పళణి కేసులో సాక్షిగా పన్నీరు

పళణి స్వామి, పన్నీరు సెల్వం - Sakshi

సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామిపై దాఖలైన కేసులో ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్‌ పన్నీరు సెల్వంను సాక్షిగా పోలీసులు చేర్చారు. ఇది కాస్త కొత్త చర్చకు దారి తీసింది. వివరాలు.. అన్నాడీఎంకేలో పళని, పన్నీరు మధ్య జరుగుతున్న వార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పార్టీని పళణి స్వామి పూర్తిగా తన ఆ«దీనంలోకి తెచ్చుకున్నారు. పన్నీరు సెల్వం, ఆయన మద్దతుదారులకు ఉద్వాసన పలికారు. అయితే, తనదే నిజమైన అన్నాడీఎంకే అని, ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్‌గా తనకే అధికారాలు ఉన్నాయంటూ పన్నీరు సెల్వం న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్‌ను బురిడి కొట్టించే విధంగా పళణి స్వామి ప్రదర్శించిన మాయకు ప్రస్తుతం పన్నీరు సాక్షి అయ్యారు. 2021 ఎన్నికల నామినేషన్‌ సమయంలో పళణి స్వామి దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో ఆస్తుల వివరాలన్నీ తప్పుల తడకగా ఉన్నాయని, అనేక ఆస్తుల వివరాలను ఆయన దాచి పెట్టినట్టు తేనికి చెందిన జిలానీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసును సేలం పోలీసులు విచారిస్తున్నారు. పళణి స్వామిపై మూడు సెక్షన్లతో కేసు పెట్టారు. ఈ కేసు విచారణను ముగించిన నివేదికను శుక్రవారం కోర్టుకు సేలం పోలీసులు సమరి్పంచారు. ఈ నివేదికలో పళణి స్వామి చేసిన తప్పుకు సాక్షులుగా ఉన్న వారి పేర్లను పొందుపరిచి ఉండడం శనివారం వెలుగులోకి వచ్చింది.

సేలం సబ్‌ రిజిస్టార్, బ్యాంక్‌ మేనేజర్‌తో పాటు పన్నీరు సెల్వంను కూడా సాక్షిగా చేర్చారు. ఆ ఎన్నికల సమయంలో పళణి, పన్నీరు ఐక్యంగా ఉన్న విషయం తెలిసిందే. సమన్వయ కమిటీ కనీ్వనర్‌ హోదాలో పళణి స్వామి నామినేషన్‌ను బలపరిచే విధంగా పన్నీరు సైలం సంతకం చేసి ఉండటంతో ఆయనన్‌ి ఈ కేసులో సాక్షిగా చేర్చినట్టు పోలీసులు పేర్కొనడం గమనార్హం. మిత్రులు, ప్రస్తుతం బద్ద శత్రువులుగా మారిన నేపథ్యంలో కేసు విచారణ సమయంలో పళణిని మరింత ఇరకాటంలో పెట్టే విధంగా పన్నీరు సెల్వం వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top