పదిహేనేళ్ల వయసులో తనకు చేదు అనుభవం ఎదురైందంటోంది నటి మంచు లక్ష్మి (Lakshmi Manchu). తాజాగా 'హాటర్‌ఫ్లై'కిచ్చిన ఇంటర్వ్యూలో ఆ చేదు జ్ఞాపకాలను పంచుకుంది. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. అప్పుడు నేను పదో తరగతి చదువుతున్నా.. నాకు 15 ఏళ్లు. నేనెప్పుడూ కారులోనే స్కూలుకు వెళ్లేదాన్ని. నా వెంట మా అమ్మ, డ్రైవర్, బాడీగార్డ్ ఉండేవాళ్లు.
అసభ్యంగా తాకాడు
ఓసారి స్కూల్ వాళ్లు మమ్మల్ని హాల్ టికెట్స్ తీసుకునేందుకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో బయటకు తీసుకెళ్లారు. అప్పుడు నేను చాలా ఎగ్జయిటయ్యాను. కానీ, దారిలో ఓ వ్యక్తి నన్ను అసభ్యంగా తాకాడు. నాకు చాలా చెత్తగా అనిపించింది. నేను చిన్నపిల్లని అన్న విషయం అతడికి తెలుసా? లేదా? అర్థం కాలేదు. అయినా అతడితో నేను గొడవపెట్టుకోలేక అక్కడి నుంచి పక్కకు జరిగాను. తర్వాత జరిగింది నా ఫ్రెండ్స్‌కు చెప్పాను.
ఎంతో ఏడ్చా..
వాళ్లు కూడా అలాంటి సంఘటనలు తరచూ ఎదుర్కొంటున్నామని చెప్పేసరికి షాకయ్యాను. ఇక్కడ నేను మోహన్‌బాబు కూతుర్ని అని నన్ను స్పెషల్‌గా పక్కన పెట్టలేదు! ఇలాంటి చేదు అనుభవాలు అందరికీ జరుగుతుంటాయి. కానీ, చాలామంది తమకలాంటి అనుభవాలు ఎదురవలేదని అబద్ధం చెప్తుంటారు. మీటూ ఉద్యమం సమయంలో అయితే కిందపడి ఏడ్చిన రోజులున్నాయి. మీటూ సమయంలో ఆడవాళ్లు ఎదుర్కొన్న ఎన్నో బాధల్ని బయటకు చెప్పారు.
ఇంట్లో దొంగతనం
అవి నేనూ ఫేస్ చేసినందున వాటిని తల్చుకుని కుమిలిపోయాను. పెద్ద కుటుంబం నుంచి వచ్చానని తెలిసి కొందరు కావాలనే నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. ఎందుకంటే అందరిలాగా మేము బయటకు వచ్చి అన్నీ చెప్పలేం కాబట్టి! ఒకసారి మా ఇంట్లో దొంగతనం జరిగింది. అది నేను బయటకు చెప్పుకోలేకపోయా! రూ.15 వేలే కదా.. పోనీలే అని వదిలేశా.. ఇంట్లో మమ్మల్ని అలాగే పెంచారు అని చెప్పుకొచ్చింది. లక్ష్మీ మంచు చివరగా 'దక్ష' సినిమాలో కనిపించింది.
చదవండి: రీతూని రైడ్‌కు తీసుకెళ్తానన్న చై


