశారు. ఈ కేసులో ఆమె నిచ్చెలి శశికళ, మరొకందరికి జైలు శిక్ష పడింది. జయలలిత అక్రమాస్తుల కేసు.. ఇవీ పూర్తి వివరాలు -
చిన్నమ్మ షాక్
సాక్షి, చైన్నె: ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో నెలకొన్న వర్గ విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యాయ పోరాటం ద్వారా, మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతల మద్దతుతో అన్నాడీఎంకేను మాజీ సీఎం పళని స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. ఇక పళణి స్వామి తనను దూరం పెట్టడంతో వేరు కుంపటి పెట్టిన మరో మాజీ సీఎం పన్నీరు సెల్వం ఆ పార్టీని ఎలాగైనా కై వసం చేసుకోవడం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. ఇందులో భాగంగా గతంలో అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో రాజకీయ పయనం సాగిస్తున్న టీటీవీ దినకరన్‌ను చేతులు కలిపారు. ఒకప్పుడు బద్ద శత్రువులుగా ఉన్న ఈ ఇద్దరు ప్రస్తుతం మంచి మిత్రులయ్యారు. అలాగే టీటీవీ దినకరన్ ద్వారా దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళను ప్రసన్నం చేసుకుని అన్నాడీఎంకే కై వశం లక్ష్యంగా మరింతగా వ్యూహాలకు పదును పెట్టాలనే ఆశతో ఉన్న పన్నీరుకు ప్రస్తుతం షాక్ తప్పలేదు. పెద్ద దిక్కుగా ఉండాలని.. అన్నాడీఎంకేలో తాజా పరిణామాల వ్యవహారంలో ఎవరో ఒకరి వైపుగా నిలబడకుండా తటస్థంగా వ్యవహరించి పార్టీకి పెద్ద దిక్కుగా నిలబడాలనే వ్యూహంతో చిన్నమ్మ ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. అందుకే ఆమె పన్నీరు, టీటీవీ దినకరన్ హాజరైన ఈ వివాహ వేడుకకు దూరంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ వివాహ వేడుకకు చిన్నమ్మ వస్తారనే ఎదురు చూపుల్లో దక్షిణ తమిళనాడులోని కీలక సామాజిక వర్గం వేచి ఉన్నా, చివరకు ప్రయోజనం లేకుండా పోయింది. అదే సమయంలో చిన్నమ్మ శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో భేటీకి ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణ తమిళనాడులోని బలమైన సామాజికవర్గం తన వెంట, పన్నీరు, దినకరన్ వెనుక ఉన్నా, ప్రస్తుతం పార్టీతో పాటుగా ముఖ్య నేతల బలం, మద్దతు పళణిస్వామి చేతిలో ఉండడాన్ని చిన్నమ్మ పరిగణనలోకి తీసుకుని ఉన్నారు. అందుకే పళణిస్వామితో సంప్రదింపులతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే ఐక్యతను చాటే విధంగా కొత్త ప్రయత్నాలకు చిన్నమ్మ సిద్ధమై తాజాగా తటస్థంగా వ్యవహరించే పనిలో పడ్డట్టు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. అలాగే, పళణికి రాయబారానికి దక్షిణ తమిళనాడుకు చెందిన మాజీ మంత్రులు నలుగుర్ని చిన్నమ్మ రంగంలోకి దించినట్లు చెబుతున్నారు. ఈ నలుగురు ప్రస్తుతం పళణి స్వామి వెన్నంటే ఉన్నా, లోక్‌సభ ఎన్నికల నాటికి అందరూ ఐక్యతతో అన్నాడీఎంకేకు తిరుగులేని విజయం అందించాలన్న కాంక్షతో ఈ రాయబార ప్రయత్నాలకు సిద్ధమైనట్టు చర్చ జరుగుతోంది. -
పళణి కేసులో సాక్షిగా పన్నీరు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామిపై దాఖలైన కేసులో ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్ పన్నీరు సెల్వంను సాక్షిగా పోలీసులు చేర్చారు. ఇది కాస్త కొత్త చర్చకు దారి తీసింది. వివరాలు.. అన్నాడీఎంకేలో పళని, పన్నీరు మధ్య జరుగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పార్టీని పళణి స్వామి పూర్తిగా తన ఆ«దీనంలోకి తెచ్చుకున్నారు. పన్నీరు సెల్వం, ఆయన మద్దతుదారులకు ఉద్వాసన పలికారు. అయితే, తనదే నిజమైన అన్నాడీఎంకే అని, ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్‌గా తనకే అధికారాలు ఉన్నాయంటూ పన్నీరు సెల్వం న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్‌ను బురిడి కొట్టించే విధంగా పళణి స్వామి ప్రదర్శించిన మాయకు ప్రస్తుతం పన్నీరు సాక్షి అయ్యారు. 2021 ఎన్నికల నామినేషన్ సమయంలో పళణి స్వామి దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో ఆస్తుల వివరాలన్నీ తప్పుల తడకగా ఉన్నాయని, అనేక ఆస్తుల వివరాలను ఆయన దాచి పెట్టినట్టు తేనికి చెందిన జిలానీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసును సేలం పోలీసులు విచారిస్తున్నారు. పళణి స్వామిపై మూడు సెక్షన్లతో కేసు పెట్టారు. ఈ కేసు విచారణను ముగించిన నివేదికను శుక్రవారం కోర్టుకు సేలం పోలీసులు సమరి్పంచారు. ఈ నివేదికలో పళణి స్వామి చేసిన తప్పుకు సాక్షులుగా ఉన్న వారి పేర్లను పొందుపరిచి ఉండడం శనివారం వెలుగులోకి వచ్చింది. సేలం సబ్ రిజిస్టార్, బ్యాంక్ మేనేజర్‌తో పాటు పన్నీరు సెల్వంను కూడా సాక్షిగా చేర్చారు. ఆ ఎన్నికల సమయంలో పళణి, పన్నీరు ఐక్యంగా ఉన్న విషయం తెలిసిందే. సమన్వయ కమిటీ కనీ్వనర్ హోదాలో పళణి స్వామి నామినేషన్‌ను బలపరిచే విధంగా పన్నీరు సైలం సంతకం చేసి ఉండటంతో ఆయనన్ి ఈ కేసులో సాక్షిగా చేర్చినట్టు పోలీసులు పేర్కొనడం గమనార్హం. మిత్రులు, ప్రస్తుతం బద్ద శత్రువులుగా మారిన నేపథ్యంలో కేసు విచారణ సమయంలో పళణిని మరింత ఇరకాటంలో పెట్టే విధంగా పన్నీరు సెల్వం వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
పేరుకే ఎమ్మెల్యేని.. వీఏఓ కూడా పట్టించుకోవడం లేదు!
సాక్షి, చైన్నె: ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని కావడంతో తనను వీఏఓ మొదలు తహసీల్దార్ వరకు చిన్నచూపు చూస్తున్నారని భవానీసాగర్ అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఎ.బన్నారి ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకే తాను ఏమ్మెల్యేగా కొనసాగుతున్నానని, కనీసం తనకు గౌరవం ఇచ్చే వాళ్లుకూడా లేదని ఉద్వేగానికి లోనయ్యారు. ఈరోడ్ జిల్లా భవానీసాగర్ నియోజకవర్గం(ఎస్సీ) ఎమ్మెల్యే బన్నారి మీడియాతో ఆవేదనను వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం అన్నాడీఎంకే తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఆ వివరాల మేరకు.. తాను ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు పూర్తి అయిందని, ఇంతవరకు తన నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పథకం కూడా జరగలేదన్నారు. తాను ఏదేని సిఫారసు చేసినా, ఆదేశాలు ఇచ్చినా వాటిని వీఏఓ మొదలు తహసీ ల్దార్ వరకు భేఖాతరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఓట్లు వేసిన ప్రజలకు న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్టు ఉద్వేగానికి లోనయ్యారు. ఇంటి పట్టాలు, పింఛన్లు, ప్రభుత్వ పథకా ల కోసం తన వద్ద కు వచ్చే వాళ్లకు న్యా యం చేసే విధంగా అధికారులకు సిఫారసులు, ఆదేశాలు చేస్తూనే ఉన్నానని, ఇంతవరకు ఒక్కటి కూడా అమలుకు నోచుకోకపోవడం శోచనీయమన్నారు. పోలీసులు, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు అయితే, తనను చిన్నచూపు చూస్తున్నారని పేర్కొన్నారు. తాను ప్రశ్నించినా, సమాధానం కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే అనే మర్యాద కూడా ఇవ్వకుండా వెళ్లి పో తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఎస్సీని కా వడంతో ఇక్కడున్న అధికారులు మరీ చిన్నచూపు చూస్తున్నారని, ఈ విషయాన్ని ఇంతవరకు తన పా ర్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లలేదన్నారు. ప్రభుత్వ అధికారిక వేడుకలకు ఆహ్వానాలు అంతంత మాత్రమేనని, తనను ప్రజాప్రతినిధిగా కాకుండా, వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తిగానే అందరూ చూస్తున్నారని ఉద్వేగ భరితంగా వ్యాఖ్యలు చేశారు. తనతో స్థానికంగా ఉన్న అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పలుమార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమే అని పేర్కొన్నారు. -
బీజేపీలోకి పన్నీరు సెల్వం తనయుడు?
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం తనయుడు, ఎంపీ రవీంద్రనాథ్ కొత్తవ్యూహాలకు పదును పెట్టారు. సొంత నియోజకవర్గం నుంచి ఈసారి ఆయన కమలం (తామర) చిహ్నంతో పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వివరాలు.. అన్నాడీఎంకేను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పళణి స్వామి పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఎలాగైనా న్యాయ పోరాటం ద్వారా ఆ పార్టీని తన వశం చేసుకునే వ్యూహాలకు సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం యత్నిస్తున్నారు. అయితే అన్నాడీఎంకే తన గుప్పెట్లోకి చేరేనా అన్న కలవరంలో పన్నీరు సెల్వం ఉన్నట్టు సమాచారం. అదే సమయంలో ఆయన వారసుడు, ఎంపీ పి. రవీంద్రనాథ్ కొత్త వ్యూహాలకు పదును పెట్టారు. అన్నాడీఎంకే నుంచి తనకు అవకాశం దక్కేది అనుమానం కావడంతో ఈసారి కాషాయం కండువాతో కాకుండా, కమలం చిహ్నంతో ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో డీఎంకే కూటమి రాష్ట్రంలో 38 స్థానాలు కై వసం చేసుకోగా, వ్యక్తిగత చరిష్మా, పార్టీ బలంతో అన్నాడీఎంకే తరపున రవీంద్రనాథ్ మాత్రమే పార్లమెంట్ మెట్లు ఎక్కారు. తాజాగా తన కుటుంబ వ్యక్తిగత చరిష్మతో మళ్లీ గెలవవచ్చు అనే ఽధీమాతో ఆయన ఉన్నా, చిహ్నం ఎక్కడ ఇరకాటంలో పెడుతుందో అనే బెంగ తప్పడం లేదటా...! అందుకే ఈ సారి ఆయన కమలం చిహ్నంతో పోటీ చేసి తేని లోక్‌సభ నియోజకవర్గంలో తమ బలాన్ని చాటే ప్రయత్నంలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో తనకు తామర చిహ్నంలో పోటీ చేసే అవకాశం కల్పించిన పక్షంలో దక్షిణ తమిళనాడులోని తన సామాజిక వర్గం ఓటు బ్యాంక్ బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా మారుస్తామనే విషయాన్ని ఢిల్లీలో తను సన్నిహితంగా ఉన్న కేంద్రం పెద్దల దృష్టికి రవీంద్రనాథ్ తీసుకెళ్లినట్టు సమాచారం. అందుకే ప్రస్తుతం బీజేపీ తన సీట్ల సంఖ్యను 13కు పెంచినట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే 11 నియోజకవర్గాలపై గురి పెట్టి బీజేపీ విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా రవీంద్రనాథ్ కోసం తేని సీటు, పుదయ నిధి కట్చి నేత ఏసీ షణ్ముగం కోసం వేలూరు సీటును ప్రస్తుతం బీజేపీ తెర మీదకు తెచ్చినట్లు సంకేతాలు వెలువడ్డాయి. అన్నాడీఎంకే నుంచి ఈ 13 సీట్లను రాబట్టుకునే వ్యూహాలకు పదును పెట్టే విధంగా బీజేపీ ఢిల్లీ నేతలు ముందుకెళ్తున్నట్లు సమాచారం. -
పళనికి అమిత్ షా అభయం
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదాలో తొలిసారిగా ఎడపాడి కే పళనిస్వామి బుధవారం ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. ఈసందర్భంగా పళనికి తన అభయాన్ని అమిత్ షా ఇస్తూ కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. అన్నాడీఎంకేలో పళని స్వామి, పన్నీరుసెల్వం మధ్య జరుగుతున్న వార్ క్లైమాక్స్‌కు చేరిన విషయం తెలిసిందే. కోర్టు, ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో అన్నాడీఎంకేను పూర్తిగా పళని స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజకీయ వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో బుధవారం ఢిల్లీకి పళని వెళ్లారు. ముందుగా సేలంలోని తన స్వగ్రామం శిలువం పట్టిలోని మారియమ్మన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడ జరిగిన కుంభాభిషేక ఉత్సవానికి కుటుంబ సమేతంగా హాజరు అయ్యారు. అనంతరం కోయంబత్తూరు చేరుకున్న పళనిస్వామి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయనకు కోయంబత్తూరు విమానాశ్రయంలో అన్నాడీఎంకే వర్గాలు ఘనంగా వీడ్కోలు పలికాయి. పార్టీ నేతలు తంగమణి, ఎస్పీ వేలుమణిలతో కలిసి రాత్రి ఏడు గంటలకు ఢిల్లీకి పళనిస్వామి చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో పార్టీ నేతలు, ఎంపీలు సీవీ షణ్ముగం, తంబిదురై, చంద్రశేఖర్ పళనికి ఆహ్వానం పలికారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో అమిత్ షాతో పళనిస్వామి భేటీ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య అర గంటకు పైగా తమిళ రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. అలాగే, రాష్ట్రంలో అన్నాడీఎంకే కూటమిలో గందరగోళం సృష్టించే విధంగా బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తరచూ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలపై అమిత్ షాకు పళణి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అలాగే, లోక్‌సభ ఎన్నికల కూటమి గురించి చర్చించినట్టు తెలిసింది. ఈసందర్భంగా పళని స్వామికి అమిత్ షా అభయాన్ని ఇచ్చినట్టు తెలిసింది. అన్ని వ్యవహారాలను తాను చూసుకుంటానని, తమిళనాడులో కూటమి అధిక స్థానాల్ని కై వసం చేసుకోవడం లక్ష్యంగా కార్యక్రమాలు విస్తృతం చేయాలని అమిత్ షా పళనికి సూచించినట్టు తెలిసింది. -
తిరుచ్చి వేదికగా పన్నీరు బల ప్రదర్శన
సాక్షి, చైన్నె: మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తిరుచ్చి వేదికగా సోమవారం తన బలాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. మద్దతుదారులు రెండు లక్షల మేరకు ఈ మహానాడుకు మద్దతుదారులు తరలిరావడం గమనార్హం. వివరాలు.. అన్నాడీఎంకేను చేజిక్కించుకునే విషయంపై ఆ పార్టీకి చెందిన మాజీ సీఎంలు పన్నీరు, పళణి స్వామి మధ్య పెద్ద పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. న్యాయ పోరాటంతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌తో జరిపిన సంప్రదింపులతో అన్నాడీఎంకేను పళణి స్వామి కై వసం చేసుకున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళణి స్వామిరాజకీయ చక్రం తిప్పుతున్నారు. అయితే న్యాయ పోరాటంలో తుది గెలుపు తనదే అన్న ధీమాతో ఉన్న పన్నీరు సెల్వం సోమవారం తిరుచ్చి వేదికగా తన బలాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. తిరుచ్చి వేదికగా ముప్పెరుం విళాగా సాయంత్రం ఐదున్నర గంటల నుంచి మహానాడు ప్రారంభమైంది. గంట పాటుగా దివంగత నేతలు ఎంజీఆర్, జయలలితలు నటించిన చిత్రాలలోని పాటలను గాయకులు పాడుతూ పన్నీరు మద్దతు దారులలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. రాత్రి ఏడున్నర గంటలకు వేదికపై పన్నీరు సెల్వం, ఆయన తనయుడు, ఎంపీ రవీంద్రనాథ్, పార్టీ నేతలు బన్రూటి రామచంద్రన్, వైద్యలింగం, మనోజ్ పాండియన్, జేసీటీ ప్రభాకర్, వెల్లమండి నటరాజన్, కూపా కృష్ణన్లు వచ్చారు. మద్దతు దారులను పలకరించేందుకు వీలుగా పన్నీరు సెల్వం కోసం ప్రత్యేక ర్యాంప్ ఏర్పాటు చేశారు. మద్దతు దారుల వద్దకు నడుచుకుంటూ వెళ్లి ఆయన అభివాదం తెలియజేశారు. పళణి స్వామి, ఆయన బృందాన్ని ఉద్దేశించి పన్నీరు సెల్వం తన ప్రసంగంలో విరుచుకు పడ్డారు. కోర్టు తుది తీర్పుతో అన్నాడీఎంకేను కై వసం చేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు. కాగా, తన సామాజిక వర్గం వెన్నంటి ఉంటుందని, లక్షల్లో తరలి వస్తారని భావించిన పన్నీరు సెల్వం చివరకు రెండు లక్షల మంది మేరకు మద్దతుదారులతో సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే ప్రచారం సాగుతుండడం గమనార్హం. -
తమిళనాట పొలిటికల్ ట్విస్ట్.. పన్నీర్ సెల్వానికి షాక్
చెన్నై: తమిళనాట రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏఐడీఎంకే పన్నీర్ సెల్వానికి ఊహించని షాక్ తగిలింది. పన్నీర్ సెల్వానికి ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి కే పళనిస్వామి నియామకాన్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆమోదించింది. దీంతో, రెండాకుల గుర్తను పళనిస్వామి దక్కించుకున్నారు. ఇక, ఈసీ నిర్ణయంతో పన్నీరు సెల్వం వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివరాల ప్రకారం.. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి నియామకాన్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆమోదించింది. కాగా ఈ విషయాన్నిఆ పార్టీ ధ్రువీకరించింది. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ పంపిన నోట్‌ను అన్నాడీఎంకే అధికార ప్రతినిధి ఆర్ఎం బాబీ మురగవేల్ గురువారం ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇక, అన్నాడీఎంకే చేసిన పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మార్పులు, ప్రధాన కార్యదర్శి ఎన్నిక, కొత్త ఆఫీస్ బేరర్ల నియామకానికి ఈసీ ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. పార్టీ అధ్యక్షురాలు, దివంగత మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత ఇద్దరు నేతలు పార్టీపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతున్నది. ఇంతకు ముందు ఈ-రోడ్ స్థానానికి ఉప ఎన్నికలు జరగ్గా.. ఇద్దరు నేతలు వేర్వేరుగా అభ్యర్థులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, పళనిస్వామి ప్రస్తుతం తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిర్ణయంతో పన్నీరు సెల్వానికి బిగ్ షాక్ తగిలింది. మరోవైపు, పన్నీర్ సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు విచారిస్తున్నది. Election Commission approves Edappadi K Palaniswami as the general secretary of AIADMK.#EdappadiPalaniswami #AIADMK pic.twitter.com/Nuobq4IVzj — Shankar (@Shankar38630530) April 20, 2023 -
తమిళనాడు అసెంబ్లీలో ఐపీఎల్ టికెట్ల పంచాయతీ
సాక్షి, చెన్నై: తమిళనాడులో ప్రస్తుతం ఐపీఎల్ టికెట్లు, చెన్నై సూపర్ కింగ్స్ కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయి. ఐపీఎల్ టికెట్లపై రాష్ట్ర అసెంబ్లీలో పెద్ద పంచాయతే జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, అన్నాడీఎంకే విప్ ఎస్పీ వేలుమణి ఓ ఆసక్తికర అంశాన్ని మంగళవారం తెర మీదకు తెచ్చారు. క్రీడల శాఖకు సంబంధించి చేపట్టిన చర్చలో ఆయన ఐపీఎల్ టికెట్లు ఇప్పించాలని సదరు మంత్రి ఉదయ నిధి స్టాలిన్‌ను కోరారు. పళణిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం ఇది వరకు ఎమ్మెల్యేలు అందరికీ ఐపీఎల్ టికెట్లు కొని ఇచ్చామని ప్రస్తావించారు. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు ప్రభుత్వం టికెట్లు కొని ఎమ్మెల్యేకు ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ఐపీఎల్ నిర్వహించేది మీ మిత్రుడైన కేంద్రమంత్రి అమిత్ షా కుమారుడు జైషానే అని, మేమే అడిగితే మాకు ఇవ్వరు, మీరు అడిగితే ఇస్తారంటూ చురకలు అంటించారు. అంతేగాక చెన్నైలో గత నాలుగేళ్లుగా ఐపీఎల్ మ్యాచ్‌లే జరగనప్పుడు, టికెట్లు కొని ఎవరికి ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు. దీంతో అన్నాడీఎంకే సభ్యులు కంగుతిన్నారు. అధికారపక్ష సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని బ్యాన్ చేయాల్సిందే.. ! -
శశికళ, దినకరన్‌కు ఆహ్వానం
సాక్షి, చైన్నె: తిరుచ్చి వేదికగా జరగనున్న మహానాడుకు శశికళ, దినకరన్‌ను ఆహ్వానించనున్నట్లు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం తెలిపారు. అన్నాడీఎంకేలో విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పార్టీని పూర్తిగా ప్రధాన కార్యదర్శి హోదాలో పళనిస్వామి తన గుప్పెట్లో తెచ్చుకున్నారు. అయితే న్యాయ పోరాటం ద్వారా పార్టీ మళ్లీ సత్తా చాటాలని సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం ప్రయత్నిస్తున్నారు. తన బలాన్ని చాటుకునే విధంగా ఈనెల 24వ తేదీన తిరుచ్చి వేదికగా భారీ మహానాడుకు సిద్ధమయ్యారకు. ముప్పెరుం విళాగా ఈ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహానాడు విజయవంతం కోసం తన శిబిరం తరపున జిల్లాల కార్యదర్శులుగా ఉన్న నేతలతో సమావేశాల్లో పన్నీరు నిమగ్న మయ్యారు. మంగళవారం జరిగిన సమావేశానంతరం మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ, ముప్పెంరు విళా అన్నది అన్నాడీఎంకే కార్యకర్తలకు దివంగత నేత ఎంజీఆర్ ఇచ్చిన హక్కులను కాపాడే విధంగా ఉంటుందని వివరించారు. పదవీ వ్యామోహంతో నిబంధనలు ఉల్లంఘించి సర్వాధికారంతో విర్ర వీగుతున్న ముఠాకు గుణపాఠం చెప్పే వేదిక అవుతుందన్నారు. ఈ మహానాడుకు చిన్నమ్మ శశికళ, అమ్మ మక్కల్ మున్నేట్రకళగం నేత టీటీవీ దినకరన్‌ను ఆహ్వానించనున్నట్లు ప్రకటించారు. వారు తప్పకుండా ఈ మహానాడుకు వస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. కాగా, పన్నీరు వ్యాఖ్యలపై పళని శిబిరం సీనియర్‌నేత జయకుమార్ స్పందిస్తూ, ఆ మహానాడును తాము లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు. అలాంటప్పుడు ఆయన ఎవరిని ఆహ్వానిస్తే తమకేంటిని ప్రశ్నించారు. -
కర్ణాటక ఎన్నికల్లో పన్నీరు శిబిరం
సాక్షి, చెన్నై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పోటీచేస్తున్నట్టు ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్ పన్నీరు సెల్వం శిబిరం ప్రకటించింది. కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్పతో ఆ శిబిరం ముఖ్యనేత పుహలేంది శుక్రవారం భేటీ అయ్యారు. మెజారిటీ శాతం నేతలు, సభ్యుల మద్దతుతో అన్నాడీఎంకేను పళనిస్వామి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన పగ్గాలు కూడా చేపట్టారు. అయితే, ఇవన్నీ తాత్కాలికమేనని కోర్టులో జరుగుతున్న న్యాయ పోరాటంలో గెలుపు తమదే ధీమాను ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్ పన్నీరుసెల్వం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పళనిస్వామి కన్నా ముందుగా బీజేపీకి దగ్గరయ్యే విధంగా పన్నీరుసెల్వం ఓ అడుగు ముందుకు వెళ్లారు. కర్ణాటకలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీతో కలిసి పయనించేందుకు అన్నాడీఎంకే సిద్ధంగా ఉన్నట్టు పన్నీరు ప్రకటించారు. అలాగే, తన మద్దతు నేత పుహలేందిని కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్పతో భేటీకి పంపించారు. ఆయన్ను కలిసిన పుహలేంది పోటీ విషయంగా చర్చించి రావడం గమనార్హం. పోటీ తథ్యం.. మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికలలో తమ శిబిరం తరఫున అన్నాడీఎంకే అభ్యర్థులు పోటీలో ఉండడం తథ్యమని స్పష్టం చేశారు. తాము పోటీ చేస్తున్నామని ఇందులో మార్పులేదన్నారు. కోర్టు తుది తీర్పు అన్నాడీఎంకేకు గట్టి సమాధానంగా ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా, నోట్ల కట్టలతో ప్రధాన కార్యదర్శి పగ్గాల చేపట్టిన పళణిస్వామికి మున్ముందు ఆ శిబిరం నేతలు బుద్ధి చెప్పే రోజులు రాబోతున్నాయన్నారు. ప్రధాని మోదీని కలిసే అవకాశం కోరినట్టు, పిలుపువస్తే కలిసేందుకు సిద్ధమని పన్నీరుసెల్వం తెలిపారు. -
జమిలీ ఎన్నికలు తథ్యం..
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడికే పళణి స్వామి సేలం పర్యటన ఆదివారం రోడ్‌షోను తలపించింది. దారి పొడవునా ఆయనకు అభిమానులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. కాగా లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి సైతం ఎన్నికలు రాబోతున్నాయని, ప్రతి ఒక్కరూ దీనికి సిద్ధంగా ఉండాలని కేడర్‌కు ఈ సందర్భంగా పళణి స్వామి సూచించారు. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా మూడు రోజుల క్రితం ఎడపాడి కె. పళణిస్వామి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ హోదాలో ప్రపథమంగా ఆదివారం చైన్నె నుంచి సొంత జిల్లా సేలంకు ఆయన బయలుదేరారు. మొదట గ్రీన్ వేస్ రోడ్డులోని ఆయన ఇంటి వద్ద నుంచే అన్నాడీఎంకే వర్గాల హడావుడి మొదలైంది. వేద పండితుల పూర్ణ కుంభ స్వాగతం పలికారు. తర్వాత సేలానికి పళణిస్వామి రోడ్డు మార్గంలో బయలు దేరారు. ఆలందూరులోని ఎంజీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన పర్యటన రోడ్ షోను తలపించే విధంగా జరిగింది. మార్గం మధ్యలో తాంబరం, చెంగల్పట్టు, మదురాంతకం, దిండివనం, విల్లుపురం, అంటూ ప్రతి చోటా ఆయన కాన్వాయ్ ఆగింది. పార్టీ కేడర్ ఈ మేరకు పళణిస్వామికి బ్రహ్మరథం పట్టేవిధంగా ఆహ్వానం పలికారు. దారి పొడవున కేడర్‌ను పలకరిస్తూ వెళ్లడంతో సేలం చేరేలోపు రాత్రి ఏడు దాటింది. సేలంలోనూ ఆయనకు ఘన స్వాగతం లభించింది. జమిలీ ఎన్నికలు తథ్యం.. దారి పొడవున తనకు బహ్మ్రరథం పట్టిన కార్యకర్తలను ఉద్దేశిస్తూ పళణి స్వామి ప్రసంగాలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంతో పాటు పుదుచ్చేరిలో ఈసారి 40 స్థానాలు అన్నాడీఎంకే కూటమి చేజిక్కించుకోవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. అసెంబ్లీకి ఎన్నికలు వస్తే అధికార పగ్గాలు చేపట్టడం తథ్యమని, ఇందులో మరో ఆలోచన లేదని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం తనకు శుభాకాంక్షలు, ఆహ్వానం తెలిపిన వారందరికి కృతజ్ఞతలు తెలుపుతూ పళణి స్వామి ఓ ప్రకటన విడుదల చేశారు. దివంగత నేతలు ఎంజీఆర్, అమ్మజయలిత మార్గంలోనే తన ప్రయాణం ఉంటుందని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, ఈనెల 7వ తేదీన అన్నాడీఎంకే కార్యదర్శులు, జిల్లాల కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పళణి స్వామి తెలిపారు. అలాగే, సోమవారం మదురైలో పర్యటించాలని నిర్ణయించారు. దేవర్ సామాజిక వర్గాన్ని ఆకర్షించే విధంగా ఈ పర్యటన ఉంటుందని భావిస్తున్నారు. -
పన్నీర్ సెల్వంకు భారీ షాక్
తమిళనాడు రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం ఒకటి చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకేలో వర్గ పోరులో.. కోర్టు తీర్పు ద్వారా పళనిస్వామి మళ్లీ పైచేయి సాధించారు. పార్టీ నుంచి తనను బహిష్కరించడంతో పాటు ఏఐఏడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి పళనిస్వామి చేపట్టడాన్ని సవాల్ చేస్తూ పన్నీర్‌సెల్వం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఇవాళ(మంగళవారం) ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువడినవెంటనే.. అన్నాడీఎంకే పార్టీ అధికారికంగా ఈపీఎస్(ఎడపాడి కే పళనిస్వామి)ని పార్టీ ప్రదాన కార్యదర్శిగా ప్రకటించింది పార్టీ సీఈసీ. ఈ మేరకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సంబురాలు జరుగుతున్నాయి. ఇక తాజా తీర్పుతో ఓపీఎస్(ఓ పన్నీర్ సెల్వం).. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్‌ను ఆశ్రయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక.. అన్నాడీఎంకే పార్టీ కార్యదర్శి (తాత్కాలిక) పదవికి పళనిస్వామి నియామకాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. కిందటి ఏడాది జులైలో పార్టీ జనరల్ కౌన్సిల్ ద్వారా ఈ నియామకం జరగ్గా.. దానిని వ్యతిరేకిస్తూ పన్నీర్ సెల్వం వర్గం న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు అన్నాడీఎంకే సాధారణ కౌన్సిల్‌ను చట్టబద్ధమైనదిగానే సమర్థించింది. అయితే తీర్మానాల చట్టబద్ధతపై నిర్ణయం మాత్రం మద్రాసు హైకోర్టుకు వదిలివేసింది. ఇదిలా ఉంటే.. గత శనివారం పార్టీ జనరల్ సెక్రటరీ పదవి ఎన్నికకు ఈపీఎస్ నామినేషన్ దాఖలు చేయగా.. ఇదంతా దొంగచాటు వ్యవహారమంటూ పన్నీర్‌సెల్వం మండిపడ్డారు. అంతలోనే మద్రాస్ హైకోర్టు ఈపీఎస్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం గమనార్హం. -
కలిసికట్టుగా లోక్‌సభ ఎన్నికల్లోకి..
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేలోని అందరూ కలిసికట్టుగా లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సమయం ఆసన్నం అవుతోందని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె నాగపట్నం, తిరువారూర్లలో పర్యటించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ వేదికగా అన్నాడీఎంకే విభేదాల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాసమస్యలపై చర్చించాల్సిన వేదికపై వివాదాలు శోచనీయమన్నారు. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులు ఎవరైనా ప్రశ్నించవచ్చునని, అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చునని, వ్యాఖ్యలు, ప్రసంగాలు చేయడానికి వీలుందన్నారు. అయితే, పన్నీరుసెల్వంను అడ్డుకోవడం శోచనీయమన్నారు. తాను ఖండించినంత మాత్రాన పన్నీరుకు మద్దతు ఇచ్చినట్టు కాదన్నారు. అన్నాడీఎంకే ఎవరి చేతిలో ఉంటే భవిష్యత్తు ఉంటుందో అన్నది కేడర్ ఆలోచించాలని, సమాధానం కేడర్ చెప్పాలని కోరారు. త్వరలో తనను పన్నీరుసెల్వం కలిసే అవకాశాలు ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. లోక్ సభ ఎన్నికలలో అందరూ కలిసికట్టుగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేకు ఈసారి గెలుపు కష్టమేనని, ఆ మేరకు తాము వ్యూహాలకు పదును పెడతామన్నారు. -
స్టాలిన్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి
చెన్నై: తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. సోషల్ మీడియాలో.. మరీ ముఖ్యంగా అక్కడి ప్రజలు బాగా యాక్టివ్‌గా ఉండే ట్విటర్లోనే ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ఎడాపెడా సాగుతోంది. అందునా తమిళ చిత్రాల ఫన్నీ వీడియోలతో రూపొందుతున్న మీమ్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కట్టడికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోగా.. అణచివేతకు దిగుతోందంటూ ప్రభుత్వంపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తమిళనాడు బడ్జెట్‌కు సంబంధించిన ఓ మీమ్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. బడ్జెట్ 2023-24లోభాగంగా మహిళలకు(ప్రత్యేకించి గృహిణులకు) నెలవారీ సహాయ పథకం ఏడువేల కోట్ల రూపాయలను కేటాయించింది స్టాలిన్ ప్రభుత్వం. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి నెలవారీగా ఒక్కో మహిళకు వెయ్యి రూపాయలు అందించనుంది ప్రభుత్వం. అయితే ఈ కేటాయింపులపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టోలో.. 2.2 కోట్ల రేషన్ కార్డు హోల్డర్లకు సాయం అందిస్తామన్న హామీని డీఎంకే ప్రభుత్వం, ఆ హామీని నెరవేర్చకుండా తాజా పథకంతో చిల్లర విసురుతోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో.. సోషల్ మీడియాలో మీమ్స్‌ను వైరల్ చేస్తున్నారు. తాజాగా.. వాయిస్ ఆఫ్ సవుక్కు అనే ట్విటర్ పేజీ అడ్మిన్‌ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా పథకాన్ని వెటకారం చేస్తూ.. హాస్యద్వయం గౌండమణి, సెంథిల్లు ఉన్న ఓ వీడియోను ఎడిట్ చేశాడు ఆ పేజీ అడ్మిన్ ప్రదీప్. అందులో ఒకరిని స్టాలిన్‌గా మరొకరిని ఆర్థిక మంత్రిగా చూపించాడు. దీంతో.. ఈ వీడియోను నేరంగా పరిగణించిన పోలీసులు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద అతన్ని అరెస్ట్ చేశారు. Sources : Pradheep one of the admins of @voiceofsavukku has been arrested in Cr No 52/2023 under sections 153, 505 (1) (b) and 509 IT Act for this video meme. pic.twitter.com/dT7LcsLorF — Savukku Shankar (@Veera284) March 22, 2023 తమిళనాడులో రాజకీయ వేడిని పుట్టించిన ఈ మీమ్-అరెస్ట్ పరిణామంపై అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా విమర్శించుకుంటున్నాయి. బీజేపీ, అన్నాడీఎంకేలు అరెస్ట్‌ను ఖండిస్తున్నాయి. పార్టీల నేతలేకాదు.. ఉద్యమకారులు, హక్కుల సాధన సమితిలు, నెటిజన్లు.. #ArrestMeToo_Stalin పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. అయితే.. ఈ ఒక్క ఘటనే కాదు. ఆమధ్య స్టాలిన్ తనయుడు ఉదయ్‌నిధి స్టాలిన్‌కు క్రీడామంత్రిత్వ శాఖను అప్పగించడంపైనా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడిచింది. తాజాగా.. తమిళనాడు పోలీసులు, బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసేందుకు గుజరాత్ దాకా వెళ్లిన పరిణామంపైనా స్టాలిన్‌ను, ఆయన తండ్రి దివంగత కరుణానిధిని కలిపి మరీ ట్రోల్ చేశారు నెటిజన్లు.


