
బాలీవుడ్ నటి మలైకా అరోరా (Malaika Arora) ప్రేమలో ఓడిపోతూనే ఉంది. మలైకా.. 1998లో నటుడు అర్బాజ్ ఖాన్‌ను పెళ్లాడింది. వీరికి 2002లో కుమారుడు అర్హాన్ ఖాన్ జన్మించాడు. మొదట్లో బాగానే ఉన్న దంపతులు తర్వాత దూరంగా ఉండటం మొదలుపెట్టారు. 2017లో విడాకులు తీసుకున్నారు. అయితే పిల్లాడి బాధ్యతను మాత్రం ఇద్దరూ తీసుకున్నారు. అనంతరం మలైకా.. నటుడు అర్జున్ కపూర్‌తో ప్రేమలో పడింది.
దంపతులుగా విడిపోయినా..
ఏళ్ల తరబడి రిలేషన్‌లో ఉన్న వీరు పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అని అంతా అనుకున్నారు. అంతలోనే ఈ ప్రేమప్రయాణానికి ఫుల్‌స్టాప్ చెప్తూ బ్రేకప్ చెప్పుకున్నారు. తాజాగా మలైకా కో పెరింటింగ్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. మేమిద్దరం భార్యాభర్తలుగా విడిపోయినా పిల్లాడి కోసం తల్లిదండ్రులుగా నిలబడ్డాం. ఇప్పుడు వాడికి 22 ఏళ్లు. తల్లి దగ్గర ఏం మాట్లాడాలి? తండ్రి దగ్గర ఎలా ఉండాలి? అనేది బాగా తెలుసు.

కోరుకున్నవన్నీ జరగవు
కాబట్టి ఇప్పుడు పరిస్థితులు అంత జటిలంగా లేవు. ఎవరి హద్దుల్లో వాళ్లం ఉన్నాం. విడాకుల వల్ల నా కొడుకు ఎఫెక్ట్ అవకూడదనుకున్నాను. అందుకే ఇద్దరం బాధ్యతలు తీసుకున్నాం. కానీ విడాకులు ప్రకటించగానే చాలామంది ఇలా చేస్తావా? ఇలా ఉండకూడదు అంటూ నాకు నీతులు చెప్పారు. నేనేమంటానంటే కొన్నిసార్లు బంధాలనేవి జటిలంగా ఉంటాయి. నా వివాహబంధం కొనసాగాలనే కోరుకున్నాను. కానీ, అది జరగలేదు. దానికి నేనేం చేయగలను?
అమ్మ కష్టాలు
అలా అని నేను ప్రేమపై విశ్వాసాన్ని కోల్పోయానని కాదు. ఏదో ఘోర తప్పిదం చేశాననీ కాదు. అందరూ తప్పంతా నాదే అన్నట్లు నావైపే వేలు చూపించారు. సెల్ఫిష్‌గా ఆలోచించానన్నారు. మీకలా అనిపించుండొచ్చు. కానీ, నేను ఆనందంగా ఉండాలనుకున్నాను. అందుకే ఆ బంధం నుంచి బయటకు వచ్చేశాను. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. ఇకపోతే నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగాను. అమ్మ రోజంతా పని చేస్తూ బిజీగా ఉండేది. మాకోసం అహర్నిశలు శ్రమించింది. తన దగ్గరున్న వస్తువులమ్మేసి మరీ స్కూల్ ఫీజు కట్టేది.
డబ్బు విలువ బాగా తెలుసు
అప్పుడు చెల్లిని నేనే చూసుకునేదాన్ని. కుటుంబం కోసం 17 ఏళ్లకే పని చేయడం మొదలుపెట్టాను. డబ్బు సంపాదించడమే నా లక్ష్యం. ఫ్రెండ్స్‌తో పార్టీలంటూ బయటకు వెళ్లేదాన్ని కాదు. ఇప్పటికీ డబ్బు విషయంలో నేనలాగే ఉంటాను. ప్రతి ఖర్చు పుస్తకంలో రాసుకుంటాను. మరీ ఖరీదైనవాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడను అని చెప్పుకొచ్చింది. కాగా 'చయ్య చయ్య' పాటతో ఫేమస్ అయిన మలైకా.. రాత్రైనా నాకు ఓకే (అతిథి), కెవ్వు కేక (గబ్బర్ సింగ్) పాటలతో టాలీవుడ్‌కు దగ్గరైంది.
చదవండి: అగ్నిపరీక్ష.. ఏంటిది? బిగ్‌బాస్ వాయిస్ తేడాగా ఉందే!