ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్త పార్టీతో అనుసంధానం... ‘జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌’ | YS Jagan Mohan Reddy Launches Jagan 2. 0 Super App | Sakshi
Sakshi News home page

ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్త పార్టీతో అనుసంధానం... ‘జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌’

Jul 17 2026 4:00 AM | Updated on Jul 17 2026 4:00 AM

YS Jagan Mohan Reddy Launches Jagan 2. 0 Super App

జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ను ఆవిష్కరిస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ 

ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పార్టీ నాయకత్వంతో నేరుగా అనుసంధానిస్తూ... సమాచార మార్పిడి, సమస్యల పరిష్కారం, పార్టీ కార్యక్రమాలను ఒకే వేదికపైకి తెచ్చే లక్ష్యంతో రూపొందించిన ‘‘జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌’’ను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ప్రతి కార్యకర్త ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘జగన్‌ 2.0సూపర్‌ యాప్‌’ ఆవిష్కరణ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

ప్రతి కార్యకర్త నిర్భయంగా అభిప్రాయం చెప్పవచ్చు..
వైఎస్సార్‌సీపీ నుంచి ఈరోజు అధికారికంగా ‘జగన్‌ 2.0 సూపర్‌యాప్‌’ను ఆవిష్కరిస్తున్నాం. సోషల్‌ మీడియాలో మన వాళ్లు పోస్ట్‌ చేసిన కంటెంట్‌ను ఇష్టం వచ్చినట్లుగా డిలీట్‌ చేయడం, అందుకోసం కుట్రలు పన్నడం.. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మనమే ఒక యాప్‌ తీసుకొచ్చి ప్లాట్‌ఫామ్‌ క్రియేట్‌ చేస్తున్నాం. అదే జగన్‌ 2.0 సూపర్‌యాప్‌. దీంట్లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం చెప్పొచ్చు. అంతేకాకుండా దీని ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో అనుసంధానమై ఉంటాడు. ఇది మన యాప్‌ కాబట్టి, మన వాళ్లే ఇందులోకి వస్తారు కాబట్టి, ఎవరు పడితే వారు డిలీట్‌ చేసే (తొలగించే) హక్కు ఉండదు. ఇది ఒక మంచి పరిణామం. ఇష్టం వచ్చినట్లు చేసే కుట్రలు దీనివల్ల తిప్పి కొట్టొచ్చు. 

ప్రతి నాయకుడితో ప్రతి కార్యకర్త అనుసంధానం..
పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త మొదలు పార్టీ కేంద్ర కార్యాలయం వరకు.. నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడితో, ప్రతి కార్యకర్త అనుసంధానమై ఉంటాడు. ఎందుకంటే పార్టీలో ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంటుంది. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గానీ, పోలీసుల వేధింపుల వల్ల కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు గానీ, పార్టీకి సంబంధించిన ఏ అంశమైనా ఈ యాప్‌ ద్వారా నేరుగా ఒకరితో ఒకరు అనుసంధానమై టచ్‌లో ఉండే అవకాశం ఉంటుంది. ఈ యాప్‌లో మరో మంచి అంశం ఏమిటంటే పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశం, ప్రెస్‌మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రకటనలు.. అన్నీ కూడా ఈ యాప్‌లో లైవ్‌ ఫీడ్‌ ద్వారా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటుంది. 

డిజిటల్‌ డైరీతో యాప్‌ను అనుసంధానిస్తాం..
భవిష్యత్తులో ఈ యాప్‌ను ఇంకా అభివృద్ధి చేస్తాం. కార్యకర్తలు ఎక్కడైనా, ఏమైనా ఇబ్బంది పడుతుంటే వాటిని ఈ యాప్‌లో పోస్ట్‌ చేయడం, ఆ తర్వాత పార్టీ వాటిపై స్పందించడం, నియోజకవర్గంలో గ్రామ­స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త... ఆ కార్యకర్తకు అండగా నిలబడే అవకాశం ఉంటుంది. పోలీసుల వేధింపులతో ఇబ్బంది పడుతున్న మన పార్టీ వారు, రాజకీయ వేధింపులకు గురవుతున్న వారు, డిజిటల్‌ డైరీలో నమోదు చేస్తున్న వివరాలు.. ఈ యాప్‌తో అనుసంధానం అవుతాయి. అంటే ఈ యాప్‌లో ఆ డిజిటల్‌ డైరీ కూడా అందుబాటులోకి వస్తుంది.

దాని వల్ల వేధింపులు, సమస్యలు ఎదుర్కొంటున్న వారు నేరుగా ఈ యాప్‌ ద్వారా డిజిటల్‌ డైరీలో ఫిర్యాదు చేయొచ్చు. ఆ వివరాలు నమోదు చేయొచ్చు. ఇతర సోషల్‌ మీడియా వేదికల్లో మనపై చేస్తున్న అనుచిత విమర్శలు, వీడియోలు, వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసి వాటిని తొలగింపచేసే ప్రయత్నం ఒకవైపు చేసూ్తనే, మరోవైపు ఈ సూపర్‌ యాప్‌ను ఎవరూ ఆపలేని విధంగా మనకు మనం సొంతంగా రూపొందించుకోవడం జరిగింది. ఈ యాప్‌ వల్ల ప్రతి కార్యకర్త నిత్యం, పార్టీ నాయకత్వంతో అనుసంధానమై ఉంటాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement