కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ సమీపంలో ఐరన్ లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వంతెన దాటి లూప్‌లైన్‌లోకి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. రైలులోని ఒక బోగీ అదుపుతప్పి పట్టాలు తప్పి పక్కకు ఒరిగింది. దీంతో విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, పట్టాలు తప్పిన వ్యాగన్‌ను తొలగించి ట్రాక్‌ను పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఈ ప్రమాదం లూప్‌లైన్ సమీపంలో జరగడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.


