సీఎం, మంత్రుల కృషితోనే ఈ మాత్రం ఊరట | CM and this is going to be saved by the efforts of the Council of Ministers | Sakshi
Sakshi News home page

సీఎం, మంత్రుల కృషితోనే ఈ మాత్రం ఊరట

Aug 15 2015 3:52 AM | Updated on Aug 14 2018 11:24 AM

సీఎం, మంత్రుల కృషితోనే ఈ మాత్రం  ఊరట - Sakshi

సీఎం, మంత్రుల కృషితోనే ఈ మాత్రం ఊరట

సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేల కృషి ఫలితంగానే పొగాకు రైతులకు ఈ మాత్రమైనా ధర పలికిందని, లేకపోతే ఇంకా ఘోరంగా

కందుకూరు అర్బన్ : సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేల కృషి ఫలితంగానే పొగాకు రైతులకు ఈ మాత్రమైనా ధర పలికిందని, లేకపోతే ఇంకా ఘోరంగా ఉండేదని పొగాకు బోర్డు ఛైర్మన్ కె.గోపాల్ అన్నారు. స్థానిక పామూరు రోడ్డులోని 27వ వేలం కేంద్రంలోని బేళ్లను గోపాల్‌తోపాటు కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావులు శుక్రవారం పరిశీలించారు. కొనుగోళ్లు ఆలస్యం కారణంగా ఎఫ్-1,ఎఫ్-2లు ఎఫ్-4గా మారుతున్నాయని, కొనుగోలుకు వచ్చిన వారు నాణ్యత లేదని కొనడంలేదని రైతులు ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే పోతుల రామారావు మాట్లాడుతూ ఎఫ్4 గ్రేడును వేలానికి పెడితే కొన్ని బేళ్లకు కేజీకి రూ.40, కొన్నింటికి రూ.90 పడుతోందని, 60 శాతం తేడా ఇంతకముందు ఎప్పుడూ లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆదెన్న కందుకూరు నియోజవర్గ సమన్వయకర్త ఉన్నం వీరాస్వామి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement