త్రిషపై మరోసారి అలాంటి కామెంట్స్‌.. ఇంతటి నీచానికి దిగుజారుతారా? | Sakshi
Sakshi News home page

Trisha Krishnan: ఇలాంటి వాళ్లను చూస్తుంటే అసహ్యంగా ఉంది: త్రిష

Published Tue, Feb 20 2024 6:23 PM

kollywood Actress Trisha Krishnan Responds On Political Leader Comments - Sakshi

గతేడాది లియోతో సూపర్‌ హిట్‌ కొట్టిన భామ త్రిష. విజయ్ సరసన హీరోయిన్‌గా నటించి బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది. లోకేశ్ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించిన నటుడు మన్సూర్‌ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ పెద్దఎత్తున వివాదస్పదమయ్యాయి. ఏకంగా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు సినీతారలు మండిపడ్డారు. 

అయితే తాజాగా అన్నాడీఎంకే మాజీ లీడర్‌ ఏవీ రాజు చేసిన అసభ్యకర కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. త్రిషపై ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్స్ అతనిపై మండిపడుతున్నారు. తక్షణమే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంలో త్రిషకు పలువురు అండగా నిలుస్తున్నారు. త్రిషను ఉద్దేశించి ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున వైరలవుతోంది. 

(ఇది చదవండి:  త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఫైనల్‌గా వివరణ ఇచ్చిన మన్సూర్!)

తాజాగా ఈ విషయంపై హీరోయిన్‌ త్రిష స్పందించింది. ఫేమస్ కావడం కోసం ఏంతటి నీచానికైనా దిగజారిపోయే జీవితాలు అవీ.. పదే పదే ఇలాంటి నీచమైన మనుషులను చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. దీనిపై త్వరలోనే న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపింది. దీనిపై మా లీగల్ డిపార్ట్‌మెంట్‌ తదుపరి చర్యలు తీసుకుంటుందని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ టాపిక్ కోలీవుడ్‌ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా.. త్రిష ప్రస్తుతం మెగాస్టార్ సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 

అసలేం జరిగిందంటే..

గతంలో ఓ ఎమ్మెల్యే డబ్బులిచ్చి త్రిషను రిసార్ట్‌కు తీసుకొచ్చారని ఇటీవలే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఏవీ రాజు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇది చూసిన పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఎలాంటి ఆధారాలు లేకుండా త్రిషపై అసభ్యంగా మాట్లాడిన ఏవీ రాజును అరెస్ట్ చేయాలని నటుడు, దర్శకుడు చేరన్ డిమాండ్ చేశారు. ఇలాంటి వారిపై నటీనటుల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా బహిరంగంగా సినీ పరిశ్రమలోని సభ్యులను కించపరిచేలా మాట్లాడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. 
 

Advertisement
Advertisement