
ఈ కృష్ణాష్టమి ఎంతో స్పెషల్ అంటోంది హీరోయిన్ హర్షిక పూనాచ (Harshika Poonacha). తన జీవితంలోకి చిన్న పాపాయి వచ్చిందని తననే కన్నయ్యగా ముస్తాబు చేశానని చెప్తోంది. తాజా ఇంటర్వ్యూలో హర్షిక మాట్లాడుతూ.. నా చిన్నప్పుడు అమ్మ నన్ను బాగా రెడీ చేసేది. స్కూల్‌లో రాధ వేషం వేసేదాన్ని.. మరికొన్నిసార్లు కృష్ణుడి వేషం వేసేదాన్ని. ఆ జ్ఞాపకాలన్నీ నాతో పదిలంగా ఉన్నాయి. ఆ సాంప్రదాయాన్ని నా కూతురి ద్వారా కొనసాగించాలనుకుంటున్నాను.
భగవద్గీత చదివా..
చాలా ప్రశ్నలకు, సమస్యలకు భగవద్గీతలో సమాధానం దొరుకుతుంది. నేను గర్భంతో ఉన్నప్పుడు ప్రతిరోజు భగవద్గీత చదివేదాన్ని. దానివల్ల మానసికంగా ఎంతో ధృడంగా తయారయ్యాను. ఆస్పత్రిలోని లేబర్ రూమ్‌లో పురిటినొప్పులతో బాధపడుతున్నప్పుడు నాకు ధైర్యం చెప్పేందుకు మామయ్య భగవద్గీతలోని శ్లోకాలు చదివాడు. ఇప్పుడు నాకు తొమ్మిది నెలల కూతురు. తనకు ధోతి కట్టి, ముత్యాల దండ వేసి కృష్ణుడిగా రెడీ చేయాలని చాలారోజులుగా అనుకుంటున్నాను. ఈ రోజు అది నెరవేరింది. అలాగే ఈ రోజు పక్కింటి పిల్లల్ని పిలిచి వారికి స్వీట్లు పంచుతాను అని చెప్పుకొచ్చింది.

సినిమా
కర్ణాటకకు చెందిన హర్షిక పునాచ 2008లో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. తెలుగులో 'ఏడుకొండలవాడ వెంకటరమణ అందరూ బాగుండాలి', 'అప్పుడలా ఇప్పుడిలా' తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. సోగ్గాడే చిన్ని నాయనా కన్నడ రీమేక్‌లోనూ నటించింది. తెలుగు, కన్నడతో పాటు తమిళ, మలయాళ, కొంకణి, భోజ్‌పురి, కొడవ భాషా చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. 2023లో నటుడు భువన్ పొన్నానను పెళ్లి చేసుకుంది. గతేడాది చివర్లో పాపకు జన్మనిచ్చింది.
చదవండి: విడాకులతో సంతోషాన్ని వెతుక్కున్నా.. తప్పేముంది?: మలైకా