సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, రైతుల తరఫున చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. త్వరలో పది రోజుల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నట్లు ప్రకటించారు.


