breaking news
tobaco farmers
-
పొగాకు రైతుల పరిస్థితి వర్ణనాతీతం: కాకాణి
సాక్షి, ప్రకాశం: దేశ చరిత్రలో ఎన్డీయే ప్రభుత్వం రైతులను మోసం చేసినట్టు ఎవరు చేయలేదన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. రాష్ట్రంలో పొగాకు రైతుల పరిస్థితి వర్ణనాతీతం. ప్రభుత్వం తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలని కాకాణి డిమాండ్ చేశారు. పొగాకు కంపెనీలతో చంద్రబాబు, లోకేష్ లాలూచీ పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడాం. పొగాకు రైతుల పరిస్థితి వర్ణనాతీతం. దేశ చరిత్రలో ఎన్డీయే ప్రభుత్వం రైతులను మోసం చేసినట్టు ఎవరు చేయలేదు. పొగాకు ధర క్వింటాకు 16వేలకు పడిపోయింది. ఇంత దారుణం ఎప్పుడు జరగలేదు. పొగాకు కొనుగోలులో కూడా అవకతవకలు జరిగాయి. రెఫరెన్స్‌లు ఇవ్వడం దారుణం. తమకు అనుకూలమైన వారి బేళ్లు ఎక్కువ ధరకు కొనుగోళ్లు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.కర్ణాటకలో పొగాకు క్వింటా ధర 36 వేలు.. ఆంధ్రలో 16 వేలు. దీనికి కారణం ఎవరు?. పొగాకు కంపెనీలతో చంద్రబాబు, లోకేష్ లాలూచీ పడ్డారు. తక్కువకు రైతుల దగ్గర కంపెనీలకు కట్టబెట్టి.. కంపెనీ నుండి చంద్రబాబు, లోకేష్ లబ్ది పొందే ప్రయత్నం. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. చంద్రబాబు వరి తినకపోతే ఇంకెవరు తినేవాళ్ళు లేరా?. ప్రజలను చంద్రబాబు తప్పు దారి పట్టిస్తున్నాడు. పొగాకు రైతులు భారీగా నష్టపోతున్నారు. తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలి. ఆందోళన చేసిన రైతులపై కేసులు పెట్టడం సిగ్గుచేటు’ అని మండిపడ్డారు. -
సీఎం, మంత్రుల కృషితోనే ఈ మాత్రం ఊరట
కందుకూరు అర్బన్ : సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేల కృషి ఫలితంగానే పొగాకు రైతులకు ఈ మాత్రమైనా ధర పలికిందని, లేకపోతే ఇంకా ఘోరంగా ఉండేదని పొగాకు బోర్డు ఛైర్మన్ కె.గోపాల్ అన్నారు. స్థానిక పామూరు రోడ్డులోని 27వ వేలం కేంద్రంలోని బేళ్లను గోపాల్‌తోపాటు కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావులు శుక్రవారం పరిశీలించారు. కొనుగోళ్లు ఆలస్యం కారణంగా ఎఫ్-1,ఎఫ్-2లు ఎఫ్-4గా మారుతున్నాయని, కొనుగోలుకు వచ్చిన వారు నాణ్యత లేదని కొనడంలేదని రైతులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పోతుల రామారావు మాట్లాడుతూ ఎఫ్4 గ్రేడును వేలానికి పెడితే కొన్ని బేళ్లకు కేజీకి రూ.40, కొన్నింటికి రూ.90 పడుతోందని, 60 శాతం తేడా ఇంతకముందు ఎప్పుడూ లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆదెన్న కందుకూరు నియోజవర్గ సమన్వయకర్త ఉన్నం వీరాస్వామి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.


