breaking news
YS Jagan Mohan Reddy
-
YS జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
-
NTV జర్నలిస్టుల అరెస్టును ఖండించిన వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: NTV జర్నలిస్టుల అరెస్టులను వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖండించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఇది పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడి. పండుగ రోజు అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి.. బలవంతంగా జర్నలిస్టుల ఇళ్లలోకి చొరబడి..అరెస్టు చేయటం దారుణం. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా, కనీసం నోటీసులు జారీ చేయకుండా జర్నలిస్టులను అరెస్టు చేయటం సరికాదు. ఈ అరెస్టులు నిరంకుశ మనస్తత్వాన్ని ప్రతిబింబం. జర్నలిస్టులు నేరస్థులో, ఉగ్రవాదులో కాదు.అయినప్పటికీ వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇలాంటి చర్యల వలన జర్నలిస్టుల కుటుంబాలు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతాయి.మీడియా సోదరులలో భయాన్ని సృష్టిస్తాయి. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి. రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించాలనీ, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు. I strongly condemn the arrests of NTV journalists, which amount to a direct attack on the freedom of the press and democratic values. Forcefully entering journalists’ homes by breaking doors at midnight during this festival and arresting them without following due legal procedure…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2026 -
ఆ పేరు వింటే ఢిల్లీకి హడల్.. YS జగన్ పై నల్లగొండ గద్దర్ సాంగ్
-
చెడును దహనం చేసేది భోగి.. వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ఒక ప్రతీక అని అన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. చెడును దహనం చేస్తూ భోగి, సంతోషానికి , సంవృద్ధికి స్వాగతం పలుకుతూ సంక్రాంతి, పశు సంపదను ప్రేమిస్తూ కనుమ... మీకు, మీకుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు.మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ఒక ప్రతీక.భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో ఎనలేని సంక్రాంతి శోభను తీసుకువచ్చాయి. ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.చెడును దహనం చేస్తూ భోగి, సంతోషానికి , సంవృద్ధికి స్వాగతం పలుకుతూ సంక్రాంతి, పశు సంపదను ప్రేమిస్తూ కనుమ... మీకు, మీకుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2026 -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి,గుంటూరు: సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ఒక ప్రతీక.భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో ఎనలేని సంక్రాంతి శోభను తీసుకువచ్చాయి. ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
రోశయ్య సతీమణి శివలక్ష్మి మృతిపై వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేత కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య కుమారుడు కొణిజేటి శివ సుబ్బారావుతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. శివలక్ష్మి గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని.. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు.కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) సోమవారం(జనవరి 12) కన్నుమూశారు. వయోభారంతో గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె అమీర్‌పేట్ ధరంకరం రోడ్డులోని నివాసంలో తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమెకు కేఎస్ సుబ్బారావు, కె.త్రివిక్రమరావు, కేఎస్ఎస్ మూర్తి కుమారులు, కుమార్తె రమాదేవి ఉన్నారు.గతేడాది డిసెంబర్ 20వ తేదీన అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఆమె కొన్నిరోజులు చికిత్స పొంది కోలుకున్నారు. తిరిగి ఆరో గ్యం క్షీణించి సోమవారం ఉదయం మృతి చెందారు. మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు తదితరులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కొంపల్లి సమీపంలోని దేవరయాంజల్ వ్యవసాయ క్షేత్రంలో శివలక్ష్మి అంత్యక్రియలు నిర్వహించారు. -
కాకినాడ జిల్లా సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి
-
సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: కాకినాడ జిల్లా అగ్ని ప్రమాదం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి ప్రభుత్వం అండగా నిలవాలని, తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు.కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్..‘మన్యంలో మారుమూలన ఉండే ఈ తండాలోని 38 పూరిళ్ళు పూర్తిగా కాలిపోయాయి. 120 మంది గ్రామస్థులు కట్టుబట్టలతో మిగిలారు. మంటలు దావానలంలా వ్యాపించి క్షణాల్లో ఊరంతా భస్మీపటలం అవడం తీవ్ర విచారకరం. బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి ప్రభుత్వం అండగా నిలవాలి. వారికి తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష అందజేయాలి. ఇల్లు కోల్పోయిన ప్రతి బాధిత కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలి. కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు వారికి అవసరమైన వసతి, ఇతర సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.కాగా, సార్లంకపల్లె.. అగ్ని ప్రమాదంలో చిక్కుకొని నిమిషాల్లో బూడిదైపోయింది. మన్యంలో మారుమూలన ఉండే ఈ తండాలోని మూడు పక్కా ఇళ్లు మినహా, 38 పూరిళ్లు కాలిపోయాయి. ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అడవిని నమ్ముకొని జీవించే సార్లంక గిరిజనులు సంక్రాంతి సందర్భంగా సరకుల కొనుగోళ్లకు సోమవారం సాయంత్రం తుని పట్టణానికి వెళ్లారు. అంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది. ఊరంతా శ్మశానంగా మారింది. ఊరికి 50 కి.మీ. దూరంలోని తుని నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికే ఊరంతా మంటల్లో ఆహుతైపోయింది. -
ఇదెక్కడి రాజకీయం పవనూ?!
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది. పిఠాపురంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా చేసిన ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మరోసారి కీర్తించారు. తమిద్దరి మధ్య అరమరికలు లేవని అన్నారు. మంచిదే. తప్పు కూడా లేదు కానీ.. ఒకప్పుడు ప్రశ్నిస్తానంటూ పార్టీని పెట్టి, ఇప్పుడు ఎవరూ ప్రశ్నించరాదని, ప్రశ్నించవద్దని చెబుతూండటం ఏ రకమైన రాజకీయమన్నది మనం ప్రశ్నించాల్సిందే. స్వోత్కర్ష, కులమతాలకు అతీతమన్నట్టు, దేశం కోసమే పనిచేస్తున్నాన్న బిల్డప్పులు చూస్తే.. పవన్ ఇప్పుడు చంద్రబాబు స్టైల్లోకి వచ్చేశారనుకోవచ్చు. ఎన్నికలప్పుడు ఏ హామీలిచ్చి గద్దెనెక్కాము?కూటమి ప్రభుత్వం వాటిని ఎంతవరకు నెరవేర్చింది? మిగిలిన వాటి గురించి ఏం చేయాలి? వంటి అంశాల జోలికి పోకుండా సంక్రాంతి సంబరాలలో నృత్యం చేసి ప్రజలను ఆనందపెట్టామని సంతృప్తి చెందినట్లుగా ఉంది.కొంతకాలం క్రితం వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక ఫంక్షన్ లో డాన్స్ చేస్తే సంబరాల రాంబాబు అని ఆయన ఎద్దేవ చేశారు. రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కళ్యాణ్ తాను మాత్రం సినిమాలలో నటించవచచ్చు.. సంక్రాంతి సంబరాలలో పాల్గొని డాన్స్ చేయవచ్చన్న మాట. పవన్ డాన్స్ చేయడాన్ని తప్పు పట్టడం లేదు. కాని రాంబాబును ఆయన అన్నమాట గుర్తు చేయాల్సి వస్తుంది.చంద్రబాబుతో తేడా లేదని చెబుతూ రాజకీయాలలో కూటమి కట్టడం కష్టమని, విడగొట్టడం సులువు అని ఆయన అన్నారు. ఎవరు ఆ ప్రయత్నం చేస్తున్నారు. కూటమి వీక్ అయిపోతోందన్న భయమేదో పట్టుకున్నట్లుగా ఉంది.2014లో జనసేన అభ్యర్ధులను పోటీలో దించకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత రోజులలో ఆ కూటమికి దూరమై వామపక్షాలు, బీఎస్పీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? 2019లో ఓటమి పాలు కాగానే ఎందుకు హుటాహుటిన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను బతిమలాడి ఆ పార్టీతో, తదుపరి టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాలి కదా! 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్‌ల పై చేసిన అవినీతి ఆరోపణలకు పవన్ తూచ్ ఎలా పెట్టారు. తెలుగుదేశం మద్దతు లేకుండా తాను గెలవలేనన్న భయంతో 15 ఏళ్లపాటు కూటమి అంటూ కూనిరాగాలు తీసి జనసేన కార్యకర్తలను మభ్య పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు రాజకీయాలు తెలిసిన వాళ్లకు అర్థమవుతూనే ఉన్నాయి. పవన్ ఒక రకంగా అధృష్టవంతుడు. ఆయన చంద్రబాబుకు డప్పు కొడితే సరిపోతుంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటువారికి అప్పగించినా నోరెత్తనక్కర్లేదు. మూడు లక్షల కోట్ల అప్పు చేసినా ఎందుకు అని అడగనక్కర్లేదు. 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టడమేమిటిన ప్రశ్నించనవసరం లేదు. పదవిలో ఎంజాయ్ చేస్తే చాలు. ఈ మాత్రం దానికి వేరే పార్టీ అవసరమా అని కొందరు ప్రశ్నిస్తుంటారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఆయన ఎన్ని గొడవలు పెట్టారు? వైసీపీ వారిని ఎన్ని బూతులు తిట్టారు?ఒకసారి కులం ఏమిటి? మతం ఏమిటి అని అంటారు. మరోసారి సనాతని హిందూ అంటూ ప్రజలను రెచ్చగొడతారు. తనకు కులమైనా మద్దతు ఇవ్వదా అంటూ కాపు వర్గాన్ని అభ్యర్ధించిన సంగతి ప్రజలు మర్చిపోతారన్నది ఆయన నమ్మకం కావచ్చు. కూటమిని ఎవరూ బలహీనపర్చనవసరం లేదు. ప్రజల ఆశలు వమ్ము అవుతున్న వేళ వారే కూటమిని కూల్చుతారు. పోలీసు బలగంతో, రెడ్ బుక్ అరాచకాలను ప్రశ్నించలేని పవన్ కళ్యాణ్ గతంలో ఏదో జరిగిందంటూ అసత్యాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. మాజీ మంత్రి వివేక హత్య ఘటనను అసందర్భంగా ప్రస్తావించడం ద్వారా ఆయన కూడా చంద్రబాబు బాటలోనే డైవర్షన్ రాజకీయం చేస్తున్నారు. పిఠాపురంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని తీర్చడానికి ఏమి చేస్తున్నది చెప్పకుండా ప్రజలకు సినిమా డైలాగులు చెబితే ఏమి ప్రయోజనం? అక్కడ పిల్లలు కుల వివక్షకు గురయ్యామని చెబితే, ఒక గ్రామంలో దళితుల బహిష్కారం వంటివి జరిగితే వాటిని చాలా చిన్న విషయాలుగా ఆయన పరిగణిస్తున్నారు. అది నిజమే అయితే ఇదే సమస్యపై వినతిపత్రం ఇవ్వడానికి రాబోయిన ఒక మహిళను ఎందుకు మూడు రోజులపాటు హౌస్ అరెస్ట్ చేశారని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. అంతగా పవన్ కళ్యాణ్ ఎందుకు భయపడ్డారని వారు అడుగుతున్నారు.పవన్ ఉప్పాడ రక్షణ గోడ నిర్మించేందుకు కృషి చేస్తే మంచిదే. కాని దానిని చూపించి అక్కడి వారిని బెదిరిస్తున్నట్లు మాట్లాడడం సరికాదు. తాము ఫలానా మంచి చేశామని చెప్పలేని ఆయన వైసీపీపై పిచ్చి విమర్శలు చేసినట్లు అనిపిస్తుంది. జగన్ పై, ఆయన కుటుంబంపై టీడీపీ సోషల్ మీడియా నీచమైన వ్యాఖ్యలు చేస్తుంటే కనీసం ఖండించని పవన్ కళ్యాణ్ నీతులు చెబుతున్నారు. ఆయన గత టర్మ్‌లో వైసీపీ వారిని ఎన్ని రకాలుగా బూతులు తిట్టింది? చెప్పులు ఎలా చూపింది.. అన్ని తెలిపే వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ప్రస్తుతం సాగుతున్నది చంద్రబాబు ప్రభుత్వమా? లేక ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ రెడ్ బుక్ ప్రభుత్వమా? చట్టవిరుద్దంగా కేసులు పెట్టడం, రోడ్లపై నడిపించడం, కాళ్లు, కీళ్లు విరగగొడతానని రౌడీ భాష మాట్లాడడం.. ఇవన్ని ఎవరు చేస్తున్నారు. ఒకరకంగా జనసేన కేడర్‌ను చూసి జాలి పడాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో జనసేనకు చెందిన వారు కూడా అవమానాలకు గురి అవుతున్నారు. శ్రీకాళహస్తిలో జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను ఒక టీడీపీ ఎమ్మెల్యే మనుషులు తీశారని వచ్చిన ఆరోపణలపై కనీసం స్పందించలేని నిస్సహాయ స్థితి పవన్ కళ్యాణ్‌ది. అంతేకాదు. ఆయనకు కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురుకాక పోలేదు. కాని టీడీపీ వారు ఏమి చేసినా సర్దుకుపోవాలని కార్యకర్తలకు చెబుతున్నప్పుడు ఆయన కూడా వాటిని భరించవలసిందే కదా! తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ యాగి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఊసే ఎందుకు ఎత్తడం లేదో! మతాల మధ్య కూడా విద్వేషం పెంచేలా మాట్లాడింది కూడా కూటమి నేతలే కదా! చంద్రబాబును పొగిడినంత సేపే ఎల్లో మీడియా ఆయనకు మద్దతు ఇస్తుందన్న సంగతి గమనించినట్లు ఉన్నారు. అందుకే ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా పనిచేస్తున్నా ప్రశ్నించకుండా పొగుడుతూ గడిపేస్తున్నారు. పదవే పరమావధిగా భావిస్తే ఇలాగే చేస్తారేమో! ఆత్మస్తుతి, పరనిందలతో రాజకీయం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. దానిని పవన్ కూడా బాగానే వంట పట్టించుకుంటున్నారా!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మోసాల ద్వారా బాబు సర్కారు యువత లక్ష్యాలకు అడ్డుపడుతోంది
సాక్షి, అమరావతి: యువత ఏకాగ్రత, లక్ష్యంతో కృషి చేస్తే దేశం బలపడుతుందని స్వామి వివేకానంద నమ్మారని, కానీ... రాష్ట్రంలో యువత అందుకు భిన్నంగా దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో హామీలను విస్మరించి యువతకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఆయన పాలన యువత, రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకొనే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన బోధనలను గుర్తుచేస్తూ... చంద్రబాబు యువతకు చేసిన మోసాలను ప్రస్తావిస్తూ వైఎస్ జగన్ సోషల్ మీడియా ‘ఎక్స్’ ఖాతాలో సోమవారం పోస్ట్ పెట్టారు. చంద్రబాబు పాలనలో 8 త్రైమాసికాల ఫీజు రీయింబర్స్మెంట్, రూ.4,900 కోట్ల విద్యా దీవెన, రూ.2,200 కోట్ల వసతి దీవెన బకాయిలు పేరుకుపోయాయని ధ్వజమెత్తారు.టీడీపీ కూటమి మేనిఫెస్టో వాగ్దానమైన యవతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి రెండేళ్లుగా చెల్లింపు లేదని గుర్తు చేశారు. ఆన్లైన్ సర్టీఫికేషన్ కోర్సులు నిలిపేశారని పేర్కొన్నారు. ఇలా మోసాలకు పాల్పడడం ద్వారా చంద్రబాబు సర్కారు యువత వారి లక్ష్యాలను సాధించకుండా అడ్డుపడుతోందని మండిపడ్డారు. వివేకానంద ప్రముఖ సూక్తిని ప్రస్తావిస్తూ ‘‘ఇకనైనా కదలండి.. మేల్కోండి.. యువత వారి లక్ష్యాల సాధనకు తోడ్పడండి’’ అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. Swami Vivekananda believed that if the youth work with focus and a goal, India grows stronger. On this National Youth Day, we remember his call.Is the state government allowing the youth to achieve this goal?In reality, the state of Andhra Pradesh's youth is grim:• 8…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 12, 2026 -
పవన్‌పై అంబటి సెటైర్లు.. ‘అది ఓ ఆర్టే’
సాక్షి,గుంటూరు: సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. క్రెడిట్ చోరీ చంద్రబాబు నిష్ణాతుడైతే.. తనలోని ఆరర్ట్స్ని ప్రదర్శించడంలో పవన్ కళ్యాణ్ దిట్టా అని ఎద్దేవా చేశారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ.. క్రెడిట్ చోరీలో చంద్రబాబు నిష్ణాతుడు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాజెక్ట్ విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భూ కేటాయింపులు, అనుమతులు, పునరావాసం వంటి కీలక పనులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగాయి.పదివేల ఎకరాలు కావాలని చంద్రబాబు కోరగా ప్రజలు తిరగబడ్డారని, తాము వచ్చాకే సరిపడా భూమికి కుదించాం. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు సహకరిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తోందని చంద్రబాబు చెప్పే మాటలు బడాయి మాత్రమే. మా హయాంలోనే అత్యధిక పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ఎంఎస్ఎంఈల ద్వారా 32 లక్షల ఉద్యోగాలు వస్తే.. గత చంద్రబాబు కేవలం 9 లక్షల ఉద్యోగాలే వచ్చాయి. కరెంటు, తాగునీరు సహా అనేక పన్నులు వేసి ప్రజలను బాధపెడుతున్న ఘనత చంద్రబాబుదే. ఛార్జీలు పెంచేదిలేదన్న ఆయన రూ.20 వేల కోట్లపైనే కరెంటు ఛార్జీలు పెంచారు. వైఎస్ జగన్ అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని విమర్శించిన చంద్రబాబు.. గత 18 నెలల్లోనే రూ.3.7 లక్షల కోట్ల అప్పు చేశారు. మరి దీన్ని ఏం అనాలో చంద్రబాబే చెప్పాలి. పవన్ కళ్యాణ్ చాలా ఆర్ట్స్ ఉన్నాయి. రాజకీయాల్లో నటించటం కూడా పవన్‌కు తెలిసిన విద్యే. చంద్రబాబును అనవసరంగా పొగడటం, వైఎస్ జగన్‌ను తిట్టినందుకు రహస్యంగా గిఫ్టులు అందుకుంటున్నారు. అది కూడా ఒక ఆర్టే. జనసేన నెత్తిమీద ఎక్కి టీడీపీ వారు డాన్స్ చేస్తున్నారు. ముందుగా మీ కార్యకర్తలను కాపాడుకో పవన్.పవన్ కళ్యాణ్ ఎక్కడ పడితే అక్కడ డాన్స్ చేస్తున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామితో ఆటలాడొద్దని హితువు పలికారు. -
YS Jagan: ప్రమాదంలో ఏపీ భవిష్యత్తు.. అయోమయంలో యువత..
-
ఏపీ యువతకు బాబు వెన్నుపోటు
సాక్షి, తాడేపల్లి: యువత ఏకాగ్రత, లక్ష్యంతో కృషి చేస్తే దేశం బలపడుతుందని స్వామి వివేకానంద నమ్మారని.. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో యువత మాత్రం అందుకు భిన్నంగా దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా చంద్రబాబు మోసాలను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో 8 త్రైమాసికాలకు గానూ ఫీజు రీయింబర్స్మెంట్లు, రూ.4,900 కోట్ల విద్యా దీవెన (Vidya Deevena), రూ2,200 కోట్ల వసతి దీవెన (Vasathi Deevena) బకాయిలు పేరుకుపోయాయని.. అలాగే నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి (మేనిఫెస్టో వాగ్దానం) చొప్పున 2 సంవత్సరాలుగా చెల్లింపులు లేవని గుర్తు చేశారు. ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులు నిలిపివేత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ మోసం ద్వారా యువతను తమ లక్ష్యాలను సాధించకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో కూటమి పాలన పరిస్థితులు యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. మేనిఫెస్టో వాగ్దానాలను ఉల్లంఘించి చంద్రబాబు యువతకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఇకనైనా మేల్కొని యువత తమ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన సహకారం అందించాలని.. వివేకానందుడి ప్రముఖ సూక్తిని ఒకదానిని(Arise, Awake, and facilitate..) ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్ జగన్ హితవు పలికారు. Swami Vivekananda believed that if the youth work with focus and a goal, India grows stronger. On this National Youth Day, we remember his call.Is the state government allowing the youth to achieve this goal?In reality, the state of Andhra Pradesh's youth is grim:• 8…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 12, 2026 -
ఉన్నదంటే ఉలికిపాటెందుకు ఎల్లోమీడియా?
ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లోమీడియా వ్యవహారం మితిమీరుతోంది. బాబుపై వారి భక్తి హద్దులు దాటుతోంది. జర్నలిజం విలువలకు ఎప్పుడో తిలోదకాలిచ్చేసిన ఎల్లోమీడియా ప్రతినిధులు మరింత దిగజారిపోయి వ్యక్తిత్వ హననానికి, అనుచిత, దారుణమైన భాషను వాడుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విషం చిమ్ముతూనే ఉన్నాయి. విషయం ఏమిటంటే.. అమరావతి మలిదశ భూసేకరణపై జగన్ ‘‘తొలిదశకే దిక్కులేదు.. మళ్లీ రెండో దశ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు’’ అని అనడం మాత్రమే. రెండు గంటలపాటు సాగిన ప్రెస్మీట్లో భోగాపురం విమానాశ్రయంపై బాబు క్రెడిట్ చోరీ మొదలుకొని అనేక అంశాలపై జగన్ మాట్లాడితే.. వాటన్నింటినీ వదిలేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక్క రివర్ బేసిన్ అన్న పదాన్ని పట్టుకుని తమ ఊహాశక్తినంతా జోడించి కథలల్లాయి! పూనకం వచ్చినట్లు ఊగిపోయాయి. మొత్తం సమస్యను పక్కదారి పట్టించేందుకు విశ్వయత్నం చేశాయి. ఆ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయం ఉంటే వ్యక్తం చేయవచ్చు. విశ్లేషించవచ్చు. అంతేకానీ దారుణమైన భాషతో విమర్శిస్తారా? జగన్ చెప్పిందేమిటి? దాన్ని ఎల్లో మీడియా ప్రచారం చేసిందెలా? అన్నది విశ్లేషిద్దాం. చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కాజేసిన తర్వాతే రాజధాని ప్రకటించారని జగన్ చాలాకాలంగా ఆధారాలతోసహా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలపై గతంలోనే టీడీపీ ప్రభుత్వ పెద్దలపై కేసులు కూడా పెట్టారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో రాజధాని పేరుతో అవినీతి జరుగుతోందని విమర్శించారు. ఇంత పెద్ద ఎత్తున భూముల సమీకరణ అవసరమా? అని ప్రశ్నించారు కూడా. అంతేకాదు అమరావతి ఒక కుల రాజధానిగా మారుతోందని కూడా విమర్శించారు. ఎల్లోమీడియా ఈ విమర్శలను ఎప్పుడూ తమ కథనాల్లో ప్రస్తావించలేదు. తొలి దశలో సేకరించిన ఏభై వేల ఎకరాల్లో రోడ్లు, విద్యుత్, డ్రైనేజి తదితర సదుపాయాల కల్పనకు ఎకరాకు రూ.రెండు కోట్లు ఖర్చు టీడీపీ ప్రభుత్వం గతంలోనే నివేదిక ఇచ్చిందని జగన్ చెప్పారు. ఇది అసత్యం కాదు కదా! ఇప్పుడు మరో ఏభై వేల ఎకరాలు తీసుకుంటే మౌలిక వసతుల కల్పనకే రూ.రెండు లక్షల కోట్లు అవుతుందని ఆయన అన్నారు. ఇది చంద్రబాబు గతంలో చెప్పిన లెక్కే! రాజధాని పెద్ద స్కామ్అని, చంద్రబాబు, ఆయన బినామీలు కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికి పల్లపు ప్రాంతాన్ని ఎంపిక చేశారని ఆయన విమర్శించారు. రాజధానిగా విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని ఎంపికి చేసిఉంటే ఇప్పటికే మహానగరంగా అభివృద్ధి అయ్యేదని జగన్ అన్నారు. ఇది వాస్తవమే కదా! చాలామంది నాగార్జున యూనివర్శిటీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో రాజధాని భవనాల నిర్మాణం చేయాలని సూచించారు. మూడు పంటలు పండే నల్లరేగడి భూములను పాడు చేయవద్దని కూడా చాలామంది స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ కూడా ఈ ప్రదేశంలో రాజధాని వద్దన్నది. అయినా చంద్రబాబు వినలేదు. ఇప్పుడు జగన్ అన్నదేమిటి? చంద్రబాబు రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు, దీనిపై సుప్రింకోర్టు కూడా దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు.రాజధాని కోసం ప్రస్తుతం తీసుకున్న 29 గ్రామాల పరిధిలోని భూమిలో అత్యధికం అటు కృష్ణా నదికి, ఇటు కొండవీటి వాగు, తదితర వాగుల మధ్య ఉన్న ప్రదేశం. నల్ల రేగడి నేల అవడంతో రాఫ్ట్ టెక్నాలజీని అమలు చేస్తున్నారని, పునాదుల నిర్మాణానికి చాలా ఖర్చు అవుతుందని వార్తలు వచ్చాయి. దీనిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి లు జగన్ మళ్లీ విషం కక్కారంటూ నానా చెత్త అంతా రాశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అమరావతి ప్రాంతం రాజధానికి అనువు కాదని ఎందుకు అన్నారు? దానిపై వీరు ఎన్నడైనా స్పందించారా? టీడీపీ మద్దతుదారుగా పేరున్న మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు రెండో దశ భూ సమీకరణను ఎందుకు వ్యతిరేకించారు? జగన్ రైతుల కష్టాల గురించి, వారికి రిటర్నబుల్ ప్లాట్ల ఇప్పటికీ ఇవ్వకపోవడం గురించి ప్రశ్నిస్తే వాటికి సమాధానం లేక ‘రివర్ బేసిన్’ అన్న పదాన్ని పట్టుకుని నానా యాగి చేశారు. ఈనాడు మీడియా అయితే ఏ, ఏ నగరాలు నదుల ఒడ్డున ఉన్నాయో చెబుతూ పెద్ద కథనాన్ని రాసేసింది. అదే టైమ్‌లో ఆ నగరాలలో ఎక్కడైనా వరద ఎత్తిపోసే స్కీములు ఉన్నాయా? అన్నది చెప్పలేదు. వేల కోట్ల ఖర్చు చేసి మూడు, నాలుగు వరద నీటి ఎత్తిపోత పథకాలను పెడుతున్న నగరంగా అమరావతి కొత్త రికార్డు సృష్టిస్తుందేమో! అంతేకాదు.. చదరపు అడుగుకు రూ.తొమ్మిది వేల నుంచి పది వేల వరకు ఖర్చుపెట్టడం కూడా మరో రికార్డే. జగన్ ప్రభుత్వం విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రతిపాదించినప్పుడు ఈనాడు మీడియా ఏకంగా సముద్రమే ముందుకు వచ్చేస్తోందంటూ తప్పుడు కథనాలు రాసింది.అది విషం చిమ్మడం కాదా? విశాఖ నగరంలో వరద ఎత్తిపోసే పరిస్థితి ఎక్కడైనా ఉందా? మరి అమరావతిలో ఎందుకు ఉంది? అంటే నేల స్వభావం, భౌగోళికంగా ఉండే పరిస్థితిని బట్టి ఆ ప్రాంతం వరద ముంపును గురవుతుంది. ఈ విషయం చెప్పినంత మాత్రాన పెద్ద తప్పు చేసినట్లు దుర్మార్గంగా ప్రచారం చేస్తుంటారు. ఒక రైతు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ గుండెపోటుకు గురై చనిపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా ఒక్క ముక్క రాయలేకపోయింది. అమరావతిపై ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే విషం కక్కినట్లా? నిజానికి ఏపీ ప్రజలను ముఖ్యంగా అమరావతి రైతులను మోసం చేయడానికి ఈ మీడియా ఈ డైవర్షన్ రాజకీయం చేసిందన్నది బహిరంగ రహస్యమే. జగన్ పేరుతో అబద్ధాలు సృష్టించి, వదంతులు వ్యాప్తి చేసి, అమరావతి రైతులను భయపెట్టడమే వీరి లక్ష్యం. అమరావతికి ఏదో అయిపోతుందని భ్రమ కల్పించి, రైతులు తమ సమస్యల గురించి చెప్పకుండా చేయడానికి జరుగుతున్న కుట్ర తప్ప ఇది మరొకటి కాదు. జర్నలిజాన్ని తాకట్టు పెట్టి నీచపు రాతలు రాయడానికే ఎల్లో మీడియా కంకణం కట్టుకుందని పదే, పదే రుజువు చేసుకుంటోంది.చివరిగా ఒక మాట. ఎవరు బాధపడినా భవిష్యత్తు నగరంగా అమరావతి అవుతుందని చంద్రబాబు అన్నారు. ఆయన చెబుతున్నది ఎలా ఉందంటే ఎందరిని బాధ పెట్టి అయినా తమ పని పూర్తి చేసుకుంటామని చెప్పినట్లు ఉందని కొందరు చేస్తున్న వ్యాఖ్యలను కాదనగలమా?అవును నష్టపోతున్న రైతుల బాధలు ప్రభుత్వ పెద్దలకు ఎందుకు పడతాయి! -
తెలుగు నేల గర్వపడే పోరాట యోధుడు ఓబన్న: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఓబన్న జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘తెలుగు నేల గర్వపడే పోరాట యోధుడు, స్నేహానికి అర్థం చెప్పిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధిపతిగా ఉంటూ బ్రిటిష్ సామ్రాజ్యానికే సవాల్ విసిరిన ఓబన్న జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. తెలుగు నేల గర్వపడే పోరాట యోధుడు, స్నేహానికి అర్థం చెప్పిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధిపతిగా ఉంటూ బ్రిటిష్ సామ్రాజ్యానికే సవాల్ విసిరిన ఓబన్న జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/IZfKKe17d7— YS Jagan Mohan Reddy (@ysjagan) January 11, 2026 వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో..తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించారు. వడ్డే ఓబన్న చిత్ర పటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ మూర్తి, పలువురు బీసీ నేతలు హాజరయ్యారు. -
సమాధానం చెప్పలేకే తిట్ల దండకం!
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు.. అవినీతి.. చీకటి ఒప్పందాలను సాక్ష్యాధారాలతో బట్టబయలు చేస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంధించిన ప్రశ్నాస్త్రాలకు సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు తిట్ల దండకం అందుకున్నారని మేధావులు, రాజకీయ పరిశీలకులు, ప్రజా సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి సీఎం చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నేతలు తమకు అలవాటైన రీతిలో పోటీ పడి దూషణలకు దిగుతున్నారంటూ ఆక్షేపిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా, ప్రజాభ్యుదయమే పరమావధిగా, ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్ష నేతగా చిత్తశుద్ధితో ప్రజల తరఫున వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తే.. చిత్తశుద్ధితో సీఎం చంద్రబాబు, మంత్రులు వాటికి సమాధానాలు చెప్పాల్సిందిపోయి, దూషణల పర్వానికి దిగడం ద్వారా తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతలను ఆపేయించానంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు, భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ చోరీ, రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతిపై ఆర్బీఐ నివేదిక, పారిశ్రామిక ప్రగతి పేరిట చేస్తున్న అవినీతి, అప్పుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, పన్నుల పేరిట బాదుడే బాదుడుతోపాటు.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి గండికొడుతూ చేస్తున్న అవినీతిపై సాక్ష్యాధారాలతో గురువారం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో ప్రభుత్వానికి ప్రశ్నాస్త్రాలను సంధించిన విషయం తెలిసిందే. ఇదే సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. రాజధానికి తొలి దశ భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా, వారికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రెండో దశలో మళ్లీ 50 వేల ఎకరాలు సమీకరిస్తుండటంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ప్రశ్నించిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా సీఎం చంద్రబాబు, మంత్రులు సమాధానాలు చెప్పలేక నీళ్లు నములుతూ తమకు అలవాటైన రీతిలో తిట్ల దండకాన్ని అందుకున్నారు. వారితో పాటు ఎల్లో మీడియా సైతం పోటీ పడి దూషణల పర్వానికి దిగింది.స్వలాభం కోసం ఎందాకైనా బాబు సిద్ధం⇒ స్వలాభం కోసం ప్రజలకు ఎంతటి మోసాన్ని చేయడానికైనా సీఎం చంద్రబాబు వెనుకాడరన్నది రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని వైఎస్ జగన్ ఎత్తిచూపడంతో చంద్రబాబు సర్కార్ ఆత్మరక్షణలో పడింది. ⇒ 2014–19 మధ్య భూ సేకరణను కోర్టు కేసులతో సంక్లిష్టం చేసి చంద్రబాబు సర్కార్ చేతులెత్తేస్తే 130 కేసులను పరిష్కరించి, 2019–24 మధ్య 2,700 ఎకరాల భూమిని సేకరించి.. రూ.960 కోట్లతో మూడు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించి.. భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను ప్రారంభించింది వైఎస్ జగన్. 2026 నాటికి ఎయిర్‌పోర్టు సిద్ధమవుతుందని అప్పుడే చెప్పిన అంశాన్ని వైఎస్ జగన్ గుర్తు చేస్తూ చంద్రబాబు క్రెడిట్ చోరీ నిర్వాకాన్ని సాక్ష్యాధారాలతోసహా బట్టబయలు చేయడంతో బాబు అబాసుపాలయ్యారు. ⇒ 2019–24 మధ్య రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేస్తే.. అందులో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.2.73 లక్షల కోట్లను ప్రజల ఖాతాల్లో జమ చేశామని.. ఎవరెవరి ఖాతాల్లో ఏ పథకం కింద ఎంత వేశామన్నది ఆధార్ కార్డులతో సహా ఇస్తామని వైఎస్ జగన్ చెప్పారు. కానీ.. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన 19 నెలల్లోనే రూ.3.02 లక్షల కోట్లు అప్పు చేసినా.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాలు అమలు చేయలేదని.. అప్పుగా తెచ్చిన ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందని వైఎస్ జగన్ నిలదీయడంపై కూడా వారెవరూ జవాబు చెప్పలేదని మేధావులు స్పష్టీకరిస్తున్నారు.⇒ ఇసుక నుంచి క్వార్ట్జ్ వరకూ ఎడాపెడా దోచేస్తూ.. మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని టీడీపీ నేతలు జేబుల్లోకి వేసుకుంటున్నారని గణాంకాలతోసహా ఎత్తిచూపితే ఎందుకు వాటిపై స్పందించరని మేధావులు నిలదీస్తున్నారు. అమరావతి మదర్ ఆఫ్ స్కామ్స్ కాదా?⇒ బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో అత్యంత అధునాతన సదుపాయాలతో చదరపు అడుగు రూ.4 వేల చొప్పున భవనాలను నిర్మిస్తుంటే.. రాజధానిలో చదరపు అడుగు రూ.పది వేలతో నిర్మిస్తున్నారని ఎత్తిచూపుతూ ఈ వ్యవహారంలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారులను కి.మీ రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల చొప్పున నిర్మిస్తుంటే.. రాజధాని అమరావతిలో కిలోమీటర్‌కు రూ.180 కోట్లు వెచ్చించి రహదారి నిర్మిస్తున్నాని ఎత్తిచూపుతూ.. భారీ ఎత్తున దోచుకుంటున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి నీకింత–నాకింత అంటూ దోచుకుంటున్నారని నిగ్గదీసి అడిగారు. దీనిపై కూడా సమాధానం రాలేదు. ⇒ గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో 50 వేల ఎకరాల ప్రాంతాన్ని రాజధానిగా 2015లో ప్రభుత్వం ప్రకటించింది. లోతట్టు ప్రాంతమైన ఆ భూమిలో రోడ్లు, విద్యుత్, తాగునీరు, మురుగు నీటి వ్యవస్థ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని కేంద్రానికి చంద్రబాబు సర్కార్ డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) సమర్పించింది. ఇప్పుడు మరో 50 వేల ఎకరాలు సేకరిస్తోంది. దీని అభివృద్ధికి మరో రూ.లక్ష కోట్లు కావాలి. మొత్తంగా రూ.రెండు లక్షల కోట్లు. అంతపెద్ద ఎత్తున అప్పు తెచ్చి ఎవరైనా రాజధాని నిర్మిస్తారా? అని వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నకూ సమాధానం లేదు.⇒ ‘మచిలీపట్నంలో పోర్టును నిర్మిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ వెస్ట్రన్ బైపాస్ పూర్తయింది. గన్నవరం ఎయిర్‌పోర్టు ఉంది. విజయవాడ–గుంటూరు మధ్యలో రహదారికి సమీపంలో లేదా విజయవాడ–మచిలీపట్నం మధ్య రహదారికి సమీపంలో రాజధానిని నిర్మించి ఉంటే తక్కువ ఖర్చుతో ఈ పాటికే మహానగరంగా అభివృద్ధి చెంది ఉండేది కాదా?’ అని వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నకూ వారి నుంచి సమాధానం లేదు.సమాధానం చెప్పేందుకు నోరు పెగలట్లేదెందుకు?⇒ రాజ్యాంగంలో ఎక్కడైనా రాజధాని ప్రస్తావన ఉందా? వైఎస్ జగన్ చెప్పినట్టుగా సీఎం, మంత్రులు ఎక్కడ కూర్చొని కార్యకలాపాలు నిర్వహిస్తే అదే రాజధాని. ఇది అబద్ధమని సాక్ష్యాధారాలతో ఒక్కరైనా సమాధానం చెప్పగలిగారా?⇒ రివర్ బేసిన్లో, ముంపు ప్రాంతంలో రాజధాని అమరావతిని నిర్మిస్తున్నారని.. ఎక్కడైనా లోతట్టు ప్రాంతం, వరద ముప్పు ఉండే ప్రాంతంలో రాజధాని నిర్మించారా? అన్న వైఎస్ జగన్ ప్రశ్నకు సూటిగా సమాధానం ఎందుకు చెప్పడం లేదు? ⇒ కొండవీటి వాగు, పాల వాగు వరద వల్ల తరచుగా రాజధాని ప్రాంతం ముంపునకు గురవుతుండటం నిజం కాదా. ఈ వరద ముప్పును తప్పించడానికే శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండ వద్ద 3 రిజర్వాయర్లు నిర్మిస్తున్న మాట వాస్తవం కాదా? కొండవీటి వాగు వరద నీటిని ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోయడానికి ఇప్పటికే 5 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ఉండవల్లి వద్ద ఎత్తిపోతల చేపట్టలేదా? తాజాగా 8,400 క్యూసెక్కులను ఎత్తిపోసేందుకు మరో ఎత్తిపోతల చేపట్టింది వాస్తవం కాదా? ⇒ రాజధానికి తొలి దశ భూ సమీకరణ కింద రైతులు భూములు ఇచ్చి 11 ఏళ్లు పూర్తయినా, ఇప్పటికీ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వక పోవడం నిజం కాదా? రైతులకు అభివృద్ధి చేయకుండా ఇచ్చిన ప్లాట్లను కూడా చెరువుల్లో, వాగుల్లో, వంకల్లో ఇవ్వడం నిజం కాదా?⇒ తాజాగా సీడ్ యాక్సిస్ రోడ్డు, ఎన్–8 రోడ్డు వంటి రోడ్ల విస్తరణ పేరుతో రైతుల ఇళ్లను కూడా సమీకరణ కింద ప్రభుత్వం లాక్కుంటుంటే.. ఈ అన్యాయంపై మంత్రి నారాయణను రైతు రామారావు ప్రశ్నిస్తూ ఆవేదనతో గుండె పగిలి చనిపోవడం నిజం కాదా?⇒ రెండో దశ భూ సమీకరణ చేసేందుకు వడ్లమానులో నిర్వహించిన గ్రామసభలో ఇదే అంశంపై మంత్రి నారాయణను రైతులు నిలదీయడం వాస్తవం కాదా? -
ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్య తీసుకోండి
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్ /అల్లిపురం/ఒంగోలు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రోజూ అభ్యంతరకరమైన రాతలు రాస్తూ, వక్రీకృత వ్యాఖ్యలు చేస్తూ, కేవలం విమర్శల కోసమే డిబేట్లు నిర్వహిస్తున్న ఏబీఎన్ టీవీ, ఆంధ్రజ్యోతి అదేపనిగా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని వైఎస్సార్సీపీ ఆక్షేపించింది. ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ శనివారం పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ గ్రీవెన్స్ సెల్ ప్రెసిడెంట్ అంకంరెడ్డి నారాయణ మూర్తి తదితరులు శనివారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో తగిన ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.ఇదే విషయమై వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే, దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్, పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, అనుబంధ సంఘాల చైర్మన్లు, నాయకులతో కలిసి విశాఖ నగర పోలీస్ కమిషనరేట్‌లో అడ్మిన్, ఏడీసీపీ డాక్టర్ వి.బి.రాజ్‌కమల్‌కు ఫిర్యాదు అందజేశారు. ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్లో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు.. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, పార్టీ నగర అధ్యక్షుడు కటారి శంకర్‌తో కలిసి ఫిర్యాదు చేశారు. కేబుల్ టీవీ నెట్వర్క్ చట్టం, ఐపీసీ నిబంధనల ప్రకారం యాంకర్, యాజమాన్యం రాధాకృష్ణ, చర్చలో పాల్గొని విషం చిమ్మిన విశ్లేషకుల మీద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు జర్నలిస్టు వెంకటకృష్ణ పైనా పోలీసులకు ఫిర్యాదు చేశాం. రెండు రోజుల క్రితం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల, భోగాపురం ఎయిర్‌పోర్టు, పరిశ్రమలు, రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై స్పష్టంగా వివరించారు. అయితే ఆ వ్యాఖ్యలను కావాలనే వక్రీకరిస్తూ, జగన్ అనని మాటలు అన్నట్లు చూపించడం ద్వారా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ ప్రస్తావిస్తే, దాన్ని పూర్తిగా ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వక్రీకరించాయి. ఇది జర్నలిజం విలువలకు పూర్తిగా పాతరేయడమే. – కొమ్మూరి కనకారావు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్, – అంకంరెడ్డి నారాయణమూర్తి, వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడుఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులు దహనం రామవరప్పాడు: విజయవాడ రూరల్ రామవరప్పాడు ఫ్లైఓవర్ సమీపంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ప్రధాన గేట్ వద్ద శనివారం వైఎస్సార్సీపీ నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ వాఖ్యలను వక్రీకరించి, రాష్ట్ర ప్రజలను తప్పు దోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ఏబీఎన్ డిబేట్లో, ఆంధ్రజ్యోతి పత్రికలో వైఎస్ జగన్‌పై విషం కక్కడాన్ని ఖండిస్తూ నినాదాలు చేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను దహనం చేశారు. -
శాపనార్థాలే సమాధానాలా?
‘వినదగు నెవ్వరు చెప్పిన...’ అన్నాడు సుమతీ శతకకారుడు. విన్న తర్వాత అందులోని నిజానిజాలేమిటో నిర్ధారించుకొని ఒక నిర్ణయం తీసుకోవాలంటాడు. సంఘ జీవనంలో మనుషుల మధ్య సంబంధాల గురించి చెప్పిన హితోక్తి ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏర్పడిన ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించవలసిన నీతిపాఠం. ప్రభుత్వ చర్యలను, నిర్ణయాలను ప్రజల తరఫున ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. అది వాటి బాధ్యత. ఆ ప్రశ్నలకు ప్రభుత్వాలు సూటిగా సమాధానాలు చెప్పి తీరాలి. అలా చెప్పకుండా దాటవేయడం మొదలుపెడితే ఆ ప్రభుత్వాలు ఏదో దాచిపెడుతున్నట్టు లెక్క. ప్రస్తుత ఏపీ సర్కార్ దాటవేసే దశను కూడా దాటిపోయింది. ఎదురు దాడినే ఆయుధంగా ప్రయోగిస్తున్నది. అందులోనూ పూనకాల దశకు చేరుకున్నది. జరగరానిదేదో జరుగుతున్నదని దీని అర్థం. చేయగూడని తప్పులేవో ప్రభుత్వం చేస్తున్నదని అర్థం. ప్రజలకు బాధ్యత వహించ వలసిన పవిత్ర కర్తవ్యాన్ని ఏపీ సర్కార్ ఈ రకంగా ఎగతాళి చేస్తున్నది. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి గురువారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడారు. వివిధ అంశాల మీద ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. అంతే, మిడతల దండు దాడి చేసినట్టు, తోడేళ్ల మంద దండెత్తి వచ్చినట్టుగా ఉన్నది కూటమి రియాక్షన్. కనీసం పదిమంది మంత్రులు జగన్‌పై ఎదురుదాడికి దిగారు. అందులో ఒక వయసు మళ్లిన మంత్రి స్థిమితం కోల్పోయి మాట్లాడారు. యెల్లో మీడియా ఛానల్స్ అన్ని రకాల మర్యాదల్నీ అతిక్రమించాయి. యెల్లో పత్రికలు యథావిధిగా వక్రీకరణకు పూనుకున్నాయి. కానీ, ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పే సాహసాన్ని ప్రభుత్వం కానీ, దాని తాబేదార్లు కానీ చేయలేదు. అసలు విషయాన్ని దాచేసి కొసరు సంగతులపై షాడో బాక్సింగ్ చేసే సంస్కృతిని యెల్లో కూటమి బాగా వంటపట్టించుకున్నది. విషయ పరిజ్ఞానం లేని పదిమంది తుత్తురుగాళ్లతో మాట్లాడించి, గత్తరలేపే వ్యూహాన్ని ప్రణాళికా బద్ధంగా అమలు చేస్తున్నది.ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. తాను ఏపీ ముఖ్యమంత్రితో ఒక క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో మాట్లాడి ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ పను లను ఆపేయించాననీ, కావాలంటే ఎవరైనా సరే చెక్ చేసుకో వచ్చనీ ఆయన అన్నారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య సున్నిత మైన అంశం. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఎత్తిపోతలపై తెలంగాణకు అభ్యంతరాలున్నాయి. కానీ రాయలసీమ అవసరాల రీత్యా ఏపీకిది వరదాయిని. ఇటువంటి అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో వైసీపీ సహా మరికొన్ని రాజకీయ పక్షాల ఏపీ ప్రభుత్వ స్పందనను డిమాండ్ చేశాయి. జగన్మోహన్రెడ్డి కూడా తన మీడియా సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎవరూ అడక్కుండానే ప్రభుత్వం ఈ అంశంపై ఒక ప్రకటన చేసి ఉండవలసింది. కానీ, ఇప్పటివరకూ ఈ వ్యవహారం మీద ఏపీ ప్రభుత్వం సూటిగా స్పందించలేదు. రేవంత్‌రెడ్డి, తాను క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో ఈ విషయం మాట్లాడుకున్నారా లేదా అనే సంగతి తప్ప అనేక ఇతర విషయాలు చంద్రబాబు మాట్లాడారు. ఒకవేళ రేవంత్ రెడ్డి చెప్పింది తప్పయితే దాన్ని ఖండించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటో అర్థం కాని విషయం. రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే అయితే, అటువంటి రహస్య నిర్ణయం తీసుకోవలసి రావడం వెనుక కీలకమైన జాతీయ భద్రతా అంశాలు దాగి ఉన్నాయని చెప్పవచ్చు. కానీ అసలు విషయాన్ని వదిలేసి ఉపవాచకాలను పఠించడం, ఉక్రోషాన్ని ప్రదర్శించడం యెల్లో కూటమి బలహీనతల్ని ఎత్తి చూపింది.అదే మీడియా సమావేశంలో అమరావతి వ్యవహారంలో ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను కూడా జగన్ ఎత్తిచూపారు. బాధ్యత కలిగిన ప్రభుత్వమైతే వాటికి సమాధానం చెప్పాలి. కానీ, ఆయన మాట్లాడిన మిగిలిన అన్ని విషయాలను వదిలేసి, ఈ ఒక్క అంశాన్నే పట్టుకుని అమరావతి మీద జగన్మోహన్రెడ్డి విషం కక్కుతున్నారంటూ ఒక చౌకబారు ప్రచారాన్ని దిగజారుడు భాషలో వండి వార్చి వడ్డించడం మొదలుపెట్టారు. ఒక్క జగన్మోహన్రెడ్డికే కాదు, అమరావతి విషయంలో ప్రభుత్వం వేస్తున్న కుప్పిగంతులపై చాలామంది మేధావులకూ, స్థానిక ప్రజలకూ పలురకాల అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేయకుండా నిందారోపణలు చేయడం వల్ల పవిత్రులమై పోతామనుకుంటే పప్పులో కాలేసినట్టే!వరద ముంపునకు అవకాశముండే ప్రాంతంలో నగర నిర్మాణం పట్ల నిపుణులందరికీ అభ్యంతరాలున్నాయి. వెయ్యి కోట్ల ఖర్చుతో రెండు ఎత్తిపోతల పథకాలను పెట్టి, రెండు రిజర్వాయర్లు నిర్మించి అమరావతిని వరద ముప్పు నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సంగతి నిజమే కదా! ఇంత ఆయాసం దేనికి, వరదముప్పు లేని ప్రాంతంలో నిర్మించు కోవచ్చు కదా! అక్కడ ముందుగానే పాలక పెద్దల అనుయా యులు భూములు కొనుగోలు చేసినందువల్లనే ఎంత ప్రయా సైనా సరే అక్కడనే రాజధాని ఉండాలని ఆరాటపడుతున్నారని అనుమానం రావడంలో తప్పేముంది! వరదముప్పు పొంచి ఉన్నచోటనే నగర నిర్మాణం ఎందుకన్న సూటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం ఉన్నదా?మొదట సేకరించిన 54 వేల ఎకరాల్లోనే అభివృద్ధి పనులు ప్రారంభం కాకుండా ఇంకో 50 వేల ఎకరాలు కావాలని అడగడం దేనికి? అందులో తక్షణమే 20 వేల ఎకరాల సమీ కరణకు రంగం సిద్ధం చేయడంలో పారదర్శకత ఏమైనా వున్నదా? ఎవరూ అడగకుండానే ప్రభుత్వం దీని మీద వివరణ ఇవ్వవలసింది. కానీ, అడిగినవారి మీద ఎదురుదాడికి దిగడం వెనుక ఏదో గూడుపుఠాణీ ఉన్నదనే కదా అర్థం? సీఆర్డీఏ వెబ్సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం తొలి దశ 54 వేల ఎకరాల్లో పార్కులు, రోడ్లు, చెరువులు వగైరాలు తీసేసిన అనంతరం 29 వేల పైచిలుకు భూములు అందుబాటులో ఉంటాయి. రైతులకు అభివృద్ధి చేసి ఇవ్వాల్సిన ప్లాట్లు, ఇప్పటి వరకు జరిపిన కేటాయింపులు, ప్రభుత్వ భవనాల అవసరాలు తీసివేసినా ఇంకా 18 వేల ఎకరాలకు పైగా సీఆర్డీఏ చేతిలో ఉన్నాయి. మరి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను చెరువుల్లో, శ్మశానాల్లో ఎందుకు వేస్తున్నారు? ఈ కారణం వల్లనే రామారావు అనే రైతు గుండె పగిలి చనిపోయిన ఉదంతాన్ని విస్మరించగలమా? అమ్ముకోవడానికి ప్రభుత్వం చేతిలో 18 వేల ఎకరాలు స్థిరంగా ఉండగా ఇంత ఆదరా బాదరాగా ఇంకో 20 వేల ఎకరాల సేకరణలోని ఔచిత్యాన్ని ఎవరైనా అడిగితే వాళ్ల మీద ‘అమరా వతి ద్రోహులు’, ‘అభివృద్ధి నిరోధకులు’ అనే ముద్రలు వేయ డానికి యెల్లో కూటమి సర్వసన్నద్ధంగా ఉన్నది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అవుతుందనీ, ప్రభుత్వం పైసా ఖర్చు చేయనవసరం లేదనీ చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి ఏడాది న్నరలోనే అమరావతి ఖాతాలో 50 వేల కోట్ల అప్పును ఎందుకు చేయవలసి వచ్చిందో వివరించాలని అడిగితే కూడా అమరావతి ద్రోహులవుతారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి సర్కార్ సూటిగా సమాధానం చెప్పవలసిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. కానీ వాటిని అడిగిన వారి మీద శాపనార్థాలు ప్రయోగిస్తూ బండి లాగిస్తున్నారు. పద్దెనిమిది నుంచి అరవయ్యేళ్లలోపు వయసున్న మహిళలందరికీ నెలకు రూ.1,500 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించరాదు. నిరుద్యోగులకు నెలకు మూడువేల రూపాయల భృతి సంగతి ఏమిటని అడగరాదు. అడిగితే అభివృద్ధికి అడ్డుపడినట్టు. ఏపీ అంటే... ‘ఏ ఫర్ అమరావతి’, ‘పీ ఫర్ పోలవరం’ అని ప్రచారం చేసుకున్న బాబు సర్కార్ పోలవరం ప్రాజెక్టుకు చేసిన ద్రోహాన్ని కూడా ఎవ్వరూ ప్రశ్నించకూడదు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించే విధంగా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయకుండా, ఏవో ప్రయోజనాల కోసం పునాది డయా ఫ్రమ్ వాల్ వేసి, వరద కారణంగా అది దెబ్బతినడానికి కారణమయ్యారని వారిని అధిక్షేపించరాదు. ఈ చారిత్రక తప్పిదం వల్ల ఆ ప్రాజెక్టు ఇంకెంతకాలం కుంటుతుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. పైగా కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యతలతో నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును కేవలం తమ వారికి కాంట్రాక్టు పనిని అప్పగించడం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ నెత్తినెత్తుకున్నారన్న అభియోగం నిజం కాదని నిరూపించగలరా? చివరికి కేంద్రం ఒత్తిడికి లొంగిపోయి, దాని ఎత్తు తగ్గించి బరాజ్ స్థాయికి కుదించలేదా? ఈ విషయం నిజమా... కాదా?ఏ ఫర్ అమరావతి. పీ ఫర్ పోలవరం... ఈ రెండింటిలోనూ పారదర్శకత కనిపించడం లేదు. ఈ రెండింటిలోనూ గోల్మాల్ జరుగుతున్నదనే ఆరోపణలు నిజమైతే విభజిత రాష్ట్రానికి అంతకంటే పెద్ద ద్రోహం ఇంకేమన్నా ఉంటుందా? ఇవే కాదు, రాష్ట్రంలో కూటమి సర్కార్ అమలు చేస్తున్న విధా నాలు పేదలు, మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఇవాళ రాష్ట్రంలో ఎవరిని కదిలించినా చెబుతున్నారు. ఏ ప్రయోజనాల్ని ఆశించి ప్రైవేట్ పెట్టుబడికి ఊడిగం చేసే పాత్రను పోషిస్తున్నారు? విశాఖ నగరానికి ఇంతకాలం ఆయువుపట్లుగా నిలిచిన విశాఖ ఉక్కు, విశాఖ పోర్టులను దెబ్బతీయడం కోసమే మిట్టల్ స్టీల్స్‌కు సముద్రతీరం వెంబడి మూడు కిలోమీటర్ల పొడవునా ప్రైవేట్ పోర్టును కేటాయించారనీ, క్యాప్టివ్ మైన్స్ ఇప్పించడం కోసం కేంద్రం దగ్గరికి ఎంపీలను పంపించారనీ వచ్చిన ఆరోపణలు నిజమా, కాదా? సూటిగా సమాధానం చెప్పగలరా? ప్రపంచంలోని నాగరిక దేశాలన్నీ విద్య, ఆరోగ్య రంగాలను ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తుంటే కూటమి ప్రభుత్వం మాత్రం అంగడి సరుకుగా మార్చిందనడానికి ఈ పందొమ్మిది నెలల పాలన రుజువు కాదా? ప్రజల మనసుల్లో ఇటువంటి ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇందులో దేనికీ కూటమి సర్కార్ సూటిగా సమాధానం చెప్పే అవకాశం లేదు. కనుక ఈ శేష కాలాన్ని శాపనార్థాలతోనే వారు గడిపేస్తారని భావించవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
YSRCPలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ సీఈసీ సభ్యునిగా కూనదరాజు సత్యనారాయణరాజు (రాజోలు), పార్టీ అధికార ప్రతినిధిగా జి.వీరశేఖరరెడ్డి (ఉదయగిరి) నియమితులయ్యారు.కాగా, ఇటీవల తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా వడ్డీ రఘురామ్ నియమితులైన సంగతి తెలిసిందే. ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా సాది శ్యాం ప్రసాద్ రెడ్డి, సీఈసీ (CEC) సభ్యుడిగా పిరియా సాయిరాజ్, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం కోఆర్డినేటర్‌గా తమ్మినేని సీతారాం నియమితులయ్యారు. -
వైఎస్ జగన్‌పై అదే పనిగా వ్యక్తిత్వ హననం: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపె రోజూ అభ్యంతరకమైన రాతలు రాస్తూ, వక్రీకృత వ్యాఖ్యలు చేస్తూ, కేవలం విమర్శల కోసమే డిబేట్లు నిర్వహిస్తున్న ఏబీఎన్ టీవీ, ఆంధ్రజ్యోతి పత్రిక అదేపనిగా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని వైఎస్సార్సీపీ ఆక్షేపించింది. ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ గ్రీవెన్స్ సెల్ ప్రెసిడెంట్ అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో తగిన ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..:ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు: కొమ్మూరి కనకారావుఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు జర్నలిస్టు వెంకటకృష్ణ పైనా పోలీసులకు ఫిర్యాదు చేశాం. రెండు రోజుల క్రితం జగన్‌గారు మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, భోగాపురం ఎయిర్‌పోర్టు, పరిశ్రమలు, రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై స్పష్టంగా వివరించారు. అయితే ఆ వ్యాఖ్యలను కావాలనే వక్రీకరిస్తూ, జగన్ అనని మాటలు అన్నట్లు చూపించడం ద్వారా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ ప్రస్తావిస్తే, దాన్ని పూర్తిగా వక్రీకరించిన ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఆయనపై విరుచుకు పడుతూ, విచక్షణా రహితంగా కామెంట్ చేశాయి.జగన్‌పై వ్యక్తిగత ద్వేషంతో డిబేట్లు పెట్టి అదేపనిగా అక్కసు వెళ్లగక్కడం, నిందించడం, బురద చల్లడం, దుయ్యబట్టడం జర్నలిజం విలువలకు పూర్తిగా పాతరేయడమే కాకుండా, అది ప్రజాస్వామ్య విరుద్ధం. చంద్రబాబుపై అంత ప్రేమ ఉంటే, పేపర్, ఛానల్‌కు ఆయన పేరు, ఫోటో పెట్టుకోవాలి. అంతతప్ప, న్యూట్రల్ జర్నలిజమ్ పేరుతో అంత దిగజారి వ్యవహరించొద్దు. అందుకే ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్య తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం.వాస్తవాలు ప్రస్తావిస్తే.. దుయ్యబడతారా?: అంకంరెడ్డి నారాయణమూర్తిరాజధాని పేరుతో రైతుల నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికీ వారికి స్పష్టత ఇవ్వలేకపోతోంది. తమకు ఇచ్చిన ప్లాట్లు అసలు ఎక్కడున్నాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో రైతు రామారావు గుండెపోటుతో మరణించాడు. ఈ వాస్తవాలను జగన్‌గారు ప్రశ్నిస్తే.. ఆయన అనని మాటలు అన్నట్లు, పూర్తిగా వక్రీకరిస్తూ ఏబీఎన్, ఆంధ్రజ్యోతి విషం చిమ్మాయి. తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ, జగన్‌గారిని నిందించాయి. జగన్ విశేష ప్రజాదరణ ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అన్న విషయాన్ని కూడా మర్చి, విషం చిమ్ముతూ గతి తప్పి విపరీతంగా వ్యాఖ్యలు చేశాయి.రాజధాని ప్రాంతంలో తగిన నిర్మాణాలు, ఎలాంటి అభివృద్ధి లేకపోయినా వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. దాన్ని ప్రశ్నించడం తప్పా? ఆ ప్రాంత రైతుల సమస్యలు ప్రస్తావించడం నేరమా?. వాటికి ప్రభుత్వం తరపున ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వకాల్తా పుచ్చుకుని, తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ, జగన్‌గారిపై విరుచుకు పడడం, పాతాళానికి దిగజారిన వారి జర్నలిజం విలువలను చూపుతోంది. అందుకే మీడియా ముసుగులో వారు చేస్తున్న అనైతిక పనులపై తగిన చర్య తీసుకోవాలని ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై ఇక్కడ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో పూర్తి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. ఇంకా ఈ విషయాన్ని ప్రెస్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా, అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తామని నారాయణమూర్తి స్పష్టం చేశారు. -
ఈసారి బాబు పప్పులు ఉడకలేదు!
ఎవరైనా మీతో అభ్యంతరకరంగా మాట్లాడితే ఏం చేస్తారు? వెంటనే ఆయనకు ధీటుగా జవాబిస్తారు. అలా కాకుండా మీ పక్కనున్న వ్యక్తిని తిట్టారనుకోండి.. దానిని ఏమంటారు? ఏదో భయంతో అలా చేసి ఉంటారని అనుకోవడం సహజమే కదా! ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అదే పని చేశారు. తాను కోరితేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటిస్తే చంద్రబాబు జవాబు ఇవ్వకపోగా... వైఎస్సార్ కాంగ్రెస్‌పై, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేశారు. అసలు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు.. మంత్రులతో మాట్లాడించారు. అంతేకాక మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయడానికి పోలవరం ప్రాజెక్టు సందర్శన పెట్టుకుని, గోదావరి జలాల గురించి, రాష్ట్రాల మధ్య సహకారం గురించి సుద్దులు చెప్పారు. పోనీ చంద్రబాబు నిజంగానే అంత చిత్తశుద్దితో ఈ విషయాలు మాట్లాడారా అంటే అదీ కనిపించదు. ఆయన విపక్షంలో ఉంటే ఒక రకం, అధికారంలో ఉంటే మరో రకం. చంద్రబాబు గత చరిత్ర అంతా ఇలా వైరుధ్యాలతోనే సాగుతోంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో 2011లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోపాటు బీజేపీ ఎమ్మెల్యే ఒకరు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలలో కొన్నిచోట్ల టీడీపీ కూడా పోటీచేసింది. ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్నందున గెలిచే అవకాశాలు లేవన్న అంచనాకు వచ్చారు. అందువల్ల పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేసే సానుకూల పరిస్థితులు లేవని భావించిన చంద్రబాబు వెంటనే డైవర్షన్ రాజకీయం చేశారు. మహారాష్ట్రలో కట్టిన బాబ్లి ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని, రెండు రాష్ట్రాల ఒప్పందానికి వ్యతిరేకంగా నిర్మించారని ఉమ్మడి ఏపీ రాజకీయ పార్టీలు ఆరోపించేవి. ఆ వివాదాన్ని చంద్రబాబు వ్యూహాత్మకంగా తన భుజాన వేసుకుని ఆ ప్రాజెక్టుపై పోరాటం ప్రకటించారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న ఈ ప్రాజెక్టును సందర్శించి హడావుడి చేయడానికి సిద్దమయ్యారు. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సుమారు 75 మందిని వెంటబెట్టుకుని దండయాత్ర మాదిరి మహారాష్ట్రకు బయల్దేరారు. ఆ రాష్ట్ర పోలీసులు దానిని అడ్డుకున్నారు. వారు పెట్టిన బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లే యత్నం చేశారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ధర్మాబాద్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత పోలీసులు వారిని వదలిపెట్టేశారు. అయినా తమను బాబ్లి ప్రాజెక్టు వద్దకు మీడియాతో సహా అనుమతించాలని డిమాండ్ చేస్తూ అక్కడే భైఠాయించారు. ఒక దశలో లాఠీ ఛార్జ్ కూడా జరిగింది. దీనికి ముందు రాష్ట్ర సరిహద్దులో దాదాపు గంటన్నర సేపు వీరంతా ధర్నా చేశారు.మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. పొరుగు రాష్ట్రానికి రావాలంటే పాస్ పోర్టు కావాలా అని కూడా ఆయన ప్రశ్నించారు. తాము యుద్దం చేయడానికి రాలేదంటూనే అంటూనే పోలీసుల సూచనలు పట్టించుకోకుండా హంగామా సృష్టించారు. దాంతో పోలీసులు చంద్రబాబుతో సహా ఆందోళనకారులపై కేసు పెట్టి అరెస్టు చేశారు.వారందరిని ఒక కాలేజీ ఆవరణలో ఉంచారు. .ఆ సమయంలో కొందరు నేతలు అక్కడనుంచి వచ్చేసినా, ఎక్కువమంది కేసులో ఇరుక్కున్నారు. కేసు రిజిస్టర్ కావడంతో టిడిపి నేతలు ఆందోళనకు గురయ్యారు. ఆ తరుణంలో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యకు పరిస్థితిని టీడీపీ నేతలు వివరించడంతో ఆయన ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఏపీకి తీసుకువచ్చారు. ఆ కేసు ధర్మాబాద్ కోర్టుకు వెళ్లింది. కోర్టులో విచారణకు వచ్చే సమయానికి చంద్రబాబు విభజిత ఏపీకి సీఎం కావడంతో బిజీ షెడ్యూల్స్ అంటూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. అక్రమంగా నిర్మించిన బాబ్లి ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణలో 18 లక్షల ఎకరాలకు నీటి సంక్షోభం వస్తుందని ఆరోపించేవారు. తీరా చూస్తే ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చేది రెండు,మూడు టీఎంసీలే కావడం విశేషం. విపక్షంలో ఉండగా చంద్రబాబు వ్యవహరించిన తీరు అది. అప్పుడు రాష్ట్రాల మధ్య రాజకీయాలు వద్దని అనలేదు. ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని అనేవారు. భావోద్వేగాలు రెచ్చగొడుతున్నట్లు ఆయన ఫీల్ కాలేదు. ఇప్పుడేమో రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ వల్ల వచ్చేవి 22 టీఎంసీలే అంటూ అర్ధం లేని వాదన తీసుకువచ్చారు. అది నిజమే అయితే రేవంత్ కు ఆ మాటే చెప్పి ఉండవచ్చు కదా! ఈ స్కీమ్ వల్ల రాయలసీమకు పెద్దగా కలిసి వచ్చేది లేదని, అందువల్ల తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడనవసరం లేదని లేఖ రాసి ఒప్పించి ఉండవచ్చు కదా! రేవంత్ తో కుమ్మక్కై చీకటి ఒప్పందం చేసుకున్నారన్న అభిప్రాయం ఏర్పడినా చంద్రబాబు మాత్రం దానిని ఖండించలేకపోయారు. దీంతో రేవంత్ చెప్పిందంతా నిజమేనని, ఆయన డిమాండ్‌కు తలొగ్గి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ను చంద్రబాబు నిలిపివేశారని ఏపీ ప్రజలకు అర్థమైంది. తన శిష్యుడుగా పేరొందిన రేవంత్ ను ఒక్క మాట అనలేకపోవడంతో ఈయనలో ఏదో భయం ఉందన్న భావన రాజకీయవర్గాలలో ఏర్పడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైమ్ లోనే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‌కు స్టే వచ్చిందని తొలుత ప్రచారం చేశారు. అయినా జగన్ పనులు ఎక్కడా ఆపకుండా 85 శాతం పూర్తి చేశారని వీడియోలతో సహా కధనాలు రావడంతో ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు, ఆయన మంత్రులు ఇప్పుడు ఏకంగా ఆ ప్రాజెక్టే అవసరం లేదన్నట్లు మాట్లాడి మరింత తప్పు చేశారు.ఒక తప్పును కవర్ చేసుకోబోయి మరిన్ని తప్పులు చేశారన్నమాట. పోనీ అన్ని ప్రాజెక్టులు అనుమతులతోనే ఆరంభం అవుతున్నాయా అంటే ఏ రాష్ట్రంలో అలా జరగదు.చంద్రబాబు చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తం పట్నం, చింతలపూడి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగు గంగ వంటి ప్రాజెక్టులను అలాగే చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు అనుమతులు కేంద్రం నుంచి సాధించే ప్రయత్నంలో ఉన్న సమయంలోనే కుడి, ఎడమ కాల్వలను తవ్వించారు. కుడి కాల్వకు టిడిపి వారే అడ్డుపడడానికి యత్నించిన సంగతి అందరికి తెలిసిందే. తెలంగాణ ప్రాజెక్టులకు తాను అడ్డు పడడం లేదని చంద్రబాబు ఏపీలో ఆయా సభలలో చెప్పడాన్ని ఎద్దేవ చేస్తూ తెలంగాణకు చెందిన 16 ప్రాజెక్టులపై ఎపి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆ మీడియా వెల్లడించింది.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2015-2017 మధ్య ఐదుసార్లు చంద్రబాబు ప్రభుత్వం లేఖలు ఎలా రాశారని ఆ మీడియా ప్రశ్నించింది. ఇదే కాదు..ఓటుకు నోటు కేసు సమయంలో హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలని, గవర్నర్ శాంతిభద్రతలు పర్యవేక్షించాలని, ఏపీ ప్రభుత్వం కూడా హైదరాబాదఃలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవచ్చని చంద్రబాబు బృందం వాదించేది. మరో విశేషం ఏమిటంటే ఓటుకు నోటు కేసు గురించి చెప్పమంటే, కేసీఆర్ టెలిఫోన్ టాపింగ్ ఎలా చేస్తారని ఎదురు ప్రశ్నించేవారు. ఏపీలో కేసీఆర్‌పై కేసులు పెట్టించారు.ఆత్మరక్షణలో పడిన ప్రతిసారి ఇలా డైవర్షన్ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు సిద్దహస్తుడని చరిత్ర చెబుతోంది. అయినా ఈసారి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ విషయంలో మాత్రం డైవర్షన్ రాజకీయం ఫలించలేదు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రాయవరంలో చంద్రబాబుకి పరాభవం
సాక్షి, తాడేపల్లి: కూటమి నేతలు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని.. అందుకే పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రాయవరం సభలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పబ్లిసిటీ పీక్, విషయం వీక్ అన్నట్టుగా చంద్రబాబు వైఖరి ఉంది. ఒక్క పాసు పుస్తకం ఇవ్వటానికి ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లారు. రాయవరంలో పాస్ పుస్తకాల పంపిణీ పేరిట చంద్రబాబు హంగామా చేశారు. కానీ, చివరకు ఏమైంది.. పరాభవం ఎదురైంది. పాస్ బుక్‌లు ఇవ్వలేదని స్వయంగా సీఎంకే రైతులు చెప్పారు. అయినా కూడా వైఎస్ జగన్‌పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. రామకోటిలాగే జగన్ కోటి రాయనిదే వాళ్లకు నిద్ర పట్టదు. చంద్రబాబు, లోకేష్, పవన్‌లు జగన్ కోటి రాస్తూ.. పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. అందుకే వాళ్లను ప్రజలు నమ్మడం లేదు. చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నారు. రైతులను జగన్ ఏం ఇబ్బంది పెట్టారు?. 2018లో చంద్రబాబు కొత్త నిబంధనలు తెచ్చారు. 22(A)లో భూముల్ని పెట్టి రైతులని ఇబ్బంది పెట్టారు. చుక్కల భూమిని సైతం 22Aలో చంద్రబాబు పెట్టారు. ఆయన హయాంలోనే రైతులకు ఇబ్బందుల ఎదురయ్యాయి. జగన్ ఒక్కరి భూమిని కూడా అలా పెట్టలేదు. ఈ విషయంలో చంద్రబాబుతో చర్చకు సిద్ధం అని పేర్ని నాని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రైతులంతా చంద్రబాబు వలన ఇబ్బందులు పడుతున్నారు. వాటిని జగన్ పరిష్కరిస్తే ఆయనపైనే విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబును ఏం అనాలో తెలుగులో పదాలు దొరకటం లేదని అన్నారాయన. జగన్ వచ్చాక జేసీతో పనిలేకుండా త్వరగా సమస్యలు పరిష్కారం అయ్యేలా చేశారు. చంద్రబాబు హయాంలోనే భూ రికార్డుల్లో చాలా అక్రమాలు జరిగాయి. ఆయన చెప్పే మాటలకు ఆయనకే నమ్మకం ఉండదు. బంధువులతో గొడవలు పెట్టుకో వద్దని చంద్రబాబు చెప్తున్నారు. కానీ ఎన్టీఆర్ దగ్గర్నుంచి జూ.ఎన్టీఆర్ వరకు అందరితో గొడవలు పెట్టుకున్నదే చంద్రబాబు. కుటుంబ సభ్యులతో ఆయనకే తగాదాలు ఉన్నాయి. ఎన్డీఆర్ ఆస్తుల్ని లాక్కున్నది ఎవరు?. నిమ్మకూరులో ఎన్టీఆర్ భూములు తీసుకున్నది ఎవరో చెప్పాలి?. ఎన్టీఆర్ ట్రస్టు భవన్, ఆయన ఇల్లు, బ్యాంకు అకౌంటను లాగేసుకున్నది ఎవరు?. క్యాన్సర్ ఆస్పత్రి ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది?.. అంటూ పేర్ని నాని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ చేపట్టిన భూసర్వే ఒక చరిత్ర. కొలతలతో సహా పొలం మ్యాప్‌ను కూడా జగనే తెచ్చారు. జగన్ చేపట్టిన భూ సర్వేనే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. పాస్ బుక్కులపై క్యూఆర్ కోడ్ సిస్టమ్ తీసుకొచ్చిందే వైఎస్ జగన్. దానిని కూడా కూటమి కొనసాగిస్తోంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక.. భూ సర్వేలు, పాస్ బుక్కుల విషయంలో ఏం మార్పులు చేశారో చెప్పాలి. ఈ విషయంలోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. పాసు పుస్తకాల ప్రింటింగ్‌లో కూడా కూటమి నేతలు కక్కుర్తి పడి కమీషన్లు తీసుకుంటున్నారు. పాస్ పుస్తకం మీద ఫోటో వేసుకుంటే నేరమా?. పాస్ పుస్తకం మీద జగన్ బొమ్మ తొలగించటం తప్ప చంద్రబాబు ఏం చేశారు?. అనేక ప్రభుత్వ సర్టిఫికెట్లపై చంద్రబాబు ఫొటోలు పెట్టారు కదా. చంద్రబాబు ఆరు అడుగుల గురివింద గింజ. 18 నెలలకే రూ.2 లక్షల కోట్లు అప్పు చేశారు. రేపు వేసవి కాలానికే మా వైఎస్సార్సీపీ హయాంనాటి అప్పుల్ని దాటి పోతారు. త్రిబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రానికి ఏం ఒరిగిందో చెప్పాలి?. పూర్తి కాని పోలవరం దగ్గర జయం జయం చంద్రన్నా అంటూ ఎందుకు భజన చేయించారు?. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో తట్టెడు మట్టి, చెంబెడు నీళ్లు మిగిలాయి. కూటమి నేతలు రికార్డు స్థాయిలో అప్పులు చేశామని సంబురాలు చేసుకోవచ్చు అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు.👉నాగార్జున సాగర్ నుండి ప్రకాశం బ్యారేజి కి నీళ్లు రాకపోతే కృష్ణాడెల్టా ఏం కావాలి?. మా హక్కులను కాలరాయటానికి చంద్రబాబు ఎవరు?. తన స్వార్ధానికి పొరుగు రాష్ట్రానికి మా హక్కులు కాలరాస్తారా?. ముచ్చుమర్రిలో 0.33tmc ల నీటితో కుప్పం వరకు నీళ్లు ఎలా వెళ్తాయి?. రాయలసీమకు లిఫ్టు అవసరం లేదంటూ చంద్రబాబు పాపం మూట కట్టుకుంటున్నారు. రాయలసీమ మీద చంద్రబాబుకు విద్వేషం👉2018 నాటికే పోలవరం పూర్తి చేస్తానన అసెంబ్లీలో చెప్పిన వ్యక్తి ఇప్పుడు కనిపించటం లేదు. పోలవరం పూర్తి చేయలేని వారు నల్లమల సాగర్ ఎలా పూర్తి చేస్తారు?. ఈ ప్రాజెక్టు చేయటానికి లక్ష కోట్లు కావాలి. అమరావతి నిర్మాణానికి రెండు లక్షల కోట్లు కావాలి. ఈ సొమ్మంతా ఎక్కడినుండి తెస్తారు?. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్ వెళ్తే చంద్రబాబు రచ్చ చేశారు. అలా ఎలా వెళ్తారనీ.. తెలంగాణతో గొడవ పడాలని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు అదే చంద్రబాబు నీతులు ఎలా చెప్తారు?. రాజధానిలో వెయ్యి కోట్లతో లిఫ్టులు కడతారా?. ఆ ఖర్చు చేస్తే రాయలసీమ ఎత్తిపోతల పూర్తవుతుంది కదారాజధానిలో మొదటి విడత భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలి. ఆ తర్వాత రెండో విడత గురించి మాట్లాడాలి. సీఎంగా ఉన్న చంద్రబాబుకు వారం వారం హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు?. రాజధానిలో రైతుల సమస్యలు పరిష్కరించమని జగన్ కోరారు. అమరావతి మీద జగన్ కు మమకారం లేకపోతే ఇల్లు కట్టుకుని ఎందుకు ఉంటారు?. చంద్రబాబుకు ఇప్పటికీ అమరావతిలో ఇల్లు లేదు. లింగమనేని రమేష్ ఇంటిలో ఎందుకు ఉంటున్నారు?ఏపీలో కులం, మతాలను రెచ్చగొట్టేదే పవన్ కళ్యాణ్. ఆయన్ని జనం కాపు కాయాలంట. ఈయనేమో చంద్రబాబును కాపు కాస్తాడంట. మరి పిఠాపురంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ఎవరు కాపు కాయాలి?. దళితులను వెలి వేస్తుంటే ఎవరు కాపు కాయాలి? అని పేర్ని నాని ఫైర్ అయ్యారు. -
ఈ జగన్ మనల్ని వదలడు.. సైలెంట్ గా ఫ్లైటెక్కి ఉస్కో !
-
భోగాపురం అసలు కథ ఇది.. క్రెడిట్ దొంగ చంద్రబాబు
-
బాబులో టెన్షన్.. జగన్ వ్యాఖ్యలపై మరో డ్రామా
-
అమరావతి రైతులతో బాబు గేమ్.. YS జగన్ ఆగ్రహం
-
ప్రజలకు సంజీవని లాంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారు... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
బాబు అవినీతి, క్రెడిట్ చోరీపై దుమ్ముదులిపిన జగన్
-
‘లిఫ్ట్’పై చంద్రబాబు డైవర్షన్!
సాక్షి, అమరావతి: చీకటి ఒప్పందాలతో రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేసిన సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను నీరుగార్చడాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీయడంతో ఆత్మరక్షణలో పడ్డ టీడీపీ కూటమి సర్కారు ఎల్లో మీడియాతో కలిసి మరోసారి డైవర్షన్ డ్రామాకు తెర తీసింది. రాజధానిలో రెండో విడత భూసమీకరణపై గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానం ఇస్తూ.. తొలి విడత భూములిచ్చిన రైతుల ఆక్రందనను ప్రస్తావించడంతో ఉలిక్కిపడిన చంద్రబాబు సర్కారు విషప్రచారానికి దిగింది.రివర్ బేసిన్ (నదీ పరివాహక ప్రాంతం)లో రాజధాని నిర్మిస్తున్నారని వైఎస్ జగన్ అంటే.. రివర్ బెడ్ (నదీ గర్భం)లో నిర్మిస్తున్నారని అన్నట్లుగా వక్రీకరిస్తూ, దూషణలకు దిగుతూ దుష్ప్రచారం చేస్తోంది. బేసిన్‌కు.. బెడ్‌కూ తేడా తెలియని మంత్రులు ఎల్లో మీడియాతో కలసి, రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిపివేసిన విషయాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఖండించకపోగా... ఎదురు దాడి, దుష్ప్రచారంఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతలను ఆపివేయించా..! పనులు ఆగాయో లేదో కావాలంటే చెక్ చేసుకోవచ్చంటూ తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సీఎం చంద్రబాబుగానీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడుగానీ రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తారనుకుంటే అది చేయలేదు. పైగా వారిద్దరి మాటలు వింటే.. ఆ ఎత్తిపోతల అవసరం లేదనడం చూస్తే.. రేవంత్‌రెడ్డితో చంద్రబాబుకు ఉన్న రహస్య ఒప్పందానికి అధికారికంగా ఆమోదముద్ర వేసినట్లేనని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు తన స్వార్థం కోసం ఎంతౖకైనా దిగజారుతారు.. ఎవరికైనా వెన్నుపోటు పొడుస్తారన్నది మరోసారి నిరూపితమైందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చడానికే రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేశారన్నది తేటతెల్లమవడంతో చంద్రబాబు సర్కార్‌పై ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే రాజధానిపై వైఎస్ జగన్ మాటలను వక్రీకరిస్తూ మంత్రులు, ఎల్లో మీడియా డైవర్షన్ డ్రామాకు తెరతీశాయి. నిర్మాణ వ్యయానికి అంతెక్కడ..?విభజన తర్వాత అధికారం చేపట్టి, అమరావతిని రాజధానిగా ప్రకటించి.. 2014–19 మధ్య ఐదేళ్లలో అదే రాజధాని నిర్మాణం కోసం రూ.5,500 కోట్లు చంద్రబాబు సర్కార్ ఖర్చు చేసింది. కానీ.. ఒక్కటంటే ఒక్క శాశ్వత నిర్మాణం చేయలేదు. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని.. ఆ ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడదని సీఎం చంద్రబాబు చెబుతూ వచ్చారు. కానీ.. ఇప్పుడు 19 నెలల్లోనే రూ.47 వేల కోట్ల రుణం రాజధాని కోసం తెచ్చారు. తొలి విడత తీసుకున్న 50 వేల ఎకరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని కేంద్రానికి చంద్రబాబు సర్కార్ డీపీఆర్ సమర్పించింది. రెండో విడతగా తీసుకుంటున్న భూముల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మరో రూ.లక్ష కోట్లు అవసరం.అంటే.. మొత్తమ్మీద రాజధాని నిర్మాణానికి ఏకంగా రూ.2 లక్షల కోట్లు అవసరం. ఇప్పటికే రూ.60 వేల కోట్లతో చేపట్టిన పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ, పనుల్లో ఎక్కడా పురోగతి లేదు. రాజధాని పేరుతో అప్పులు తేవడం, పనుల అంచనా వ్యయాలు పెంచడం, కాంట్రాక్టర్లకు అప్పగించడం, మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు చెల్లించడం, కమీషన్లు వసూలు చేసుకోవడం మినహా నిర్మాణ పనుల్లో ఎలాంటి పురోగతి కన్పించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధానిలో వర్షం కురిస్తే ఆ నీరు కృష్ణాలోకి వెళ్లడం లేదనే నెపంతో ఇప్పటికే రూ.222 కోట్లతో ఉండవల్లి వద్ద కొండవీటివాగు వరద ఎత్తిపోతల నిర్మించారు. తాజాగా రూ.523 కోట్లతో ఉండవల్లి వద్ద రెండో ఎత్తిపోతలను చేపట్టారు.వరదను నియంత్రించడానికి మూడు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు.. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తే మంత్రులు, ఎల్లో మీడియా గగ్గోలు పెడుతున్నారు. ప్రజలకు నిజంగానే మేలు చేయాలన్న సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే రాజధాని నిర్మాణం ఎప్పుడో జరిగిపోయి ఉండేది. కానీ అలా జరగలేదు కదా? ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ ప్రశ్నిస్తే ఎందుకంత ఉలుకు? ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల విశాల ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలి. అలాగే రాజధాని ప్రాంత రైతులకు న్యాయం జరగాలి. అదే విషయాన్ని వైఎస్ జగన్ చెప్పారు. రాజధాని రైతులకు అన్యాయం జరుగుతోందనే కదా వైఎస్ జగన్ చెప్పింది! ఇకనైనా రాజధాని రైతులకు న్యాయం చేయడంపై దృష్టి పెట్టండి.. రాజధాని నిర్మాణం పేరుతో ప్రజలపై ఇంకా భారం మోపడం ఆపాలని సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎల్లో మీడియాకు మేధావులు, రైతులు హితవు పలుకుతున్నారు.ఏడేళ్లలో ఏం చేశావ్ బాబూ..?రాజధాని నిర్మాణం కోసం టీడీపీ హయాంలో తొలి విడతగా 53 వేల ఎకరాలు సమీకరించారు. 2014–19 మధ్య ఐదేళ్లు.. ఇప్పుడు రెండేళ్లు వెరసి దాదాపు ఏడేళ్లు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. కానీ..ఇప్పటికీ రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఒక కొలిక్కి రాకముందే రెండో విడత భూసమీకరణను ప్రభుత్వం ప్రారంభించడంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. తొలి విడత భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లను వాగులు, వంకలు, చెరువుల్లో ఇవ్వడం.. ఇప్పుడు రహదారుల నిర్మాణం పేరుతో నివాసం ఉంటున్న ఇళ్లను సైతం చంద్రబాబు ప్రభుత్వం గుంజుకోవడంపై రైతులు మానసికంగా కుంగిపోతున్నారు.ఇదే అంశంపై ఇటీవల రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన రామారావు అనే రైతు గుండె పగిలి మరణించారు. రెండో విడత భూసమీకరణ కోసం వడ్డమానులో నిర్వహించిన గ్రామసభలో ప్రభుత్వాన్ని రైతులు నిలదీశారు. తొలి విడతలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు.. ఇప్పుడు రెండో విడతలో భూములివ్వాలంటే, మూడేళ్లలోగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆవేదననే వైఎస్ జగన్ ప్రస్తావించారు. -
మాది సంక్షేమ క్యాలెండర్..బాబుది అప్పుల క్యాలెండర్
సాక్షి, అమరావతి: ‘మా ప్రభుత్వంలో ప్రతి ఏటా సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసి, దాన్ని క్రమం తప్పకుండా అమలు చేశాం. అదే ఇప్పుడున్న చంద్రబాబు అప్పులు తెచ్చుకోవడానికి క్యాలెండర్ విడుదల చేస్తున్నారు’ అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దునుమాడారు. తమ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే.. రెండేళ్లు కూడా తిరక్కముందే రూ.3.02 లక్షల కోట్లు.. అంటే తాము ఐదేళ్లలో చేసిన అప్పులో 90.87 శాతం అప్పును చంద్రబాబు ప్రభుత్వం ఈ 18 నెలల్లోనే చేసేసిందంటూ కాగ్ నివేదికల్లో గణాంకాలను చూపుతూ కడిగిపారేశారు. ఇన్ని అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రజలకేమైనా మేలు చేశాడా? అంటే అదీ లేదన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లేకుండా పోయాయని, వైఎస్సార్సీపీ హయాంలో అమలైన పథకాలన్నీ రద్దు చేసేశారని నిప్పులు చెరిగారు. ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ గాలికి పోయాయని ఎద్దేవా చేశారు. రైతులు, విద్యార్థులు, అక్కచెల్లెమ్మలు, ఉద్యోగులకు దిక్కులేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు దాదాపుగా రూ.30 వేల కోట్లు బకాయి పడిందని చెప్పారు. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పీఆర్సీ ఊసే లేదన్నారు. ఇక సరెండర్ లీవుల గురించి చెప్పాల్సిన పనే లేదన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..ఆశ్చర్యం కలిగించేలా అప్పులు ళీ చంద్రబాబు పదే పదే తప్పులు చేస్తూ.. మరో వైపు దు్రష్పచారం చేస్తుంటారు. వైఎస్సార్సీపీ హయాంలో రూ.10 లక్షల కోట్ల నుంచి రూ.14 లక్షల కోట్ల మేర అప్పులు చేసేశారని ఎన్నికలకు ముందు దు్రష్పచారం చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబును ఎవరైనా గిల్లినా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీసినా, ఉద్యోగులు సమ్మెల్లోకి వెళ్లినా మళ్లీ మనమే గుర్తుకొస్తాం. అసెంబ్లీలో ఒకటి చెబుతారు. ప్రభుత్వ రికార్డుల్లో ఒకటి చూపుతారు. బహిరంగ సభల్లో ఇంకో మాట మాట్లాడతారు.⇒ 2014లో బాబు గద్దెనెక్కే నాటికి ప్రభుత్వ అప్పులు, రాష్ట్ర ప్రభుత్వ హామీతో తీసుకున్న అప్పులు, హామీ లేని రుణాలు అన్నీ కలిపి రూ.1,40,717 కోట్లు ఉన్నాయి. ఈ అప్పులు చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.3,90,247 కోట్లకు చేరాయి. ఈ లెక్కన ఆయన రూ.2,49,530 కోట్లు అప్పు చేశారు. అంటే.. చంద్రబాబు సర్కార్ హయాంలో రుణాల సగటు వార్షిక వృద్ధి రేటు(సీఏజీఆర్) 22.63 శాతం నమోదైంది. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.3,31,671 కోట్లు అప్పు చేశాం. ఈ లెక్కన గమనిస్తే అప్పుల్లో సీఏజీఆర్ 13.57 శాతం మాత్రమే ఉంది.ప్రజలపై విపరీతంగా బాదుడు ⇒ చంద్రబాబు ఓ వైపు అప్పులు చేస్తూనే, మరో వైపు ప్రజల మీద విపరీతంగా బాదేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఐదేళ్లపాటు కరెంటు చార్జీలు పెంచనని చంద్రబాబు అన్నారు. కానీ, రెండేళ్లు కూడా గడవకుండానే ఏకంగా రూ.20,135 కోట్ల కరెంటు చార్జీలు బాదారు. ట్రూ అప్, ఇంకా రకరకాల చార్జీల పేరిట భారం మోపుతున్నారు. ఇంధనం, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఫ్యూయల్, పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జెస్ట్మెంట్ – ఎఫ్‌పీపీసీఏ) కింద 2024 నవంబర్ 29న రూ.9,412 కోట్లు, 2024 అక్టోబర్ 25న మరో రూ.6,072 కోట్లు, 2025 సెపె్టంబర్ 27న మరో రూ.1863 కోట్లు, ప్రొవిజనల్ ఎఫ్‌పీపీసీఏ చార్జెస్ కింద మరో రూ.2,787 కోట్లు వెరసి రూ.20,135 కోట్ల విద్యుత్ చార్జీలు బాదుడే బాదుడు. ⇒ రిజిస్ట్రేషన్ చార్జీలు 50% పెంచారు. దీంతో భూములు కొనాలంటేనే షాక్ కొట్టే పరిస్థితి. గ్రామాల్లో ప్రజలు తాగే తాగునీటిపైనా చార్జీలు వసూలు చేస్తున్నారు. తాజాగా కొత్తగా వాహనాల కొనుగోళ్లపై రోడ్ సెస్ వేశారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించింది. వాళ్లు తగ్గించిన పన్ను మొత్తాన్ని రహదారి సుంకం రూపంలో వీళ్లు మళ్లీ వేస్తున్నారు. అన్ని రకాల రోడ్లకూ టోల్ గేట్లు పెట్టి వసూలు చేయడం ఒక వడ్డన అయితే, రోడ్ సెస్ పేరిట వాహనాల మీద వడ్డిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం వీళ్ల జేబుల్లోకి పోతోంది.⇒ మేము చేసిన రూ.3.31 లక్షల కోట్ల అప్పుల్లో రూ.2.73 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) కింద ప్రజలకు అందించిన ఘనత మాది. డీబీటీ కింద ఎవరికి ఇచ్చామో పేరు, ఆధార్, బ్యాంక్ ఖాతాతో సహా పూర్తి వివరాలు అందిస్తాం. మేం ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే, కేవలం రెండేళ్లు కూడా తిరక్కుండానే బాబు రూ.రూ.3,02,303 కోట్లు అప్పు చేశారు. అంటే మేం ఐదేళ్లలో చేసిన అప్పులో 90.87 శాతం ఇప్పటికే చేసేశారు. మరోవైపు వచ్చే మూడు నెలల కాలంలో మరో రూ.11 వేల కోట్లు అప్పు చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ముందు ప్రతిపాదన పెట్టారు. అప్పులు తేవడంలో ఓ పద్ధతి పాడు లేకుండా పోయింది. రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తున్నారు. ⇒రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం వీళ్ల జేబుల్లోకి పోతోంది. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్, లేటరైట్ ఇలా ప్రతిదీ కుంభకోణం అయిపోయింది. రాష్ట్రంలో గ్రామ గ్రామాన మద్యం మాఫియా కనిపిస్తోంది. కమీషన్ల కోసం అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) రూపంలో కుంభకోణాలు చేస్తున్నారు. ప్రతి ఊళ్లో రేషన్ మాఫియా, ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు దర్శనమిస్తున్నాయి. ఏ పనికి అయినా సరే కింది నుంచి పైదాక లంచం ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. - వైఎస్ జగన్ -
భూ దోపిడీ.. క్రెడిట్ చోరీ..
సాక్షి, అమరావతి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో భారీగా భూ దోపిడీకి పథకం వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఎయిర్‌పోర్టు నిర్మాణంలో క్రెడిట్ చోరీకి పడరాని పాట్లు పడుతున్నారని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు చేసిందేమీ లేకపోగా.. ఎవరో చేసిన పనిని తన ఖాతాలో వేసుకోవడానికి కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతూ, నిస్సంకోచంగా క్రెడిట్ చోరీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2014–19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భోగాపురం విమానాశ్రయానికి ఏకంగా 15 వేల ఎకరాల భూమి కావాలన్న చంద్రబాబు తీరును చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారన్నారు. ఆ తర్వాత చంద్రబాబు 5 వేల ఎకరాలు అని చెప్పారన్నారు.దీంతో ప్రజలు ఆయన చిత్తశుద్ధిపై అనుమానంతో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాజెక్టుపై న్యాయస్థానాల్లో ఏకంగా 130 కేసులు దాఖలు చేశారని చెప్పారు. దీంతో ప్రాజెక్టు నిలిచిపోయిందన్నారు. నాడు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఎయిర్‌పోర్టుకు కనీస అనుమతులు తేవడంలో దారుణంగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్లో విశ్వాసాన్ని నింపి, కోర్టు కేసులను పరిష్కరించి 2,700 ఎకరాల భూసేకరణ చేసి ఎయిర్‌పోర్టు నిర్మాణ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లామని గుర్తు చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. భూ సేకరణకు రూ.960 కోట్లు ఖర్చు చేశాం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విమానాశ్రయానికి 2,200 ఎకరాలు, ఏరో సిటీకి మరో 500 ఎకరాలు కలిపి మొత్తం 2,700 ఎకరాల్లో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాం. అంతర్జాతీయంగా చూసినా 2,500 ఎకరాల్లో బ్రహ్మాండమైన విమానాశ్రయం ఏర్పాటవుతుంది. మేం ప్రభుత్వంపై రైతుల్లో విశ్వాసాన్ని పెంచి కోర్టు కేసులు మొత్తం వేగంగా పరిష్కరించాం. సమయాన్ని వెచ్చించి.. శ్రమించి విజయవంతంగా భూసేకరణ పూర్తి చేసి మూడు గ్రామాల్లో 400 కుటుంబాలను తరలించాం. వారికి ప్రత్యేకంగా పునరావాస కాలనీలు నిర్మించి ఇచ్చాం. భూ సేకరణ కోసమే దాదాపు రూ.960 కోట్లు ఖర్చు చేశాం. భోగాపురం భూ సేకరణ మొత్తం మా హయాంలో జరిగింది.కనీసం కనెక్టివిటీ రోడ్డూ పూర్తి చేయలేదు..భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మించడమే కాదు.. దానికి కనెక్టివిటీ రోడ్డు విషయంలోనూ అప్పుడే మేం దృష్టి సారించాం. విశాఖ సిటీ నుంచి 55 కిలోమీటర్ల మేర 77 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల రోడ్డుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాం. కేంద్ర మంత్రి గడ్కరీతో దీన్ని అప్పటికప్పుడు మంజూరు చేయించాం. ఆ సమావేశంలోనే గడ్కరీ దీనిని ‘వైఎస్ జగన్ డ్రీమ్ ప్రాజెక్ట్..’ అని ప్రకటించారు (ఆ వీడియోను ప్రదర్శించారు). కానీ, ఈ రోజు విమానాశ్రయం విషయంలో క్రెడిట్ తీసుకోవాలని తాపత్రయపడుతున్న వ్యక్తులు కనీసం ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ రోడ్డును కూడా పూర్తి చేయలేకపోయారు.రెండు సంవత్సరాలు సమయం తీసుకున్నా చంద్రబాబు రోడ్డు పనులను చేయకుండా గాలికొదిలేశారు. విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే నాటికి రోడ్డు పూర్తి చేయాలనే కనీస ధ్యాస కూడా వీరికి లేదు. త్వరలో భోగాపురం నుంచి విమానాలు టేకాఫ్ అవుతాయి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే సరైన రోడ్లు లేవు. చంద్రబాబు, పౌర విమానయానశాఖ మంత్రి మాత్రం తామే విమానాశ్రయాన్ని నిర్మించినట్లు బిల్డప్ ఇస్తారు. వీళ్లు కనీసం ఒక్క అనుమతి అయినా తీసుకొచ్చారా? భూ సేకరణ చేశారా? కనీసం ఇప్పుడు జరగాల్సిన పనులైనా చేయించారా? చంద్రబాబు మనస్తత్వం ఎలా ఉంటుందంటే.. తన కాంట్రిబ్యూషన్ ఏమీ లేకుండానే క్రెడిట్ కొట్టేస్తారు! ఎవరో పని చేస్తే.. ఆ క్రెడిట్ తీసుకోవడానికి కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పి సంకోచం లేకుండా చోరీ చేసేస్తారు.బాబు అనుమతులు కూడా తేలేకపోయారు..నాడు చంద్రబాబు హయాంలో అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయానశాఖ మంత్రిగా ఉన్నారు. అయినా కూడా.. భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్టుకు కనీసం అనుమతులు, ఎన్వోసీలు తేలేకపోయారు. ఆ ప్రాజెక్టు అనుమతులు అన్నీ మేమే తీసుకొచ్చాం. విశాఖపట్నంలో డిఫెన్స్ ఎస్టాబ్లి‹Ùమెంట్లు (రక్షణ శాఖ విభాగాలు) ఎక్కువగా ఉన్నందున ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక అనుమతులు అవసరం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చాం. నేను స్వయంగా ప్రధానిని కలిసి లేఖలు ఇచ్చా. అనేక సార్లు విజ్ఞ్ఞప్తి చేశా.అందుకే.. మా హయాంలోనే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బీసీఏఎస్ (బ్యూరో ఆఫ్ సివిల్ ఏవివేషన్ సెక్యూరిటీ), రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖ, పర్యావరణ అనుమతులు, కేంద్ర ప్రభుత్వ ఎన్వోసీ, అన్ని బ్యాంకుల ఫైనాన్షియల్ క్లోజర్ పర్మిషన్లు వచ్చాయి. ఇవన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగానే జరిగాయి. రోడ్లు, నీళ్లు, కరెంటు లాంటి మౌలిక వసతులకు అవసరమైన అదనపు నిధులను మా ప్రభుత్వంలోనే కేటాయించి ఖర్చు చేశాం. కోవిడ్ లాంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ధృడ సంకల్పంతో ముందుకెళ్లాం. ఆ తర్వాత 2023 మే 3వ తేదీన ముఖ్యమంత్రి హోదాలో నేను భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన కూడా చేశా. 2026లో తొలి విమానం ఇక్కడి నుంచి టేకాఫ్ అవుతుందని ఆ రోజు మీటింగ్‌లో నేను చెప్పిందే ఇవాళ నిజమవుతోంది.⇒ భోగాపురం ఎయిర్‌పోర్టుకు మా హయాంలోనే అన్ని అనుమతులు వచ్చాయి. రోడ్లు, నీళ్లు, కరెంటు లాంటి మౌలిక వసతులకు అదనపు నిధులను మా ప్రభుత్వంలోనే కేటాయించి ఖర్చు చేశాం. 2023 మే 3వ తేదీన ముఖ్యమంత్రి హోదాలో నేను భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేశా. 2026లో తొలి విమానం ఇక్కడి నుంచి టేకాఫ్ అవుతుందని ఆ రోజు మీటింగ్‌లో నేను చెప్పిందే ఇవాళ నిజమవుతోంది. ఈ రోజు విమానాశ్రయం విషయంలో క్రెడిట్ తీసుకోవాలని తాపత్రయపడుతున్న వ్యక్తులు.. కనీసం ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ రోడ్డు కూడా పూర్తి చేయలేకపోయారు. విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే నాటికి రోడ్డు పూర్తి చేయాలనే కనీస ధ్యాస కూడా వీరికి లేదు...⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విమానాశ్రయానికి 2,200 ఎకరాలు, ఏరో సిటీకి మరో 500 ఎకరాలు కలిపి మొత్తం 2,700 ఎకరాల్లో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాం. రైతుల్లో విశ్వాసాన్ని పెంచి కోర్టు కేసులు మొత్తం వేగంగా పరిష్కరించాం. విజయవంతంగా భూసేకరణ పూర్తి చేసి మూడు గ్రామాల్లో 400 కుటుంబాలను తరలించాం. వారికి ప్రత్యేకంగా పునరావాస కాలనీలు నిర్మించి ఇచ్చాం. భూ సేకరణ కోసమే దాదాపు రూ.960 కోట్లు ఖర్చు చేశాం. భోగాపురం భూ సేకరణ మొత్తం మా హయాంలో జరిగింది.⇒ భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మించడమే కాదు.. దానికి కనెక్టివిటీ రోడ్డు విషయంలోనూ అప్పుడే మేం దృష్టి సారించాం. విశాఖ సిటీ నుంచి 55 కిలోమీటర్ల మేర 77 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల రోడ్డుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాం. కేంద్ర మంత్రి గడ్కరీతో దీన్ని అప్పటికప్పుడు మంజూరు చేయించాం. ఆ సమావేశంలోనే గడ్కరీ దీనిని ‘వైఎస్ జగన్ డ్రీమ్ ప్రాజెక్ట్..’ అని ప్రకటించారు. – వైఎస్ జగన్ -
బాబు స్వార్థ ప్రయోజనాల కోసం 'సంజీవని తాకట్టు': వైఎస్ జగన్
శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి స్థాయిలో నీటిని తరలించాలంటే 881 అడుగులు ఉండాలి. తెలంగాణ 777–825 అడుగుల మధ్య రోజుకు 8 టీఎంసీల నీళ్లు వాడుకుంటుంటే, మనం కేవలం 0.6 టీఎంసీలు మాత్రమే తీసుకుంటున్నాం. ఇలాగైతే నీటి మట్టం ఎప్పుడు 881 అడుగులకు చేరుతుంది? ఎప్పుడు శ్రీశైలం నిండుతుంది? శ్రీశైలంలో 881 అడుగుల స్థాయిలో నీళ్లు ఎన్ని రోజులు ఉంటాయి? ఎప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కిందనున్న రిజర్వాయర్లకు నీళ్లు వస్తాయి? రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల పరిస్థితి ఏమిటి ? చిత్తూరు జిల్లాలోనే పుట్టిన చంద్రబాబు ఏరోజైనా ఈ ఆలోచన చేశాడా? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతలపై చంద్రబాబు, జల వనరుల శాఖ మంత్రి కలిసి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలను ఖండిస్తారని అందరూ భావించారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టే స్థాయికి దిగజారిపోరని ప్రతీ రైతూ ఆశించారు. కానీ.. ఆశ్చర్యకర రీతిలో రాయలసీమ ఎత్తిపోతల అవసరమే లేదంటూ చంద్రబాబు బరితెగించి మాట్లాడటమే కాకుండా, జలవనరుల మంత్రితో మాట్లాడించిన మాటలు చూస్తుంటే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో తను (చంద్రబాబు) చేసుకున్న రహస్య ఒప్పందానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసినట్లుగా కన్పిస్తోంది. స్వలాభం కోసం ప్రజలకు ఎంతటి ద్రోహమైనా, ఎంతటి మోసమైనా చేయడానికి చంద్రబాబు వెనుకాడడని మరోసారి రుజువైంది. తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్టే.. జన్మనిచ్చిన సీమకు కూడా ఏమాత్రం వెనుకాడకుండా వెన్నుపోటు పొడుస్తాడన్నది మరోసారి నిరూపితమైంది.పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ, గాలేరుృనగరి, ఎస్సార్బీసీ, చెన్నైకి తాగునీరు రూపంలో దాదాపు 101 టీఎంసీల కేటాయింపులున్నాయి. ప్రస్తుత స్పిల్ లెవల్ 841 అడుగులు. ఈ స్థాయిలో నీరు ఉంటే కేవలం 2 వేల క్యూసెక్కులు వస్తుంది. 854 అడుగులకు నీరు చేరితే 7 వేల క్యూసెక్కులు వస్తుంది. ఈ లెక్కన పూర్తి సామర్థ్యం 44 వేల క్యూసెక్కుల నీరు కిందకు (కాలువలోకి) రావాలంటే శ్రీశైలంలో 881 అడుగులకు నీరు చేరాలి. గత 20 ఏళ్లలో కేవలం మూడు, నాలుగు సార్లు మాత్రమే కేటాయించిన మేరకు నీళ్లు వాడుకోగలిగాం. మరొకవైపు యథేచ్ఛగా ఎత్తిపోతలు, పవర్ హౌస్ ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు 8 టీఎంసీలను శ్రీశైలం నుంచి తెలంగాణ దిగువకు తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్న పరిస్థితి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల అత్యంత అవశ్యం. గుక్కెడు నీళ్ల కోసం అల్లాడిపోతున్న ప్రజల గొంతు తడపాలని, ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ ఉండదు. ఎప్పుడుచూసినా దిక్కుమాలిన అబద్ధాలు, మోసాలు. ప్రజల కోసం చీకు, చింతా లేవు. చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ దొంగ పనులే. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కొత్తదేమీ కాదు. రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి తాగునీటి అవసరాలు తీర్చేందుకు గతంలో కేటాయింపుల మేరకు ముందే కట్టి ఉన్న రిజర్వాయర్లకు నీటిని సప్లిమెంట్ చేసే పథకమే ఇది.కృష్ణా నదిలో వరద వచ్చే రోజులు ఏటా తగ్గిపోతున్నాయి. ఏడాదిలో 20ృ30 రోజులకు మించి వరద రావడం లేదు. మరొకవైపు లిఫ్టులు, పవర్ హౌస్‌ల ద్వారా తెలంగాణ ఎడాపెడా రోజుకు 8 టీఎంసీల నీళ్లు తోడేస్తోంది. శ్రీశైలం నుంచి 777ృ825 అడుగులకే నీళ్లు ఖాళీ చేసేస్తున్నారు. ఈ పరిస్థితిలో తక్కువ సమయంలోనే ఇప్పటికే కట్టి ఉన్న ప్రాజెక్టులకు నీళ్లు నింపలేని పరిస్థితిని చక్కదిద్దేందుకే ఈ ప్రాజెక్టు చేపట్టాం. దీంట్లో కొత్త రిజర్వాయర్లు ఏమీ లేవు. ఉన్న రిజర్వాయర్లకు నీళ్లు పంపేందుకు ఉద్దేశించిందే ఈ ప్రాజెక్టు.అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రప్రదేశ్.. అందరూ మాట్లాడేది ఒకటే భాష. అందరూ అన్నదమ్ములమే. తెలంగాణ ప్రాంతం వాళ్లకు నష్టం చేయాలని జగన్ ఏ రోజూ ఆలోచన చేయడు. కానీ మన రాష్ట్ర ప్రజలకు నష్టం జరగకుండా చూసుకోవడం మన ధర్మం. కొంత మంది పాలకులు ఇందులో ఎమోషనల్ డ్రామాలు ప్లే చేసి, భావోద్వేగాలను రెచ్చగొట్టి.. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేయడం చాలా తప్పు. అందరూ అన్నదమ్ములుగానే ఉన్నాం.. కలిసి మెలిసి ఉన్నాం.. కలిసి మెలిసి పెరిగాం.. అలాగే ఉండాలి. -వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు రాయలసీమ ఎత్తిపోతల సంజీవని అని, ఇన్సూరెన్స్ పాలసీ వంటిదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. అలాంటి రాయలసీమ ఎత్తిపోతలపై సీఎం చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలోని జల వనరుల శాఖ మంత్రి మాట్లాడుతున్న మాటలు వింటుంటే ‘వీళ్లు అసలు మనుషులేనా?’ అనిపిస్తోందని మండిపడ్డారు. వాళ్లు మాట్లాడిన ప్రతీ మాట రాక్షసులను గుర్తు చేస్తోందంటూ దుయ్యబట్టారు. ఏపీ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమైనప్పుడు (క్లోజ్డ్ డోర్ మీటింగ్) రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేయాలని తాను అడిగానని, తనపై ఉన్న గౌరవంతో చంద్రబాబు ఆ ప్రాజెక్టును ఆపేశారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆ రాష్ట్ర అసెంబ్లీ నిండు సభలో ప్రకటించారని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డితో సాన్నిహిత్యం కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని ఏ విధంగా అమ్మకానికి పెట్టారో చెప్పేందుకు రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనే నిదర్శనమన్నారు. చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చొని స్వప్రయోజనాల కోసం సొంత రాష్ట్రాన్ని ఏ విధంగా తాకట్టు పెట్టాడో.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తన స్వార్థం కోసం ఏ విధంగా పణంగా పెడుతున్నాడో చెప్పేందుకు రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలే సాక్ష్యాలని ధ్వజమెత్తారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతుల దృష్టిలో చంద్రబాబు ఓ విలన్ కేరక్టర్‌గా కన్పిస్తున్నారన్నారు. బహుశా దేశ చరిత్రలో ఇలాంటి చరిత్ర హీనుడు ఎవరూ ఉండకపోవచ్చని నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల, భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ చోరీ, పెట్టుబడులు–ఉపాధి కల్పన–అప్పులపై నాణేనికి మరో పార్శ్వం తదితర అంశాలకు సంబంధించి సాక్ష్యాధారాలతో సహా వాస్తవాలను వివరిస్తూ చంద్రబాబు సర్కార్ వ్యవహార శైలిని ఏకిపారేశారు. రాయలసీమ ఎత్తిపోతలపై చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి కలిసి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలను ఖండిస్తారని అందరూ ఆశిస్తే.. ఆశ్చర్యకరంగా బాబు రహస్య ఒప్పందానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసినట్లుగా కన్పిస్తోందన్నారు. తక్షణమే రాయలసీమ ఎత్తిపోతల పనులను ప్రారంభించి.. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని, లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ ఎత్తిపోతలను వాయు వేగంతో పూర్తి చేసి, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘రాయలసీమ ఎత్తిపోతల’ గొప్ప ఆలోచన నిజంగా రాయలసీమ ఎత్తిపోతల అనేది గొప్ప ఆలోచన. గొప్ప ఉద్దేశం. కరువు కోరల్లో చిక్కుకున్న రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం ప్రశ్నార్థకమైన పరిస్థితులు.. తాగడానికి మంచినీళ్లు కూడా ఒక్కోసారి దొరకని పరిస్థితి. ఇలాంటి ప్రాంతానికి ఈ రాయలసీమ ఎత్తిపోతల అనేది ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది. రాయలసీమతోపాటు నెల్లూరు, చెన్నైలకు సంజీవని లాంటిది. ఈ విషయంలో అందరూ ఆలోచించాలని చెబుతున్నా. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. శ్రీశైలం నుంచి రాయలసీమకు, నెల్లూరుకు, చెన్నై ప్రాంతాలకు నీటిని విడుదల చేసే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ స్పిల్ లెవల్ 841 అడుగులు. కానీ ప్రస్తుతం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గరిష్ఠ సామర్థ్యం 44 వేల క్యూసెక్కులు. ఆ స్థాయిలో ప్రధాన కాలువలోకి నీళ్లు రావాలంటే శ్రీశైలంలో 881 అడుగుల్లో నీళ్లుండాలి. శ్రీశైలంలో 841 అడుగుల్లో నీరు ఉంటే కేవలం 2 వేల క్యూసెక్కులు, 854 అడుగులకు చేరితే 7 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ప్రధాన కాలువలోకి వస్తుంది. ఈ లెక్కన 44 వేల క్యూసెక్కుల నీరు కిందకు (కాలువలోకి) రావాలంటే శ్రీశైలంలో 881 అడుగులకు నీరు చేరాలి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, చెన్నైకి తాగునీరు రూపంలో దాదాపు 101 టీఎంసీల కేటాయింపులున్నా సరే... గడిచిన 20 ఏళ్లలో కేవలం 3–4 సార్లు మాత్రమే కేటాయించిన మేరకు నీళ్లు వాడుకోగలిగాం. అందరూ ఆలోచించాల్సిన వాస్తవాలు ఇవి. ఇలాంటి దుర్భర పరిస్థితులు ఒకవైపు ఉండగా, విభజన తర్వాత తెలంగాణలో ఏం జరిగిందో ఒకసారి పరిశీలించాలి.ఓటుకు కోట్లు కేసు కోసం రాష్ట్ర ప్రయోజనాలు పణం ⇒ 2015లో ఇక్కడ చంద్రబాబు సీఎంగా ఉండగా, అక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ సమయంలో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచారు. శ్రీశైలంలో 802 అడుగుల నుంచే నీళ్లు తోడుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఈ పనులు చేపట్టింది. మరోవైపు 800 అడుగుల్లోనే రోజుకు మరో 2 టీఎంసీలు వాడుకునేందుకు వీలుగా పాలమూరు–రంగారెడ్డి–దిండి ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారు. ఇంకో వైపున 825 అడుగులకే ఎస్ఎల్బీసీ నుంచి మరో 40 టీఎంసీలు తీసుకెళ్లేలా నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ⇒ శ్రీశైలంలోకి నీళ్లు రాకముందే జూరాల నుంచి నెట్టంపాడు, కోయల్ సాగర్, భీమా ఎత్తిపోతల ద్వారా మరొక టీఎంసీ నీళ్లు అటు నుంచి అటే తెలంగాణకు తరలిస్తున్న పరిస్థితి. ఇంకొక వైపు 777 అడుగుల నుంచి శ్రీశైలం ఎడమ వైపున ఉన్న పవర్ హౌస్‌లో విద్యుదుత్పత్తి కోసం రోజుకు 4 టీఎంసీల నీళ్లు ఇష్టమొచ్చినట్టుగా ఎడాపెడా తీసుకొని శ్రీశైలం నుంచి ఖాళీ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ గమనించాలి.⇒ ఇటువైపు మన రాష్ట్రంలో నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతుంటే.. మరొకవైపు అటు యథేచ్చగా ఎత్తిపోతలు, పవర్ హౌస్ ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు 8 టీఎంసీలను శ్రీశైలం నుంచి తెలంగాణ దిగువకు తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏపీది అడ్డుకోలేని పరిస్థితి. శ్రీశైలం ఎడమ వైపున పవర్ హౌస్‌లో విద్యుత్ ఉత్పత్తికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రోజుకు 4 టీఎంసీల నీళ్లను ఖాళీ చేస్తున్నా అడ్డుకోలేకపోతున్నాం. నాగార్జున సాగర్ ఎడమ గట్టు పవర్ హౌస్, దాని నిర్వహణ అన్నీ వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. ⇒ మొన్నటి వరకు మన భూ భాగంలో ఉన్న నాగార్జున సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, దాని నిర్వహణ కూడా తెలంగాణ చేతుల్లోనే ఉండేది. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, దాని నిర్వహణను స్వాధీనం చేసుకుంది. నాగార్జున సాగర్ కిందనున్న పులిచింతల ప్రాజెక్టు, దాంట్లో ఎడమ వైపున ఉన్న పవర్ హౌస్ కూడా తెలంగాణ చేతుల్లోనే ఉంది. రాష్ట్రానికి, రాయలసీమకు తీవ్ర విఘాతం కల్గించే ఈ నిర్ణయాలన్నీ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్నవే. ఇందుకు కారణం.. ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నోరు మెదపని పరిస్థితి. అప్పట్లోనే మన రాష్ట్ర హక్కుల కోసం ప్రతిపక్ష నేతగా ఉన్న నేను కర్నూలులో జల దీక్ష కూడా చేశాను. చంద్రబాబు మౌనం.. రాష్ట్రానికి శాపం ⇒ చంద్రబాబు మౌనం వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో ఎడమ వైపు తెలంగాణ చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులు 2019 వైఎస్సార్సీపీ వచ్చే నాటికి చకచకా జరుగుతున్నాయి. కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ విస్తరణ పనులతోపాటు పాలమూరు–రంగారెడ్డి–దిండి ఎత్తిపోతల పథకాలలో ఏ ఒక్కదానికి పర్యావరణ అనుమతుల్లేవు. ఈ పనులు ఆపాలని ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) 2021 అక్టోబర్‌లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదేశాలిచ్చినా వారు పట్టించుకోలేదు. ⇒ ఇదే విషయమై ఎన్జీటీ 2022లో తెలంగాణ ప్రభుత్వానికి రూ.920 కోట్ల జరిమానా కూడా విధించింది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఎత్తిపోతలు, పవర్ హౌస్ ఆపరేషన్స్ ద్వారా శ్రీశైలంలో 777 అడుగుల నుంచి 825 అడుగుల వరకు రోజుకు 8 టీఎంసీల నీళ్లు తీసుకుంటున్న పరిస్థితి. మరోవైపు మన రాష్ట్ర పరిస్థితి చూస్తే 834 అడుగుల వద్ద మల్యాల వద్ద చిన్న ఎత్తిపోతల ద్వారా 0.3 టీఎంసీలు, ముచ్చుమర్రిలో 795 అడుగుల వద్ద 0.3 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోగలుగుతున్నాం. ⇒ తెలంగాణ వాళ్లు 8 టీఎంసీలు నీళ్లు వాడుకుంటుండగా, మనం కేవలం 0.6 టీఎంసీలు మాత్రమే తీసుకుంటున్నాం. శ్రీశైలం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు.. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి స్థాయిలో నీటిని తరలించాలంటే 881 అడుగులు ఉండాలి. రోజుకు 777–825 అడుగుల వద్ద 8 టీఎంసీలు నీళ్లు ఖాళీ అవుతుంటే.. ఎప్పుడు 881 అడుగులకు నీరు చేరుతుంది? ఎప్పుడు శ్రీశైలం నిండుతుంది? శ్రీశైలంలో 881 అడుగుల స్థాయిలో నీళ్లు ఎన్ని రోజులు ఉంటాయి? ఎప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కిందనున్న రిజర్వాయర్లకు నీళ్లు వస్తాయి? రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల పరిస్థితి ఏమిటి ? చంద్రబాబు చిత్తూరు జిల్లాలోనే పుట్టాడు. ఏరోజైనా ఆలోచన చేశాడా? రిజర్వాయర్లకు.. స్టెబిలైజింగ్ రిజర్వాయర్లకు తేడా తెలియదా? ⇒ రాయలసీమ ఎత్తిపోతల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంటుందన్న జ్ఞానం కూడా ఈ పెద్దమనిíÙకి లేదు. పైగా ఈ ప్రాజెక్టును ఇంకా గందరగోళంలో పడేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రయోజనాలను, కరువు పీడిత రాయలసీమ, నెల్లూరు ప్రజలను చులకన చేసి మాట్లాడతున్నాడు. ఆ ఎత్తిపోతలలో కింద స్టెబిలైజింగ్ రిజర్వాయర్లను పట్టుకొని రిజర్వాయర్లంటాడు. అక్కడ కట్టింది రిజర్వాయర్లు కాదన్న విషయాన్ని తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ⇒ స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు కట్టకపోతే కుప్పంకు, చిత్తూరుకు తాగునీళ్లు కూడా పోయే పరిస్థితి ఉండదు. తాను పుట్టిన చిత్తూరు జిల్లా ప్రజలపై మమకారం లేదు. తనకు ఓటేసి గెలిపించిన కుప్పం ప్రజలపై కృతజ్ఞతా లేదు. హంద్రీ–నీవా ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు 500 కిలోమీటర్లకు పైబడి నీళ్లు ప్రయాణం చేయాలి. ఈ ప్రాంతం పూర్తిగా శివారు (టెయిల్ ఎండ్)లో ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమిస్తూ చిత్తూరు జిల్లాకు నీళ్లు ఇవ్వాలని, కుప్పంకు నీళ్లు ఇవ్వాలని ఆలోచన చేశాం. జీఎన్ఎస్ఎస్ (గాలేరు–నగరి) ద్వారా గండికోటకు నీళ్లు వస్తే.. అక్కడ ఎత్తిపోతలు పెట్టి హెచ్ఎన్ఎస్ఎస్ (హంద్రీ–నీవా) కాలువలోకి మరిన్ని నీళ్లు పంపి తద్వారా తంబళ్లపల్లి, పీలేరు మదనపల్లె, పుంగనూరు, కుప్పం, చిత్తూరులకే కాకుండా రాయచోటికి నీళ్లు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ⇒ ఇదే ఆలోచనతో పనులు చేపట్టాం. దాంట్లో భాగంగానే ఈ స్టెబిలైజేషన్ రిజర్వాయర్లు నిర్మించాం. వీటి నిల్వ సామర్థ్యం ఎంతో తెలుసా? కాలేటి వాగు సామర్థ్యం 1.2 టీఎంసీలు. ముదివేడు సామర్థ్యం 2 టీఎంసీలు. నేతిగుంటిపల్లి సామర్థ్యం ఒక టీఎంసీ. ఆవులపల్లి సామర్థ్యం 3 టీఎంసీలు. మా హయాంలో వీటిని కట్టాం. 500 కిలోమీటర్లు దాటి శివారు ప్రాంతానికి వెళ్లా్లలంటే, ఈ స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు లేకపోతే ఎలా వెళ్తాయో ఒక్కసారి ఆలోచన చేయండి.భావోద్వేగాలను రెచ్చగొట్టి.. ⇒ అటు తెలంగాణ కానివ్వండి.. ఇటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి.. అందరూ మాట్లాడేది ఒకటే భాష. అందరూ అన్నదమ్ములమే. తెలంగాణ ప్రాంతం వాళ్లకు నష్టం చేయాలని జగన్ ఏరోజూ ఆలోచన చేయడు. కానీ మన రాష్ట్ర ప్రజలకు నష్టం జరగకుండా చూసుకోవడం మన ధర్మం. ఇందులో ఎమోషనల్ డ్రామాలు ప్లే చేసి, భావోద్వేగాలను రెచ్చగొట్టి, ఇరు ప్రాంతాల ప్రజల మధ్య గొడవలు సృష్టించే కార్యక్రమం పాలకులుగా కొంత మంది చేస్తున్నారు. ఇది చాలా తçప్పు. వాస్తవాలు, నిజాలు నిక్కచ్చిగా చెప్పాలి. అప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటారు. ⇒ అందరూ అన్నదమ్ములుగానే ఉన్నాం. కలిసి మెలిసి ఉన్నాం.. కలిసి మెలిసి పెరిగాం. అలాగే ఉండాలి. గతంలో రాయలసీమలో ఏ ప్రాజెక్టును కూడా పూర్తిగా వాడుకోలేని పరిస్థితి. చంద్రబాబు 40 ఏళ్లు ఇండస్ట్రీ అంటాడు.‡ 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేశాడు. మళ్లీ సీఎం పదవిలో కూర్చొని 19 నెలలవుతోంది. రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లలో పూర్తి సామర్థ్యం మేరకు నీళ్లు నింపుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇదే పెద్దమనిషి ప్యాకేజీలు విడగొడతాడు.. జీవో నెంబర్ 22, జీవో నెంబర్ 63 అంటూ డబ్బులు దోచేయడానికి జీవోలు జారీ చేస్తాడు. రేట్లు పెంచి, నామినేషన్ల పద్ధతిలో పనులిచ్చి దోచుకునే కార్యక్రమం చేస్తాడు. కొత్త రిజర్వాయర్ల నిర్మాణం మాట ఎలా ఉన్నా, ఉన్న రిజర్వాయర్లకు నీళ్లు నింపే కార్యక్రమం చేపట్టకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం. రాయలసీమ లిఫ్టునకు వ్యతిరేకంగా కేసులు వేయించాడు⇒ ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితిని చక్కబెట్టే దిశగా అడుగులు పడ్డాయి. ఇందులో భాగమే రాయలసీమ ఎత్తిపోతల. శ్రీశైలంలో 800 అడుగుల నుంచే మనం కూడా 3 టీఎంసీల నీళ్లు తీసుకుని వెళ్లే వెసులుబాటును ఈ ఎత్తిపోతల ద్వారా కల్పించాం. దాదాపు రూ.1,000 కోట్లు ఖర్చుతో చేపట్టి చకచకా పనులు కూడా జరిగాయి. ఈ ఎత్తిపోతల పూర్తయితే మా ప్రభుత్వానికి, వైఎస్ జగన్‌కు ఎక్కడ క్రెడిట్ వస్తుందో అనే భయంతో చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సొంత టీడీపీ కార్యకర్తలతోనే తెలంగాణ నుంచి కేసులు వేయించి అడ్డుకోవాలని చూశాడు. ఎంత దుర్మార్గుడో చూడండి. ⇒ అయినా సరే రాయలసీమ, నెల్లూరు రైతులకు మేలు చేకూర్చేందుకు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టును ముందుకు కొనసాగించాం. ఈ ప్రాంత రైతుల దురదృష్టమేమిటంటే మా ప్రభుత్వం మళ్లీ రాకపోవడం. ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టుకు చంద్రగ్రహణం పట్టింది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో రహస్య ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి, సీమకు తీరని అన్యాయం చేశాడు చంద్రబాబు. కేవలం ఎన్జీటీ అభ్యంతరాల తర్వాత ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ) 2024 నవంబర్, 2025 జనవరి, ఫిబ్రవరిలలో మూడుసార్లు సమావేశమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు కనీసం నోరు మెదపలేదు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే ఈ ప్రాజెక్టును ఈ పెద్దమనిషి ఖూనీ చేశాడు. ⇒ ఒకటికి మూడుసార్లు సమావేశమై తమ వాదన విన్పించేందుకు అవకాశం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపకుండా ఈ ప్రాజెక్టుపై కత్తి పెట్టాడు. అసలు ఈ ప్రాజెక్టే వేస్ట్ అన్నట్టుగా మాట్లాడతాడు. తన మనుషులతో మాట్లాడిస్తున్నాడు. పైగా ఆశ్చర్యకరంగా శ్రీశైలం డెడ్ స్టోరేజ్‌లో 34 టీఎంసీలే.. దాంట్లో ఏపీ వాటా 22 టీఎంసీలే.. దీని కోసం లిఫ్టు ఎందుకంటూ చంద్రబాబు అంటున్నాడు. చంద్రబాబూ.. నువ్వు అసలు మనిషివేనా.. నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా. అటువైపు 777–825 అడుగులకే రోజుకు 8 టీఎంసీల నీరు వాడుకుంటుంటే 881 అడుగులకు నీళ్లెప్పుడు చేరతాయి.. ఆ తర్వాత పోతిరెడ్డిపాడుకు ఎప్పుడు వస్తాయన్న కనీస ఆలోచన చేయకుండా మాట్లాడుతున్నాడంటే ఆయన్ను ఏమనాలి? మా హయాంలో ఒక్కొక్కటిగా చక్కదిద్దుతూ వచ్చాం ⇒ రాయలసీమలో పేరుకు రిజర్వాయర్లున్నాయి. కానీ ఏ ఒక్క రిజర్వాయర్‌లోనూ వాటి పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నీరు నింపలేని పరిస్థితి ఉండేది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని ఒక్కొక్కటిగా సరిదిద్దుతూ వచ్చాం. ప్రజలకు మేలు చేయాలనే తపనతో పని చేశాం. ⇒ తెలుగు గంగ లింక్ కెనాల్ 0 నుంచి 18 కిలోమీటర్ల డిజైన్ మేరకు నీటిని పంపించుకోలేని పరిస్థితి ఉండేది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.500 కోట్లు ఖర్చు పెట్టి డిజైన్ మేరకు దాంట్లో 15 వేల క్యూసెక్కులు పంపేలా ఆధునికీకరించి వాడుకలోకి తీసుకొచ్చాం. ⇒ ఎస్ఆర్బీసీ–జీఎన్ఎస్ఎస్ కాలువ సామర్థ్యం రెండూ కలిపి 30 వేల క్యూసెక్కులకు పెంచే కార్యక్రమం చేపట్టాం. నిప్పుల వాగు నుంచి నెల్లూరు వరకు 30 వేల క్యూసెక్కులు వెళ్లేలా పనులు చేపట్టాం. ⇒ హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువలో కేవలం 2 వేల క్యూసెక్కుల నీళ్లు వెళ్తుంటే, మేము వచ్చిన తర్వాత ఆ కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచే పనులకు శ్రీకారం చుట్టాం. ⇒ అవుకు టన్నెల్(సొరంగం)లో ఫాల్ట్ జోన్ సమస్యను గత ప్రభుత్వాలేమీ పట్టించుకోలేదు. మేము వాటిని అధిగమించి మొదటి టన్నెల్ ద్వారా 10 వేల క్యూసెక్కులు, రెండో టన్నెల్ ద్వారా మరో 10 వేల క్యూసెక్కుల నీళ్లు పంపగలిగాం. రెండు టన్నెళ్లు పూర్తి చేసేందుకు రూ.260 కోట్లు ఖర్చు చేశాం. అవుకులో మూడో టన్నెల్ పనులు కూడా మొదలు పెట్టాం. ⇒ గండికోట రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 27 టీఏంసీలు. కానీ.. ఏరోజూ 14–15 టీఎంసీలకు మించి నీళ్లు నిల్వ చేయలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,000 కోట్లు ఆర్అండ్ఆర్ మీద ఖర్చు పెట్టి 27 టీఎంసీల నీళ్లు నిలిచేలా చేశాం.⇒ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం మేరకు 10 టీఎంసీల నీళ్లు నిలపలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.280 కోట్లు ఖర్చు చేసి.. ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి చేసి 10 టీఎంసీల నీళ్లు నిలిపేలా చేశాం. ⇒ బ్రహ్మంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17 టీఎంసీలు. కానీ.. ఏ రోజూ ఆ స్థాయిలో నిల్వ చేయలేదు. మేము వచ్చిన తర్వాత డయా ఫ్రమ్ వాల్ కొత్తది వేసి.. లీకేజీ సమస్యను అరికట్టి రూ.90 కోట్లు ఖర్చు చేసి.. 17 టీఎంసీల నీళ్లు నింపాం. ⇒ వెలుగొండలో రెండు టన్నెళ్లను పూర్తి చేసి రెండు దశాబ్దాల కలను సాకారం చేసి, జాతికి అంకితం చేశాం. మిగిలింది ఆర్ అండ్ ఆర్, లైనింగ్ పనులు మాత్రమే.⇒ కొన్ని దశాబ్దాలుగా తెలుగుగంగలో అంతర్భాగమైన సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో పూర్తి సామర్థ్యంలో ఏ రోజూ నీళ్లను నిలపలేదు. మేము వచ్చిన తర్వాత ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి సోమశిలలో 78 టీఎంసీలు, కండలేరులో 68 టీఎంసీల నీళ్లను నిలుప గలిగాం. రూ.120 కోట్లు ఖర్చు చేసి ఈ డ్యామ్‌లలో పూర్తి సామర్థ్యంలో నీళ్లు నిలబెట్టగలిగాం. ⇒ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ పనులు మా హయాంలో పూర్తి చేశాం. ఇక్కడ నుంచి కూతవేటు దూరంలో ఉంది పులిచింతల ప్రాజెక్టు. ఏ ఒక్కరోజూ పూర్తి సామర్థ్యం మేరకు ఇక్కడ నీటిని నిల్వ చేయలేదు. మేము వచ్చిన తర్వాత ఆర్ అండ్ ఆర్కు రూ.200 కోట్లు ఖర్చు చేశాం. 45 టీఎంసీలు స్టోరేజ్ చేశాం. ఇవన్నీ మా హయాంలో జరిగాయి. చిత్తశుద్ధి, సిన్సియారిటీ, కమిట్మెంట్ ఉంటే ఏదైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. పనులు జరుగుతాయి. అవి చంద్రబాబులో లోపించాయి. -
వైఎస్సార్‌టీఏ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్(వైఎస్సార్‌టీఏ) నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కె.జాలిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్కే జంషీద్, ట్రెజరర్ ఎస్.ప్రేమ్ సాగర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సీకే వెంకట్‌నాథ్‌రెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్షులు బి.సురేశ్, ఎం.వి.మహంకాళీరావు, జి.వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తొలి దశకే దిక్కు లేదు.. మళ్లీ రెండో దశా?
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో తొలి దశలో భూసమీకరణ కింద తీసుకున్న 50 వేల ఎకరాల్లో ఇప్పటికీ అభివృద్ధి పనులు చేయకుండా... రెండో దశలో 50 వేల ఎకరాలను ఎందుకు సమీకరిస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. అమరావతి నిర్మాణం ఓ స్కామ్ అన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. రాజధాని తొలి దశలో భూములిచ్చిన రైతులకు ఇప్పటికీ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండానే రెండో దశ భూ సమీకరణ చేస్తుండడంపై మీ స్పందన ఏమిటని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానమిచ్చారు. ‘‘చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కాజేసిన తర్వాతే రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారు.అనంతరం తొలి దశలో 50 వేల ఎకరాలు సమీకరించారు. ఆ భూముల్లో రాజధాని నిర్మించాలంటే తాగునీరు, రహదారులు, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థ వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్లు అవసరమని గతంలో కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇచ్చింది. రెండో విడతలో 50 వేల ఎకరాలు తీసుకుంటే, వాటిలో సదుపాయాలకు ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున మరో రూ.లక్ష కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది.అంటే, రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. కానీ, ఇప్పటికీ తొలి దశలో భూములిచ్చిన రైతులకు ఏ హామీలను అమలు చేయలేదు. దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు’’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు, ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడ కూర్చొని కార్యకలాపాలు నిర్వహిస్తే అదే రాజధాని. చంద్రబాబు రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు. దీనిపై సుప్రీంకోర్టు దృష్టిపెట్టాలి. కేవలం చంద్రబాబు, ఆయన బినామీలు కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికే రివర్ బేసిన్లో రాజధాని నిర్మిస్తున్నారు’’ అని మండిపడ్డారు. రాజధాని ఓ పెద్ద స్కామ్ రాజధాని నిర్మాణ పనుల్లో అంచనా వ్యయాలు భారీగా పెంచేసి, అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించి, భారీగా కమీషన్లు తీసుకుంటున్నారని, రాజధాని ఓ పెద్ద స్కామ్ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన బినామీలు కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికే పల్లపు ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారని పునరుద్ఘాటించారు. విజయవాడ–గుంటూరు మధ్య జాతీయ రహదారికి సమీపంలో రాజధాని నిర్మించి ఉంటే ఈ పాటికే మహానగరంగా అభివృద్ధి చెందేదని వివరించారు. మీ హయాంలో అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు మీకంటే చంద్రబాబు ఎక్కువ అప్పులు చేస్తోంది. మరి ఇప్పుడు రాష్ట్రం ఏమౌతుంది అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మీరే చెప్పండని వైఎస్ జగన్ అన్నారు. దక్షిణ సుడాన్, సోమాలియానో అవుతుందని అన్నారు.ఈ దశాబ్దంలోనే అతి పెద్ద స్కామ్మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఈ దశాబ్దంలోనే అతి పెద్ద స్కామ్ అని వైఎస్ జగన్ అన్నారు. ‘‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ టెండర్లు రాకపోవడం సంతోషకరం. ప్రైవేటీకరణపై న్యాయ పోరాటం చేస్తున్నాం. నిన్ననే (జనవరి 7న) హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశాం. దాన్ని కోర్టు ఆమోదించింది. ప్రభుత్వానికి నోటీసులిచ్చింది’’ అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘కట్టినవి, దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నవి, సగం పూర్తయినవి... ఉచితంగా ఇవ్వడమే కాక, రెండేళ్ల పాటు నడిపేందుకు సంబంధించిన జీతాలు సంవత్సరానికి రూ.60 కోట్లు, రెండేళ్లకు రూ.120 కోట్లు ఒక్కో కాలేజీకి చంద్రబాబు ఇస్తాడంట.ప్రభుత్వ భూమి, ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ సిబ్బంది.. జీతాలు ఇచ్చేది ప్రభుత్వం.. కానీ, లాభాలేమో ప్రైవేటు వ్యక్తలకంట. ఇది స్కామ్ కాకపోతే ఏంటి? ఇలాంటి స్కాముల్లో నిజంగా ఎవరైనా భాగస్వాములవుతారా?’’ అని ప్రశ్నించారు. ‘‘తొలుత కిమ్స్ వాళ్లు టెండర్ వేశారని చెప్పి డబ్బా కొట్టుకున్నారు. కిమ్స్ వాళ్లు అదేమీ లేదు. ఆ స్కాముల్లో మాకు సంబంధం లేదని వెనక్కి తప్పుకొన్నారు. వీళ్లకు ఏం చేయాలనో దిక్కు తెలీలేదు. ఎల్లయ్యతోనో, పుల్లయ్యతోనో, వంట మనుషులతోనో టెండర్లు వేయిస్తున్నారు.వాళ్లకైనా సరే నేను ఇస్తానంటున్నాడు చంద్రబాబు’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘‘ఛత్తీస్‌గఢ్‌లో కూడా బీజేపీ ప్రభుత్వమే కదా ఉంది... అక్కడ 13 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను మొన్ననే ప్రారంభించారు. కొత్త మెడికల్ కాలేజీలు ఎవరైనా పెట్టాలనుకుంటే దరఖాస్తులు పెట్టుకుంటే ఇస్తారు. అదొక పద్ధతి. భూములు కొనుక్కో, భవనాలు కట్టుకో, అన్ని రకాలుగా చేసుకో, ప్రభుత్వం నీకు సహకరిస్తుంది. ఇదొక పద్ధతి. కానీ, ఈ మాదిరిగా స్కాములు చేస్తూ, ఇప్పటికే ప్రభుత్వం కట్టిన భవనాలను ప్రైవేటువాళ్లకు ఊరికే ఇచ్చేయడం, సిబ్బంది జీతాలు కూడా ప్రభుత్వమే ఇవ్వడం వంటివి ఎవడూ చేయడు. ఏ ప్రభుత్వమూ చేయదు’ అంటూ వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
మా హయాంలోనే పారిశ్రామిక వృద్ధి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘అదానీ డేటా సెంటర్.. గూగుల్.. భోగాపురం ఎయిర్పోర్ట్.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాల్లో చంద్రబాబు క్రెడిట్ చోరీ తెలిసిందే. ఆయన ఇంకో అడుగు కూడా ముందుకేసి.. మా హయాంలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు వెళ్లిపోయారంటూ నిరంతరం బురదజల్లుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు..! దీనికి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, డజన్ల కొద్దీ అబద్ధాల ఫ్యాక్టరీలైన వాళ్ల సోషల్ మీడియా వంత పాడుతోంది..’ అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు.నిజాలు గడప దాటేలోపే.. చంద్రబాబు అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేసి వస్తాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేస్తున్న ఆ తప్పుడు ప్రచారాలను బద్ధలుకొడుతూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2025 డిసెంబర్ 11న ఒక నివేదిక విడుదల చేసిందని గుర్తు చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్బీఐ నివేదికను పరిశీలిస్తే.. 2019–24 మధ్య వైఎస్సార్ సీపీ హయాంలో తయారీ రంగం జీవీఏ (స్థూల ఉత్పత్తి విలువ) వృద్ధిలో దేశంలోనే ఏపీ 5వ స్థానంలో నిలిచిందని, దక్షిణాది రాష్ట్రాల్లో నాడు నంబర్ వన్‌గా ఉందని గుర్తు చేశారు.‘మా హయాంలో తయారీ రంగంలో ఏపీ వృద్ధి రేటు 11.12 శాతం ఉంటే, దేశ సగటు వృద్ధి రేటు కేవలం 6.87 శాతం మాత్రమే. అంతేకాదు.. మా ఐదేళ్ల పాలనలో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటును గమనిస్తే దేశంలో 8వ స్థానంలో, దక్షిణాదిలో మళ్లీ మొదటి స్థానంలో నిలిచాం. దేశ సగటు 8.96 శాతం అయితే ఏపీలో 11.14 శాతం ఉంది. అయినాసరే చంద్రబాబు పైశాచిక ఆనందంతో నిత్యం మాపై టన్నుల కొద్దీ బురద వేస్తూనే ఉన్నారు. అసలు వాస్తవం ఏమిటంటే.. చంద్రబాబు హయాంలో పారిశ్రామిక వేత్తలు బెదిరి పారిపోతున్నారు..’ అని పేర్కొన్నారు. కప్పం కడితేనే పరిశ్రమల మనుగడ.. సజ్జన్ జిందాల్, అరబిందో, మైహోమ్స్ సిమెంట్స్, శ్రీసిమెంట్స్, రామ్‌కో సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, యూబీ, షిర్డీసాయి.. వీళ్లందరూ చంద్రబాబు ఏలుబడిలో పరిశ్రమలను నడపలేక ఇబ్బందులు పడుతున్నారు. వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా.. కప్పం కట్టకపోతే పరిశ్రమలను నడిపే పరిస్థితి ఉందా? చంద్రబాబు ఈమధ్య మరో డ్రామా మొదలు పెట్టారు. కొత్త ఏడాది వేడుకలకు ఆయన, ఆయన కుమారుడు విదేశాలకు వెళ్లారు. ఎక్కడికి వెళ్లారో ప్రజలకు ఎలాగూ తెలియదు. పైపెచ్చు వీళ్ల పర్యటనను దాచిపెట్టే కార్యక్రమంలో భాగంగా ఎల్లో మీడియా కొత్త కొత్త సెన్సేషనల్ అబద్ధాలను క్రియేట్ చేస్తోంది. పారిశ్రామిక ప్రతిపాదనల్లో దేశంలో ఏపీ నంబర్ 1 అంటూ కొత్త వక్రీకరణ తీసుకొస్తోంది. అదంతా కేవలం పబ్లిసిటీ మాత్రమే. రియాలిటీ కాదు. ఎంఎస్ఎంఈల్లో 32.79 లక్షల ఉద్యోగాలు కల్పించాం వంటవారికి, డ్రైవర్లకు సూటూ బూటూ వేసి కూర్చోబెట్టడం.. ఎంవోయూలు రాయడం.. రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటూ ప్రకటించుకోవడం చంద్రబాబుకు అలవాటే. 2014–19 మధ్య కూడా ఇలాంటి కథలే విన్నాం. ఆర్టీఐ ద్వారా వెల్లడించిన సమాచారం చంద్రబాబు పారిశ్రామిక పబ్లిసిటీ గుట్టును బయటపెట్టింది. 2014–19 మధ్య భారీ పరిశ్రమల్లో రూ.50,708 కోట్లు పెట్టుబడులు క్షేత్రస్థాయిలో కనిపిస్తే దాని ద్వారా 84,333 ఉద్యోగాలు కల్పించారు. అదే మా హయాంలో 2019–24 మధ్య చూస్తే.. దాదాపు రూ.70 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి.అది గతంలో కంటే 25 శాతం అధికం. దీంతో పాటు 90,230 ఉద్యోగాలు కల్పించాం. ఇక ఎంఎస్ఎంఈలు చూసినా మేం ఐదేళ్లలో 32,79,770 ఉద్యోగాలిచ్చాం. ఇది మేం చెబుతున్నది కాదు.. ఆ విషయం సాక్షాత్తూ చంద్రబాబు ప్రభుత్వం రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ (సామాజిక ఆర్థిక) సర్వే రిపోర్ట్‌లోనే ఉంది. చంద్రబాబు ఇచి్చన ఎంఎస్ఎంఈ ఉద్యోగాలు కేవలం దాదాపు 9.50 లక్షలు మాత్రమే. మరి ఇప్పుడు చెప్పండి.. ఎవరి హయాంలో విధ్వంసం జరిగింది? ఎవరి హయాంలో పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు? ఎవరి హయాంలో పారిశ్రామిక వేత్తలకు ఊరట, భరోసా లభించింది? కమీషన్లు ఇస్తేనే ప్రోత్సాహకాలు! పారిశ్రామిక ప్రోత్సాహకాల్లో ఒక్క ఎంఎస్ఎంఈ విభాగంలోనే చంద్రబాబు దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా పెండింగ్ పెట్టారు. ఆ ప్రోత్సాహకాలు ఇచ్చే నాథుడు లేడు. పట్టించుకునే నాథుడు కనిపించట్లేదు. మొత్తంగా చూస్తే దాదాపు రూ.8 వేల కోట్లకుపైగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు పెండింగ్‌లో ఉన్నాయి. అవి ఇవ్వాలంటే.. రెండు బకెట్లు పెట్టారట! ఒక బకెట్లో.. 30 శాతం ఎవరు కమీషన్ ఇస్తే వారి పేరు పెడతారట! రెండో బకెట్లో న్యూట్రల్‌గా (తటస్థం) కనిపించడానికి కేవలం 20 శాతం మాత్రం పెడతారట! కొంతమందిని ఎంపిక చేసి 20 శాతం సొమ్ము ఇస్తారట! ఇలా ప్రోత్సాహకాల్లోనూ దోపిడీ చేస్తుంటే ఇంకేం పరిశ్రమలు వస్తాయి? చంద్రబాబు గతంలో మాదిరిగానే ఈదఫా కూడా పెట్టుబడులపై పీక్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ చేసేవన్నీ స్కామ్‌లే! పేరుకు ఒకట్రెండు పెద్ద కంపెనీలకు ఉచితంగా, 99 పైసలకే భూములిస్తున్నట్లు ప్రకటించి ఆ ముసుగులో రూ.వేల కోట్ల విలువైన భూములను తన బినామీలకు కారుచౌకగా దోచిపెడుతున్నారు. పెద్ద కంపెనీల పేర్లతో పబ్లిసిటీ చేసుకుని మరో మార్గంలో ఎల్లయ్యలకో, పుల్లయ్యలకో, తన బినామీలకు అప్పనంగా కట్టబెడుతున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు కారుచౌకగా భూములు! సత్వా గ్రూపు, కపిల్ గ్రూపు, ఏఎన్ఎస్ఆర్ గ్రూపు.. తదితర రియల్ ఎస్టేట్ కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి వేలం లేకుండానే భూములు ఇచ్చేస్తోంది. పొరుగున తెలంగాణలో చూస్తే ప్రభుత్వం నిర్వహించిన వేలంలో ఎకరా భూమి రూ.170 కోట్లు పలికింది. గుజరాత్‌లోనూ ఇలానే ప్రభుత్వం వేలంలో భూమిని కేటాయిస్తూ ఖజానాకు నిధులు సమకూర్చుకుంటోంది. మన రాష్ట్రంలో మాత్రం రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు దోచిపెడుతున్నారు. ఎకరా రూ.50 కోట్లు విలువైన భూములను కేవలం రూ.1.50 కోట్లకే ఇచ్చేశారు.సత్వాకు 30 ఎకరాలు, కపిల్ చిట్ ఫండ్స్‌కు 10 ఎకరాలు, ఏఎన్‌ఎస్‌ఆర్‌కు 10 ఎకరాలు.. రహేజాకు అయితే మరీ 99 పైసలకే కట్టబెట్టేశారు. ఒకవైపు ఎలాంటి వేలం లేకుండానే భూములు కారుచౌకగా ఇవ్వడమే కాకుండా.. మరోవైపు ల్యాండ్ యూజ్ (భూమి వినియోగం) 40–50 శాతం మిక్స్డ్ యూజ్ చేసుకునేందుకు స్వేచ్ఛ ఇచ్చారు. మరోవైపున వీళ్లు బిల్డింగులు కడితే.. ఎస్ఎఫ్టీకి రూ.2 వేలు తిరిగి ప్రభుత్వమే వెనక్కి డబ్బులిచ్చేలా భారీ స్కామ్‌కు తెరదీశారు. ఇది నిజంగా బొనాంజా కాదా? రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడికి ఎవరైనా ఈ మాదిరిగా ఇస్తారా? విశాఖలో లూలుకు రూ.2 వేల కోట్ల భూమి విశాఖపట్నంలో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన 14 ఎకరాల భూమిని 99 ఏళ్లకు లూలు గ్రూప్‌నకు లీజుకిచ్చారు. ఎలాంటి టెండరూ లేదు.. ఎలాంటి వేలం లేదు. కేవలం కంపెనీ రాసిన లెటర్ ఆధారంగా ఈ భూములు వాళ్లు మాల్ కట్టుకోవడానికి ఇచ్చేశారు. ఇదే లూలు గ్రూపు అహ్మదాబాద్‌లో 16 ఎకరాల భూమిని రూ.519 కోట్లకు వేలంలో కొనుగోలు చేసి మాల్ కడుతోంది. ఆంధ్రాలో మాత్రం ఉచితంగా, వేలం లేకుండా చంద్రబాబు ఇచ్చేస్తున్నారు. అహ్మదాబాద్‌లో లూలుకు కేటాయించిన భూమి వేలంలో రూ.519 కోట్లు ధర పలకడంతో పాటు రికార్డు స్థాయిలో రూ.31 కోట్లు స్టాంపు డ్యూటీ కింద వచ్చిందంటూ ఆ రాష్ట్రం క్రెడిట్ తీసుకుంటోంది. (ఆంగ్ల పత్రిక కథనాన్ని చూపించారు)⇒ చంద్రబాబు గతంలో మాదిరిగానే ఈదఫా కూడా పెట్టుబడులపై పీక్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ చేసేవన్నీ స్కామ్‌లే! పేరుకు ఒకట్రెండు పెద్ద కంపెనీలకు ఉచితంగా, 99 పైసలకే భూములిస్తున్నట్లు ప్రకటించి ఆ ముసుగులో రూ.వేల కోట్ల విలువైన భూములను తన బినామీలకు కారుచౌకగా దోచిపెడుతున్నారు. పెద్ద కంపెనీల పేర్లతో పబ్లిసిటీ చేసుకుని మరో మార్గంలో ఎల్లయ్యలకో, పుల్లయ్యలకో, తన బినామీలకు అప్పనంగా కట్టబెడుతున్నారు...⇒ వంటవారికి, డ్రైవర్లకు సూటూ బూటూ వేసి కూర్చోబెట్టడం.. ఎంవోయూలు రాయడం.. రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటూ ప్రకటించుకోవడం చంద్రబాబుకు అలవాటే. 2014–19 మధ్య కూడా ఇలాంటి కథలే విన్నాం. ఆర్టీఐ ద్వారా వెల్లడించిన సమాచారం చంద్రబాబు పారిశ్రామిక పబ్లిసిటీ గుట్టును బయటపెట్టింది. 2014–19 మధ్య భారీ పరిశ్రమల్లో రూ.50,708 కోట్లు పెట్టుబడులు క్షేత్రస్థాయిలో కనిపిస్తే 84,333 ఉద్యోగాలు కల్పించారు. అదే మా హయాంలో 2019–24 మధ్య చూస్తే.. దాదాపు రూ.70 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అది గతంలో కంటే 25 శాతం అధికం. దీంతో పాటు 90,230 ఉద్యోగాలు కల్పించాం. ఇక ఎంఎస్ఎంఈలు చూసినా మేం ఐదేళ్లలో 32,79,770 ఉద్యోగాలిచ్చాం. ఈ విషయం సాక్షాత్తూ చంద్రబాబు ప్రభుత్వం రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ (సామాజిక ఆర్థిక) సర్వే రిపోర్ట్‌లోనే ఉంది.⇒ ఇటీవల ఆర్బీఐ నివేదికను పరిశీలిస్తే వైఎస్సార్సీపీ హయాంలో తయారీ రంగం జీవీఏ (స్థూల ఉత్పత్తి విలువ) వృద్ధిలో దేశంలోనే ఏపీ 5వ స్థానంలో నిలిచింది. దక్షిణాది రాష్ట్రాల్లో నాడు నంబర్ వన్‌గా ఉంది. మా హయాంలో తయారీ రంగంలో ఏపీ వృద్ధి రేటు 11.12% ఉంటే, దేశ సగటు వృద్ధి రేటు కేవలం 6.87% మాత్రమే. మా ఐదేళ్ల పాలనలో పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటును గమనిస్తే దేశంలో 8వ స్థానం, దక్షిణాదిలో మొదటి స్థానంలో నిలిచాం. దేశ సగటు 8.96% అయితే ఏపీలో 11.14% ఉంది. అయినా చంద్రబాబు పైశాచిక ఆనందంతో నిత్యం మాపై టన్నుల కొద్దీ బురద వేస్తూనే ఉన్నారు. – వైఎస్ జగన్ -
Special Report: 20 TMC నీటితో ఏం చేయొచ్చో తెలుసా..?
-
రెండో విడత భూసేకరణపై వైఎస్.జగన్ ఆగ్రహం
-
చంద్రబాబు, లోకేష్ లండన్ టూర్ వైఎస్ జగన్ సెటైర్లు
-
రాజధానిలో రెండో దశ భూ సమీకరణ.. వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: అమరావతి రాజధానిలో రెండో దశ భూ సమీకరణపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి దశలో తీసుకున్న భూమినే అభివృద్ది చేయకుండా మళ్లీ రెండో దశ ఎందుకని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్నది పిచ్చి పని అంటూ మండిపడ్డారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వైఖరిని తప్పు పట్టారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్..‘రాజధాని పేరుతో తొలి విడతలో 50 వేల ఎకరాలు తీసుకున్నారు. ఆ భూమి అభివృద్దికే లక్ష కోట్లు అవసరమని చంద్రబాబు చెప్పారు. అది కూడా కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీరు లాంటి మౌళిక సదుపాయాలకే ఖర్చు చేశారు. ఆ లక్ష కోట్లు ఎప్పుడు వస్తాయో? ఎలా వస్తాయో తెలియదు. అప్పట్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు.చంద్రబాబు చర్యలతో భూములు ఇచ్చిన రైతులు బోరుమంటున్నారు. వారికి ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇంకా రెండో దశ పేరుతో భూములు ఎందుకు తీసుకుంటున్నారు?. మరో 50 వేల ఎకరాలు తీసుకుని ఏం చేస్తారు?. ఈ లక్ష ఎకరాల్లో మౌళిక సదుపాయాల కల్పనకే రూ.2 లక్షల కోట్లు అవసరం అవుతాయి. ఈ డబ్బంతా ఎక్కడ నుంచి తెస్తారు?. తాను, తన బినామీలు దోచుకోవటానికే చంద్రబాబు భూములు సేకరిస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: క్రిడెట్ చోరికి బాబు పడరాని పాట్లు: వైఎస్ జగన్ -
తెలంగాణకు జగన్ ఎప్పుడూ అన్యాయం చెయ్యడు..
-
చంద్రబాబుది విలన్ క్యారెక్టర్.. ఆధారాలతో ఏకిపారేసిన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
బాబుకు భయపడి పారిపోతున్న పారిశ్రామికవేత్తలు ఇదిగో కేంద్రం ఇచ్చిన రిపోర్ట్
-
YS Jagan: భోగాపురం కోసం క్రెడిట్ చోర్....ఎంత కష్టం వచ్చింది బాబు
-
YS Jagan : రాయలసీమ ఇరిగేషన్ అవసరం లేదంటూ..
-
విత్ ప్రూప్స్.. మరోసారి బాబు అప్పుల గుట్టు విప్పిన జగన్
-
తప్పేముంది సామీ.. మంచిదే కదా.. రిపోర్టర్ ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్
-
ఏ రోజూ అలాంటి ఆలోచన చేయను: వైఎస్ జగన్
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు అన్నదమ్ముల్లా ఎల్లప్పుడూ కలిసుండాలని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలని తాము కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కొంత మంది నాయకులు సొంత ప్రయోజనాల కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టి రెండు ప్రాంతాల ప్రజల మధ్య గొడవలు పెడుతున్నారని, ఇది ఎంతమాత్రం సరైంది కాదని అన్నారు.''అందరం అన్నదమ్ములం. మనమంతా ఒకటే భాష మాట్లాడుతున్నాం. ఎవరికి ఎవరూ వ్యతిరేకం కాదు. తెలంగాణ ప్రాంతంలోని వారికి నష్టం చేయాలని జగన్ ఏ రోజూ ఆలోచన చేయడు, తపన పడడు, తాపత్రయపడడు. అయితే మా ప్రాంతంలో ఉన్న మా వాళ్లకు మాత్రం నష్టం జరగకుండా చూసుకునే కార్యక్రమం కూడా చేయడం మా ధర్మం. కొత్త రిజర్వాయర్లు ఏమీ కట్టడం లేదు. ఉన్న రిజర్వాయర్లకే నీళ్లు చేర్చగలిగే కార్యక్రమం చేయలేకపోతే చరిత్రహీనులమవుతాం. ఇదే మేం చేస్తున్నాం. ఇందులో ఒక ఎమోషనల్ డ్రామా ప్లే చేసి.. భావోద్వేగాలను రెచ్చగొట్టి, ఇరు ప్రాంతాల ప్రజలకు మధ్య గొడవలు క్రియేట్ చేసే కార్యక్రమం పాలకులుగా ఉన్న కొంతమంది చేస్తావున్నారు. తప్పది. వాస్తవాలు కరెక్ట్‌గా చెప్పాలి. కరెక్ట్‌గా చెప్పినప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు. అందరం అన్నదమ్ముల్లానే కలిసిమెలిసి ఉన్నామ''ని వైఎస్ జగన్ (YS Jagan) అన్నారు. రాయలసీమకు 'చంద్ర'గ్రహణంకాగా, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేసి ఆ ప్రాంత ప్రజలకు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వెన్నుపోటు పొడిచారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. తన స్వార్థ రాజకీయాల కోసం ప్రజా ప్రయోనాలు తాకట్టు పెట్టారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్‌ను చంద్రబాబు దగ్గరుండీ మరి ఖూనీ చేశారని, ఇలాంటి చరిత్రహీనులు దేశంలో ఎవరూ ఉండరని మండిపడ్డారు. తన స్వార్థం కోసం జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు పొడిచారని, రాయలసీమకు 'చంద్ర'గ్రహణం పట్టిందని జగన్ దుయ్యబట్టారు. చదవండి: ఆ 20 టీఎంసీల నీళ్లు ఉంటే..'క్రెడిట్ వితవుట్ కాంట్రిబ్యూషన్'భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో క్రెడిట్ చోరీ (Credir Chori) చేయడానికి చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని పట్టించుకోలేదని, తమ హయాంలో పనులు వేగవంతం చేశామని గుర్తు చేశారు. కోవిడ్ కష్టాల్లో కూడా ఎయిర్‌పోర్టు పనులు ఆగలేదన్నారు. 2026లో భోగాపురం ఎయిర్‌పోర్టులో మొదటి విమానం టేకాఫ్ అవుతుందని 2023లోనే తాను చెప్పిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు మనస్తత్వాన్ని 'క్రెడిట్ వితవుట్ కాంట్రిబ్యూషన్'గా వర్ణించారు. -
బాబు, రేవంత్ చీకటి ఒప్పందం నిజాలు బయటపెట్టిన జగన్
-
రిపోర్టర్ ప్రశ్నకు వైఎస్ జగన్ ఫన్నీ రిప్లై
-
నేను ఆరోజే చెప్పా, 2026లో తొలి ఫ్లైట్ ఎగురుతుందని
-
వైఎస్ జగన్ ను కలిసిన నల్లజర్ల పోలీసు బాధితులు
-
‘బాబు హయాంలో పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్తున్నాయి’
సాక్షి,గుంటూరు: వైఎస్సార్సీపీ హయాంలో పరిశ్రమలు, పారిశశ్రామిక వేత్తలు పారిపోతున్నారని ప్రచారం చేశారు. మా హయాంలో కాదు.. చంద్రబాబు నాయుడు హయాంలో సంస్థలు తరలిపోతుందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఇదే విషయాన్ని ఆర్బీఐ కుండబద్దలు కొడుతూ డిసెంబర్ 11,2025న ఆర్బీఐ నివేదికను విడుదల చేసింది.ఈ సందర్భంగా.. తమ హయాంలో పరిశ్రమలు, పారిశ్రామిక వేత్తలు తరలి వెళ్లాయని చంద్రబాబు అండ్ కో చేసిన విష ప్రచారాన్ని ఖండించారు.ఆర్బీఐ విడుదల చేసిన రిపోర్టులో.. మా హయాంలో మానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్)లో తయారీ రంగంలో భారత్‌లోనే రాష్ట్రం ఐదవ స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీది అగ్రస్థానం.ఇది వాస్తవం. కానీ చంద్రబాబు ఏమంటారు. ప్రతిరోజు తనకున్న పైశాచికానందంతో మాపై టన్నుల కొద్ది బురద జల్లుతుంటారు.వాస్తవం ఏంటంటే?చంద్రబాబు హయాంలో పారిశ్రామికవేత్తలు బెదిరిపోతున్నారన్నది వాస్తవం.పేర్లు చెబుతా రాసుకోండి. సచిన్ జిందాల్,మైహోం సిమెంట్స్,శ్రీ సిమెంట్స్,రామ్‌కో సిమెంట్స్,దాల్మియా సిమెంట్స్,భారతి సిమెంట్స్‌తో పాటు ఇతర పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో ఎక్కడైనా,ఏ జిల్లాలోనైనా చంద్రబాబుకు కప్పం కట్టకపోతే నడపలేరు’ అని తెలిపారు. ప్రెస్ మీట్లో ప్రదర్శించిన ప్రెజెంటేషన్ డాక్యుమెంట్స్ కోసం 👉.. జగన్ హయాంలోనే పారిశ్రామికాభివృద్ధి -
బాబు రెండు బకెట్ల స్కీమ్ అంటా.. జగన్ సెటైర్లే సెటైర్లు
-
భోగాపురంలో వీళ్ళ ఎలివేషన్స్ చూడాలయ్య.. ఏకిపారేసిన వైఎస్ జగన్
-
కుప్పానికి నీళ్లు ఇచ్చింది మనం.. వాళ్లని కూడా బాబు మోసం చేశాడు
-
చిత్తూరులోనే పుట్టి పెరిగావు.. కొంచమైనా సిగ్గు లేదయ్యా చంద్రబాబు
-
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అన్ని అనుమతులు తెచ్చింది మేమే: వైఎస్ జగన్
తాడేపల్లి: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి క్రెడిట్ చోరీకి చంద్రబాబు పడరాని పాట్లు పడతున్నారని వైఎస్సారసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు తొలుత 15 వేల ఎకరాలు.. ఆ తర్వాత 5 వేల ఎకరాలు బాబు కావాలన్నారని, ఆ ఎయిర్‌పోర్ట్‌కు వ్యతిరేకంగా 130 కోర్టు కేసులు కూడా ఉంటే వాటి అన్నింటినీ అధిగమించి దానికి తాను శంకుస్థాపన చేశానన్నారు వైఎస్ జగన్ఈ రోజు(గురువారం, జనవరి 8వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాకే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను వేగవంతం చేశామన్నారు. ‘భోగాపురం ఎయిర్పోర్ట్ భూసేకరణకు రూ. 960 కోట్లు ఖర్చు చేశాం. మేం వచ్చాక భోగాపురం కోర్టు కేసులు పరిష్కరించాం. మా హయాంలోనే నిర్వాసితులకు భూములు కేటాయించాం. భోగాపురం నిర్వాసితులకు కాలనీలు కట్టాం. అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నా అనుమతులు తెచ్చకోలేకపోయారు. మేం అధికారంలోకి వచ్చాక అన్ని అనుమతులు తెచ్చాం. కోవిడ్ కష్టాలలో కూడా ఎయిర్పోర్ట్ పనులు ఆగలేదు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు నేనే శంకుస్థాపన చేశారు. 2026లో మొదటి విమానం ల్యాండింగ్ అవుతుందని ఆనాడే చెప్పా’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై జగన్ స్ట్రాంగ్ కౌంటర్
-
YS Jagan: ఆడియో వీడియోలతో అడ్డంగా దొరికిపోయాడు
-
సొంత రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన చరిత్ర హీనుడు చంద్రబాబు
-
చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు: వైఎస్ జగన్ ధ్వజం
సాక్షి,అమరావతి: రాయలసీమ లిఫ్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. నేడు(గురువారం, జనవరి 8వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్ని తాకట్టు పెట్టారు. ఇలాంటి చరిత్ర హీనులు దేశంలో ఎవరూ ఉండరు. చంద్రబాబు చరిత్ర హీనుగా మిగిలిపోతారు. రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా తాకట్టు పెట్టారో సీఎం రేవంత్ చెప్పారు. రాయలసీమ లిప్ట్ ఆపించామని సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పారు. రాయలసీమ లిఫ్ట్‌పై వాస్తవాలు అందరికి తెలియాలి. రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదని మాట్లాడుతున్నారు. అంటే.. వీళ్లకి రేవంత్‌కు మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. రాయలసీమ లిఫ్ట్ సీమ, నెల్లూరుకు సంజీవిని. వీళ్ల మాటలు చూస్తుంటే మనుషేలా అనిపిస్తుంది. చంద్రబాబు క్లోజ్‌డోర్ మీటింగ్‌లో అడిగినట్లు.. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రే చెప్పారు. చంద్రబాబది ఒక విలన్ క్యారెక్టర్.చంద్రబాబు అండ్ కో బరితెగించి మాట్లాడటం చూస్తుంటే.. రేవంత్‌తో చీకటి ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్లుంది. తన స్వార్థం కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచారు. తన స్వార్థం కోసం జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు పొడిచారు’ అని ధ్వజమెత్తారు.పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావాలంటే.. శ్రీశైలంలో 881 అడుగుల నీటిమట్టం ఉండాలి. పోతిరెడ్డిపాడుకు 7వేల క్యూసెక్కులు రావాలంటే.. 854 అడుగుల ఎత్తులో నీళ్లు తోడుకోవాలి. పోతిరెడ్డిపాడు నుంచి 101 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి.పోతిరెడ్డిపాడు నుంచి 2,3సార్లే నీటిని తీసుకున్నాం. కల్వకుర్తిని 25 నుంచి 50 టీఎంసీఎలకు పెంచారు.పాలమూరు-రంగారెడ్డి,డిండిని డిజైన్ చేశారు.ఎస్ఎల్బీసీ నుంచి మరో 40 టీఎంసీలు తోడుకోవడానికి నిర్మాణాలు, అదనంగా మరో టీఎంసీ తరలింపునకు కూడా తెలంగాణ ప్రణాళికలు. 770 అడుగల నుంచే ఎడమవైపు పవర్ హౌస్ ద్వారా.. మరో 4 టీఎంసీలు ఎడాపెడా తోడేసుకుంటున్నారు. రోజుకు మొత్తం 8 టీఎంసీలు తెలంగాణ తోడుకుంటుంది’ అని స్పష్టం చేశారు. ఓటుకు కోట్లు కేసులో ఆడియో,వీడియోలతో చంద్రబాబు దొరికిపోయారు. చంద్రబాబు నోరు మెదపలేక రాషష్టట్రాన్ని తాకట్టు పెట్టారు. కల్వకుర్తి,ఎస్ఎల్బీసీ, పాలమూరు-రంగారెడ్డి,డిండి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేవు. ఈ పనులు ఆపాలని 2021 అక్టోబర్‌లో ఎన్జీటీ ఆదేశాలిచ్చింది. ఎన్జీటీ ఆదేశాలను తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు. ఆ తర్వాత తెలంగాణకు ఎన్జీటీ రూ.920 కోట్ల పెనాల్టీ వేసింది. శ్రీశైలంలో 777 అడుగుల దగ్గరే తెలంగాణ నీళ్లు తోడుకుంటుంటే.. ఏపీ మాత్రం 834 అడుగుల దగ్గర నీళ్లు తోడుకునే పరిస్థితి. మా ప్రభుత్వం రాకపోవడం రాయలసీమ ప్రజల దురదృష్టంశ్రీశైలానికి ఎప్పుడు 881 అడుగులకు నీరు చేరుకుంటుంది?.సీమ సస్యశ్యామలం కోసమే రాయలసీమ లిఫ్ట్ చేపట్టాం. 800 అడుగుల్లో రోజుకు 3 టీఎంసీలు తోడుకునేలా డిజైన్ చేశాం. రూ. వెయ్యి కోట్లు ఖర్చుచేసి పనులను పరుగులు పెట్టించాం. రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్‌ను అడ్గుకోవడానికి చంద్రబాబే స్వయంగా కేసులు వేయించారు. మా ప్రభుత్వం రాకపోవడం రాయలసీమ ప్రజల దురదృష్టం. రాయలసీమకు చంద్రగ్రహణం పట్టింది. చంద్రబాబే దగ్గరుండి రాయాలసీమ లిఫ్ట్‌ను ఖూనీ చేశారు. 22 టీఎంసీలకు లిఫ్ట్ ఎందుకని చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబుకు బుద్ధి,జ్ఞానం ఉందా?’ శ్రీశైలం నీళ్లను 500 కిలోమీటర్లు తీసుకెళ్లి కుప్పంకు ఇచ్చాం. రాయలసీమకు నీళ్ల కేటాయింపుల మేరకు లిఫ్ట్ ప్రాజెక్ట్.ఆంధ్రా, తెలంగాణ ప్రజలు అన్న దమ్ములం. ఏపీ ప్రజలకు నష్టం జరగకుండా చూడాల్సి ధర్మం ఉంది. తప్పును సరిదిద్దుకోకపోతే చరిత్రహీనులవుతాం. పాలకులు భావోద్వేగాలు రెచ్చగొట్టడం సరైందేనా?.సీమ ప్రాజెక్టులకు ఫుల్‌గా నీళ్లు నింపుకోలేని పరిస్థితి. చంద్రబాబు తప్పును మేం సరిదిద్దుతూ వచ్చాం. సీమ ప్రాజెక్టులకు ఫుల్‌గా నీళ్లు నింపుకోలేని పరిస్థితి. మేం వచ్చాక కెనాల్ల సామర్ధ్యాన్ని కూడా పెంచాం. మేం వచ్చాక పూర్తిస్థాయిలో గండికోటలో నీళ్లు నిల్వ చేశాం. బ్రహ్మంసాగర్‌లో మేం వచ్చాకే 17 టీఎంసీలు నిల్వ చేశాం.బాబు హయాంలో ఏనాడూ నీళ్లు నిల్వ చేయలేదు. వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ఘనత మాదే. సోమశిలలో 78,కండలేరులో 68 టీఎంసీలు నిల్వ చేశాం. పులిచింతలలో కూడా మేం వచ్చాకే 45టీఎంసీలు నిల్వచేశాం. అలాంటి ప్రాజెక్టు పూర్తయితే నాకు పేరొస్తుందని ఆపేశారని’ అన్నారు. -
Watch Live: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్
-
భయపడకు నేనున్నా.. వైఎస్ జగన్ ను కలిసిన నల్లజర్ల పోలీసు బాధితులు
-
జగన్ మళ్లీ సీఎం కావాలంటూ బైక్ యాత్ర
చిత్తూరు జిల్లా : 175 నియోజకవర్గాల్లో పర్యటనలో భాగంగా నగరికి వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం, జలదంకి మండలం అన్నవరం గ్రామానికి చెందిన అడవికొట్టు రాజు బైక్ యాత్ర చేస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో బైక్ యాత్ర చేయడానికి సంకల్పించి గత ఏడాది డిసెంబరు 21న యాత్ర ప్రారంభించిన రాజు, బుధవారం చిత్తూరు జిల్లా నగరికి చేరుకున్నారు. బైక్‌పై వైఎస్ జగన్ చిత్రపటాలు ఉన్న ఫ్లెక్సీలతోను, వైఎస్సార్సీపీ జెండాతో ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్న బైక్‌పై వస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. 97 రోజుల పర్యటన నిమిత్తం బయలుదేరానని జగనన్నపై ఉన్న అభిమానమే ఈ పర్యటనకు కారణమని అడవికొట్టు రాజు తెలిపారు. -
తాజా రాజకీయ పరిణామాలపై నేడు వైఎస్ జగన్ ప్రెస్ మీట్
-
నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నేడు ఆయన మీడియాతో మాట్లాడతారు. -
రేపు వైఎస్ జగన్ మీడియా సమావేశం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రేపు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడతారని వైఎస్సార్సీపీ ఒక ప్రకటనలో తెలిపింది. చంద్రబాబు మోసాలు, రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు, వైఎస్సార్సీపీ శ్రేణులపై కొనసాగుతున్న కూటమి కక్ష రాజకీయాలు, అక్రమ కేసులు.. దాడులు, కూటమి కనుసన్నల్లో పోలీసుల వ్యవహార శైలి, భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ.. తదితర సమకాలీన రాజకీయ అంశాలపై వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. -
కేడర్ ఎవరూ భయపడొద్దు.. నల్లజర్ల బాధితులకు వైఎస్ జగన్ హామీ
సాక్షి, తాడేపల్లి: నల్లజర్ల పోలీసు బాధితులు తాజాగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఘటన అనంతర పరిణామాలను బాధితులు.. వైఎస్ జగన్ కు వివరించారు. పోలీసులు తమను బెదిరించడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, నడిరోడ్డుపై నడిపించిన తీరును కార్యకర్తలు వైఎస్ జగన్ తెలిపారు.అనంతరం పార్టీ కార్యకర్తలతో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్.. కేడర్ ఎవరూ భయపడవద్దు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అక్రమ కేసులు, వేధింపులపై పార్టీ తరఫున న్యాయ సహాయం అందిస్తాం. చట్టాన్ని చేతిలోకి తీసుకుని పోలీసులు వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదు. అక్రమ కేసులు పెట్టిన వారు భవిష్యత్‌లో చట్టప్రకారం తప్పకుండా శిక్ష అనుభవిస్తారు అని హామీ ఇచ్చారు.ఇదిలా ఉండగా.. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆయన ఫ్లెక్సీ వద్ద పొట్టేలు బలి ఇచ్చారంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం వారిపై దారుణంగా కొట్టిన పోలీసులు నడిరోడ్డుపై నడిపించారు. -
టీడీపీ గూండాలు చేసిన అరాచకాలను వైఎస్ జగన్ కు వివరించిన బొమ్మనహాళ్ ఎంపీటీసీలు
-
వైఎస్ జగన్‌ను కలిసిన బొమ్మనహళ్ ఎంపీటీసీలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను బొమ్మనహళ్ ఎంపీటీసీలు కలిశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిసి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా టీడీపీ గూండాలు చేసిన అరాచకాలను ఎంపీటీసీలు వివరించారు. ఎంపీపీ ఎన్నిక సందర్భంగా దౌర్జన్యంగా ఎంపీపీ పదవిని కైవసం చేసుకున్న తీరును చెప్పుకొచ్చారు.అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి. ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా జరపాల్సిన ఎన్నికను ఇలా అప్రజాస్వామిక పద్దతిలో గెలుపొందడం దారుణం. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్, హైకోర్టు దృష్టికి తీసుకువెళ్దామన్నారు. ఇదే సమయంలో రాయదుర్గంలో జరిగిన అరాచకాలపై కూడా వైఎస్ జగన్ ఆరా తీశారు. పార్టీ ఇంఛార్జ్ మెట్టు గోవిందరెడ్డిపై జరిగిన దాడి గురించి ఆయన కుమారుడు విశ్వనాథ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. -
పవన్ కళ్యాణ్ కు భారీ షాక్ ఇచ్చిన జనసేన నాయకులు
-
జనసేనకు బిగ్ షాక్.. వైఎస్సార్సీపీలోకి చేరికలు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో అధికార కూటమి ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు ఎదురుదెబ్బ తగిలింది. జనసేనకు చెందిన పలువురు కీలక నేతలు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ నేపథ్యంలో జనసేన నేతలకు వైఎస్సార్సీపీ కండువా కప్పి.. వైఎస్ జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో చింతలపూడి నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. ఏబండారు గంగాసురేష్, ఆనెం సుభాష్, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన జడ్డు దామోదర్ సహా పలువురు నేతలు.. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, చింతలపూడి వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ కంభం విజయరాజు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాధరావు, జంగారెడ్డిగూడెం వైఎస్సార్సీపీ నేత బీవీఆర్ చౌదరి పాల్గొన్నారు. -
చంద్రబాబు పీడిత రాయలసీమ!
‘ప్రాంతేతరుడు మోసం చేస్తే,ప్రాంతం పొలిమేరల వరకూ తరిమి కొడతాం. ప్రాంతం వాడే మోసం చేస్తే, ప్రాంతం లోపలే పాతిపెడతాం’ అంటూ ఎలుగెత్తి చాటిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి స్ఫూర్తిదాయకమైన మాటలు... రాయలసీమ సమాజం చెవుల్లో మార్మోగుతున్నాయి. అంతేకాదు, రాయలసీమ ప్రాంతంలో పుట్టి, పెరిగి, రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి, పాలకుడిగా ఇప్పుడా ప్రాంతానికే ద్రోహం తలపెట్టిన చంద్ర బాబును ఏం చేయాలో అనే అంతర్మథనంలోనూ రాయలసీమ ఉంది. దశాబ్దాలుగా రాయలసీమ ప్రాంతాన్ని జలగలా పట్టి పీడిస్తున్న కరవు రక్కసిని పారదోలాలనే దివంగత ప్రియతమ నేత, తన తండ్రి వైఎస్సార్ ఆశయాన్ని, ఆకాంక్షను నెరవేర్చడానికి మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్’కు 2020 మే 5న శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీల నీటితో పాటు కరవు ప్రాంతమైన రాయల సీమలో 9.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం నిర్దేశించుకోవడం వైఎస్ జగన్ గొప్ప ఆశయానికి నిదర్శనం.అప్పుడే పూర్తయ్యేది!శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ. 3,825 కోట్ల ఖర్చుతో ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. మొదటి దశలో పనులు చేపట్టాలని 2023 ఆగస్టు 11న అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే లోకం సుభిక్షంగా ఉండేందుకు దేవతలు యజ్ఞాలు చేస్తుంటే, రాక్షసులు విఘ్నాలు కలిగించిన చందంగా... రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకుండా నాడు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు తన మనుషుల ద్వారా ఎన్జీటీలో పిటిషన్ వేయించి, అడ్డు తగిలారు. అయితే మహాభారతంలో అర్జునుడి లక్ష్యం చెట్టుపై ఉన్న పక్షి కన్నుపై తప్ప, కొమ్మలపై కానట్టుగా... పార్థుడి లాంటి వైఎస్ జగన్ దృష్టి ప్రాజెక్ట్ పనులపై మాత్రమే ఉండింది. అందుకే చంద్రబాబు సృష్టించిన ఆటంకాలను లెక్క చేయకుండా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని శరవేగంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకున్నారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం 2024 ఎన్నికల తర్వాత కొనసాగి ఉంటే, ఈ పాటికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తయి, రాయలసీమంతా సస్యశ్యామలం అయ్యేది. కరవు పీడిత ప్రాంత రైతాంగం జీవన రూపురేఖలే పూర్తిగా మారిపోయేవి. కానీ రాయలసీమతో పాటు ఆంధ్రప్రదేశ్ సమాజంలో వెలుగులు నింపే వైఎస్ జగన్ పరిపాలనా దీపాన్ని... అబద్ధాలు, విష ప్రచారం ద్వారా కూటమి కొండెక్కించేసింది. తద్వారా వైఎస్ జగన్ కంటే, ఎక్కువగా తామే నష్టపోవాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్ సమాజం ఆవేదన చెందుతోందన్నది ముమ్మాటికీ నిజం.మాతృగడ్డకే ద్రోహమా?ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం ద్వారా... మొదటి బాధిత ప్రాంతంగా రాయలసీమ రికార్డులకెక్కింది. రాయలసీమ వాసిగా, ఆ ప్రాంతా నికి తీరని ద్రోహం చేసిన పాలకుడిగా సమాజం అతడిపై మండి పడుతోంది. రాజకీయ ప్రత్యర్థి అయిన మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు మాలాంటి నాయకులపై ‘చంద్రబాబు అండ్ కో’కు కోపం ఉండొచ్చు. ఒకవేళ మాపై కోపాన్ని తీర్చుకోవాలంటే అధికారాన్ని యథేచ్ఛగా వాడుకోవచ్చు. ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మాకున్నాయి.కానీ కరవు ప్రాంతంపై చంద్రబాబు ప్రతాపం ఎందుకో అర్థం కావడం లేదు. అధికారాన్ని తాను పుట్టిన ప్రాంతానికి ద్రోహం తలపెట్టడానికి దుర్వినియోగం చేయడం ఎంత మాత్రం క్షమార్హం కాదు. బహుశా దేశ చరిత్రలో మరే నాయకుడూ తనకు రాజకీయ, అధికార భిక్షమేసిన మాతృగడ్డకు చంద్రబాబు మాదిరిగా వెన్ను పోటు పొడిచి ఉండరంటే అతిశయోక్తి కాదు. పిల్లనిచ్చిన మామకే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఇంతకాలం ఆయనపై మచ్చ ఉంది. ఇప్పుడు దానికంటే మించిన మచ్చ, అప్రతిష్ఠ చంద్రబాబుకు దక్కాయి. నిత్యం కరవు కాటకాలతో అల్లాడుతున్న రైతాంగం జీవితాలను మార్చేందుకు, కృష్ణా నీళ్లతో బీడు భూముల్ని తడిపేందుకు భగీ రథుడిలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యజ్ఞం తలపెట్టగా, రాక్షసుడి మాదిరిగా చంద్రబాబు ఆటంకాలు సృష్టించారు. తన రాజకీయ శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కోరిన వెంటనే, తన అబ్బ సొత్తు అన్నట్టుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనుల్ని అర్ధంతరంగా ఆపివేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి పనులు చేయడానికి మాత్రమే చంద్రబాబు నాయకత్వంలోని కూటమికి అధికారం కట్టబెట్టారు. అంతే తప్ప, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కోరినట్టు నడుచుకోవడా నికి కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాళోజీ చెప్పినట్టు...రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల నిలిపివేతతో, ఇవాళ కరవు పీడిత ప్రాంతం తీవ్రంగా నష్టపోతోంది. మళ్లీ వలసలు తప్పడం లేదు. మరోవైపు ఉపాధి హామీ పథకానికి కూడా కోరలు కట్ చేసిన పరిస్థితి. రాయలసీమ ప్రాంతంపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష? గత ఎన్నికల్లో అత్యధిక ఎమ్మెల్యే స్థానాల్ని కూటమికే కట్టబెడితే, రిటర్న్ గిఫ్ట్‌గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను లేకుండా చేస్తారా? ఇదెక్కడి అన్యాయం? ఈ దుర్మార్గానికి ఏం పేరు పెడితే సరిపోతుందో విజ్ఞులైన రాయలసీమ ప్రజలు ఆలోచించాలి. రాయలసీమ ప్రాంతం నీళ్ల కోసం అలమటిస్తోంది. అందుకే దివంగత వైఎస్సార్ హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు అప్పట్లో పెంచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 80 వేల క్యూసెక్కులకు పెంచి, రాయలసీమ ప్రాంత కరవు పారదోలడానికి పనుల్ని వేగవంతం చేశారు. ఇదీ రాయలసీమను కరవు రక్కసి నుంచి తరిమికొట్టడానికి జగన్ నిబద్ధత. చంద్రబాబు మాత్రం... తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ రాయలసీమ కరవును పారదోలాలని ఆలోచించలేదు. కానీ వైఎస్ జగన్ తీర్చిదిద్దిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను మాత్రం తన రాజకీయ శిష్యుడైన రేవంత్ రెడ్డి కోసం లిఫ్ట్ చేయ డానికి అత్యుత్సాహం ప్రదర్శించారు. అందుకే చంద్రబాబును రాయలసీమ పాలిట పీడకుడని చెప్పడం! తమ ప్రాంతానికి మిత్రులెవరో, శత్రువులెవరో ప్రజలకు రేవంత్ రెడ్డి మాటలతో స్పష్టమైంది. సొంత ప్రాంతం వాడే ద్రోహం చేస్తే, ఏం చేయాలో మహాకవి కాళోజీ మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని నిర్ణయించుకోవా ల్సింది రాయలసీమ సమాజమే!భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త తిరుపతి మాజీ ఎమ్మెల్యే -
నల్ల మస్తానయ్య ఉరుసు ఉత్సవాలకు వైఎస్ జగన్‌కు ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: గుంటూరులోని హజరత్ కాలే మస్తాన్ షా అవులియా బాబా(నల్ల మస్తానయ్య) 134వ ఉరుసు ఉత్సవాలు నేడు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. హజరత్ కాలే మస్తాన్‌షావలి దర్గా ధర్మకర్త రావి రామ్మోహనరావు పలువురు వైఎస్సార్సీపీ నేతలతో కలిసి తాడేపల్లి వెళ్లి వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు. ఉరుసు నేపథ్యంలో మస్తాన్ బాబాకు చాదర్ (శేషవస్త్రం), చందనం, శాండిల్ ఆయిల్ సమర్పించారు వైఎస్ జగన్. ఆ సమయంలో గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు, రావి రామ్మోహన రావు సతీమణి డూండేశ్వరి, బుర్రా సత్యనారాయణ రెడ్డి, తుమ్మూరు షమిత్ సాయి గణేష్ రెడ్డి, రావి జ్జానేశ్వర్ బావాజీ మస్తాన్ రావు, గుంటూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ తదితరులు ఉన్నారు. హజ్రత్ కాలే మస్తాన్ షా ఔలియా బాబా గుంటూరు నగరంపాలెంలో ఉన్న ప్రసిద్ధ సూఫీ సంత్. ఆయన్ని హిందూ ముస్లింలు ఐక్యంగా ఆరాధిస్తారు. ఈ ఉరుసు ఉత్సవాలు నేటి నుంచి 10 వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాల చివరి రోజున బాబా ఆశీసులైన కుర్చీని యథాస్థానంలో ఉంచడంతో ఉత్సవాలు ముగుస్తాయి. -
రేవంత్ మాట.. బాబు గుట్టు!
కాలం కలిసిరాకపోతే తాడే పామవుతుందట. పాపం... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిప్పుడు ఈ సామెతను పదే పదే తలచుకుంటూ ఉండి ఉంటారు. ఎందుకంటే... పోతిరెడ్డిపాడు వద్ద గత ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తన కోరిక మీద చంద్రబాబు నిలిపివేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా ఆ రాష్ట్ర శాసనసభలోనే ప్రకటించారు. కావాలని చెప్పారో, క్రెడిట్ కోసం చెప్పారో, అనుకోకుండా చెప్పేశారో తెలియదు కాని... ఈ నిజం కాస్తా చంద్రబాబు ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీసేసింది. తెలంగాణ ప్రజల మెప్పు కోసం లేదంటే బీఆర్ఎస్పై పైచేయి కోసం రేవంత్ అసలు వాస్తవాన్ని ఒప్పుకోవడంతో చంద్రబాబు కాస్తా రాయలసీమ ద్రోహిగా ముద్రపడిపోయారు. రాయలసీమ కరువు శాశ్వత నివారణకు వృథా అవుతున్న కృష్ణా జలాల సద్వినియోగమే మేలైన మార్గమని నమ్మిన గత ముఖ్యమంత్రి జగన్ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. వరద వచ్చినప్పుడు రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లలో నిల్వ చేయాలన్నది ఈ పథకం ఉద్దేశం. దీనిపై తెలంగాణ రాజకీయ పార్టీల నేతలు అప్పట్లోనే విమర్శలు చేసినా జగన్ దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు. తమకు కేటాయించిన నీటిలోనే తీసుకుంటామని, పైగా వరద నీరు సముద్రంలో కలిసే బదులు వాడుకుంటే మంచిది కదా అని వాదించేవారు. తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా తీసుకుంటున్నట్లే తాము కూడా అదే 800 అడుగుల నీటి మట్టం వద్ద నీటిని తీసుకుంటే తప్పేమిటని ప్రశ్నించేవారు.నిజానికి పోతిరెడ్డిపాడు వల్ల తెలంగాణకు నష్టమేమీ ఉండదన్నది నిపుణుల అభిప్రాయం.కాకపోతే నదీ జలాల పంపిణీపై ట్రిబ్యునల్ ఏర్పడినట్లు ఈ స్కీమ్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి ఎక్కువ వాటా ఇవ్వాల్సి వస్తుందన్నది తెలంగాణ అభ్యంతరం. అయినా ఏ రాష్ట్రం అయినా తన సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుంది. అదే రీతిలో జగన్ రాయలసీమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ను ముందుకు తీసుకువెళ్లారు. ఆ తరుణంలో రేవంత్ రెడ్డే అప్పట్లో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంతమందితో ఎన్జీటీకి ఫిర్యాదు చేయించారని అనేవారు. టీడీపీ అనుకూలంగా ఉన్నవారే ఈ స్కీమ్‌పై ఫిర్యాదు చేసినా చంద్రబాబు నాయుడు పట్టించుకోకుండా మౌనంగా ఉన్నారన్న విమర్శ వచ్చేది. ఏడువేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును శరవేగంగా చేయడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చింది. అయినా తాగు నీటి అవసరాల పేరుతో ఈ స్కీమును కొనసాగించారు. దాదాపు 85 శాతం పనులు పూర్తి చేయించారు. అంతలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయి, టీడీసీ. జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి రావడంతో ఈ స్కీమ్ కు గ్రహణం పట్టినట్లయింది. కేంద్రంలో కూడా ఇదే కూటమి పాలిస్తున్న నేపథ్యంలో స్కీమ్‌ను కొనసాగించి ఉంటే చంద్రబాబుకు మంచి పేరు వచ్చేది. కాని ఆ పని చేయకపోగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిక మేరకు ఈ ప్రాజెక్టును నిలిపివేశారు. పర్యావరణానికి సంబందించి కేంద్రం నిర్వహించిన సమావేశంలో ఏపీ ప్రభుత్వం తన వాదనను వినిపించలేదని ఫలితంగా అనుమతులు రాలేదని, దానివల్ల రాయలసీమకు తీరని నష్టం వాటిల్లుతుందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి లోక్‌సభలోనే చెప్పారు. ఎందుకు ఏపీ ప్రభుత్వం అలా చేసిందన్నదానికి ఇప్పుడు సమాధానం దొరికినట్లయింది. రేవంత్, చంద్రబాబులు ఏకాంతంగా భేటీ అయి తీసుకున్న నిర్ణయమట. తనమీద గౌరవంతో చంద్రబాబు ఈ పని చేశారని రేవంత్ చెప్పారు. ఇది రేవంత్ మీద గౌరవంగా చూడాలా? లేక రాయలసీమ ప్రజల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ది కొరవడడంగా చూడాలా? అందరూ వీరిద్దరి సంబంధంగా చూస్తారు. గత శాసనసభ ఎన్నికల సమయంలో టీడీపీ తెలంగాణలో పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. రేవంత్‌ను కాంగ్రెస్ లోకి పంపడం మొదలు, ఆయన ముఖ్యమంత్రి అవడం వరకు చంద్రబాబు పాత్ర ఉందని చాలామంది చెబుతుంటారు. తాజాగా జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో సైతం తెలుగుదేశం పార్టీ మాత్రం తన మిత్రపక్షమైన బీజేపీకి కాకుండా కాంగ్రెస్‌కే అనుకూలంగా పనిచేసిందన్నది బహిరంగ రహస్యం. రాజకీయంగా ఇంతగా కలిసిపోయిన చంద్రబాబు, రేవంత్‌లు రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పనిచేస్తే ఫర్వాలేదు. ఇప్పటి వరకు తెలంగాణలో చంద్రబాబు చెప్పినట్లే రేవంత్ ప్రభుత్వం నడుస్తోందని అనుకునేవారు. తాజాగా ఈ రేవంత్ ఈ సమాచారం వెల్లడించడంతో కొత్త అనుమానాలు వస్తున్నాయి. రేవంత్ చెప్పినట్లు ఏపీలో చంద్రబాబు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారన్న భావన కలుగుతుంది. అందులో ఇది ఒకటి. కాకపోతే ఈ రహస్యం రేవంత్ చెప్పేస్తారని చంద్రబాబు ఊహించి ఉండరు. దీనివల్ల ఏపీలో చంద్రబాబుకు రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా రేవంత్ ఈ గుట్టు విప్పడం విశేషం. ఏపీ నీటి ప్రయోజనాలను పణంగా పెట్టి మరీ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఆపేయడం వెనుక కారణాలేమిటి అన్న ప్రశ్న సహజంగానే వస్తుందని ఇప్పటికే వైసీపీ నేతలు పలువురు ఈ అంశంలో చంద్రబాబు తీరును ఎండగడుతూ విమర్శలు చేస్తున్నారు. కొందరైతే చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు, రేవంత్‌కు 2009 నుంచి సంబంద బాంధవ్యాలు ఏర్పడ్డాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లవలసి వచ్చింది.అయినా చంద్రబాబు ఆ కేసులో ఇబ్బంది పడకుండా రేవంత్ సహకరించారని చెబుతారు. అప్పటి నుంచి వీరి మధ్య దోస్తి బాగా కుదిరిందని రాజకీయవర్గాలు నమ్ముతాయి. చంద్రబాబు నాయుడు కుటుంబ వ్యాపార ప్రయోజనాలు కూడా తెలంగాణలో అధికంగా ఉన్నాయి. కారణం ఏమైనా చంద్రబాబు ఈ విధంగా రాయలసీమకు అన్యాయం చేయడానికి కూడా సిద్దపడడంం దారుణమనిపిస్తుంది. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు జవాబు ఇవ్వకపోవడం గమనార్హం. జగన్ ఒక విజన్‌తో రాయలసీమ అభివృద్దికి, నీటి సమస్య తీర్చడానికి ప్రయత్నిస్తే చంద్రబాబు మాత్రం ఎంతసేపు రాజకీయాలకే ప్రాముఖ్యత ఇస్తుంటారన్న విషయం మరోసారి తేటతెల్లమవుతుంది. పైకి మాత్రం రాయలసీమను రత్నాల సీమ చేస్తానని చెబుతుంటారు. చంద్రబాబు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కొత్తగా ఒక్క ఇరిగేషన్ స్కీమ్ తీసుకురాలేదు. ఉన్నవాటిని పూర్తి చేయలేదు. ఎన్నికల సమయాలలో మాత్రం శంకుస్థాపనల హడావుడి చేస్తుంటారు. 1999 ఎన్నికలకు ముందు ఇలాగే పలు స్కీమ్‌లకు శంకుస్థాపనలు చేసి పట్టించుకోకపోతే అప్పటి విపక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2002 ప్రాంతంలో శిలాఫలకాల వద్ద పూలు పెట్టి వచ్చి నిరసన తెలిపారు. తదుపరి తాను సీఎం అయ్యాక ఆయన చేపట్టిన తొలి కార్యక్రమం జలయజ్ఞం. తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్రలలో వివిద ప్రాజెక్టులు చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు ఈ దశకు రావడానికి, జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషి అని చెప్పక తప్పదు. ఆ రోజుల్లో పోతిరెడ్డిపాడు వద్ద నీటి తరలింపు సామర్ధ్యం 44వేల క్యూసెక్కులకు పెంచడానికి పనులు ఆరంభిస్తే తెలుగుదేశం పార్టీ ప్రకాశం బ్యారేజీ వద్ద నిరసన తెలిపింది. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు దానికి వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాశారు. చంద్రబాబు వారినెవరిని వారించ లేదు. తదుపరి జగన్ ముఖ్యమంత్రి అయి తీసుకువచ్చిన రాయలసీమ లిఫ్ట్‌కు చంద్రబాబే నిలిపివేశారంటే ఏమనుకోవాలి. ఈ మధ్యకాలంలో రెండు రాష్ట్రాలు నీటిని మసర్ధంగా వాడుకోవాలని అంటూంటారే ఎందుకు చెబుతున్నారా అన్న సందేహం వచ్చింది. ఇప్పుడు అసలు విషయం బోధపడినట్లయింది. తెలంగాణ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం ఒక సంగతి అయితే, ఏపీలో రాయలసీమ ప్రాజెక్టుకు మంగళం పలకడం మరో ఎత్తు. గోదావరి-బనకచర్ల స్కీమ్ అని కొన్నాళ్లు హడావుడి చేశారు. దాంతో ఏపీ రూపురేఖలు మారిపోతాయని భ్రమలు పెట్టడానికి యత్నించారు.తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించగానే, దానిని మానుకుని ఇప్పుడు గోదావరి నుంచి నల్లమల సాగర్ ప్రాజెక్టు అంటూ కొత్త గాత్రం అందుకున్నారు. ఇది కూడా సుమారు అరవైవేల కోట్ల ప్రాజెక్టు అట. ఇది ఎప్పుడు ఆరంభం అవుతుందో, ఎప్పటికి పూర్తి అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఈలోగా తెలంగాణ ప్రభుత్వం దీనికి అభ్యంతరం తెలిపింది.నిజానికి ఈ భారీ స్కీమ్ లపై చంద్రబాబుకు నమ్మకం ఉండి చేపడుతున్నారని చెప్పజాలం.కేవలం రాజకీయ ప్రయోజనాలు, ఇతరత్రా కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తుంటారని ఆయన ప్రత్యర్ధులు విమర్శిస్తుంటారు. ఒక్కటి మాత్రం నిజం. చంద్రబాబుకు గతంలో అసలు భారీ నీటి ప్రాజెక్టులంటే పెద్దగా నమ్మకం లేదు. ఎన్నికలలో అవి ఫలితాలు ఇవ్వవన్నది ఆయన భావన. టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్న దివంగత నేతలు ఎర్రా నారాయణస్వామి, వడ్డి వీరభద్రరావు వంటి వారు ఆ రోజుల్లో పోలవరం ప్రాజెక్టుకోసం ఎన్ని ఉద్యమాలు చేసినా చంద్రబాబు మాత్రం కిమ్మనే వారు కారు. వైఎస్ అధికారంలోకి వచ్చాకే పోలవరం ప్రాజెక్టు సాకారం అవడం ఆరంభం అయింది. ఏది ఏమైనా రాయలసీమ ప్రజలకు రేవంత్ చెప్పిన విషయం పిడుగుపాటు వంటిది.అదే టైమ్ లో టిడిపి,జనసేన,బిజెపి కూటమి ప్రభుత్వం రాయలసీమకు తీరని ద్రోహం చేసిందన్న సంగతి నిర్దారణ అవుతుంది.ఈ కూటమిని రాయలసీమ ప్రజలు ఇంకా క్షమిస్తారా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
భోగాపురం ఎయిర్‌పోర్టు ఘనత ముమ్మాటికీ జగన్‌దే
మహారాణిపేట: భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ ఘనత ముమ్మాటికీ వైఎస్ జగన్‌దేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. సోమవారం మద్దిల పాలెంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో చంద్రబాబు కంట్రిబ్యూషన్ ఏమీలేదని విమర్శించారు. టీడీపీ నేతలు సిగ్గు లేకుండా భోగాపురం క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. క్రెడిట్ చోరీకి పాల్పడడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. కేవలం ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికే 2019 ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు అప్పటి సీఎం చంద్రబాబు హడావుడిగా ఎయిర్‌పోర్టు పనులకు శంకుస్థాపన చేశారన్నారు.భూసేకరణ, అనుమతులు, ఆర్థిక వనరులు లేకుండా ఏ రకంగా నిర్మాణం చేద్దామని అప్పట్లో బాబు శంకుస్థాపన చేశారో తెలీదని విమర్శించారు. 2019లో వైఎస్ జగన్ హయాంలోనే ఎయిర్‌పోర్టు కోసం భూసేకరణతోపాటు అన్ని అనుమతులు సాధించిన తర్వాతే 2023 మే 3న నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని స్పష్టం చేశారు. అదేరోజు జూన్ 2026 నాటికి ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారని చెప్పారు. అందులో భాగమే ఆదివారం జరిగిన విమాన ల్యాండింగ్ ట్రయల్ రన్ అని అమర్నాథ్ స్పష్టం చేశారు. ఇదే జగన్ విజన్‌కి తార్కాణమన్నారు. నిర్వాసితులకూ వైఎస్సార్సీపీ హయాంలో న్యాయం చేస్తూ.. నాలుగు గ్రామాల ప్రజలకు పరిహారం, మౌలిక సదుపాయల కల్పన కోసం సుమారు రూ.500 కోట్లు ఖర్చు పెట్టి రెండుచోట్ల కాలనీలు నిరి్మంచిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా టీడీపీ నేతలు నిస్సిగ్గుగా ఆ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడంతోపాటు ఎయిర్‌పోర్టు విషయంలో కట్ పేస్ట్ వీడియోలతో జగన్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. రీల్స్ రామ్మోహన్‌ను పంపిస్తే ఆయనేమో తన ఘనతగా తాను సాధించినట్లుగా ఫీలవుతున్నారని విమర్శించారు. విజయవాడ విమానాశ్రయాన్ని ఏళ్లతరబడి కడుతున్నారని, మరి దానిని రామ్మోహన్నాయుడు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎవరికో పుట్టిన బిడ్డకు తమ పేరు పెట్టుకోవడం వారికి అలవాటు అని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. కుప్పంలో ఎయిర్ పోర్టు మాటేమిటి? ‘అమరావతిలో కొత్తగా ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్ నిరి్మస్తామని బాబు అంటున్నారు. ఇంకా వింటే పోర్టు కూడా కడతామని చెబుతారు. మీ సొంత నియోజకవర్గం కుప్పంలో ఎయిర్ స్ట్రిప్కి సంబంధించి 2019 జనవరిలో శంకుస్థాపన చేశారు. అది ప్రారంభమైందా? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మంచి రోడ్ కనెక్టివిటీ ఉండాలని వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కి హాజరైన కేంద్రమంత్రి గడ్కరీని ఒప్పించి ప్రకటన చేయించాం. ఈ ఘనత జగన్‌కే దక్కుతుంది. భోగాపురం విమానాశ్రయానికి ఆరులేన్ల జాతీయ రహదారి ఏమైపోయింది.బాబు అధికారంలోకి రాగానే మెట్రో, పోర్టు, ఎయిర్‌పోర్టు అని చెప్పడం పరిపాటిగా మారింది. విశాఖ మెట్రో గురించి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఫీజుబులిటీ రిపోర్ట్ లేదు, మరోసారి పంపించాలని చెప్పింది. దీన్నే చంద్రబాబు 2029 ఎన్నికల వరకు తిప్పి.. ఎన్నికల ముందు టెంకాయ కొడతారు. అమరావతిలో మాత్రం ఆవకాయ్ అంటారు. ఏ ప్రాజెక్టుకైనా ముందు టెంకాయ్ నాదే అనడం బాబు అలవాటు. మంగళగిరిలో పప్పు, అమరావతిలో ఆవకాయ్.. ఆంధ్రాకు అప్పులు, చంద్రబాబు గొప్పలు తప్ప ఇంతకుమించి ఈ రెండేళ్లలో సాధించిందేమీ లేదు’ అని అమర్నాథ్ ధ్వజమెత్తారు. విజన్ అంటే జగన్.. భజన అంటే బాబు‘విజన్ అంటే జగన్, భజన అంటే చంద్రబాబు అన్న విషయం ఈ రెండేళ్లలో రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. పబ్లిసిటీ తప్ప మరోకటి లేదు. ఏ చానెల్ పెట్టినా బాబుకు జాకీర్ హుస్సేన్ని మించి తబలా కొట్టేవాళ్లు తయారు అయ్యారు. ఇంత డప్పు కొట్టినా.. రాష్ట్రం మాత్రం అప్పులపాలైంది. రెండేళ్లలో రూ.3 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆ రోజు జగన్‌కి ఇచ్చిన మాట ప్రకారం జీఎమ్మార్ సంస్థ ఈ ప్రాంత ప్రజల ఆశలను నిజం చేసింది. ఆ సంస్థకు ధన్యవాదాలు’ అని అమర్నాథ్ పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్య పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని అరాచక రాజ్యంగా మార్చారు
సాక్షి, అమరావతి: ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని మండిపడ్డారు. దేశానికి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే సీఎం చంద్రబాబు... రాష్ట్రాన్ని అరాచక, ఆటవిక రాజ్యంగా మార్చినందుకు సమాధానం చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో సోమవారం ఆయన పోస్ట్ చేశారు. ‘‘ఒక చిన్న ఎంపీపీ ఎన్నికలో కూడా ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా ఖూనీ చేస్తున్న తీరు, ఎన్నికలను ప్రజాస్వామ్య ప్రక్రియకు బదులుగా బల ప్రదర్శన వేదికగా మార్చిన వైనం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ తీవ్ర దురహంకారాన్ని, ప్రమాదకర స్వభావాన్ని బట్టబయలు చేస్తోంది’’ అని అన్నారు.‘‘ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు ఎంపీపీ ఎన్నికలో ఓటు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను నడిరోడ్డుపై అడ్డుకోవడమే కాకుండా, వారిపై దాడి చేశారు. దీంతో ఒక మహిళా ఎంపీటీసీ తీవ్రంగా గాయపడ్డారు. ఒక సభ్యుడిని కిడ్నాప్ చేశారు. మరొకరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వీటన్నింటి వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం... ఎంపీపీ ఎన్నికలో వారిని ఓటు వేయకుండా ఆపడమే.ఒక భయాందోళన పరిస్థితి సృష్టించి, బల ప్రయోగంతో వారి ఓటు హక్కును అడ్డుకోవడమే. ప్రజల గొంతును అణచివేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాతరేయడానికి ఒక పథకం ప్రకారం చేసిన ప్రయత్నం ఇది. ఇలాంటి అప్రజాస్వామిక సంఘటనల సమయంలో... పోలీసులు టీడీపీ చేతిలో కీలుబొమ్మల్లా వ్యవహరిస్తూ, అధికార పార్టీకి బహిరంగంగా మద్దతిస్తూ, ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడడంలో విఫలమవుతున్నారు’’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. మౌన ప్రేక్షకుల్లా ఎన్నికల అధికారులు ‘‘రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలో కూడా అదే పరిస్థితి చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను నిర్బంధించి దూరంగా ఉంచారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల అధికారులు, పోలీసులు మౌన ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు బాసటగా నిలిచి, ఎంపీపీ ఎన్నికను బలవంతంగా పూర్తి చేశారు’’ అని జగన్ ధ్వజమెత్తారు.‘‘ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల కిడ్నాప్, వారిపై బహిరంగంగా దాడి, పోలీసు వ్యవస్థను దుర్వీనియోగం చేయడం, ఎన్నికల ప్రక్రియను పూర్తిగా అనుకూలంగా మార్చుకోవడం టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో సర్వసాధారణమైపోయింది. ఒక చిన్న స్థానిక సంస్థ పరోక్ష ఎన్నికలోనే ప్రజాస్వామ్యం పరిస్థితి ఇలా ఉందంటే ఈ ప్రభుత్వం ఎంత అధికార దుర్వీనియోగం చేస్తోందో తేటతెల్లం అవుతోంది. ఎంత ప్రజాస్వామ్య వ్యతిరేకిగా మారింది అన్న విషయాన్ని చాటుతోంది’’ అని జగన్ అన్నారు. -
ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూటమి దౌర్జన్యం.. వైఎస్ జగన్ సీరియస్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దౌర్జన్యంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. దేశానికి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే చంద్రబాబునాయుడు, రాష్ట్రాన్ని అరాచక, ఆటవిక రాజ్యంగా మార్చినందుకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘ఎంపీపీ ఉప ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వం దౌర్జన్యం. ఒక చిన్న ఎంపీపీ ఉప ఎన్నికలో కూడా ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా ఖూనీ చేస్తున్న తీరు, ఎన్నికలను ప్రజాస్వామ్య ప్రక్రియకు బదులుగా బలప్రదర్శన వేదికగా మార్చిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వపు తీవ్ర దురహంకారాన్ని, ప్రమాదకరమైన స్వభావాన్ని బట్టబయలు చేస్తోంది.‘ఉదయగిరి నియోజకవర్గం, వింజమూరు మండలంలో, ఎంపీపీ ఉప ఎన్నికలో ఓటు వేయడానికి వెళ్తున్న మా వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను నడిరోడ్డుపై అడ్డుకోవడమే కాకుండా, వారిపై దాడి చేశారు. దీంతో ఒక మహిళా ఎంపీటీసీ తీవ్రంగా గాయపడ్డారు. ఒక సభ్యుడిని కిడ్నాప్ చేశారు. మరొకరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వీటన్నింటి వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం, ఆ ఎంపీపీ ఉప ఎన్నికలో వారు ఓటు వేయకుండా ఆపడమే. అలా ఒక భయాందోళన పరిస్థితి సృష్టించి, బల ప్రయోగంతో వారి ఓటు హక్కును అడ్డుకోవడమే. తద్వారా ప్రజల గొంతును అణచి వేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాతరేయడానికి ఒక పథకం ప్రకారం చేసిన ప్రయత్నం ఇది. ఇలాంటి అప్రజాస్వామిక సంఘటనల సమయంలో, పోలీసులు టీడీపీ చేతిలో కీలుబొమ్మల్లా వ్యవహరిస్తూ, అధికార పార్టీకి బహిరంగంగా మద్దతు ఇస్తూ, ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడటంలో విఫలమవుతున్నారు’.Even in a small MPP election, the way democracy is being brutally murdered exposes the extreme high-handedness of the TDP and the dangerous nature of the coalition government led by @ncbn, who has reduced elections to a show of force instead of a democratic process.In Udayagiri… pic.twitter.com/aVzxEkRijx— YS Jagan Mohan Reddy (@ysjagan) January 5, 2026‘రాయదుర్గం నియోజకవర్గం, బొమ్మనహల్ మండలంలో కూడా అదే పరిస్థితి చోటు చేసుకుంది. మా వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను నిర్బంధించి దూరంగా ఉంచారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు, ఎన్నికల అధికారులు మూగ ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. అలా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు బాసటగా నిల్చి, అక్కడ ఎంపీపీ ఉప ఎన్నికను బలవంతంగా పూర్తి చేశారు’.‘ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కిడ్నాప్ చేయడం, వారిపై బహిరంగంగా దాడి చేయడం, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడం.. ఇంకా ఎన్నికల ప్రక్రియను పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకోవడం టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో సర్వసాధారణమైపోయింది. దేశానికి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే చంద్రబాబునాయుడు, రాష్ట్రాన్ని అరాచక, ఆటవిక రాజ్యంగా మార్చినందుకు సమాధానం చెప్పాలి. ఒక చిన్న స్థానిక సంస్థ పరోక్ష ఉప ఎన్నికలోనే ప్రజాస్వామ్యం పరిస్థితి ఇలా ఉందంటే, ఈ ప్రభుత్వం ఎంత అధికార దుర్వినియోగం చేస్తోంది.. ఎంత ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మారింది.. అన్న విషయాలను తేటతెల్లం చేస్తోంది’ అని వ్యాఖ్యానించారు. -
గవర్నర్ నజీర్‌కు వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: నేడు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. గవర్నర్ నజీర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు పోస్టు చేశారు. Heartiest birthday greetings to Hon’ble Governor of Andhra Pradesh, Sri Syed Abdul Nazeer Ji! Praying for your good health, happiness and long life. @governorap pic.twitter.com/kviH86AZRR— YS Jagan Mohan Reddy (@ysjagan) January 5, 2026 -
భోగాపురంలో రామ్మోహన్ షో.. బాబు తీరు అలా?: పేర్ని నాని
సాక్షి, మచిలీపట్నం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కృషితోనే భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైఎస్ జగన్ ఆలోచన, కష్టంతోనే భోగాపురం ఎయిర్‌పోర్టు వచ్చింది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు చంద్రబాబుకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. రామ్మోహన్ నాయుడు తీరుతో భారత్ పరువు పోయిందని విమర్శించారు.మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘భోగాపురంలో ఎయిర్‌పోర్టులో ట్రయిల్ రన్ జరిగింది. విమానం రన్ వే మీద ఆగడం రామ్మోహన్ నాయుడు బిల్డప్ ఇచ్చాడు. హైదరాబాద్, భోగాపురంలో చంద్రబాబే ఎయిర్‌పోర్టులు కట్టారంటూ రామ్మోహన్ మాట్లాడుతున్నాడు. ఇండిగో అంశాల్లో భారతదేశం సిగ్గు పడుతుంది. ప్రపంచం ముందు భారత్ తలదించుకుంది. అది ఎవరి వల్లనో అందరూ గుర్తు పెట్టుకుంటారు.భోగాపురం ఎయిర్‌పోర్టుకు చంద్రబాబుకి అసలు సంబంధం ఏంటి?. 2019 ఎన్నికల ముందు దిగిపోతూ శిలాఫలకం పెట్టాడు. ముందు 5 వేల ఎకరాలు అని.. తర్వాత 15వేల ఎకరాలు అని చంద్రబాబు అన్నాడు. ఒక్క ఎకరం కూడా భూమి తీసుకోకుండా శిలాఫలకం వేసి చంద్రబాబు దిగిపోయాడు. బందర్ పోర్టుకి 33వేల ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చి 2019 మార్చి 7వ తేదీ శంకుస్థాపన చేసారు. జగన్ రాకపోతే భోగాపురం ఎప్పటికీ మొదలయ్యేది కాదు. 2200 ఎకరాలు ఎయిర్‌పోర్టుకి చాలు అని.. భూసేకరణ పూర్తి చేసి, నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ఇచ్చి.. కాలనీ నిర్మించి 2023లో శంకుస్థాపన చేశారు..జగన్ కష్టార్జితమే భోగాపురం.. అన్ని అనుమతులతో భోగాపురం ఎయిర్‌పోర్టు రైతుల త్యాగాలతో నిర్మాణం అవుతుందని.. 2026లో ప్రారంభం అవుతుందని వైఎస్ జగన్ చెప్పారు. వైజాగ్ పోర్ట్ నుండి భోగాపురం ఎయిర్‌పోర్టుకి 6600 కోట్లతో ఆరు వరుసల జాతీయ రహదారి మంజూరు చేస్తున్నట్లు మంత్రి గడ్కరీ ప్రకటించారు. 18 నెలల్లో భూ సేకరణ చేసి ఎయిర్పోర్ట్ కట్టగలరా? ప్రజలు అన్ని గమనిస్తుంటారు. ఎవరో చేసిన పని తన అకౌంట్లో వేసుకోవడం కూటమి నేతలు నేర్చుకున్నారు. పారిశ్రామిక వేత్తలు పారిపోతే భోగాపురం ఎయిర్‌పోర్టు ఎలా కట్టారు?. మీరు ఫొటోలు దిగే ఎయిర్‌పోర్టు జగన్ కష్టార్జితం. జగన్ మళ్ళీ రాడని, భూస్థాపితం చేశామని కూటమి నేతలు చెపుతున్నారు. మరి మెడికల్ కాలేజీకి ఎందుకు టెండర్లు వేయడానికి ముందుకు రావడం లేదు. 2029లో జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. అసమర్థ పాలన అని చెప్పుకునే మీకు అధికారంలో ఉండే అర్హత ఎక్కడ ఉంది?. చంద్రబాబు చెప్పిన సొల్లు మాటలు ఇవే. కరెంట్ ఛార్జీలు పెంచమని, ప్రతి ఇంటి నుండి కరెంట్ అమ్ముకోవచ్చని చంద్రబాబు చెప్పాడు. మీటర్లు బద్దలు కొట్టమని చెప్పారు. ఇప్పుడు అదే మీటర్లు బిగిస్తున్నారు. వాలంటీర్లకి 10వేలు ఇస్తామని చెప్పారు.. వాలంటీర్లు లేకుండా చేశారు..మెడికల్ కాలేజీలు తీసుకోవాలని అనుకొనే వాళ్లను చట్టం ప్రకారం చర్యలు తీసుకొంటామని జగన్ చెప్పాడు. ఎకరం భూమి రూపాయికి, ఆసుపత్రి ఫ్రీ.. రెండేళ్లు డాక్టర్లు జీతాలు ఇస్తామని ప్రకటించిన ఒక్కరు కూడా ముందుకు రాలేదు. టెండర్లు ఒక్కడు కూడా వేయలేదు. కానీ ఆదోనికి ఒక టెండర్ వచ్చిందని సంకలు గుద్దుకున్నారు. రెండు రోజుల్లోనే టెండర్ మేము వేయలేదని కిమ్స్ చెప్పింది. ప్రేమ్ చాంద్ షాకి ఆదోని మెడికల్ కాలేజ్ ఇస్తున్నట్లు సత్యకుమార్ ప్రకటించాడు. కిమ్స్ 26 ఆసుపత్రిలో ప్రేమ్ చాంద్ షా అనే వ్యక్తి లేడు. ఉన్నాడని ఆధారాలతో నిరూపించగలడా?. లక్ష కోట్లు ఆస్తులు దోచేస్తున్నారు..అమరావతిలో తుమ్మ చెట్లు కొట్టం.. అమరావతిలో తుమ్మ చెట్లు కొట్టం.. నీళ్లు తోడం అని ప్రతీ మూడు నెలలకు నారాయణ చెపుతున్నారు. ప్లాట్స్ ఇవ్వలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నాటి సింగపూరు వాళ్ళు ఏమైపోయారు?. సింగపూర్ అమరావతి కట్టినట్లు ఉంది.. మెడికల్ కాలేజీల పరిస్థితి. నూతన సంవత్సర వేడుకలకు విదేశాలు పోతారు.. మీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంత?. పోలీస్ వాహనాలకు డీజిల్ ఇచ్చారా? ఒక్క పైసా కూడా నేటికి ఇవ్వలేదు. ఏపీలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోతుందని కేంద్రం చెప్పింది. ఏదో ఒక రోజు పోలీసులు చంద్రబాబుపై సహాయ నిరాకరణ చేస్తారు. చంద్రబాబు చరిత్ర అసత్యాలు, బురిడీలు, మాయమాటలు చెప్పడమే. చంద్రబాబు మూడు లక్షల కోట్లు అప్పు చేశారు.. వచ్చిన ఆదాయం ఏం చేశారు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. -
మమతా బెనర్జీకి వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సహా రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా మమతా దీదీకి విషెస్ తెలియజేసిన వైఎస్ జగన్.. ఆమె ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు.Happy Birthday to @MamataOfficial Didi! Praying for your good health and happiness always.— YS Jagan Mohan Reddy (@ysjagan) January 5, 2026 -
ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చిన ఏకైక మగాడు
-
జగన్ కృషి వల్లే భోగాపురం ఎయిర్ పోర్ట్.. అసలు నిజాలు ఇవిగో..!
-
జగన్ విజన్.. దటీజ్ భోగాపురం
సాక్షి, అమరావతి : భూ సేకరణ పూర్తి చేయలేదు.. కనీసం కోర్టు కేసులు తేల్చలేదు.. కేంద్రం నుంచి ఎన్వోసీ తీసుకోలేదు.. అయినా భోగాపురం ఎయిర్‌పోర్టును మేమే కట్టేశామంటూ డప్పులు కొట్టుకోవడం ఒక్క చంద్రబాబు సర్కారుకే చెల్లుతుంది. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం విషయంలో 2014–2019 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం, కాలయాపన చేశారు. అప్పట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీకే చెందిన అశోక్ గజపతి రాజు ఉన్నప్పటికీ కనీసం భూ సేకరణ చేయలేకపోయారు. అనుమతులు తీసుకురాలేకపోయారు. 2,703 ఎకరాలకు గాను 377 ఎకరాలు మాత్రమే చంద్రబాబు హయాంలో సేకరించారు. కనీసం ఎన్వోసీ కూడా లేదు.అయినా ఎన్నికల ముందు హడావిడిగా భూ సేకరణ, ఎటువంటి అనుమతులు లేకుండానే 2019 ఫిబ్రవరిలో టెంకాయ కొట్టి మమా అనిపించేశారు. 2019లో వైఎస్ జగన్ అధికారం చేపట్టాక ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. ఉత్తరాంధ్ర మణిహారంగా వైజాగ్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం 2,200 ఎకరాల్లో నిర్మించేలా నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 ఏప్రిల్‌లో జీఎంఆర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత భూమిని సేకరించడంతోపాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, అనుమతులు పొందడం వంటి కీలక వ్యవహారాలను పూర్తి చేశారు. హైకోర్టు, ఎన్జీటీల్లో ఉన్న కేసులను అధిగమించి పనులు మొదలు పెట్టడానికి మార్గం సుగమం చేశారు.కేంద్రం కూడా ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 2022 నవంబర్‌లో నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేసింది. దీంతో 2023 మే 3న వైఎస్ జగన్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి వాయు వేగంతో పనులు జరుగుతున్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే భోగాపురం ఎయిర్‌పోర్టు తానే నిర్మిస్తున్నట్లు బాబు డబ్బా కొట్టుకోవడం ప్రారంభించారు. త్వరలో వాణిజ్యపరంగా అందుబాటులోకి రానున్న జీఎంఆర్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఆదివారం తొలిసారిగా విమానాన్ని ల్యాండ్ చేసి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ క్రమంలో అప్పటి వైఎస్ జగన్ సర్కారు నిర్దేశించిన విధంగానే 2026 జూన్‌లోగా నిర్మాణ పనులు పూర్తి చేసుకొని వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.సామాజిక మాధ్యమాల్లో క్రెడిట్ చోరీ ట్రెండింగ్ వైఎస్ జగన్ హయాంలో వచ్చిన ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, అదానీ డేటా సెంటర్.. ఇలా అన్ని ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకొని అభాసుపాలైనప్పటికీ వురోసారి నిస్సిగ్గుగా భోగాపురం ఎయిర్‌పోర్టును తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు విశ్వప్రయత్నం చేస్తున్నారు. బాబు క్రెడిట్ చోరీపై ప్రజలు సామాజిక మాధ్యమాల్లో ఆధారాలతో సహా పెట్టి ఉతికి ఆరేస్తున్నారు.శంషా బాద్ ఎయిర్‌పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టులు వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్ చేతులు మీదుగా ప్రారంభమయ్యాయంటూ జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు చెప్పిన మాటల వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, టీడీపీకి చెందిన కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు కానీ ఒక్క అనుమతిని కూడా తీసుకు రాలేదని, ఎకరం భూమి కూడా సేకరించలేదని, ఒక్క రూపాయి భూ పరిహారమూ చెల్లించలేదని గుర్తు చేస్తున్నారు. అయినా క్రెడిట్ తీసుకోవడానికి ఎలా సిద్ధమయ్యారంటూ సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు.క్రెడిట్ తండ్రీ తనయులదే..మా ఫస్ట్ ఎయిర్‌పోర్ట్‌కు హైదరాబాద్‌లో వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. ఆయన సీఎంగా ఉండగానే నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంలో కూడా వైఎస్సార్ పాల్గొన్నారు. ఇది భగవంతుడి నిర్ణయమో.. ఏమో తెలియదు కానీ, ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషం. – 2023 మే 3న భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపనలో జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జున రావు -
విజన్ వైజాగ్‌లో కీలక అడుగు
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ కావడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విమానాశ్రయం ఏర్పాటు కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు సాధించడంతో పాటు ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయిందన్నారు. ‘విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒక మైలు రాయి.విజన్ వైజాగ్ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడింది. మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు.. ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు రూ.960 కోట్లు ఖర్చు చేశాం. తద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయింది.As the first flight prepares to land in Vizag, Andhra Pradesh accelerates on its growth runway, marking a significant milestone for #VisionVizag.Congratulations to the GMR Group for their exceptional efforts. During our tenure expedited permissions, timely approvals and land…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 4, 2026ఆ రోజు మేం చేసిన కృషి.. ఇవాళ్టి ఈ కీలక మైలు రాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచింది. ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జీఎంఆర్ గ్రూప్‌కు నా హృదయ పూర్వక అభినందనలు. అలాగే, విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌కు 2023 మార్చిలో ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహకారం, కృషి నాకు గుర్తుంది’ అని వైఎస్ జగన్ ఆదివారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. -
భోగాపురం ఎయిర్ పోర్ట్ లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ పై YS జగన్ రియాక్షన్
-
భోగాపురం ఎయిర్ పోర్ట్ గురించి ఆ నాడు జగన్ చెప్పిన మాటలు
-
ఏపీ అభివృద్ధిలో భోగాపురం ఒక మైలురాయి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ కావడంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. విమానాశ్రయం ఏర్పాటు కోసం వైఎస్సార్సీపీ హయాంలోనే అనుమతులు సాధించడం, ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయిందని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలివిమానం ల్యాండింగ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒకమైలురాయి. #VisionVizag లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడింది. ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన GMR గ్రూప్‌కు నా హృదయపూర్వక అభినందనలు. మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు, ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు రూ. 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం.ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయింది. ఆ రోజు మేం చేసిన కృషి ఇవాళ్టి ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచింది. అలాగే, విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌కు 2023 మార్చిలో ఆమోదం ఇచ్చిన శ్రీ నితిన్ గడ్కరీ గారి కృషి, సహకారం నాకు ఎంతో గుర్తుంది’ అని పోస్టు చేశారు.As the first flight prepares to land in Vizag, Andhra Pradesh accelerates on its growth runway, marking a significant milestone for #VisionVizag.Congratulations to the GMR Group for their exceptional efforts. During our tenure expedited permissions, timely approvals and land…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 4, 2026 -
జగన్ కృషి.. భోగాపురం ఎయిర్ పోర్ట్ రన్ వే ప్రత్యేకతలు
-
పిల్లల్ని చూడడానికి లండన్ వెళ్తే గోలగోల చేశారుగా... జగన్‌కు ఒక రూల్... మీకు ఒక రూలా..?
-
సావిత్రిబాయి పూలేకు జగన్ నివాళులు
-
‘భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత వైఎస్ జగన్‌దే’
విశాఖ: భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత కచ్చితంగా మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని మరోసారి స్పష్టం చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను వైఎస్ జగన్ నెరవేర్చారన్నారు. భోగాపుర ఎయిర్పోర్ట్ కోసం భూ సమీకరణ, భూ వివాదాలను పరిష్కరించింది వైఎస్ జగనేనని, భూసేకరణ బాధితుల పరిహారం కోసం రూ. 1100 కోట్లు కేటాయించారన్నారు. 2023, మే 3వ తేదీన భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వైఎస్ జగన్ శంకస్థాపన చేశారని, 2025 డిసెంబర్ నెలాఖరుకు మొదటి ఫ్లైట్ ల్యాండ్ చేయాలనే టార్గెట్‌ను జీఎంఆర్‌కు అప్పగించారన్నారు.వైఎస్ జగన్ టార్గెట్ లో భాగంగానే రేపు తొలి ఫ్లైట్ ల్యాండ్ అవుతుందన్నారు. 2019 ఫిబ్రవరి 14 న ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కోసం ఎన్నికలకు ముందు చంద్రబాబు హడావుడిగా శంకుస్థాపన చేశారని, 2700 ఎకరాలకు గాను 250 ఎకరాలను కూడా చంద్రబాబు సేకరించలేదన్నారు. వైఎస్ జగన్ కృషిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. -
సావిత్రి బాయి పూలే జయంతి: వైఎస్ జగన్ నివాళులు
నేడు సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే జయంతి. ఆ మహనీయురాలి జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. మహిళల అభ్యుదయానికి విద్యే నాంది అని దృఢంగా నమ్మి, సమాజపు కట్టుబాట్లను ధైర్యంగా ఎదుర్కొంటూ 1848లోనే పూణేలో దేశంలో తొలి బాలికల పాఠశాలను స్థాపించిన భారతదేశపు తొలి మహిళా గురువు సావిత్రి బాయి పూలే అని కొనియాడారు.మహిళల అభ్యుదయానికి విద్యే నాంది అని దృఢంగా నమ్మి, సమాజపు కట్టుబాట్లను ధైర్యంగా ఎదుర్కొంటూ 1848లోనే పూణేలో దేశంలో తొలి బాలికల పాఠశాలను స్థాపించిన భారతదేశపు తొలి మహిళా గురువు, సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే గారు. నేడు ఆ మహనీయురాలి జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/yoY1ivGYaF— YS Jagan Mohan Reddy (@ysjagan) January 3, 2026 ఇదిలా ఉంచితే, వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సావిత్రీబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. సావిత్రీబాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పార్టీ నేతలు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ మూర్తి, పలువురు బీసీ నేతలు హాజరయ్యారు. -
అధికారాన్ని అడ్డుపెట్టుకుని దుర్మార్గంగా దాడులా?
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యుడు భోగతి విజయప్రతాప్ రెడ్డిపై టీడీపీ వర్గీయుల హత్యాయత్నం దారుణమని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ తరహా దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడం ఎంత మాత్రం సరికాదని హెచ్చరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను, అనైతిక కార్యక్రమాలను, అరాచకాన్ని ప్రజలు గమనిస్తున్నారని, వారికి గట్టిగా బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందన్నారు.టీడీపీ వర్గీయుల చేతిలో గాయపడిన విజయ ప్రతాప్‌రెడ్డి ఆరోగ్యంపై ఆయన తండ్రి భోగతి నారాయణరెడ్డితో వైఎస్ జగన్ శుక్రవారం ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. దాడి జరిగిన తీరును నారాయణరెడ్డి జగన్‌కు వివరించారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణమని ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నాయకుల వైఫల్యాలను ప్రశ్నిస్తే ఇలా భయోత్పాతం సృష్టిస్తుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని గుర్తుంచుకోవాలన్నారు.వైఎస్సార్సీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. రాజకీయాలు ఇంతలా దిగజారిపోవడం దురదృష్టకరమన్నారు. చేయకూడని తప్పులు చేస్తున్న వారిపై వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే చట్ట ప్రకారం తగిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతాప్‌రెడ్డి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
విజయప్రతాప్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
తాడేపల్లి : అనంతపురం జిల్లా యల్లనూరు జెడ్పీటీసీ సభ్యుడు విజయప్రతాప్ రెడ్డిపై టీడీపీ గూండాల చేసిన దాడిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖండించారు. ప్రస్తుతం విజయప్రతాప్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయన తండ్రితో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ క్రమంలోనే ప్రతాప్‌రెడ్డి ఆరోగ్యంపై ఆరా తీశారు వైఎస్ జగన్. ఈ క్రమంలోనే టీడీపీ గూండాల దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం అండతో వారు చేస్తున్న దాడులను తిప్పికొడదామన్నారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వంపై వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘ఈ అనైతిక చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. కూటమి పార్టీలకు తగిన బుద్ది చెబుతారు. వైఎస్సార్సీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలి. అందరికీ పార్టీ అండగా ఉంటుంది. రాజకీయాలు ఇంతలా దిగజారిపోవడం దురదృష్టకరం. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే వారందరికీ తగిన గుణపాఠం చెబుదాం’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు. కాగా,నూతన సంవత్సర వేడుకల వేళ ఏపీలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. శింగనమల నియోజకవర్గం యల్లనూరులో పచ్చ బ్యాచ్ బరితెగించింది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేశారు. యల్లనూరు వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం చేశారు. టీడీపీ నేతలు కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ప్రతాప్‌రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
మా అబ్బాయి కంటే.. జగనన్న ఓడిపోయాడని చాలా బాధపడ్డాం!
-
జగన్ వార్నింగ్ తో చంద్రబాబు సెల్ఫ్ గోల్..
-
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
-
కొత్త ఏడాదిలో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి
సాక్షి, తాడేపల్లి: తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 సంవత్సరంలో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారాయన.అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం.. ప్రతీ ఒక్కరి జీవితాలలో ఆరోగ్యం, ఆనందం, సంతృప్తి నింపే సంవత్సరం కావాలి. మీరు, మీ కుటుంబ సభ్యులు వెలుగుతో, నవ్వులతో నిండిన ఏడాది గడపాలని కోరుకుంటున్నా’’ అంటూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన. Happy New Year to all! May 2026 be a year of good health and deep fulfillment. Wishing you and your loved ones a year filled with light and laughter!#HappyNewYear2026— YS Jagan Mohan Reddy (@ysjagan) January 1, 2026అంతకు ముందు న్యూఇయర్ సందేశాన్ని విడుదల చేసిన ఆయన.. 2026లో ప్రతి ఇంటా సుఖ శాంతలు వెల్లివిరియాలని, ఈ ఏడాది ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందం నింపాలన్నారు. అందరు ఆరోగ్యంగా ఉండాలని.. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికీ దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆకాక్షించారు. -
బాబుగారు... చిల్లర రాజకీయాలపై మీరే మాట్లాడాలి!
ఏపీ ముఖ్యమంత్రికో చిత్రమైన గుణం ఉంది. ఆయన ఎవరినైనా దూషించవచ్చు కానీ.. ఎవరైనా ఆయన్ను పల్లెత్తు మాట అన్నాసరే.. ‘‘చూశారా ఎంత మాటన్నారో?.. ప్రజల కోసం అన్నీ భరిస్తా’’ అనేస్తారు. ఇదీ ఇకరకమైన ప్లేటు ఫిరాయింపే. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహావిష్కరణ సభలో ఇటీవల ఆయన మాట్లాడుతూ ‘‘వాజ్ పేయి వంటి ఉన్నత వ్యక్తులతో రాజకీయం చేసిన తాను ఇప్పుడు చిల్లర వ్యక్తులతో రాజకీయాలు చేయాల్సి వస్తోంది’’ అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘కొందరు నాయకులు స్ఫూర్తినిస్తారు. మరికొందరు దేశం కోసం బతుకుతారు. ఇంకొందరు స్వార్థం కోసమే బతుకుతారు’’ అని కూడా వ్యాఖ్యానించినట్లు తెలుగుదేశం మీడియా తన కథనంలో తెలిపింది. విపక్షమైనంత మాత్రాన వారిని చిల్లర వ్యక్తులతో పోల్చడం ఏపాటి సభ్యత? గురువింద గింజ సామెత ఆయనకు గుర్తురాలేదా? ఎవరేమైనా అనని దులుపుకుని పోవడమే ఆయన నైజమా?వాస్తవానికి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి పరిస్థితులకు ఎంతో తేడా ఉంది. ఒకపక్క చంద్రబాబు పాలన వ్యవస్థల్లో జగన్ తీసుకొచ్చిన సంస్కరణలనే అనుసరిస్తూ ఇంకోపక్క ఇష్టారీతిని భూముల పందేరం పెడుతున్నారు. ఎన్నికల సందర్భంగా తానిచ్చిన హామీల్లో 95 శాతం వరకూ నెరవేర్చిన జగన్‌కు.. ఇచ్చిన హామీల్లో దాదాపు ఏవీ నెరవేర్చని టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వానికి పోలికెక్కడ? ఈ రెండు అంశాలు చాలవా? ఎవరిది చిల్లర రాజకీయమో అర్థం చేసుకునేందుకు? గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ వంటి విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రంలో పాలనను ప్రజల చెంతకు చేర్చిన ఘనత జగన్‌ది. గతిలేక... తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని కొనసాగించాల్సిన స్థితి చంద్రబాబుది. అందుకే కదా జగన్ పథకాల పేర్లు మార్చి క్రెడిట్ చోరీకి పాల్పడింది? ఇది చిల్లరతనం కాదా? అని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది కదా! వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, గౌరవ వేతనం కూడా రూ.పదివేలకు పెంచుతామన్న ఎన్నికల హామీని అధికారంలోకి వచ్చిన తరువాత తుంగలో తొక్కడం చిల్లరతనం కాదా? అని ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలోని సుదీర్ఘ సముద్రతీర ప్రాంతాన్ని ఆర్థిక చోదక శక్తిగా మార్చేందుకు జగన్ చేపట్టిన నౌకాశ్రయాలను చూపి చంద్రబాబు ఇప్పుడు పెట్టుబడులు అడుగుతున్నారని గుర్తు చేస్తున్నారు. అన్ని మౌలిక వసతులతో చరిత్రలో ఎన్నడూ లేనట్టు ఏకంగా 17 వైద్య కళాశాలలను తీసుకొస్తే అందులో జగన్ స్వార్థం కనిపిస్తుందా? పేద విద్యార్ధుల విద్య, పేద ప్రజలకు మంచి వైద్యం అప్పగించాలన్నదే ఆయన లక్ష్యం కనిపిస్తుందా?? ఎంతో సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు ఒక్క ప్రభుత్వమెడికల్ కాలేజీని తన హయాంలో తేలేదు? పైగా జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ఎకరా వంద రూపాయల లీజుకు కట్టబెట్టి ప్రైవేటు వారికి సంపదగా మారుస్తున్నారే? దీనిని బట్టి అర్థం కాదా? ఎవరు స్వార్థపరులన్నది? జగన్ తెచ్చిన కాలేజీలలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను వ్యతిరేకించిన చంద్రబాబు, లోకేశ్‌లు ఇప్పుడు ఏకంగా కాలేజీలనే ప్రైవేటికరిస్తూ జనం దృష్టిలో విలన్లుగా మారారన్న సంగతి అర్థం చేసుకోలేకపోతున్నారు. జగన్ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు, రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ, వలంటీర్లు కిడ్పాప్ చేశారంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు చిల్లరవి కావా? అధికారంలోకి వచ్చాకైనా వీటిలో ఒక్కదానికైనా ఆధారం చూపించారా?ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబును ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయజాలం. కాని ఆయనే అనవసర కామెట్లు చేస్తున్నారనిపిస్తుంది.ఇక రాజకీయ కోణం చూద్దాం. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో వేసిన గుంతులు, కట్టిన పొత్తులు ఏ సిద్ధాంతపరమైన రాజకీయాలకు ప్రతీకలు? మామ ఎన్టీఆర్‌పై కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేస్తానని తొడగొట్టి సవాల్ చేసిన చంద్రబాబు 1983 ఎన్నికలలో ఓటమి తర్వాత బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీలోకి ఫిరాయించేశారే! మరి జగన్ ఏమి చేశారు. తాను విబేధించిన కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలో అఖండ విజయం సాధించారు. దీనిని ప్రతిష్టాత్మక వ్యవహారం అంటారు కాని జెండాలు మార్చే చిల్లర రాజకీయం అనరు కదా! 1995లో ఎన్టీ రామారావును దించడానికి తనకు మద్దతు ఇచ్చే మీడియా ద్వారా ఎంతగా అప్రతిష్టపాలు చేసింది చరిత్రలో ఉంది కదా! అది ఏమైనా ఘనమైన విషయమా? ఎన్టీ రామారావే చంద్రబాబు బుద్ధి, నైజం గురించి ఎంత ఘోరంగా దూషించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంటాయే!. అది ఏపాటి గౌరవమో చంద్రబాబు చెప్పగలరా? ఆ ఎపిసోడ్లో వాజ్‌పేయి వంటివారు ఎన్టీఆర్కే మద్దతు ఇచ్చింది వాస్తవం కాదా? ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కొత్తగా పెట్టిన పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది కదా! 1996లో వామపక్షాలతో కలిసి పోటీచేసి బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించే వారా? కాదా?ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్‌ను గోదాట్లో ముంచి బీజేపీకి మద్దతు ఇచ్చారా?లేదా? 2001-02 మధ్య గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీపై ఎలాంటి విమర్శలు చేశారో గుర్తు ఉండకపోవచ్చు. ఆ తర్వాత కాలంలో ఆయన ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి 2014లో పొత్తు పెట్టుకుంది నిజమా? కాదా? 2004 ఎన్నికలలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఓటమికి గురైన తర్వాత జీవితంలో బీజేపీతో కలవనని ప్రకటించారా? లేదా? ఇప్పుడేమో వాజ్ పేయి, నరేంద్ర మోడీ తనకు స్ఫూర్తి అని ప్రకటించుకుంటున్నారు. ఆయన ఎలాగైనా రూపాంతరం చెందగలరన్నమాట. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ఉద్యమం చేస్తున్న టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని 2009 ఎన్నికలలో పోటీ చేయడానికి రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చారా?లేదా? తీరా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చాక ఎన్ని మాటలు మార్చారు? తెలంగాణలో తన వల్లే రాష్ట్రం వచ్చిందని, ఏపీకి వెళ్లి రాష్ట్రాన్ని సోనియాగాంధీ నాశనం చేశారని ఎంతగా నిందించారు? దీనిని ఏ రాజకీయం అంటారు? 2018లొ కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ప్రధాని మోడీని ఎన్ని మాటలు అన్నారో తెలియదా? దేశ ప్రధానినే టెర్రరిస్టు అన్న చరిత్ర చంద్రబాబుదే కావచ్చు. ఆ రోజుల్లో టీడీపీ మీడియాలో వచ్చిన కొన్ని హెడ్డింగ్‌లు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మోసాల మోడీ, బీజేపీకి సహకరించే వాళ్లు దేశద్రోహులు, మోడీని దింపేస్తాం, మోడీ హటావో..మోడీతో రాజీ లేదు..రెచ్చిపోతా..,ఇలాంటి స్టేట్ మెంట్లు ఇచ్చిన చంద్రబాబు 2024 ఎన్నికలకు ముందు మోడీ, అమిత్ షాలతో కలవడానికి ఎన్ని పాట్లుపడింది ఇటీవలి చరిత్రే కదా? మధ్యలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఎన్నికలలో పోటీచేశారే. ఆ తర్వాత వారిని గాలికి వదలివేశారే! వీటిని రాజకీయ వ్యూహాలు అంటారా? లేక అవకాశవాద రాజకీయాలు అంటారా? లేక చిల్లర రాజకీయాలు అంటారా అన్నదానిపై ఎప్పుడైనా టీడీపీ వివరణ ఇచ్చిందా? మరి జగన్ ఎప్పుడైనా ఇలాంటి అవకాశవాద, లేదా చిల్లర రాజకీయాలకు పాల్పడ్డారా? నిజానికి బీజేపీ కోరిన విధంగా జగన్ ఎన్డీయేలో చేరి ఉంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. విధానాల మీద అభిప్రాయం చెప్పవచ్చు కాని రాజకీయ ప్రత్యర్ధుల వ్యక్తిత్వాన్ని కింపచరిచే విధంగా మాట్లాడి రాజకీయ లబ్ది పొందాలని అనుకుంటే ఎదురుదెబ్బ తప్పదు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
జనాలకు భరోసా కల్పిస్తూ జగన్ ప్రయాణం.. 2025 రౌండప్ చిత్రాలు
-
NTR District: YSRCP బ్యానర్లు తొలగించడంపై అసహనం
-
పేరు మార్చితే వైఎస్ జగన్ బ్రాండ్ పోతుందా..?
-
Ys Jagan: తెలుగు ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
-
Magazine Story: దారి తప్పిన నాలుగో సింహం పోలీసుల మెడకు ఉచ్చు
-
ప్రజలకు వైఎస్ జగన్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: వైకుంఠ ఏకాదశి పవిత్ర పర్వదినాన్ని తెలుగు ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఆ వైకుంఠ వాసుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ.. తెలుగు ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అంటూ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా వైఎస్ జగన్ శుభాకాంక్షల సందేశాన్ని పంచుకున్నారు.ఆ వైకుంఠ వాసుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) December 30, 2025శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.క్లిక్ చేయండి👉: ముక్కోటి ఏకాదశి..తిరుమలలో ప్రముఖుల సందడి చిత్రాలు -
ఎమ్మెల్యే విరూపాక్షికి వైఎస్ జగన్ పరామర్శ
ఆలూరు రూరల్: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రెండు మోకాళ్లకు శస్త్రచికిత్స చేయించుకుని చికిత్స పొందుతున్న కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఫోన్లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆర్యోగంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. -
హంపి, అర్జున్‌లకు వైఎస్ జగన్ అభినందనలు
వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్షిప్-2025లో కాంస్య పతకాలు గెలిచిన ఇరిగేశి అర్జున్, కోనేరు హంపిలను ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. వారి దృఢ సంకల్పం, ఆటతీరు, పోరాట స్ఫూర్తి అందరికీ గర్వకారణం అంటూ ఎక్స్ వేదికగా ఆయన కొనియాడారు.కాగా దోహా వేదికగా జరిగిన ఈ వరల్డ్ మెగా ఈవెంట్లో హంపి మహిళల విభాగంలో ఆఖరి వరకు పోరాడింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత హంపి, జు జినెర్ (చైనా), అలెగ్జాండ్రా గొర్యాక్చినా (రష్యా) 8.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. కానీ టైబ్రేక్ స్కోరులో ఆమె మూడో స్దానంతో సరిపెట్టుకుంది. దీంతో కాంస్య పతకం హంపి దక్కించుకుంది.మరోవైపు ఓపెన్ విభాగంలో అర్జున్ 9.5 పాయింట్లతో మూడో స్దానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకున్నాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అర్జున్‌కు ఇదే తొలి పతకం. ఇక 10.5 పాయింట్లతో అగ్రస్దానంలో నిలిచిన నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్.. ఆరోసారి ప్రపంచ ర్యాపిడ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. -
మా నాయకుడు జగన్ అని గర్వంగా చెప్తాం రాచమల్లు గూస్ బంప్స్ కామెంట్స్
-
రైలు ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి
-
ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో విజయవాడకు చెందిన ప్రయాణికుడు మృతి చెందడంపైనా విచారం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగడం దిగ్భ్రాంతి కలిగించింది. ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందడం బాధాకరం. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ప్రమాదంలో ఎవరైనా గాయపడి ఉంటే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం, రైల్వే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అని ఒక ప్రకటనలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. టాటానగర్(జార్ఖండ్)-ఎర్నాకుళం(కేరళ) మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ ఆదివారం అర్ధరాత్రి అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. రైలులోని ఓ బోగీలో మంటలు చెలరేగి.. మరో బోగికి అంటుకున్నాయి. ఈ ఘటనలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ప్రయాణికుల్లో విజయవాడకు చెందిన చంద్రశేఖర్(70) అనే వృద్ధుడు సజీవ దహనం అయ్యారు. లోకో పైలట్ సమయస్ఫూర్తితో మిగతా ప్రయాణికులంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. -
పునర్వి‘భజన’లో రాజకీయ కుతంత్రం
సాక్షి, అమరావతి: స్వార్థ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు జిల్లాల పునర్విభజన చేస్తున్నారు. ప్రజల, పాలనా సౌలభ్యాలకు తిలోదకాలిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒక శాస్త్రీయ ప్రాతిపదికన ఏర్పాటైన జిల్లాలను టీడీపీ ప్రయోజనాలే పరమావధిగా అస్తవ్యస్తంగా మారుస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక జిల్లా రద్దుకు సిద్ధమయ్యారు. 2023లో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన రాజంపేట పార్లమెంటు ప్రాంతాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు. ఆ జిల్లాకు అదే ప్రాంతానికి చెందిన ప్రఖ్యాత వాగ్గేయకారుడు అన్నమయ్య గౌరవార్థం పేరు పెట్టారు. రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లా ఏర్పాటైంది. దీనికి అందరి ఆమోదం లభించింది. ఇప్పుడు దాన్ని చంద్రబాబు ప్రభుత్వం కకావికలం చేస్తోంది. అప్పట్లో చిత్తూరు జిల్లా ప్రాధాన్యాన్ని కొనసాగించేందుకు రాజంపేట పరిధిలో ఉన్న పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆ జిల్లాలో కలిపారు. చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా మదనపల్లె జిల్లాను ఏర్పాటు చేసే పేరుతో అన్నమయ్య జిల్లా రూపురేఖలను మార్చివేసేలా ప్రతిపాదించారు. ఆ జిల్లాలో ఉన్న తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న మదనపల్లె జిల్లాలో కలిపారు. చిత్తూరు జిల్లాలో ఉన్న పుంగనూరు అసెంబ్లీ స్థానాన్ని మదనపల్లె జిల్లాలో విలీనం చేశారు. తుది నోటిఫికేషన్ విడుదల చేసే సమయానికి మిగిలిన రైల్వేకోడూరు, రాయచోటి, రాజంపేట నియోజకవర్గాలను తిరుపతి, కడప, మదనపల్లె జిల్లాల్లో కలపి అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దు చేయాలని ప్రతిపాదించారు. అదే గనుక జరిగితే అన్నమయ్య జిల్లా కనుమరుగైనట్లే. తొలిసారి జిల్లా రద్దుకు అడుగులు రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకూ గతంలో ఏర్పాటైన జిల్లాలను ఏ ప్రభుత్వం రద్దు చేయలేదు. 11 జిల్లాలతో మొదలైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం 23 జిల్లాలకు విస్తరించింది. 2014లో తెలంగాణ విడిపోయిన తర్వాత 13 జిల్లాలతో అవశేష ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. చంద్రబాబు ఆ జిల్లాలను పునర్వ్యస్థీకరించకుండా వదిలేశారు. 2023లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. గతంలో ఉన్న 13 జిల్లాలను అలాగే ఉంచి కొత్తగా మరో 13 జిల్లాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు కొత్తగా మరో 3 జిల్లాలు ఏర్పాటు చేస్తామని ముందు చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం చివరికి ఒక విధానం, హేతుబద్ధత లేకుండా రాజకీయ కారణాలతో అన్నమయ్య జిల్లాను లేకుండా చేయాలనే అభిప్రాయానికి వచ్చింది. రాజంపేట ఛిన్నాభిన్నమే లక్ష్యం రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీకి పట్టు లేకుండాపోవడంతో ఆ నియోజకవర్గాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. 2004 నుంచి టీడీపీ అక్కడ గెలవలేదు. రాష్ట్ర విభజన తర్వాత 2014, 2019, 2024 ఎన్నికల్లో అక్కడ వైఎస్సార్సీపీ గెలిచింది. రాజకీయంగా ఆ నియోజకవర్గంలో టీడీపీకి ఇక పట్టు చిక్కే పరిస్థితులు లేకపోవడంతో జిల్లాల పునర్విభజన ముసుగులో అందులోని అసెంబ్లీ స్థానాలను చెల్లాచెదురు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మదనపల్లె జిల్లా ఏర్పాటు చేయడానికి పెద్దగా అభ్యంతరాలు లేకపోయినా ఆ పేరుతో ఉన్న జిల్లాను రద్దు చేయడం సరికాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పునర్విభజనలో చిత్తూరు జిల్లాలో ఉన్న పుంగనూరు నియోజకవర్గాన్ని మదనపల్లె జిల్లాలో కలపాలని నిర్ణయించారు. దీంతో చిత్తూరు జిల్లా కేవలం ఆరు నియోజకవర్గాలకే పరిమితం కానుంది. 32 మండలాలతో ఉన్న ఆ జిల్లా 26 మండలాలకే పరిమితమై ప్రాధాన్యం కోల్పోనుంది. తగ్గిపోతున్న బాపట్ల జిల్లా ప్రాముఖ్యంఅలాగే కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తుండగా దాని కోసం బాపట్ల జిల్లా ప్రాధాన్యాన్ని తగ్గిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తున్నారు. బాపట్ల జిల్లా నుంచి అద్దంకి, నెల్లూరు జిల్లా నుంచి కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు. దీంతో 25 మండలాలతో ఉన్న బాపట్ల జిల్లా ఇప్పుడు 20 మండలాలకే పరిమితం కానుంది.పోలవరం లేకుండానే పోలవరం జిల్లాఅల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంతాన్ని విచిత్రంగా పునర్వ్యస్థీకరించింది. పోలవరం లేకుండా పోలవరం జిల్లాను ఏర్పాటు చేసి ప్రస్తుతం చేపట్టిన జిల్లాల పునర్విభజనకు అసలు ప్రాతిపదికే లేదని నిరూపిస్తున్నారు. కేవలం రంపచోడవరం నియోజకవర్గంతో ఒక జిల్లాను ఏర్పాటు చేయడమేకాకుండా దానికి పక్కనున్న ఏలూరు జిల్లాలో ఉన్న పోలవరం పేరును దానికి పెట్టడం గమనార్హం. అరకు పార్లమెంటు స్థానం పరిధి ఎక్కువ కావడం, నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉండడంతో ఈ జిల్లాను పునర్వ్యస్థీకరించడం 2022లోనే సవాలుగా మారింది. అయినా అప్పట్లో దాని విస్తృత పరిధి దృష్ట్యా రెండు జిల్లాలుగా విభజించారు. పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేశారు. తద్వారా రెండు గిరిజన జిల్లాలను వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే రంపచోడవరం నియోజకవర్గం పాడేరుకు దూరంగా ఉందనే సాకుతో కేవలం ఆ ఒక్క నియోజకవర్గంతోనే ఇప్పుడు కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. పైగా దానికి ఏలూరు జిల్లాలో ఉన్న పోలవరం పేరు పెట్టడం ఇంకా విచిత్రంగా ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం ఒక నియోజకవర్గం కోసం జిల్లా ఏర్పాటు చేయడాన్ని బట్టి తాము చేసిన పునర్వ్యస్థీకరణకు తీరూతెన్నూ లేదని చంద్రబాబు ప్రభుత్వం నిరూపించుకుంది. ఒంగోలు, రాజంపేట, అరకు పార్లమెంటు స్థానాల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకు చంద్రబాబు ఈ పునర్విభజనను ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.2014లో వదిలేసి ఇప్పుడు తూట్లు పొడుస్తున్న చంద్రబాబుఅమరావతి కోసం చంద్రబాబు 2014–19లో జిల్లాలను పునర్వ్యస్థీకరించకుండా వదిలేయడంతో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక శాస్త్రీయ దృక్పథంతో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని జిల్లాలను పునర్వ్యస్థీకరించారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు, అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకూడదనే ప్రాథమిక సూత్రాల ఆధారంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి జిల్లాలో జనాభా సగటున 15 లక్షల నుంచి 20 లక్షలు ఉండేలా చూశారు. తద్వారా అన్ని జిల్లాలకు సమాన ప్రాధాన్యం ఉండేలా స్వరూపాలను నిర్దేశించారు. ఇందుకోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా, 51 రెవెన్యూ డివిజన్లను 76 డివిజన్లుగా పునర్వ్యస్థీకరించారు. చివరికి చంద్రబాబు సుదీర్ఘకాలం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం రెవెన్యూ డివిజన్ కూడా వైఎస్ జగన్ హయాంలోనే ఏర్పాటైంది. అంత శాస్త్రీయంగా జరిగిన పునర్విభజనను చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం నీరుగార్చడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.అన్నమయ్య జిల్లాపై నేడు నిర్ణయంఅన్నమయ్య జిల్లా రద్దు అంశాన్ని సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో తేల్చుదామని సీఎం చంద్రబాబు అధికారులతో చెప్పినట్టు తెలిసింది. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశమైనా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దు చేయడానికి దాదాపు నిర్ణయించినట్లు సమాచారం. కొత్తగా ఏర్పాటు చేసే మదనపల్లె జిల్లానే అన్నమయ్య జిల్లాగా కొనసాగిస్తున్నట్లు చెప్పాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. రాయచోటి నియోజకవర్గాన్ని మదనపల్లె జిల్లాలో కలిపి జిల్లా కేంద్రంగా మదనపల్లెను చేయాలని దాదాపు ఖరారు చేశారు. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి తాజాగా పలు మార్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. వీటన్నింటిపై సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదముద్రవేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ నెల 31న జిల్లాల పునర్విభజనకు సంబంధించిన మార్పులపై తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. -
ముస్లిం మత పెద్ద ముఫ్తీ అబ్దుల్ వహాబ్ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: ముస్లిం మత పెద్ద ముఫ్తీ అబ్దుల్ వహాబ్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అ ట్వీట్లో ‘60 ఏళ్లకు పైగా ఇస్లాం ధర్మ ప్రచారానికి, విద్యకు అంకితమైన నెల్లూరుకు చెందిన ముఫ్తీ అబ్దుల్ వహాబ్ గారి మరణం ముస్లిం సమాజానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. 60 ఏళ్లకు పైగా ఇస్లాం ధర్మ ప్రచారానికి, విద్యకు అంకితమైన నెల్లూరుకు చెందిన ముఫ్తీ అబ్దుల్ వహాబ్ గారి మరణం ముస్లిం సమాజానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/LMV96K43Bl— YS Jagan Mohan Reddy (@ysjagan) December 28, 2025 -
ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు
-
రతన్ టాటా జయంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. రతన్ టాటాకు నివాళి అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘టాటా సంస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన 'భారతదేశ రత్నం' రతన్ టాటా. ఆయన దాతృత్వం, వారసత్వం మనందరికీ స్ఫూర్తి దాయకం’ అని పోస్టు చేశారు. Paying tributes to ‘Jewel of India' Shri Ratan Tata Ji on his birthday, whose entrepreneurship took Indian industry to a global level. His simplicity, philanthropy, and legacy continue to guide us. pic.twitter.com/BAskFec7iO— YS Jagan Mohan Reddy (@ysjagan) December 28, 2025 -
హక్కులు రావడమే వారికి శాపం
సాక్షి, అమరావతి: దశాబ్దాల పాటు సాగిన ఆంక్షల చెర నుంచి గత ప్రభుత్వంలో విముక్తి పొందిన అసైన్డ్ పేద రైతుల భూములపై చంద్రబాబు సర్కారు దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. 13.59 లక్షల ఎకరాలపై చట్టబద్ధంగా హక్కులు కల్పించడాన్ని నేరంగా చిత్రీకరిస్తూ ఏడాదిన్నర నుంచి వాటిని నిషేధిత జాబితా 22ఏలో చేర్చి ఇబ్బందిపెడుతోంది. తన హయాంలో భూములకు సంబంధించి ఒక్క సంస్కరణ కూడా చేయకుండా వాటన్నిటినీ వివాదాల్లో ముంచిన చంద్రబాబు... వైఎస్ జగన్ హయాంలో జరిగిన సంస్కరణ కారణంగా లబ్ధి పొందిన 20 లక్షల మంది అసైన్డ్ భూముల రైతులను అష్టకష్టాలు పెడుతున్నారు. తమ హక్కులను అనుభవించనివ్వాలని రైతులు వేడుకుంటున్నా చంద్రబాబు కనికరించడం లేదు. వారిని కుట్రదారులుగా చిత్రీకరిస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. చరిత్రాత్మక రీతిలో వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూముల సమస్య పరిష్కారానికి నడుంబిగించి అసైన్డ్ భూముల చట్టానికి సవరణ చేసింది. దశాబ్దాల పాటు భూములపై ఏ హక్కులు లేకుండా కేవలం సాగుకే పరిమితమైన పేద రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తమకు హక్కులు ఇవ్వాలని ఎస్సీ, బీసీ, ఎస్టీ ఇతర పేద రైతులు ఎన్నో ఏళ్లుగా కోరినా, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం వారికి మేలు చేయాలని నిర్ణయించింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది. అనంతరం రాష్ట్ర రైతుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు (ఫ్రీహోల్డ్) ఇచ్చింది. దీంతో 27.40 లక్షల ఎకరాలకు చెందిన అసైన్డ్ రైతులకు సంపూర్ణ హక్కులు దక్కాయి. వారు ప్రైవేటు భూముల తరహాలో తమ భూములకు హక్కుదారులు అయ్యారు. 2024లో ఎన్నికలు జరిగే సమయానికి 13.59 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూములను గత ప్రభుత్వం ఫ్రీహోల్డ్ చేసి దాదాపు 20 లక్షల మంది రైతులను యజమానులను చేసింది. కొందరు అమ్ముకోవడం తప్పా? హక్కులు వచ్చిన రైతుల్లో కొందరు భూములపై ఆంక్షలు లేకపోవడం, మంచి ధర రావడంతో అమ్ముకున్నారు. దీన్ని కూటమి ప్రభుత్వం వివాదంగా మార్చింది. వాస్తవానికి ఇలా క్రయవిక్రయాలు జరిగింది కేవలం 25 వేల ఎకరాలకు సంబంధించిన భూములు మాత్రమే. మిగిలినవన్నీ అసైనీల చేతుల్లోనే ఉన్నాయి. కానీ, రైతులకు మేలు చేసే ఈ సంస్కరణను చంద్రబాబు ప్రభుత్వం తప్పు పడుతూ ఈ భూములన్నీ అక్రమమని... వాటిని 22ఏ జాబితాలో పెట్టింది. దీంతో రిజి్రస్టేషన్లు జరగడం లేదు. సంబంధిత రైతులు రుణాలు కూడా తీసుకోలేకపోతున్నారు. 10 లక్షల ఎకరాలు సక్రమమని తేలినా... కూటమి ప్రభుత్వ విచారణలోనే 10 లక్షల ఎకరాలు సక్రమమని తేలింది. ఏడాదిన్నరగా ఫ్రీహోల్డ్ భూములపై విచారణ చేయిస్తూనే ఉంది. రెండుసార్లు వెరిఫికేషన్ చేసి, అధికారుల కమిటీలతో విచారణ జరిపించారు. ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రుల సంఘం అరడజనుసార్లు సమావేశమైనా ఏమీ తేల్చలేదు. ఫ్రీహోల్డ్ భూములపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడమే తప్ప ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వాస్తవానికి రెవెన్యూ శాఖ విచారణలో సుమారు 10 లక్షల ఎకరాలు సక్రమంగా ఫ్రీహోల్డ్ అయినట్లు తేలింది. మిగతా 4 లక్షల ఎకరాల్లో ఉల్లంఘనలు ఉన్నాయని చెప్పినా అవి ఏమిటనేది కచ్చితంగా తేల్చలేకపోయింది. కేవలం రాజకీయ కారణాలతోనే కొన్ని జిల్లాల్లో ఫ్రీహోల్డ్ భూములపై వివాదాలు సృష్టించారు. ఎక్కడైనా అధికారులు, భూ మాఫియాకు చెందినవారి వల్ల పొరపాట్లు జరిగితే సరిదిద్దాల్సింది పోయి అన్నింటినీ వివాదాస్పదంగా చూపుతూ చంద్రబాబు సర్కారు రైతుల కడుపు కొడుతోంది. రాజధానిలో అసైన్డ్ రైతుల నుంచి భూములు కొల్లగొట్టి వారికి రావాల్సిన ప్లాట్లను దర్జాగా దోచేసిన టీడీపీ నేతలు ఇప్పుడు రాష్ట్రంలోని మిగతా అసైన్డ్ రైతుల భూములను కూడా కొట్టేసే ప్రయత్నాలు చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అడ్డగోలుగా వక్రీకరించి 22ఏ జాబితాలో పెట్టారుఅసైన్డ్ భూముల చట్టానికి సవరణ ద్వారా జగన్ ప్రభుత్వం చేసిన మంచి పనిని వక్రీకరించి 22ఏ జాబితా నుంచి తొలగించిన భూములన్నీ అన్యాక్రాంతమైనట్లు టీడీపీ మంత్రులు, నేతలు అడ్డగోలుగా వాదించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫ్రీ హోల్డ్ అయిన 13 లక్షల ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు జరిగింది కేవలం 25 వేల ఎకరాలకు మాత్రమేనని టీడీపీ ప్రభుత్వమే నిర్ధారించింది. ఇంకా ఎక్కడైనా ఉల్లంఘనలుంటే విచారణ జరిపి మిగిలిన భూములపై ఆంక్షలు ఎత్తివేయాలి. కానీ, ఆ పని చేయడంలేదు. వైఎస్ జగన్ హయాంలో యాజమాన్య హక్కులు రావడమే వారికి శాపంగా మారింది. ఫ్రీహోల్డ్ భూముల రిజి్రస్టేషన్లకు అనుమతి ఇస్తే అది చేసింది వైఎస్ జగన్ కాబట్టి ఆయనకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో దానిపై నిత్యం బురద జల్లుతూనే ఉంది. దీంతో లక్షలాది మంది రైతులు లబోదిబోమంటున్నారు. -
‘దివ్యాంగ’ ప్రభుత్వం! అభాగ్యులతో చెలగాటం
రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు సామాజిక బాధ్యతను గాలికొదిలేసింది. కొత్తగా ఒక్క పింఛన్ ఇవ్వకపోగా, ఉన్న పింఛన్లలో నెల నెలా కోత పెడుతోంది.. నోటీసులతో బెంబేలెత్తిస్తూ అర్హులైన లబ్దిదారులను కుదిస్తోంది.. పేదరికంలో మగ్గిపోతూ.. నడవలేని దుస్థితిలో.. కుటుంబ సభ్యుల సహకారంతో ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని ‘కనికరించండయ్యా.. మా దీనస్థితిని చూడండయ్యా.. పింఛన్ ఇప్పించండయ్యా..’ అంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. జిల్లా సర్వోన్నతాధికారులైన కలెక్టర్లు అభాగ్యుల వినతి పత్రం తీసుకోవడం తప్ప ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉండిపోతున్నారు.. ‘ఇది సర్కారు పెద్దల నిర్ణయం.. మా చేతిలో ఏమీ లేదు’ అని చెప్పలేక పోతున్నారు.. వెరసి అభాగ్యులు ప్రతి వారం కాళ్లరిగేలా తిరుగుతున్నారు.జగన్ సీఎం అయ్యే నాటికి పింఛన్లు 39 లక్షలువైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన పింఛన్లు 66,34,372ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లు : 61,24,605బాబు ప్రభుత్వంలో కోత : 5,09,767రూపాయికి, అర్ధ రూపాయికి కార్పొరేట్లకు భూములు కట్టబెడుతున్న చంద్రబాబు సర్కారు పేదల పింఛన్ ‘ఆశ’పై మాత్రం నీళ్లు చల్లుతూనే ఉంది. కనీసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అత్యంత దారుణంగా వ్యవహరిస్తుండటం బహుశా దేశంలో ఒక్క మన రాష్ట్రంలో తప్ప మరెక్కడా ఉండి ఉండదు. పైకి మాత్రం వాట్సాప్ గవర్నెన్స్ అంటూ గొప్పలకు కొదవ లేదు.. ఇలా వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే అలా సమస్య పరిష్కరించేస్తామంటూ ఊదరగొడుతోంది. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి’ పరిశీలనలో ఊరూరా కన్నీటి గాధలే కనిపించాయి. నాడు పింఛన్ వచ్చింది.. నేడు ఏం పాపం చేశాను?శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం చెట్టుపొదిలాం గ్రామానికి చెందిన గడే తేజకు రెండు కాళ్లు కదలవు. మాటలు సరిగా రావు. వైద్యులు 98 శాతం వైకల్యం ఉందని ధ్రువపత్రం ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల పింఛన్ వచ్చేది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం.. ఉన్న పింఛన్‌ను సైతం తొలగించింది. ఎందుకు తొలగించారో చెప్పే వారు లేరు. ఎన్నిమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. నేను ఏం పాపం చేశాను? ఎందుకు నా పింఛన్ ఆపేశారని బాధితుడు కన్నీటి పర్యంతం అవుతున్నాడు.సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి నెట్వర్క్: రోజులు గడుస్తున్నాయి.. వయసు పెరుగుతోంది.. 60.. 61.. 62.. కానీ ప్రభుత్వం నుంచి పింఛన్ రాలేదు. 60 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ అందిస్తాం అని ఎన్నికలప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలు నీటి మూటలే అని తేటతెల్లమైంది.. పోనీ, దివ్యాంగులనైనా కనికరిస్తున్నారా.. అంటే అదీ లేదు.. ఒంటరి మహిళల ఊసే లేదు.. ఇదే చంద్రబాబు గత ప్రభుత్వంలో అయితే పింఛన్ తీసుకుంటున్న వారు ఎవరైనా చనిపోతేనే.. ఆ స్థానంలో తిరిగి మరొకరికి పింఛన్ ఇచ్చే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. దరఖాస్తు చేసుకునే అవకాశమే లేకుండా చేశారు. సచివాలయంలో అడిగితే వాళ్లకు ఏ సమాచారం లేదని చెబుతున్నారు. ఆన్లైన్లో ఎప్పుడు దరఖాస్తు చేయాలో తెలియడం లేదు. దానికి ఎప్పుడు అవకాశం కల్పిస్తారో అంతకంటే తెలియదు. ఊళ్లలో వృద్ధులు మాత్రమే కాదు కదల్లేని దివ్యాంగులు సైతం పెన్షన్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఓట్ల కోసం మాటలు చెప్పినంత సులువుగా చంద్రబాబు పని చేయడంలేదని, పూట గడవక అల్లాడిపోతున్నా ఆదుకోవడం లేదంటూ వాపోతున్నారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో.. ప్రతి ఊళ్లోనూ పింఛన్ గాధలు చూస్తుంటే కంట నీరొస్తోంది. పింఛన్లలో కోతలే కోతలుఇటు కొత్త పింఛన్ ఇవ్వకపోగా గతంలో వైఎస్ జగన్ హయాంలో పెన్షన్లు అందుకున్న లక్షల మందిని ప్రభుత్వం ఈ పథకానికి దూరం చేసింది. సూపర్ సిక్స్ పేరిట ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచి్చన చంద్రబాబు.. తర్వాత తన నిజ స్వరూపం చూపుతున్నారు. రకరకాల కారణాలతో పెన్షన్ల సంఖ్యను కుదిస్తూ వస్తున్నారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చే నాటికి 39 లక్షలు మాత్రమే పింఛన్లు ఉన్నాయి. 2024 మార్చిలో ఎన్నికల నాటికి వైఎస్ జగన్ ప్రభుత్వం 66,34,372 మందికి పింఛన్లు ఇచ్చేది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 27లక్షలకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు సర్కారు పింఛన్లను 61,24,605కే పరిమితం చేసింది. అంటే ఏకంగా 5,09,767 పెన్షన్లను నిర్ధాక్షిణ్యంగా కత్తిరించింది. కొత్తగా ఒక్కరికీ పింఛన్ ఇవ్వకపోగా, విధివంచితులైన దివ్యాంగుల పట్ల కనీసం జాలి, దయ చూపకుండా అమానవీయంగా వారి పెన్షన్లను కూడా కట్ చేశారు.. చేస్తున్నారు. రీ–వెరిఫికేషన్ పేరిట వారికి నరక యాతన చూపిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ పింఛన్ అందేది. అర్హులు ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి, మంజూరు చేసేది. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సదరం క్యాంపులు ఏర్పాటు చేసి, సర్టిఫికెట్లు మంజూరు చేసింది. 2024 మార్చి నాటికి 8,13,316 మంది దివ్యాంగులకు పెన్షన్లు ఇచ్చింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం రకరకాల వెరిఫికేషన్ల పేరిట వీరి సంఖ్యను నెల నెలా తగ్గిస్తోంది. రీ–వెరిఫికేషన్ అంటూ వారిని సదరం పేరిట మళ్లీ మళ్లీ ఆస్పత్రులకు తిప్పుతోంది. తొలగించిన వారితో పాటు రెండు మూడు లక్షల మంది కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. చంద్రబాబును నమ్మి మోసపోయామని ఊరూరా ప్రజలు ఇప్పుడు వాపోతున్నారు. మంచానికే పరిమితమైనా అందని పింఛన్కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం గజ్జనపూడికి చెందిన ఇతని పేరు కాకర అబ్బులు. వయసు 58 సంవత్సరాలు. రెండేళ్ల క్రితం జామాయిల్ చెట్టు నరుకుతుండగా చెట్టు మీద పడటంతో మెడ విరిగిపోయింది. మెడకు శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటుండగా, నడుం నొప్పి ప్రారంభమైంది. నడుము దెబ్బతిందని వైద్యులు ధ్రువీకరించారు. ఇప్పటికీ మంచానికే పరిమితమయ్యాడు. ‘నా కుమారుడు శాంతి ప్రసాద్ 10వ తరగతితో చదువు ఆపేసి కూలి పనులకు వెళుతున్నాడు. నాకు సదరం సర్టిఫికెట్ మంజూరైనా పింఛన్ మంజూరు కాలేదు.’ అని అబ్బులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇది కడుపు కొట్టడమే.. ఇతని పేరు శ్రీనివాసులు. శ్రీ సత్యసాయి జిల్లా పేరూరుకు చెందిన ఇతనికి 2010లో జరిగిన ప్రమాదంలో వెన్నెముక చితికిపోయింది. అప్పటి నుంచి మంచం, వీల్ చైర్‌కే పరిమితం. ఎటూ కదల్లేడు. గత 15 సంవత్సరాల్లో వైద్య ఖర్చుల కోసం తన పది ఎకరాల భూమిని సైతం అమ్ముకున్నాడు. 90 శాతం వైకల్యం ఉందని వైద్యులు సర్టిఫికెట్ జారీ చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇతనికి రూ.6 వేల పింఛన్ మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం రీ–వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగ శాతాన్ని 77కు తగ్గించేసింది. దీంతో పూర్తి వైకల్యం కలిగిన బాధితులకు వచ్చే రూ.15 వేల పింఛన్‌కు అర్హత లేకుండా పోయింది. ఈనెల 22న కలెక్టరేట్లో కలెక్టర్‌కు తన గోడు విన్నవించుకున్నాడు.19 నెలలుగా ఎదురుచూపులు ఈమె పేరు అబ్బోల్ల లక్ష్మీదేవి. శ్రీ సత్య సాయి జిల్లా నల్లచెరువు మండలం చెరువు వాండ్లపల్లి గ్రామం. ఈమె రెండేళ్ల కిందట గ్రామంలో కూలి పనులకు వెళ్లి వేరుశనక్కాయలు ఆడిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె కుడి చేయి మిషన్‌లో ఇరుక్కొని కట్ అయ్యింది. ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్న తర్వాత సదరం సర్టిఫికెట్ తీసుకుంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 19 నెలలైంది. అన్ని అర్హతలున్నా పెన్షన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. ఆన్లైన్లో పెన్షన్‌కు సంబంధించిన సైట్ ఓపెన్ కాలేదని అధికారులు వెనక్కి పంపిస్తున్నారని వాపోతోంది.నా గోడు పట్టించుకునే వారేరీ? శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బొగిడియా పుట్టుగకు చెందిన బొగిడియా లక్ష్మి కూలి పని చేస్తుండగా ఏడాదిన్నర క్రితం ప్రమాదవశాత్తు కుడి కాలు కోల్పోయింది. ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేదని, తనకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని కన్నీటి పర్యంతమవుతోంది. కొబ్బరి తోటల్లోకి వెళ్లి ఇదివరకట్లా పనులు చేయలేక పోతోంది. పూరింట్లో ఉంటున్న ఈమె.. తన ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి అగచాట్లు పడుతోంది. తనకు 84 శాతం దివ్యాంగురాలిగా గుర్తింపు సర్టిఫికెట్ ఇచి్చనా.. ఈ ప్రభుత్వం తనకు ఎందుకు పింఛన్ ఇవ్వడం లేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. నా గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విలపిస్తోంది. అర్హత ఉన్నా పింఛన్ ఇవ్వడం లేదు విజయనగరం జిల్లా రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన సత్యం, సీతమ్మ దంపతులది నిరుపేద కుటుంబం. సెంటు భూమి కూడా లేదు. దివ్యాంగుడైన లక్ష్మణ అనే కుమారుడు ఉన్నాడు. అంతు చిక్కని వ్యాధితో పక్షవాతానికి గురికావడంతో అతని రెండు కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. మంచానికే పరిమితం అయ్యాడు. ఆ వృద్ధులు బతకడమే కష్టం అనుకుంటే వారికి బరువుగా మారాడు. లక్ష్మణకు 2024లో సదరం ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఆ తర్వాత పింఛన్‌కు దరఖాస్తు చేశారు. ఎదురు చూపులే తప్ప ఫలితం లేదు. తామెంత కాలం బతికి ఉంటామో తెలియదని, తమ తదనాంతరం తమ కొడుకు పరిస్థితి ఏమిటని వారు విలపిస్తున్నారు. వెన్నుపూస దెబ్బతిన్నా.. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం కామనగరువు పితానివారిపాలెనికి చెందిన నాగవరపు శ్రీనివాసరావుకు వెన్నుపూస దెబ్బతింది. కాళ్లు పని చేయడం లేదు. మంచానికే పరిమితమయ్యాడు. 81 శాతం దివ్యాంగత్వం ఉందని సదరం సరిఫ్టికెట్ ఇచ్చారు. పింఛన్‌కు ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేదు. శ్రీనివాసరావును తీసుకుని ఆయన భార్య సత్యవతి కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును సైతం కలిశారు. అయినా ఫించన్ మంజూరు కాలేదు. ఒక్క అడుగేయలేదన్నా కనికరం లేదు తిరుపతి జిల్లా పాకల మండలం రమణయ్యగారిపల్లెకి చెందిన హేమలత, రమణయ్యకు ఇద్దరు పిల్లలు. పెద్ద బిడ్డ హని్వత (6) మానసిక వైకల్యంతో మంచానికే పరిమితం. అడుగు తీసి అడుగు వేయలేదు. అత్యంత పేద కుటుంబం. సెంటు భూమి లేదు. వ్యవసాయ కూలి పనులకు వెళుతుంటారు. పింఛన్ డబ్బులు వస్తే బిడ్డ వైద్య ఖర్చులకు సాయంగా ఉంటుందని ఏడాదిగా పింఛన్ కోసం తిరుగుతూనే ఉన్నారు. క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు తాము మొరపెట్టుకున్నా.. పింఛన్ దరఖాస్తుకు అనుమతులు రాలేదని చెబుతున్నారు.రెండేళ్ల నుంచి తిరుగుతున్నా... అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం అమలాపురానికి చెందిన రావి సత్యవతి భర్త రెండేళ్ల కిందట చనిపోయాడు. అప్పటి నుంచి వితంతు పింఛన్ మంజూరు చేయాలని సచివాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ‘జగన్ బాబు ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు గ్రామంలో మాలాంటోళ్లకు పింఛన్లు ఇచ్చేవోళ్లు, నాఖర్మేటో భర్త పోయి ఏ ఆసరా లేకుండా ఇబ్బంది పడుతున్నా. ఇప్పుడు పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాను. పింఛన్ రావాలంటే నేను కూడా పోవాలేమో. చంద్రబాబు వచ్చేక కొత్తగా ఒక్కరికీ పింఛన్ ఇవ్వలేదంట’ అని వాపోతోంది. ఈమెకు అర్హత లేదా?పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పాంచాలి గ్రామానికి చెందిన జయశ్రీ పుట్టుకతోనే మానసిక దివ్యాంగురాలు. పూర్తిగా మంచానికే పరిమితం. ఆమెతో పాటు.. ఒకరు కచి్చతంగా తోడు ఉండాల్సిందే. నెలవారీ మందులకే రూ.వేలల్లో ఖర్చు అవుతోంది. మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు సామాజిక పింఛను అందిస్తున్నామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. జయశ్రీకి మాత్రం కేవలం రూ.6 వేలు అందిస్తోంది. తమ బిడ్డ పరిస్థితిని పరిశీలించి పింఛన్ మొత్తాన్ని పెంచాలని తల్లిదండ్రులు రమణమ్మ, వెంకటరావు అధికారులు, ప్రజా ప్రతినిధులకు మొర పెట్టుకుంటూనే ఉన్నారు. గత సోమవారం కూడా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎంత తిరిగినా పట్టించుకోవడంలేదు‘మేడం.. మా నాన్న మహబూబ్‌బాషాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాళ్లు, చేతులు చచ్చుబడ్డాయి. పింఛన్ మంజూరు కోసం సదరం క్యాంప్ చుట్టూ తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదు. మా అమ్మ హమిదాబీకి ఏడాది నుంచి టీబీ సోకడంతో రెండు కాళ్లు పని చేయక మంచం పట్టింది. గతంలో నాకు రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో రాడ్లు వేశారు. అయినా అతి కష్టంగా ఇన్నాళ్లూ పాలిష్ కటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాను. ఇక నాకు ఓపిక సరిపోవడం లేదు మేడం.. మా అమ్మా నాన్నలకు పింఛన్ అయినా ఇప్పించండి.. లేదా నా కిడ్నీలు అమ్ముకుని మా అమ్మనాన్నలను పోషించుకోవడానికి అనుమతైనా ఇవ్వండి’ అంటూ నంద్యాల జిల్లా దొర్నిపాడుకు చెందిన అన్వర్‌బాషా గత మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కన్నీటి పర్యంతమయ్యాడు. కనీసం ఇద్దరిలో ఎవరో ఒకరికి పింఛన్ మంజూరు చేయాలని వేడుకున్నాడు. ఎంపీడీఓ సావిత్రి అతని నుంచి అర్జీ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పింఛన్ మంజూరుకు కృషి చేస్తామన్నారు. కాగా, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్ మంజూరు చేయలేదని, కనీసం ఇలాంటి వారిపట్ల అయినా కనికరం చూపడం లేదనే విషయం అక్కడ చర్చకు వచ్చింది.తోడ్పాటు కోసం ఎదురుచూపు బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన పెరికల శకుంతల ఏడాదిన్నర క్రితం ఉన్న పళంగా పక్షవాతం బారిన పడింది. కాలకృత్యాలు సైతం మంచంలోనే తీర్చుకోవాల్సిన పరిస్థితి. పక్షవాతం రోగులకు ఇచ్చే పింఛన్ రూ.15 వేలకు నోచుకోలేదు. సదరం క్యాంపుల చుట్టూ తిరిగి తిరిగి ఎట్టకేలకు 90 శాతం వైకల్యం ఉన్నట్లు ధృవీకరణ పత్రం తెచ్చుకున్నా పింఛన్ అందడం లేదు. డైపర్లు, నెలవారి మందుల కోసం నెలకు రూ.8 వేలు ఖర్చు చేస్తున్న ఆ కుటుంబానికి ప్రభుత్వ తోడ్పాటు అందడం లేదు. నా కాలు చూడండయ్యా.. ఇతని పేరు గంటస్వామి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు. మధుమేహంతో రెండేళ్ల క్రితం కాలు తీసేశారు. చేతి వేలు కూడా తీసేశారు. పని చేసుకోలేడు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకు. చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నా, దాని ఆదాయం ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో పూట గడవడానికి ఒక్కోసారి అడుక్కోవాల్సి వస్తోంది. ‘ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి 2024లో సదరం ధ్రువపత్రం తెచ్చుకున్నాను. 75 శాతం వికలాంగత్వం ఉందని సర్టిఫికెట్ ఇచ్చారు. పింఛన్ కోసం వినతి పత్రం ఇస్తే ప్రభుత్వం నుండి అనుమతి రాలేదని చెప్తున్నారు. నాలాంటి వికలాంగుల కోసం అనుమతులు వచ్చే వరకు వేచి ఉంటే నా బతుకు ఏమైపోవాలి? నా కాలు వైపు ఓసారి చూడండయ్యా’ అని వేడుకుంటున్నాడు. ఎన్నిమార్లు వినతులివ్వాలి? ఈమె పేరు కె.నళిని. చిత్తూరు జిల్లా నగరి మండలం ఎం.కొత్తూరు గ్రామం. భర్త, ముగ్గురు పిల్లలతో నిశ్చింతగా సాగుతున్న ఈమె జీవితంలోకి కష్టం ఒక్కసారిగా వచ్చిపడింది. గ్రానైట్ క్వారీలో పని చేస్తూ కుటుంబ పోషణ భారం చూసుకునే ఈమె భర్త అనారోగ్యంతో గత ఏడాది మృతి చెందాడు. దీంతో పిల్లల పోషణ భారం ఆమెపై పడింది. పెద్దగా ఆస్తులు లేవు. 10వ తరగతి వరకు మాత్రమే చదువుకోవడంతో తాపీ పనుల్లో కూలీగా చేరింది. వితంతు పింఛను కోసం ఎన్నిమార్లు వినతి పత్రాలు ఇస్తున్నా పింఛన్ మంజూరు కాలేదని కన్నీటిపర్యంతమవుతోంది. కాళ్లరిగేలా తిరుగుతున్నా.. ఈమె పేరు వంతాల రాధిక. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ పరిధిలోని పనసపుట్టు గ్రామం. భర్త జోగేశ్వరరావు 2025 మార్చి 22న అనారోగ్యంతో మృతి చెందాడు. ముగ్గురు ఆడ పిల్లలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. తిండి గింజల కోసం వ్యవసాయమే ఆధారం. వితంతు పింఛన్ సౌకర్యం కల్పించాలని 10 నెలల నుంచి గ్రామ సచివాలయం, డుంబ్రిగుడ మండల పరిషత్ కార్యాలయాలకు కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కనికరించలేదు. దరఖాస్తే తీసుకోవడం లేదు ఇతని పేరు గద్దల రామకృష్ణ. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం కోకిలంపాడు. వ్యవసాయ కూలీ. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాదిన్నర క్రితం కూలి పనికి వెళ్లి మెట్లపై నుంచి కిందపడిపోయాడు. వెన్నెముక విరిగిపోయింది. రెండుసార్లు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఉన్నదంతా వైద్యానికే ఖర్చు అయింది. అయినా పూర్తిగా కోలుకోలేదు. వీల్ చైర్‌కు పరిమితమయ్యాడు. 87 శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం కూడా తీసుకున్నాడు. ఆర్డీఓ కార్యాలయానికి వెళితే గ్రామ సచివాలయానికి వెళ్లాలని చెప్పారు. దరఖాస్తు కూడా తీసుకోకుండానే వెనక్కు పంపారు. గ్రామ సచివాలయంలో అడిగితే ఆన్లైన్లో సైట్ ఓపెన్ కావడం లేదని చెబుతున్నారు. ఎన్నిసార్లు తిరిగినా అదే సమాధానం వస్తోందని బావురుమంటున్నాడు. వైకల్యం కనిపించడం లేదేమో! నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఎల్లావత్తులకు చెందిన ఇట్టే భూపాల్‌కు ప్రమాదవశాత్తు ఏడాదిన్నర క్రితం కుడికాలు పోయింది. ఒంటి కాలితో అవçస్థలు పడుతున్నాడు. ఏదైనా అత్యవసర పని నిమిత్తం కొద్ది దూరం వెళ్లాల్సి వస్తే కర్రల సాయంతో నడుస్తున్నాడు. తనకు పింఛన్ మంజూరు చేయాలని ఏడాదిన్నరగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అయినా ఫలితం లేదు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి ఆ గ్రామానికి వెళ్లగా ఆయన వద్దకు వెళ్లి వికలాంగత్వ ధ్రువపత్రం, పోగొట్టుకున్న కాలిని చూపించి తనకు పింఛన్‌కు అర్హత ఉన్నప్పటికీ కొత్త పింఛన్ మంజూరు చేయడం లేదని విలపించాడు. -
ప్రజారోగ్యంపై ‘విషకీయం’
మెడికల్ కాలేజీల ‘పీపీపీ’ మీద ఈరోజు (శనివారం) రెండు ముఖ్యమైన దినపత్రికల్లోని ఎడిట్ పేజీల్లో స్పందనలు కనిపించాయి. ఇందులో ‘ఈనాడు’ దినపత్రికలో వచ్చిన ఎడిటోరియల్ కాలమ్ ఒకటి. ఈ కాలమ్‌లో వెలువడే అభిప్రాయాలు పత్రిక పాలసీ కింద లెక్క. వార్తా కథనాలకు భిన్నంగా ఈ సంపాదకీయ కాలమ్‌లో చేసే విమర్శలు సైతం నిర్మాణాత్మకంగా ఉండాలని పాఠకులు ఆశిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అదొక సంప్రదాయం కూడా! ఈ కట్టుబాటును ‘ఈనాడు’ చాలాసార్లు ఉల్లంఘించింది. ప్రతిపక్ష నేత మీద పగతో ఆ సంపాదకీయం ఈ రోజున రగిలిపోయింది. సంపాదకీయ ప్రమాణాలను పాటించడం విషయంలో అది చిట్టచివరి జారుడు మెట్టుపై నుంచి కూడాకిందికి దొర్లింది.ప్రభుత్వ ఆధ్వర్యంలో మొదలైన మెడికల్ కాలేజీలను ‘పీపీపీ’ ముసుగులో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతి రేకిస్తూ ఏపీలో కోటీ నాలుగు లక్షల మందికి పైగా తమ అడ్రస్, ఫోన్ నంబర్లు వేసి మరీ సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో మీడియాతో జగన్ మాట్లాడిన మాటలు కూటమిని ఇరుకున పెట్టాయి. ‘పీపీపీ’ ముసుగులో పెద్ద స్కామ్ దాగుందని ఆయన తొలి నుంచీ వాదిస్తున్నారు. ఆయన వాదనను మేధావులతో పాటు సామాన్య జనం సైతం విశ్వసిస్తున్నారు. అందుకు రికార్డు స్థాయిలో నమోదైన సంతకాలే సాక్ష్యం. మీడియాతో మాట్లాడి నప్పుడు జగన్ అదే విషయాన్ని చెప్పారు. ఈ స్కామ్‌లో పాలు పంచుకొనేవారిని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విచా రించి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఇందులో అభ్యంతరకరమైన విషయం ఏమున్నది? జగన్ మాటలు కాదు, ఆ మాటల వెనకున్న జనాభి ప్రాయం కూటమిని భయపెడుతున్నట్లున్నది. ప్రైవేట్ విద్యా వ్యాపారులు కూడా జనాభిప్రాయానికే జంకుతున్నారేమో! ఐదు కాలేజీలకు టెండర్లు పిలిస్తే ఒక్కదానికి కూడా పడలేదు. ముఖ్యమంత్రికి ఆంతరంగికుడైన మంత్రి నారాయణ స్వయానా అతిపెద్ద చదువుల బేహారి. ఆయన కూడా ముందుకు రాక పోవడం ఏమిటి? ఇది ముమ్మూర్తులా స్కామ్ కనుక, ఇందులో దొరకడం ఖాయమని భయపడ్డారేమో! ఆదోని కాలేజీకి ‘కిమ్స్’ యాజమాన్యం టెండర్ వేసిందని ముందు ప్రకటించారు. ఆస్పత్రి యాజమాన్యం ఖండించేసరికి, అందులో పనిచేస్తున్న దానయ్య ఎవరో దాఖలు చేశారని మాట మార్చారు. ఈ వ్యవహారం చూస్తుంటే ‘స్కిల్ కుంభకోణం’ గుర్తురావడం లేదూ? తొలుత సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఆ కంపెనీ రంగంలోకి వచ్చి ఖండించిన తర్వాత కాదు కాదు, అందులో పనిచేసే ఉద్యోగితో ఒప్పందం కుదిరిందని చెప్పుకొచ్చారు. అన్ని స్కామ్‌ల స్క్రిప్టూ ఒకే రకంగా ఉంటుందేమో?‘పీపీపీ’కి ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉండటానికి జగన్ కారణమని భావిస్తున్న కూటమి నేతలు ఆయనపై శివమెత్తి ఊగిపోయారు. ఇందులో డిప్యూటీ సీఎం, ఫోర్త్ టైమ్ సీఎం పోటీపడ్డారు. యెల్లో మీడియా పోషిస్తున్న పాత్రకు పరాకాష్ఠ ఇవాళ్టి ‘ఈనాడు’ సంపాదకీయం. ‘జగన్ విషరాజకీయాలు’ అనే శీర్షికతో కలంలో విషం పోసి దాన్ని కాలమ్ నిండా వెదజల్లారు. ఈ విషవాహినిలో కొన్ని అపురూప విషయాలను కూడా అది దొర్లించింది. భిన్న పార్టీల సభ్యులతో కూడిన పార్లమెంట్ స్థాయీ సంఘం కూడా ‘పీపీపీ’ పద్ధతిలో మెడికల్ కాలేజీలను నిర్వహించుకోవాలని సూచించిందనీ, దాన్ని కూడా జగన్ చెవి కెక్కించుకోలేదనీ ‘ఈనాడు’ వాపోయింది. ప్రభుత్వ రంగంలో ప్రారంభమై కొంతమేరకు పూర్తయిన కాలేజీలను కూడా ‘పీపీపీ’కే అప్పగించాలని కూడా స్థాయి సంఘం చెప్పిందా? ఇక చేపట్టబోయే వాటి గురించి చెప్పిందా? ఏడాదిన్నర కాలంలో2 లక్షల 70 వేల కోట్లకు పైగా చేసిన అప్పులో ఓ నాలుగు వేల కోట్లు కేటాయిస్తే పది కాలేజీలు పూర్తయ్యే అవకాశం ఉన్నా కూడా ‘పీపీపీ’కే అప్పగించాలని స్థాయీ సంఘం చెప్పిందా?అయినా దేశ వనరులన్నింటినీ ప్రైవేట్ పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కోసం కంకణం కట్టుకున్న ఎన్టీఏ ప్రభుత్వహయాంలో ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ ఏ సలహా ఇచ్చినా వేదవాక్కు అవుతుందా? యుగాల నాటి ఆరావళి పర్వతశ్రేణి ఎత్తు కొలతల్ని నిర్ణయించి, వాటిని తవ్వి పోసుకోవడానికి అనుమతులకు సిద్ధమైన ఎన్డీఏ సర్కార్ ‘పీపీపీ’లకు అనుకూలం కాకపోతే వ్యతిరేకంగా ఉంటుందా? ఈ పద్ధతిలో చేపట్టే వైద్య కళాశాలలూ, ఆరోగ్య సేవల ప్రాజెక్టులకు మూలధన వ్యయంలో 30–40 శాతం, నిర్వహణ వ్యయంలో పాతిక శాతం గ్రాంటుగా ఇస్తా్తమని కేంద్రం రాసిందట! కొత్త కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే ఉంటే ఈ గ్రాంటు ఇవ్వబోమని కూడా కేంద్రం రాసిందా? ఆ విషయం కూడా చెప్పాలి కదా!జనం ఛీకొట్టి 11 సీట్లకే పరిమితం చేసినా జగన్ తనకు అలవాటైన బెదిరింపు భాషను మానుకోలేదట! అలా అని ‘ఛీనాడు’ చెబుతున్నది. నిజమే, 11 సీట్లకే వైసీపీ పరిమితమైందన్న మాట వాస్తవమే! 40 శాతం ఓట్లు వచ్చాయన్న మాట కూడా నిజమే కదా! పవన్ కల్యాణ్ పార్టీతోపాటు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటే తప్ప, ఈ కూటమికి కొన్ని ముదనష్టపు మీడియా సంస్థలు తోడైతే తప్ప టీడీపీ నిల బడలేకపోయిందన్న మాట కూడా నిజమే కదా! పోలింగ్ సమయం ముగిసిన తర్వాత అసాధారణ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలింగ్ పన్నెండున్నర శాతం పెరగడం అనుమానాలు రేకెత్తిస్తున్నదని కొన్ని జాతీయ సంస్థలు లెక్కలతో సహా వెల్లడించిన విషయం కూడా వాస్తవమే కదా! ఇటువంటి విషయాలన్నీ మరుగునపెట్టి జగన్‌ను 11 సీట్లకే పరిమితం చేశామంటూ రొయ్య మీసాలు తిప్పడం, సంపాదకీయాల్లో రంకెలు వేయడం చోద్యంగా లేదా? రాజధానికి భూమినిచ్చిన రైతు రామారావు నిన్న జరిగిన గ్రామ సభలో తనకు జరిగిన మోసాన్ని చెబుతూ మంత్రి సాక్షిగా గుండె పగిలి చనిపోతే ఆ వార్త వేయాలనేఇంగితం లేని పత్రిక సుద్దులు చెబితే ఎట్లా?జాతీయ ఆంగ్లపత్రిక ‘ది హిందూ’ ఎడిట్ పేజీలో కూడా ‘పీపీపీ’ల అంశంపై ఇవాళ ప్రధాన వ్యాసం అచ్చయింది. మాజీ ఐఏఎస్ అధికారి, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా కూడా పనిచేసిన సుజాతారావు ఈ వ్యాసాన్ని రాశారు. ఆమె ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా చాలాకాలం పనిచేశారు. ‘పీపీపీ’ విధానం ద్వారా ఆరోగ్య సేవలను అందజేయాలనుకోవడం వాంఛ నీయం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ షరతులను కచ్చితంగా అమలుచేసే యంత్రాంగం లేకుండా ప్రజారోగ్యం వంటి కీలక రంగాల్లో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం అవివేకమని ఆమె వ్యాఖ్యానించారు. గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య సేవలను ముక్కల కింద విడగొట్టి అరడజన్ కాంట్రాక్టు సంస్థలకు అప్పగించిందనీ, వాటి అజమాయిషీ చేయలేకపోవడంతో ప్రజారోగ్య సేవలుగందరగోళంలో పడ్డ సంగతినీ సుజాతారావు గుర్తుచేశారు. 70 శాతం బెడ్ల కేటాయింపు, ఔట్ పేషెంట్ సేవలు ఉచితంగాఅందజేయడం వంటి నిబంధనలను అమలు చేయడం సాధ్యం కాదని ఆమె కుండబద్దలు కొట్టారు.ఒక్క సుజాతారావే కాదు, ఎందరో విజ్ఞులు వైద్యరంగ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. ‘పీపీపీ’ అంటే ప్రైవేటీకరణ కాదనే డొల్ల వాదనను ఖండిస్తున్నారు. ‘పీపీపీ’ మీద ఇటీవల ముఖ్యమంత్రి ఒక విచిత్ర వాదన ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. ‘పీపీపీ పద్ధతిలో రోడ్లను అప్పగిస్తాం. వాళ్లు కొన్నాళ్లు వాటిని నిర్వహించి తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తారు. అంటే అవి ప్రభుత్వ ఆస్తిగానే ఉంటాయ’ని ఆయన చెప్పారు. కానీ దశా బ్దాల తరబడి కాంట్రాక్టర్లు ఆ రోడ్లను నిర్వహించినంత కాలం జనం టోల్ ఫీజు కట్టాలనే సంగతిని మాత్రం ఆయన చెప్పలేదు. ప్రభుత్వం ఇప్పటికే మెడికల్ కాలేజీల కోసం విలువైన భూముల్ని కేటాయించింది. వివిధ దశల్లో నిర్మాణాలు కూడా పూర్తి చేసింది. ఇంకో 4,500 కోట్లు ఖర్చుపెడితే ఆ పది కాలేజీలు ప్రభుత్వపరమవుతాయి. ఈ దశలో వాటిని పలు రాయితీలతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి, రెండేళ్లపాటు సిబ్బంది జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించేలా నిబంధనలు రూపొందించి, ఇదే పెద్ద అభివృద్ధి మార్గంగా కూటమి ప్రచారం చేసుకుంటున్నది.పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందకుండా, పేద విద్యార్థులకు వైద్యవిద్య అందకుండా చేసే ఈ విధానాన్ని జగన్ మోహన్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఇందులో ఇమిడి ఉన్న అవి నీతిని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని కట్టబెట్టి, నిర్వహణ కోసం రాయితీలు ఇచ్చి, రెండేళ్లపాటు జీతాలు కూడా ఇచ్చే ఏర్పాటులో ఏ కుంభకోణం లేదని చెబితే ఎవరు నమ్ముతారు? జగన్ పిలుపుతో జనకోటి గళం కలపడంతో కూటమి నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. అందుకే జగన్ మీద దాడి చేస్తున్నారు.ఈ దాడి కేవలం జగన్ మీదనే అనుకోవడానికి వీల్లేదు. ఇది ప్రజావైద్యం మీద దాడి! పేద ప్రజల ఉన్నత విద్యా ఆకాంక్షల మీద దాడి!! రాజ్యాంగ ఆశయాల మీద దాడి!! వారు చేసే విమర్శలకు ఏ రకమైన ఆధారాన్ని చూపెట్టరు. ఏ లెక్కల ప్రకారం చెబుతున్నారో చెప్పరు. పుర్రెకు తోచింది చెబుతారు. నోటికి వచ్చింది మాట్లాడతారు. నిన్నగాక మొన్న పారిశ్రామిక ప్రగతిలో, వస్తూత్పత్తి రంగంలో జగన్ కాలంలో ఏపీ దక్షిణాది లోనే నంబర్ వన్‌గా ఉన్నదని రిజర్వ్ బ్యాంకు చెప్పినా ఈ కూటమి వినదు. అన్ని రంగాల్లో ఏపీని జగన్ గాఢాంధకారంలోకి నెట్టారని సంపాదకీయంలో ‘ఈనాడు’ రాసింది. ఎవరు చెప్పారు? ‘కాగ్’ చెప్పిందా? ‘నీతి ఆయోగ్’ చెప్పిందా? జీఎస్టీ లెక్కలు చెప్పాయా? అటువంటి సంస్థల్ని ఉటంకిస్తే కూటమి లెక్కలు తారుమారవుతాయి. కనుక వాటి జోలికి పోరు. ప్రజా ధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడానికి కుట్రలు చేస్తున్న విషరాజకీయం, దానికి తాబేదారుగా ‘ఈనాడు’ ఒలకబోస్తున్న విష సంపాదకీయం – వెరసి ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్యంపై ఇదొక ‘విషకీయ’క్రీడ!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
దెందులూరులో టీడీపీ గూండాల అరాచకం
సాక్షి,ఏలూరు: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నాయి. పెదపాడు మండలం ఏపూరి గ్రామ వైఎస్సార్సీపీ దళిత సర్పంచ్ చోటగిరి రామకృష్ణ పై పచ్చ మూకలదాడి చేశాయి.ద్విచక్ర వాహనంపై నూజివీడు వెళ్లివస్తున్న రామకృష్ణను టీడీపీ మూకలు అడ్డగించి దాడి చేశాయి. బాధితుడి బైక్ నెంబర్ ప్లేట్‌పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఫోటోలు ఉన్నాయని దాడికి దిగారు. బైక్‌పై వెళ్తున్న రామకృష్ణను కిందకి లాగి దాడి చేశారు. ఆపై అసభ్యంగా దూషించారు. తనపై టీడీపీ నేతలు దాడి చేసి, అసభ్యంగా దూషించారని రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మాటిస్తే మడమతిప్పని నేత.. లైవ్ లో మీసం తిప్పిన KS ప్రసాద్
-
డిజిటల్ సంస్కరణలకు జగన్ మోడల్‌ను అప్లై చేస్తే..
సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసే రూపాయిలో.. ప్రజలకు చేరేది కేవలం 15 పైసలు మాత్రమే. మధ్యలో అవినీతి, పరిపాలనా ఖర్చులే అందుకు కారణాలుగా ఉన్నాయ్.. ఈ మాట ఒకప్పడు ప్రధాని హోదాలో రాజీవ్ గాంధీ చేసింది. తరువాతి దశాబ్దాల్లో, సంక్షేమ పథకాలలో లీకేజీలను తగ్గించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇన్నేళ్లు గడిచాక డిజిటల్ విప్లవం కారణంలో ఆ పరిస్థితిలో క్రమక్రమంగా మార్పు కనిపిస్తోంది.తప్పుడు క్లెయిమ్స్, ప్రజా సంక్షేమ పథకాలలో అవినీతి.. అర్హత లేని లబ్ధిదారులు అనేవి ఇందులో ప్రదానంగా సమస్యలు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1–3 ట్రిలియన్ డాలర్ల వరకు ఆ నష్టం జరుగుతోంది. అయితే.. దీనిని తగ్గించడానికి భారత్ సహా అనే దేశాలు ఏఐ, డిజిటల్ ఐడెంటిటీ, ప్రాసెస్ రీడిజైన్ వంటి పద్ధతులను పాటిస్తూ మెరుగైన ఫలితాలు రాబట్టుకోలుగుతున్నాయి.ఆయా దేశాల్లో..ఈ ఏడాది బీసీజీ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. యూఎస్ మెడికెయిడ్(అమెరికా ఫెడరల్ ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం) ఏఐని ఉపయోగించి తప్పుడు క్లెయిమ్స్‌ను తప్పించుకుని 1 శాతం ఖర్చు.. అంటే దాదాపు 9 బిలియన్ డాలర్ల దాకా ఆదా చేసుకోగలిగింది. ఆసియా-ఫసిఫిక్ రీజియన్లలో డాక్టర్లు పేషెంట్లకు అత్యధికంగా యాంటీబయటిక్స్ను సూచించిన విషయాన్ని డాటా బేస్ ఆధారంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తించింది. ఆ వెంటనే వైద్యులను కంపేరిజన్ లేఖల ద్వారా అప్రమత్తం చేసింది. దీంతో ఒక ఏడాదిలోనే అలాంటి ప్రిస్క్రిప్షన్లలో 12 శాతం తగ్గుదల కనిపించింది.సింగపూర్‌లో ప్రజా సంక్షేమ పథకాల కోసం ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ (చాట్‌బాట్/డిజిటల్ సహాయకుడు) ప్రవేశపెట్టారు. దీంతో కాల్ సెంటర్లకు కాకుండా.. ప్రజలు ఏఐ అసిస్టెంట్ ద్వారా నేరుగా సమాధానాలు పొందగలిగారు. ఈ ప్రభావంతో ఫోన్ కాల్స్ సంఖ్య 50 శాతానికి తగ్గింది. ప్రభుత్వానికి ఖర్చు తగ్గడంతో పాటు ప్రజలకు సమాచారం అందడం సులభతరం అయింది.కెనడా రెవెన్యూ ఏజెన్సీ.. ఏఐను ఉపయోగిస్తూ ట్యాక్స్ మోసాలకు చెక్ పెడుతోంది. యునైటెడ్ కింగ్డమ్లో డిపార్ట్మెంట్ ఫర్ వర్క్ అండ్ పెన్షన్స్(DWP) డేటా ఆధారిత ప్లాట్‌ఫారమ్‌ను అందుబాటులోకి తెచ్చుకుంది. ఈ డాటా ద్వారా తప్పుగా జరిగే చెల్లింపులను (overpayments) తగ్గించుకుని.. ఈ ఒక్క ఏడాదిలోనే 500 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.5,000 కోట్లకు పైగా) నష్టం జరగకుండా చూసుకుంది.మరి భారత్ విషయానికొస్తే..భారత్‌లో సంక్షేమ పథకాల లభ్ధిదారుల సంఖ్యలో తగ్గుదల కనిపించడం లేదు. అయితే వీటిల్లో లీకేజీలని తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం సత్పలితాలనే ఇస్తున్నాయి. భారత్‌లో బయోమెట్రిక్, ఆధార్ తరహా డిజిటల్ ఫస్ట్ ఐడీ.. వాటి అనుసంధానాలతో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఈ డిజిటల్ చెల్లింపుల సంస్కరణలతో ఈ ఏడాది సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తున్న ధనంలో దాదాపు 13% లీకేజీలు తగ్గాయని బీసీజీ నివేదిక ఇచ్చింది. అంటే.. అప్పటిదాకా వెళ్ళిన నిధుల్లో కొంత అర్హత లేని/నకిలీ లబ్ధిదారులకు వెళ్ళిందని సూచించినట్లే కదా.జగన్ మోడల్ కలిస్తే..ప్రజా సంక్షేమంలో భారత్ పూర్తిస్తాయి లీకేజీలను అరికట్టాలంటే .. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించిన డీబీటీ వ్యవస్థ(Direct Benefit Transfer) కచ్చితంగా అవసరమనే చర్చ నడుస్తోంది. అందుకు సహేతుకమైన కారణాలను వివరిస్తున్నారు. డీబీటీ మన దేశానికి కొత్తది కాదు. ఇది 2013లోనే ప్రారంభమైంది. అయితే ఇన్నేళ్ల కాలంలో సంపూర్ణంగా.. అదీ సమర్థవంతంగా అమలు చేసింది మాత్రం ఒక్క జగన్ ప్రభుత్వమే!.2019లో వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని సంక్షేమ పథకాలను (అమ్మ ఒడి, రైతు భరోసా.. ఇలా పథకాలెన్నో) వంద శాతం డీబీటీ ఆధారంగా మార్చింది. ఆధార్ అనుసంధానం(తప్పనిసరి), బయోమెట్రిక్ ధృవీకరణలకు బ్యాంక్ ఖాతా లింక్ తప్పనిసరి చేసింది. తద్వారా నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరేలా చేసింది. అలా.. జగన్ స్వయంగా బటన్ నొక్కడం ద్వారా ఐదేళ్ల కాలంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేసిన నగదు.. అక్షరాల రూ.2.70 లక్షల కోట్లు.వైఎస్సార్సీపీ హయాంలో మధ్యవర్తుల అవసరం లేకుండా పోయింది. లంచాల రూపంలో అవినీతికి ఆస్కారం కనిపించలేదు. నేరుగా అర్హత ఉన్నవాళ్ల ఖాతాల్లోకే వెళ్తున్నందునా.. ఒక్క పైసా కోత పడేది కాదు. ఆఖరికి కరోనా టైంలోనూ డీబీటీ ద్వారానే సంక్షేమం అందించడం ఇక్కడ మరో రికార్డు. కాబట్టి.. జగన్ డీబీటీ మోడల్‌ను అనుసరిస్తూనే ఏఐ, బయోమెట్రిక్ ఆధారిత వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తే ప్రజా సంక్షేమంలో లీకేజీలను తగ్గించి ప్రతీ రూపాయి కూడా అర్హులైన వారికి చేరగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
జగన్ రివర్స్ ఎటాక్.. చంద్రబాబుకు మరో దెబ్బ
-
వంగవీటి మోహన రంగా వర్థంతి సందర్భంగా YS జగన్ నివాళులు
-
వంగవీటి రంగాకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: కాపు నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, వారి గొంతుకగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగా గారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అంటూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, వారి గొంతుకగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగా గారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/CPgKs65Lbt— YS Jagan Mohan Reddy (@ysjagan) December 26, 20251947 జులై 4వ తేదీన కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో జన్మించిన వంగవీటి మోహన రంగా.. కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూనే పేద ప్రజల తరఫున పోరాడేవారు. ఆ ఆదరణతో.. 1985లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే.. 1988 డిసెంబర్ 26న ఆయన విజయవాడలో దారుణహత్యకు గురయయారు. ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద మలుపుగా భావిస్తుంటారు. -
క్రిస్మస్ వేడుకలలో వైఎస్ జగన్
పులివెందుల: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అక్కడికి హాజరైన వారిని ఆప్యాయంగా, చిరునవ్వుతో పలకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ ఇక్కడికి విచ్చేసిన బంధువర్గానికి, స్నేహితులు, ఆప్తులు, అభిమానులకు క్రిస్మస్ పర్వదినం, ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఏటా క్రిస్మస్ పర్వదినం రోజున నా సొంత గడ్డపై కుటుంబ సభ్యులు, బంధుగణం, స్నేహితులతో కలిసి పండుగలో పాల్గొనడం మనసుకు ఆనందాన్ని ఇచ్చింది. మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దేవుని చల్లని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ తన మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, కుటుంబ సభ్యులు, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాష్ రెడ్డి, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, చర్చి ఫాదర్లు రెవరెండ్ డాక్టర్ థామస్ ప్రసాదరావుబాబు, నరేష్ బాబు, మృత్యుంజయరావులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. 2026 నూతన సంవత్సర చర్చి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చర్చిలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథరెడ్డి, డాక్టర్ సుధ, మాజీ మంత్రి అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ మేయర్ సురేష్, కడప మేయర్ పాకా సురేష్, మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ మధురెడ్డి, వైఎస్ జోసఫ్‌రెడ్డి పాల్గొన్నారు. -
క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ జగన్ (ఫొటోలు)
-
అమ్మతో జగన్.. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు
-
పులివెందుల క్రిస్మస్ ప్రార్థనల్లో వైఎస్ జగన్
-
కుటుంబ సమేతంగా క్రిస్మస్ సంబరాల్లో YS జగన్
-
వైఎస్ జగన్ పై అద్భుతమైన పాట పాడిన వీరాభిమాని
-
క్రైస్తవ సోదరులకు జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
-
క్రిస్టమస్ వేడుకలో పాల్గొన్న వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు. క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్ జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతీ ఏటా క్రమం తప్పకుండా ఆయన ఈ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి పులివెందుల వాసులతో ఈ వేడుకల్లో పాల్గొంటారు. -
వైఎస్ జగన్ సర్కారు విద్యుత్ సంస్కరణలతో.. రూ.5,253 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంస్కరణలు, తీసుకొచ్చిన వినూత్న విధానాలవల్ల 2019–24 మధ్య విద్యుత్ సంస్థల నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గాయి. ఫలితంగా.. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఆ మిగులును కొంత ప్రజలకు వెనక్కి ఇచ్చి, మిగతాది తమ ఇతర ఖర్చుల్లో సర్దుబాటు చేసుకున్నాయి. దానివల్ల రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల భారం చాలావరకూ తప్పింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) తాజాగా రూ.134.08 కోట్లను ట్రూడౌన్ చేయడానికి అనుమతివ్వడంతో జగన్ హయాంలో జరిగిన రూ.5,252.93 కోట్ల ఖర్చుల పొదుపు అంశం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. నాడు మిగులు ఇలా.. 2019–20 నుంచి 2023–24 వరకూ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) రూ.1,974.75 కోట్లు, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) రూ.1,400 కోట్ల ఖర్చులు మిగిల్చాయి. ఈ మొత్తం రూ.3,374.75 కోట్లను ట్రూడౌన్ చేశాయి. 2024–25 వార్షిక ఆదాయ వ్యయ నివేదిక (ఏఆర్ఆర్)లో డిస్కంలు ఈ మొత్తాన్ని సర్దుబాటు చేశాయి. అంటే.. వాటి రెవెన్యూ గ్యాప్‌ను భర్తీచేసుకోవడానికి వినియోగించుకున్నాయి. తద్వారా బకాయిల భారాన్ని తగ్గించుకున్నాయి. వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం రాలేదు. అదే విధంగా 2019–20 నుంచి 2023–24 మధ్య 4వ నియంత్రణ కాలానికి ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో)కు చెందిన విద్యుత్ పంపిణీ వ్యవస్థను వినియోగించుకున్నందుకు ముందుగా ఆమోదించిన దానికంటే తక్కువగా డిస్కంలు వెచ్చించాయి. తద్వారా డిస్కంలు రూ.1,059.76 కోట్లు మిగిల్చాయి. ఇందులో ఏపీఈపీడీసీఎల్‌లో రూ.383.84 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్లో రూ.428.57 కోట్లు, ఏపీసీపీడీసీఎల్‌లో 247.35 కోట్లుగా ఉంది. వీటిని కూడా ఏఆర్‌ఆర్‌లో సర్దుబాటు చేశారు. దీనికి అదనంగా మరో రూ.818.43 కోట్లు ఆదా అయినట్లు ఏపీఈఆర్సీ తాజాగా తేల్చింది. అంటే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యుత్ పంపిణీ కోసం చేసిన ఖర్చుల్లో రూ.1,878.19 కోట్లు మిగిలాయి. ఈ మొత్తాన్ని డిస్కంలకు ఏపీ ట్రాన్స్‌కో తిరిగి ఇస్తోంది. ఈ మొత్తంలో ఇప్పటికే చాలావరకూ సర్దుబాటు చేయగా మిగిలిన రూ.134.08 కోట్లను వెనక్కు ఇచ్చేందుకు ఏపీఈఆర్సీ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ లెక్కన గత ప్రభుత్వ చర్యల కారణంగా రాష్ట్ర ప్రజలపై రూ.5,252.93 కోట్ల ట్రూఅప్ భారం తగ్గింది. అదే విధంగా.. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 మధ్య కాలానికి డిస్కంలు వసూలుచేసిన ట్రూ అప్ చార్జీలు ఏపీఈపీడీసీఎల్ రూ.126 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ రూ.70 కోట్లు చొప్పున మొత్తం రూ.196 కోట్లను ట్రూడౌన్ చేసి వినియోగదారులకు గత ప్రభుత్వంలో డిస్కంలు వెనక్కి ఇచ్చాయి. అది కూడా కలిపి గత ప్రభుత్వ చర్యల కారణంగా వినియోగదారులకు ట్రూడౌన్ రూపంలో మొత్తంగా రూ.5,448.93 కోట్లు ప్రయోజనం చేకూరింది. -
రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. పులివెందుల పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు ఓ సందేశం విడుదల చేయడంతో పాటు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘‘దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారు. కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు.. తద్వారా, మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారు....దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్ బాటలు వేశారు. క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయి అని వైఎస్ వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షల్లో తెలియజేశారు.ఈ ఉదయం ఎక్స్ ఖాతాలో.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు!. ఈ పండుగ రోజు మనం కొత్త ఆశతో, మంచి భవిష్యత్తు కోసం కలిసి ముందుకు సాగుదాం. సాటి మనుషులకు సహాయం చేస్తూ, ఆనందం పంచుకుందాం. మెర్రీ క్రిస్మస్! అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Wishing everyone a joyous Christmas! On this day of the birth of hope, let us renew our commitment to serving humanity and building a brighter tomorrow for all. Merry Christmas!— YS Jagan Mohan Reddy (@ysjagan) December 25, 2025 ‘ఈరోజు ఎంతో సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు. ఒక నూతన విశ్వాసం ఆవిర్భవించిన ఈవేళ, మానవత్వాన్ని మరింత పరిమళింపచేసేలా, మన అంకితభావాన్ని పునరుద్ధరిస్తూ.. తద్వారా ప్రజలందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేలా ముందుకు సాగుదాం’. మరోసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అని తెలియజేశారాయన. -
తుస్సుమన్న పీపీపీ బిడ్డింగ్.. జగన్ విజయానికి సూచిక
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటు సంస్థలకు ఇవ్వడాన్ని మేం సహించం... దీనివెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం ఉన్నది. ఎంతో కష్టపడి మేం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే వాటిని చేతగాని చంద్రబాబు ప్రభుత్వం నడపలేక ప్రయివేటుకు ఇచ్చేస్తున్నది. దీన్ని మేం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మద్దతును కూడా కూడగట్టాం. కోటికిపైగా సంతకాలు సేకరించాం.. .. మళ్ళీ చెబుతున్నాం.. మా మాట కాదని ఎవరైనా మెడికల్ కాలేజీలు తీసుకోవడానికి బిడ్డింగ్ వేస్తె మాత్రం తీవ్ర పరిణామాలు తప్పదు. మేం అధికారంలోకి వస్తే మళ్ళీ కాలేజీలు వెనక్కి తీసుకోవడమే కాకుండా వారిపై చర్యలు తీసుకుంటాం అంటూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేసిన ప్రకటన లాంటి హెచ్చరిక ప్రయివేటు మెడికల్ కాలేజీల గుండెల్లో రైళ్లు పరుగులెత్తించింది. అందుకేనేమో ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు.. కార్పొరేట్ సంస్థలు ఏవీ పెద్దగా ఈ అంశంలో ముందుకు రాలేదు.వాస్తవానికి మార్కాపురం.. మదనపల్లి, పులివెందుల, ఆదోని మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇచ్చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అయితే ఆదోని కాలేజీకి మాత్రమే కిమ్స్ యాజమాన్యం దరఖాస్తు చేసుకున్నది. అంటే మొత్తం నాలుగు కాలేజీలకు గాను ఒకటే దరఖాస్తు వచ్చింది. మిగతా మూడు కాలేజీలకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం.ఈ పరిణామం చూస్తుంటే వైఎస్ జగన్ చెప్పిన మాట ప్రకారం అయన చేసి తీరతారన్న నమ్మకం, మళ్ళీ అయన వస్తే కాలేజీలు వెనక్కి తీసుకుంటారన్న భయం కలగలిపి వారిని ఈ బిడ్డింగ్ నుంచి వెనకడుగు వేసేలా చేసిందని అంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, తెలుగుదేశం ప్రభుత్వం పని తీరు.. వివిధ వర్గాల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత ఇవన్నీ క్రోడీకరించి చూసుకుంటున్న మెడికల్ వ్యాపారవేత్తలు ఈ విషయంలో ఒక అవగాహనకు వచ్చినట్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో వైయస్ జగన్ ఎప్పుడు ఏ పర్యటన చేపట్టినా వెల్లువెత్తుతున్న జనాభిమానం ఒకవైపు.. అటు రైతులు,, మహిళలు.. విద్యార్థులు.. యువత వంటి వర్గాల్లో జగన్ పట్ల పెరుగుతున్న సానుకూలత, అదే తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతలను క్రోడీకరించి మెడికల్ వ్యాపారులు పరిస్థితిని అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నరలోనే కూటమి ప్రభుత్వం పట్ల ఇంత వ్యతిరేకత వస్తే రానున్న మూడేళ్ళలో ఇది మరింత పెరగడం తధ్యమని, అది కూటమి ఓటమిని, వైఎస్ జగన్ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదని భావించిన బిడ్డర్లు ఇక ఈ అంశం జోలికి పోకూడదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ గెలుపు తథ్యం, అదే జరిగితే కోట్లు పెట్టుబడి పెట్టి తెచ్చుకున్న ఈ కాలేజీలను ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకుంటే భారీగా నష్టపోతామన్న భయంతోనే వారు వెనకడుగు వేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి మెడికల్ వ్యాపారులు ముందు చూపుతో వేసిన వెనకడుగు.. వైఎస్ జగన్ విజయానికి సూచనే అని తేల్చేశారు.:::సిమ్మాదిరప్పన్న -
శభాష్ ఇస్రో.. YS జగన్ ప్రశంసలు
-
ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: ఇస్రో బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. తాజాగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఇస్రో శాస్త్రవేత్తలు శాటిలైట్‌ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చడం మన శాస్త్రీయ నైపుణ్యానికి నిదర్శనం. దేశానికి స్ఫూర్తినిస్తూ నిరంతరం కృషి చేస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అభినందనలు’ అని పోస్టు చేశారు. Heartfelt congratulations to the Indian Space Research Organisation and its dedicated team on the successful #LVM3M6 / BlueBird Block-2 mission. Placing the satellite into its intended orbit is a proud moment for India and a testament to our scientific excellence. A Salute to the…— YS Jagan Mohan Reddy (@ysjagan) December 24, 2025 -
రాబోయేది మనమే..!
-
వైఎస్ జగన్‌కు అస్వస్థత.. నేటి కార్యక్రమాలు రద్దు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అస్వస్థతకు గురయ్యారు. వైఎస్ జగన్ జ్వరంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ల సూచన మేరకు ఈరోజు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా ఈ ప్రకటనను విడుదల చేసింది. పులివెందులజ్వరంతో బాధపడుతున్న మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్డాక్టర్ల సూచన మేరకు పులివెందుల పర్యటనలో ఇవ్వాళ్టి కార్యక్రమాలను రద్దు చేసుకున్న వైయస్ జగన్— YSR Congress Party (@YSRCParty) December 24, 2025కాగా, పులివెందుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ నేడు ఇడుపులపాయలో ప్రార్థనల్లో పాల్గొనాల్సి ఉంది. అలాగే, మధ్యాహ్నం పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమాలు రద్దు అయ్యాయి. ఇక, రేపు పులివెందుల సీఎస్ఐ చర్చి క్రిస్టమస్ వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొనే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. వైఎస్ జగన్ మంగళవారం పులివెందులో నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలతో మమేకమయ్యారు. సాయంత్రం పులివెందులకు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులతో పాటు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అందరినీ పేరుపేరున పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు తమ కష్టాలను జగన్‌తో వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలన్ని ఓపికతో విని.. నేనున్నానని, రాబోయే రోజులు మనవేనంటూ ధైర్యం చెప్పారు. సాయంత్రం 3.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల కష్టాలు వింటూ సమస్యలకు పరిష్కార మార్గం చూపారు. వైఎస్ జగన్ పులివెందులకు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పార్టీ అభిమానులు, క్యాడర్‌తో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో క్యాంపు కార్యాలయ ప్రాంగణం నిండిపోయింది. జగన్ అక్కడకు రాగానే జై జగన్ నినాదాలతో కార్యాలయం ప్రాంగణం హోరెత్తింది. ఈ సందర్భంగా టీచర్లను ప్రభుత్వం వేధిస్తున్న తీరును వైఎస్సార్‌టీఏ నేతలు వివరించారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ గుది బండగా మారిందని జగన్ దృష్టికి తెచ్చారు. తద్వారా రాష్ట్రంలోని 1.30 లక్షల మంది ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. టీచర్ల సమస్యలను సావధానంగా విన్న వైఎస్ జగన్.. మన ప్రభుత్వంలో టీచర్లకు అన్ని విధాలుగా మేలు చేశామని, ఈ ప్రభుత్వం నాలుగు డీఏలు పెండింగ్ పెట్టిందని, ఇప్పటి వరకు పీఆర్సీ చైర్మన్‌ను నియమించలేదని, పీఆర్సీ కూడా ప్రకటించలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయులందరికీ మేలు చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. -
చంద్రబాబుకు బిగ్ షాక్!
సాక్షి, విజయవాడ: చంద్రబాబు కూటమి సర్కార్‌కు ఊహించని షాక్ తగిలింది. మెడికల్ కాలేజీలను తీసుకునేందుకు ప్రైవేటు సంస్థలు ముందుకు రాలేదు. వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమంతో ప్రైవేటు సంస్థలు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.వివరాల ప్రకారం.. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని నాలుగు మెడికల్ కాలేజీలకు పీపీపీ విధానంలో టెండర్లను పిలిచింది. ఈ టెండర్ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. అయితే, మార్కాపురం, పులివెందుల, మదనపల్లె మెడికల్ కాలేజీలకు ఎలాంటి బిడ్లు దాఖలు కాలేదు. కేవలం ఆదోని మెడికల్ కాలేజీకి మాత్రమే సింగిల్ బిడ్ దాఖలైంది. కాగా, కూటమి ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు టెండర్లు గడువు పెంచింది. అయినప్పటికీ ప్రైవేటు సంస్థలు ముందుకు రాకపోవడం గమనార్హం.ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. అక్టోబర్ నుండి ఉద్యమ బాట పట్టిన వైఎస్సార్సీపీ.. కోటి సంతకాల సేకరణతో పతాక స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు సంస్థలు మెడికల్ కాలేజీల నిర్వహణకు ముందుకు రాలేదని తెలుస్తోంది. ఉద్యమంగా కోటి సంతకాల సేకరణ..అంతకుముందు.. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంగా మారిన వేళ.. సోషల్ మీడియాలో ఆ ప్రజా ఉద్యమానికి అపూర్వ స్పందన లభించింది. ఎక్స్‌లో వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం టాప్ ట్రెండింగ్‌లో కొనసాగింది. కోటి సంతకాల సేకరణకు ఎక్స్‌లో మద్దతు వెల్లువెత్తింది. కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ వేల సంఖ్యలో ట్వీట్లు చేశారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో పాటు ర్యాలీలకు యువత, ఉద్యోగులు, మేధావులు సహా అన్ని రంగాల నిపుణులు స్వచ్ఛందంగా ముందుకువచ్చారు. దీంతో, చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఇది బట్టబయలు చేసింది.వైఎస్ జగన్ సంకల్పం..పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంకల్పించారు. అదే సమయంలో వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేశారు. తాను అధికారంలో ఉండగానే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు కూడా. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ క్రెడిట్‌ను నాశనం చేయాలని బలంగా నిర్ణయించింది. స్వతహాగానే పెత్తందారుల సీఎం అయిన చంద్రబాబు.. పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ఆ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగానే నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతను చూపించైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని వైఎస్ జగన్ భావించారు. ఒక పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగానే.. కోటి సంతకాల సేకరణ ఉద్యమం “రచ్చబండ” కార్యక్రమం నుంచి మొదలై.. నియోజకవర్గాలు నుంచి జిల్లా కేంద్రాలు దాటింది. రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైనే సంతకాలు సేకరించి.. వాటిని గవర్నర్‌కు అందజేశారు. -
రాబోయే రోజులు మనవే
సాక్షి కడప ప్రతినిధి/పులివెందుల: రాబోయే రోజులు మనవేనని, ధైర్యంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను కలిసి సమస్యలు చెప్పుకున్న వారికి భరోసా ఇచ్చారు. టీడీపీ నేతల అరాచకాలతో ఇబ్బందులు పడిన వారి కష్టం విని.. నేనున్నానని ధైర్యం చెప్పి ఊరడించారు. మంగళవారం ఆయన తన సొంత నియోజకవర్గం కార్యకర్తలు, ప్రజలతో మమేకమయ్యారు. సాయంత్రం పులివెందులకు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులతో పాటు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అందరినీ పేరుపేరున పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు తమ కష్టాలను జగన్‌తో వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలన్ని ఓపికతో విని.. నేనున్నానని, రాబోయే రోజులు మనవేనంటూ ధైర్యం చెప్పారు. సాయంత్రం 3.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల కష్టాలు వింటూ సమస్యలకు పరిష్కార మార్గం చూపారు. వైఎస్ జగన్ పులివెందులకు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పార్టీ అభిమానులు, క్యాడర్‌తో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో క్యాంపు కార్యాలయ ప్రాంగణం నిండిపోయింది. జగన్ అక్కడకు రాగానే జై జగన్ నినాదాలతో కార్యాలయం ప్రాంగణం హోరెత్తింది. నూతన డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ వైఎస్సార్‌టీఏ నూతన డైరీ, క్యాలెండర్లను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీచర్లను ప్రభుత్వం వేధిస్తున్న తీరును వైఎస్సార్‌టీఏ నేతలు వివరించారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ గుది బండగా మారిందని జగన్ దృష్టికి తెచ్చారు. తద్వారా రాష్ట్రంలోని 1.30 లక్షల మంది ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. టీచర్ల సమస్యలను సావధానంగా విన్న వైఎస్ జగన్.. మన ప్రభుత్వంలో టీచర్లకు అన్ని విధాలుగా మేలు చేశామని, ఈ ప్రభుత్వం నాలుగు డీఏలు పెండింగ్ పెట్టిందని, ఇప్పటి వరకు పీఆర్సీ చైర్మన్‌ను నియమించలేదని, పీఆర్సీ కూడా ప్రకటించలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయులందరికీ మేలు చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సు«ధ, జెడ్పీ చైర్మన్ రామగోవిందురెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్‌రెడ్డి, కమలాపురం ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి తదితరులు వైఎస్ జగన్‌ను కలిశారు. -
టీడీపీ–జనసేన దుష్ప్రచారం ఆర్బీఐ నివేదికతో బట్టబయలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై టీడీపీ, జనసేన నేతలు చేస్తున్న దుష్ప్రచారాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019–24 మధ్య పారిశ్రామిక ప్రగతి, తయారీ రంగంలో వృద్ధిపై స్థూల విలువ జోడింపు (జీవీఏ– గ్రాస్ వ్యాల్యూ యాడెడ్)తో ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఈ నెలలో విడుదల చేసిన నివేదికలోని గణాంకాలను ఉటంకిస్తూ విష ప్రచారాన్ని ఎండగట్టారు. ఆ నివేదికలో పేర్కొన్న అంశాలను జత చేస్తూ.. ‘సత్యమేవ జయతే’ హ్యాష్ ట్యాగ్‌తో సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో మంగళవారం పోస్టు చేశారు.ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘‘టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఎన్నికల ముందు, ఇప్పుడూ పనిగట్టుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని, ఫలితంగా పెట్టుబడిదారులు రాష్ట్రం వదిలి వెళ్లిపోయారంటూ విమర్శలు చేస్తున్నారు. అంతే కాకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికాభివృద్ధి జరగలేదంటూ పచ్చి అబద్ధాలు వల్లె వేస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలు చెబుతున్న దాంట్లో వాస్తవం ఉంటే తయారీ, పరిశ్రమల రంగంలో రాష్ట్రం పని తీరు దయనీయంగా ఉండేది.కానీ.. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. తయారీ, పరిశ్రమల రంగంలో స్థూల విలువను జోడిస్తూ ఆర్బీఐ ఈ నెల విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది. తయారీ రంగం వృద్ధిలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్.. దేశ వ్యాప్తంగా ఐదో స్థానంలో ఉంది. పారిశ్రామికాభివృద్ధిలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్.. దేశ వ్యాప్తంగా ఎనిమిదో స్థానంలో ఉంది. ఇప్పుడు చెప్పండి.. 2019–24 మధ్య ఏపీ బ్రాండ్ దెబ్బతిందా? సమర్థవంతమైన నాయకత్వం వల్ల ఇంతకుముందెన్నడూ చూడని ఆర్థిక పురోగతిని చూశామా? -
ఇది అసలు నిజం.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ, జనసేన అబద్ధాల దుష్ప్రచారాన్ని ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బట్టబయలు చేశారు. టీడీపీ, జనసేన అసత్య ప్రచారాన్ని మరోసారి ఆయన ఎండగట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కూటమి సర్కార్ చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని వైఎస్ జగన్ బయటపెట్టారు. ఆర్బీఐ గణాంకాలను చూపుతూ కూటమి ప్రభుత్వానికి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు వేశారు.‘‘వైఎస్సార్సీపీ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. అదే నిజమైతే ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు భిన్నంగా ఎందుకున్నాయి?. ఆర్బీఐ గణాంకాలు చూస్తే వైఎస్సార్సీపీ పనితీరు ఏంటో తెలుస్తుంది...2019-24 మధ్య ఉత్పత్తి రంగంలో ఏపీ దక్షిణ భారత్‌లో నెం.1. యావత్ దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. 2019-24 మధ్య ఏపీ పారిశ్రామిక రంగంలో పురోగతి. దక్షిణ భారత్‌లో నెం.1, యావత్ దేశంలో 8వ స్థానం. మరి దీన్ని బ్రాండ్ ఏపీ నాశనం అంటారా?. లేక సమర్థవంతమైన నాయకత్వం ద్వారా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందింది అంటారా? సత్యమేవ జయతే‘‘ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 𝗧𝗗𝗣 – 𝗝𝗦𝗣 𝗹𝗶𝗲𝘀 𝗲𝘅𝗽𝗼𝘀𝗲𝗱 TDP and JSP, before and after forming Government persistently made the following allegations-Brand AP was destroyed owing to YSRCP Government-Investors abandoned AP owing to YSRCP Government-No industrial growth was witnessed during… pic.twitter.com/KvB40DJWGL— YS Jagan Mohan Reddy (@ysjagan) December 23, 2025 -
వైఎస్ జగన్ ప్రజాదర్బార్: సమస్యలు వింటూ.. భరోసా కల్పిస్తూ.. (ఫొటోలు)
-
పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసానిస్తూ.. ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.వైఎస్ జగన్‌ను కడప నూతన మేయర్ పాకా సురేష్ కలిశారు. నూతన మేయర్‌ను వైఎస్ జగన్ అభినందించారు. వైఎస్ జగన్‌ను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా కలిశారు.కాగా, రేపు(బుధవారం, డిసెంబర్ 24) ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని భాకరాపేట క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. గురువారం(డిసెంబర్ 25) ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. -
ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
-
నేడు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23 నుంచి మూడు రోజులపాటు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఆయన మంగళవారం సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.బుధవారం ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని భాకరాపేట క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. గురువారం ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. -
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇలా..
సాక్షి, తాడేపల్లి: రేపటి(డిసెంబర్ 23 మంగళవారం) నుంచి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. రేపు(మంగళవారం) పులివెందుల క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్భార్ నిర్వహించనున్నారు.ఎల్లుండి(బుధవారం) ఉదయం ఇడుపులపాయలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనలకు హాజరుకానున్నారు. సాయంత్రం భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్భార్ నిర్వహించనున్నారు. 25న ఉదయం 8.30 గంటలకు సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరు కానున్నారు.23.12.2025(మంగళవారం) షెడ్యూల్:సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.24.12.2025(బుధవారం) షెడ్యూల్:ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయ చేరుకుని ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్ళి భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు25.12.2025(గురువారం) షెడ్యూల్:ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు, ఆ తర్వాత 10.30 గంటలకు పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు. -
పులివెందులకు YS జగన్.. మూడు రోజుల షెడ్యూల్ ఇదే
-
పెరిగిన జగన్ క్రేజ్.. టెన్షన్ లో కూటమి నేతలు


