ట్రాన్స్‌ జెండర్‌పై అనుచిత వ్యాఖ్యలు..

Madras High Court Orders YouTuber To Pay 50 Lakh Compensation To Transgender Politician - Sakshi

యూట్యూబర్‌కు రూ.50 లక్షల జరిమానా

చెన్నై: ట్రాన్స్‌జెండర్‌ వ్యాపారవేత్త, ఏఐఏడీఎంకే అధికారి ప్రతినిధి అప్సరా రెడ్డిని అప్రతిష్టపాలు చేసిన ఓ యూట్యూబర్‌కు మద్రాస్‌ హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది! ఆమె ప్రొవోగ్‌ మేగజీన్‌లో పని చేసిన రోజుల్లో మైకేల్‌ ప్రవీణ్‌ అనే సహోద్యోగితో విభేదాలొచ్చాయి.

దాంతో అతను అప్సరను కించపరుస్తూ 10 వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రవీణ్‌ నుంచి రూ.1.25 కోట్లు పరిహారం కోరుతూ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆమెకు రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ‘‘సోషల్‌ మీడియాలో పోస్టులతో ఇతరుల గోప్యతకు భంగం కలిగించొద్దు. ఏ హక్కయినా పరిమితులకు లోబడి ఉంటుంది’’ అని పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top