
కష్టాలు చుట్టాల్లా వస్తూ పోతుంటాయంటుంటారు. కానీ బిగ్‌బాస్ బ్యూటీ, కన్నడ నటి కీర్తి భట్ (Keerthi Bhat) జీవితంలో మాత్రం అవి ఫ్యామిలీ మెంబర్స్‌లా తిష్ట వేశాయి. యాక్సిడెంట్‌లో కన్నవాళ్లను పోగొట్టుకుంది. అదే ప్రమాదంలో చావు చివరి అంచుల వరకు వెళ్లొచ్చింది. జీవితంలో తల్లయ్యే అదృష్టాన్ని పోగొట్టుకుంది. తనొక అనాధ అని ప్రియుడు వదిలేయడంతో కుంగిపోయింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసింది. వాటిన్నింటినీ దాటుకుని సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది.

నన్ను పిలవలేదు
తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్ ఫైనలిస్టుగా నిలిచింది. తాజాగా ఆమె టీవీ ఇండస్ట్రీలోని పరిస్థితి గురించి ఓపెన్ అయింది. బిగ్‌బాస్ 6 అయిపోయాక BB అవార్డ్స్ అని ఓ కార్యక్రమం చేశారు. అందులో టాప్ 3లో ఉన్న నేను, టాప్ 5లో ఉన్న రోహిత్ లేము. కానీ, టాప్ 10లో, ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నవాళ్లందరూ ఉన్నారు. మమ్మల్నెందుకు పిలవలేదో అర్థం కాలేదు.
కలర్ చూస్తున్నారు
వాళ్లు పిలిస్తే వెళ్తాం కానీ, అడిగి మరీ వెళ్లలేం కదా! తర్వాత నాకర్థమైన విషయం ఏంటంటే.. ఇక్కడ మూడు రూల్స్ కచ్చితంగా ఫాలో కావాలి. ఒకటి.. నోటికొచ్చినట్లు మాట్లాడి కంటెంట్ క్రియేట్ చేయాలి. రెండు.. మోడ్రన్‌గా ఉండాలి, ఎక్స్‌పోజ్ చేయాలి. మూడు.. కలర్ బాగుండాలి. ఈ మూడు క్వాలిటీస్ ఉంటే షోలతో బిజీగా ఉండొచ్చు. అవి నా వల్ల కాదు అని కీర్తి చెప్పుకొచ్చింది.
చదవండి: చిరు మాజీ అల్లుడితో నటించిన బ్యూటీ.. 'కూలీ'తో వైరల్