
ప్రతి ఏడాది బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show) వస్తుంది. అది కామన్.. కానీ, ఈసారి బిగ్‌బాస్ కంటే ముందు అగ్నిపరీక్ష వస్తోంది. సామాన్యులను సెలక్ట్ చేసే ప్రోగ్రామ్ ఇది. ఏదో ఆషామాషీగా కాకుండా ఎంతో ఘనంగా ఈ అగ్నిపరీక్ష ప్రోగ్రామ్‌ను జరిపించనున్నారు. దీనికి బిగ్‌బాస్ మాజీ విన్నర్స్ అభిజిత్ (Abhijeet), బిందు మాధవి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ నవదీప్ జడ్జిలుగా వ్యవహరించనున్నారు.
నా తడాఖా చూపిస్తా!
తాజాగా పెద్దపులి అభిజిత్ మళ్లీ వచ్చాడంటూ హాట్‌స్టార్ ఓ ప్రోమో రిలీజ్ చేసింది. అందులో అభిజిత్ మాట్లాడుతూ.. ఓ కంటెస్టెంట్‌గా వచ్చిన నన్ను.. ఈరోజు మళ్లీ జడ్జిగా పిలిచారు.. థాంక్యూ! ఇప్పటిదాకా నన్ను స్వీట్ చాక్లెట్ బాయ్‌గానే చూశారుకదా.. ఈ ఆగస్టు 22 నుంచి నా జడ్జిమెంట్ ఎంత కష్టంగా ఉంటుందో బిగ్‌బాస్‌తో సహా వాళ్లకూ (కంటెస్టెంట్స్‌కు) చూపిస్తా.. అన్నాడు. అయితే ఈ వీడియోలో బిగ్‌బాస్ వాయిస్ మారింది. గంభీరంగా వినిపించే బిగ్‌బాస్ గొంతుక పేలవంగా మారిపోయింది.
గొంతు మారిపోయింది
మరి ఇది ప్రోమో వరకేనా? లేదా అగ్నిపరీక్ష షోలో, బిగ్‌బాస్ 9వ సీజన్‌లో కూడా ఇదే గొంతు వినిపిస్తుందా? అని చాలామంది డౌట్ పడ్డారు. దీంతో హాట్‌స్టార్ ఈ అనుమానాలకు క్లారిటీ ఇచ్చింది. ప్రమోషన్స్ కోసమే ఈ కొత్త వాయిస్ వాడామని, బిగ్‌బాస్ షోలో పాత గొంతే వినిపిస్తుందని వివరణ ఇచ్చింది. ఇకపోతే అగ్నిపరీక్ష.. ఆగస్టు 22 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ అగ్నిపరీక్షలో సెలక్ట్ అయిన కంటెస్టెంట్లు బిగ్‌బాస్ 9లో కామనర్స్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు.

The Peddha Puli @Abijeet roars Back! 🦁
This time, not as a contestant, but as the formidable Judge of Bigg Boss Agnipariksha! A true test to crack. ⌛#BiggbossTelugu9 Agnipariksha starts from August 22nd exclusively on JioHotstar
#BiggbossTelugu9#BiggbossAgnipariksha… pic.twitter.com/IXOzs4xyzZ— JioHotstar Telugu (@JioHotstarTel_) August 16, 2025
చదవండి: అందం ఒక్కటే కాదు.. కలర్ ఉంటేనే షోలకు పిలుస్తారు: కీర్తి భట్