టాలీవుడ్‌లో కంటే బాలీవుడ్‌లో ఎక్కువ గుర్తింపు సంపాదించుకుంది శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala). దీంతో మొదట్లో చాలామంది ఈ అమ్మాయిని ముంబై బ్యూటీ అనుకున్నారు. కానీ, ఈమె అచ్చ తెలుగమ్మాయి అని, తనది విశాఖపట్నం అని తర్వాత అందరికీ తెలిసొచ్చింది. తెలుగు కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఆమె మాట్లాడుతుంటే తన భర్త, హీరో నాగచైతన్య కూడా అలా చూస్తూ ఉండిపోతాడట!
అక్కడ స్పీడు.. ఇక్కడేమో
చై మాట్లాడుతూ.. ముంబైలో సిటీ అమ్మాయిలా చాలా దూకుడుగా, ఆతస్మైర్యంతో కనిపిస్తూ ఉంటుంది. వైజాగ్‌లో తన ఇంటికొస్తే మాత్రం పల్లెటూరి పిల్లలా మారిపోతుంది. సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తుంది. అలాగే తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుంది. ఎంతలా అంటే తను నాకు తెలుగు నేర్పించేంత గొప్పగా మాట్లాడుతుంది, అంత టాలెంట్ ఉంది అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
తెలుగు భాషపై ప్రేమ
శోభిత తన పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సమయంలో అచ్చ తెలుగులో క్యాప్షన్ ఇచ్చింది. మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా అంటూ శ్లోకాన్ని రాసింది. అక్కడే తనకు తెలుగు భాషపై ఎంత ప్రేముందో అర్థమవుతోంది. అలాగే ట్రెడిషనల్‌గా ముస్తాబవడం కూడా శోభితకు ఎంతో ఇష్టం. అఖిల్ పెళ్లిలో పెద్దగా హంగూ ఆర్భాటలకు పోకుండా చాలా సింపుల్‌గా ముస్తాబైంది. ఫుల్ స్లీవ్స్ బ్లౌజుతో చీర కట్టి, మెడలో సింపుల్‌గా ఒక నగ అలరించుకుని నుదుటన పెద్ద బొట్టుబిళ్ల పెట్టుకుంది.
పెళ్లి
అక్కడే శోభిత సింప్లిసిటీ కనిపిస్తోంది. దీపావళి పండక్కి కూడా పర్పుల్ డ్రెస్‌లో రెడీ అయి దీపాలు వెలిగించింది. కాగా నాగచైతన్య.. గతంలో సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ, ఎంతోకాలం కలిసుండలేకపోయారు. 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత చై.. శోభితతో ప్రేమాయణం సాగించాడు. వీరిద్దరూ 2024లో పెళ్లి చేసుకున్నారు. మరోవైపు సమంత కూడా దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: మాపై చిన్నచూపు.. బతకాలనిపించలేదు: రాము తల్లి భావోద్వేగం


